kovind
-
‘ఒక దేశం.. ఒక ఎన్నిక’పై 18,626 పేజీల కోవింద్ నివేదిక
మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలోని అత్యున్నత స్థాయి కమిటీ ‘ఒక దేశం.. ఒక ఎన్నిక’ (వన్ నేషన్.. వన్ ఎలక్షన్)కు సంబంధించిన నివేదికను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు సమర్పించింది. దేశవ్యాప్తంగా లోక్‌సభ, రాష్ట్ర అసెంబ్లీలు, స్థానిక సంస్థలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించడంపై సాధ్యాసాధ్యాలను ఈ నివేదికలో పొందుపరిచారు. కోవింద్ నేతృత్వంలోని అత్యున్నత స్థాయి కమిటీ 18,626 పేజీల ఈ నివేదికను రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు సమర్పించినట్లు ఒక ప్రకటనలో తెలిపింది. 2023, సెప్టెంబర్ 2 ఈ నివేదిక రూపకల్పనకు శ్రీకారం చుట్టారు. పలువురు నిపుణుల సారధ్యంలో 191 రోజుల కసరత్తు అనంతరం ఈ నివేదికను పూర్తిచేశారు. తొలి దశలో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి నిర్వహించాలని, తరువాతి 100 రోజుల్లో రెండో దశలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని కోవింద్ కమిటీ ఈ నివేదికలో సిఫారసు చేసింది. ‘ఒక దేశం.. ఒక ఎన్నిక’ నివేదికలోని ముఖ్యాంశాలు కోవింద్ కమిటీ తన నివేదికలో ఏకకాలంలో ఓటు వేయడం దేశప్రజల ఆకాంక్షలను సాకారం చేయడంలో సహాయపడుతుందని పేర్కొంది. ఒకేసారి ఐక్యంగా ఓటు వేయడం అనేది అభివృద్ధి ప్రక్రియను, సామాజిక ఐక్యతను ప్రోత్సహిస్తుంది. ప్రజాస్వామ్య పునాదిని మరింత బలోపేతం చేస్తుంది. ఏకకాలంలో ఓటింగ్ జరగడం వల్ల పారదర్శకత, సౌలభ్యం, ఓటరు విశ్వాసం గణనీయంగా పెరుగుతుందని కోవింద్ కమిటీ భావించింది. ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించడానికి అవసరమైన పరికరాలు, సిబ్బంది, భద్రతా దళాల ముందస్తు ప్రణాళికను ఈ కమిటీ సిఫారసు చేసింది. తొలిసారిగా అన్ని రాష్ట్రాల అసెంబ్లీల పదవీకాలం వచ్చే లోక్‌సభ ఎన్నికల వరకు ఉండవచ్చని నివేదిక పేర్కొంది. హంగ్ హౌస్ లేదా అవిశ్వాస తీర్మానం జరిగితే, మిగిలిన ఐదేళ్ల కాలానికి తాజా ఎన్నికలు నిర్వహించవచ్చని కోవింద్ కమిటీ పేర్కొంది. -
రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ వీడ్కోలు ప్రసంగం
న్యూఢిల్లీ: రాష్ట్రపతి పదవీకాలం పూర్తి చేసుకున్న సందర్భంగా జాతినుద్దేశించి వీడ్కోలు ప్రసంగం ఇచ్చారు రామ్‌నాథ్ కోవింద్. భారత ప్రజాస్వామ్య వ్యవస్థ చాలా గొప్పగా ఉందన్నారు. మన దేశ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రత్యేక స్థానం ఉందని తెలిపారు. ఈ సంస్కృతి నేటి యువతను ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలని ఆకాంక్షించారు. 21వ శతాబ్దం భారత్‌దే అవుతుందని ధీమా వ్యక్తం చేశారు. తాను కాన్పుర్ దేహాత్ జిల్లా పరౌఖ్ గ్రామంలోని పేద కుటుంబం నుంచి వచ్చి ఈ స్థాయికి చేరినట్లు కోవింద్ పేర్కొన్నారు. రాష్ట్రపతిగా తన శాయశక్తుల మేరకు బాధ్యతలు నిర్వర్తించినట్లు తెలిపారు. తనకు సమాజంలోని అన్ని వర్గాలు, ముఖ్యంగా పార్లమెంటేరియన్లు మద్దతుగా నిలిచినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఇటీవల జరిగిన రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థి ద్రౌపది ముర్ము ఘన విజయం సాధించారు. సోమవారం ఆమె భారత 15వ రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. చదవండి: ఉద్ధవ్ థాక్రేకు ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఎత్తలేదు.. ఆయన తలరాత ఆ రోజే ఖరారైంది -
రాష్ట్రపతి కోవింద్,ప్రధాని మోదీని కలిసిన రజనీకాంత్
-
15ఏళ్ల తర్వాత రాష్ట్రపతి కోవింద్ రైలు ప్రయాణం
-
‘మొదటి మహిళ’కు సత్కారం
న్యూఢిల్లీ: ‘నా బరువు 30 కిలోలు. నేను మోయాల్సిన లగేజీ కూడా దాదాపు 30 కిలోలే. అయితే, భర్త చనిపోవటంతో నా ముగ్గురు పిల్లలను బతికించుకునే భారం నాదే. అందుకే పోర్టర్గానే ఉండిపోవాలని నిర్ణయించుకున్నా’ అని రాజస్తాన్‌కు చెందిన మొట్టమొదటి మహిళా రైల్వే కూలీ మంజు చెప్పిన మాటలు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను కదిలించాయి. శనివారం రాష్ట్రపతి భవన్‌కు వచ్చిన 90 మంది మొదటి మహిళల్లో జైపూర్‌కు చెందిన మంజు ఒకరు. రాష్ట్రపతి కోవింద్‌ను కలిసిన వారిలో వివిధ రంగాల్లో మొట్టమొదటి వారిగా ప్రసిద్ధులైన ఐశ్వర్యరాయ్, నికోల్ ఫారియా, బచేంద్రిపాల్, టెస్సీ థామస్, రజనీ పండిట్ తదితరులతోపాటు మొదటి మహిళా ఫైర్‌ఫైటర్, మహిళా బస్ డ్రైవర్, మహిళా మర్చంట్ నేవీ కెప్టెన్ తదితరులున్నారు. వీరందరినీ రాష్ట్రపతి సత్కరించారు. సందర్భంగా మంజు మాట్లాడుతూ..‘పోర్టర్ ఉద్యోగంలో అడుగడుగునా అవాంతరాలే. అక్షర జ్ఞానం లేకపోవటంతో ప్లాట్‌ఫాంలు, కోచ్‌లు, సీట్ల నంబర్లను గుర్తు పెట్టుకోవటం కష్టమైపోయింది. రైల్వే అధికారుల సాయంతో ఆరునెలల్లో అంకెలను, అక్షరాలను నేర్చుకున్నా’అని తెలిపింది. వాయవ్య రైల్వే రీజియన్‌లో తొలి మహిళా కూలీగా రికార్డుల్లో స్థానం సంపాదించుకుంది. రాష్ట్రపతిని కలసిన వారిలో దివ్యాంగురాలయినప్పటికీ ఐఏఎస్‌కు ఎంపికైన ఇరా సింఘాల్ కూడా ఉన్నారు. మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ వివిధ రంగాలకు చెందిన 112 మందిని ‘మొదటి మహిళలు’గా ప్రకటించింది. -
ఢిల్లీకి సీఎం కేసీఆర్
రాష్ట్రపతిగా కోవింద్ ప్రమాణ స్వీకారానికి హాజరు ప్రధాని, కేంద్ర మంత్రులతో భేటీ!.. 27న తిరుగు పయనం సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు మూడు రోజుల ఢిల్లీ పర్యటనకు బయల్దేరి వెళ్లారు. సోమవారం రాత్రి 9 గంటలకు శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయల్దేరిన సీఎం.. రాత్రి 11 గంటలకు ఢిల్లీ చేరుకున్నారు. మంగళవారం పార్లమెంట్ సెంట్రల్ హాల్లో జరగనున్న రామ్‌నాథ్ కోవింద్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరవుతారు. పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, హోం మంత్రి రాజ్‌నాథ్, కేంద్ర జల వనరుల మంత్రి ఉమాభారతితో సీఎం భేటీ అయ్యే అవకాశాలు న్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని ఈ సందర్భంగా ప్రధానిని సీఎం కోరనున్నారు. అలాగే ప్రధాన మంత్రి కృషి సించాయి యోజన కింద ఉన్న పదకొండు ప్రాజెక్టుల్లో వరద కాల్వ, దేవాదుల, భీమా ప్రాజెక్టులకు రూ.5,490 కోట్లు మంజూరు చేయాలని విన్నవించనున్నారు. దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తున్న మిషన్ కాకతీయకు రూ.5 వేల కోట్లు, మిషన్ భగీరథకు రూ.19 వేల కోట్లు కేటాయించాలంటూ గతంలో నీతి ఆయోగ్ చేసిన సిఫార్సులనూ మరోసారి ప్రధాని దృష్టికి తీసుకెళ్లనున్నారు. గ్రానైట్, బీడీ, చేనేత పరిశ్రమల ఉత్పత్తులపై జీఎస్టీని సడలించాలని, ఎఫ్ఆర్బీఎం రుణ పరిమితిని 3 నుంచి 3.5 శాతానికి పెంచాలని కోరనున్నారు. విభజన చట్టం ప్రకారం కొత్తగా ఏర్పడిన తెలంగాణలో నియోజకవర్గాల పునర్విభజన చేపట్టాలని ప్రధానికి సీఎం విన్నవించనున్నారు. వెనకబడిన జిల్లాలకు కేంద్రం నుంచి రావాల్సిన మూడో విడత రూ.450 కోట్ల ఆర్థిక సాయం వెంటనే విడుదల చేయాలని, సచివాలయ నిర్మాణానికి రక్షణ శాఖ ఆధ్వర్యంలో ఉన్న బైసన్ పోలో గ్రౌండ్ అప్పగింతను వేగవంతం చేయాలని కోరనున్నారు. ఉప రాష్ట్రపతి అభ్యర్థి వెంకయ్య నాయుడును కలసి సీఎం శుభాకాంక్షలు తెలుపనున్నారు. అలాగే పదవీ కాలం ముగియనున్న రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని ఆయనకు కేటాయించిన ప్రత్యేక నివాసంలో భేటీ అయ్యే అవకాశాలున్నాయి. కాగా, ఇప్పటికే ఖరా రైన షెడ్యూలు ప్రకారం ఈ నెల 27న ముఖ్యమంత్రి తిరిగి హైదరాబాద్‌కు చేరుకుంటారు. గవర్నర్ ఢిల్లీ పర్యటన రాష్ట్ర గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ఢిల్లీకి బయల్దేరి వెళ్లారు. నూతన రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రమాణ స్వీకారోత్సవానికి ఆయన హాజరవుతారు.