Ksirabhisekam
-
కృష్ణదేవరాయలు విగ్రహానికి క్షీరాభిషేకం
అనంతపురం సప్తగిరి సర్కిల్: రెక్టార్ పదవిని రి జర్వేషన్ వర్గాల వారికి కేటాయించాలని డిమాండ్ చేస్తూ వర్సిటీలో ఆదివారం కృష్ణ దేవరాయలు విగ్రహానికి విద్యార్థి సం ఘాల నాయకులు క్షీరాభిషేకం చేశారు. వారు మాట్లాడుతూ రెక్టార్ పోస్టును రిజర్వేషన్వ వర్గాలకు కేటాయించకుండా మోసం చేస్తున్నారని ఆరోపించారు. ఉన్నత పదవులను రిజర్వేషన్ వర్గాలకు అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. తప్పుడు సమాచారంతో యూజీ, పీజీ, డిస్టెన్సు విభాగాలను అస్తవ్యçస్తంగా మార్చినవారిని నుంచి తొలగించి రిజర్వేషన్ వర్గాలవారితో ఆ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. వైఎస్సార్‌ఎస్‌యూ నాయకులు క్రాంతికిరణ్, నాగార్జున, రాజు, ఎన్ఎస్యూఐ నాయకులు పులిరాజు, బాబు, నరేష్, ఏఐఎస్ఎఫ్ నాయకులు పాల్గొన్నారు. -
వైభవం.. వీరబ్రహ్మం జయంత్యుత్సవం
బ్రహ్మంగారిమఠం: కాలజ్ఞాన ప్రబోధకర్త శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి 408వ జయంత్యుత్సవాలు రెండు రోజులుగా అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. శుక్రవారం స్వామి పుట్టిన రోజు కావటంతో వేద పండితులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఇందులో మఠాధిపతులు వీరభోగ వసంత వెంకటేశ్వరస్వాములు సతీసమేతంగా.. పార్కులో ఉన్న వీరబ్రహ్మేంద్రస్వామి విగ్రహానికి క్షీరాభిషేకం చేయడానికి బయలుదేరారు. 101 మంది మహిళలు కలశాలతో అక్కడికి మేళతాళాలతో కలిసి వెళ్లారు. వేది పండితులు వేద మంత్రాలు పఠించగా మఠాధిపతులు విగ్రహమూర్తికి క్షీరాభిషేకం చేశారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. కల్యాణం.. వీరబ్రహ్మేంద్రస్వామి, గోవిందమాంబకు ఆలయ అర్చకులు కల్యాణం నిర్వహించారు. కార్యక్రమంలో మఠా«ధిపతుల దంపతులు, స్థానిక మఠం మేనేజరు ఈశ్వరాచారి, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. ప్రచారం లేక తగ్గిన భక్తులు: మహోత్సవాలకు ఏటా రాష్ట్ర నలుమూల నుంచే కాకుండా తెలంగాణ, కర్ణాటక నుంచి భక్తులు పాల్గొనే వారు. ఈ ఏడాది కేవలం మండల భక్తులతోపాటు కొన్ని ప్రాంతాల నుంచి విశ్వబ్రాహ్మణులు మాత్రమే వచ్చినట్లు తెలిసింది. ఇందుకు కారణం దేవస్థాన నిర్వాహకులు సరిగా ప్రచారం చేయకపోవటం వల్లనే అని భక్తులు ఆరోపిస్తున్నారు. గోడపత్రాలు, పత్రికల ప్రకటనలు, ఇతర జిల్లాల ప్రజలకు తెలిసే విధంగా ప్రచారం చేయలేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కార్తీక మాసంలో దేవాలయాల్లో గడిపేందుకు ప్రజలు అధిక సంఖ్యలో వచ్చే అవకాశం ఉన్నా ప్రచారం లేకపోవటం వలనే భక్తుల సంఖ్య తగ్గిందని స్థానికులతోపాటు వ్యాపారులు పేర్కొన్నారు. -
కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం
మిరుదొడ్డి: గ్రామీణ పేదరిక నిర్మూలన పథకం (సెర్ఫ్), ఉపాధి హామీ పథకం కింద పని చేస్తున్న ఉద్యోగుల వేతనాల పెంపును హర్షిస్తూ ఐకేపీ మండల సమాఖ్య క్లస్టర్ కో ఆర్డినేటర్లు సీఎం కేసీఆర్ చిత్ర పటానికి బుధవారం మిరుదొడ్డిలో క్షీరాభిషేకం చేశారు. ఒకరికొకరు స్వీట్లు పంచి పెట్టుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండల సమాఖ్య క్లస్టర్ కో ఆర్డినేటర్ల వేతనం రూ. 6,150 నుండి, రూ. 12, వేలకు పెరగనుందన్నారు. వేతనాల పెంపునకు ఆమోదం తెలిపిన సీఎం కేసీఆర్‌కు, మంత్రులు జూపల్లి కృష్ణారావు, హరీష్‌రావు, దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డికి ఈ సందర్భంగా వారు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఐకేపీ ఏపీఎం కృష్ణారెడ్డి, సీసీలు బాల్‌రాజ్ గౌడ్, ప్రభాకర్, సిద్ధిరాములు, వైకుంఠం, ప్రవీణ్, నాగరాజు, మణెమ్మ, ఎండీ. అక్బర్ పాషా తదితరులు పాల్గొన్నారు. -
సాగు నీరందించేందుకు సీఎం కృషి
మంత్రి జోగు రామన్న కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం ఆదిలాబాద్ అర్బన్ : జిల్లా రైతులకు సాగునీరందించేందుకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు చర్యలు తీసుకుంటున్నారని రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి జోగు రామన్న తెలిపారు. ఇందులో భాగంగా ఈ నెల 8న ముంబరుు వెళ్లనున్నారని, మహారాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుని జిల్లాలోని రెండు లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు చర్యలు చేపట్టారని వివరించారు. శనివారం జిల్లా పరిషత్ కార్యాలయం ఎదుట మంత్రి రామన్నతోపాటు టీఆర్ఎస్ పశ్చిమ జిల్లా అధ్యక్షుడు లోక భూమారెడ్డి, జిల్లా పరిషత్ చైర్పర్సన్ వి.శోభారాణి, జెడ్పీటీసీ సభ్యులు సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ సర్కారు చేపడుతున్న సాగునీటి ప్రాజెక్టులు, బ్యారేజీల నిర్మాణాల వల్ల ప్రతి రైతు పొలానికి సాగునీరు అంది జిల్లా సస్యశ్యామలంగా మారుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇచ్చిన హామీలో భాగంగా చనాఖ-కోర్టా బ్యారేజీ నిర్మాణం చేపట్టామని, ఇది గుర్తుంచుకుని కొందరు నాయకులు బుద్ధి తెచ్చుకోవాలని ఎద్దేవా చేశారు. చనాఖ -కోర్టా బ్యారేజీకి రూ.123 కోట్లు, పెన్‌గంగ ప్రాజెక్టుకు రూ.1,226 కోట్లు కేటాయించి నట్లు తెలిపారు. అనంతరం భూసార పరీక్షల సంచా ర వాహనంను పరిశీలించారు. అప్పటికప్పుడు రైతు పొలాల్లోని మట్టి నమూనాలను సేకరించి ఫలితాలను అప్పుడే ప్రకటిస్తారని అధికారులు తెలిపారు. జిల్లా జెడ్పీటీసీ సభ్యుల ఫోరం అధ్యక్షుడు ఏమాజీ, జెడ్పీటీసీ సభ్యులు పాల్గొన్నారు.