నేడు కుందనపల్లిలో ధర్నా
గోదావరిఖని : ఎల్లంపల్లి నీటిని స్థానిక ప్రజల అవసరాలకు కేటాయించకుండా ఇతర ప్రాంతాలకు తరలించడాన్ని నిరసిస్తూ శుక్రవారం కుందనపల్లి చౌరస్తాలో నిర్వహించే ధర్నాను విజయవంతం చేయాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు లింగమూర్తి పిలుపునిచ్చారు. గురువారం స్థానిక ప్రధాన చౌరస్తాలోని ఐఎన్టీయూసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. రామగుండం, పెద్దపల్లి, కరీంనగర్, మానకొండూర్, హుస్నాబాద్ తదితర నియోజకవర్గ ప్రజలకు తాగునీరు అందించకుండా సిద్దిపేట, గజ్వేల్ తదితర ప్రాంతాలకు టీఆర్ఎస్ ప్రభుత్వం పైపులైన్ల ద్వారా నీటిని తరలించుకుపోతోందని పేర్కొన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వానికి బుద్ది చెప్పడానికి ధర్నా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ధర్నాలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు. పార్టీ నగర అధ్యక్షుడు కాల్వ లింగస్వామి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మున్సిపల్ మాజీ చైర్మన్ బడికెల రాజలింగం, గుమ్మడి కుమారస్వామి, మహంకాళి స్వామి, బొంతల రాజేష్, సుతారి లక్ష్మణ్‌బాబు, ఎండీ ముస్తాఫా, తిప్పారపు శ్రీనివాస్, భైరిమల్ల రాజ్‌కుమార్, ఫయాజ్‌అలీ, అమలేశ్వర్‌రావు, దార కుమార్, గట్ల రమేశ్, బుర్ర సుధీర్‌గౌడ్, వీరబోయిన రవియాదవ్, గుండేటి రాజేష్, కేశవులు, ఈదునూరి హరిప్రసాద్, గోలివాడ ప్రసన్నకుమార్, బొమ్మక రాజేష్, పెద్దెల్లి ప్రకాశ్, నమిండ్ల ఎల్లేశ్, గడ్డం రమేశ్, తాళ్లపెల్లి యుగేంధర్, నారాయణగౌడ్, పర్శ శ్రీనివాస్, యాట్ల మధు, చరణ్, పోషం, ప్రవీణ్, బూడిద మహేందర్, సతీశ్ తదితరులు పాల్గొన్నారు.