kumara swami
-
సంకీర్ణ సర్కార్‌కు ఢోకా లేదు : కుమారస్వామి
బెంగళూర్ : కర్ణాటకలో తమ ప్రభుత్వానికి ఎలాంటి ఢోకా లేదని ముఖ్యమంత్రి కుమారస్వామి స్పష్టం చేశారు. సంకీర్ణ సర్కార్ ముందున్న సమస్యలు త్వరలో సమసిపోతాయని చెప్పారు. త్వరలోనే కేబినెట్ పునర్వ్యస్థీకరణ చేపడతామని తెలిపారు. కాగా కర్ణాటకలో సంక్షోభం ఎదుర్కొంటున్న జేడీఎస్-కాంగ్రెస్ సంకీర్ణ సర్కార్ సమస్యలను అధిగమించేందుకు వ్యూహాత్మక ఎత్తుగడలకు పదునుపెట్టింది. కాంగ్రెస్ మంత్రులు ఇప్పటికే రాజీనామా చేయగా, జేడీఎస్ మంత్రులు సైతం రాజీనామా చేసి ఇరు పార్టీలకు రాజీనామా చేసిన రెబెల్ ఎమ్మెల్యేలకు మంత్రి పదవులను ఆఫర్ చేస్తామనే సంకేతాలు పంపారు. కేబినెట్ పునర్వ్యవస్థీకరణ ఉంటుందని సీఎం కుమారస్వామి ప్రకటించి రెబెల్ ఎమ్మెల్యేలను తిరిగి సంకీర్ణ శిబిరానికి చేరువయ్యేలా ప్రయత్నాలు ముమ్మరం చేశారు. అసంతృప్త ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఆఫర్ చేయడం ద్వారా వారు బీజేపీకి దగ్గరకాకుండా నిలువరించాలని సంకీర్ణ సర్కార్ యోచిస్తోంది. తమ ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు జేడీఎస్ 35 మంది పార్టీ ఎమ్మెల్యేలను రిసార్టుకు తరలించింది. -
సీఎం జగన్‌ను కలిసిన ముఖ్యమంత్రి తనయుడు
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి కుమారుడు నిఖిల్ గౌడ మర్యాదపూపూర్వకంగా కలిశారు. మంగళవారం ఆయన ముఖ్యమంత్రి నివాసానికి రాగా.. సీఎం జగన్ నిఖిల్‌ను సాదరంగా ఆహ్వానించారు. అనంతరం ఇద్దరు కాసేపు ముచ్చటించారు. కాగా సీఎం జగన్‌ను మర్యాదపూర్వకంగానే కలిశానని నిఖిల్ పేర్కొన్నారు. లోక్ సభ ఎన్నికల్లో కర్ణాకటలోని మండ్య లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసిన నిఖిల్ ఘోరంగా ఓటమి పాలయ్యారు. మండ్యలో బీజేపీ మద్దతుతో పోటీ చేసిన సుమలత అంబరీష్ నిఖిల్‌పై గెలుపొందారు. నిఖిల్ గౌడతో సమావేశ అనంతరం సీఎం జగన్ తెలుగు కవి, సాహితీవేత్త సినారె (సింగిరెడ్డి నారాయణరెడ్డి) పార్లమెంట్ ప్రసంగాలపై రూపొందించిన పుస్తకాన్నిఆవిష్కరించారు. తాడేపల్లి సీఎం క్యాంప్ ఆఫీస్‌లో జరిగిని ఈ కార్యక్రమంలో సుప్రీం కోర్టు విశ్రాంత న్యాయమూర్తి జాస్తి చలమేశ్వర్, నేషనల్ జ్యూడిషియల్ అకాడమీ డైరెక్టర్ జస్టిస్ గోడ రఘురామ్, తదితరులు పాల్గొన్నారు. మాజీ రాజ్యసభ సభ్యుడు యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ రచించిన ‘పెద్దల సభలో తెలుగు పెద్ద’ పుస్తకాన్ని తన చేతుల మీదుగా ఆవిష్కరించడం అదృష్టంగా భావిస్తున్నానని సీఎం వైఎస్ జగన్ తెలిపారు. -
మళ్లీ నోరుజారిన సిద్ధరామయ్య
శివాజీనగర: ఎన్నికల ప్రచార సభల్లో కాంగ్రెస్ మాజీ సీఎం సిద్ధరామయ్య నోరుజారుతూ చిక్కుల్లో పడుతున్నారు. బీదర్‌లో గతవారం జరిగిన కాంగ్రెస్ సమావేశంలో నరేంద్ర మోదీ మళ్లీ ప్రధాని కావాలని వ్యాఖ్యానించి ఆ తరువాత నాలుక్కరుచుకున్న ఆయన మరోసారి నోరుజారారు. ముఖ్యమంత్రి కుమారస్వామిని మాజీ ముఖ్యమంత్రి అని సంబోధించి నాలుక్కరచుకున్నారు. సోమవారం నగరంలోని హారోహళ్ళిలో సంకీర్ణ అభ్యర్థి కృష్ణభైరేగౌడ తరఫున ఎన్నికల ప్రచారంలో సిద్ధరామయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిద్ధు మాట్లాడుతూ నేను ఇంకా అనేకచోట్ల ప్రచారాల్లో పాల్గొనాల్సి ఉంది, అందుచేత నేను తక్కువగా మాట్లాడుతాను, తరువాత మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి వస్తారని వ్యాఖ్యానించారు. వెంటనే ‘మాజీ కాదు, మాజీ కాదు’ అంటూ జనంలో నుంచి కొందరు కేకలు పెట్టారు. తప్పు గుర్తించిన సిద్ధరామయ్య, ముఖ్యమంత్రి కుమారస్వామి వస్తారని తెలిపారు. సిద్ధు ప్రసంగిస్తూ జేడీఎస్ అధినేత హెచ్.డీ.దేవేగౌడ బెంగళూరు ఉత్తర నుంచి పోటీ చేయాలని ఒత్తిడి ఉండేది. అయితే తుమకూరు ప్రజల కోరిక మేరకు అక్కడి నుంచి పోటీలో ఉన్నారు. అందరికీ ఆమోదయోగ్యమైన అభ్యర్థిగా కృష్ణభైరేగౌడను ఎంపిక చేశామని చెప్పారు. కేంద్ర మంత్రి డీ.వీ.సదానందగౌడ నిష్క్రియాపరుడఉ, ఆయన మీకు ముఖం చూపించారా? ఆయనకు ముఖం చూపించే శక్తి లేదు అని విమర్శించారు. అందుచేత మోదీ ముఖం చూసి ఓటు వేయాలని చెబుతున్నారని అన్నారు. ఈలోగా సీఎం కుమారస్వామి ప్రచారానికి వచ్చారు. -
మమతా బెనర్జీ అసంతృప్తి..!!
బెంగుళూరు : కర్ణాటక 25వ ముఖ్యమంత్రిగా, కాంగ్రెస్-జేడీఎస్ పార్టీల కూటమి తరపున జేడీఎస్ నేత కుమారస్వామి ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. బుధవారం జరిగిన ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి సోనియా గాంధీ, కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీలతో పాటు పలు రాష్ట్రాల కీలక నేతలు, ముఖ్యమంత్రులు, మాజీ ముఖ్యమంత్రులు హాజరయ్యారు. ఈ ప్రతిపక్షాల కూటమిని చూస్తే 2019లో జరగబోయే ఎన్నికలకు ముందుగానే సమరశంఖం పూరించారన్నట్లు ఉంది. ఈ కార్యక్రమానికి పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కూడా హజరయిన సంగతి తెలిసిందే. అయితే దీదీ వేదిక వద్దకు వచ్చేటప్పుడు ఆశ్చర్యకరమైన సంఘటన చోటుచేసుకుంది. వేదిక వద్దకు వెళ్లడానికి ఏర్పాటు చేసిన భద్రతా చర్యల వల్ల మమతా బెనర్జీకి ఇబ్బంది తలెత్తిందని సమాచారం. ప్రమాణ స్వీకారం జరుగుతున్న వేదిక వద్దకు చేరుకోవడానికి ఉన్న దారిలో కదలడానికి వీలు లేకుండా వాహనాలతో రోడ్డును మూసివేసారని, దాని వల్ల దీదీ వేదికను చేరుకునేందుకు కొద్దీ దూరం నడిచి వచ్చారని సమాచారం. దీదీ వేదిక మీదకు వస్తున్నప్పుడు ఆమె అసహనం ఉండటం కెమెరా కంటికి చిక్కింది. అంతేకాకుండా తనకు కలిగిన ఇబ్బంది గురించి కర్ణాటక డీజీపీ నీలమణి రాజు వద్ద కూడా మమతా బెనర్జీ అసంతృప్తిని వ్యక్తం చేశారు. అనంతరం రెడ్ కార్పెట్ మీద నడుచుకుంటూ అతిథులు ఉన్న వేదిక వద్దకు చేరారు. అక్కడ మమతా బెనర్జీని మాజీ ప్రధాని, కుమార స్వామీ తండ్రి హేచ్‌డీ దేవగౌడ వేదిక మీదకు ఆహ్వానించారు. అనంతరం అతిథులకు కేటాయించిన ప్రదేశంలో కూర్చున్న తర్వాత మిగతా ప్రముఖులతో మమతా ముచ్చటించారు. అలానే ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హజరయిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, పాటు మరికొంత మంది ఆప్ పార్టీ నాయకులకు కూడా ప్రమాణ స్వీకార వేదిక వద్దకు హజరు కావడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేయలేదు. ఈ విషయం గురించి ఆప్ అధికార ప్రతినిధి రాఘవ్ చదా ‘బెంగుళూరులో ఉన్నంత ట్రాఫిక్ దేశంలో మరెక్కడా ఉండదు. అందువల్లే మేము ప్రమాణ స్వీకార వేదిక వద్దకు నడుచుకుంటూ వెళ్లాము’అని ట్విట్ చేశారు. -
కువైట్‌లో కరీంనగర్‌వాసి మృతి
కమలాపూర్: కువైట్‌లో కరీంనగర్ జిల్లా వాసి ఒకరు మృతి చెందారు. కమలాపూర్ మండల కేంద్రానికి చెందిన గూళ్ల కుమారస్వామి (38) ఉపాధి కోసం కువైట్ వెళ్లాడు. అక్కడ అనారోగ్యం బారినపడిన ఆయన మృతిచెందారు. ఆయన భౌతిక కాయం కోసం కుటుంబీకులు ఎదురుచూస్తున్నారు -
‘దళం’లో తిరుగు బావుటా ?
పార్టీలో చిచ్చురేపిన రాజ్యసభ అభ్యర్థి ఎంపిక ప్రక్రియ జేడీఎల్పీ సమావేశానికి గైర్హాజరైన ఐదుగురు అసంతృప్త ఎమ్మెల్యేలు కాంగ్రెస్ అభ్యర్థికే మద్దతని తేల్చిచెప్పిన వైనం డిగ్గీని కలవడానికి ఢిల్లీకి ఆ ఐదుగురు ! బెంగళూరు : రాజ్యసభ ఎన్నికల సందర్భంగా దళం పార్టీ ఎమ్మెల్యేలు తిరుగుబావుటా ఎగురవేశారు. దీంతో ఆ పార్టీ లుకలుకలు మరోసారి బయట పడ్డాయి. అంతేకాకుండా పార్టీ రాష్ట్రాధ్యక్షుడు కుమారస్వామిపై గుర్రుగా ఉన్న ఐదుగురు శాసనసభ్యులు గురువారం సాయంత్రం జరిగిన జేడీఎస్ పార్టీ శాసనసభ పక్ష (జేడీఎల్పీ) సమావేశానికి గైర్హాజరు కావడమే కాకుండా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికే తమ ఓటు అని ఆ పార్టీ రాష్ట్రాధ్యక్షుడు కుమారస్వామి ఎదుట తేల్చిచెప్పడంతో పార్టీలో కలకలం రేగింది. రాష్ట్ర శాసనసభ నుంచి రాజ్యసభకు వచ్చేనెల 11న పోలింగ్ జరగనుండగా నామినేషన్ వేయడానికి ఈ నెల 31 వరకూ మాత్రమే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో రాజ్యసభ ఎన్నికల విషయమై చర్చించడానికి జేడీఎస్ పార్టీ బెంగళూరు శివారులోని నెలమంగళలో ఉన్న గోల్డెన్ఫామ్ రిసార్టులో గురువారం సాయంత్రం జేడీఎల్పీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఆ పార్టీ ఎమ్మెల్యేలైన జమీర్‌అహ్మద్‌ఖాన్, చలువరాయస్వామి, అఖండ శ్రీనివాస్‌మూర్తి, బాలకృష్ణ, ఇక్బాల్అన్సారీలు గైర్హాజరయ్యారు. ఈ విషయమై జేడీఎల్పీ సమావేశానికి ముందు దేవెగౌడ మాట్లాడుతూ...‘ప్రస్తుతం పార్టీ బలోపేతం చేయడం ప్రస్తుత లక్ష్యం. జేడీఎల్పీ సమావేశానికి జమీర్ అహ్మద్‌ఖాన్ కాని మరొకరు కాని రాకున్నా ఎటువంటి ఇబ్బంది లేదు.’ అని అసహనం వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా గత కొన్ని రోజులుగా వీరు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండటమే కాకుండా రాజ్యసభ ఎన్నికల సందర్భంగా వీరు కాంగ్రెస్‌తో చేతులు కలుపుతారన్న వార్తలు వెలువబడుతున్నాయి. దీంతో వీరి గైర్హాజరిని ముందే పసిగట్టిన ఆ పార్టీ రాష్ట్రాధ్యక్షుడు కుమారస్వామి అసంతృప్త ఎమ్మెల్యేలను బుధవారం రాత్రి బెంగళూరులోని ఓ హోటల్లో ప్రత్యేకంగా సమావేశమై బుజ్జగించడానికి ప్రయత్నించారు. అయితే వారు తమ నిర్ణయాన్ని మార్చుకోలేదు. అంతే కాకుండా అంతేకాకుండా తాము కాంగ్రెస్ పార్టీ మూడో అభ్యర్థి కే.సీ రామమూర్తికి మద్దతు ఇస్తామని జమీర్ అహ్మద్‌ఖాన్ కుమారస్వామితో పేర్కొన్నారు. ఈ విషయమై కాంగ్రెస్ పార్టీ కర్ణాటక రాజకీయ వ్యవహారాల ఇన్ఛార్జ్ దిగ్విజయ్‌సింగ్‌తో మాట్లాడటానికి త్వరలో ఢిల్లీ వెలుతున్నట్లు ఆయన కుమారస్వామి ముందు కుండబద్దలు కొట్టారు. దీంతో చేసేదేమిలేక కుమారస్వామి వెనుదిరిగారని విశ్వసనీయ వర్గాల సమాచారం. -
కుమారస్వామి దాగుడు మూతలు
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : లోక్‌సభ ఎన్నికలకు 15 మందితో కూడిన జేడీఎస్ అభ్య ర్థుల తొలి జాబితాను ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు హెచ్డీ. దేవెగౌడ గురువారం ఇక్కడ ప్రకటించారు. చిక్కబళ్లాపురం నుంచి మాజీ ముఖ్యమంత్రి హెచ్డీ. కుమారస్వామి పోటీ చేసే విషయమై ఇంకా స్పష్టత రాలేదు. గురువారం అక్కడ నిర్వహించిన సమావేశంలో ఆయన కార్యకర్తల అభిప్రాయాలను సేకరించారు. పోటీ చేయాల్సిందేనని కార్యకర్తలు పట్టుబట్టారు. రెండు రోజుల తర్వాత తన నిర్ణయాన్ని ప్రకటిస్తానని ఆయన విలేకరులకు తెలిపారు. తాను లేదా తన భార్య పోటీ చేయాలని కార్యకర్తలు పట్టుబడుతున్నారని ఈ సందర్భంగా కుమారస్వామి చెప్పారు. కాగా గత ఏడాది బెంగళూరు గ్రామీణ లోక్‌సభ స్థానానికి కుమారస్వామి రాజీనామా చేశారు. ఆ సందర్భంగా ఆయన... ఇకమీదట లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసేది లేదని ప్రకటించారు. ఇటీవల దేవెగౌడ కూడా ఈ లోక్‌సభ ఎన్నికల్లో తమ కుటుంబ సభ్యులెవరూ పోటీ చేయబోరని స్పష్టం చేశారు. హఠాత్తుగా కుమారస్వామి పేరు తెర సాక్షి ప్రతినిధి, బెంగళూరు : లోక్‌సభ ఎన్నికలకు 15 మందితో కూడిన జేడీఎస్ అభ్య ర్థుల తొలి జాబితాను ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు హెచ్డీ. దేవెగౌడ గురువారం ఇక్కడ ప్రకటించారు. చిక్కబళ్లాపురం నుంచి మాజీ ముఖ్యమంత్రి హెచ్డీ. కుమారస్వామి పోటీ చేసే విషయమై ఇంకా స్పష్టత రాలేదు. గురువారం అక్కడ నిర్వహించిన సమావేశంలో ఆయన కార్యకర్తల అభిప్రాయాలను సేకరించారు. పోటీ చేయాల్సిందేనని కార్యకర్తలు పట్టుబట్టారు. రెండు రోజుల తర్వాత తన నిర్ణయాన్ని ప్రకటిస్తానని ఆయన విలేకరులకు తెలిపారు. తాను లేదా తన భార్య పోటీ చేయాలని కార్యకర్తలు పట్టుబడుతున్నారని ఈ సందర్భంగా కుమారస్వామి చెప్పారు. కాగా గత ఏడాది బెంగళూరు గ్రామీణ లోక్‌సభ స్థానానికి కుమారస్వామి రాజీనామా చేశారు. ఆ సందర్భంగా ఆయన... ఇకమీదట లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసేది లేదని ప్రకటించారు. ఇటీవల దేవెగౌడ కూడా ఈ లోక్‌సభ ఎన్నికల్లో తమ కుటుంబ సభ్యులెవరూ పోటీ చేయబోరని స్పష్టం చేశారు. హఠాత్తుగా కుమారస్వామి పేరు తెర పైకి రావడం రాజకీయ వర్గాల్లో కొంత ఆశ్చర్యాన్ని కలిగించింది. రాజకీయ చాణక్యుడుగా పేరు గడించిన దేవెగౌడ, కేంద్రంలో ఎన్నికల అనంతరం చోటు చేసుబోయే పరిణామాల గురించి ఇప్పటి నుంచే జాగ్రత్త పడుతున్నట్లు తెలుస్తోంది. 1996 నాటి ఫలితాలు పునరావృతం కావచ్చని ఆయన అంచనా వేస్తున్నారు. అదే కనుక జరిగితే తన తరఫున కేంద్రంలో చురుకైన పాత్ర పోషించడానికి ఓ నాయకుడు అవసరం. ప్రస్తుతం వార్ధక్యం వల్ల ఆయన చురుకుగా వ్యవహరించ లేకపోతున్నారు. ఏ పదవులనైనా ముందుగా తన కుటుంబానికే కేటాయించే ‘సంప్రదాయాన్ని’ పాటిస్తున్న ఆయన, అనూహ్యంగా తృతీయ ఫ్రంటు అధికారంలోకి వస్తే... అనే ఆలోచనతో కుమారస్వామిని రంగంలోకి దించాలనుకుంటున్నారు. ఈ మాటను కార్యకర్తలతో చెప్పించడం ద్వారా చాణక్యాన్ని ప్రదర్శిస్తున్నారు. జేడీఎస్‌లోకి షరీఫ్, సాంగ్లియానా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు షరీఫ్ మైసూరు నుంచి జేడీఎస్ టికెట్టుపై పోటీ చేయడం ఖాయమనిపిస్తోంది. బెంగళూరు సెంట్రల్ టికెట్ లభించక పోవడంతో ఆయన కాంగ్రెస్ నుంచి వైదొలగాలనుకుంటున్నారు. జేడీఎస్ వైపు మొగ్గు చూపుతున్నారు. ప్రస్తుతం మక్కా యాత్రలో ఉన్న ఆయన, తిరిగి రాగానే తన రాజకీయ భవిష్యత్తును ప్రకటిస్తానని తెలిపారు. కాగా కాంగ్రెస్‌కే చెందిన మరో నాయకుడు, రిటైర్డ్ పోలీసు అధికారి హెచ్‌టీ. సాంగ్లియానా కూడా జేడీఎస్‌లో చేరనున్నట్లు సమాచారం. ఆయనకు బెంగళూరు సెంట్రల్ టికెట్టు ఖరారైనట్లు తెలిసింది. -
కాంగ్రెస్‌లోనే అధికంగా అక్రమ ఘనులు
సాక్షి, బెంగళూరు : రాష్ర్టంలో ఇనుప ఖనిజం అక్రమ తవ్వకానికి సంబంధించి సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు రద్దయిన 51 ‘సీ’ కేటగిరీ లీజుల్లో అత్యధికం కాంగ్రెస్ పార్టీ వారివేనని ప్రతిపక్ష నాయకుడు కుమారస్వామి ఆరోపించారు. కనుక ఖజానాకు ఏర్పడిన నష్టాన్ని వారి నుంచే వసూలు చేయాలని డిమాండ్ చేశారు. విధాన సౌధలో శుక్రవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి కావడానికి ముందు అక్రమంగా మైనింగ్‌కు పాల్పడిన వారి నుంచి జరిమానా వసూలు చేస్తానని బీరాలు పలికిన సిద్ధరామయ్య ఇప్పుడెందుకు ఆ పని చేయడం లేదని ప్రశ్నించారు. ఆక్రమణదారుల్లో కాంగ్రెస్ వారే ఎక్కువగా ఉండడం దీనికి కారణమేమోనని సందేహం వ్యక్తం చేశారు. కాగా నిషిద్ధ సింగిల్ నంబర్ లాటరీలను అరికట్టడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. హోం శాఖ మంత్రి కేజే. జార్జ్ లాలూచీ వల్లే ఇంకా లాటరీలు మనుగడ సాగిస్తున్నాయని ఆరోపించారు. దీనిపై తాను గొంతు చించుకుని అరుస్తున్నా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. లాటరీ నిర్వాహకులపై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసు అధికారిని బదిలీ చేశారని ఆయన ఆరోపించారు. పార్టీ విప్‌ను వచ్చే నెల 5న ప్రకటిస్తామన్నారు.