Kolavennu
-
నెలకు 3 లక్షల రూపాయల జీతం వదిలేసి..
ఆయన ఓ విశ్రాంత ఉద్యోగి. నెలకు రూ.3 లక్షలు జీతం. ప్రైవేటు కంపెనీలో డిజిఎంగా పనిచేసి వీఆర్ఎస్ తీసుకున్నారు ఘట్రాజు వెంకటేశ్వరరావు. వ్యవసాయంపై ఉన్న ఆసక్తితో అమ్మమ్మ గారి ఊరు కృష్ణా జిల్లా కంకిపాడు మండలం కోలవెన్ను గ్రామానికి వచ్చి తమ 4.5 ఎకరాల పొలంలో ప్రకృతి వ్యవసాయ విధానంలో దేశీ వరి రకాల సాగు చేపట్టారు. సుమారు రెండేళ్లు నిల్వ చేసిన ధాన్యాన్ని ఆరోగ్యదాయకమైన దేశీ బియ్యం విక్రయిస్తూ లాభాలతో ఆత్మసంతృప్తిని ఆర్జిస్తున్నారు. ఆయన అనుభవాల సారం ఆయన మాటల్లోనే.. ‘‘ప్రముఖ కంపెనీలో ముంబైలో ఉద్యోగం చేశాను. డీజీఎంగా బాధ్యతలు నిర్వహణ. ఐదేళ్ల క్రితం వీఆర్ఎస్ తీసుకుని హైదరాబాద్‌కు వచ్చేశాను. అప్పటికే ప్రకృతి సేద్యంపై ప్రచారం విస్తృతంగా సాగుతోంది. ప్రకతి వ్యవసాయ నిపుణులు సుభాష్ పాలేకర్ శిక్షణా తరగతుల్లో పాలొని మెళకువలు నేర్చుకున్నా. ఆచరణలో పెట్టేందుకు అమ్మమ్మ వాళ్ల ఊరైన కోలవెన్ను వచ్చి స్థిరపడ్డా. 4.5 ఎకరాల్లో తులసీబాణం, నారాయణ కామిని, నవారా, కాలాభట్, మార్టూరు సన్నాలు, రత్నచోడి, బహురూపి వంటి దేశీ వరి రకాలు సాగు చేస్తున్నా. రెండు ఆవులను తెచ్చుకున్నా. ఏటా సాగు ఆరంభంలో 40 ట్రక్కుల ఘన జీవామృతాన్ని పొలంలో చల్లుతున్నా. పంటకు అన్ని పోషకాలు సమృద్ధిగా లభిస్తున్నాయి. వర్రలతో బావిని కట్టించి 1200 లీటర్ల జీవామృతం తయారుచేసి 15 రోజులకోసారి చల్లుతున్నా. పంట ఆరోగ్యంగా ఎదుగుతున్నది. తెగుళ్ల బెడద లేదు. ఆవ పిండి చెక్క కూడా జీవామృతంలో కలిపి వాడుతున్నా. ఎకరాకు రూ. 25–30 వేల వరకూ పెట్టుబడి అవుతుంది. 25–28 బస్తాల వరకూ ధాన్యం దిగుబడి వస్తున్నది. పంటను ఆశించే పురుగు నివారణకు వేపపిండి చల్లుతాను. పోషకాలు జీవామతం ద్వారా అందుతాయి. మరీ అవసరం అయితే, అగ్ని అస్త్రం చల్లుతాను. ఎలాంటి పురుగైనా నాశనం అవుతుంది. దేశవాళీ విత్తన పంట నిల్వ, మార్కెటింగ్ విషయాలు చాలా ప్రధానమైనవి. పంట చేతికి వచ్చాక కనీసం 10 నెలల నుంచి రెండేళ్ల వరకూ పంటను మాగబెట్టిన ధాన్యాన్ని మిల్లులో ఆడించి నాణ్యమైన బియ్యాన్ని బెంగుళూరు, హైదరాబాద్, కొచ్చిన్, చెన్నై ప్రాంతాల్లో ఉన్న నేరుగా విక్రయిస్తున్నా. నవారా, కాలాభట్ స్థానికంగా కిలో రూ. 90కి, బయట ప్రాంతాలకు రూ. 120కే అందిస్తున్నా, రవాణా ఖర్చు కూడా కలిపి. ఇతర రకాల బియ్యం కిలో రూ.75కే ఇస్తున్నా. ప్రతి రైతూ ప్రకృతి విధానం వైపు అడుగులు వేస్తే దిగుబడులు, ఆరోగ్యం, ఆదాయం, భూసారం పెంపుదల సాధ్యమే. ప్రభుత్వం రైతు భరోసా, ఇతర సబ్సిడీలు అందిస్తున్నది. వీటితో పాటు ప్రకృతి విధానంలో పండించిన పంటకు అంతర్జాతీయంగా ఉన్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని మార్కెటింగ్ సదుపాయాలు విస్తరించి, అదనపు వసతులు కల్పిస్తే కొత్త రైతులు కూడా ఈ విధానంలోకి వచ్చేస్తారు.’’ – ఈ.శివప్రసాద్, సాక్షి, కంకిపాడు, కృష్ణా జిల్లా వడ్లు ఎంత మాగితే అన్నం అంత ఒదుగుతుంది. ధాన్యం నిల్వ చేయకుండా తినటం వల్ల కడుపు నొప్పి, అజీర్ణ సమస్యలు ఏర్పడతాయి. పంట నాణ్యంగా ఉంటే ఆరోగ్యం వృద్ధి చెందుతుంది. అలాగే ప్రకృతి విధానం వల్ల భూసారం పెంపొందుతుందని గుర్తించాను. (క్లిక్: కొబ్బరి పొట్టుతో సేంద్రియ ఎరువు! ఎలా తయారు చేసుకోవాలంటే!) – ఘట్రాజు వెంకటేశ్వరరావు (92255 25562), కోలవెన్ను -
కంకిపాడు పోలీసుల అత్యుత్సాహం
సాక్షి, కంకిపాడు: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీమంత్రి పార్థసారధిని పోలీసులు అరెస్ట్ చేశారు. కృష్ణాజిల్లా కంకిపాడు మండలం కోలవెన్ను గ్రామంలో జన్మభూమి కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళుతున్న ఆయనను మంగళవారం పోలీసులు అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా పార్థసారధి మాట్లాడుతూ ప్రభుత్వం సమాధానం చెప్పుకోలేక తమని అరెస్ట్ చేశారని మండిపడ్డారు. ప్రజా సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందని ధ్వజమెత్తారు. రాష్ట్రవ్యాప్తంగా జన్మభూమి సభకు వెళ్లకుండా విపక్ష నేతలను అడ్డుకుంటున్నారన్నారు. ప్రతి గ్రామ సభలోనూ నిరసనలు వెల్లువెత్తుతున్నాయని, అయితే సమస్యలను లేవనెత్తే అవకాశమే ఇవ్వడం లేదన్నారు. నిలదీసిన విపక్ష నేతలను బలవంతంగా అరెస్ట్ చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. జన్మభూమి కార్యక్రమాలు నామమాత్రంగా జరుగుతున్నాయని, పోలీసులను అడ్డం పెట్టుకుని జన్మభూమి సభ నడిపిస్తున్నారని పార్థసారధి వ్యాఖ్యానించారు. గ్రామంలో పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వలేదని ఆయన అన్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి హయంలో విపక్ష నేతలకు మాట్లాడే అవకాశం ఇచ్చేవారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వం ఎమర్జెన్సీ రోజులను గుర్తు చేస్తోందన్నారు. ప్రజలకు ఇచ్చిన అన్ని హామీలను అమలు చేశామని చెప్పే ప్రభుత్వం జన్మభూమి కార్యక్రమానికి ప్రతపక్షాలను ఎందుకు అనుమతించడం లేదని ప్రశ్నించారు. డ్వాక్రా రుణమాఫీ ఎవరికి చేశారని, రుణాలు చెల్లించాలని బ్యాంక్‌ల నుంచి మహిళలకు నోటీసులు వస్తున్నాయన్నారు. రాష్ట్రంలో రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర లేదన్నారు. ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లేందుకు యత్నిస్తే అడ్డుకోవడం సరికాదంటూ...ప్రభుత్వ వైఖరికి నిరసిస్తూ ఆయన నోటికి నల్లరిబ్బన్ కట్టుకున్నారు. అలాగే వైఎస్ఆర్ సీపీ నేత పార్థసారధితో పాటు గ్రామ మాజీ సర్పంచ్ చంద్రశేఖర్‌ను కూడా పోలీసులు అరెస్ట్ చేసి కంకిపాడు పోలీస్ స్టేషన్‌కు తరలించారు. మరోవైపు జన్మభూమికి వెళుతున్న తమను పోలీసులు అడ్డుకున్నారని గ్రామానికి చెందిన మహిళలు ఆరోపించారు. తమ సమస్యలు చెప్పుకునేందుకు వెళుతున్న తమని భయపెట్టి నోరు మెదపకుండా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కంకిపాడు పోలీసుల అత్యుత్సాహం జన్మభూమి కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళుతున్న వైఎస్ఆర్ సీపీ నేత, మాజీమంత్రి పార్థసారధిని అరెస్ట్ చేసిన పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. ఆయనతో పాటు ఇతర నేతలను పోలీసులు వాహనంలో...పలు పోలీస్ స్టేషన్లు చుట్టూ తిప్పుతున్నారు. ముందుగా కంకిపాడు పోలీస్ స్టేషన్‌కు అక్కడ నుంచి ఉయ్యూరు, పమిడిముక్కల, తోట్లవల్లూరు వైపుకు తీసుకుని వెళ్లి మరలా ఉయ్యూరు వైపుకు తరలిస్తున్నారు. పోలీసుల వైఖరిపై వైఎస్ఆర్ సీపీ నేతలు మండిపడుతున్నారు. -
వైఎస్ఆర్ సీపీ నేత పార్థసారధి గృహ నిర్బంధం
-
కోలవెన్నులో ఉద్రిక్తత, పార్థసారధి గృహనిర్బంధం
సాక్షి కంకిపాడు : కృష్ణాజిల్లా కంకిపాడు మండలం కొలవెన్నులో మంగళవారం ఉదయం ఉద్రిక్తత నెలకొంది. గ్రామంలో జరిగే జన్మభూమి కార్యక్రమానికి హాజరయ్యేందుకు వెళ్ళిన వైఎస్ఆర్ సీపీ నేత, మాజీమంత్రి కె.పార్ధసారధిని పోలీసులు గృహ నిర్బంధం చేశారు. జన్మభూమి కార్యక్రమంలో పాల్గొనకూడదంటూ పోలీసుల ఆంక్షలు విధించారు. గ్రామ సర్పంచ్ ఇంటి చుట్టూ పోలీసులు భారీగా మోహరించారు. బయటకు వస్తే అరెస్ట్ చేస్తామంటూ హెచ్చరికలు చేశారు. జన్మభూమిలో ప్రజా సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళ్లేందుకు అవకాశం ఇవ్వాలని పార్థసారథి విజ్ఞప్తి చేసినా పోలీసులు స్పందించకపోవడంతో వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
భార్యను చంపాలని ఇంటికి నిప్పు పెట్టాడు
కంకిపాడు (కృష్ణా): భార్యను హత్య చేసేందుకు ఓ భర్త ఇంటికి నిప్పు పెట్టడంతో మంటలు చెలరేగి ఆరు ఇళ్లు పూర్తిగా కాలిపోయాయి. ఈ ఘటన కృష్ణా జిల్లా కంకిపాడు మండలం కోలవెన్నులో శుక్రవారం ఉదయం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో మంటలు పెద్ద ఎత్తున చెలరేగి చుట్టు పక్కల ఉన్న మూడు గడ్డి వాములు కూడా దగ్ధమయ్యాయి. సుమారుగా రూ. 10 లక్షల ఆస్తినష్టం జరిగినట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
వివాహ విందులో అపశ్రుతి
భోజనాలు కలుషితం 400 మందికి అనారోగ్యం వాంతులు, విరేచనాలతో అస్వస్థత నిండిపోరుున స్థానిక ఆస్పత్రులు కోలవెన్నులో ఘటన కంకిపాడు : ఓ వివాహ వేడుకలోని భోజనాల్లో ఆహారం కలుషితమై 400మంది అనారోగ్యం పాలైన ఘటన శనివారం రాత్రి మండలంలోని కోలవెన్నులో జరిగింది. గ్రామానికి చెందిన దివంగత తుమ్మల ఆంజనేయులు కుమారుడు మనోజ్ వివాహం శ్రీవర్షిణితో శుక్రవారం రాత్రి జరగ్గా, శనివారం వ్రతం చేసుకుని మూడు వేలమందికి భోజనాలు పెట్టారు. విందు ఆరగించిన వారికి సాయంత్రం 6 గంటల తరువాత వరుసగా వాంతులు, విరేచనాలు అయ్యూరుు. కంకిపాడు పరిసర ప్రాంతాల్లోని ఆస్పత్రులకు తీసుకెళ్లినా ఫలితం కనిపించలేదు. విషయం తెలుసుకున్న పెనమలూరు ఎమ్మెల్యే బోడె ప్రసాద్, గ్రామ సర్పంచి, వైఎస్సార్ సీపీ నేత తుమ్మల చంద్రశేఖర్ అప్రమత్తమయ్యారు. వైద్య ఆరోగ్యశాఖ ప్రతినిధులు, ప్రైవేటు వైద్యుల బృందం గ్రామానికి రప్పించారు. వినాయకస్వామి గుడి, కమ్యూనిటీ హాలు, దళితవాడ సెంటర్, కొత్తపేట ఏరియాల్లో రోగులు బారులు తీరారు. షామియూనాలు వేసి పరీక్షలు నిర్వహించారు. నీరసించిన వారికి సెలైన్లు పెట్టారు. బాధితుల్లో చిన్నారులు, మహిళలు, వృద్ధులే అధికంగా ఉన్నారు. ముగ్గురిని విజయవాడలోని కొత్త ప్రభుత్వాస్పత్రికి పంపగా, 11మంది చిన్నారులను పాత ఆస్పత్రికి పంపారు. అరుుతే, వారి పరిస్థితి బాగానే ఉందని వైద్యులు తెలిపారు. వైద్య శిబిరాలను వైద్యాధికారి జయప్రద పర్యవేక్షించారు. డీఎంహెచ్‌వో నాగమల్లేశ్వరి, ఎంపీపీ దేవినేని రాజా, తహశీల్దార్ రోజా, కంకిపాడు సీఐ రామ్‌కుమార్ తదితరులు భోజనాల్లోని తేడాను పరిశీలించారు. పెరుగు, ఐస్‌క్రీమ్, హల్వాలో తేడా ఉన్నట్లుగా పలువురు బాధితులు చెబుతున్నారు. కాగా, వైద్య శిబిరం వద్దకు వస్తున్న ఐదుగురు దళితవాడ వాసులను కుక్క కరిచింది. వారిని కూడా అంబులెన్స్‌లో విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వైఎస్సార్ సీపీ నేత సారథి పరామర్శ వైఎస్సార్ సీపీ దక్షిణ కృష్ణా అధ్యక్షుడు కె.పార్థసారథి హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని బాధితులను పరామర్శించారు. వైద్యం అందుతున్న తీరును పరిశీలించారు. ఆందోళన చెందొద్దని బాధితులకు ధైర్యం చెప్పారు. జెడ్సీ చైర్ పర్సన్ గద్దె అనురాధ బాధితుల్ని పరామర్శించగా, కలెక్టర్ బాబు.ఎ ఫోన్లో ఎప్పటికప్పుడు విషయూలు తెలుసుకుంటున్నారు. -
రాత్రంతా రోడ్డుపైనే నిరసన
నవీన్ మృతదేహంతో తెల్లవారుజాము వరకూ ఆందోళన న్యాయం చేయాలని గ్రామస్తులు, బంధువుల డిమాండ్ ఎట్టకేలకు దిగివచ్చిన ట్రాక్టర్ యజమాని వర్గీయులు కోలవెన్ను (కంకిపాడు) : రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విద్యార్థి నవీన్‌కుమార్ కుటుం బాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ అతడి కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్తులు చేపట్టిన ఆందోళన రెండో రోజైన బుధవారం తెల్లవారుజాము వరకు కొనసాగింది. రెండు వర్గాల మధ్య జరిగిన చర్చల నేపథ్యంలో కోలవెన్ను గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. ఒకానొక దశలో తోపులాటలు జరిగాయి. అనంతరం రాజీ కుదరటంతో గ్రామస్తులు ఆందోళన విరమించారు. వివరాల్లోకి వెళితే.. కోలవెన్ను గ్రామానికి చెందిన ప్రత్తిపాటి నవీన్‌కుమార్ (18) విజయవాడలోని ఓ కళాశాలలో బీకాం ప్రథమ సంవత్సరం చదువుతున్నాడు. మంగళవారం కళాశాల నుంచి రాత్రి ఎనిమిది గంటల సమయంలో ఆటోలో ఇంటికి వస్తున్నాడు. మాదాసువారిపాలెం సమీపంలో ఎదురుగా వేగంగా వస్తున్న ట్రాక్టర్ ఆటోను ఢీకొంది. ఈ ఘటనలో నవీన్‌కుమార్ అక్కడికక్కడే మృతి చెందిన విషయం తెలిసిందే. కోలవెన్ను రోడ్డు మార్జిన్లో ఉన్న కంకర గుట్టను తప్పించే క్రమంలో వేగంగా వెళ్తున్న రెండు వాహనాలు పరస్పరం ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో మృతి చెందిన నవీన్ కుటుంబానికి న్యాయం చేయాలంటూ గ్రామస్తులు, బంధువులు పట్టుబట్టారు. దీంతో పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ప్రమాదానికి కారణమైన ట్రాక్టర్ యజమాని ప్రతినిధులు, బాధితులు, గ్రామస్తులతో తెల్లవారుజాము వరకూ పోలీసుస్టేషన్లోనే చర్చలు జరిపారు. పెనమలూరు ఎమ్మెల్యే బోడె ప్రసాద్ ముఖ్య అనుచరుడు ఇచ్చిన హామీతో గ్రామస్తులు ఆందోళనను తాత్కాలికంగా విరమించారు. అప్పటి వరకూ ఘటనాస్థలంలోనే ఉన్న మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం విజయవాడకు తరలించారు. కోలవెన్నులో ఉద్రిక్తత బాధితులు, ట్రాక్టర్ యజమాని ప్రతినిధులతో గ్రామ సర్పంచ్ తుమ్మల చంద్రశేఖర్ (బుడ్డి), టీడీపీ నేత తుమ్మల జగదీష్ స్థానిక పంచాయతీ కార్యాలయంలో బుధవారం ఉదయం నుంచి చర్చలు జరిపారు. ఒక్కగానొక్క కొడుకును పోగొట్టుకున్న నవీన్ తల్లిదండ్రులు నాగరాజు, శ్రీదేవి రోదించిన తీరు అక్కడ ఉన్నవారిని కదిలించివేంది. అందరితో కలివిడిగా ఉండే నవీన్ మృతిని గ్రామస్తులు జీర్ణించుకోలేకపోతున్నారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలంటూ పంచాయతీ కార్యాలయానికి అధిక సంఖ్యలో చేరుకున్నారు. తమసహ విద్యార్ధిని చూసేందుకు విజయవాడలోని కళాశాల విద్యార్ధులు కోలవెన్ను చేరుకున్నారు. దీంతో గ్రామం లో విషాదం నెలకొంది. ట్రాక్టర్ యజమాని ఎం.శ్రీనివాసరావు తరఫు మధ్యవర్తులు జగన్మోహన్రావు, విశ్వేశ్వరరావు బాధిత కుటుంబానికి అందించే నష్టపరిహారం అందించే విషయం స్పష్టంగా చెప్పకపోవడం గ్రామస్తులు, మృతుని బంధువులను ఆగ్రహానికి గురిచేసింది. ఎస్ఐ శ్రీనివాస్ సమక్షంలోనే స్థానికులు మధ్యవర్తులపై దాడికి యత్నించారు. దీంతో ఎస్ఐ అక్కడినుంచి వెళ్లిపోయారు. సర్పంచ్ తుమ్మల చంద్రశేఖర్, తుమ్మల జగదీష్‌లు బాధితులు, మధ్యవర్తులతో చర్చలు జరిపారు. ఈ క్రమంలో నష్టపరిహారం విషయంలో ఏకాభిప్రాయం కుదరకపోవటంతో గ్రామానికి చెందిన యువత ఆగ్రహావేశాలతో కార్యాలయంలోకి తోసుకొచ్చి తోపులాటకు దిగారు. ప్రమాదానికి కారణమైన వ్యక్తులను వదిలేది లేదంటూ పెద్దగా కేకలు వేశారు. ఆందోళనకారులకు సర్దిచెప్పి రూ 2లక్షలు నష్టపరిహారం బాధిత కుటుంబానికి అందించేలా రాజీ కుదిర్చారు. దీంతో ఆందోళనకారులు వెనుదిరిగారు.