last week bussiness
-
గతవారం బిజినెస్
పోంజీ స్కీములపై కొరడా పోంజీ పెట్టుబడి పథకాలతో సామాన్య ప్రజానీకాన్ని మోసగించే, నిర్వహించే వారిని కఠినంగా శిక్షించే దిశగా కేంద్రం మరిన్ని చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా చట్టవిరుద్ధంగా డిపాజిట్లు సమీకరించడాన్ని నిషేధిస్తూ సమగ్ర బిల్లును రూపొందించింది. అన్‌రెగ్యులేటెడ్ డిపాజిట్ స్కీమ్స్ నిషేధ బిల్లు 2018ని త్వరలో పార్లమెంటులో ప్రవేశపెట్టనుంది. ‘తేజ్’లో యుటిలిటీ బిల్లుల చెల్లింపు గూగుల్ ఇండియా గతేడాది సెప్టెంబర్‌లో ఆవిష్కరించిన మొబైల్ వాలెట్ యాప్ ’తేజ్’ను సరికొత్త ఫీచర్‌తో అప్డేట్ చేసింది. యుటిలిటీ బిల్ పేమెంట్ ఆప్షన్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. దీంతో యూజర్లు వాటర్, ఎలక్ట్రిసిటీ, డీటీహెచ్, మొబైల్ బిల్లులను చెల్లించొచ్చు. అది కూడా ఎటువంటి ట్రాన్సాక్షన్ చార్జీలు లేకుండా. మూతబడనున్న మరో టెల్కో రుణభారంతో మూతబడుతున్న టెలికం సంస్థల జాబితాలో తాజాగా ఎయిర్‌సెల్ కూడా చేరబోతోంది. సుమారు రూ. 15,500 కోట్ల రుణాలు పేరుకుపోవడంతో కంపెనీ త్వరలో నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) ముందు దివాలా పిటీషన్ దాఖలు చేయనుంది. మలేషియాకి చెందిన మాతృ సంస్థ మ్యాక్సిస్ గతంలో ఎయిర్‌సెల్‌లో మరిన్ని పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చినప్పటికీ.. ఆ తర్వాత వెనక్కి తగ్గినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ప్రైవేటుకూ బొగ్గు మైనింగ్ ప్రభుత్వ రంగ దిగ్గజం కోల్ ఇండియా గుత్తాధిపత్యానికి చెక్ పెడుతూ బొగ్గు రంగంలో కేంద్రం మరిన్ని సంస్కరణలకు తెరతీసింది. ఇకపై వాణిజ్య అవసరాల కోసం బొగ్గును ఉత్పత్తి చేసేందుకు ప్రైవేట్ కంపెనీలకు కూడా కాంట్రాక్టులివ్వాలని నిర్ణయించింది. ప్రస్తుతం ప్రైవేట్ కంపెనీలు సొంత అవసరాల కోసం బొగ్గును ఉత్పత్తి చేయడానికి మాత్రమే అనుమతిస్తున్నారు. ప్రధాని మోదీ సారథ్యంలో ఇటీవల జరిగిన సమావేశంలో కేంద్ర క్యాబినెట్ ఆర్థిక వ్యవహారాల కమిటీ (సీసీఈఏ) ఈ నిర్ణయం తీసుకుంది. షేర్ల తనఖా తగ్గింది! ప్రమోటర్ల షేర్ల తనఖా గత ఏడాది డిసెంబర్ క్వార్టర్లో తగ్గింది. తనఖాలో ఉన్న ప్రమోటర్ల షేర్ల శాతం గత ఏడాది అక్టోబర్ క్వార్టర్లో సగటున 8.3 శాతంగా ఉంది. అది డిసెంబర్ క్వార్టర్లో 7.8 శాతానికి తగ్గినట్లు కోటక్ ఇన్స్టిట్యూషనల్ ఈక్విటీస్ రీసెర్చ్ తెలియజేసింది. డిసెంబర్ క్వార్టర్లో ప్రమోటర్లు రూ.1.98 లక్షల కోట్ల విలువైన షేర్లను తనఖా పెట్టారని ఇది బీఎస్ఈ–500 సూచీ మార్కెట్ క్యాప్‌లో 1.47 శాతానికి సమానమని పేర్కొంది. పీఎఫ్ వడ్డీ రేటు 8.55 శాతానికి తగ్గింపు ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ ఈపీఎఫ్‌వో 2017–18 ఆర్థిక సంవత్సరానికి పీఎఫ్‌పై వడ్డీ రేటును 8.65 శాతం నుంచి 8.55 శాతానికి తగ్గించింది. దీంతో రూ. 586 కోట్ల మేర మిగులు నమోదు కానుందని ఈపీఎఫ్‌వో ట్రస్టీల సమావేశం అనంతరం కేంద్ర కార్మిక మంత్రి సంతోష్ కుమార్ గంగ్వార్ తెలిపారు. గత ఆర్థిక సంవత్సరం 8.65 శాతం వడ్డీ రేటునివ్వడంతో.. రూ. 695 కోట్ల మిగులు నమోదైనట్లు వివరించారు. దాదాపు 6 కోట్ల చందాదారులపై ఇది ప్రభావం చూపనుంది. భారత్‌లో పెట్టుబడులు కొనసాగిస్తాం: ఉబెర్ ప్రముఖ ట్యాక్సీ సేవల సంస్థ ‘ఉబెర్’ తాజాగా భారత్‌లో పెట్టుబడులు కొనసాగిస్తామని స్పష్టం చేసింది.’ఇండియా మాకు చాలా ముఖ్యమైన ప్రాంతం. ప్రధానమైన మార్కెట్ కూడా. ఇక్కడ వచ్చే దశాబ్ద కాలంలో దాదాపు 10 రెట్ల వరకు వృద్ధిని లక్ష్యంగా నిర్దేశించుకున్నాం’ అని ఉబెర్ సీఈవో డారా ఖోస్రోషాహి తెలిపారు. తొలిసారి భారత్‌లో పర్యటిస్తోన్న ఆయన.. సంస్థ ప్రధాన ఇన్వెస్టర్ అయిన సాఫ్ట్‌బ్యాంక్ సలహాలను స్వీకరించబోమనే సంకేతాలిచ్చారు. తొలి 5జీ ట్రయల్స్ సక్సెస్.. ఎయిర్టెల్, హువావే సంస్థలు తాజాగా భారత్‌లో తొలిసారి 5జీ నెట్వర్క్ ట్రయల్స్‌ను నిర్వహించాయి. ఇందులో 3 గిగాబైట్ పర్ సెకన్ (జీబీపీఎస్)కుపైగా డేటా స్పీడ్‌ను సాధించినట్లు ఇరు కంపెనీలు ప్రకటించాయి. గురుగావ్‌లోని మానేసర్ వద్ద ఉన్న ఎయిర్టెల్ నెట్వర్క్ ఎక్స్పీరియన్స్ సెంటర్లో ఈ ట్రయల్స్ జరిగాయి. ఇంటర్నెట్ యూజర్లు @ 50 కోట్లు!! దేశంలో ఇంటర్నెట్ యూజర్ల సంఖ్య 2018 జూన్ నాటికి 50 కోట్లకు చేరుతుందని అంచనా. ఐఎంఏఐ– ఐఎంఆర్బీ సంయుక్త సర్వేలో ఈ విషయం వెల్లడయ్యింది. సర్వే ప్రకారం.. 2017 డిసెంబర్లో ఇంటర్నెట్ యూజర్ల సంఖ్య వార్షిక ప్రాతిపదికన 11.34 శాతం వృద్ధితో 48.1 కోట్లకు చేరింది. పట్టణ ప్రాంతాల్లో ఇంటర్నెట్ యూజర్ల సంఖ్య 2017 డిసెంబర్ నాటికి వార్షిక ప్రాతిపదికన 9.66 శాతం వృద్ధితో 29.5 కోట్లకు చేరి ఉంటుందని అంచనా. ఇక ఇదే సమయంలో గ్రామీణ ప్రాంతాల్లో వీరి సంఖ్య 14.11 శాతం వృద్ధితో 18.6 కోట్లకు పెరిగి ఉండొచ్చు. భారత్‌లోని మొత్తం ఇంటర్నెట్ యూజర్లలో విద్యార్థులు, యువత వాటా దాదాపు 60 శాతం. ఇక క్రాస్ కరెన్సీ ట్రేడింగ్! బాంబే స్టాక్ ఎక్సే్చంజ్‌లో (బీఎస్ఈ) క్రాస్ కరెన్సీ డెరివేటివ్స్ ట్రేడింగ్ మొదలవుతోంది. ఈ నెల 27 నుంచి క్రాస్ కరెన్సీ డెరివేటివ్స్‌ను ప్రారంభిస్తున్నామని, క్రాస్ ఇండియన్ రూపీ (ఐఎన్ఆర్) ఆప్షన్స్‌ను కూడా ఆరంభిస్తామని బీఎస్ఈ వెల్లడించింది. వీటివల్ల లిక్విడిటీ మరింతగా పెరుగుతుందని తెలియజేసింది. ప్రస్తుతం మల్టీ కమోడిటీ ఎక్సే్చంజ్‌లో (ఎంసీఎక్స్) కరెన్సీ ట్రేడింగ్‌కు అనుమతి ఉంది కానీ.. క్రాస్ కరెన్సీ ట్రేడింగ్‌కు అనుమతి లేదు. మూడేళ్లలో ఇ–రిటైల్‌లో 2.5 రెట్లు వృద్ధి!! ఇ–రిటైల్ మార్కెట్ వచ్చే మూడేళ్లలో రెండు రెట్లకు పైగా పెరగనుందని క్రిసిల్ తన నివేదికలో అంచనా వేసింది. అయితే మార్కెట్ పరిమాణం ఎంతుంటుందో మాత్రం వెల్లడించలేదు. కంపెనీలు డిస్కౌంట్ల నుంచి ఏకీకరణ, భౌగోళిక వైవిధ్యం, వ్యాపార పునర్నిర్మాణం, కస్టమర్లకు చేరువ కావడం వంటి అంశాలపై దృష్టి కేంద్రీకరించాల్సి వస్తుందని తెలిపింది. డీల్స్.. ♦ ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ కంపెనీ.. మీడియా సంస్థ ఈరోస్ ఇంటర్నేషనల్‌లో వాటా కొంటోంది. న్యూయార్క్ స్టాక్ ఎక్సే్చంజ్‌లో లిస్టయిన ఈరోస్ ఇంటర్నేషనల్‌లో 5 శాతం వాటాను ఒక్కో షేర్‌ను 15 డాలర్లకు రిలయన్స్ ఇండస్ట్రీస్ తన అనుబంధ కంపెనీ ద్వారా కొనుగోలు చేయనుంది. ♦ ప్రైవేట్ రంగ ఫెడరల్ బ్యాంక్.. ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ రంగంలోకి ప్రవేశించింది. ఇన్వెస్ట్మెంట్ కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఈక్విరస్ క్యాపిటల్‌లో 26 శాతం వాటాను కొనుగోలు చేశామని ఫెడరల్ బ్యాంక్ తెలిపింది. ఆటోమొబైల్స్.. ♦ అల్ట్రా–లగ్జరీ కార్ల తయారీ కంపెనీ ’రోల్స్‌రాయిస్’ తాజాగా 8వ జనరేషన్ ఫాంటమ్ కారును భారత్ మార్కెట్లోకి తీసుకువచ్చింది. దీని ప్రారంభ ధర రూ.9.5 కోట్లు. ♦ జర్మనీకి చెందిన లగ్జరీ కార్ల తయారీ కంపెనీ బీఎండబ్ల్యూకు చెందిన ప్రీమియం మోటార్‌సైకిల్ విభాగం బీఎండబ్ల్యూ మోటొరాడ్ తాజాగా భారత్‌లో తన బైక్స్ ధరలను 10 శాతం వరకు తగ్గించింది. ధరల తగ్గింపు నిర్ణయం తక్షణం అమల్లోకి వస్తుందని కంపెనీ తెలిపింది. అడ్వెంచర్, స్పోర్ట్, టూరింగ్, హెరిటేజ్, రోడ్‌స్టర్ వంటి కేటగిరీల్లోని మోటార్‌సైకిళ్లకు తగ్గింపు వర్తిస్తుందని పేర్కొంది. ♦ స్కోడా ఆటో ఇండియా తన అన్ని మోడళ్ల ధరలను వచ్చే నెల నుంచి పెంచుతోంది. బడ్జెట్లో కస్టమ్స్ సుంకాలను పెంచడంతో అన్ని మోడళ్ల ధరలను 1 శాతం వరకూ (రూ.10,000 నుంచి రూ.35 వేల వరకూ) పెంచుతున్నామని స్కోడా ఆటో ఇండియా తెలిపింది. కస్టమ్స్ సుంకం పెంపు ప్రభావాన్ని తట్టుకోవడానికి దశల వారీగా కార్ల ధరలను మరింతగా పెంచుతామని పేర్కొంది. ♦ కన్సూమర్ ఎలక్ట్రానిక్స్ తయారీ కంపెనీ ’లెనొవొ ఇండియా’ ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్ వ్యాపారంలో తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. తాజాగా డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో 30.8 శాతం మార్కెట్ వాటాతో మళ్లీ అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. కంపెనీ మొదటి స్థానంలో ఉండటం ఇది వరుసగా మూడో త్రైమాసికం. -
గతవారం బిజినెస్
దిగ్గజ బ్యాంకుల ముందస్తు పన్నులు డౌన్ రెండవ త్రైమాసికానికి సంబంధించి ముందస్తు పన్ను చెల్లింపుల్లో ప్రభుత్వ, ప్రైవేటు రంగ బ్యాంకింగ్ దిగ్గజాలు- ఎస్బీఐ, ఐసీఐసీఐలు వెనక్కు తగ్గాయి. ఎల్ఐసీ, ఆర్ఐఎల్, హెచ్డీఎఫ్సీ, యస్ బ్యాంక్‌తోపాటు స్టీల్, సిమెంట్ తదితర రంగాలు సానుకూల ఫలితాలను నమోదు చేసుకున్నాయి. గత ఏడాది ఇదే కాలంలో రూ.1,620 కోట్లు చెల్లించిన ఎస్బీఐ ఈ ఏడాది అంతకు 26 శాతం తక్కువతో రూ.1,200 కోట్లనే చెల్లించింది. ఇక ఐసీఐసీఐ బ్యాంక్ చెల్లింపులు 20 శాతం తక్కువగా రూ.1,500 కోట్ల నుంచి రూ.1,200 కోట్లకు పడిపోయాయి. హైదరాబాద్ నుంచి గోఎయిర్ విమానయాన రంగ సంస్థ గోఎయిర్ తాజాగా తన సర్వీసులను హైదరాబాద్ నుంచి ప్రారంభిస్తోంది. అక్టోబర్ 12 నుంచి ఈ సేవలు మొదలు కానున్నాయి. దీంతో సంస్థకు భాగ్యనగరి 23వ నగరం కానుంది. హైదరాబాద్ నుంచి చెన్నై, బెంగళూరు, భువనేశ్వర్, కోల్‌కతా నగరాలకు ప్రతిరోజూ నాన్ స్టాప్ సర్వీసులను గోఎయిర్ నడపనుంది. హైదరాబాద్ నుంచి బెంగళూరు మీదుగా పోర్ట్‌బ్లెయిర్‌కు ఫై్లట్స్ ప్రారంభించనుంది. ఫార్చ్యూన్ జాబితాలో మనోళ్లు ఫార్చ్యూన్ తాజాగా రూపొందించిన అమెరికాకు వెలుపల అత్యంత శక్తివంతమైన 50 మంది మహిళల జాబితాలో అరుంధతీ భట్టాచార్య, చందా కొచర్, శిఖా శర్మ స్థానం పొందారు. ఎస్బీఐ చీఫ్ అరుంధతీ భట్టాచార్య జాబితాలో రెండో స్థానాన్ని కైవసం చేసుకుంటే,ఐసీఐసీఐ బ్యాంక్ హెడ్ చందా కొచర్ 5వ స్థానంలో నిలిచారు. యాక్సిస్ బ్యాంక్ సీఈవో శిఖా శర్మ 19వ స్థానంలో ఉన్నారు. మార్కెట్ విలువ పరంగా యూరోజోన్‌లోనే పెద్ద బ్యాంక్.. బ్యాంకో శాన్‌టండర్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ అన బాటిన్ జాబితాలో టాప్‌లో ఉన్నారు. ఎల్అండ్టీ టెక్ ఐపీవోకు మంచి స్పందన లార్సన్ అండ్ టూబ్రో అనుబంధ సంస్థ ఎల్ అండ్ టీ టెక్నాలజీ సర్వీసెస్ తొలి పబ్లిక్ ఆఫర్ 2.5 రెట్లు ఓవర్‌సబ్‌స్క్రయిబ్ అయ్యింది. రూ. 900 కోట్ల నిధుల సమీకరణకు కంపెనీ జారీ చేసిన ఇష్యూ గడువు గత గురువారంతో ముగిసింది. సంస్థాగత ఇన్వెస్టర్ల వాటాకు 5 రెట్ల స్పందన లభించగా, రిటైల్ ఇన్వెస్టర్ల నుంచి వచ్చిన బిడ్స్ 1.73 రెట్లు ఉన్నాయి. రూ. 850-860 ప్రైస్‌బ్యాండ్‌తో ఆఫర్ జారీ అయ్యింది. 27% పెరిగిన పరోక్ష పన్ను వసూళ్లు కేంద్ర ప్రభుత్వపు ఆదాయంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ఐదు నెలల్లో మంచి వృద్ధి నమోదయ్యింది. దీనికి ప్రత్యక్ష, పరోక్ష పన్ను వసూళ్లు కారణంగా నిలిచాయి. ఏప్రిల్-ఆగస్ట్ మధ్య కాలంలో పరోక్ష పన్ను వసూళ్లు 27.5 శాతం వృద్ధితో రూ.3.36 లక్షల కోట్లకు, ప్రత్యక్ష పన్ను వసూళ్లు 15.03 శాతం వృద్ధితో రూ.1.89 లక్షల కోట్లకు చే రాయి. దీంతో మొత్తం ప్రత్యక్ష, పరోక్ష పన్ను వసూళ్లు (ఆగస్ట్ చివరకి) రూ.5.25 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. ఆర్‌కామ్-ఎయిర్‌సెల్ విలీనం టెలికం రంగంలో అతిపెద్ద డీల్ సాకారమైంది. అనిల్ అంబానీ అడాగ్ గ్రూప్‌నకు చెందిన రిలయన్స్ కమ్యూనికేషన్స్(ఆర్‌కామ్), ఎయిర్‌సెల్‌ల విలీన ఒప్పందం ఎట్టకేలకు కుదిరింది. వైర్లెస్ మొబైల్ సర్వీసుల కార్యకలాపాలను విలీనం చేస్తున్నట్లు ఇరు కంపెనీలు ప్రకటించాయి. ఈ మేరకు ఒప్పందంపై సంతకాలు చేసినట్లు వెల్లడించాయి. తద్వారా రూ.65,000 కోట్ల విలువైన సంస్థగా ఆవిర్భవిస్తున్నట్లు వెల్లడించాయి. అంతేకాదు ఈ డీల్ పూర్తయితే.. విని యోగదారులు, ఆదాయం పరంగా ప్రతిపాదిత విలీన సంస్థ భారత్‌లో నాలుగో అతిపెద్ద టెలికం ఆపరేటర్‌గా నిలుస్తుంది. ఆదాయ పరంగా 12 ప్రధాన సర్కిళ్లలో మూడో స్థానానికి చేరుతుంది. డాయిష్ బ్యాంక్‌కు అమెరికా జరిమానా జర్మనీ దిగ్గజం డాయిష్ బ్యాంక్ భవిష్యత్తును ప్రశ్నార్థకంలో పడేసే పెద్ద చిక్కు వచ్చి పడింది. వివరాల్లోకి వెళితే... 2008కి ముందు రెసిడెంట్ తనఖా ఆధారిత బాండ్లను నిబంధనలకు విరుద్ధంగా విక్రయించడం ద్వారా ఆర్థిక సంక్షోభానికి తన వంతు కారణమయ్యిందన్న అంశంపై అమెరికా న్యాయశాఖ డాయిష్ బ్యాంకు నుంచి 14 బిలియన్ డాలర్లను డిమాండ్ చేసింది. ఇంత భారీ మొత్తంలో జరిమానా పడుతుందని డాయిష్ ఊహించలేదు. కేవలం 3.4 బిలియన్ డాలర్ల మేర మాత్రమే డిమాండ్ ఉంటుందని భావించింది. 50 కోట్లకు ఆన్లైన్ యూజర్లు! దేశంలో ఆన్లైన్ యూజర్ల సంఖ్య 2020 నాటికి 50 కోట్లకు చేరుతుందని గూగుల్ ఆసియా పసిఫిక్ లాంగ్వేజ్ హెడ్ రిచా సింగ్ చిత్రాంశి అంచనా వేశారు. స్మార్ట్‌ఫోన్స్ వినియోగం పెరుగుదల, ఇంటర్నెట్ వ్యాప్తి వంటి పలు అంశాలు దీనికి కారణంగా నిలుస్తాయని పేర్కొన్నారు. ప్రస్తుతం దేశంలో 65 శాతం మంది స్మార్ట్‌ఫోన్స్ ద్వారానే ఎక్కువగా ఇంటర్నెట్ను ఉపయోగిస్తున్నారని తెలిపారు. 35 కోట్ల మంది ఆన్లైన్ యూజర్లలో 15 కోట్ల మంది స్థానిక భాషకే అధిక ప్రాధాన్యమిస్తున్నారని పేర్కొన్నారు. రెండేళ్ల గరిష్టానికి టోకు ధరలు టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ధరల పెరుగుదల రేటు ఆగస్టులో 3.74 శాతంగా నమోదయ్యింది. ఇది రెండేళ్ల గరిష్ట స్థాయి. సూచీలో దాదాపు 60 శాతంపైగా వాటా కలిగిన తయారీ విభాగంలో కొన్ని వస్తువులు, అలాగే పప్పు దినుసుల ధరల పెరుగుదల మొత్తం సూచీపై ప్రభావం చూపింది. అదీకాక గత ఆర్థిక సంవత్సరం ఇదే నెల (ఆగస్టు) ధరల్లో అసలు పెరుగుదల లేకపోగా క్షీణతలో -5.06 శాతం వద్ద ఉండడం (బేస్ ఎఫెక్ట్) కూడా తాజా రేటు పెరుగుదలకు కారణమని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. నియామకాలు * ప్రభుత్వ రంగ సిండికేట్ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్‌గా సి.హెచ్.ఎస్.ఎస్. మల్లికార్జునరావు బాధ్యతలు చేపట్టారు. * ఇసుజు మోటార్స్ ఇండియా (ఐఎంఐ) చైర్మన్‌గా హిరోషి నకగవ నియమితులయ్యారు. ఇక ఇదివరకు ఐఎంఐ చైర్మన్ పదవిలో కొనసాగిన హిరొయసు మియురా... ఇసుజు ఇంజనీరింగ్ బిజినెస్ సెంటర్ ఇండియా (ఐఈబీసీఐ) చైర్మన్, మేనేజింగ్ డెరైక్టర్‌గా బాధ్యతలు చేపట్టారు. * ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం ఎల్ఐసీ ఎండీగా ఉన్న వీకే శర్మ చైర్మన్‌గా అదనపు బాధ్యతలు స్వీకరించారు. డీల్స్.. * ఆన్లైన్ పేమెంట్ సేవల్లో గ్లోబల్ ప్లేయర్‌గా ఉన్న పేయూ, అదే రంగంలోని దేశీయ కంపెనీ సిట్రస్ పేను కొనుగోలు చేసింది. పూర్తిగా నగదు రూపంలో 130 మిలియన్ డాలర్లు (సుమారు రూ.870కోట్లు) చెల్లించడం ద్వారా కొనుగోలుకు ఒప్పందం చేసుకుంది. * జర్మనీకి చెందిన బహుళజాతి ఫార్మా, కెమికల్స్ కంపెనీ బేయర్ ఏజీ, అమెరికాకు చెందిన బయోటెక్ అగ్రగామి కంపెనీ మోన్శాంటో మధ్య ఎట్టకేలకు డీల్ సెట్ అయింది. ప్రపంచంలోనే అతిపెద్ద నగదు ఒప్పందం వీటి మధ్య కుదిరింది. 66 బిలియన్ డాలర్లను నగదు రూపంలో చెల్లించి మోన్శాంటోను కొనుగోలు చేసేందుకు బేయర్ ఏజీ ముందుకు వచ్చింది. * డిజిటల్ పేమెంట్స్ కంపెనీ ‘ఇట్జ్‌క్యాష్’ తాజాగా పేమెంట్ గేట్‌వే సంస్థ ‘వీసా’తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ద్వారా వచ్చే నాలుగేళ్లలో 10 బిలియన్ డాలర్ల విలువైన లావాదేవీలను నిర్వహించాలని ఇట్జ్‌క్యాష్ లక్ష్యంగా నిర్దేశించుకుంది. * మహీంద్రా గ్రూపులో భాగమైన మహీంద్రా సీఐఈ ఆటోమోటివ్... బెంగళూరుకు చెందిన బిల్‌ఫోర్జ్ కంపెనీని రూ.1,331.2 కోట్లకు కొనుగోలు చేసింది. * అస్సెట్స్ కేర్ అండ్ రీకన్స్ట్రక్షన్ ఎంటర్ప్రైజ్ (ఏసీఆర్‌ఈ)లో 13.67 శాతం వాటాను యాక్సిస్ బ్యాంకు కొనుగో లు చేయనుంది. ఐఎఫ్సీఐ నుంచి ఈ వాటాను రూ.22.72 కోట్లు చెల్లించడం ద్వారా సొంతం చేసుకోనుంది. * ప్రింటర్స్ విభాగంలో హెచ్‌పీ కంపెనీ అతిపెద్ద కొనుగోలుకు తెరతీసింది. శామ్సంగ్ ఎలక్ట్రానిక్స్‌కు చెందిన ప్రింటర్స్ వ్యాపారాన్ని 1.05 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేయనున్నట్లు ప్రకటించింది. -
గతవారం బిజినెస్
నిరుత్సాహంలో ఎగుమతులు ఎగుమతుల్లో అసలు వృద్ధిలేకపోగా క్షీణ ధోరణి వరుసగా 16వ నెల మార్చిలోనూ కొనసాగింది. అసలు వృద్ధిలేకపోగా -5.47 శాతం క్షీణత నమోదయ్యింది. వెరసి మొత్తం ఆర్థిక సంవత్సరం (2015-16 ఏప్రిల్ నుంచి మార్చి వరకు) ఎగుమతుల్లో -16 శాతం క్షీణత నమోదయ్యింది. భారీ ఐపీఓకు వొడాఫోన్ సన్నాహాలు భారత్‌లో ఐపీఓకు రావడానికి వొడాఫోన్ రంగం సిద్ధం చేస్తోంది. ఈ ఐపీఓ విలువ రూ.13,200 కోట్ల నుంచి రూ.16,500 కోట్ల రేంజ్లో ఉంటుందని అంచనా. ఐవీఆర్‌సీఎల్‌లో పెరిగిన ఐసీఐసీఐ బ్యాంక్ వాటా రుణభారంలో ఉన్న ఇన్ఫ్రా సంస్థ ఐవీఆర్‌సీఎల్‌లో ఐసీఐసీఐ బ్యాంక్ తన వాటాను 11.43శాతానికి పెంచుకుంది. వ్యూహాత్మక రుణ పునర్వ్యవస్థీకరణ (ఎస్డీఆర్)లో భాగంగా 2015 జూన్ 25 నుంచి 2016 ఏప్రిల్ 13 మధ్యకాలంలో అదనంగా మరో 7.3 శాతం వాటాలు (సుమారు 3.9 కోట్ల షేర్లు) తీసుకోవడంతో బ్యాంకు వాటా పెరిగింది. అత్యంత ప్రభావిత బ్రాండ్ గూగుల్ దేశంలో అత్యంత ప్రభావితమైన బ్రాండ్‌గా గూగుల్ అవతరించింది. టాప్-10 ప్రభావిత బ్రాండ్ల జాబితాలో ఇది అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. గ్లోబల్ మార్కెట్ రీసెర్చ్ కంపెనీ ఇప్సో నివేదిక ప్రకారం.. గూగుల్ తర్వాతి స్థానాల్లో ఫేస్బుక్, జి-మెయిల్, మైక్రోసాఫ్ట్, శాంసంగ్, వాట్స్యాప్లు ఉన్నాయి. ఫ్లిప్‌కార్ట్ ఏడవ స్థానంలో, అమెజాన్ 8వ స్థానంలో ఉన్నాయి. దీని తర్వాతి స్థానాల్లో ఎస్బీఐ (9వ స్థానం), ఎయిర్టెల్ (10వ స్థానం) ఉన్నాయి. ఈ-కామర్స్ ఫిర్యాదులపై కమిటీ ఈ కామర్స్ వ్యాపార లావాదేవీలకు సంబంధించిన ఫిర్యాదుల పరిష్కారం కోసం ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేయనున్నది. ఈ కామర్స్ జోరుగా పెరుగుతోందని, అలాగే వినియోగదారుల ఫిర్యాదులు కూడా పెరుగుతున్నాయని, దీని నివారణ కోసం త్వరలో ఒక కమిటీని ఏర్పాటు చేస్తామని వినియోగదారుల వ్యవహారాల మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ చెప్పారు. జన్‌ధన్ ఖాతాల్లో రూ.36,000 కోట్లు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన జన్ ధన్ ఖాతాల్లోని డిపాజిట్ల విలువ రూ.36,000 కోట్లుగా ఉందని కేంద్ర మంత్రి జితేందర్ సింగ్ తెలిపారు. ప్రధాన్ మంత్రి జన్ ధన్ యోజనా కింద 28 కోట్ల బ్యాంకు అకౌంట్ల్లు ప్రారంభమయ్యాయని, వీటి ద్వారా బ్యాంకులు రూ.36,000 కోట్ల డి పాజిట్లను స్వీకరించాయని తెలిపారు. పెట్టుబడుల ఉపసంహరణ శాఖ పేరు ‘దీపం’ పెట్టుబడుల ఉపసంహరణ శాఖ (డీడీ)ను ఇకపై డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్మెంట్ (డీఐపీఏఎం- దీపం)గా వ్యవహరించనున్నారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణ నుంచి ఈక్విటీల్లో కేంద్రం పెట్టుబడుల నిర్వహణ వరకూ కార్యకలాపాల విస్తృతి నేపథ్యంలో దీనికి అనుగుణంగా శాఖ పేరు మార్చారు. టాటా స్టీల్ యూకేలో 25% వాటా తీసుకుంటాం! సంక్షోభంలో చిక్కుకున్న టాటా స్టీల్ యూకేను గట్టెక్కించే ప్రయత్నాల్లో అవసరమైతే 25% మేర వాటాలు కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని బ్రిటన్ వాణిజ్య మంత్రి సాజిద్ జావిద్ తెలిపారు. కార్యకలాపాల కొనుగోలుకు ముందుకొచ్చే సంస్థలకు మిలియన్ల కొద్దీ పౌండ్ల మేర రుణపరమైన ఉపశమనం కలిగించేందుకు కూడా సుముఖంగా ఉన్నట్లు వివరించారు. మార్కెట్లోకి బెంట్లీ ‘బెంటేగ’ అల్ట్రా లగ్జరీ కార్ల తయారీ కంపెనీ బెంట్లీ తాజాగా తన తొలి స్పోర్ట్సు యుటిలిటీ వాహనం ‘బెంటేగ’ను మార్కెట్లోకి విడుదల చేసింది. దీని ధర రూ.3.85 కోట్లు (ఎక్స్ షోరూమ్ ఢిల్లీ). ఎక్స్‌క్లూజివ్ మోటార్స్.. బెంట్లీ కంపెనీకి భారత్‌లోని డీలర్‌గా వ్యవహరిస్తోంది. ట్విన్ టర్బో చార్జ్డ్ 6 లీటర్ వీ12 పెట్రోల్ ఇంజిన్ కలిగిన బెంటేగ 0-100 కిలోమీటర్ల వేగాన్ని కేవలం 4.1 సెకన్లలో అందుకుంటుందని, ప్రపంచంలో ఇదే అత్యంత వేగవంతమైన లగ్జరీ ఎస్యూవీ అని పేర్కొంది. ఇక దీని టాప్ స్పీడ్ గంటకు 301 కిలోమీటర్లు. ‘సీఎన్ఎన్-ఐబీఎన్’ ఇక ‘సీఎన్ఎన్-న్యూస్18’ రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు చెందిన మీడియా సంస్థ ‘నెట్వర్క్18’ తన ఆంగ్ల న్యూస్ చానల్ ‘సీఎన్ఎన్-ఐబీఎన్’ను ‘సీఎన్ఎన్-న్యూస్18’గా రీబ్రాండ్ చేసింది. ఇందులో భాగంగా సంస్థ కొత్త పేరు, లోగో, స్టూడియోను ఆవిష్కరించింది. ఐపీఓకు హెచ్డీఎఫ్సీ స్టాండర్డ్ లైఫ్! హెచ్డీఎఫ్సీ స్టాండర్డ్ లైఫ్ సంస్థ ఐపీఓ ప్రయత్నాలను ప్రారంభించింది. భారత్‌లో తొలిసారిగా ఐపీఓకు వస్తున్న తొలి జీవిత బీమా సంస్థ ఇదేకానున్నది. ఈ ఐపీఓలో భాగంగా హెచ్డీఎఫ్సీ స్టాండర్డ్ లైఫ్‌లో తనకున్న61.65 శాతం వాటాలో 10 శాతం వాటాను హెచ్డీఎఫ్సీ విక్రయించనున్నది. ఐపీఓ వివరాలు వెల్లడి కానప్పటికీ, ఈ కంపెనీ ఐపీఓ కనీసం రూ.2,000 కోట్లు ఉంటుందని అంచనా. 2016-17లో అరశాతం రేటు కోత! ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2016-17) రెపో రేటు 50 బేసిస్ పాయింట్లు తగ్గే అవకాశం ఉందని ప్రపంచ ఆర్థిక సేవల దిగ్గజ సంస్థ- మోర్గాన్ స్టాన్లీ అభిప్రాయపడింది. తగిన వర్షపాతం, ద్రవ్యోల్బణం కట్టడి వంటి అంశాలు.. రేటు మరింత తగ్గింపునకు దోహదపడతాయని పేర్కొంది. డీల్స్.. * బికే బిర్లా గ్రూప్‌కు చెందిన ఫ్లాగ్ షిప్ కంపెనీ కేశోరామ్ ఇండస్ట్రీస్‌కు హరిద్వార్‌లో ఉన్న టైర్ల తయారీ యూనిట్‌ను జేకే టైర్ పూర్తి అనుబంధ సంస్థ జేకే టైర్ అండ్ జేకే ఏషియా పసిఫిక్ రూ.2,195 కోట్లకు కొనుగోలు చేసింది. * హీరో మోటోకార్ప్ చైర్మన్ పవన్ ముంజాల్, గూగుల్ ఇండియా హెడ్ రాజన్ ఆనందన్‌లు.. బైక్ ట్యాక్సీ అపరేటర్ ‘ర్యాపిడో’లో పెట్టుబడులు పెట్టారు. ఎంత మొత్తంలో ఇన్వెస్ట్ చేసింది వెల్లడించలేదు. * భారతీ ఎయిర్టెల్ తన టవర్ల విభాగమైన భారతీ ఇన్ఫ్రాటెల్లో 5 శాతం వాటాను విక్రయించాలని యోచిస్తోంది. బహిరంగ మార్కెట్ లావాదేవీల ద్వారా ఈ వాటా విక్రయంతో రూ.3,500 కోట్ల నుంచి రూ.4,000 కోట్లు సమీకరించాలని భారతీ ఎయిర్టెల్ యోచిస్తోందని సమాచారం. ఇన్ఫ్రాటెల్లో ఎయిర్‌టెల్‌కు 71.7 శాతం వాటా ఉంది. * నియంత్రణ సంస్థల నుంచి అన్ని అనుమతులు రావడంతో టెలికం టవర్ల నిర్వహణ సంస్థ వయోమ్ నెట్వర్క్స్ కొనుగోలు ప్రక్రియ పూర్తయినట్లు అమెరికన్ టవర్ కార్పొరేషన్ (ఏటీసీ) వెల్లడించింది. దాదాపు రూ. 7,635 కోట్లకు వయోమ్లో 51 శాతం వాటాలు కొనుగోలుకు గతేడాది అక్టోబర్ 21న ఏటీసీ ఒప్పందం కుదుర్చుకుంది. * పారిశ్రామిక దిగ్గజాలు అంబానీ సోదరుల సారథ్యంలోని రెండు టెలికం సంస్థల మధ్య 9 సర్కిళ్లలో స్పెక్ట్రం షేరింగ్ ఒప్పందానికి టెలికం విభాగం (డాట్) ఆమోదముద్ర వేసింది. దీని ప్రకారం ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ (ఆర్‌జియో), అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్‌కామ్) 9 సర్కిళ్లలో స్పెక్ట్రంను పంచుకునేందుకు వీలవుతుంది. -
గతవారం బిజినెస్
మందగించిన వాహన విక్రయాలు వాహన విక్రయాలు జనవరిలో మందగించాయి. దేశీయ విక్రయాల్లో మారుతీ సుజుకీ స్వల్ప వృద్ధిని సాధించగా, హ్యుందాయ్, ఫోర్డ్, మహీంద్రా కంపెనీలు ఒక్క అంకె వద్ధినే సాధించాయి. మరోవైపు టాటా మోటార్స్, హోండా కార్ప్ దేశీయ అమ్మకాలు క్షీణించాయి. కీలక రంగాల వృద్ధి 0.9 శాతం ఎనిమిది కీలక రంగాల గ్రూప్ 2015 డిసెంబర్లో కేవలం 0.9 శాతం వృద్ధిని నమోదు చేసుకుంది. 2014 ఇదే నెలలో ఈ వృద్ధి రేటు 3.2 శాతం. అయితే 2015 నవంబర్‌లో అసలు ఈ గ్రూప్‌లో అసలు వృద్ధి లేకపోగా క్షీణత (ఎనిమిది నెలల కనిష్టం, -1.3 శాతం క్షీణత) నమోదయ్యింది. ఈ ఎనిమిది రంగాల్లో బొగ్గు, క్రూడ్ ఆయిల్, సహజ వాయువులు, రిఫైనరీ ప్రొడక్టులు, ఎరువులు, స్టీల్, సిమెంట్, విద్యుత్ రంగాలు ఉన్నాయి. మొత్తం పారిశ్రామిక ఉత్పత్తిలో ఈ ఎనిమిది రంగాల వాటా 38 శాతం. యాపిల్‌ను దాటిన గూగుల్ ‘ఆల్ఫాబెట్’ మెరుగైన ఆర్థిక ఫలితాల నేపథ్యంలో ఇంటర్నెట్ దిగ్గజం గూగుల్ మాతృ సంస్థ ఆల్ఫాబెట్ ప్రపంచంలోనే అత్యధిక మార్కెట్ విలువ గల కంపెనీగా టెక్ సంస్థ యాపిల్‌ను అధిగమించింది. సోమవారం మార్కెట్ ముగిసిన తర్వాత జరిగిన లావాదేవీల్లో షేరు ధర ప్రకారం ఆల్ఫాబెట్ మార్కెట్ విలువ ఏకంగా 570 బిలియన్ డాలర్లకు ఎగసింది. యాపిల్ మార్కెట్ విలువ 535 బిలియన్ డాలర్లు. నేడు క్విక్ హీల్ ఐపీఓ సాఫ్ట్వేర్ సంస్థ క్విక్ హీల్ టెక్నాలజీస్ తన ఐపీఓకు రూ.311-321ను ధరల శ్రేణిగా నిర్ణయించింది. ఈ నెల 8న ప్రారంభమై, 10న ముగిసే ఈ ఐపీఓ ద్వారా రూ.250 కోట్లు సమీకరించాలని క్విక్ హీల్ టెక్నాలజీస్ యోచిస్తోంది. ఈ ఐపీఓకు బుక్ రన్నింగ్ లీడ్ మేనేజర్లుగా ఐసీఐసీఐ సెక్యూరిటీస్, జెఫరీస్ ఇండియా, జేపీ మోర్గాన్ ఇండియాలు, రిజిష్ట్రార్‌గా లింక్ ఇన్‌టైమ్ ఇండియాలు వ్యవహరిస్తున్నాయి. ప్రభుత్వ బ్యాంకులకు రూ.5,000 కోట్లు! ప్రభుత్వ రంగ (పీఎస్‌యూ) బ్యాంకులకు ప్రస్తుత త్రైమాసికంలో (జనవరి-మార్చి) ప్రభుత్వం రూ.5,000 కోట్లు తాజా మూలధనంగా ఇవ్వనుంది. ఆర్థిక సేవల కార్యదర్శి ఏసీ దుగ్గల్ ఈ విషయం తెలిపారు. బ్యాంక్ బ్యాలెన్స్ షీట్ల పటిష్టత లక్ష్యంగా కేంద్రం ఈ చర్య తీసుకోనుందని ఆయన వెల్లడించారు. పాలసీ రేట్లు యథాతథం అందరి అంచనాలకు అనుగుణంగానే ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్.. కీలక పాలసీ వడ్డీరేట్లలో ఎలాంటి మార్పులూ చేయకుండా యథాతథంగా కొనసాగిస్తున్నట్లు ప్రకటించారు. రాను న్న బడ్జెట్లో నిర్మాణాత్మక సంస్కరణలపై ప్రభుత్వం చేపట్టే చర్యలు, స్థూల ఆర్థిక అంశాలకు అనుగుణంగా భవిష్యత్తులో వడ్డీరేట్ల తగ్గింపు ఆధారపడి ఉంటుందని స్పష్టం చేశారు. వృద్ధి మందగమనం, ద్రవ్యోల్బణం పెరుగుదల రిస్కులు కూడా ఆర్బీఐ తాజా నిర్ణయానికి కారణాలుగా నిలిచాయి. అత్యంత శక్తివంతమైన బ్రాండ్ టీసీఎస్ ఐటీ సర్వీసుల్లో ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన బ్రాండ్‌గా టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్)నిలిచింది. అంతర్జాతీయ ప్రముఖ బ్రాండ్ వేల్యూయేషన్ కంపెనీ బ్రాండ్ ఫైనాన్స్ రూపొందించిన 2016 వార్షిక జాబితాలో తమకు ఈ ఘనత దక్కిందని టీసీఎస్ తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా వేలాది బ్రాండ్లను పరిగణనలోకి తీసుకొని ఈ జాబితాను బ్రాండ్ ఫైనాన్స్ తయారు చేసింది. ఆసియా షేర్ల జాబితాలో 3 దేశీ షేర్లు సిటీ రీసెర్చ్ సంస్థ రూపొందించిన ఆసి యా షేర్ల జాబితాలో మూడు భారత షేర్లకు చోటు దక్కింది. ఈ ఏడాది దృష్టి పెట్టాల్సిన ఆసియా షేర్ల జాబితాను సిటీ రీసెర్చ్ తయారు చేసింది. 13 షేర్లతో రూపొందించిన ఈ జాబితాను 18 షేర్లకు విస్తరించామని సిటీ రీసెర్చ్ పేర్కొంది. రిలయన్స్ ఇండస్ట్రీస్, యాక్సిస్ బ్యాంక్, అరబిందో ఫార్మా.. షేర్లకు ఈ జాబితాలో చోటు దక్కింది. ప్రాణాధార ఔషధ దిగుమతులపై కొరడా! లైఫ్ సేవింగ్స్ డ్రగ్స్ (ప్రాణాధార ఔషధాలు) దిగుమతులపై కేంద్రం కస్టమ్స్ సుంకాల మినహాయింపుల్ని ఉపసంహరించుకుంది. ఈ ఔషధాలపై 16 నుంచి 20% వరకూ కస్టమ్స్ సుంకాలను విధించనున్నట్లు కూడా సమాచారం. ‘మేకిన్ ఇండియా’ కార్యక్రమంలో భాగంగా దేశంలోనే కీలక ఔషధాల ఉత్పత్తి వృద్ధి లక్ష్యంలో భాగంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. డీల్స్.. * వర్చువల్ ఎగ్జిబిషన్ల నిర్వహణ నిమిత్తం ప్రాపర్టీ పోర్టల్ హౌసింగ్.కామ్ సంస్థ ఐసీఐసీఐ ప్రాపర్టీ సర్వీసెస్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. * తక్షణ నగదు బదిలీ సేవల కోసం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో ఒమన్ యూఏఈ ఎక్స్చేంజ్ చేతులు కలిపింది. ఒమన్‌లో నివసించే ఖాతాదారులు.. భారత్‌లోని ఏ ఎస్బీఐ ఖాతాకైనా తక్షణం నగదును బదిలీ చేసేందుకు ఉపయోగపడేలా ఫ్లాష్రెమిట్ సర్వీసులు ఉపయోగపడతాయని ఒమన్ యూఏఈ ఎక్స్చేంజ్ తెలిపింది. * విద్యుత్ ఆదా చేసే ఎల్ఈడీ బల్బులను రూ. 99కే విక్రయించే దిశగా ప్రభుత్వ రంగ ఎనర్జీ ఎఫీషియెన్సీ సర్వీసెస్ (ఈఈసీఎల్)తో ఆన్లైన్ రిటైల్ సంస్థ స్నాప్‌డీల్ ఒప్పందం కుదుర్చుకుంది. * చిత్ర నిర్మాణం కోసం అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ ఎంటర్టైన్మెంట్.. నీరజ్ పాండే, శీతల్ భాటాయాల ఫ్రైడే ఫిల్మ్‌వర్క్స్ ఒక జాయింట్ వెంచర్‌ను ఏర్పాటు చేశాయి. ప్లాన్ సి స్టూడియోస్ పేరుతో ఏర్పాటు చేసిన ఈ జేవీలో ఇరు సంస్థలకు 50:50 శాతం వాటాలున్నాయి. * ఎస్సార్ కంపెనీ ముంబైలోని బిజినెస్ పార్క్‌ను విక్రయిం చింది. ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్(బీకేసీ)లో 1.25 మిలియన్ల చదరపుటడుగుల విస్తీర్ణమున్న ఈక్వినాక్స్ బిజి నెస్ పార్క్‌ను బెంగళూరుకు చెందిన రియల్టీ సంస్థ ఆర్ఎంజీ కార్ప్‌కు విక్రయించామని ఎస్సార్ కంపెనీ తెలిపింది. ఈ డీల్ విలువ రూ.2,400 కోట్లు. * అమెరికాకు చెందిన ట్యాక్సీ అగ్రిగేటర్ ఉబెర్, ఆర్థిక సంస్థలు, బ్యాంకులతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. తమ భాగస్వామ్య డ్రైవర్లకు వాహన రుణాల కోసం బ్యాంకులు, ఆర్థిక సంస్థలతో భాగస్వామ్యం కుదుర్చుకున్నామని ఉబెర్ తెలిపింది. * ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ, పర్యాటక సేవలు అందించే థామస్ కుక్ కంపెనీతో జతకట్టి... ‘థామస్ కుక్ హాలిడే అకౌంట్’ పేరిట కొత్త రికరింగ్ డిపాజిట్ పథకాన్ని అందుబాటులోకి తెచ్చింది. * అమెరికాకు చెందిన జీఈ అప్లయెన్సెస్ వ్యాపారాన్ని చైనాకు చెందిన హయర్ గ్రూప్ కొనుగోలు చేసింది. -
గతవారం బిజినెస్
ఎయిర్టెల్ ప్రత్యేక మైక్రో-వెబ్సైట్ భారతీ ఎయిర్టెల్ కంపెనీ ప్ర త్యేకమైన మైక్రో-వెబ్‌సైట్‌ను సోమవారం ప్రారంభించింది. ఎయిర్టెల్ నెట్వర్క్ కవరేజ్ లైవ్ స్టేటస్‌ను ఈ ప్రత్యేకమైన వెబ్సైట్ తెలియజేస్తుంది. అంతేకాకుండా ఈ వెబ్సైట్ కంపెనీ సైట్ విస్తరణ ప్రాజెక్ట్ పురోగతిని వెల్లడిస్తుంది. కాల్ డ్రాప్‌ల విషయంలో విమర్శలు బాగా పెరుగుతున్న నేపథ్యంలో ఎయిర్టెల్ ఈ ప్రత్యేక వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తెస్తుండడం విశేషం. అలాగే కంపెనీ.. తాజాగా వింక్ గేమ్స్ పేరిట గేమింగ్ యాప్‌ను ఆవిష్కరించింది. రుణ రేటు తగ్గించిన హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ప్రైవేటు బ్యాంకింగ్‌లో రెండో స్థానంలో ఉన్న హెచ్డీఎఫ్సీ బ్యాంక్... తన కనీస రుణ (బేస్) రేటును స్వల్పంగా 0.05 శాతం తగ్గించింది. దీనితో ఈ రేటు 9.30 శాతానికి తగ్గింది. ఇది బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) రేటుకు సరిసమానం. బ్యాంకులు తమ రుణ మంజూరీలకు ఈ రేటునే బేస్‌గా తీసుకుంటాయి. ఇంతకన్నా తక్కువ రేటుకు రుణాలివ్వవు. రుణ రేటు తగ్గింపు వల్ల దీనితో అనుసంధానమైన గృహ, వాహన, విద్యా రుణ రేటు కొంతమేర తగ్గే అవకాశం ఉంది. ప్రతిభా సింటెక్స్‌కు లక్ష డాలర్ల జరిమానా పైరేటెడ్ సాఫ్ట్వేర్ ఉపయోగించినందుకు గాను దేశీ టెక్స్టైల్స్ కంపెనీ ప్రతిభా సింటెక్స్ సంస్థ భారీ మూల్యం చెల్లించాల్సి వస్తోంది. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కి చెందిన ఈ సంస్థను... 30 రోజుల్లోగా 1,00,000 డాలర్ల (సుమారు రూ. 66 లక్షలు) జరిమానా కట్టాలంటూ అమెరికా కోర్టు ఆదేశించింది. రూ.40,000 కోట్లతో ఇన్ఫ్రా నిధి మౌలిక రంగ ప్రాజెక్టులకు నిధులు సమకూర్చే లక్ష్యంతో కేంద్రం రూ. 40,000 కోట్ల జాతీయ పెట్టుబడి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ (ఎన్ఐఐఎఫ్)ను ఏర్పాటు చేసింది. ఎన్‌ఐఐఎఫ్‌కు బడ్జెట్ నుంచి ప్రభుత్వం రూ.20,000 కోట్ల మేర కేటాయింపులు జరపనుండగా, ప్రై వేట్ ఇన్వెస్టర్ల నుంచి మరో రూ. 20,000 కోట్లు వస్తాయని అంచనా. కొత్త వాటితో పాటు నిలిచిపోయిన ప్రాజెక్టులు, విస్తరణ ప్రాజెక్టులకు నిధులు సమకూర్చేందుకు కేంద్రం దీన్ని ఏర్పాటు చేస్తోంది. వరంగల్‌లో ఇన్ఫోసిస్ క్యాంపస్! టెక్నాలజీ కంపెనీ ఇన్ఫోసిస్ వరంగల్‌లో క్యాంపస్‌ను ఏర్పాటు చేయాలని భావిస్తోంది. ఫిబ్రవరిలో కంపెనీ అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది. కంపెనీకి అతిపెద్ద క్యాంపస్ అయిన పోచారం కేంద్రాన్ని అదే నెలలో ప్రారంభిస్తోంది. మైసూరు సెంటర్ మాదిరిగా ఇంజనీరింగ్ పూర్తయిన తాజా గ్రాడ్యుయేట్లకు వరంగల్ కేంద్రంలో శిక్షణ ఇస్తారు. నాలుగు ఎఫ్‌డీఐ ప్రతిపాదనలకు ఆమోదం విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డ్(ఎఫ్ఐపీబీ) రూ.1,810 కోట్ల విలువైన నాలుగు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల(ఎఫ్‌డీఐ) ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. వీటిలో హెచ్డీఎఫ్సీ స్టాండర్ట్ లైఫ్ ఇన్సూరెన్స్ కూడా ఉంది. ఫైర్ పై ్ల నెట్వర్క్స్ లిమిటెడ్, సాఫ్ట్వేర్ ఈజ్ కరెక్ట్ తదితర ప్రతిపాదనలకు కూడా ఆమోదం లభించింది. తగ్గిన యునెటైడ్ స్పిరిట్స్ నెట్‌వర్త్ యునెటైడ్ స్పిరిట్స్ కంపెనీ నెట్‌వర్త్ నాలుగేళ్లలో సగానికి పైగా హరించుకుపోయింది. పలు కారణాల వల్ల తమ నెట్‌వర్త్ ఈ స్థాయిలో తగ్గిపోయిందని యునెటైడ్ స్పిరిట్స్ తెలిపింది. తమ ప్రమోటర్ గ్రూప్ సంస్థ యునెటైడ్ బ్రూవరీస్(హోల్డింగ్స్) రుణాలకు కేటాయింపులు జరపడం, తదితర కారణాల వల్ల తమ నెట్‌వర్త్ తగ్గిందని పేర్కొంది. ఎస్సార్ డీలిస్టింగ్ పూర్తి ఎస్సార్ ఆయిల్ డీలిస్టింగ్ పూర్తయింది. వాటాదారులకు డీలిస్టింగ్ ప్రక్రియ కింద రూ.3,745 కోట్లు చెల్లించామని ఎస్సార్ ఆయిల్ తెలిపింది. భారత కార్పొరేట్ చరిత్రలో ఇదే అతి పెద్ద డీలిస్టింగ్. డీలిస్టింగ్ పూర్తవడానికి 9.26 కోట్ల షేర్లు అవసరమని, ఓపెన్ ఆఫర్ ద్వారా 10.1 కోట్ల షేర్లను సమీకరించామని ఎస్సార్ గ్రూప్ వ్యవస్థాపక చైర్మన్ శశి రుయా చెప్పారు. 1995లో ఐపీఓకు వచ్చిన ఎస్సార్ ఆయిల్ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ అప్పుడు రూ.2,000కోట్లుగా ఉంది. డీలిస్టింగ్ ధర(రూ.263)ను పరిగణనలోకి తీసుకుంటే ఇప్పుడు ఆ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.38,000 కోట్లకు పెరిగింది. 1.7 శాతం పెరిగిన విదేశీ రుణ భారం భారత్ విదేశీ రుణ భారం ఏప్రిల్-సెప్టెంబర్ మధ్య 1.7 శాతం పెరిగింది. మార్చి 2015 ముగింపుతో పోల్చితే, సెప్టెంబర్ వరకూ గడచిన ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఆరు నెలల కాలంలో విదేశీ రుణం 8 బిలియన్ డాలర్లు పెరిగి 483.2 బిలియన్ డాలర్లకు చేరిందని గురువారం విడుదలైన గణాంకాలు తెలిపాయి. వాణిజ్య రుణాల వంటి దీర్ఘకాలిక విదేశీ రుణం, ఎన్ఆర్ఐ డిపాజిట్లు పెరగడం విదేశీ రుణం పెరగడానికి కారణమని ఆర్థిక మంత్రిత్వశాఖ ఒక ప్రకటనలో తెలిపింది. లక్ష్యంలో 87 శాతానికి ద్రవ్యలోటు ప్రభుత్వ ఆదాయం-వ్యయాలకు మధ్య వ్యత్యాసానికి సంబంధించిన ద్రవ్యలోటు 2015-16 బడ్జెట్ లక్ష్యంలో 87 శాతానికి చేరింది. ఈ మేరకు ఏప్రిల్-నవంబర్ మధ్య గణాంకాలను అధికార వర్గాలు విడుదల చేశాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యలోటు లక్ష్యం 5.55 లక్షల కోట్లు. స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో ఈ మొత్తం 3.9 శాతానికి మించకూడదన్నది విధానం. ఎనిమిది మౌలిక రంగాల గ్రూప్ ‘మైనస్’ ఎనిమిది పారిశ్రామిక రంగాల గ్రూప్ ఉత్పత్తి 2015 నవంబర్‌లో పూర్తి నిరాశను మిగిల్చింది. 2014 నవంబర్‌తో పోల్చిచూస్తే... ఉత్పత్తిలో అసలు వృద్ధిలేకపోగా 1.3 శాతం క్షీణత (మైనస్)ను నమోదుచేసుకుంది. గడచిన ఏడు నెలల కాలంలో ఇంత దారుణమైన ఫలితం ఎన్నడూ రాలేదు (ఏప్రిల్‌లో 0.4 శాతం క్షీణత). మొత్తం పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ)లో ఈ ఎనిమిది పరిశ్రమల గ్రూప్ వాటా దాదాపు 38 శాతం. గ్రామాల్లోనూ బ్యాంక్ శాఖలు! సుమారు 5,000 మంది పైగా జనాభా గల ప్రతి గ్రామంలోనూ 2017 మార్చి నాటికల్లా బ్యాంకు శాఖలు ఏర్పాటు చేయాలని రిజర్వ్ బ్యాంక్ నిర్ణయించింది. ఇందుకోసం తమ తమ రాష్ట్రాల్లో అటువంటి గ్రామాలను గుర్తించాలని రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ (ఎస్ఎల్బీసీ)లకు సూచించింది. అందరినీ ఆర్థిక సేవల పరిధిలోకి తెచ్చేందుకు శాఖల ఏర్పాటు అవసరమని ఆర్బీఐ అందులో పేర్కొంది. డీల్.. టెలికాం దిగ్గజం భారతీ ఎయిర్టెల్... అగరె వెర్లైస్ కంపెనీలో మొత్తం వంద శాతం వాటాను కొనుగోలు చేసింది. మధ్యప్రదేశ్‌లో(చత్తీస్‌గఢ్ రాష్ట్రంతో కలుపుకొని) 4జీ స్పెక్ట్రమ్ ఉన్న అగరె వెర్లైస్ కంపెనీలో ఎయిర్టెల్ ఇటీవల 74 శాతం వాటాను కొనుగోలు చేయగా, తాజాగా 26 శాతం వాటాను చేజిక్కించుకుంది. దీంతో అగరె వెర్లైస్..తమ పూర్తి అనుబంధ కంపెనీగా మారిందని భారతీ ఎయిర్టెల్ పేర్కొంది. ఈ డీల్ విలువ రూ.150 కోట్లు ఉండొచ్చని సమాచారం. ప్రభుత్వ రంగ అతిపెద్ద విద్యుత్ యంత్రాల తయారీ సంస్థ భెల్ సీఎండీగా అతుల్ సోబ్టి పదవీ బాధ్యతలు చేపట్టారు. -
గతవారం బిజినెస్
క్షీణతలోనే టోకు ద్రవ్యోల్బణం టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం వరుసగా 12వ నెలలోనూ అసలు పెరక్కపోగా... మైనస్‌లోనే కొనసాగింది. అక్టోబర్‌లో -3.81 శాతంగా నమోదయ్యింది. సెప్టెంబర్‌లో ఈ రేటు -4.54 శాతం. 2014 ఇదే నెలలో ఈ రేటు 1.66 శాతంగా ఉంది. దేశంలో టోకు ధరల సూచీ అసలు పెరక్కపోవడానికి కారణాల్లో అంతర్జాతీయ కమోడిటీ ధరలు కనిష్ట స్థాయిల్లో ఉండడం ఒకటి. త్వరలో ఎస్బీఐ ‘బటువా’ వాలెట్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) త్వరలో సాధారణ మొబైల్ ఫోన్లలో పనిచేసే మొబైల్ వాలెట్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. బిల్లు చెల్లింపులు, నగదు బదిలీ వంటి అన్ని రకాల నగదు చెల్లింపుల లావాదేవీలను నిర్వహించుకునే విధంగా ‘బటువా’ పేరుతో ఈ వాలెట్‌ను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు ఎస్బీఐ ఎండీ (నేషనల్ బ్యాంకింగ్ గ్రూప్) రజనీష్ కుమార్ తెలిపారు. ఎగుమతులు పదకొండవ‘సారీ’ ఎగుమతుల క్షీణ ధోరణి వరుసగా 11వ నెలా కొనసాగింది. వాణిజ్య మంత్రిత్వశాఖ గణాంకాల ప్రకారం.. 2014 అక్టోబర్ ఎగుమతుల విలువతో పోల్చితే 2015 అక్టోబర్‌లో ఎగుమతులు అసలు పెరక్కపోగా 17.5 శాతం క్షీణించాయి. విలువలో 25.89 బిలియన్ డాలర్ల నుంచి 21.36 బిలియన్ డాలర్లకు పడిపోయాయి. అంతర్జాతీయంగా డిమాండ్ మందగమనం దీనికి ప్రధాన కారణం. మ్యాగీ నూడుల్స్‌పై సుప్రీంకు ఎఫ్ఎస్ఎస్ఏఐ మ్యాగీ నూడుల్స్ నిషేధ సంక్షోభం నుంచి ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న నెస్లే ఇండియాను.. సమస్యలు మళ్లీ చుట్టుముడుతున్నాయి. మ్యాగీ నూడుల్స్‌పై నిషేధాన్ని ఎత్తివేస్తూ బాంబే హైకోర్టు ఉత్తర్వులివ్వడాన్ని సవాలు చేస్తూ ఆహార పదార్థాల నాణ్యతా ప్రమాణాల నియంత్రణ సంస్థ ఎఫ్ఎస్ఎస్ఏఐ.. తాజాగా సుప్రీం కోర్టుకు వెళ్లింది. పరీక్షల కోసం ల్యాబొరేటరీలకు కంపెనీ ఇచ్చిన శాంపిల్స్ నాణ్యతపై సందేహాలు వ్యక్తం చేసింది. పైగా.. తాజా శాంపిల్స్‌ను అందించే పనిని హైకోర్టు తటస్థ సంస్థకు కాకుండా వాటిని తయారు చేసే నెస్లేకు అప్పగించడాన్ని ఎఫ్ఎస్ఎస్ఏఐ తన పిటీషన్లో సవాలు చేసింది. పెరుగుతున్న ఈక్విటీ ఎంఎఫ్ ఖాతాలు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసే ఇన్వెస్టర్ల సంఖ్య పెరుగుతోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ఏడు నెలల కాలంలో కొత్తగా 24 లక్షల మంది ఇన్వెస్టర్లు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ అకౌంట్లు ప్రారంభించారని మార్కెట్ నియంత్రణ సంస్థ సెబి తెలిపింది. గత ఆర్థిక సంవత్సరం మొత్తం మీద 25 లక్షల కొత్త ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ అకౌంట్లు మాత్రమే ప్రారంభమయ్యాయని పేర్కొంది. కాగా ఈ ఏడాది అక్టోబర్ 31నాటికి డీమ్యాట్ అకౌంట్ల సంఖ్య 1.02 కోట్లకు పెరిగిందని సీడీఎస్ఎల్ తెలిపింది. జెట్, ఇండిగో, స్పైస్‌జెట్‌లకు జరిమానా విమానయాన రంగంలో అనుచిత వ్యాపార విధానాలపై కొరడా ఝుళిపిస్తూ.. కాంపిటీషన్ కమిషన్ (సీసీఐ).. మూడు దిగ్గజ సంస్థలపై భారీ జరిమానా విధించింది. సరకు రవాణాకు సంబంధించి ఇంధన సర్‌చార్జి నిర్ణయించడంలో కుమ్మక్కయ్యాయన్న ఆరోపణల మీద జెట్ ఎయిర్వేస్, ఇండి గో, స్పైస్‌జెట్ సంస్థలు మొత్తం రూ. 258 కోట్లు పెనాల్టీ కట్టాలని ఆదేశించింది. కొత్త మొబైల్ కనెక్షన్లలో భారత్ టాప్ దేశంలో మొబైల్ వినియోగదారుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. ఇతర ప్రపంచ దేశాల కన్నా అధికంగా, భారత్‌లో మొబైల్ వినియోగదారుల సంఖ్య జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో నికరంగా కొత్తగా 1.3 కోట్లు పెరిగింది. ఈ పెరుగుదల చైనాలో 70 లక్షలుగా, అమెరికాలో 60 లక్షలుగా, మయన్మార్‌లో 50 లక్షలుగా, నైజీరియాలో 40 లక్షలుగా ఉంది. ఇదే సమయంలో ప్రపంచ వ్యాప్తంగా 8.7 కోట్ల మంది కొత్తగా మొబైల్ కనెక్షన్లను తీసుకున్నారు. కాగా దేశంలో టెలిఫోన్ వినియోగదారుల సంఖ్య ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి 102.26 కోట్లకు చేరినట్లు ట్రాయ్ తెలిపింది. బెయిలవుట్ నిధుల కోసం గ్రీస్ డీల్ దాదాపు 12 బిలియన్ యూరోల బెయిలవుట్ రుణ మొత్తం విడుదలకు సంబంధించి రుణదాతలతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు గ్రీస్ వెల్లడించింది. దీని కింద మరో 48 సంస్కరణలను గ్రీస్ అమలు చేయాల్సి ఉంటుంది. వీటిని గ్రీస్ పార్లమెంటు గురువారం ఆమోదించిన వెంటనే బెయిలవుట్ మొత్తాన్ని విడుదల చేయడం జరుగుతుందని యూరోగ్రూప్ చీఫ్ జెరోన్ తెలిపారు. కోల్ ఇండియా డిజిన్వెస్ట్మెంట్కు ఓకే దాదాపు రూ. 69,500 కోట్ల బృహత్తర డిజిన్వెస్ట్‌మెంట్ లక్ష్యాన్ని సాధించే దిశగా కోల్ ఇండియాలో 10 శాతం వాటాల విక్రయానికి కేంద్రం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ప్రస్తుతం కోల్ ఇండియా మార్కెట్ విలువ ప్రకారం.. దీని ద్వారా కేంద్ర ఖజానాకు కనీసం రూ. 21,138 కోట్లు సమకూరగలవని కేంద్ర బొగ్గు, విద్యుత్ శాఖల మంత్రి పియుష్ గోయల్ చెప్పారు. కంపెనీలో ప్రభుత్వానికి 79.65 శాతం వాటాలు ఉన్నాయి. మరోవైపు, రూ. 10 ముఖవిలువ గల 3,39,84,000 ఈక్విటీ షేర్లతో కొచ్చిన్ షిప్‌యార్డు (సీఎస్ఎల్) ఐపీవో ప్రతిపాదనకు క్యాబినెట్ ఓకే చేసింది. పసిడి పథకానికి స్పందన అంతంతే.. కేంద్రం ఇటీవల అట్టహాసంగా ప్రారంభించిన బంగారం డిపాజిట్ పథకానికి అంతంత మాత్రం స్పందనే కనిపిస్తోంది. దీని కింద ఇప్పటిదాకా 400 గ్రాముల మేర మాత్రమే పసిడి డిపాజిట్లు వచ్చాయి. వజ్రాభరణాల ఎగుమతి ప్రోత్సాహక మండలి జీజేఈపీసీ ఉత్తరాది రీజియన్ చైర్మన్ అనిల్ శంఖ్వాల్ ఈ విషయం తెలిపారు. ప్రస్తుతమున్న 13,000 మంది బీఐఎస్ సర్టిఫైడ్ జ్యుయలర్లందరూ కూడా పసిడి కలెక్షన్ ఏజెంట్లుగా వ్యవహరించేందుకు అనుమతులిస్తే ఈ ప్రయోగం విజయవంతం అయ్యే అవకాశాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. వ్యవసాయ రుణ లక్ష్యం 11.57 శాతం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో బ్యాంకులు తమ వద్ద ఉండే నిధుల్లో కనీసం 11.57 శాతం మొత్తాన్ని.. నేరుగా కార్పొరేట్యేతర రైతులకు రుణాలుగా ఇవ్వాలని రిజర్వ్ బ్యాంక్ ఆదేశించింది. 20 పైగా శాఖలు ఉన్న విదేశీ బ్యాంకులు ఎప్పటిలాగే ఆర్బీఐ ఆమోదం మేరకు తమ తమ ప్రణాళికలను అమలు చేయాల్సి ఉంటుంది. ప్రాధాన్యత రంగానికి నిర్దేశించిన రుణ వితరణ లక్ష్యాన్ని సాధించని బ్యాంకులపై జరిమానాలు ఉంటాయని రిజర్వ్ బ్యాంక్ పేర్కొంది. విదేశీ మారక నిల్వలు పెరిగాయ్.. భారత్ విదేశీ మారకపు నిల్వలు నవంబర్ 13తో ముసిగిన వారాంతానికి 352.515 బిలియన్ డాలర్లకు ఎగశాయి. అంతక్రితం వారం (నవంబర్ 6)తో పోల్చితే 781 మిలియన్ డాలర్లు పెరిగాయి. నవంబర్ 6తో ముగిసిన వారంలో విదేశీ మారకపు నిల్వలు 1.9 బిలియన్ డాలర్లు తగ్గి, 351.734 బిలియన్ డాలర్లకు పడ్డాయి. కార్పొ ట్యాక్స్ తగ్గింపునకు రోడ్‌మ్యాప్ వచ్చే నాలుగేళ్లలో కార్పొరేట్ ట్యాక్స్‌ను క్రమేపీ 30 శాతం నుంచి 25 శాతానికి తగ్గించడానికి... ఇతర పన్ను మినహాయింపుల్ని రద్దుచేయడానికి సంబంధించిన ముసాయిదాను కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు విడుదల చేసింది. చిన్నతరహా పరిశ్రమలకు కొత్త ఫండ్ సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు తమ ఉత్పత్తిలో పర్యావరణ కాలుష్యానికి తావులేని అత్యాధునిక సాంకేతిక పరికరాల కొనుగోలుకు కేంద్రం ఒక ప్రత్యేక ఫండ్‌ను ఏర్పాటు చేసింది. డీల్స్.. భారత్ ప్రముఖ టైర్ల తయారీ సంస్థ అపో లో టైర్స్.. జర్మనీలోని ప్రముఖ టైర్ పంపిణీ దిగ్గజ సంస్థల్లో ఒకటైన రిఫిన్‌కమ్ జీఎం బీహెచ్ను కొనుగోలు చేసింది. ఒప్పందం విలువ దాదాపు రూ.301 కోట్లు (45.6 మిలియన్ యూరోలు). * మౌలిక రంగ దిగ్గజం రిలయన్స్ ఇన్ఫ్రా (ఆర్ఇన్ఫ్రా) సంస్థ .. ముంబై పరిసర ప్రాంతానికి సంబంధించిన తమ విద్యుత్ వ్యాపార విభాగంలో 49 శాతం వాటాలను కెనడాకు చెందిన పీఎస్పీ ఇన్వెస్ట్మెంట్స్కి విక్రయించనుంది. డీల్ విలువ సుమారు రూ. 3,500 - రూ. 4,000 కోట్ల దాకా ఉంటుందని అంచనా. * జీవిత బీమా వ్యాపార విభాగం ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్‌లో ఆరు శాతం వాటాలను రూ. 1,950 కోట్లకు విక్రయించాలని ఐసీఐసీఐ బ్యాంక్ నిర్ణయించింది. ఇందులో 4 శాతం వాటాలను ప్రేమ్‌జీ ఇన్వెస్ట్‌కు, రెండు శాతం వాటాలను కంపాస్వేల్ ఇన్వెస్ట్మెంట్స్ సంస్థకు విక్రయించనున్నట్లు పేర్కొంది. * అంతర్జాతీయ ఆతిథ్య రంగంలో భారీ డీల్‌కు తెరతీసింది మారియట్ ఇంటర్నేషనల్ సంస్థ. 12.2 బిలియన్ డాలర్లకు స్టార్‌వుడ్ హోటల్స్ అండ్ రిసార్ట్స్ వరల్డ్వైడ్ను కొనుగోలు చేయనున్నట్లు ప్రకటించింది. * మొబైల్ యాప్ సంస్థ టాస్క్బక్స్లో టైమ్స్ గ్రూప్‌లో భాగమైన టైమ్స్ ఇంటర్నెట్.. మెజారిటీ వాటాలు దక్కించుకుంది. ఇందుకోసం 15 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 99 కోట్లు) ఇన్వెస్ట్ చేసినట్లు టైమ్స్ ఇంటర్నెట్ తెలిపింది. * రెలిగేర్ ఎంటర్ప్రైజెస్ సంస్థ మ్యూచువల్ ఫండ్ వ్యాపారం నుంచి వైదొలుగుతోంది. రెలిగేర్ ఇన్వెస్కో ఏంఎసీలో తనకున్న 51 శాతం వాటాను విదేశీ భాగస్వామి ఇన్వెస్కోకు విక్రయించనున్నది. -
గతవారం బిజినెస్
డిమాండ్ ఎగువకు..ధర దిగువకు.. భారత్‌లో పసిడి డిమాండ్ ఈ ఏడాది మూడవ త్రైమాసికంలో (జూలై-సెప్టెంబర్) వార్షిక ప్రాతిపదికన 13 శాతం పెరిగింది. ఈ పరిమాణాన్ని 268 టన్నులుగా వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ పేర్కొంది. త్రైమాసికం ప్రారంభంలో ధరలు తక్కువగా ఉండడం, పెళ్లిళ్లు, పండుగల సీజన్ డిమాండ్ పెరగడానికి కారణం. కాగా పసిడి ధర ఢిల్లీలో మూడు నెలల కనిష్ట స్థాయికి దిగింది. ఢిల్లీలో 10 గ్రాములకు 24, 22 క్యారెట్ల బంగారం ధరలు రూ.25,950, రూ.25,800 చొప్పున నమోదయ్యాయి. ఎన్ఈసీ బ్లాక్‌లో విక్రయానికి నికో వాటాలు నిధుల కొరతతో అల్లాడుతున్న నికో రిసోర్సెస్ .. ఎన్ఈసీ-25 గ్యాస్ బ్లాక్ నుంచి వైదొలగాలని నిర్ణయించింది. ఇందులో తనకున్న 10% వాటాలను భాగస్వామ్య సంస్థలు రిలయన్స్ ఇండస్ట్రీస్, బీపీకి విక్రయించనున్నట్లు 2016 రెండో త్రైమాసికం ఆర్థిక ఫలితాల వెల్లడి సందర్భంగా తెలిపింది. ఎన్ఈసీ-25 బ్లాక్ లో 60% వాటాలతో రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రధాన ఆపరేటర్‌గా ఉంది. బీపీకి 30%, నికో రిసోర్సెస్‌కు 10%వాటాలు ఉన్నాయి. ప్రపంచ వృద్ధి చోదకంగా భారత్ రానున్న కాలంలో భారత్ కూడా చైనాలా ప్రపంచ ఆర్థిక వృద్ధిలో కీలక పాత్ర పోషించనుంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు వృద్ధి చోదకంగా నిలువగలిగే సత్తా భారత్‌కు ఉందని, కానీ దీని కోసం ఇన్ఫ్రా లేమి, లింగ వివక్ష, విద్యుత్ కొరత వంటి ఇతరత్రా సవాళ్లను అధిగమించాల్సి ఉందని ఎకనమిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ (ఈఐయూ) తెలిపింది. ఫార్చ్యూన్ బిజినెస్ లీడర్ల జాబితాలో మనోళ్లు బిజినెస్ మ్యాగజైన్ ఫార్చ్యూన్ రూపొందించిన ప్రపంచ టాప్ 50 బిజినెస్ లీడర్ల జాబితాలో భారత సంతతికి చెందిన అజయ్ బంగా, ఫ్రాన్సిస్ డి సౌజా, సత్య నాదెళ్లకు చోటు దక్కింది. ఈ జాబితాలో మాస్టర్‌కార్డ్ అజయ్ బంగా ఐదవ స్థానంలో, కాగ్నిజంట్ ఫ్రాన్సిస్ డిసౌజా 16 వ స్థానంలో మైక్రోసాఫ్ట్ నాదెళ్ల 47వ స్థానంలో నిలిచారు. ఈ జాబితాలో నైక్ కంపెనీకి చెందిన మైక్ పార్కర్ అగ్రస్థానంలో, ఫేస్బుక్ మార్క్ జుకరబర్గ్ రెండో స్థానంలో ఉన్నారు. విమానాల్లో బ్యాగేజ్ బాదుడు జీరో బ్యాగేజ్ చార్జీ ఆఫర్లు ప్రకటించేందుకు దేశీ విమానయాన సంస్థలకు డీజీసీఏ అనుమతినిచ్చింది. ఒకవేళ ఇలాంటి ఆఫర్లో టికెట్ పొందినవారు ప్రయాణ సమయంలో చెకిన్ బ్యాగేజ్‌తో వచ్చిన పక్షంలో నిర్దేశిత చార్జీలు వసూలు చేసుకునేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. చెకిన్ బ్యాగేజ్ ఉండని ప్రయాణికులకు.. డిస్కౌంట్లు ఇచ్చేలా జీరో బ్యాగేజ్ ఆఫర్లకు అనుమతించాలంటూ ఇండిగో, సై్పస్‌జెట్, ఎయిర్ఏషియా ఇండియా సంస్థలు గతంలోనే కోరినప్పటికీ తిరస్కరించిన డీజీసీఏ తాజాగా ఈ ప్రతిపాదనకు ఆమోదముద్ర వేసింది. ఇంకా ఇబ్బందుల్లోనే ఆర్థిక వ్యవస్థ ఆర్థిక వ్యవస్థకు ఇబ్బందులు తొలగిపోలేదని గురువారం విడుదలైన తాజా పారిశ్రామిక ఉత్పత్తి, రిటైల్ ద్రవ్యోల్బణం గణాంకాలు పేర్కొంటున్నాయి. వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం అక్టోబర్‌లో 5 శాతంగా నమోదయ్యింది. ఇక సెప్టెంబర్ పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ) కేవలం 3.6 శాతం వృద్ధిని నమోదు చేసుకుంది. పౌండ్ల రూపంలో బాండ్ల జారీకి ఎయిర్టెల్ రెడీ! దేశీయ టెలికాం దిగ్గజం భారతీ ఎయిర్టెల్ రూ.5,000 కోట్ల(50 కోట్ల గ్రేట్ బ్రిటన్ పౌండ్) స్టెర్లింగ్ బాండ్లను జారీ చేయనున్నది. ఈ బాండ్లను లండన్ స్టాక్ ఎక్స్ఛేంజ్లో లిస్ట్ చేస్తామని ఎయిర్టెల్ గ్రూప్ కోశాధికారి హర్జిత్ కోహ్లి చెప్పారు. ఈ బాండ్ల జారీ ద్వారా సమీకరించిన మొత్తంతో ప్రస్తుతమున్న రుణాలను రీ ఫైనాన్స్ చేస్తామని చెప్పారు. బాండ్లు జారీ ఎప్పుడనే విషయాన్ని త్వరలో తెలియజేస్తామన్నారు. ఆలీబాబా రికార్డ్ స్థాయి అమ్మకాలు చైనా ఈ కామర్స్ దిగ్గజం ఆలీబాబా బుధవారం రికార్డ్ స్థాయి ఆన్లైన్ అమ్మకాలు సాధించింది. ప్రతీ ఏడాది నవంబర్ 11న వచ్చే వార్షిక సింగిల్స్ డే సందర్భంగా 1,433 కోట్ల డాలర్ల ఆన్లైన్ అమ్మకాలు సాధించామని ఆలీబాబా తెలిపింది. ఇది ప్రపంచంలోనే ఒక్క రోజులో అత్యధికంగా ఆన్లైన్ అమ్మకాలు సాధించిన రోజని పేర్కొంది. గత ఏడాది సింగిల్స్ డే అమ్మకాలతో పోల్చితే ఈ ఏడాది 60% వృద్ధి సాధించామని తెలిపింది. 15 రంగాల్లో ఎఫ్‌డీఐ నిబంధనల సడలింపు కేంద్రం.. పౌర విమానయానం, బ్యాంకింగ్, రిటైల్, న్యూస్ చానళ్లు తదితర 15 రంగాల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల నిబంధనలను సవరించింది. డీటీహెచ్, కేబుల్ నెట్వర్క్, ఐదు ప్లాంటేషన్ పంటల సాగులో 100% ఎఫ్‌డీఐలకు కేంద్రం అనుమతించింది. ఇక న్యూస్, కరెంట్ అఫైర్స్ చానళ్లలో ఎఫ్‌డీఐ పరిమితిని 26% నుంచి 49%కి పెంచింది. రక్షణ, సింగిల్ బ్రాండ్ రిటైల్ రంగంలో ఎఫ్‌డీఐ నిబంధనలను సడలించింది. షేర్ల విభజనకు నాట్కో ఆమోదం రూ. 10 ముఖ విలువ కలిగిన షేరును రూ.2గా విభజించడానికి నాట్కో కంపెనీ బోర్డు ఆమోదం తెలిపింది. దీనికి రికార్డు తేదీ నవంబర్ 28గా నిర్ణయించారు. నవంబర్ 28 నాటికి షేర్లు కలిగిన వాటాదారులకు ప్రతీ షేరుకు 5 షేర్లు వస్తాయి. ఈ ఏడాది భారత్ వృద్ధి రేటు 7.3 శాతం! అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ భారత్ వృద్ధి రేటును 2015లో 7.3% గా అంచనా వేస్తోంది. 2016లో ఈ రేటు 7.5%గా ఉంటుందన్నది పేర్కొం ది. ఇదే జరిగితే ప్రపంచంలోనే వేగం గా అభివృద్ధి చెందుతున్న దేశంగా చైనాను భారత్ అధిగమిస్తుం ది. 2015లో చైనా వృద్ధి రేటును 6.8%గా ఐఎంఎఫ్ అంచనా వేస్తోంది. 2016లో ఈ రేటు 6.3%గా ఉంటుందని పేర్కొంది. థామస్‌కుక్ నుంచి తొలి ఫారెక్స్ యాప్ విదేశీ మారక లావాదేవీలన్నీ ఒకే చోట నిర్వహించుకునే వెసులుబాటు కల్పిస్తూ.. భారత్‌లో తొలిసారి ‘ఫారిన్ ఎక్స్చేంజ్ యాప్’ను ప్రవేశపెట్టినట్టు థామస్‌కుక్ తెలిపింది. ఇందులో డాలర్, ఫ్రాంక్, యూరో తదితర ప్రధాన కరెన్సీల మారక విలువలను ఎప్పటికప్పుడు పొందుపరుస్తామని పేర్కొంది. రేట్లలో హెచ్చుతగ్గుల వల్ల నష్టపోకుండా ఈ యాప్‌లో ‘బ్లాక్ మై రేట్’ అనే ఆప్షన్‌ను ఏర్పాటు చేశామని వివరించింది. ఇండిగో.. లాభాల టేకాఫ్.. విమానయాన సంస్థ ఇండిగో మాతృ కంపెనీ ఇంటర్గ్లోబల్ ఏవియేషన్ షేరు స్టాక్ మార్కెట్లో లాభాలతో లిస్టయింది. ఇష్యూ ధర రూ.765తో పోలిస్తే 12% లాభంతో రూ.856 వద్ద బీఎస్ఈలో లిస్టయింది. ఇంట్రాడేలో 17% వృద్ధితో రూ.898ని తాకిన ఈ షేరు చివరకు 15% లాభంతో రూ.878 వద్ద ముగిసిం ది. ఎన్ఎస్ఈలో 14.6% లాభంతో రూ.877 వద్ద ముగిసింది.