కుమారస్వామి దాగుడు మూతలు
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : లోక్‌సభ ఎన్నికలకు 15 మందితో కూడిన జేడీఎస్ అభ్య ర్థుల తొలి జాబితాను ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు హెచ్‌డీ. దేవెగౌడ గురువారం ఇక్కడ ప్రకటించారు. చిక్కబళ్లాపురం నుంచి మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డీ. కుమారస్వామి పోటీ చేసే విషయమై ఇంకా స్పష్టత రాలేదు.
గురువారం అక్కడ నిర్వహించిన సమావేశంలో ఆయన కార్యకర్తల అభిప్రాయాలను సేకరించారు. పోటీ చేయాల్సిందేనని కార్యకర్తలు పట్టుబట్టారు. రెండు రోజుల తర్వాత తన నిర్ణయాన్ని ప్రకటిస్తానని ఆయన విలేకరులకు తెలిపారు. తాను లేదా తన భార్య పోటీ చేయాలని కార్యకర్తలు పట్టుబడుతున్నారని ఈ సందర్భంగా కుమారస్వామి చెప్పారు. కాగా గత ఏడాది బెంగళూరు గ్రామీణ లోక్‌సభ స్థానానికి కుమారస్వామి రాజీనామా చేశారు.
ఆ సందర్భంగా ఆయన... ఇకమీదట లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసేది లేదని ప్రకటించారు. ఇటీవల దేవెగౌడ కూడా ఈ లోక్‌సభ ఎన్నికల్లో తమ కుటుంబ సభ్యులెవరూ పోటీ చేయబోరని స్పష్టం చేశారు. హఠాత్తుగా కుమారస్వామి పేరు తెర సాక్షి ప్రతినిధి, బెంగళూరు : లోక్‌సభ ఎన్నికలకు 15 మందితో కూడిన జేడీఎస్ అభ్య ర్థుల తొలి జాబితాను ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు హెచ్‌డీ. దేవెగౌడ గురువారం ఇక్కడ ప్రకటించారు. చిక్కబళ్లాపురం నుంచి మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డీ. కుమారస్వామి పోటీ చేసే విషయమై ఇంకా స్పష్టత రాలేదు. గురువారం అక్కడ నిర్వహించిన సమావేశంలో ఆయన కార్యకర్తల అభిప్రాయాలను సేకరించారు. పోటీ చేయాల్సిందేనని కార్యకర్తలు పట్టుబట్టారు.
రెండు రోజుల తర్వాత తన నిర్ణయాన్ని ప్రకటిస్తానని ఆయన విలేకరులకు తెలిపారు. తాను లేదా తన భార్య పోటీ చేయాలని కార్యకర్తలు పట్టుబడుతున్నారని ఈ సందర్భంగా కుమారస్వామి చెప్పారు. కాగా గత ఏడాది బెంగళూరు గ్రామీణ లోక్‌సభ స్థానానికి కుమారస్వామి రాజీనామా చేశారు. ఆ సందర్భంగా ఆయన... ఇకమీదట లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసేది లేదని ప్రకటించారు. ఇటీవల దేవెగౌడ కూడా ఈ లోక్‌సభ ఎన్నికల్లో తమ కుటుంబ సభ్యులెవరూ పోటీ చేయబోరని స్పష్టం చేశారు.
హఠాత్తుగా కుమారస్వామి పేరు తెర పైకి రావడం రాజకీయ వర్గాల్లో కొంత ఆశ్చర్యాన్ని కలిగించింది. రాజకీయ చాణక్యుడుగా పేరు గడించిన దేవెగౌడ, కేంద్రంలో ఎన్నికల అనంతరం చోటు చేసుబోయే పరిణామాల గురించి ఇప్పటి నుంచే జాగ్రత్త పడుతున్నట్లు తెలుస్తోంది. 1996 నాటి ఫలితాలు పునరావృతం కావచ్చని ఆయన అంచనా వేస్తున్నారు. అదే కనుక జరిగితే తన తరఫున కేంద్రంలో చురుకైన పాత్ర పోషించడానికి ఓ నాయకుడు అవసరం.
ప్రస్తుతం వార్ధక్యం వల్ల ఆయన చురుకుగా వ్యవహరించ లేకపోతున్నారు. ఏ పదవులనైనా ముందుగా తన కుటుంబానికే కేటాయించే ‘సంప్రదాయాన్ని’ పాటిస్తున్న ఆయన, అనూహ్యంగా తృతీయ ఫ్రంటు అధికారంలోకి వస్తే... అనే ఆలోచనతో కుమారస్వామిని రంగంలోకి దించాలనుకుంటున్నారు. ఈ మాటను కార్యకర్తలతో చెప్పించడం ద్వారా చాణక్యాన్ని ప్రదర్శిస్తున్నారు.
జేడీఎస్‌లోకి షరీఫ్, సాంగ్లియానా
కాంగ్రెస్ సీనియర్ నాయకుడు షరీఫ్ మైసూరు నుంచి జేడీఎస్ టికెట్టుపై పోటీ చేయడం ఖాయమనిపిస్తోంది. బెంగళూరు సెంట్రల్ టికెట్ లభించక పోవడంతో ఆయన కాంగ్రెస్ నుంచి వైదొలగాలనుకుంటున్నారు. జేడీఎస్ వైపు మొగ్గు చూపుతున్నారు.
ప్రస్తుతం మక్కా యాత్రలో ఉన్న ఆయన, తిరిగి రాగానే తన రాజకీయ భవిష్యత్తును ప్రకటిస్తానని తెలిపారు. కాగా కాంగ్రెస్‌కే చెందిన మరో నాయకుడు, రిటైర్డ్ పోలీసు అధికారి హెచ్‌టీ. సాంగ్లియానా కూడా జేడీఎస్‌లో చేరనున్నట్లు సమాచారం. ఆయనకు బెంగళూరు సెంట్రల్ టికెట్టు ఖరారైనట్లు తెలిసింది.