lease deals
-
భళా హైదరాబాద్
న్యూఢిల్లీ: కార్యాలయ స్థలాల (ఆఫీస్ స్పేస్) మార్కెట్లో సందడి నెలకొంది. 2024లో ఈ మార్కెట్లో లీజు లావాదేవీలు గణనీయంగా పెరిగాయి. హైదరాబాద్‌లో 37 శాతం వృద్ధితో 123 లక్షల చదరపు అడుగుల (ఎస్ఎఫ్టీ) స్థూల లీజింగ్ లావాదేవీలు నమోదయ్యాయి. 2023లో 90 లక్షల ఎస్ఎఫ్టీ మేర లావాదేవీలు జరగడం గమనార్హం. హైదరాబాద్ సహా దేశవ్యాప్తంగా ఎనిమిది ప్రధాన నగరాల్లో 885 లక్షల చదరపు అడుగుల (ఎస్ఎఫ్టీ) విస్తీర్ణం మేర స్థూల లీజింగ్ 2024లో నమోదైనట్టు కుష్మన్ అండ్ వేక్ఫీల్డ్ నివేదిక వెల్లడించింది. అంతకుముందు ఏడాది 746 లక్షల ఎస్ఎఫ్టీతో పోల్చి చూస్తే 19 శాతం వృద్ధి నమోదైనట్టు తెలిపింది. ‘‘భారత ఆఫీస్ మార్కెట్‌కు 2024 నిర్ణయాత్మకమైనది. రికార్డు స్థాయిలో లీజింగ్ నమోదైంది. ఆఫీస్ స్పేస్‌కు అంతర్జాతీయంగా భారత్ బలమైన వృద్ధి మార్కెట్ అని మరోసారి నిరూపితమైంది’’అని కుష్మన్ అండ్ వేక్ఫీల్డ్ ఇండియా సీఈవో అన్షుల్ జైన్ పేర్కొన్నారు. గ్లోబల్ కేపబులిటీ సెంటర్లు (జీసీసీలు) పెరుగుతుండడం బహుళజాతి సంస్థలకు భారత్ వ్యూహాత్మక ప్రాధాన్యమైనదిగా తెలియజేస్తున్నట్టు పేర్కొన్నారు. ఆఫీస్ స్పేస్ డిమాండ్‌లో 30 శాతం డిమాండ్ జీసీసీల నుంచే వస్తోంది. ‘‘2025లో గ్రేడ్–ఏ ఆఫీస్ స్పేస్ డిమాండ్ బలంగా ఉండనుంది. అంతర్జాతీయ ఆఫీస్ మార్కెట్లో భారత్ ఆధిపత్యం బలపడనుంది’’అని జైన్ అంచనా వేశారు. తాజా లావాదేవీలు, రెన్యువల్ అన్నీ స్థూల లీజింగ్ కిందకే వస్తాయి. పట్టణాల వారీగా లీజింగ్.. → బెంగళూరులో 259 లక్షల చదరపు అడుగుల స్థూల లీజింగ్ లావాదేవీలు 2024లో నమోదయ్యాయి. అంతకుముందు ఏడాది లీజింగ్ పరిమాణం 158.3 లక్షల చదరపు అడుగులుగా ఉంది. అత్యధికంగా 64 శాతం వృద్ది ఇక్కడ నమోదైంది. → ముంబైలో స్థూల లీజింగ్ 27 శాతం పెరిగి 178.4 లక్షల చదరపు అడుగులకు చేరింది. → అహ్మదాబాద్‌లో 11 శాతం అధికంగా 18.1 లక్షల ఎస్ఎఫ్టీ లీజు లావాదేవీలు జరిగాయి. → ఢిల్లీ ఎన్సీఆర్లో మాత్రం క్రితం ఏడాదితో పోలి్చతే 3 శాతం తక్కువగా 131.4 లక్షల చదరపు అడుగుల లీజింగ్ లావాదేవీలు నమోదయ్యాయి. → పుణెలో 84.7 లక్షల ఎస్ఎఫ్టీ లీజింగ్ రికార్డు అయింది. 2023లో లీజు పరిమాణం 97.4 లక్షల ఎస్ఎఫ్టీతో పోల్చితే 13 శాతం తగ్గింది. → కోల్‌కతా ఆఫీస్ మార్కెట్లో 17 లక్షల చదరపు అడుగుల లీజు లావాదేవీలు నమోదయ్యాయి. అంతకుముందు ఏడాదితో పోల్చితే స్థిరంగా కొనసాగింది. → ఐటీ–బీపీఎం, ఇంజనీరింగ్ అండ్ తయారీ, బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సరీ్వసెస్, ఇన్సూరెన్స్ (బీఎఫ్ఎస్ఐ) రంగాలు ఆఫీస్ స్పేస్ డిమాండ్‌లో ప్రముఖ పాత్ర పోషించాయి. → మొత్తం స్థూల లీజింగ్‌లో కోవర్కింగ్ ఆపరేటర్లు 14 శాతం తీసుకున్నారు. ప్రాపర్టీ యజమానుల నుంచి ఆఫీస్ స్పేస్ లీజు తీసుకుని, కార్పొరేట్లు, ఇతరులకు వీరు లీజుకు ఇవ్వనున్నారు. తగ్గిన ఖాళీ స్థలాలు.. 2024లో వాణిజ్య రియల్ ఎస్టేట్‌లో రికార్డు స్థాయి లావాదేవీలు నమోదైనట్టు, ఖాళీ స్థలాలు గణనీయంగా తగ్గినట్టు ముంబైకి చెందిన రహేజా కార్ప్ ఎండీ, సీఈవో వినోద్ రోహిరా తెలిపారు. మౌలిక వసతులకు ప్రాధాన్యం ఇచ్చే అన్ని పట్టణాల్లోనూ వాణిజ్య రియల్ ఎస్టేట్‌లో వృద్ధి నమోదైనట్టు చెప్పారు. గ్రేడ్ ఏ ఆఫీస్ స్పేస్‌కు డిమాండ్ ఇక ముందూ కొనసాగుతుందన్నారు. -
ఆఫీస్ లీజింగ్ పెరిగింది
న్యూఢిల్లీ: కార్యాలయాల లీజింగ్ స్థలం పెరిగిందని రియల్టీ కన్సల్టెంట్ కొలియర్స్ ఇండియా తెలిపింది. ‘ఆరు ప్రధాన నగరాల్లో 2022 ఏప్రిల్–జూన్‌లో స్థూలంగా 1.47 కోట్ల చదరపు అడుగుల విస్తీర్ణంలోని స్థలాన్ని ఆఫీసులు లీజుకు తీసుకున్నాయి. అంత క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది రెండున్నర రెట్లకు పైమాటే. ఈ ఏడాది జనవరి–జూన్‌లో ఆఫీస్ లీజింగ్ రెండున్నర రెట్లు అధికమై 2.75 కోట్ల చదరపు అడుగులకు చేరింది. డిసెంబర్‌కల్లా ఇది 4–4.5 కోట్ల చదరపు అడుగులకు చేరుకోవచ్చని అంచనా. డిమాండ్ పెరగడంతో అద్దెలు సైతం దూసుకెళ్తాయి. హైదరాబాద్ మార్కెట్లో ఏప్రిల్–జూన్‌లో స్థూల లీజింగ్ స్థలం 23 లక్షల చదరపు అడుగులకు చేరింది. 2021 ఏప్రిల్–జూన్‌లో ఇది 7 లక్షల చదరపు అడుగులు. జనవరి–జూన్‌లో ఇది 11 లక్షల నుంచి 45 లక్షల చదరపు అడుగులకు ఎగసింది’ అని కొలియర్స్ వివరించింది. -
గార్డెన్ సిటీ కిందికి నిజాం నగరం పైకి!
సాక్షి, హైదరాబాద్: తొలిసారిగా దేశీయ కార్యాలయాల స్థలాల లావాదేవీలలో బెంగళూరు కంటే హైదరాబాద్‌లో ఎక్కువగా జరిగాయి. కరోనా మహమ్మారి ప్రభావం నుంచి హైదరాబాద్ ఆఫీస్ స్పేస్ విభాగం శరవేగంగా కోలుకుంటోంది. ఈ ఏడాది జూలై– సెప్టెంబర్ మూడో త్రైమాసికం (క్యూ3)లో హైదరాబాద్‌లో 25 లక్షల చ.అ. కార్యాలయ స్థల లావాదేవీలు జరగగా.. బెంగళూరులో 21 లక్షల చ.అ. లీజు కార్యకలాపాలు జరిగాయి. ఇదే సమయంలో భాగ్యనగరంలో 32 లక్షల చ.అ. స్పేస్ సరఫరాలోకి రాగా.. బెంగళూరులో కేవలం 9 లక్షల చ.అ. స్పేస్ అందుబాటులోకి వచ్చింది. 2021 క్యూ3లో దేశవ్యాప్తంగా 1.03 కోట్ల చ.అ. ఆఫీస్ లావాదేవీలు జరిగాయని కొల్లియర్స్ మార్కెట్ రీసెర్చ్ తెలిపింది. క్రితం త్రైమాసికంతో పోలిస్తే ఇది 89 శాతం వృద్ధి రేటు. క్యూ3లోని మొత్తం లావాదేవీలలో ఐటీ హబ్‌లైన హైదరాబాద్, బెంగళూరు, పుణే నగరాల వాటా 62 శాతంగా ఉంది. రెండు డోసుల వ్యాక్సిన్ వేసుకున్న వారి సంఖ్య పెరగడం, కంపెనీలు వర్క్ ఫ్రం ఆఫీస్ పునఃప్రారంభిస్తుండటం వంటి కారణాలతో దేశీయ కార్యాలయాల మార్కెట్‌కు డిమాండ్ పెరుగుతుందని కొల్లియర్స్ ఇండియా ఎండీ, సీఈఓ రమేష్ నాయర్ తెలిపారు. రాయదుర్గం, హైటెక్ సిటీల్లోనే.. కరోనా సెకండ్ వేవ్ నిర్మాణ రంగంపై పెద్దగా ప్రభావం చూపించలేదు. ఇప్పటికే ఉన్న ఆఫీస్ స్పేస్ స్టాక్‌ను లీజుకు ఇవ్వడంపై డెవలపర్లు దృష్టి పెట్టారు. హైదరాబాద్‌లోని మొత్తం లావాదేవీలలో బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సరీ్వసెస్ అండ్ ఇన్సూరెన్స్ (బీఎఫ్ఎస్ఐ), ఫ్లెక్సిబుల్ వర్క్‌ప్లేస్ వాటా 66 శాతంగా ఉన్నాయి. రాయదుర్గంలో అత్యధికంగా 53 శాతం లీజు కార్యకలాపాలు జరిగాయి. హైటెక్‌సిటీలో 40 శాతం లీజు కార్యకలాపాలు జరిగాయి. సరఫరాలోనూ మనమే టాప్.. ఈ ఏడాది మూడో త్రైమాసికంలో కొత్తగా 1.08 కోట్ల చ.అ. ఆఫీస్ స్పేస్ సరఫరా జరిగింది. అత్యధికంగా హైదరాబాద్‌లో 29 శాతం, పుణేలో 25 శాతం సప్లయి జరిగింది. ఈ ఏడాది క్యూ3లోని మొత్తం లీజులలో ఫ్లెక్సిబుల్ వర్క్‌ప్లేస్ వాటా 26 శాతంగా ఉంది. ఈ విభాగంలో లావాదేవీలు పుణే తర్వాత హైదరాబాద్‌లో ఎక్కువగా జరిగాయి. -
కబంధ హస్తాల్లో మున్సిపల్ షాపులు
నెల్లూరు సిటీ: సొమ్మొకరిది..సోకొకరిది అన్నట్లుగా తయారైంది నగర పాలక సంస్థ మున్సిపల్ షాపుల పరిస్థితి. 20 ఏళ్లకుపైగా కొందరి కబంధ హస్తాల్లో మున్సిపల్ షాపులు కొనసాగుతున్నాయి. అధికార పార్టీ, రాజకీయ నాయకుల అండదండలతో షాపు లీజుదారులు కొనసాగుతున్నారు. బయట వ్యక్తులకు ఎక్కువ మొత్తానికి షాపులను అద్దెకు ఇచ్చి కార్పొరేషన్ ఆదాయానికి గండికొడుతున్నారు. మున్సిపల్ షాపులపై చర్యలు తీసుకునేందుకు అధికారులు సైతం వెనుకంజ వేస్తున్నారు. నెల్లూరు నగర పాలక సంస్థ పరిధిలో 14 మున్సిపల్ కాంప్లెక్స్‌లు ఉన్నాయి. అందులో 234 షాపులు ఉండగా, వాటిలో 64 షాపులు 20 ఏళ్లకు పైబడి కొందరి చేతుల్లో ఉన్నాయి. మరో 100 నుంచి 120 షాపులను పదేళ్లకుపైగా కొందరు బినామీలు నడుపుతున్నారు. మున్సిపల్ నిబంధనల ప్రకారం షాపు లీజుకు తీసుకుని మూడేళ్లు దాటితే వేలం పాట నిర్వహించాలి. అయితే ఈ నిబంధనలు అమలు కావడంలేదు. కార్పొరేషన్ రెవెన్యూ అధికారులు కొన్ని సార్లు వేలం పాటలు నిర్వహించేందుకు యత్నించినా బడాబాబులు, అధికార పార్టీ నాయకులు ఒత్తిళ్లతో అడ్డుకుని షాపు లీజుదారుడికే కట్టబెట్టుతున్నారనే విమర్శలు ఉన్నాయి. లీజుదారుడు ఒకరు.. బాడుగకు ఉండేది మరొకరు... మున్సిపల్ షాపులను లీజుకు తీసుకున్న వారు మాత్రమే షాపు నిర్వహణ చేయాలి. అయితే లీజుదారుడు కార్పొరేషన్‌కు తక్కువ బాడుగ చెల్లిస్తూ బయట వ్యక్తికి ఎక్కువ బాడుగలకు ఇస్తున్నారు. చిన్నబజారు, డైకాస్రోడ్డు, మద్రాసుబస్టాండు, గాంధీబొమ్మ సెంటర్లోని మున్సిపల్ కాంప్లెక్స్‌లో కొందరు షాపులను వేలం పాటలో రూ.5 నుంచి రూ.7వేలకు తీసుకుని, బయట వ్యక్తికి అదే షాపును రూ.10వేల నుంచి రూ.15వేలకు బాడుగకు ఇస్తున్నారు. వేలం పాటలు నిర్వహించపోవడంతో ఏటా లక్షల రూపాయల కార్పొరేషన్ ఆదాయానికి గండి పడుతోంది. మున్సిపల్ షాపుల వేలానికి అడ్డంకులు గతంలో పనిచేసిన కమిషన్ పీవీవీఎస్ మూర్తి కార్పొరేషన్ పరిధిలోని 25 ఏళ్ల లీజు నిండిన 65 షాపులకు వేలం పాట నిర్వహించేందుకు సన్నద్ధమయ్యారు. షాపుల వేలం పాట తేదీని సైతం ప్రకటించారు. అయితే ఆయా షాపుల లీజుదారులు కోర్టుకు వెళ్లడంతో తాత్కాలికంగా వేలం పాట నిలిపివేశారు. ఇది జరిగి ఒకటన్నర ఏడాది కావస్తున్నా అధికారులు అటు వైపుగా కన్నెత్తి చూడకపోవడం విశేషం. ఇప్పటికైనా కార్పొరేషన్ అధికారులు స్పందించి వేలం పాటలకు చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. షాపింగ్ కాంప్లెక్ పేరు షాపుల సంఖ్య ప్రకాశం పంతులు కాంప్లెక్స్ 18 సుబేదారుపేట కాంప్లెక్స్ 13 బీవీఎస్ఎం కాంప్లెక్స్ 16 పప్పులవీధి కాంప్లెక్స్ 24 ఏసీ భవన్ కాంప్లెక్స్ 12 పనుతల వారి కాంప్లెక్స్ 13 చిన్నబజారు కాంప్లెక్స్ 38 డైకాస్రోడ్డు 06 సౌదాన్య కాంప్లెక్స్ 15 డైకాస్రోడ్డు కాంప్లెక్స్ 05 ఏసీ విహార్ కాంప్లెక్స్ 05 ఏసీ సుబ్బారెడ్డి కాంప్లెక్స్ 22 -
బేరానికి బెజవాడ రైల్వే స్టేషన్
సాక్షి, అమరావతి : బెజవాడ రైల్వే స్టేషన్ బేరానికి ప్రైవేటు కంపెనీలు ‘టెండర్’ పెట్టాయి. లీజు గడువు 45 ఏళ్లు కాదు.. 99 ఏళ్లకు పొడిగిస్తేనే టెండర్లలో పాల్గొంటామని దక్షిణ మధ్య రైల్వేకు తేల్చి చెప్పాయి. దీంతో ప్రైవేటు కంపెనీల డిమాండ్ మేరకు దక్షిణ మధ్య రైల్వే అధికారులు రైల్వే బోర్డుకు తాజాగా నివేదిక పంపించారు. ఇది రైల్వేస్టేషన్లను ప్రైవేటుకు కట్టబెట్టడమేనని రైల్వే యూనియన్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విజయవాడ రైల్వే స్టేషన్‌కు పరిసరాలు, ఫ్లాట్ ఫాంలు అన్నీ కలిపి దాదాపు 22 ఎకరాలకు పైగా స్థలం ఉంది. రూ.195 కోట్లు విలువగా బెజవాడ స్టేషన్‌ను నిర్ధారించి, ఇందులో ప్రపంచ స్థాయి సదుపాయాలు కల్పించాలని రైల్వేశాఖ నిర్ణయించింది. ఈ మేరకు ప్రైవేటు కంపెనీలకు 45 ఏళ్ల పాటు లీజుకు అప్పగించాలని గత ఏడాది ప్రతిపాదించింది. 99 ఏళ్ల పాటు లీజుకు అయితే టెండర్లలో పాల్గొంటామని కంపెనీలు స్పష్టం చేశాయి. 45 ఏళ్లపాటు లీజుకు టెండర్లు రైల్వేల్లో ప్రైవేటు పెట్టుబడులు ఆహ్వానించేందుకు గాను రైల్వే మంత్రిత్వ శాఖ గతేడాది ప్రారంభంలో స్టేషన్ రీ డెవలప్మెంట్ (ఎస్ఆర్పీ) కార్యక్రమాన్ని అమలు చేసేందుకు నిర్ణయించింది. ఈ కార్యక్రమంలో భాగంగా రైల్వే స్టేషన్లను ప్రైవేటుకు అప్పగించడం ద్వారా నాన్ టిక్కెట్ రెవెన్యూ కింద రూ.లక్ష కోట్లు ఆర్జించేందుకు ప్రణాళికలు రూపొందించారు. దేశం మొత్తంలో 23 స్టేషన్లు ఎంపిక చేసిన రైల్వే శాఖ.. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో సికింద్రాబాద్, విజయవాడ రైల్వే స్టేషన్లు రీ డెవలప్మెంట్ కింద ప్రైవేటు కంపెనీలకు అప్పగించేందుకు నిర్ణయించారు. ఈ కార్యక్రమంలో రైల్వే స్టేషన్లో కమర్షియల్ స్థలంతో పాటు రైల్వేకు చెందిన ఖాళీ స్థలాలను 45 ఏళ్ల పాటు ప్రైవేటుకు లీజుకు అప్పగిస్తారు. వీటిలో ప్రయాణికులకు ప్రపంచ స్థాయి సౌకర్యాలను అందించేలా ప్రైవేటు కంపెనీలు నిర్మాణాలు చేపట్టాలి. రైల్వే స్టేషన్లోనే మల్టీప్లెక్స్ థియేటర్లు, హోటళ్లు, పార్కింగ్ ప్రదేశాలు, అధునాతన స్కానర్లు తదితరాలతో పాటు రైల్వే స్టేషన్‌ను ఓ ఐకానిక్ భవంతిలా తీర్చిదిద్దాలి. గతేడాది స్విస్ ఛాలెంజ్‌లో విజయవాడ రైల్వే స్టేషన్‌ను ప్రైవేటు కంపెనీలకు అప్పగించేందుకు టెండర్లు పిలిచారు. ప్రైవేటు కంపెనీలకు అప్పగించినందుకు గాను రైల్వేకు 45 ఏళ్ల పాటు లీజు విధానంలో మొత్తం రూ.195 కోట్లు చెల్లించాలి. లీజు గడువు ముగిసిన తర్వాత అభివృద్ధి చేసిన స్టేషన్‌ను తిరిగి రైల్వేకు అప్పగించాలి. 99 ఏళ్ల లీజు కావాలంటున్న కంపెనీలు విజయవాడ రైల్వే స్టేషన్‌ను రీ డెవలప్మెంట్ చేసేందుకు గాను గత ఏడాది స్విస్ ఛాలెంజ్ విధానంలో రైల్వే శాఖ టెండర్లు పిలిచింది. అయితే ఈ టెండర్లలో పాల్గొనేందుకు ప్రైవేటు కంపెనీలు ముందుకు రాలేదు. 45 ఏళ్ల పాటు లీజుకు కుదరదని, 99 ఏళ్ల పాటు లీజుకు అయితే టెండర్లలో పాల్గొంటామని ప్రీ బిడ్డింగ్ సమావేశంలో స్పష్టం చేశాయి. ఇదే విషయాన్ని విజయవాడ డివిజన్ రైల్వే ఉన్నతాధికారులు రైల్వే బోర్డుకు నివేదిక పంపించారు. రాష్ట్రంలోని ఆర్టీసీ స్థలాలను ప్రైవేటు కంపెనీలు 33 ఏళ్ల పాటు లీజుకు అంగీకరించి బీవోటీ విధానంలో బస్టాండ్లను అభివృద్ధి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రైల్వే స్థలాల అభివృద్ధి కోసం 99 ఏళ్ల పాటు లీజుకు ఇవ్వాలని కోరడం సమంజనం కాదని రైల్వే ఉన్నతాధికారులు అభిప్రాయపడుతున్నారు. దీనిపై రైల్వే బోర్డు ఏ విధంగా స్పందిస్తుందో చూడాల్సిందే. మరోవైపు చారిత్రాత్మక స్టేషన్‌గా, ఉత్తర, దక్షిణ భారతావనులను కలిపే జంక్షన్‌గా ఉన్న విజయవాడ రైల్వే స్టేషన్‌ను ప్రైవేటుకు అప్పగించడాన్ని రైల్వే యూనియన్ నేతలు వ్యతిరేకిస్తున్నారు. 1888 విజయవాడ రైల్వే స్టేషన్ నిర్మాణం జరిగిన సంవత్సరం 250 విజయవాడ మీదుగా రోజు రాకపోకలు సాగించే రైళ్లు రూ. 70 లక్షలు రోజుకు ఆదాయం రోజుకు ప్రయాణికుల ట్రాఫిక్ లక్ష భవనాల నిర్మాణ స్థలం: 3 ఎకరాలు 7.87 ఎకరాలు విజయవాడ రైల్వే స్టేషన్ వద్ద రిజర్వ్ స్థలం 8.81 ఎకరాలు ఫ్లాట్ ఫాంలు విస్తరించిన స్థలం సర్కులేటింగ్ ఏరియా: 1.90 ఎకరాలు ప్రైవేటుకు అప్పగించేందుకు రైల్వేశాఖ నిర్ణయించిన వ్యయం: రూ. 195 కోట్లు -
లీజు ఒప్పందాలపై స్టాంపు డ్యూటీ తగ్గింపు
సాక్షి, హైదరాబాద్: హేతుబద్ధీకరణలో భాగంగా పలు రకాల లీజు ఒప్పందాలపై స్టాంపు డ్యూటీని ప్రభుత్వం తగ్గించింది. ఇది గురువారం నుంచి అమల్లోకి రానుంది. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ముఖ్య కార్యదర్శి వీకే అగర్వాల్ బుధవారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. వివరాలిలా ఉన్నాయి... ఏడాది లోపు గడువున్న లీజు ఒప్పందాల రిజిస్ట్రేషన్‌కు ప్రస్తుతమున్న 4% స్టాంపు డ్యూటీలో ఎలాంటి మార్పూ లేదు ఏడాది నుంచి 5 ఏళ్ల లోపు లీజు ఒప్పందాల రిజిస్ట్రేషన్‌కు నివాస భవనాలకైతే ప్రస్తుతం మొత్తం అద్దెలో 0.4 శాతం స్టాంపు డ్యూటీగా ఉంది. కానీ ఇకపై వార్షిక సగటు అద్దెలో 0.5 శాతం చెల్లిస్తే సరిపోతుంది. నివాసానికి కాకుండా ఇతర అవసరాలకు తీసుకున్న లీజు ఒప్పందాలకు సగటు వార్షిక అద్దెలో 1 శాతం స్టాంపు డ్యూటీ చెల్లించాలి. 5 నుంచి 10 ఏళ్ల గడువున్న లీజు ఒప్పందాల రిజిస్ట్రేషన్‌కు నివాస భవనాలకు ప్రస్తుతం మొత్తం అద్దెలో 0.4 శాతం స్టాంపు డ్యూటీ ఉంది. దాన్ని ఇకపై వార్షిక సగటు అద్దెలో 1 శాతం చెల్లించాలి. ఇతర అవసరాలకు చేసుకున్న లీజు ఒప్పందాల రిజిస్ట్రేషన్‌కు వార్షిక సగటు అద్దెలో 2 శాతం చెల్లించాలి. 10 నుంచి 20 ఏళ్ల గడువున్న లీజు ఒప్పందాల రిజిస్ట్రేషన్‌కు ప్రస్తుతం మొత్తం అద్దెలో 0.6 శాతం స్టాంపు డ్యూటీ ఉంది. ఇకపై వార్షిక సగటు అద్దెలో 6 శాతం చెల్లిస్తే సరిపోతుంది. 20 నుంచి 30 ఏళ్ల లీజు ఒప్పందాల రిజిస్ట్రేషన్‌కు ప్రస్తుతం మొత్తం అద్దెలో 0.8 శాతం స్టాంపు డ్యూటీ ఉంది. అదిప్పుడు వార్షిక సగటు అద్దెలో 15 శాతానికి పరిమితం కానుంది. 30 ఏళ్లకు మించిన లీజు ఒప్పందాల రిజిస్ట్రేషన్‌కు ఆస్తి తాలూకు మొత్తం మార్కెట్ విలువలో 5 శాతం లేదా సగటు వార్షిక అద్దెకు 10 రెట్లలో ఏది ఎక్కువైతే అది ప్రస్తుతం అమల్లో ఉంది. ఇకపై లీజు ఒప్పందం చేసుకునే ఆస్తి మార్కెట్ విలువలో 3 శాతం చెల్లించాలి. మరికొన్ని రకాల ఒప్పందాల డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్లకు కూడా స్టాంపు డ్యూటీ స్వల్పంగా తగ్గింది