land records purgation
-
అలాగే వదిలేస్తారా...
విజయనగరం గంటస్తంభం: రెవెన్యూ రికార్డుల్లో అనేక లోపాలున్న విషయం ప్రభుత్వం దృష్టికి వెళ్లింది. వాటిని సరిదిద్దేందుకు భూ(ల్యాండు) రికార్డులు స్వచ్ఛీకరణ(ఫ్యూరిఫికేషన్) చేయాలని నిర్ణయించింది. మూడు విడతల్లో అన్ని గ్రామాల్లో రికార్డులు ప్రక్షాళన చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా నవంబర్ 1వ తేదీ నుంచి రికార్డుల ప్యూరిఫికేషన్ ప్రక్రియ చేపట్టి ఈ నెలాఖరు వరకు అన్ని గ్రామాల్లో ఆర్ఎస్ఆర్ రికార్డుతో వెబ్‌ల్యాండు రికార్డు సరి చూశారు. డిసెంబర్ 1న తొలివిడత గ్రామాల్లో గ్రామసభ నిర్వహించారు. డిసెంబర్ 2 నుంచి 2020 జనవరి 31వ తేదీ వరకు తొలివిడత గ్రామాల్లో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకుని, వినతిపత్రాలు తీసుకుని, వాటిని పరిష్కరించి రికార్డు సరి చేయాలి. రెండో విడత మార్చి నెలాఖరు నాటికి, మూడో విడత మే నెలాఖరు నాటికి పూర్తి చేయాలి. కానీ మొదటి విడత గ్రామసభలు వరకు అంతా సక్రమంగా జరిగినా తర్వాత కార్యక్రమం కాస్తా మరుగున పడిందనే చెప్పాలి. అప్డేట్ కాని రికార్డులు రెవెన్యూ సమస్యలు పరిష్కారం కావాలంటే ముందుగా రెవెన్యూ రికార్డులు సరిదిద్దాలని ప్రభుత్వం భావించింది. అందులో భాగంగా మాన్యువల్ రికార్డులతోపాటు వెబ్‌ల్యాండు రికార్డులు సరి చేయడంపై దృష్టిసారించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఆరు ప్రధాన సమస్యలపై దృష్టిసారించి రికార్డులు సరి చేయాలని నిర్ణయించింది. కానీ ప్రస్తుత పరిస్థితి చూస్తే ఈ కార్యక్రమం సత్ఫాలితాలిస్తుందన్న నమ్మకం కలగట్లేదు. మొత్తం సబ్ డివిజన్లలో ఉన్నతాధికారులు తయారు చేసిన ఫార్మాట్లో జిల్లాలో అధికారులు 18,46,406 అప్లోడ్ చేశారు. కానీ 9,75,078.34 ఎకరాలు మాత్రమే అప్లోడ్ చేశారు. మిగతా విస్తీర్ణం గురించి క్లారిటీ లేదు. అసలు ఇందులో మొదటి విడత గ్రామాల్లో ఎన్ని సబ్డివిజన్లు, విస్తీర్ణం ఉంది... అందులో ఎన్ని, ఎంత అప్లోడ్ చేశారన్నది తెలియడం లేదు. తహసీల్దార్లు భూమి రికార్డుల స్వచ్చీకరణ డేటా అప్లోడ్ కూడా చేయడం లేదు. అయినా రాష్ట్రంలో మనమే ముందంజలో ఉన్నామని అధికారులు చెబుతున్నారు. అధికారుల మీన మేషాలు: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని భూమి రికార్డులు స్వచ్చీకరణ కార్యక్రమం చేపట్టినా అధికారులు మాత్రం నిర్లిప్తంగానే ఉన్నారు. గ్రామాల్లో వీఆర్వోలు భూమి రికార్డులు స్వచ్చీకరణ గ్రామసభలు సక్రమంగా పెట్టలేదు. తొలివిడత గ్రామాల్లో రైతుల నుంచి ఎన్ని వినతులు వచ్చాయన్న విషయం చెప్పలేకపోతుండడం ఇందుకు నిదర్శనం. నవశకం సర్వే, ఇళ్ల పట్టాల పంపిణీ, ఓటర్ల జాబితా సవరణ సాకుగా మొన్నటివరకూ చెప్పిన అధికారులు ఈ కార్యక్రమాన్ని వాయిదా వేయాలని రెవెన్యూసంఘం నాయకుల ద్వారా రెవెన్యూ మంత్రిని కోరారు. ఎక్కువ సమయం ఇచ్చినందున వాయిదా కుదరదని మంత్రి చెప్పినా వీరి తీరు మారలేదు. నవశకం సర్వే పూర్తయినా, ఇళ్ల పట్టాలు పంపిణీ పనిభారం కొంత తగ్గినా రెవెన్యూ రికార్డుల స్వచ్చీకరణ అంశాన్ని సీరియస్‌గా తీసుకోవడం లేదు. మొత్తమ్మీద ఈ కార్యక్రమాన్ని ప్రహసనంగానే కొనసాగిస్తున్నారు. వీరి తీరువల్ల ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తోందన్న అభిప్రాయం సర్వత్రా వినిపిస్తోంది. కార్యక్రమం కొనసాగుతోంది భూమి రికార్డుల ఫ్యూరిఫికేషన్ కార్యక్రమం కొనసాగుతోంది. తొలివిడత గ్రామసభలు జరిగాయి. అందులో గుర్తించిన సమస్యలు తహసీల్దార్లు పరిష్కరిస్తున్నారు. అయినా అందుకు సంబంధించి డేటా మాకైతే పంపడం లేదు. అందువల్లే స్పష్టంగా చెప్పలేకపోతున్నాం. ఇకపై పూర్తిస్థాయిలో దృష్టి పెడతాం. – బాలాత్రిపుర సుందరి, ఎస్డీసీ, కేఆర్ఆర్సీ, విజయనగరం -
భూ చిక్కులకు చెక్ పెట్టేలా..
సాక్షి, విజయనగరం గంటస్తంభం: ఏళ్లు తరబడుతున్నాయి.. భూములు చేతులు మారుతున్నాయి.. హక్కుదారులూ మారుతున్నారు... కానీ రికార్డులు మాత్రం అలాగే ఉండిపోతున్నాయి. దీంతో అసలైన భూ హక్కుదారులకు చిక్కులు తప్పడంలేదు. స్పందన కార్యక్రమంలో రెవెన్యూ సమస్యలపైనే అధిక ఫిర్యాదులు అందుతున్నాయి. దీంతో రెవెన్యూ రికార్డుల ప్రక్షాళనకు వైఎస్సార్ సీపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. పైలెట్ ప్రాజెక్టుగా మండలానికి ఒక గ్రామాన్ని ఎంపికచేసింది. దీనికోసం ప్రత్యేక అధికారులను, సర్వే బృందాలను సన్నద్ధం చేస్తోంది. నియోజకవర్గం ప్రత్యేకాధికారి కురుపాం సబ్ కలెక్టరు, పార్వతీపురం పార్వతీపురం ఐసీడీఎస్ పీడీ సాలూరు డీఆర్డీఏ పీడీ బొబ్బిలి ఎస్డీసీ, భూసేకరణ, బొబ్బిలి చీపురుపల్లి ఎస్డీసీ, భూసేకరణ, చీపురుపల్లి గజపతినగరం ఆర్డీవో విజయనగరం నెల్లిమర్ల ఎఫ్ఎస్వో, విజయనగరం విజయనగరం ఎస్డీసీ, కేఆర్ఆర్సీ శృంగవరపుకోట ఎస్డీసీ, భూసేకరణ, యూనిట్–3 ఆరు సమస్యలపై ఫోకస్ రెవెన్యూ సమస్యలు పరిష్కారం కావాలంటే ముందుగా రెవెన్యూ రికార్డులు సరిదిద్దాలని ప్రభుత్వం భావించింది. ఇందులో భాగంగా మాన్యువల్ రికార్డులతో పాటు వెబ్‌ల్యాండ్ రికార్డులు సరిచేయాలని నెలరోజుల కిందట సంయుక్త కలెక్టర్లతో జరిగిన సమావేశంలో రెవెన్యూ మంత్రి పిల్లి సుబాస్ చంద్రబోస్ ఆదేశాలు జారీ చేశారు. ఇందులో భాగంగా ఆరు అంశాలపై దృష్టి సారించాలని సూచించారు. భూములు వారసత్వంగా పిల్లలకు సంక్రమించినా రికార్డుల్లో ఇప్పటికి చాలామంది తల్లిదండ్రులు పేర్లు ఉన్నాయి. అలాగే, భూములు క్రయవిక్రయాలు జరిగిన తర్వాత రిజిస్ట్రేషన్ చేసినప్పటికీ కీలకమైన రెవెన్యూ రికార్డుల్లోకి వారి పేర్లు రావడం లేదు. పట్టాదారుపాసు పుస్తకాలు, టైటిల్ డీడ్స్ జారీ చేసిన రికార్డులు పరంగా వారి పేర్లు నమోదు కావడం లేదు. ఒక రైతుకు వేర్వేరు ఖాతాలు కింద భూములు ఉన్నాయి. ఇవన్నీ ఒకే ఖాతా పరిధిలోకి తీసుకురావాలని నిర్ణయించారు. సాగులో ఉన్న రైతులు, ఇతర వివరాలు తెలియక నోషనల్ ఖాతాల్లో ఆ భూములను నమోదు చేశారు. ఏళ్ల తరబడినా అవి అలాగే ఉన్నాయి. మాన్యువల్, ఆన్లైన్ ఎస్ఎల్ఆర్ సరి చేయాలని, వెబ్‌ల్యాండులో భూ విస్తీర్ణం చూసి తేడా ఉంటే సరి చేయాలని సూచించారు. ప్రయోగాత్మక అమలుకు చర్యలు ఈ సమస్యలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాయి. జిల్లాలో కూడా దాదాపుగా అన్ని రెవెన్యూ గ్రామాల్లో ఉన్నా ఆశ్చర్యపోనక్కర్లేదు. అయితే, అన్ని గ్రామాల్లో ఒకేసారి చేపట్టడం వల్ల ఫలితాలు ఎలా ఉంటాయో చెప్పలేని పరిస్థితి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ముందుగా ఒక రెవెన్యూ గ్రామంలో ఈ సమస్యలపై దృష్టిసారించి రెవెన్యూ రికార్డులు ఫ్యూరిఫికేషన్ చేయాలని నిర్ణయించారు. దీనికి మండలానికి ఒక గ్రామం ఎంపిక చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఆగ్రామంలో గ్రామసభ పెట్టి ఈ ఆరు అంశాలపై వివరాలు సేకరించి ఒక్కో అంశంపై వచ్చిన లోపాలను గుర్తించి రికార్డులు సరి చేసేందుకు వివరాలు తయారు చేయాలని సూచించింది. ఇందులో భాగంగా ఇప్పటికే మండలానికి ఒక గ్రామాన్ని జిల్లా రెవెన్యూ అధికారులు గుర్తించారు. జిల్లాలో గుర్తించిన రెవెన్యూ గ్రామాలు మండలం గ్రామం కురుపాం గోటికుప్ప గుమ్మలక్ష్మీపురం కుడ్డతాళ్లవలస జియ్యమ్మవలస అక్కందొరవలస కొమరాడ చీడిపల్లి గరుగుబిల్లి సీతానగరం పార్వతీపురం నిశ్శణ్ముకపురం బలిజిపేట శివరాంపురం సాలూరు కూర్మరాజుపేట పాచిపెంట మిర్తివలస మెంటాడ గురమ్మవలస మక్కువ బంగారువలస బొబ్బిలి జయరంగరాయపురం రామభద్రపురం మర్రివలస బాడంగి రామచంద్రపురం తెర్లాం పూనువలస మెరకముడిదాం వాసుదేవపురం గరివిడి విజయరాంపురం చీపురుపల్లి అర్దివలస గుర్ల గొర్లె సీతారాంపురం దత్తిరాజేరు లక్ష్మీపురం గజపతినగరం టి.ఎస్.కె.పురం బొండపల్లి ఐ.వి.అగ్రహారం గంట్యాడ జగ్గాపురం నెల్లిమర్ల పూతికపేట పూసపాటిరేగ పాలంకి డెంకాడ చిట్టిగుంకలాం భోగాపురం కోటభోగాపురం విజయనగరం సిర్యాలపేట ఎస్.కోట మామిడిపల్లి వేపాడ జమ్మాదేవిపేట ఎల్.కోట కూర్మవరం కొత్తవలస రాయపురాజుపేట జామి సోమయాజులపాలెం ఈనెల 16వ తేదీలోగా రెవెన్యూ అధికారులు గ్రామసభ నిర్వహించి ఆరు అంశాలకు సంబంధించి రైతులు నుంచి సమస్యలు తెలుసుకుంటారు. దీనికోసం ఆరు రకాల నమూనా పత్రాలు అధికారులు డిజైన్ చేసి పంపించారు. వాటి ఆధారంగా రైతులు నుంచి వివరాలు సేకరిస్తారు. ఇలా సేకరించిన వివరాలతో మండల తహసీల్దారు, డీటీ, గ్రామ రెవెన్యూ అధికారులతో ఈనెల 17వ తేదిన కలెక్టరేట్లో అధికారులు సమావేశం నిర్వహిస్తారు. జిల్లాలో ఉన్న 34 రెవెన్యూ గ్రామాలు నుంచి వచ్చిన వివరాలతో ఆరు అంశాలపై ఒక నివేదిక తయారు చేస్తారు. ఆ నివేదికలో అంశాలు ఈ నెల 20వ తేదీన విజయనగరంలో రెవెన్యూ అధికారులతో రెవెన్యూ మంత్రి నిర్వహించే సదస్సులో వివరిస్తారు. దీనికి పరిష్కార మార్గాలు గురించి చర్చిస్తారు. ఇలా రాష్ట్రంలో అన్ని జిల్లాల నుంచి వచ్చిన లోపాలు ఆధారంగా రికార్డులు ఫ్యూరిఫికేషన్‌పై దృష్టిసారిస్తారు. పర్యవేక్షణకు ప్రత్యేకాధికారుల నియామకం గ్రామ సభలు, భూమి రికార్డుల ఫ్యూరిఫికేషన్ కోసం నియోజకవర్గానికి ఒక ప్రత్యేకాధికారిని కలెక్టర్ హరిజవహర్‌లాల్ నియమించారు. జిల్లాలో పని చేస్తున్న డిప్యూటీ కలెక్టర్లకు ఈ బాధ్యతలు అప్పగించారు. వీరు గ్రామాల్లో జరుగుతున్న సభలు తీరును పర్యవేక్షించి జిల్లా అధికారులకు నివేదిస్తారు. -
రెవెన్యూ సిబ్బందికి నెల జీతం బోనస్?
సాక్షి, హైదరాబాద్ : నాలుగు నెలలుగా భూ రికార్డుల ప్రక్షాళన కోసం తీవ్రంగా శ్రమిస్తున్న రెవెన్యూ సిబ్బందికి ప్రోత్సాహకం ఇవ్వాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్న రెవెన్యూ సిబ్బందికి నెల జీతం బోనస్‌గా ఇవ్వాలనే ప్రతిపాదనపై ఉన్నతస్థాయి వర్గాల్లో కసరత్తు జరుగుతోంది. ఎప్పుడో నిజాం నవాబు నాటి రికార్డులను ఎంతో శ్రమకోర్చి ప్రక్షాళన చేసిన క్షేత్రస్థాయి వీఆర్వోలు, వీఆర్ఏల నుంచి సీసీఎల్ఏ సిబ్బంది వరకు ఈ ప్రోత్సాహకాన్ని ఇస్తారని, ఏప్రిల్ నెల జీతంతోపాటు బోనస్ వస్తుందనే చర్చ రెవెన్యూ వర్గాల్లో ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. ఏం చేద్దాం.. ఎలా చేద్దాం వాస్తవానికి భూ రికార్డుల ప్రక్షాళనలో పాల్గొన్న రెవెన్యూ సిబ్బందికి ప్రోత్సాహకం ఇవ్వనున్నట్టు సీఎం కేసీఆర్ గత నెలలోనే ప్రకటించారు. క్షేత్రస్థాయిలో రెవెన్యూ సిబ్బంది ఎంతో కృషి చేశారని ప్రశంసించారు. మరోవైపు ఈ ప్రోత్సాహకం విషయంలో ఏం చేద్దామన్న దానిపై రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులు తర్జనభర్జనలు పడుతున్నారు. తెలంగాణ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ (టీఆర్ఎస్ఏ) ప్రతిపాదిస్తున్న విధంగా సిబ్బంది మొత్తానికి నెల జీతం బోనస్‌గా ఇవ్వాలనే దానిపై చర్చిస్తున్నారు. ఈ ప్రతిపాదన ప్రకారం రూ.18 కోట్ల వరకు ప్రభుత్వంపై భారం పడనుందని రెవెన్యూ వర్గాలు ఓ అంచనాకు వచ్చాయి. అయితే రెవెన్యూ శాఖలో పని చేస్తున్న మొత్తం 40 వేల మంది సిబ్బందికీ బోనస్ ఇవ్వాలా లేదా భూ రికార్డుల ప్రక్షాళనలో ప్రత్యక్షంగా పాలుపంచుకున్న వీఆర్ఏలు, వీఆర్వోలు, తహసీల్దార్లు, ఇతర కార్యాలయ సిబ్బందికి మాత్రమే ఇవ్వాలా అనే దానిపై చర్చలు జరుగుతున్నాయి. ఆర్డీవో కార్యాలయాల నుంచి కలెక్టర్, సీసీఎల్ఏ కార్యాలయాల సిబ్బంది వరకు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్నందున అందరికీ బోనస్ వర్తింపజేయాలని రెవెన్యూ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు బోనస్ ఎవరికి ఇస్తారన్నది త్వరగా తేల్చి వీలుంటే మార్చి లేదా ఏప్రిల్ నెల జీతంలో బోనస్ జమ చేస్తారని రెవెన్యూ వర్గాలు చెబుతున్నాయి. -
‘పట్టా’ పరేషాన్
మణుగూరు: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న రైతు పెట్టుబడి పథకం ఫలాలు పట్టాదారులకు మాత్రమే అందే అవకాశాలు కనిపిస్తున్నాయి. పట్టా ఉన్న రైతులకే పెట్టుబడి నగదును అందించేలా ప్రణాళిక రూపొందించడంతో కాస్తుదారులైన రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. గ్రామసభల ద్వారా రైతుల అభిప్రాయాలు సేకరించేటప్పుడు, ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఉపసంఘం చర్చల సమయంలో కేవలం పట్టాదారులనే లెక్కలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా గల పట్టాదారు రైతులు (1బీలో నమోదైన పట్టాదారు మాత్రమే) ‘ఏ’ కేటగిరి కింద సుమారు 71.75 లక్షల మంది ఉన్నట్లు రెవెన్యూ రికార్డుల ప్రక్షాళన తర్వాత ప్రభుత్వం అంచనాకు వచ్చింది. పట్టాదారు రైతుల వివరాలు, సాగు విస్తీర్ణం తదితర వివరాలు నమోదు చేస్తుండటంతో ఈ పథకం కొంతమంది రైతులకే పరిమితమయ్యేలా కనిపిస్తోంది. దీంతో జిల్లా వ్యాప్తంగా గల 23 మండలాల్లో కాస్తుదారుల్లో కొనసాగుతున్న రైతులకు, కౌలుదారులకు, రెవెన్యూ, భూదాన సమితి, దేవాదాయ భూములు సాగు చేసే రైతులకు ఎలాంటి సహాయం అందే అవకాశాలు లేవు. జిల్లాలో 50 శాతం భూములకే పట్టాలు.. జిల్లా వ్యాప్తంగా 3, 25, 182 ఎకరాల భూమి సాగులో ఉండగా 1,04, 616 మంది రైతులు వ్యవసాయం చేస్తున్నారు. సాగు భూమి(1/70 చట్టం పరిధిలో)లో 50 శాతం భూములకే పట్టాలు ఉన్నట్లు భూ ప్రక్షాళనలో అధికారులు గుర్తించారు. పలు రకాల ప్రభుత్వ (వ్యవసాయ) భూముల్లో సన్న, చిన్నకారు రైతులే ఎక్కువగా పంటలు సాగు చేస్తుండటం గమనార్హం. ప్రభుత్వ సాయం పట్టాదారులకే దక్కితే ఆర్థిక ఇబ్బందులు ఉండి, సరైన భూ హక్కులు లేని నిరుపేద రైతులకు అన్యాయం జరిగే అవకాశం ఉంది. వారసత్వం, పసుపు కుంకుమ, విక్రయాలకు సంబంధించిన అంశాల ప్రక్షాళన విషయంలో లక్షల్లో డబ్బులు చేతులు మారుతున్నాయి. కానీ పలు రకాల ప్రభుత్వ భూములు సాగు చేసే బీద రైతులకు మాత్రం రెవెన్యూ రికార్డుల్లో స్థానం దక్కడం లేదు. దీంతో ప్రభుత్వం అమలు చేస్తున్న అనేక పథకాలకు దూరం అవుతుండగా, తాజాగా రైతు పెట్టుబడి సహాయానికి కూడా అర్హత లేకపోవడంతో సన్న, చిన్నకారు రైతులు తలలు పట్టుకుంటున్నారు. ఏజెన్సీలో రైతుల భవిష్యత్ ప్రశ్నార్థకం... రాష్ట్రంలో ప్రభుత్వం అమలు చేస్తున్న పలు సంక్షేమ పథకాలను జిల్లాలోని ఏజెన్సీ ప్రాంత రైతులు పొందలేకపోతున్నారు. సుమారు 70, 80 సంవత్సరాలుగా (తరతరాలుగా) ఏజెన్సీ ప్రాంతంలో నివాసం ఉంటూ జీవనాధారం కోసం నిరుపేద రైతులు ప్రభుత్వ భూములు(రెవెన్యూ, దేవాదాయ, భూదాన సమితి, అటవీ భూములు) సాగు చేసుకుంటున్నారు. కాగా ప్రభుత్వం సంక్షేమ ఫలాలు అందించే క్రమంలో మైదాన ప్రాంతాలకు సంబంధించిన అంశాలనే పరిగణనలోకి తీసుకోవడంతో ఏజెన్సీ ప్రాంతంలో పొలాలు సాగు చేస్తున్న గిరిజనేతర రైతులకు తరుచూ అన్యాయం జరుగుతోంది. జిల్లాలో 23 మండలాల్లో (జిల్లా మొత్తం) గల భూములకు 1/70 చట్టం అమల్లో ఉండటం గమనార్హం. ప్రభుత్వం పకడ్భందీగా చేపట్టిన భూ ప్రక్షాళనలో కూడా గిరిజనేతర రైతులకు పేర్లు మార్చే అవకాశాలు లేవు. దీంతో ఏజెన్సీ ప్రాంతంలో అత్యధిక శాతం భూముల్లో సాగుచేసే సన్న, చిన్నకారు గిరిజనేతర రైతులకు ప్రభుత్వ సహాయం అందటం లేదు. సాగు చేస్తున్న భూములకు పూర్తిస్థాయిలో హక్కులు లేక, కనీసం ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహం కూడా పొందే అవకాశం లేకపోవడంతో బీద రైతులు ఆవేదన చెందుతున్నారు. -
నింగి నుంచి భూమి సర్వే..
మహబూబ్‌నగర్/మహబూబ్‌నగర్ న్యూటౌన్: ప్రతీ సోమవారం కలెక్టరేట్లలో జరిగే ప్రజావాణితో పాటు సర్వే ల్యాండ్ రికార్డుల కార్యాలయాలకు పదుల సంఖ్యలో ఫిర్యాదులు వస్తుంటాయి. తమ భూమి సర్వే చేసి హద్దులు నిర్ధారించాలని ఆ ఫిర్యాదుల్లో పలువురు కోరుతుంటారు. శాశ్వత పరిష్కారం కోసం వీరందరూ ఎదురుచూస్తున్నా ఫలితం ఉండడం లేదు. ఈక్రమంలో నాలుగు నెలలుగా రాష్ట్ర ప్రభుత్వం భూరికార్డుల ప్రక్షాళన కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తూ రికార్డుల ప్యూరిఫికేషన్‌కు చర్యలు చేపట్టింది. అయితే, రికార్డుల వరకే పరిమితం కాకుండా శాశ్వత పరిష్కారం చూపాలనే ఉద్దేశంతో ఉపగ్రహ ఛాయాచిత్రాల ద్వారా జియోగ్రాఫిక్ ఇన్ఫర్మాటిక్ సిస్టమ్(జీఐఎస్) సర్వే నిర్వహించాలని యోచిస్తోంది. ఇటీవల రాష్ట్ర స్థాయిలో ఉన్నత స్థాయి అధికారుల సమీక్షలో రికార్డుల ప్యూరిఫికేషన్ సర్వే సందర్భంగా క్షేత్ర స్థాయిలో ఎదురైన సమస్యలు, వాటిని అధిగమించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. ఈ క్రమంలోనే జీఐఎస్ ద్వారా భూముల సర్వే చేపడితే ఎలా ఉంటుందనే సాధ్యాసాధ్యాలపై కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ చర్చించి సిద్ధంగా ఉండాలని అధికారులకు సూత్రప్రాయంగా నిర్దేశించినట్లు తెలిసింది. రెవెన్యూ శాఖ ప్రక్షాళన రెవెన్యూ శాఖను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగా ఇప్పటికే భూముల లెక్క తేల్చడంతో పాటు రికార్డుల ప్యూరిఫికేషన్ కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ సందర్భంగా క్షేత్ర స్థాయిలో రికార్డులకు, క్షేత్ర స్థాయికి తేడాలు ఉన్నట్లు అధికారులు గమనించారు. భూప్రక్షాళన కార్యక్రమం ద్వారా ఆశించిన ఫలితాలు రావాలంటే మరిన్ని చర్యలు అవసరమని భావించిన ప్రభుత్వం జీఐఎస్ ల్యాండ్ సర్వే చేపట్టాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. తద్వారా భూరికార్డులు, హద్దుల విషయంలో పూర్తి పారదర్శకత తీసుకురావాలని యోచిస్తున్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. ఇదీ మేలు జియోగ్రాఫిక్ ఇన్ఫర్మేషన్ సిస్టం(జీఐఎస్) ద్వారా భూముల సర్వే చేపడితే భూయాజమానులకు మేలు జరగడంతో పాటు రికార్డుల నిర్వహణ సైతం పారదర్శకమవుతుంది. సర్వే నంబర్ల వారీగా నిర్ణయించే హద్దుల మేరకు వాస్తవంగా భూమి విస్తీర్ణం, నక్షాలు రూపొందిస్తారు. పట్టాదారుల విస్తీర్ణం తేల్చి తర్వాత హద్దులు నిర్ణయిస్తారు. వీఆర్వో, సర్వేయర్లు ఇచ్చే రిపోర్టు ఆధారంగా రిజిస్ట్రేషన్ చేస్తారు. వీఆర్వో, సర్వేయర్ల రిపోర్టును తప్పని సరిచేయడంతో పాటు కొనుగోలు చేసిన భూమికి పక్కా కొలతలు నిర్ణయిస్తారు. దీని ప్రకారం రిజిస్ట్రేషన్, ముటేషన్ రికార్డుల్లో నమోదు చేయడం ద్వారా భవిష్యత్‌లో కొలతలకు సంబంధించి ఇబ్బందులు ఉండవు. అలాగే, ఎవరైనా భూమి కొలతల సమస్యతో అధికారుల వద్దకు వస్తే పరిష్కరించడం సులువవుతుంది. సర్వే నంబర్ల జియో ట్యాగింగ్ జీఐఎస్ సర్వే ద్వారా భూకొలతలు చేపట్టాక కర్ణాటక తరహాలో సర్వే నంబర్ల వారీగా హద్దులు నిర్ణయించి సర్వే నంబర్లను జియో ట్యాగింగ్ చేస్తారు. వచ్చే నెలలో జరగనున్న ఉన్నత స్థాయి సమీక్ష సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం ఆలోచన మేరకు జీఐఎస్ ల్యాండ్ సర్వే నిర్వహిస్తే భూప్రక్షాళన ఆశయం నెరవేరడమే కాకుండా భూ యాజమానులకు కొలతలు, హద్దులు, రికార్డుల పరంగా ఇబ్బందులు తొలగిపోయే అవకాశముంది. ఇందులో భాగంగా సర్వే నంబర్లను జియో ట్యాగింగ్ చేస్తే ఎప్పటికప్పుడు ప్రభుత్వ పర్యవేక్షణ ఉంటుంది. గతంలో ప్రభుత్వ భవనాల నిర్మాణానికి స్థలాలు కేటాయించాలని తహసీల్దార్లకు సూచిస్తే కొన్ని మండలాల్లో ప్రభుత్వ భూములు లేవని చెప్పడం, భూములు ఉన్నట్లు రికార్డులు చెబుతుండడం ఇబ్బందులు తెచ్చిపెట్టాయి. అదే సర్వే నంబర్లను జియో ట్యాగింగ్ చేస్తే వాస్తవంగా ఎంత భూమి అందుబాటులో ఉందో తెలిసిపోనుంది. త్వరలో సర్వే మహబూబ్‌నగర్ జిల్లాలోని తహసీల్దార్లతో ఈనెల 17న కలెక్టర్ రొనాల్డ్‌రోస్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన రాష్ట్ర స్థాయిలో నిర్వహించిన సమావేశంలో చర్చకొచ్చిన అంశాలను వివరించారు. క్షేత్ర స్థాయిలో ఎదురవుతున్న హద్దుల సమస్యను అన్ని జిల్లాల అధికారులు సమావేశం దృష్టికి తెచ్చారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా జీఐఎస్ సర్వే నిర్వహించి భూప్రక్షాళన ఫలితాలను ప్రజలకు అందించాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోందని చెప్పారు. -
నేటి నుంచే భూరికార్డుల ‘ప్రక్షాళన’
సర్వం సిద్ధం చేసిన రెవెన్యూ యంత్రాంగం సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న భూరికార్డుల ప్రక్షాళన కార్యక్రమం నేటి నుంచే ప్రారంభం కానుంది. ఇందుకుగానూ రెవెన్యూ శాఖ ఏర్పాట్లను పూర్తి చేసింది. జిల్లా కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్ల నుంచి వీఆర్ఏల వరకు పాల్గొనే ఈ ప్రక్షాళన కార్యక్రమం సెప్టెంబర్ 15 నుంచి డిసెంబర్ 31 వరకు అంటే 100 రోజులపాటు జరగనుంది. ఈ కార్యక్రమంలో రాష్ట్రవ్యాప్తంగా 1,343 బృందాలు పనిచేయనున్నాయి. ప్రతి మండలంలో ఉన్న మొత్తం గ్రామాల్లో 3 గ్రామాలను తొలుత ఎంచుకుని అక్కడే 10 రోజులపాటు ప్రక్షాళన కార్యక్రమం నిర్వహించనున్నారు. తొలిరోజు, చివరిరోజు గ్రామసభలు నిర్వహించి కార్యక్రమ ఉద్దేశాలను, కార్యక్రమ ఫలితాన్ని అధికారులు వివరించనున్నారు. తొలిరోజు గ్రామసభ అయిన తర్వాత రెవెన్యూ సిబ్బంది రైతులకు ఆన్లైన్–1బీ ప్రతులను ఇచ్చి వారి సంతకాలు తీసుకోవడంతో పాటు మార్పుచేర్పులు చేయాల్సిన పత్రాన్ని కూడా ఇంటికి తీసుకెళ్లి ఇస్తారు. రెవెన్యూ అధికారులు ఇచ్చిన రికార్డులతో రైతు ఏకీభవిస్తే ఎలాంటి సమస్యా ఉండదు. విభేదిస్తే మాత్రం రెవెన్యూ సిబ్బంది ఇచ్చిన మార్పుచేర్పుల పత్రంలో ఆ వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది. అప్పుడు రెవెన్యూ సిబ్బంది దానిని పరిశీలించి అవసరమైతే మార్పుచేర్పులు చేసి ఆ మార్పుచేర్పులు చేసిన పత్రాన్ని కూడా రైతులకు ఇవ్వనున్నారు. ఇదే పత్రాన్ని గ్రామసభలో కూడా ప్రదర్శించనున్నారు. అయితే, భూరికార్డుల ప్రక్షాళన ఏ గ్రామంలోనైనా 10 రోజులపాటే ఉంటుంది కాబట్టి ఆ 10 రోజుల్లోనే రికార్డులను సవరించుకోవాల్సి ఉంటుందని రెవెన్యూ అధికారులు చెపుతున్నారు. రెవెన్యూ ఆఫీసుల చుట్టూ తిరిగి చేయించుకునే దానికన్నా రెవెన్యూ సిబ్బందే ఇంటి వద్దకు వచ్చినప్పుడు చేయించుకోవడం మేలని, రైతులంతా తమ రికార్డులను సవరించుకునే ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుతున్నారు. మరో, ముఖ్య విషయమేమిటంటే.. భూరికార్డుల ప్రక్షాళన సందర్భంగా ఎలాంటి సర్వేలు చేయబోరు. కేవలం రికార్డులను మాత్రమే సరిచేయనున్నారు. ప్రక్షాళనలో రెవెన్యూ సిబ్బంది రైతులకు ఇచ్చేవి 1) ఆన్లైన్–1బీ ప్రతి, 2) రశీదు, 3) మార్పుచేర్పుల ప్రతిపాదన పత్రం రెవెన్యూ సిబ్బంది వచ్చినప్పుడు రైతు వద్ద ఉండాల్సినవి 1) పట్టాదారు పాసుపుస్తకం లేదంటే భూమికి సంబంధించిన రికార్డు ఏదైనా