line workers
-
పల్లెల్లో ఈతవనాలకు పెద్దపీట
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఈత వనాల పెంపకానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. గత ఏడాది మార్చిలో జరిగిన శాసనసభ సమావేశాల్లో సీఎం కేసీఆర్ హామీ ఇచ్చిన విధంగా ప్రతి గ్రామంలో ఈత వనాలు పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఉపాధి హామీ పథకం కింద ప్రత్యేక నర్సరీ లను ఏర్పాటు చేసి ఈత మొక్కలు పెంచాలని, రానున్న వర్షాకాలంలో హరితహారంలో భాగంగా వీటిని పెంచేందుకు స్థలాలు గుర్తించాలని కలెక్టర్లకు ఎక్సైజ్ శాఖ కమిషనర్ సోమేశ్‌కుమార్ ఇటీవల లేఖ రాశారు. వీలున్నంత త్వరగా ఏర్పాట్లు పూర్తి చేయాలని ఈ లేఖలో ఆయన ఆదేశించారు. వనాల పెంపకం... వారి సంక్షేమం కోసమే.. గీత కార్మికుల సంక్షేమంలో భాగంగా ఈత వనాల పెంపకాన్ని ప్రభుత్వం తొలి ప్రాధాన్యంగా ఎంచుకున్నట్టు అర్థమవుతోంది. అందులో భాగంగానే ఎక్సైజ్ కమిషనర్ జిల్లా కలెక్టర్లకు రాసిన లేఖలో ప్రతి గ్రామంలో ఖచ్చితంగా 3 వేల నుంచి 6 వేల ఈత మొక్క లు నాటేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఆ గ్రామంలో గీతకార్మికులున్నారా లేదా అనే దానితో సంబంధం లేకుండా చెట్లు పెంచాలని, గీత కార్మికులు ఎక్కువగా ఉండే గ్రామాల్లో వారి అవసరాలకు అనుగుణంగా ఈ సంఖ్యను పెంచాలని తెలిపారు. ఈత వనాల పెంపకానికి గ్రామీణాభివృద్ధి, ఎక్సైజ్ శాఖ, ఉద్యాన, రెవెన్యూ, అటవీ అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించింది. -
రిజర్వాయర్ పనుల శంకుస్థాపనలో ఉద్రిక్తత
తమకు ప్రత్యామ్నాయం చూపాలని అడ్డుకున్న గీతకార్మికులు నిరసనల మధ్యనే శంకుస్థాపన చేసిన మంత్రి చందూలాల్ జఫర్‌గఢ్: వరంగల్ జిల్లా జఫర్‌గఢ్ మండలంలో ఉప్పుగల్లు రిజర్వాయర్ శంకుస్థాపన తీవ్ర ఉద్రిక్తతల నడుమ సాగింది. రిజర్వాయర్ వల్ల ఉపాధి కోల్పోతున్న తమను ఆదుకునేందుకు స్పష్టమైన హామీ ఇచ్చేంత వరకు పనులు ప్రారంభించవద్దంటూ గీత కార్మికులు అడ్డుతగిలారు. ఒకవైపు గీత కార్మికులు నిరసన వ్యక్తం చేస్తుండగానే గిరిజన సంక్షేమ శాఖ మంత్రి చందులాల్ రిజర్వాయర్ పనులకు శంకుస్థాపన చేశారు. దేవాదుల ప్రాజెక్టులో భాగంగా ఉప్పుగల్లు గ్రామాన్ని ఆనుకొని రిజర్వాయర్‌ను నిర్మించేందుకు ప్రభుత్వం రూ.300 కోట్లు మంజూరు చేసింది. ఈ రిజర్వాయర్ నిర్మాణ వల్ల ఉప్పుగల్లు గ్రామానికి చెందిన రైతుల వ్యవసాయ భూములతో పాటు గీత కార్మికుల తాటి చెట్లు ముంపునకు గురవుతున్నాయి. ఇప్పటికే ముంపునకు గురయ్యే భూములపై సర్వే నిర్వహించడంతో పాటు భూములు కోల్పోయే కొంతమంది రైతులకు ప్రభుత్వం నుంచి పరిహారం వచ్చింది. అయితే తాటిచెట్ల విషయంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదు. దీంతో వీటిపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్న గీత కార్మికులు ఉపాధి కోల్పోతున్నారు. ఈ విషయం తేలకుండానే ప్రజాప్రతినిధులు రిజర్వాయర్ నిర్మాణ పనుల శంకుస్థాపనకు పూనుకున్నారు. ఈ విషయాన్ని ముందే తెలుసుకున్న గీత కార్మికులు పెద్ద సంఖ్యలో మోకు ముత్తాదులతో శిలఫలకం వద్దకు చేరుకుని నిరసన చేపట్టారు. తాటి చెట్ల వల్ల ఉపాధి కోల్పోతున్న తమను ఆదుకునే విషయంలో ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ ఇచ్చిన తరువాతనే పనులకు శంకుస్థాపన చేయాలని డిమాండ్ చేశారు. రిజర్వాయర్ పనులకు శంకుస్థాపన చేయకుండా అడ్డుతగిలారు. వారిని నివారించేందుకు పోలీసులు ప్రయత్నం చేయగా గీత కార్మికులతో వారితో వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో వారి ఇరువురి మధ్య తోపులాట జరిగింది. నియోజకవర్గ ఎమ్మెల్యే రాజయ్యకు వ్యతిరేకంగా గీతకార్మికులు పెద్ద పెట్టున నినాదాలు చేశారు. ఒక ఒక వైపు గీతా కార్మికులు తమ నిరసన వ్యక్తం చేస్తుండగానే మంత్రి చందులాల్ రిజర్వాయర్ పనులకు శంకుస్థాపన చేశారు. సభ జరగకుండా పలుమార్లు అడ్డుకున్నారు. పోలీసులు వారిని అక్కడి నుంచి బలవంతంగా బైటకు పంపించారు. ఈ సమయంలో ఎమ్మెల్యే రాజయ్యతో పాటు ఇదే గ్రామస్తుడైన వర్దన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ రిజర్వాయర్ వల్ల నష్టపోతున్న గీత కార్మికులను అన్ని విధాలుగా అదుకుంటామని హామీ ఇచ్చారు. -
పండగ పూటా పస్తులే!
తిరుపతి రూరల్: ప్రభుత్వ నిర్ణయాలు పండుటాకులను ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. పింఛన్ పెరిగిందని ఆనందించిన అసహాయులకు అదీ అందని ద్రాక్షలా మారుతోంది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తూన్న జన్మభూమి-మాఊరు కార్యక్రమానికి జనం ఉండరని జిల్లాలో పింఛన్ల పంపిణీని శనివారం అర్ధంతరంగా నిలిపివేశారు. దీంతో జిల్లావ్యాప్తంగా వేలాదిమంది వితంతువులు, వికలాంగులు, వృద్ధులు, చేనేత, గీత కార్మికులు, అభయహస్తం పింఛన్‌దారులు పండుగ పూట పస్తులుండాల్సిన పరిస్థితి. వీరందరికీ జన్మభూమి ప్రారంభం తర్వాతే పింఛన్లు పంపిణీ చేయనున్నారు. ఇస్తూ.. ఇస్తూ.. జిల్లాలో సెప్టెంబర్ వరకు దాదాపు నాలుగు లక్షలకు పైగా పింఛన్ లబ్ధిదారులు ఉన్నారు. అనర్హుల ఏరివేత పేరుతో టీడీపీ నేతల కనుసన్నల్లో చే పట్టిన సర్వేలో పింఛన్ల జాబితా నుంచి 84,617 మందిని ఇప్పటికే తొలగించారు. వీరికి అక్టోబర్ నుంచి పింఛన్లు నిలిపివేశారు. మిగిలిన వారికి ఐదు రెట్లు పింఛన్ పెంచాం అంటూ జన్మభూమి కార్యక్రమంలో అందించారు. కొన్ని పంచాయతీల్లో జన్మభూమి ఆలస్యం కావడంతో పింఛన్ కోసం లబ్ధిదారులు ఆధికార పార్టీ నేతలను నిలదీయడం మొదలుపెట్టారు. దీంతో జన్మభూమితో పనిలేకుండా మూడు రోజులుగా పింఛన్లు అందిస్తున్నారు. కాని ఈ నెల 25 నుంచి మళ్లీ జన్మభూమి కార్యక్రమం పునఃప్రారంభం కానుంది. అందరికీ పింఛన్లు అందిస్తే సభలకు జనంరారనే అనుమానం అధికార పార్టీ నేతలకు వచ్చింది. అనుకున్నదే తడవుగా పింఛన్ల పంపిణీ నిలిపివేయాలని అధికారులపై ఒత్తిడి తెచ్చారు. దీంతో శనివారం జిల్లా వ్యాప్తంగా పింఛన్ల పంపిణీని పోస్టుమాస్టర్లు నిలిపివేశారు. అభాగ్యుల ఆవేదన పెరిగిన పింఛన్ చేతికి వస్తుందని వేయి కళ్లతో ఎదురు చూస్తున్న అభాగ్యులకు ప్రభుత్వ నిర్ణయం పిడుగుపాటుగా మారింది. పింఛన్‌కు, జన్మభూమికీ లింకు పెడుతూ దానిని అందకుండా చేస్తుండడంతో మండిపడుతున్నారు. దీపావళికి ఇంట్లో పింఛన్ వెలుగులు వస్తాయని కొందరు, అనారోగ్యానికి అక్కరకు వస్తుందని మరికొందరు ఆశించినా వారికి నిరాశే మిగిలింది. ప్రభుత్వ ఆదేశాల మేరకే.. జన్మభూమి ఉన్న రోజునే పింఛన్లు ఇవ్వాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అందువలన పింఛన్ల పంపిణీ ఆపేశాం. తిరిగి జన్మభూమి జరిగే రోజు ఆయా గ్రామాల్లోని లబ్ధిదారులకు పింఛన్లు ఇస్తాం. - ఏపీడీ.శర్మ, పోస్టల్ సూపరింటెండెంట్, తిరుపతి