ప్రపంచ సౌభాగ్య సూచీలో భారత్‌కు 106 స్థానం
లండన్: అంతర్జాతీయ సౌభాగ్య సూచీలో భారత్ స్థానం మరింత దిగజారింది. గతేడాది 101 స్థానంలో ఉన్న మన దేశం ఈ ఏడాది 106కు పడిపోయింది. పొరుగు దేశాలైన చైనా, నేపాల్, శ్రీలంక, బంగ్లాదేశ్‌లు ఈ సూచీలో మనకంటే మెరుగైన స్థానంలో ఉన్నాయి. సౌభాగ్య సూచీలో భారత్ స్థానం దిగజారడానికి ప్రధాన కారణం.. అక్కడ అంత ‘సురక్షితమైన పరిస్థితులు’ లేకపోవడమేనని ఈ జాబితాను రూపొందించిన లండన్‌కు చెందిన లెగాటమ్ ఇన్స్టిట్యూట్ తెలిపింది.