సరిహద్దుకు లేజర్ కవచం
న్యూఢిల్లీ: పఠాన్కోట్ ఉగ్రదాడి నేపథ్యంలో దేశంలోకి ఉగ్రవాదులు చొరబడకుండా హోం శాఖ చర్యలు చేపట్టనుంది. భారత్, పాక్ సరిహద్దుల్లో ప్రమాదం పొంచి ఉన్న కంచె లేని 40కి పైగా ప్రదేశాల్లో త్వరలో లేజర్ కిరణాలతో కంచె (గోడ) ఏర్పాటు చేయనున్నారు. బీఎస్ఎఫ్ అభివృద్ధి పరిచిన ఈ లేజర్ కిరణాల కంచెను పంజాబ్లోని సరిహద్దు ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తారు. కంచెను దాటేందుకు ప్రయత్నిస్తే ఆ కిరణాలు గుర్తించి పెద్ద శబ్దంతో హెచ్చరికలు చేస్తాయి. ప్రమాదమున్న 40 ప్రాంతాల్లో 5 లేదా 6 కేంద్రాల్లో మాత్రమే లేజర్ గోడలు ఏర్పాటు చేశారు. జైషే మహమ్మద్ ఉగ్రవాదులు చొరబడిన బమియాల్లో ఉన్న ఉజ్ నది తీరంలో ఈ లేజర్ గోడను పఠాన్కోట్లో దాడి తర్వాత ఏర్పాటు చేశారు.