
'మా పార్టీ నేతలపై లాఠీచార్జ్ చేయడం అమానుషం'
హైదరాబాద్: కరీంనగర్లో శుక్రవారం రైతాంగ సమస్యలపై ధర్నా చేసిన కాంగ్రెస్ నేతలపై లాఠీచార్జ్ చేయడం అమానుషమని తెలంగాణ శాసనసభ పక్షనేత కె.జానారెడ్డి అన్నారు. శనివారం హైదరాబాద్లో ఆయన మీడియా ఎదుట మాట్లాడుతూ... కాంగ్రెస్ నేతల ఇచ్చిన వినతి పత్రాన్ని తీసుకోవడానికి జిల్లా కలెకర్ట్ ముందుకు రాకపోవడం విచారకరమని అన్నారు.
అధికార టీఆర్ఎస్ నేతలు రైతాంగ సమస్యలను నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపించారు. తక్షణమే తెలంగాణ అసెంబ్లీని సమావేశపరచి.... కరువు, రైతాంగ సమస్యలపై చర్చించాలని టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని జానారెడ్డి డిమాండ్ చేశారు.