Kobe Bryant
-
నా ఆప్త మిత్రుడు కోబీకి అంకితమిస్తున్నా.. జొకోవిచ్ భావోద్వేగం! వీడియో వైరల్
Novak Djokovic Pays Glorious Tribute To Kobe Bryant: ‘‘మీ అందరి ముందు నిలబడి నేను 24 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ గురించి మాట్లాడతానని ఏనాడూ ఊహించలేదు. ఇది నిజమవుతుందని కూడా అనుకోలేదు. కానీ గత రెండేళ్లలో కొత్త చరిత్ర సృష్టించే అవకాశం నా ముందు ఉందనిపించింది. అందివచ్చిన అవకాశాన్ని ఎందుకు వదులుకోవాలని అనుకున్నాను. నా శరీరం సహకరించినంత వరకు, నా శిక్షణ సిబ్బంది, కుటుంబసభ్యుల సహకారం ఉన్నంతవరకు ఈ జైత్రయాత్రను కొనసాగిస్తాను. అత్యున్నతస్థాయిలో ఉన్నప్పటికీ ఈ ఆటకు ఇప్పుడే వీడ్కోలు పలికే ఆలోచన లేదు. ఈ విజయాన్ని నా ఆప్త మిత్రుడు, మూడేళ్ల క్రితం హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయిన అమెరికా బాస్కెట్‌బాల్ దిగ్గజం కోబీ బ్రయాంట్‌కు అంకితం ఇస్తున్నాను. 24వ గ్రాండ్‌స్లామ్ యూఎస్ ఓపెన్ గెలిస్తే కోబీ బ్రయాంట్ ఫొటో ఉన్న టీ షర్ట్‌ను ట్రోఫీ ప్రదానోత్సవంలో ధరించాలని అనుకున్నాను’’ అని సెర్బియా టెన్నిస్ దిగ్గజం నొవాక్ జొకోవిచ్ భావోద్వేగానికి లోనయ్యాడు. యూఎస్ ఓపెన్-2023లో పురుషుల సింగిల్స్ విభాగంలో విజేతగా నిలిచిన జొకోవిచ్.. కెరీర్లో 24వ గ్రాండ్‌స్లామ్ గెలిచి చరిత్రకెక్కాడు. ఆదివారం ఉదయం జరిగిన ఫైనల్లో రెండో సీడ్ జొకోవిచ్ 6–3, 7–6 (7/5), 6–3తో మూడో సీడ్ డానిల్ మెద్వెదెవ్ (రష్యా)ను ఓడించాడు. వరల్డ్‌నంబర్ 1 తద్వారా యూఎస్ ఓపెన్ విజేతగా నిలవడంతో పాటు ఏటీపీ ర్యాంకింగ్స్‌లో మళ్లీ వరల్డ్ నంబర్‌వన్‌గా నిలిచాడు. ఈ సందర్భంగా భావోద్వేగానికి లోనైన జొకోవిచ్.. తన స్నేహితుడు కోబీ బ్రియాంట్‌ను గుర్తు చేసుకున్నాడు. అతడి ఫొటో ఉన్న టీ షర్ట్ ధరించి నివాళి అర్పించాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. మిలియన్ల కొద్దీ వ్యూస్‌తో దూసుకుపోతోంది. రికార్డుల జొకోవిచ్ కాగా ఈ విజయంతో ఒకే ఏడాది మూడు గ్రాండ్‌స్లామ్ టోర్నీ టైటిల్స్‌ను నాలుగుసార్లు చొప్పున (2011, 2015, 2021, 2023) సాధించిన తొలి ప్లేయర్‌గా జొకోవిచ్ నిలిచాడు. అదే విధంగా.. అత్యధిక సింగిల్స్ టైటిల్స్ నెగ్గిన క్రీడాకారుల జాబితాలో కానర్స్ (109; అమెరికా), ఫెడరర్ (103; స్విట్జర్లాండ్) తర్వాత జొకోవిచ్(96) మూడో స్థానంలో ఉన్నాడు. తీరని విషాదం ‘బ్లాక్ మాంబా’గా సుపరిచితమైన బాస్కెట్ బాల్ లెజెండ్ కోబీ బ్రయాంట్, కూతురు జియానా(13) సహా మరో ఏడుగురు హెలికాప్టర్ ప్రమాదంలో మృత్యువాత పడిన విషయం విదితమే. దీంతో కోబీ కుటుంబం సహా అతడి అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. క్రీడా ప్రపంచాన్ని నివ్వెరపరిచిన ఈ ఘటన జరిగి మూడేళ్లకు పైనే అయింది. చదవండి: వాళ్లను ఉతికి ఆరేశారు! పాక్ మరీ చెత్తగా.. శ్రీలంక తక్కువేం కాదు! Novak hits 24 and pays tribute to the late Kobe Bryant 💙 pic.twitter.com/rDXVUvYe1Z — US Open Tennis (@usopen) September 10, 2023 -
కన్నీళ్లు తెప్పించిన సజీవదహనం ఫోటోలు.. '31 మిలియన్ డాలర్లు చెల్లించండి'
అమెరికన్ బాస్కెట్‌బాల్ దిగ్గజం కోబ్ బ్రియాంట్ 2020లో హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన సంగతి తెలిసిందే. అతని మరణవార్త అప్పట్లో క్రీడాలోకాన్ని తీవ్ర దిగ్ర్బాంతికి గురి చేసింది. సబర్బన్ లాస్ ఏంజిల్స్‌లో పొగమంచు కారణంగా హెలికాప్టర్ కుప్పకూలి మంటలు చెలరేగాయి. దీంతో బ్రియంట్తో సహా ఆయన 13 ఏళ్ల కూతురు జియానా దుర్మరణం చెందింది. హెలికాప్టర్ కూలుతూనే మంటల్లో చిక్కుకోవడంతో హెలికాప్టర్లో ఉన్న మరో ఎనిమిది మంది కూడా సజీవదహనమయ్యారు.. మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా కాలిపోయాయి. PC: కోబ్ బ్రియాంట్ భార్య వెనెస్సా బ్రియాంట్ అప్పట్లో కోబ్ బ్రియాంట్ మృతిపై సెర్చ్ ఆపరేషన్‌లో భాగంగా లాస్ ఏంజిల్స్ కౌంటీ డిప్యూటీస్ సహా అగ్నిమాపక అధికారులు సంఘటనా స్థలానికి చేరుకొని ఫోటోలు తీశారు. అంతటితో ఊరుకోకుండా ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో బ్రియాన్ సజీవదహనం ఫోటోలు వైరల్ అయ్యాయి. ఈ ఫోటోలు బ్రయంట్ భార్య వెనెస్సాను ఎమోషన్‌కు గురిచేయడంతో పాటు మానసిక సంఘర్షణకు గురయ్యేలా చేశాయి. తన అనుమతి లేకుండా ఫోటోలు సోషల్ మీడియాలో పెట్టడంపై లాస్ ఏంజిల్స్ కౌంటీపై కోర్టులో దావా వేసింది. తాజాగా బుధవారం దావాను పరిశీలించిన తొమ్మిది మందితో కూడిన ధర్మాసనం.. తీర్పును వెనెస్సాకు అనుకూలంగా ఇచ్చింది. కోబ్ బ్రయంట్ భార్య సహా మిగతావాళ్లకు కలిపి లాస్ ఏంజెల్స్ కౌంటీ 31 మిలియన్ డాలర్ల నష్టపరిహారాన్ని చెల్లించాలని జ్యూరీ ఆదేశించింది. వెనెస్సా బ్రయంట్ కుటుంబంతో పాటు క్రిస్ చెస్టర్, అతని భార్య సారా, కుమార్తె పేటన్ కూడా ఈ ప్రమాదంలో మరణించారు. దీంతో 31 మిలియన్ డాలర్స్‌లో వెనెస్సా బ్రియంట్కు 16 మిలియన్ డాలర్లు.. చెస్టర్ ఫ్యామిలీకి 15 మిలియన్ డాలర్లు చెల్లించాలని కౌంటీకి పేర్కొంది. PC: కోబ్ బ్రియాంట్ కుటుంబం(ఫైల్ ఫోటో) ధర్మాసనం తీర్పును చదవగానే భావోద్వేగానికి గురైన వెనెస్సా బ్రియాంట్ విలేకరులతో మాట్లాడకుండానే కన్నీళ్లు పెట్టుకుంటూ కోర్టు ఆవరణ నుంచి వెళ్లిపోయింది. ఆ తర్వాత ఇన్స్టాగ్రామ్ వేదికగా తన భర్త బ్రియాంట్, కూతురు జియానా ఫోటోను షేర్ చేస్తూ "ఆల్ ఫర్ యు! ఐ లవ్ యు! జస్టిస్ ఫర్ కోబ్ అండ్ జిగి!" అని క్యాప్షన్ జత చేసింది. PC: కోబ్ బ్రియాంట్(ఫైల్ ఫోటో) కొబ్ బ్రయంట్ తన 20 ఏళ్ల కెరీర్లో పలు రికార్డులు సాధించారు. నేషనల్ బాస్కెట్ బాల్ అసోసియేషన్ తరపున ఆడి ఐదు సార్లు ఛాంపియన్ గా నిలిచారు. 18సార్లు ఆల్ టైమ్ స్టార్ గా నిలిచారు. 2016లో ఎన్ బీఎ నుంచి మూడోసారి ఆల్ టైమ్ స్కోరర్ గా రిటైర్ అయ్యారు. కొబ్ బ్రయంట్ 2012 ఒలింపిక్స్ లో యూఎస్ టీమ్ తరపున ఆడి రెండు స్వర్ణ పతకాలు అందుకున్నారు. -
మైదానంలోనే కుప్పకూలాడు.. 18 ఏళ్లకే
వాషింగ్టన్: కారు ప్రమాదంలో గాయపడిన ప్రముఖ గోల్ఫ్ ఆటగాడు టైగర్ వుడ్స్(45) ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు. టైగర్ స్పృహలోనే ఉన్నారని, చికిత్సకు స్పందిస్తున్నారని పేర్కొన్నారు. సకాలంలో ఆయనను ఆస్పత్రికి తీసుకురావడం వల్ల పెను ప్రమాదం తప్పిందని, కుడి కాలులో రాడ్డు వేసినట్లు తెలిపారు. కాగా లాస్ ఏంజెల్స్‌లో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో టైగర్ వుడ్స్ తీవ్రంగా గాయపడిన విషయం విదితమే. ఆయన ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి పల్టీలు కొట్టి రోడ్డు పక్కనున్న లోయలోకి 20 అడుగుల దూరం దూసుకెళ్లింది. ఈ క్రమంలో ఆయనను సమీప ఆస్పత్రికి తీసుకువెళ్లి చికిత్స అందిస్తున్నారు. ఈ వార్తతో క్రీడాలోకం తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. టైగర్ ప్రాణాలతో సురక్షితంగా బయటపడాలని ఆయన అభిమానులు ప్రార్థిస్తున్నారు. మరికొంత మంది గతేడాది హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన కోబీ బ్రియాంట్ సహా అకస్మాత్తుగా ఈ లోకాన్ని వీడిన క్రీడాకారులను తలచుకుంటూ భావోద్వేగానికి లోనవుతున్నారు. పద్దెనిమిదేళ్లకే మృత్యువాత పడ్డాడు ధ్రువ్ మహేందర్ పండోవ్.. పంజాబ్ తరఫున ఫస్ట్‌క్లాస్ క్రికెట్ ఆడాడు. 1974 జనవరి 9న జన్మించిన అతడు పదమూడేళ్ల వయస్సులోనే దేశవాళీ క్రికెట్లో అడుగుపెట్టాడు. జమ్ము కశ్మీర్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో 137 పరుగులు చేసిన ధ్రువ్, ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో అత్యంత పిన్న వయసులో సెంచరీ సాధించిన తొలి భారత క్రికెటర్‌గా చరిత్రకెక్కాడు. 14 ఏళ్ల 294 రోజుల వయసులో ఈ ఘనత సాధించాడు. అంతేగాక రంజీ ట్రోఫీలో 1000 పరుగుల మార్కును చేరుకున్న పిన్న వయస్కుల్లో(17 ఏళ్ల 341 రోజులు) ఒకడిగా కూడా నిలిచాడు. మెరుగైన భవిష్యత్తు గల ఆటగాడిగా ప్రశంసలు అందుకున్న ధ్రువ్ దురదృష్టవశాత్తూ అంబాలాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. పద్దెమినిదేళ్ల వయసులో(1992, జనవరి 31)నే ఈ లోకాన్ని శాశ్వతంగా వీడి వెళ్లిపోయాడు. మైదానంలో కుప్పకూలాడు భారత్ తరఫున 4 టెస్టు మ్యాచ్‌లు, 32 వన్డేలు ఆడాడు క్రికెటర్ రమణ్ లంబా కుశాల్. 1960లో ఉత్తర్‌ప్రదేశ్‌లో జన్మించిన అతడు, ఐర్లాండ్ తరఫున అనధికారంగా వన్డే మ్యాచుల్లో పాల్గొన్నాడు. అంతేగాకుండా బంగ్లాదేశ్ ఢాకా ప్రీమియర్ లీగ్‌లోనూ ఆడాడు. ఈ క్రమంలో 1998 ఫిబ్రవరిలో జరిగిన ఓ మ్యాచ్‌లో భాగంగా క్రికెట్ బాల్ తగిలి తీవ్రంగా గాయపడ్డాడు. అంతర్గత అవయవాల్లో రక్తస్రావం జరిగడంతో కోమాలోకి వెళ్లి మూడు రోజుల తర్వాత మృతి చెందాడు. కూతురితో పాటు తాను కూడా బాస్కెట్‌బాల్ దిగ్గజం కోబీ బ్రియాంట్ గతేడాది తన అభిమానులను శోకసంద్రంలో ముంచి ఈ లోకాన్ని వీడాడు. సుమారు రెండు దశాబ్దాల పాటు (1996-2016) తన మెరుపు విన్యాసంతో మైదానంలో పాదరసంలా కదిలిన బ్రయాంట్.. కూతురు జియానాను సైతం తనలాగే అద్భుతమైన క్రీడాకారిణిగా తీర్చిదిద్దాలని భావించాడు. మాంబా స్పోర్ట్స్ అకాడమీలో జియానాకు బాస్కెట్‌బాల్ మ్యాచ్ ఉండటంతో అందులో పాల్గొనడానికి తనతో పాటు హెలికాప్టర్లో వెళ్తుండగా ప్రమాదం జరిగి ఇద్దరూ మృత్యువాత పడ్డారు. వారితో పాటు మరో ఏడుగురు కూడా మరణించారు. ఏడేళ్లపాటు జీవచ్చవంలా ఫార్ములా వన్ మాజీ ప్రపంచ చాంపియన్ మైకెల్ షుమాకర్ స్కై డైవింగ్ సరదాతో చావు అంచుల దాకా వెళ్లాడు. ఫ్రాన్స్‌లోని ఆల్ప్స్ పర్వత శ్రేణుల్లో షుమేకర్ స్కీయింగ్ చేస్తూ ప్రమాదానికి గురైన అతడు సుదీర్ఘకాలంపాటు కోమాలోనే ఉన్నాడు. 1946లో తొలిసారిగా ఆరంభమైన ఫార్ములా వన్ నాటి నుంచీ అంతకు ముందెన్నడు లేనివిధంగా, ఫార్ములా వన్ చాంపియన్ షిప్ లతో పాటు పందేలనూ గెలుచుకున్న షూమాకర్.. 2004లో చివరిసారిగా తన చివరి ఫార్ములా రేస్‌ను గెల్చుకున్నాడు. ప్రస్తుతం అతడు కోమా నుంచి బయపడినప్పటికీ మునుపటిలా సాధారణ జీవితం గడిపే అవకాశం లేదని వైద్యులు తెలిపారు. విషాదాంతంగా ముగిసిన హ్యూస్ జీవితం క్రికెట్‌ను ప్రాణంగా భావించిన ఆస్ట్రేలియా క్రికెటర్ ఫిలిఫ్ జోయెల్ హ్యూస్ జీవితం ఆట కారణంగానే అర్ధాంతరంగా ముగిసిపోయింది. 2014 నవంబర్‌లో సిడ్నీ క్రికెట్ గ్రౌండ్లో దేశవాళీ మ్యాచ్ సందర్భంగా సీన్ అబాట్ సంధించిన బౌన్సర్ హ్యూస్ తలకు బలంగా తాకింది. బాధతో విలవిల్లాడుతూ క్రీజులోనే కుప్పకూలిన హ్యూస్ చికిత్స పొందుతూ రెండు రోజుల తర్వాత తుదిశ్వాస విడిచాడు. పాతికేళ్ల వయసులోనే ఈ లోకాన్ని వీడి వెళ్లిపోయాడు. వీరితో పాటు క్రీడా రంగానికి చెందిన మరెంతో మంది ఆటగాళ్లు హఠాన్మరణం చెంది అభిమానులకు దుఃఖాన్ని మిగిల్చారు. చదవండి: అమెరికాలో రోడ్డు ప్రమాదం.. టైగర్ వుడ్స్‌కు తీవ్ర గాయాలు మొతేరా క్రికెట్ స్టేడియం : బిగ్ సర్ప్రైజ్ -
కోబీ బ్రయాంట్ టవల్‌కు రూ. 24 లక్షలు
లాస్ ఏంజెలిస్: అమెరికా విఖ్యాత బాస్కెట్‌బాల్ ప్లేయర్, దివంగత కోబీ బ్రయాంట్ మరణానంతరం కూడా తన అభిమానులకు తానెంతటి ఆరాధ్యమో ప్రపంచానికి చాటుతున్నాడు. నేషనల్ బాస్కెట్‌బాల్ లీగ్ (ఎన్బీఏ) నుంచి రిటైర్ అవుతూ... తన వీడ్కోలు ప్రసంగంలో భుజాలపై వేసుకున్న టవల్‌ను ఒక వేలం పాటలో ఉంచగా... అది 33,077 అమెరికన్ డాలర్లు (రూ.24.89 లక్షలు) పలికి కోబీ క్రేజ్‌ను మరోసారి తెలియజేసింది. ఈ వేలం పాటలో కోబీ అభిమాని ఒకరు ఈ మొత్తం చెల్లించి సొంతం చేసుకున్నాడు. తన 20 ఏళ్ల ఎన్బీఏ కెరీర్ మొత్తం లాస్ ఏంజెలిస్ లేకర్స్‌కే ప్రాతినిధ్యం వహించిన కోబీ... ఈ ఏడాది జనవరి 26న జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో మరణించాడు. -
వేలంలో ‘బ్లాక్ మాంబా’ టవల్‌కు భారీ ధర
లాస్ ఏంజెల్స్: ఈ ఏడాది జనవరిలో అమెరికా బాస్కెట్‌బాల్ చాంపియన్ ప్లేయర్ కోబీ బ్రయాంట్ దుర్మరణం చెందిన సంగతి తెలిసిందే. హెలికాప్టర్ ప్రమాదంలో ఈ అమెరికన్ సూపర్‌స్టార్ మృతిచెందాడు. ఈ ప్రమాదంలో బ్రయాంట్‌తో పాటు అతని కూతురు 13 ఏళ్ల కుమార్తె జియానా కూడా మరణించింది. అయితే బ్లాక్ మాంబాగా పిలుచుకునే బ్రయాంట్ తరచు తన భుజాలపై వేసుకుని టవల్‌ను వేలంలో పెట్టగా దానికి భారీ ధర పలికింది. బ్రయాంట్ మ్యాచ్ గెలిచిన సందర్భాల్లో ఎక్కువగా భుజాలపై వేసుకుని టవల్‌ను తాజాగా ఆన్లైన్ వేలంలో పెట్టారు. (క్షమాపణ చెప్పిన బీబీసీ) ఇది చివరకు ఒక అభిమాని చేతుల్లోకి వెళ్లింది. ఆ టవల్‌ను 33 వేల డాలర్లు(రూ. సుమారు రూ. 24 లక్షలు) వెచ్చించి వూల్ఫ్ అనే ఒక అభిమాని కొనుగోలు చేశాడు. కాగా, 2016 ఏప్రిల్ 13వ తేదీన లేకర్స్ గేమ్‌కు ఉపయోగించిన రెండు టికెట్లను కూడా బ్రయాంట్ టవల్‌ను కొనుగోలు చేసిన అభిమాని అందుకున్నాడు. ఆనాటి మ్యాచ్‌లో బ్రయాంట్ 60 పాయింట్లు సాధించాడు. ఉతాహ్ జాజ్‌తో జరిగిన మ్యాచ్‌లో లేకర్స్ 101 పాయింట్లు సాధించింది. అందులో బ్రయాంట్ ఒక్కడే 60 పాయింట్లను నమోదు చేయడం విశేషం. అయితే తన వద్ద లేకర్స్ జట్టుకు చెందిన చాలా జ్ఞాపకాలు పదిలంగా ఉన్నట్లు తెలిపాడు. వీటి కోసం దక్షిణ కాలిఫోర్నియాలోని ఒక మ్యూజియం ఏర్పాటు చేసి అందులో పెడతానన్నాడు. అదే తన చిరకాల కోరిక అని వూల్ఫ్ తెలిపాడు. (కోబీ మరణం నన్ను మార్చివేసింది: కోహ్లి) -
గుండె పగిలే వార్త అది: కోహ్లి
హామిల్టన్: బాస్కెట్ బాల్ దిగ్గజం కోబీ బ్రియాంట్ మరణవార్త తనను షాక్‌కు గురిచేసిందని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి విచారం వ్యక్తం చేశాడు. జీవితంలో ఎప్పుడు ఎలాంటి మార్పులు చోటుచేసుకుంటాయో ఊహించలేమని.. ప్రతీ క్షణాన్ని ఆస్వాదించాలని చెప్పుకొచ్చాడు. కివీస్‌తో జరిగిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసిన టీమిండియా.. మూడు వన్డేల సిరీస్‌కు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మంగళవారం మీడియాతో మాట్లాడిన కోహ్లి.. కోబీకి నివాళులు అర్పించాడు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... ‘‘ఇది చాలా బాధకరమైన విషయం. గుండె పగిలే వార్త. ప్రతీ ఒక్కరూ షాక్‌కు గురయ్యారు. రోజూ పొద్దునే ఎన్బీఏ మ్యాచ్‌లు చూడటంతో నా రోజు మొదలయ్యేది. అలాంటిది నాకు స్ఫూర్తిగా నిలిచిన కోబీ అకస్మాత్తుగా ఈ లోకం నుంచి వెళ్లిపోవడం బాధాకరం. జీవితం ఎప్పుడు ఎలాంటి మలుపులు తీసుకుంటుందో తెలియదు. కొన్నిసార్లు... మనం కేవలం ఆట గురించే ఆలోచిస్తాం. ఎలాంటి షాట్ ఆడాలి.. బంతిని ఎలా విసరాలి.. ఇలాంటి ఆలోచనలతో జీవించడాన్ని మరచిపోతాం. కోబీ మరణం నన్ను పూర్తిగా మార్చివేసింది. ఇప్పుడు నేను జీవితాన్ని కొత్తగా చూడటం మొదలుపెట్టాను. దాన్ని ప్రశంసిస్తున్నాను. జీవితాన్ని.. ప్రతీ క్షణాన్ని ఆస్వాదించాలి. రోజులో ఏం చేస్తున్నామనేది ముఖ్యం కాదు... జీవించి ఉండటం కొన్నిసార్లు అతి ముఖ్యమైనదిగా అనిపిస్తుంది’’ అని కోహ్లి వేదాంత ధోరణిలో చెప్పుకొచ్చాడు.(చదవండి : టీమిండియా సూపర్ విక్టరీ: నెవర్ బిఫోర్... 5-0) కాగా ‘బ్లాక్ మాంబా’గా సుపరిచితమైన బాస్కెట్ బాల్ లెజెండ్ కోబీ బ్రయాంట్, కూతురు జియానా(13) సహా మరో ఏడుగురు హెలికాప్టర్ ప్రమాదంలో దుర్మరణం పాలైన విషయం విదితమే. గత ఆదివారం కాలిఫోర్నియా సమీపంలోని క్యాలాబసస్ వద్ద జరిగిన ఈ దుర్ఘటన యావత్ క్రీడా ప్రపంచాన్ని దుఃఖ సాగరంలో ముంచివేసింది.(మాటలు రావడం లేదు: కోబీ భార్య భావోద్వేగం) -
విషాదం.. మాటలు రావడం లేదు: కోబీ భార్య
లాస్ ఏంజెల్స్: తన భర్త, కూతురి దుర్మరణం తమ కుటుంబాన్ని అగాథంలోకి నెట్టివేసిందని బాస్కెట్‌బాల్ దిగ్గజం కోబీ బ్రియాంట్ భార్య వెనెస్సా బ్రియాంట్ భావోద్వేగానికి గురయ్యారు. వాళ్లిద్దరూ లేని లోటు ఎవరూ పూడ్చలేరని.. ఈ విషాదం గురించి వర్ణించడానికి మాటలు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి విషాదకర సమయంలో తమకు తోడుగా ఉన్న లక్షలాది మందికి ధన్యవాదాలు తెలిపారు. ‘బ్లాక్ మాంబా’గా సుపరిచితమైన బాస్కెట్ బాల్ లెజెండ్ కోబీ బ్రయాంట్, కూతురు జియానా(13) సహా మరో ఏడుగురు హెలికాప్టర్ ప్రమాదంలో దుర్మరణం పాలైన విషయం విదితమే. ఆదివారం కాలిఫోర్నియా సమీపంలోని క్యాలాబసస్ వద్ద జరిగిన ఈ దుర్ఘటన యావత్ క్రీడా ప్రపంచాన్ని దుఃఖ సాగరంలో ముంచివేసింది. ఈ నేపథ్యంలో కోబీ మరణం తర్వాత తొలిసారిగా ఆయన భార్య వెనెస్సా గురువారం సోషల్ మీడియా వేదికగా తన బాధను పంచుకున్నారు. ‘‘నా ప్రియమైన భర్త కోబీ... అద్భుతమైన తండ్రి... నా అందమైన, అద్భుతమైన, చలాకీదైన చిన్నారి జియానా- నా కూతురు, నటాలియా, బియాంక, కాప్రీల సోదరి.. వాళ్లిద్దరినీ కోల్పోవడంతో కుటుంబం మొత్తం విషాదంలో మునిగిపోయింది. కోబీ, గిగీ లేని జీవితాన్ని ఊహించుకోలేకపోతున్నాం అయినా వాళ్లు ఎల్లప్పుడూ మాతోనే ఉన్నట్లుగా భావిస్తాం.(దిగ్గజం విషాదాంతం) నేను వాళ్లిద్దరినీ ఆత్మీయంగా ఆలింగనం చేసుకోవాలి.. వారి తలపై ప్రేమగా ముద్దు పెట్టాలి అని ఆకాంక్షిస్తున్నాను. వాళ్లు మాతోనే ఉంటారు. ఈ ప్రమాదంలో నా భర్త, కూతురితో పాటు చనిపోయిన మిగతా వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. వారికి ముంబా స్పోర్ట్స్ ఫౌండేషన్ తరఫున సహాయం అందజేస్తాం’’ అంటూ భావోద్వేగ పోస్టు పెట్టారు. కాగా కోబీ- వెనెస్సా(డ్యాన్సర్)లు 2001లో ప్రేమ వివాహం చేసుకున్నారు. ఈ జంటకు నలుగురు ఆడ పిల్లలు.. నటాలియా (17 ఏళ్లు), జియానా (13 ఏళ్లు), బియాంకా (3 ఏళ్లు), క్యాప్రి (7 నెలలు) ఉన్నారు. ఇక సుమారు రెండు దశాబ్దాల పాటు (1996-2016) తన మెరుపు విన్యాసంతో మైదానంలో పాదరసంలా కదిలిన బ్రయాంట్.. తన కూతురు జియానాను సైతం అద్భుతమైన క్రీడాకారిణిగా తీర్చిదిద్దాలని భావించాడు. మాంబా స్పోర్ట్స్ అకాడమీలో జియానాకు బాస్కెట్‌బాల్ మ్యాచ్ ఉండటంతో అందులో పాల్గొనడానికి హెలికాప్టర్లో వెళ్తుండగా ఇద్దరూ మృత్యువాత పడ్డారు.(కనుమరుగైన ‘బ్లాక్ మాంబా’) View this post on Instagram My girls and I want to thank the millions of people who’ve shown support and love during this horrific time. Thank you for all the prayers. We definitely need them. We are completely devastated by the sudden loss of my adoring husband, Kobe — the amazing father of our children; and my beautiful, sweet Gianna — a loving, thoughtful, and wonderful daughter, and amazing sister to Natalia, Bianka, and Capri. We are also devastated for the families who lost their loved ones on Sunday, and we share in their grief intimately. There aren’t enough words to describe our pain right now. I take comfort in knowing that Kobe and Gigi both knew that they were so deeply loved. We were so incredibly blessed to have them in our lives. I wish they were here with us forever. They were our beautiful blessings taken from us too soon. I’m not sure what our lives hold beyond today, and it’s impossible to imagine life without them. But we wake up each day, trying to keep pushing because Kobe, and our baby girl, Gigi, are shining on us to light the way. Our love for them is endless — and that’s to say, immeasurable. I just wish I could hug them, kiss them and bless them. Have them here with us, forever. Thank you for sharing your joy, your grief and your support with us. We ask that you grant us the respect and privacy we will need to navigate this new reality. To honor our Team Mamba family, the Mamba Sports Foundation has set up the MambaOnThree Fund to help support the other families affected by this tragedy. To donate, please go to MambaOnThree.org. To further Kobe and Gianna’s legacy in youth sports, please visit MambaSportsFoundation.org. Thank you so much for lifting us up in your prayers, and for loving Kobe, Gigi, Natalia, Bianka, Capri and me. #Mamba #Mambacita #GirlsDad #DaddysGirls #Family ❤️ A post shared by Vanessa Bryant 🦋 (@vanessabryant) on Jan 29, 2020 at 4:59pm PST -
కనుమరుగైన ‘బ్లాక్ మాంబా’
మాటలింకా పూర్తిగా రాకుండానే, ఇంకా బుడి బుడి అడుగులతో తడబడుతుండగానే తనకు తోచినవిధంగా బాస్కెట్ బాల్ ఆటాడుతూ అందరినీ అలరించిన ఒక బుడతడు ఇకపై నిరంతరం ఆ బాస్కెట్ బాల్ క్రీడనే శ్వాసిస్తాడని, భవిష్యత్తులోఆ రంగాన్నే శాసిస్తాడని, దిగ్గజంగా వెలుగు లీనుతాడని ఎవరూ ఊహించలేరు. తన ఆటతో మైదానంలోని ప్రేక్షకులను మాత్రమే కాదు... సకల రంగ దిగ్గజాలను సైతం అబ్బురపరిచిన కోబీ బ్రయంట్ నాలుగు పదుల వయసులోనే సోమవారం ఒక హెలికాప్టర్ ప్రమాదంలో తనువు చాలించిన తీరు అందరినీ విషాదంలో ముంచింది. తనెంతో ఇష్టపడే తన కుమార్తె పదమూడేళ్ల జియానాకూ, ఆమె సహచర క్రీడాకారులకూ బాస్కెట్ బాల్లో శిక్షణనిచ్చి, వారి ఆటను స్వయంగా చూడటానికి ఆ టీంతో కలిసి హెలికాప్టర్లో వెడుతూ వారంద రితోపాటు కోబీ దుర్మరణం పాలయ్యాడు. కోబీ లాంటి క్రీడాకారులు అరుదుగా ఉద్భవిస్తారు. ఏ రంగంపైన అయినా ఇష్టం పెంచుకోవడం అందులో ప్రవేశించడానికి ఏదోమేరకు తోడ్పడవచ్చు. కానీ ఆ రంగంలో కొనసాగాలన్నా, దూసుకుపోవాలన్నా, శిఖరాగ్ర స్థాయిలో నిలవాలన్నా నిరంత రమైన కఠోర సాధన అవసరం. అన్నిటికీ మించి క్రమశిక్షణ ముఖ్యం. నాన్న జెల్లీ బీన్ బాస్కెట్ బాల్ క్రీడాకారుడు కావడంతో కోబీని ఆ రంగం చిరుప్రాయంనాడే ఆకర్షించింది. ఆయన దగ్గర నేర్చు కున్న మెలకువలు పాఠశాల జట్టులో ప్రవేశించడానికి ఎంతోకొంత ఉపయోగపడివుండొచ్చు. కానీ హైస్కూల్ జట్టు నుంచి పదిహేడేళ్ల చిరుప్రాయంలో నేరుగా ప్రతిష్టాత్మకమైన జాతీయ బాస్కెట్ బాల్ అసోసియేషన్(ఎన్బీఏ)కు 1996లో ఎంపిక కావడం మాత్రం పూర్తిగా కోబీ ప్రదర్శించిన ప్రతిభా పాటవాల పర్యవసానమే. బాస్కెట్ బాల్ రంగంలోకి తుపానులా వచ్చిపడిననాడే ఆ ఆటలో అంతక్రితం మైకేల్ జోర్డాన్, విల్ట్ చాంబర్లిన్లు నెలకొల్పిన అద్భుతమైన రికార్డుల్ని అధిగమించాలని... కరీం అబ్దుల్ జబ్బార్ కన్నా ఎక్కువ పాయింట్లు సాధించాలని... బిల్ రసెల్‌కి మించిన టైటిళ్లు సొంతం చేసుకోవాలని కోబీ నిర్ణయించుకున్నాడు. కానీ ఒంటినిండా అయిన గాయాల కారణంగా మైకేల్ జోర్డాన్ సాధిం చిన ఆరు టైటిళ్ల స్థాయికి ఈవలే ఉండిపోక తప్పలేదు. ఆ సంగతలావుంచి కోబీ బ్రయాంట్ ఆ ఆటనొక తపస్సుగా భావించి, రోజుకు ఏకబిగిన ఎనిమిది గంటలు అందులోనే మునిగితేలాడు. మెలకువలన్నీ నేర్చుకున్నాడు. వాటికి తన సునిశిత నైపుణ్యాన్ని జోడించాడు. కనుకనే ఒకసారి బంతి చేతికి చిక్కిందంటే దాన్ని ప్రత్యర్థి పక్షంలో ఎవరికీ అందనీయకుండా, మెరుపు వేగంతో ముందుకు దూసుకుపోవడం, బాస్కెట్లో అలవోకగా దాన్ని జారవిడవడం కోబీకి మాత్రమే సాధ్యమయ్యేది. చూసేవారందరినీ మంత్రముగ్ధుల్ని చేసేది. చుట్టుముట్టినవారెవరికీ అందకుండా పాదరసంలా జారి పోయే కోబీ బ్రయాంట్ తీరు ఎవరికీ అంతుచిక్కేది కాదు. రెండు దశాబ్దాలపాటు తన క్రీడా పాటవంతో అందరినీ అలరించాక, ఎందరికో స్ఫూర్తిదాయకంగా నిలిచాక 2016లో అతను రిటైరైన ప్పుడు కోబీ ఖాతాలో అయిదు ఎన్బీఏ టైటిళ్లు, రెండు ఒలింపిక్ స్వర్ణాలు, 33,643 పాయింట్లు ఉన్నాయి. ఒక మ్యాచ్‌లో 81 పాయింట్లు సాధించి టాప్ ఫైవ్‌లో ఒకడిగా నిలిచాడు. తన కెరీర్లో అయిదుసార్లు 60 పాయింట్లకంటే ఎక్కువ సాధించిన చరిత్ర కూడా కోబీదే. 2016లో ఆడిన ఆఖరా టలో సైతం ఆ లక్ష్యాన్ని అందుకోవడం అతని విశిష్టత. కోబీ ఆట అందరినీ కట్టిపడేయడానికి, విస్మ యపరచడానికి ప్రత్యేక కారణముంది. ఆటలోకి దిగాక కేవలం పాయింట్లు సాధించడానికి మాత్రమే కోబీ పరిమితం కాడు. ఆట ఆరంభంలోనే దాన్ని పూర్తిగా తన చేతుల్లోకి తెచ్చుకుంటాడు. ఆద్యం తమూ అది తనచుట్టూ తిరిగేలా చేసుకుంటాడు. అతనిలోని ఈ లక్షణమే ప్రపంచవ్యాప్తంగా లక్షలా దిమందిని ఆకర్షించింది. వ్యక్తిగా కూడా కోబీ కొన్ని విలువలకు కట్టుబడినవాడు. అందుకే హైస్కూల్ నుంచి వచ్చినప్పుడు తనకు అవకాశమిచ్చిన లేకర్స్ జట్టుతోనే రిటైరయ్యేవరకూ నిలిచి, ఆడిన ప్రతిసారీ తన సర్వశక్తులూ దానిపైనే కేంద్రీకరించాడు. వేరే సంస్థలు లేకర్స్‌ను మించి ఇస్తామని ఆశపెట్టినా లొంగలేదు. కనుకనే కోబీతోపాటే ఆయన వాడిన 8, 24 నంబర్ల జెర్సీలకు లేకర్స్ రిటైర్మెంట్ ఇచ్చేసింది. తన ప్రతిభను దాచుకోవడం, దాన్ని సొమ్ము చేసుకోవాలని చూడటం కోబీకి పొసగనివి. అందుకే సహచర పురుష, మహిళ క్రీడాకారుల ఆటను గమనించడం, అందులోని లోటు పాట్లేమిటో వారికి తెలియజేసి, వారు ఎదగడానికి దోహదపడటం ఆయన ప్రత్యేకత. అందుకే కోబీ సీనియర్లు, సహచర క్రీడాకారులు, అతని అనంతరకాలంలో ఆ రంగంలోకొచ్చినవారు అతన్ని ప్రేమగా స్మరించుకున్నారు. ఇది కోబీ వ్యక్తిత్వాన్ని పట్టిచూపే అంశం. కోబీ జీవితంలో ఎత్తుపల్లాలు లేవని కాదు. ఆటాడే క్రమంలో అయిన గాయాలు ఆయన్ను ఇబ్బందిపెట్టాయి. ఎన్నోసార్లు మోకాళ్ల వద్ద, చీలమండ దగ్గర గాయాలై ఆట విడుపు తప్పలేదు. తన ప్రాణసమానమైన ఆటకు వీడ్కోలు పలికే వేళ దాన్నుద్దేశించి ‘డియర్ బాస్కెట్ బాల్’ అంటూ కోబీ రాసిన కవిత అతనిలోని క్రీడాకారుడు పుట్టి పెరిగి దిగ్గజంగా రూపొందిన వైనాన్ని వివరిస్తుంది. దాని ఆధారంగా మరో ఇద్దరితో కలిసి తాను నిర్మించిన యానిమేషన్ చిత్రానికి 2018లో ఆస్కార్ అవార్డు లభించింది. ఈ స్వల్ప నిడివి చిత్రం కోబీలోని భిన్న కోణాన్ని ఆవిష్కరించింది. అమెరికా బాస్కెట్‌బాల్‌లో ఈమధ్య మెరుగైన ఆటగాళ్ల జాడ కనబడటం లేదని చాలామందిలో బెంగ పట్టు కుంది. ఒకప్పుడు న్యూయార్క్, లాస్ఏంజెలెస్, షికాగో, ఫిలడెల్ఫియా తదితరచోట్ల వీక్షకుల్ని ఉర్రూ తలూగించి కట్టిపడేసిన క్రీడాకారులు ఇప్పుడు ఎక్కడా కానరావడం లేదన్న చింత అందరిలోవుంది. ఇలాంటి తరుణంలో బాస్కెట్‌బాల్‌ను తన జీవితంలో భాగంగా కాదు... దాన్నే జీవితంగా భావించి చివరివరకూ తన సర్వస్వాన్నీ అందుకోసమే ధారపోసిన ‘బ్లాక్ మాంబా’ కోబీ వంటి దిగ్గజం కను మరుగు కావడం విచారకరం. ఆ లోటును పూడ్చడం ఎవరికీ సాధ్యం కాదు. -
కోబ్ మరణం: కన్నీళ్లు పెట్టుకున్న దియా మీర్జా
-
ఆయన మరణం కలచివేసింది: దియా మీర్జా
జైపూర్: కన్నీళ్లు కార్చేందుకు భయపడాల్సిన అవసరం లేదని.. బాధను ధైర్యంగా వ్యక్తపరచాలని బాలీవుడ్ భామ దియా మీర్జా అన్నారు. తనివితీరా ఏడ్వటం వల్ల మనసుకు ఉపశమనం కలుగుతుందని పేర్కొన్నారు. రాజస్తాన్ రాజధాని జైపూర్‌లో జరుగుతున్న లిటరేచర్ ఫెస్టివల్‌కు సోమవారం ఆమె హాజరయ్యారు. వాతావరణ మార్పు అంశంపై చర్చ సందర్భంగా దియా ఒక్కసారిగా కన్నీటిపర్యంతమయ్యారు. అమెరికా బాస్కెట్‌బాల్ దిగ్గజం కోబ్ బ్రియాంట్ మరణవార్త తనను తీవ్రంగా కలచివేసిందని భావోద్వేగానికి గురయ్యారు. ‘‘జనవరి 26.. దాదాపు ఉదయం 3 గంటల సమయంలో నా అభిమాన ఎన్బీఏ ఆటగాడు దుర్మరణం పాలయ్యాడనే వార్తకు సంబంధించిన అలెర్ట్‌తో రోజు ప్రారంభమైంది. కాలిఫోర్నియాలో ఆయన విమానం కుప్పకూలిందనే వార్త నన్ను తీవ్ర వేదనకు గురిచేసింది. పూర్తి నిరాశలో కూరుకుపోయాను. బీపీ లెవెల్స్ పడిపోయాయి. మన రోజువారీ జీవితంలో ఇలాంటి ప్రమాదాలు, వివిధ విషయాలు మనల్ని అగాథంలోకి నెట్టేస్తాయి. అయితే మనం మనోనిబ్బరంతో ఉండాలి. అంతేకాదు ఎదుటివారి బాధను మన బాధగా భావించి వారికి అండగా ఉండాలి. వారి స్థానంలో మనల్ని ఊహించుకుని అండగా నిలబడాలి. కన్నీళ్లు కార్చేందుకు ఏమాత్రం వెనుకాడకూడదు’’ అంటూ దియా మీర్జా ఉద్వేగానికి లోనయ్యారు. ఇది నటన కాదని.. ఇలా కన్నీళ్లు కార్చడం ద్వారా భారం తగ్గినట్లుగా అనిపిస్తుందని చెప్పుకొచ్చారు.(కోబ్ బ్రయాంట్ దుర్మరణం.. శోకసంద్రంలో అమెరికా) కాగా అమెరికా లెజండరీ బాస్కెట్‌బాల్ ప్లేయర్, కోచ్ కోబ్ బ్రియాంట్ హెలికాప్టర్ ప్రమాదంలో దుర్మరణం పాలైన విషయం విదితమే. ఈ ఘటనలో బ్రియాంట్ కుమార్తె గియానా కూడా మృత్యువాత పడింది. హెలికాప్టర్ కూలుతూనే మంటల్లో చిక్కుకోవడంతో.. మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా కాలిపోయాయి. ఈ విషాదకర ఘటనపై క్రీడాలోకం సహా పలువురు ప్రముఖులు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. -
దిగ్గజం విషాదాంతం
చాంపియన్ ప్లేయర్... ఒలింపిక్స్ గోల్డెన్ స్టార్... ఆస్కార్ అవార్డ్ విన్నర్... బాస్కెట్ బాల్ లెజెండ్ కోబీ బ్రయాంట్ జీవన ప్రయాణం విషాదాంతమైంది. హెలికాప్టర్ ప్రమాదంలో ఈ అమెరికన్ సూపర్‌స్టార్ దుర్మరణం పాలయ్యాడు. అతనితో పాటు 13 ఏళ్ల కుమార్తె జియానా కూడా మరణించడం అభిమానుల్ని తీవ్రంగా కలచివేసింది. క్రీడాలోకాన్ని కన్నీట ముంచిన ఈ పిడుగులాంటి వార్తపై ప్రపంచ వ్యాప్తంగా ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. లాస్ఏంజిల్స్: అమెరికాను... ఎన్బీఏనే కాదు... యావత్ క్రీడా ప్రపంచాన్నే దుఃఖ సాగరంలో ముంచేసే వార్త ఇది. 41 ఏళ్ల బాస్కెట్‌బాల్ దిగ్గజం కోబీ బ్రయాంట్ భారత కాలమానం ప్రకారం ఆదివారం అర్ధరాత్రి దాటాక హెలికాప్టర్ ప్రమాదంలో మరణించాడు. పైలట్, బ్రయాంట్ సహా 9 మందితో లాస్ ఏంజిల్స్ నుంచి బయలుదేరిన సికోర్‌స్కై ఎస్–76 హెలికాప్టర్ కాలిఫోర్నియా సమీపంలోని క్యాలాబసస్ కొండను ఢీకొట్టింది. వెంటనే అది పేలడంతో ప్రయాణిస్తున్న వారంతా దుర్మరణం పాలయ్యారు. మృతుల్లో బ్రయాంట్ టీనేజ్ కుమార్తె 13 ఏళ్ల జియానా కూడా ఉంది. మాంబా స్పోర్ట్స్ అకాడమీలో తన కూతురు జియానా బాస్కెట్‌బాల్ మ్యాచ్ ఉండటంతో అందులో పాల్గొనడానికి కోబీ హెలికాప్టర్లో బయలుదేరాడు. అమెరికా కాలమానం ప్రకారం ఉదయం 9 గంటలకు టేకాఫ్ అయిన కొద్దిసేపటికే మారుమూల కొండప్రాంతంలో పెను ప్రమాదానికి గురైంది. ఈ విషాదవార్త అమెరికాను శోకసంద్రంలో ముంచేసింది. అక్కడి ఆకాశహర్మ్యాలు బ్రయాంట్ జెర్సీ రంగు లైట్లతో సంతాపసూచకంగా వెలిగాయి. కోబీ బ్రయాంట్ మ్యాచ్‌లు ఆడే సమయంలో 8 లేదంటే 24 నంబర్లతో కూడిన పర్పుల్, గోల్డ్, వైట్ కలర్ జెర్సీలను ధరించేవాడు. ఎత్తయిన టవర్స్ ఈ రంగు లైట్లతో నివాళి ప్రకటించగా... చాలా మంది అమెరికన్లు, బాస్కెట్‌బాల్ అభిమానులు వీధుల్లో గుమిగూడి పుష్పగుచ్ఛాలతో నివాళులు అర్పించారు. ఓ దిగ్గజం విషాదాంతంపై అందరూ శోకతప్త హృదయంతో స్పందించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నుంచి తెలంగాణ రాష్ట్ర మంత్రి కె.తారకరామారావు (కేటీఆర్) దాకా... క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్, గోల్ఫ్ దిగ్గజం టైగర్ వుడ్స్, టీమిండియా క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లి అందరూ బాస్కెట్‌బాల్ దిగ్గజం కోబీ బ్రయాంట్ మరణాన్ని జీర్ణించుకోలేక బరువెక్కిన గుండెలతో సంతాపం ప్రకటించారు. ఎవరీ బ్రయాంట్... ఏమిటీ ఫాలోయింగ్ క్రికెట్ కిక్‌లోనే ఉండే మనకు బ్రయాంట్ ఎవరో తెలియకపోవచ్చు. కానీ ఎన్బీఏ వైపు ఏ కాస్తో కూస్తో కన్నేసిన వారందరికీ బ్రయాంట్ సుపరిచితుడు. నేషనల్ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ (ఎన్బీఏ) పోటీలను అమెరికాలో ఇష్టపడని వారుండరు. అందరూ మనసు పడే ఆ ఆటలో రెండు దశాబ్దాల పాటు (1996–2016) తన మెరుపు విన్యాసంతో ఆకట్టుకున్నాడు బ్రయాంట్. కోర్టులో అతని పాదరసంలాంటి కదలికలు గమనించినా... బాస్కెట్లో అలవోకగా బంతిని పడేయడం చూసినా... ఎవరికైనా అనిపించేదొక్కటే... ఈ ఆజానుబాహుడు బాస్కెట్‌బాల్ కోసమే పుట్టాడా అని! నిజమే ప్రతిష్టాత్మక ఎన్బీఏలో ఆ దిగ్గజ స్టార్ ప్రదర్శన అలా ఉంటుంది మరి! అన్నట్లు అతనేమీ పైచదువులు చదవనేలేదు. పాఠశాల విద్యతోనే పుస్తకాలతో కుస్తీ ముగిసింది. కానీ బాస్కెట్‌బాల్‌తో దోస్తీ మొదలయ్యాక పైపైకి... ఎవరికీ అందనంత ఎత్తుకి ఎదిగిపోయాడు. స్కూల్ చదువు ముగిసిన వెంటనే 1996లో ఎన్బీఏలో చేరాడు. కూతురు జియానాతో... 8, 24 జెర్సీల విలాపం అమెరికాలోని ఫిలడెల్ఫియా నగరంలో 1978, ఆగస్టు 23న జన్మించిన బ్రయాంట్ హైస్కూల్ చదువు ముగియగానే 18 ఏళ్ల వయసులో నేరుగా ఎన్బీఏలో చేరాడు. అలా 1996లో ‘లాస్ఏంజిల్స్ లేకర్స్’ జట్టుకు ఆడటం మొదలుపెట్టిన ఈ ‘బ్లాక్ మాంబా’ (కోబీ ముద్దుపేరు) ఆఖరిదాకా ఆ ఫ్రాంచైజీని వీడలేదు. ఎవరెన్ని మిలియన్ డాలర్లతో ఆఫర్లు ఇచ్చినా... లేకర్స్ తరఫునే తన కెరీర్ ఆసాంతం ఆడటం విశేషం. కోబీ ‘షూటింగ్ గార్డ్’ స్థానంలో 8 లేదంటే 24వ జెర్సీ నంబర్లతో బరిలోకి దిగేవాడు. తన విజయవంతమైన 20 ఏళ్ల కెరీర్లో ఎన్నో ఘన తలు, రికార్డులు సాధించాక 2016లో గుడ్‌బై చెప్పాడు. ►సుదీర్ఘ కెరీర్లో కోబీ 33,643 పాయింట్లు చేయడం విశేషం. ఎన్బీఏలో అత్యధిక స్కోర్ చేసిన ఆటగాళ్లలో టాప్–5 (నాలుగో)లో నిలిచాడు. ఒక్క మ్యాచ్‌లోనే 81 పాయింట్లు సాధించిన రికార్డు బ్రయాంట్ది. 6 అడుగుల 6 అంగుళాల ఎత్తుండే ఈ ఆజానుబాహుడు కోర్టులో బంతినందుకుంటే మాత్రం స్కోర్ చేయకుండా ఉండడు. ఎన్బీఏలో తన లేకర్స్ జట్టును ఐదుసార్లు (2000, 2001, 2002, 2009, 2010) చాంపియన్‌గా నిలపడంలో కీలకపాత్ర పోషించాడు. 2008లో ‘అత్యంత విలువైన ఆటగాడు’గా అవార్డు అందుకున్న బ్రయాంట్ 18 సార్లు ఎన్బీఏ ఆల్‌స్టార్స్ జట్టు సభ్యుడిగా ఎంపికయ్యాడు. 2000 నుంచి 2016 వరకు వరుసగా 17 సార్లు ఈ ఘనతకెక్కాడు. ►తన దేశం ‘టీమ్ అమెరికా’కు 2007 నుంచి 2012 వరకు ప్రాతినిధ్యం వహించాడు. ఈ కాలంలోనే బీజింగ్ (2008), లండన్ (2012) ఒలింపిక్స్ల్లో అమెరికా జట్టు బంగారు పతకం గెలుపొందడంలో కీలకపాత్ర పోషించాడు. ఇంతటి ఘనచరిత్రను లిఖించుకున్న బ్రయాంట్‌కు గౌరవసూచకంగా లాస్ఏంజిల్స్ లేకర్స్ జట్టు 8, 24 నంబర్ జెర్సీలకు 2017లో రిటైర్మెంట్ ఇచ్చేసింది. ఇప్పుడు ఆ రెండు జెర్సీలకు ప్రాణముంటే గనక తమ ప్రియమైన ఆటగాడి మరణాన్ని జీర్ణించుకోలేక విలపించేవేమో! ►కోబీ బ్రయాంట్ది ప్రేమ వివాహం. 2001లో డ్యాన్సర్ వానెస్సా లైన్‌ను కోబీ వివాహం చేసుకున్నాడు. వారికి నలుగురు ఆడ పిల్లలు. నటాలియా (17 ఏళ్లు), జియానా (13 ఏళ్లు), బియాంకా (3 ఏళ్లు), క్యాప్రి (7 నెలలు). హెలికాప్టర్ ప్రమాదంలో రెండో అమ్మాయి జియానా మృతి చెందింది. ►2016లో బాస్కెట్‌బాల్‌కు వీడ్కోలు పలికాక కోబీ బ్రయాంట్ పలు వ్యాపారాలు మొదలుపెట్టాడు. 2018లో ‘డియర్ బాస్కెట్‌బాల్’ పేరుతో కోబీ బ్రయాంట్ నిర్మించిన యానిమేటెడ్ షార్ట్ ఫిల్మ్‌కు ఆస్కార్ అవార్డు కూడా లభించడం విశేషం. కోబీ గ్రేటెస్ట్ బాస్కెట్‌బాల్ ప్లేయర్. అతనితో పాటు టీనేజ్ కుమార్తె మృతి చెందారనే భయంకరమైన వార్త నన్ను విషాదంలో ముంచింది. అతని ఆత్మకు శాంతి చేకూరాలని, తన కుటుంబానికి దేవుడు అండగా నిలవాలని ప్రార్థిస్తున్నా. –అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బాస్కెట్‌బాల్ కోర్టులో బ్రయాంట్ ఓ లెజెండ్. ప్రమాదంలో అతని కూతురు కూడా మరణించడం చాలా బాధాకరం. వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నా. –అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామా బ్రయాంట్ నాకు సోదరుడితో సమానం. అలాంటివాడు ఇలా ఆకస్మికంగా మృతిచెందాడనే వార్త నన్ను షాక్‌కు గురిచేసింది. –బాస్కెట్‌బాల్ లెజెండ్ జోర్డాన్ నేను లేకర్స్‌కు వీరాభిమానిని. బ్రయాంట్ వల్లే ఎన్బీఏలో లేకర్స్ చారిత్రక విజయాలెన్నో సాధించింది. శారీరకంగా, మానసికంగా ఎంతో బలమైన ఆటగాడు కోబీ. అలాంటి ప్లేయర్ ఇలా మనకు ఆకస్మికంగా దూరమవడం బాధాకరం. –విఖ్యాత గోల్ఫర్ టైగర్ వుడ్స్ కోబీ, అతని కుమార్తె జియానా మరణించారనే విషాద వార్త నన్ను తీవ్రంగా బాధించింది. అతని కుటుంబానికి, అభిమానులకు నా ప్రగాఢ సానుభూతి. –సచిన్ నేను ఉదయాన్నే లేచి ఎన్నోసార్లు కోబీ బ్రయాంట్ మ్యాచ్‌లను చూశాను. అతని మరణవార్తతో దిగ్భ్రాంతికి గురయ్యా. ఆ ప్రమాదంలో అతని కుమార్తె కూడా మృతి చెందడంతో నా గుండె పగిలింది. అతని ఆత్మకు శాంతి చేకూరాలి. దేవుడు వారి కుటుంబానికి ధైర్యమివ్వాలి. –విరాట్ కోహ్లి బ్రయాంట్ నా ఫేవరెట్. కుమార్తెతో సహా అతను మరణించాడనే వార్తతో నేను షాక్‌కు గురయ్యాను. అతని ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ని ప్రార్థిస్తున్నా. –తెలంగాణ మంత్రి కేటీఆర్ -
క్షమాపణ చెప్పిన బీబీసీ
లండన్ : తాము ప్రసారం చేసిన వీడియోలో తప్పు దొర్లినందుకు ప్రముఖ వార్తా సంస్థ బీబీసీ క్షమాపణలు తెలిపింది. అమెరికా లెజండరీ బాస్కెట్‌బాల్ ప్లేయర్ కోబ్ బ్రియాంట్ దుర్మరణానికి సంబంధించి బీబీసీ ఆదివారం పది గంటల బులిటెన్‌లో ఓ వార్తను ప్రసారం చేసింది. అయితే అందులో కోబ్కు బదులుగా లిబ్రోన్ జేమ్స్ చిత్రాలను చూపించారు. జేమ్స్, కోబ్ కెరీర్ పాయింట్లను అధిగమిస్తున్న వార్తను టెలికాస్ట్ చేశారు. దీంతో కోబ్కు బదులు జేమ్స్ స్క్రీన్ మీద ఎందుకు కనిపిస్తున్నాడనే దానిపై స్పష్టత లేకపోవడంతో వీక్షకులు ఆశ్చర్యపోయారు. బీబీసీ చేసిన తప్పిదాన్ని ప్రస్తావిస్తూ.. ఆ సంస్థకు వ్యతిరేకంగా కామెంట్లు చేశారు. బీబీసీని ఉద్దేశించి కొందరు నెటిజన్లు ఘాటుగా కూడా స్పందించారు. వార్త ప్రసారంలో తప్పును గుర్తించిన బీబీసీ.. నష్ట నివారణ చర్యలు చేపట్టింది. ఈ ఘటనకు సంబంధించి బులిటెన్ చివర్లో న్యూస్ రీడర్ రీతా చక్రవర్తి చేత క్షమాపణలు చెప్పించింది. ‘కోబ్ మరణానికి సంబంధించిన వార్తను ప్రసారం చేసే సమయంలో.. ఒకానొక సందర్భంలో పొరపాటున కోబ్కు బదులుగా మరో బాస్కెట్‌బాల్ ఆటగాడు జేమ్స్ దృశ్యాలను ప్రసారం అయ్యాయ’ని రీతా పేర్కొన్నారు. అలాగే ఈ బులిటెన్ ముగిసిన కొద్ది సేపటికే బీబీసీ ఎడిటర్(సిక్స్ అండ్ టెన్) పాల్ రాయల్ ట్విటర్ ద్వారా క్షమాపణలు చెప్పారు. మానవ తప్పిదం వల్ల ఇలా జరిగిందన్న పాల్.. ఈ చర్య తమ సాధారణ ప్రమాణాలను తక్కువ చేసి చూపిందని అభిప్రాయపడ్డారు. గతంలో కూడా బీబీసీ ఇటువంటి తప్పిదానికి క్షమాపణ చెప్పింది. 2018 జూలైలో పాకిస్తాన్ అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్‌కు బదులుగా.. పాకిస్తాన్ బౌలర్ వసీమ్ అక్రమ్ దృశ్యాలను ప్రసారం చేసినందుకు బీబీసీ ప్రేక్షకులను క్షమాపణ కోరింది. కాగా, కోబ్ ప్రయాణిస్తున్న అతని ప్రయివేట్ హెలికాప్టర్ లాస్ఏంజిల్స్కు 65 కిలోమీటర్ల దూరంలోని క్యాలబసస్‌లో ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ఘటనలో కోబ్, అతని కుమార్తె గియానాతో పాటు మరో ముగ్గురు మృతి చెందారు. తన 20 ఏళ్ల కెరీర్లో కోబ్ ఐదుసార్లు ఎన్బీఏ చాంపియన్‌షిప్‌ను సొంతం చేసుకున్నారు. అంతేకాకుండా అత్యధిక గోల్స్ సాధించిన టాప్ ప్లేయర్స్‌లలో కోబ్ బ్రియంట్ ఒకడిగా నిలిచారు. I genuinely cannot believe that the actual BBC News at 10 just did this pic.twitter.com/n6csMV9OOG — Matthew Champion (@matthewchampion) January 26, 2020 In tonight’s coverage of the death of Kobe Bryant on #BBCNewsTen we mistakenly used pictures of LeBron James in one section of the report. We apologise for this human error which fell below our usual standards on the programme. — Paul Royall (@paulroyall) January 26, 2020 చదవండి : కుమార్తెతో సహా బాస్కెట్‌బాల్ లెజెండ్ కోబ్ దుర్మరణం ట్రంప్ ట్వీట్‌పై నెటిజన్ల మండిపాటు.. -
ట్రంప్ ట్వీట్‌పై నెటిజన్ల మండిపాటు..
వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌పై నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. అమెరికా లెజండరీ బాస్కెట్‌బాల్ ప్లేయర్, కోచ్ కోబ్ బ్రియాంట్, అతని కుమార్తె గియానా హెలికాప్టర్ ప్రమాదంలో దుర్మరణం చెందిన సంగతి తెలిసిందే. బ్రియాంట్, గియానా మృతిపై ప్రపంచంలోని పలువురు ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా నివాళులర్పిస్తున్నారు. ఓ దిగ్గజ ఆటగాడిని కోల్పోయామని విచారం వ్యక్తం చేస్తున్నారు. బ్రియాంట్ మృతి పట్ల ట్రంప్‌తోపాటు అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. అయితే ఈ క్రమంలో బ్రియాంట్కు నివాళులర్పిస్తూ.. ట్రంప్ చేసిన ట్వీట్‌పై కొందరు నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. ‘గొప్ప బాస్కెట్‌బాల్ ఆటగాళ్లలో బ్రియాంట్ ఒక్కరిగా నిలిచిపోతారు. బ్రియాంట్కు కుటుంబం అంటే చాలా ఇష్టం. భవిష్యత్తుపై అతనికి బలమైన నమ్మకం, ప్రేమ ఉండేది. బ్రియాంట్‌తో పాటు అతని కుమార్తె గియానా కూడా ఈ ప్రమాదంలో మరణించడం మరింత బాధను పెంచింది. మెలానియాతో పాటు నేను.. బ్రియాంట్ భార్య వెనెస్సాకు, అతని కుటుంబానికి సంతాపం తెలుపుతున్నాం. దేవుడు వారితో ఉండాలని ఆశిస్తున్నాను’ అని ట్రంప్ పేర్కొన్నారు. అంతకుముందే ట్వీట్ చేసిన ఒబామా బ్రియాంట్ మృతికి నివాళులర్పిస్తూ ట్వీట్ చేశారు. అలాగే తన భార్య మిషెల్‌తోపాటు తన తరఫున వెనెస్సాతోపాటు బ్రియాంట్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. అయతే ట్రంప్ ట్వీట్ చేసిన కొద్దిసేపటికే నెటిజన్లు.. ఒబామా, ట్రంప్ ట్వీట్ల మధ్య సారూప్యత ఉందని కామెంట్లు చేయడం మొదలుపెట్టారు. కొద్దిపాటి మార్పులతో ఒబామా ట్వీట్‌ను ట్రంప్ కాపీ చేశారని ఆరోపిస్తున్నారు. ఒబామా చేసిన ట్వీట్‌కు సంబంధించిన స్ర్కీన్ షాట్లను షేర్ చేస్తూ ట్రంప్‌పై విమర్శలు చేస్తున్నారు. ‘మీరు ఎప్పటికీ ఒబామా కాలేరు.. కనుక ఇలాంటి పనులను ఆపేయండి’ అని ఓ నెటిజన్ ట్వీట్ చేశారు. Kobe Bryant, despite being one of the truly great basketball players of all time, was just getting started in life. He loved his family so much, and had such strong passion for the future. The loss of his beautiful daughter, Gianna, makes this moment even more devastating.... — Donald J. Trump (@realDonaldTrump) January 26, 2020 Kobe was a legend on the court and just getting started in what would have been just as meaningful a second act. To lose Gianna is even more heartbreaking to us as parents. Michelle and I send love and prayers to Vanessa and the entire Bryant family on an unthinkable day. — Barack Obama (@BarackObama) January 26, 2020 -
బ్రియాంట్ చివరి ట్వీట్ ఇదే..
కాలిఫోర్నియా: అమెరికన్ నేషనల్ బాస్కెట్ బాల్ చరిత్రలో టాప్ స్కోరర్లలో ఒకడిగా ఉన్న కోబ్ బ్రియాంట్ హెలికాప్టర్ ప్రమాదంలో అకాలమరణం చెందడం ప్రతీ ఒక్కర్నీ తీవ్రంగా కలచివేసింది. 2008, 2012 ఒలింపిక్స్ల్లో అమెరికాకు స్వర్ణ పతకాలు సాధించడంలో బ్రియాంట్‌ది కీలకపాత్ర. 2016లో బాస్కెట్‌బాల్ నుంచి వీడ్కోలు తీసుకున్న బ్రియాంట్.. అమెరికా నేషనల్ బాల్ అసోసియేషన్(ఎన్బీఏ) ప్రొఫెషనల్ లీగ్‌లో తన కెరీర్ మొత్తం లాస్ ఏంజెల్స్ లేకర్స్ కే ఆడాడు. (ఇక్కడ చదవండి: ఆ వార్త వినడం దురదృష్టకరం: కోహ్లి) ఈ లీగ్‌లో అత్యధిక స్కోర్ చేసిన జాబితాలో బ్రియాంట్ మూడో స్థానంలో ఉండగా అతన్ని తాజాగా లీబ్రాన్ జేమ్స్ అధిగమించాడు. దీనిపై జేమ్స్‌కు బ్రియాంట్ అభినందలు తెలియజేస్తూ.. ‘నన్ను అధిగమించిన నా బ్రదర్‌కు ఇవే నా విషెస్. గేమ్‌ను మరింత ముందుకు తీసుకెళతావని ఆశిస్తున్నా కింగ్ జేమ్స్’ అని ట్వీట్ చేశాడు. ఇదే అతని చివరి ట్వీట్ అయ్యింది. మృతిచెందడానికి కొన్ని గంటల ముందు జేమ్స్‌ను కొనియాడుతూ బ్రియాంట్ చేసిన ట్వీట్ ఇది. (ఇక్కడ చదవండి: బాస్కెట్‌బాల్ లెజెండ్ కోబ్ దుర్మరణం) Continuing to move the game forward @KingJames. Much respect my brother 💪🏾 #33644 — Kobe Bryant (@kobebryant) January 26, 2020 -
ఆ వార్త వినడం దురదృష్టకరం: కోహ్లి
కాలిఫోర్నియా: హెలికాప్టర్ ప్రమాదంలో అమెరికా బాస్కెట్‌బాల్ దిగ్గజం, కోచ్ కోబ్ బ్రియాంట్ దుర్మరణం చెందడంపై ఒక్కసారిగా క్రీడాలోకం షాక్‌కు గురైంది. ప్రస్తుతం న్యూజిలాండ్ పర్యటనలో ఉన్న టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి, రోహిత్ శర్మలు బ్రియాంట్ మృతిపై ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ‘ ఈ వార్త వినడం దురదృష్టకరం. ఇది నన్ను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. జీవితం అనేది ఊహించలేనిది. ఆ ప్రమాదంలో బ్రియాంట్‌తో పాటు అతని కుమార్తె కూడా మృతి చెందడం కలిచివేస్తోంది. వారి ఆత్మకు శాంతి కలగాలి. ఆ కుటుంబానికి మనో ధైర్యాన్ని ఇవ్వాలని దేవుడ్ని కోరుకుంటున్నా’ అని కోహ్లి ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో పోస్ట్ చేశాడు. ‘ ఇది క్రీడా ప్రపంచం మొత్తానికి దుర్దినం. ఒక దిగ్గజాన్ని క్రీడాలోకం కోల్పోయింది. బ్రియాంట్, అతని కుమార్తె గియానా ఆత్మకు శాంతి చేకూరాలి’ అని రోహిత్ శర్మ ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో సంతాపం తెలిపాడు. (ఇక్కడ చదవండి: బాస్కెట్‌బాల్ దిగ్గజం దుర్మరణం) ఆదివారం తన ప్రయివేట్ హెలికాప్టర్లో ప్రయాణిస్తున్న బ్రియాంట్ లాస్ఏంజిల్స్కు 65 కిలోమీటర్ల దూరంలోని క్యాలబసస్‌లో ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ప్రమాదంలో బ్రియాంట్, కుమార్తె గియానాతో పాటు మరో ముగ్గురు మృతి చెందారు. హెలికాప్టర్ కూలుతూనే మంటల్లో చిక్కుకోవడంతో ఒక్కరు కూడా ప్రాణాలతో బయటపడలేదు. మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా కాలియాయి. బ్రియాంట్ అకాల మరణంపై అమెరికా ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామాలు విచారం వ్యక్తం చేశారు. అమెరికా ఓ దిగ్గజ ఆటగాడిని కోల్పోయిందని, అతడు దేశంలో బాస్కెట్‌బాల్ అభివృద్దికి విశేషకృషి చేశాడని ప్రశంసించారు. అంతేకాకుండా అమెరికా క్రీడా చరిత్రలో అత్యంత విషాదకరమైన ఘటనగా పేర్కొన్నారు. వీరితో పాటు అమెరికన్ నేషనల్ బాస్కెట్‌బాల్ అసోసియేషన్(ఎన్బీఏ) సంతాపం తెలుపుతూ అతడి మరణం తమకు తీరని లోటని సంతాపం వ్యక్తం చేసింది. View this post on Instagram Absolutely devastated to hear this news today. So many childhood memories of waking up early and watching this magician doing things on the court that I would be mesmerized by. Life is so unpredictable and fickle. His daughter Gianna passed away too in the crash. Iam absolutely Heartbroken. Rest in peace. Strength and condolences to the family 🙏 A post shared by Virat Kohli (@virat.kohli) on Jan 26, 2020 at 3:50pm PST View this post on Instagram Sad day for the sporting world today. One of the greats of the game gone too soon. Rest in peace Kobe Bryant and his little daughter Gianna and the other victims A post shared by Rohit Sharma (@rohitsharma45) on Jan 26, 2020 at 3:57pm PST -
బాస్కెట్‌బాల్ లెజెండ్ కోబ్ దుర్మరణం
కాలిఫోర్నియా: అమెరికా లెజండరీ బాస్కెట్‌బాల్ ప్లేయర్, కోచ్ కోబ్ బ్రియాంట్ ఓ హెలికాప్టర్ ప్రమాదంలో దుర్మరణం చెందారు. ఈ ప్రమాదంలో బ్రియాంట్ కుమార్తె గియానాతో పాటు మరో ముగ్గురు మృతి చెందారు. ఆదివారం తన ప్రయివేట్ హెలికాప్టర్లో ప్రయాణిస్తున్న బ్రియాంట్ లాస్ఏంజిల్స్కు 65 కిలోమీటర్ల దూరంలోని క్యాలబసస్‌లో ఒక్కసారిగా కుప్పకూలింది. హెలికాప్టర్ కూలుతూనే మంటల్లో చిక్కుకోవడంతో ఒక్కరు కూడా ప్రాణాలతో బయటపడలేదు. మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా కాలియాయి. ఇక ఈ ప్రమాదానికి గల కారణాల కోసం పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బ్రియాంట్ అకాల మరణంపై అమెరికా ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామాలు విచారం వ్యక్తం చేశారు. అమెరికా ఓ దిగ్గజ ఆటగాడిని కోల్పోయిందని, అతడు దేశంలో బాస్కెట్‌బాల్ అభివృద్దికి విశేషకృషి చేశాడని ప్రశంసించారు. అంతేకాకుండా అమెరికా క్రీడా చరిత్రలో అత్యంత విషాదకరమైన ఘటనగా పేర్కొన్నారు. వీరితో పాటు అమెరికన్ బాస్కెట్‌బాల్ అసోసియేషన్(ఎన్బీఏ) సంతాపం తెలుపుతూ అతడి మరణం ఎన్బీఏకు తీరని లోటని తెలిపింది. ‘బ్రియాంట్, అతడి కుమార్తె మరణవార్త తెలిసి షాక్‌కు గురయ్యాను. ప్రపంచస్థాయి ఆటగాడికి నా కన్నీటి వీడ్కోలు’ అంటూ తెలంగాణ రాష్ట్ర మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్వీట్ చేశారు. ఇక ఈ దిగ్గజ ఆటగాడి మృతితో యావత్ క్రీడా ప్రపంచం ఒక్కసారిగా షాక్‌కు గురైంది. ఈ దిగ్గజ క్రీడాకారుడి మరణావార్త విని అమెరికా ప్రజలు శోకసంద్రంలో మునిగిపోయారు. అక్కడి అన్ని టీవీ ఛానళ్ల న్యూస్ రీడర్లు అతడి మరణవార్తను తెలుపుతూ కన్నీటిపర్యంతమయ్యారు. అంతేకాకుండా అనేకచోట్ల అతడికి సంతాపం తెలుపుతూ పలు కార్యక్రమాలు చేపట్టారు. 'బ్లాక్ మాంబా'గా బాస్కెట్ బాల్ ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్న ఈ దిగ్గజ ఆటగాడు.. దాదాపు 20 ఏళ్లకు పైగా తన ఆటతో అభిమానులను అలరించాడు. అంతేకాకుండా అత్యధిక గోల్స్ సాధించిన టాప్ ప్లేయర్స్‌లలో కోబ్ బ్రియంట్ ఒకడిగా నిలిచాడు. -
బాస్కెట్‌బాల్ లెజెండ్ కోబ్ బ్రియాంట్ మృతి
-
బై బై ‘బ్లాక్ మంబా’
లాస్ ఏంజిల్స్: నేషనల్ బాస్కెట్ బాల్ అసోసియేషన్ (ఎన్బీఏ) స్టార్ ఆటగాడు కోబ్ బ్రయాంట్ తన రెండు దశాబ్దాల అద్భుత కెరీర్‌కు ముగింపు పలికాడు. తన కెరీర్ ఆద్యంతం లాస్ ఏంజిల్స్ లేకర్స్ జట్టుకే ఆడిన 37 ఏళ్ల కోబ్ తన అసమాన ఆటతో ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను అలరించాడు. బుధవారం రాత్రి స్టేపుల్స్ సెంటర్స్‌లో ఉతా జాజ్‌తో జరిగిన తన చివరి మ్యాచ్‌లోనూ సత్తా చూపిస్తూ ఏకంగా 60 పాయింట్లు సాధించాడు. ఇది ఏ ఆటగాడి చివరి మ్యాచ్‌లోనైనా రికార్డు స్కోరు. దీంతో లేకర్స్ 101-96 తేడాతో నెగ్గింది. బ్లాక్ మంబా అనే ముద్దుపేరుతో పిలుచుకునే ఈ స్టార్ చివరి ఆటను చూసేందుకు అభిమానులు పోటెత్తారు. బాస్కెట్‌బాల్ చరిత్రలోనే జత టిక్కెట్లకు అత్యధిక రేటు (రూ.18 లక్షల 30 వేలు) పలికింది. మరోవైపు హాలీవుడ్ స్టార్స్‌తో పాటు ఇతర క్రీడా దిగ్గజాలు కూడా ఈ మ్యాచ్‌ను వీక్షించారు.