kukat pally
-
సాయుధ బలగాల గౌరవ వందనం,కళాకారుల ఆటపాటలు
-
Samantha Defamation Case: కూకట్పల్లి కోర్టు కీలక ఆదేశాలు
-
వ్యభిచార గృహంపై పోలీసుల దాడి
సాక్షి, హైదరాబాద్: గుట్టు చప్పుడు కాకుండా వ్యభిచారం నిర్వహిస్తున్న ఓ ఇంటిపై కూకట్పల్లి పోలీసులు దాడి చేసి నిర్వాహకులతో పాటు విటులను అదుపులోకి తీసుకుని అరెస్టు చేసిన సంఘటన కూకట్పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో శుక్రవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. వరంగల్ జిల్లాకు చెందిన ముక్కర రాజు(31) ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. గత కొద్ది రోజులుగా భాగ్యనగర్‌కాలనీలోని ఓ అపార్టుమెంట్‌లోని ఫ్లాట్ నెంబర్ 303ని అద్దెకు తీసుకొని పానగం శ్రీకాంత్ ద్వారా వ్యభిచారం నిర్వహిస్తున్నాడు. సమాచారం అందుకున్న కూకట్పల్లి పోలీసులు ఆ ఇంటిపై దాడి చేసి ఇద్దరు నిర్వాహకులతో పాటు విటులు ముక్కపాటి హరి, ఆకుని నీలంధర్, జింకల పృథ్వీరాజ్‌తో పాటు ఓ యువతిని అదుపులోకి తీసుకొని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. వారి వద్ద నుంచి నాలుగు సెల్ఫోన్లు, రూ.2 వేల నగదును స్వాధీనం చేసుకొని కోర్టులో హాజరుపర్చినట్లు తెలిపారు. ( చదవండి: జుత్తాడ మర్డర్: పాత కక్షలతో దారుణానికి ఒడిగట్టిన కిరాతకుడు ) -
ఆరోగ్యకర ఆహార అలవాట్లతోనే మేలు
కేపీహెచ్‌బీకాలనీ: ఆరోగ్యకర ఆహార అలవాట్లతోనే యువతకు మేలు చేకూరుతుందని, బలవర్థకమైన ఆహారాన్ని తీసుకోవడం ద్వారా సంపూర్ణ ఆరోగ్యంపై దృష్టి సారించా లని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. బుధవారం జేఎన్టీయూహెచ్ ఆడిటోరియంలో ఎన్ఎస్ఎస్, కూకట్పల్లి ఇస్కాన్ శాఖలు సంయుక్తంగా నిర్వహించిన ‘కిల్ కేన్సర్’ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆమె మాట్లాడుతూ.. కేన్సర్ పట్ల ప్రతిఒక్కరిలో అవగాహన కల్పించవలసిన అవసరం ఉందని, ఆ దిశగా ప్రభుత్వా లు చర్యలు తీసుకోవాలన్నారు. యంగ్ తెలంగాణ రాష్ట్రానికి దేశంలోనే యంగ్ గవర్నర్‌గా తాను నియమితులు కావడం అదృష్టమన్నారు. ఈ కార్యక్రమంలో జేఎన్టీయూహెచ్ వీసీ, ఐటీ శాఖ కార్యదర్శి జయేష్ రంజన్ తదిత రులు పాల్గొన్నారు. కాగా, ఏసు ప్రభువు శాంతి, సామరస్యం, సోదరభావాన్ని బోధించారని, ఆయన బోధనలు ఆచరణీయమని గవర్నర్ పేర్కొన్నారు. రాజ్‌భవన్ దర్బార్ హాల్లో బుధవారం నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న గవర్నర్ ఈ మేరకు వ్యాఖ్యానించారు. -
కూకట్‌పల్లిలో యువతి ఆత్మహత్య
సాక్షి, హైదరాబాద్: నగరంలోని కూకట్‌పల్లిలో విషాదం చోటు చేసుకుంది. స్థానికంగా ఉన్న శ్రీ నిలయం అపార్ట్మెంట్ పై నుంచి దూకి గురువారం ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. ఇంటర్మీడియట్ చదువుతున్న రేష్మి (18) అనే యువతి ఈ ఆత్మహత్యకు పాల్పడినట్టు తెలుస్తోంది. అయితే మతిస్థిమితం లేకపోడం వల్లే రేష్మి అపార్ట్మెంట్ పై నుంచి దూకిందని ఆమె తల్లిదండ్రులు తెలిపారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. యువతి మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. -
కూకట్పల్లి కెనరా బ్యాంక్‌లో స్వల్ప అగ్నిప్రమాదం
హైదరాబాద్: కూకట్పల్లి ప్రగతి నగర్‌లోని ఓ బ్యాంక్‌లో ఆదివారం సాయంత్రం స్వల్ప అగ్నిప్రమాదం సంభవించింది. కెనరా బ్యాంక్‌లో మంటలు చెలరేగడంతో గమనించిన స్థానికులు అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సకాలంలో ఘటనా స్థలికి చేరుకుని మంటాలను అదుపులోకి తెచ్చినట్టు తెలిసింది. కాగా, ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.