kondamma
-
కామ్రేడ్ శివరామిరెడ్డి సతీమణి కొండమ్మ మృతి
సాక్షి, హైదరాబాద్ : కడప జిల్లా కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాతల్లో ఒకరైన నర్రెడ్డి శివరామిరెడ్డి సతీమణి కొండమ్మ గురువారం తెల్లవారుజామున హైదరాబాద్‌లోని ఆమె కుమార్తె భగీరథీ ఇంట్లో కన్నుమూశారు. కడప జిల్లాలోని బ్రహ్మంగారి మఠం మండలం సోమిరెడ్డిపల్లె గ్రామంలో జన్మించిన కొండమ్మకు 1947లో శివరామిరెడ్డితో వివాహమైంది. కమ్యూనిస్టు పార్టీపై నిషేధం ఉన్న కాలంలో 1949 అక్టోబర్ 1న వీరపునాయునిపల్లె మండలం, యూరాజుపాలెం గ్రామంలో పోలీసు కాల్పుల్లో చనిపోయిన కమ్యూనిస్టు కుటుంబాల్లో, ప్రజల్లో ఆమె ధైర్యం నింపారు. ఇతరనాయకురాళ్లతో కలసి మహిళా ఉద్యమాన్ని నిర్మించారు. పార్టీ సాయుధ పోరాటానికి అవసరమైన ఆయుధాలను కొనేందుకు తన మెడలోని బంగారు నగల్ని విరాళంగా ఇచ్చారు. సాయుధ పోరాటంలో ఆర్థికంగా చితికిపోయిన కామ్రేడ్ల కుటుంబాలను ఆదుకోవడానికి తనవంతు వాటాకు వచ్చిన ఆస్తిని అమ్మి ఆర్థిక సహాయం అందించే అంశంలోనూ, దుర్భర దారిద్య్రాన్ని గడిపిన సందర్భంలోనూ భర్తకు ఆమె అండగా నిలిచారు. కమ్యూనిస్టు ఉద్యమానికి నర్రెడ్డి కొండమ్మ సేవలు మరువలేనివని హైదరాబాద్ కొండమ్మ పార్థీవదేహం వద్ద నివాళులర్పించిన సందర్భంగా సీపీఐ జాతీయ కార్యదర్శి కె. నారాయణ సంతాపం ప్రకటించారు. -
రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి
శింగనమల : మండలంలోని సప్తగిరి క్యాంపర్ సమీపంలో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందింది. ఎస్ఐ హమీద్‌ఖాన్ తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. గార్లదిన్నె మండలం కొప్పలకొండకు చెందిన కొండమ్మ(50) కొడుకు(వరుసకు)తో కలిసి దిచక్రవాహనంపై అనంతపురం ఆస్పత్రికి వెళుతోంది. ద్విచక్ర వాహనం సప్తగిరి క్యాంపర్ వద్ద ఉన్న బ్రిడ్జి వద్దకు రాగానే వెనుక వస్తున్న కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనంలో వెనుక కూర్చున్న కొండమ్మ కింద పడింది. కొండమ్మకు తీవ్ర గాయాలవడంతో 108లో అనంతపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందింది. మృతురాలికి భర్త, ఇద్దరు కుమారులు ఉన్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
కానిస్టేబుల్ రెండో కాపురం చిచ్చు
భర్త రెండో కాపురం ఆ కుటుంబంలో చిచ్చు పెట్టింది. మొదటి భార్యపై భర్త తరఫు బంధువులు దాడి చేశారు. ఈ ఘటన శనివారం రాత్రి 11 గంటల సమయంలో అనంతపురంలోని గౌరవ గార్డెన్ సమీపంలో చోటు చేసుకుంది. బాధితురాలు తెలిపిన వివరాల మేరకు... గంగాధర్ త్రీటౌన్ పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పని చేస్తూ ఇటీవల హెడ్ కానిస్టేబుల్‌గా పదోన్నతి పొంది కళ్యాణదుర్గం స్టేషన్‌కు బదిలీ అయ్యాడు. డెప్యూటేషన్‌పై త్రీటౌన్ పోలీస్ స్టేషన్ ఆవరణలోని కోర్టు మానిటరింగ్ విభాగంలో పని చేస్తున్నాడు. ఈయనకు భార్య కొండమ్మ, కుమారులు నితీష్, రుతిక్ ఉన్నారు. అయితే, గంగాధర్ సుమారు ఏడాదిన్నరగా వేరే మహిళతో కాపురం పెట్టాడు. మొదటి భార్యకు విడాకులివ్వలేదు. ఈ విషయమై భార్యభర్తలు పలుమార్లు గొడవపడ్డారు. ఈ క్రమంలో శనివారం రాత్రి రెండో కాపురం పెట్టిన మహిళతో ఉన్నాడనే సమాచారం అందుకున్న కొండమ్మ, అన్న రంగస్వామి, తల్లితో కలిసి వెళ్లింది. వీరు వచ్చిన విషయం తెలుసుకున్న గంగాధర్ లోపల గడియపెట్టుకుని బయటకు రాలేదు. తన బంధువులకు సమాచారం అందించడంతో వారు అక్కడికి చేరుకుని కొండమ్మ, రంగస్వామిపై దాడి చేశారు. దీంతో రంగస్వామి తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో ఎస్ఐ రెడ్డప్ప ఘటనాస్థలానికి చేరుకుని దాడి చేసిన వారిని అదుపులోకి తీసుకున్నారు. -
లోయలోకి దూసుకెళ్లిన కారు.. ఒకరి మృతి
కారు అదుపుతప్పి లోయలోకి దూసుకెళ్లిన ఘటనలో ఓ వ్యక్తి మృతిచెందగా.. మరో ఇద్దరు మహిళలకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ పంఘటన విశాఖ జిల్లా పాడేరు మండలం పోతురాజు గుడి సమీపంలో మంగళవారం అర్ధరాత్రి దాటాక చోటుచేసుకుంది. నక్కలపుట్టుకు చెందిన సంతల వ్యాపారి పప్పు వెంకటరావు(55) కుటుంబ సభ్యులతో కలిసి కారులో విశాఖపట్నం వచ్చి తిరిగి ఇంటికి వెళ్తుండగా.. పోతురాజు గుడి సమీపంలో అదుపు తప్పి లోయాలోకి దూసుకెళ్లింది. దీంతో కారు నడుపుతున్న వెంకటరావు అక్కడికక్కడే మృతిచెందగా.. ఆయన భార్య పార్వతి, చెల్లెలు కొండమ్మకు తీవ్ర గాయాలయ్యాయి. వారిని పాడేరు ఏరియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. -
పైకప్పు కూలి - వ్యక్తి దుర్మరణం
ప్రకాశం జిల్లా ఉలవపాడు మండలం ఆత్మకూరు గ్రామంలో ఇంటి పైకప్పు భాగం కూలి ఓ వ్యక్తి మృతి చెందాడు. వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో ఈ ఘటన జరిగింది. కృష్ణమూర్తి అనే వ్యక్తి (45) నిద్రలో ఉండగా అర్ధరాత్రి సమయంలో... వర్షానికి బాగా నానిన పైకప్పు కొంత భాగం భాగం ఊడి మీద పడింది. తీవ్రంగా గాయపడిన అతడు మంచంపైనే ప్రాణాలు వదిలాడు. వర్షాలతో ఈ గ్రామానికి రాకపోకలు కూడా నిలిచిపోయాయి. మరోవైపు మండల కేంద్రంలోని అంబేద్కర్ నగర్లో దాసరి కొండమ్మ (80) చలిగాలులు తట్టుకోలేక ఆదివారం తెల్లవారుజామున మృతి చెందింది. -
అడ్డుగా ఉన్నాడని హతమార్చారు
ప్రియునితో కలిసి భర్తను చంపిన వైనం మర్రివలసలో దారుణం ప్లాస్టిక్ వైర్లతో ఉరి సహజమరణంగా నమ్మించేందుకు యత్నం నిలదీసిన గ్రామస్తులు నేరం అంగీకరించిన మృతుని భార్య పరారీలో ప్రియుడు కె.కోటపాడు : వివాహేతర సంబంధం నేపథ్యంలో భర్తను ప్రియునితో కలిసి ఉరివేసి హతమార్చిన సంఘటన మర్రివలస గ్రామంలో చోటుచేసుకుంది. ఈ ప్రాంతంలో సంచలనం సృష్టించిన ఈ ఘటన వివరాలు పోలీసుల కథనం మేరకు ఇలావున్నాయి. మర్రివలస గ్రామానికి చెందిన సీముసురు కొండమ్మ (42), సీముసురు కోనారితో 15 ఏళ్లుగా వివాహేతర సంబంధం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఆదివారం రాత్రి కొండమ్మ భర్త సీముసురు బంగారయ్య (52) ఇంటివద్ద భోజనం చేసి రోజూమాదిరిగానే గ్రామ శివారులోని పాకవద్దకు వెళ్లి పడుకున్నాడు. ఇంతలో అక్కడికి చేరుకున్న భార్య కొండమ్మ, కోనారి కలిసి మంచంపై పడుకున్న బంగారయ్యను ప్లాస్టిక్ వైర్లతో గొంతునులిమి హతమార్చారు. అనంతరం వారు అక్కడినుంచి జారుకున్నారు. తెల్లవారుజాము 4 గంటల సమయంలో కుమారుడు పైడిరాజు, కోడలు కృష్ణవేణి వద్దకు వెళ్లి తండ్రి బంగారయ్య పాకవద్ద చనిపోయి ఉన్నాడని కొండమ్మ చెప్పింది. దీంతో వారు పాకవద్దకు వెళ్లి మృతదేహాన్ని పరిశీలించారు. ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. బంగారయ్య మెడచుట్టూ ఉరితీసిన ఆనవాళ్లు ఉండటంతో అనుమానించిన వారు పరిసరాలను పరిశీలించారు. మంచంపక్కనే ప్లాస్టిక్ వైర్లు ఉండటంతో హత్యకు గురైనట్టు అనుమానించిన గ్రామస్తులు కొండమ్మను నిలదీశారు. భర్త బంగారయ్యను తాను చంపుకున్నానని ఆమె బదులివ్వడంతో సర్పంచ్ ఎ. కోడూరు పోలీసులు, రెవెన్యూ సిబ్బందికి సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న చోడవరం సీఐ కిరణ్‌కుమార్, ఎ.కోడూరు ఎస్ఐ అల్లు స్వామినాయుడు కొండమ్మను విచారించారు. భర్తను ప్లాస్టిక్ వైరుతో మెడకు ఉరివేసి తాను, కోనారి కలసి హతమార్చామని ఆమె అంగీకరించిందని పోలీసులు తెలిపారు. ఈ మేరకు వారిద్దరిపై హత్యానేరం కింద కేసు నమోదు చేశామని వారు పేర్కొన్నారు. కొండమ్మను అదుపులోకి తీసుకుని, పరారీలో ఉన్న కోనారికోసం పోలీసులు గాలిస్తున్నారు. గతంలోనూ హత్యాయత్నం! వివాహేతర సంబంధంపై నిలదీస్తున్న భర్తను హతమార్చేందుకు గతంలోను ప్రయత్నించిందని గ్రామస్తులు తెలిపారు. అప్పటిలో స్థానికులు మందలించడంతో వి రమించిందని వారు పేర్కొన్నారు. కొండమ్మ, కోనారి వివాహేతర సంబంధంపై బంగారయ్య తరచూ నిలదీ యడంతో భార్యాభర్తల మధ్య గొడవలు జరిగేవని గ్రామస్తులు తెలిపారు. నెలరోజులపాటు వేరే గ్రామం లో ఉన్న కొండమ్మ ఇటీవల గ్రామానికి వచ్చిందని, కూలిసొమ్ముకోసం భర్తతో ఘర్షణ పడిందని వారు చెప్పారు. ఈ నేపథ్యంలో బంగారయ్యను అడ్డుతొలగించేందుకు కొండమ్మ, కోనారి పథకం ప్రకారం హత్యచేశారని పోలీసులు తెలిపారు. మృతుడు బంగారయ్యకు ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. -
వైఎస్సార్ సీపీకి ఓటెయ్యడం నేరమా?
మార్కాపురం : ఆరు నెలల క్రితం జరిగిన ఎంపీటీసీ ఎన్నికల్లో వైఎస్సార్ సీపీకి ఓట్లు వేశామని టీడీపీ నాయకులు, కార్యకర్తలు తమపై దాడి చేస్తున్నారని మార్కాపురం మండలం చింతగుంట్లకు చెందిన దళితులు పులుకూరి వెలుగొండయ్య, రూతమ్మ, మరియమ్మ, కొండమ్మ, తదితరులు సోమవారం స్థానిక ఆర్డీఓ కార్యాలయానికి వచ్చి ఆందోళన వ్యక్తం చేశారు. ఎంపీటీసీ ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన వ్యక్తికి తాము ఓట్లు వేయలేదన్న కోపంతో తమపై అక్రమంగా కేసులు బనాయిస్తూ ఇళ్లకు రానివ్వకుండా అడ్డుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. క్రిస్మస్కు స్వగ్రామానికి వెళ్తే 24వ తేదీ రాత్రి తమపై దాడికి ప్రయత్నించటంతో తప్పించుకుని మార్కాపురం పట్టణానికి వచ్చి బంధువుల ఇంట్లో తల దాచుకున్నామన్నారు. ప్రభుత్వం తమకు ఇచ్చిన పొలాల్లో టీడీపీ నేతలు జేసీబీలతో గుంతలు తీయించారని, సాగు చేసుకునేందుకు కూడా పనికి రాకుండా చేస్తున్నారని విచారం వ్యక్తం చేశారు. వైఎస్సార్ సీపీకి ఓట్లు వేయటమే తాము చేసిన నేరమా.. అని దళితులు ప్రశ్నించారు. బాధితులకు అండగా ఉండాలి :ఆర్డీఓను కోరిన ఎమ్మెల్యే జంకె చింతగుంట్ల దళితులకు అండగా ఉండాలని ఆర్డీఓను ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డి కోరారు. సోమవారం బాధితులతో ఆయన ఆర్డీఓను కలిశారు. వాటర్‌షెడ్ పథకం నెపంతో తమ పార్టీ కార్యకర్తల పొలాలను ప్రత్యర్థులు పొక్లెయిన్లతో త వ్విస్తున్నారని, పొలం గట్ల వెంబడి ఉన్న చిల్లకంపను వారే కొట్టుకుని అమ్ముకుంటున్నారని, ఈ సంఘటనపై విచారణ జరపాలని ఆర్డీఓను ఎమ్మెల్యే కోరారు. బాధిత కుటుంబాలకు రక్షణ కల్పించాలన్నారు. వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై ప్రభుత్వ పథకాల అమలులో వివక్ష చూపొద్దన్నారు. ఈ సంఘటనపై విచారణ జరిపిస్తానని, సర్వేయర్‌ను పంపించి పొలం హద్దులు చూపిస్తానని, వాటర్‌షెడ్ అధికారులతో మాట్లాడతానని ఎమ్మెల్యేకు ఆర్డీఓ హామీ ఇచ్చారు. ఎమ్మెల్యేతో పాటు మార్కాపురం ఎంపీపీ ఎల్.మాలకొండయ్య ఉన్నారు.