The list
-
నేడే విడుదల
ఏకాభిప్రాయం ఉన్న స్థానాల్లో అభ్యర్థుల ప్రకటన పోటాపోటీగా ఉన్న చోట్ల మరింత జాప్యం కాంగ్రెస్ జాబితాలో బండ కార్తీక... టీఆర్ఎస్ జాబితాలో బొంతు బస్తీల్లో ఎన్నికల ఊరేగింపులు. ప్రచారం కొత్తపుంతలు. హిమాయత్ నగర్లో ఓ పార్టీ అభ్యర్థి గంగిరెద్దుల వారి డప్పు వాయిస్తూ... ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. సిటీబ్యూరో: మహా నగర పాలక సంస్థ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితా శుక్రవారం విడుదల కానుంది. తెలంగాణ రాష్ట్ర సమితి సుమారు 51 డివిజన్లకు, కాంగ్రెస్ 40 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించేందుకు గురువారం కసరత్తు పూర్తి చేశాయి. ఎంఐఎం అదే బాటలో నడుస్తోంది. టీడీపీ-బీజేపీ కూటమి సీట్ల సర్దుబాటు పూర్తయిన స్థానాల్లో కొన్నిచోట్ల అభ్యర్థులను ప్రకటించే ందుకు యత్నిస్తోంది. తొలి జాబితాలో నియోజకవర్గాల ఇన్చార్జులుగా వ్యవహరిస్తున్న నాయకుల కుటుంబ సభ్యులతో పాటు మేయర్ అభ్యర్థులుగా రంగంలోకి దింపే వారి పేర్లను ప్రకటించనున్నారు. టీఆర్ఎస్ యువజన విభాగం అధ్యక్షుడు బొంతు రాంమోహన్‌ను చర్లపల్లి డివిజన్‌కు... ఎంపీ కేశవరావు కూతురు గద్వాల విజయలక్ష్మిని ఖైరతాబాద్ నియోజకవర్గంలోని బంజారాహిల్స్ లేదా వెంకటేశ్వర నగర్ డివిజన్లలో ఒకదానికి అభ్యర్థిగా ప్రకటించే అవకాశం ఉంది. ఇక కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే సుమారు 40 మందితో ఇచ్చే తొలి జాబితాలో ఏకాభిప్రాయం వచ్చిన కుత్బుల్లాపూర్‌లోని ఐదు, ఎల్బీనగర్లో ఎనిమిది డివిజన్లకు, మిగిలిన నియోజకవర్గాల్లో ఒక్కొక్క అభ్యర్థులను గుర్తించిన డివిజన్లలో ప్రకటిస్తారు. కాంగ్రెస్ జాబితాలో తార్నాక నుంచి మాజీ మేయర్ బండ కార్తీకరెడ్డి, బౌద్ధనగర్ నుంచి ఆదం ఉమాదేవి పోటీ చేయనున్నారు. బీజేపీలో భాగ్‌అంబర్‌పేట నుంచి బీజేపీ నగర అధ్యక్షుడు వెంకట్‌రెడ్డి సతీమణి పేరు తొలి జాబితాలో ప్రకటించనున్నారు. ఉత్కంఠ బల్దియా ఎన్నికల్లో పోటీ చేయనున్న అధికార టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను శుక్రవారం ప్రకటించనున్నారన్న సమాచారంతో ఆశావహుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే పార్టీ ఆధ్వర్యంలో కె.కేశవరావు నేతృత్వంలో ఏర్పాటు చేసిన ఐదుగురు సభ్యుల కమిటీ నగరంలో ముఖ్యనేతలు, మంత్రులు, ఇన్చార్జులతో సంప్రదింపుల ప్రక్రియ పూర్తి చేసింది. అభ్యర్థుల ఎంపికపై అధినేతకు నివేదిక సమర్పించినట్లు తెలిసింది. టిక్కెట్లు ఆశించి ఇతర పార్టీల నుంచి గులాబీ గూటికి చేరుతున్న ఆశావహుల మధ్య సిగపట్లు తప్పని పరిస్థితి కనిపిస్తోంది. కీలక డివిజన్లకు ముగ్గురు నుంచి ఐదుగురేసి టిక్కెట్లు ఆశిస్తుండడంతోతీవ్ర పోటీ నెలకొంది. ఇటీవల ఇతర పార్టీల నుంచి జోరుగా టీఆర్ఎస్లో చేరారు. దీంతో ఉద్యమ సమయం నుంచి పార్టీలో ఉన్న నాయకుల్లో అసమ్మతి రాజుకుంటోంది. గెలుపు గుర్రాలకే టిక్కెట్లు కేటాయిస్తామని అధినేత కేసీఆర్ ప్రకటించడంతో ఆశావ హుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. పార్టీ ఆధ్వర్యంలో గెలిచే అవకాశాలున్న అభ్యర్థులపై డివిజన్ స్థాయిలో ఐదు సర్వేలు చేసిన విషయం తెలిసిందే. ఈ నివేదికలను ప్రామాణికంగా తీసుకుంటారా? లేక అం గబలం, అర్థబలం ఉండి.. ఇతర పార్టీల నుంచి టీఆర్ఎస్లో చేరిన గెలుపు గుర్రాలకే టిక్కెట్లిస్తారా అన్నది మరికొన్ని గంటల్లో తేలనుంది. ఇటీవల ఎల్బీనగర్, కుత్బుల్లాపూర్, ఉప్పల్, మల్కాజ్గిరి, మహేశ్వరం, శేరిలింగంపల్లి, కూకట్పల్లి, సికింద్రాబాద్, సనత్ నగర్ నియోజకవర్గాల నుంచి కాంగ్రెస్, టీడీపీ, బీజేపీలకు చెందిన ద్వితీయ శ్రేణి నాయక గణం, మాజీ కార్పొరేటర్లు టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. వారిలో కొందరికికార్పొరేటర్ టిక్కెట్లు ఎరజూపి అధికార పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు గులాబీ కండువాలు కప్పిన విషయం విదితమే. తాజాగా చేరుతున్న వారిని తమతో కలుపుకుని వెళ్లేందుకు సీనియర్లు ససేమిరా అంటున్నారు. ఇతర పార్టీల నుంచి దిగుమతి చేసుకున్న నాయకులను బలవంతంగా అభ్యర్థులుగా తమపై రుద్దుతున్నారని అసమ్మతి గళం వినిపిస్తున్నారు. ఇదే విషయాన్ని ఇన్చార్జులుగా ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలకు నిర్మొహమాటంగా స్పష్టం చేస్తుండడం గమనార్హం. ఈ పరిణామాలు పాత, కొత్త నేతల మధ్య సయోధ్య కుదిర్చి పార్టీ అభ్యర్థిని గెలిపించే బాధ్యత తీసుకున్న ఇన్చార్జులకు కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతున్నాయన్న వాదనలు వినిపిస్తున్నాయి. సోషల్ మీడియాలో పుకార్లు టిక్కెట్లు ఆశిస్తున్న టీఆర్ఎస్ అభ్యర్థులకు వాట్సాప్, ఫేస్బుక్ వంటి సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం మరింత టెన్షన్ పెంచుతోంది. ఇప్పటికే డివిజన్ల వారీగా కొందరికి టీఆర్ఎస్ టిక్కెట్లు ఖరారైనట్లు సోషల్ మీడియా గ్రూపుల్లో సంక్షిప్త సందేశాలు అందుతుండడంతో గందరగోళం మొదలైంది. పార్టీ అధిష్టానం మాత్రం తుది జాబితా ప్రకటించలేదని... సోషల్ మీడియాలో ప్రచారం పుకార్లు మాత్రమేనని స్పష్టం చేస్తోంది. -
భారీగా తగ్గిన ఓటర్లు
జిల్లాలో మొత్తం ఓటర్లు 33,38,938 గతేడాది కంటే 71,679తక్కువ 4 నియోజకవర్గాల్లో పెరుగుదల.. 11 నియోజకవర్గాల్లో తగ్గుదల అత్యధికంగా విశాఖ పశ్చిమలో 17,987 ఓటర్ల తొలగింపు కొత్త ఓటు హక్కు పొందిన యువత 26,693 మందే 2016 ఓటర్ల తుది జాబితా వెల్లడి విశాఖపట్నం: గతంలో ఎన్నడూ లేని విధంగా జిల్లాలోని ఓటర్లలో భారీగా కోతపడింది. ఓటర్ల తుది జాబితా-2016ను మంగళవారం జిల్లా యంత్రాంగం విడుదల చేసింది. తుది జాబితా ప్రకారం జిల్లాలో 33,43,190 మంది ఓటర్లున్నట్టుగా ప్రకటించారు. గతేడాది ప్రకటించిన ఓటర్ల జాబితాతో పోలిస్తే ఏకంగా 20 శాతం మేర కోతపడింది. వీటిపై డిసెంబర్ -15వ తేదీ వరకు విచారణ చేసి, జనవరి 11న తుది జాబితా సిద్ధంచేశారు. తగ్గడం ఇదే తొలిసారి ఓటర్ల సవరణ కోసం గతేడాది అక్టోబర్-5 భారత ఎన్నికల సంఘం నోటిఫి కేషన్ జారీ చేసింది. నవంబర్ 16 వరకు కొత్త ఓటర్ల నమోదుకు అవకాశం ఇచ్చారు. అక్టోబర్ 11న, నవంబర్ 1న పోలింగ్ కేంద్రాల్లో ప్రత్యేక ఓటు నమోదు శిబిరాలు నిర్వ హించారు. కొత్తగా ఓటుహక్కు కోసం 26,693 మంది, ఓటు హక్కు తొలగింపు కోసం 623 మంది, చేర్పులు మార్పుల కోసం 5145 మంది, నియోజకవర్గ పరిధిలో ఒక పోలింగ్ బూత్ నుంచి మరో పోలింగ్ బూత్‌కు ఓటు బదిలీ కోసం 1412 మంది దరఖాస్తు చేసు కున్నారు. వీటిపై డిసెంబర్ -15 వరకు విచారణ చేపట్టారు. తుది జాబితాను జనవరి 11న ప్రచురించారు. ఈ వివరాలను మంగళవారం మీడియాకు వెల్లడించారు. కొత్తగా ఓటు కోసం దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఇవ్వడంతో గతంతో పోలిస్తే ఓట్ల సంఖ్య పెరగాల్సింది పోయి గణనీయంగా తగ్గింది. 2015 ఓటర్ల జాబితా కింద జిల్లాలో 34,10,617 మంది కాగా, తాజాగా సవరించిన ఓటర్ల జాబితా-2016 ప్రకారం జిల్లాలో 33,38,938 మంది ఓటర్లున్నారు. అంటే ఏకంగా 71,679 మంది ఓటుహక్కును కోల్పోయారు. ఇంత భారీ స్థాయిలో ఓటర్లలో కోత పడడం ఇదే తొలిసారి. 2015లో పురుష ఓటర్లు 17,00195 మంది ఉంటే.. ప్రస్తుతం 16,63,444 మంది ఉన్నారు. అలాగే 2015లో స్త్రీలు 17,10,161 మంది ఉంటే ప్రస్తుతం 16,75,236 మంది ఉన్నారు. ఈ లెక్కన పురుష ఓట్లు 36,751 మహిళా ఓట్లు 34,925 తగ్గాయి. 2015లో ఇతరులు 261 మంది ఉంటే ప్రస్తుతం 258 మంది ఉన్నారు. ఏడుగురు ప్రవాస భారతీయులకు ఓటు హక్కు 2016లో కొత్తగా విశాఖ ఈస్ట్ పరిధిలో ఏడుగురు ప్రవాస భారతీయులకు ఓటు హక్కు కల్పించారు. 4252 మంది సర్వీస్ ఓటర్లుండగా, వారిలో 3459 మంది పురుషులు, 793 మంది స్త్రీలు ఉన్నారు. సవరించిన ఓటర్ల జాబితా ప్రకారం హెచ్చుతగ్గులు నియోజక వర్గాల వారీగా పరిశీలిస్తే భీమిలిలో 2353, విశాఖ ఈస్ట్‌లో 2906, మాడుగులలో 744, పాడేరులో 750 చొప్పున ఓట్ల సంఖ్య పెరగగా, విశాఖ సౌత్‌లో 7035, నార్త్‌లో 15,852, పశ్చిమలో అత్యధికంగా 17,987, గాజువాకలో 12,049, చోడవరంలో 1953, అరకువాలీ (ఎస్టీ)లో 2698, అనకాపల్లిలో 3620, యలమంచలిలో 8290, పాయకరావుపేటలో 6777, నర్సీపట్నంలో 1849 చొప్పున ఓట్లు తగ్గాయి. 18-19 ఏళ్ల లోపు వయస్సు కలిగి ఓటు హక్కుకు అర్హతకలిగిన యువత 1.75,298 మంది ఉన్నారు. వారిలో 62,250 మంది మాత్రమే ఓటు హక్కు కలిగి ఉండగా, కొత్తగా 26,693 మంది మాత్రమే ఓటు హక్కు పొందారు.1,13,048 మంది ఓటుకు దూరంగా ఉన్నారు. మరో పక్క చనిపోయిన వారితో పాటు ఇతర ప్రాంతాలకు వలసవెళ్లిన వారు, అనర్హులను తొలగించడంతో సవరించిన జాబితాలో ఓటర్ల సంఖ్య గణనీయంగా తగ్గింది. -
అట్టహాసంగా...
జంట జిల్లాల్లో 5,500 మందికి పింఛన్ల పంపిణీ హాజరైన డిప్యూటీ సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు. పూర్తిగాని లబ్ధిదారుల ఎంపిక, కొనసాగుతున్న పరిశీలన నిలదీత, విజ్ఞప్తులతో గందరగోళం హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో ‘ఆసరా’ పథకం కింద శనివారం 5,500 మంది వృద్ధులు, వికలాంగులకు పింఛన్లు పంపిణీ చేశారు. ఆసరా పథకం కింద నగరంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమం శనివారం అట్టహాసంగా ప్రారంభమైంది. మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొనడంతో కార్యక్రమం ఆర్భాటంగా సాగింది. గతంలో పింఛన్లు పొందిన వారితోపాటు కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారంతా రావడంతో సందడి నెలకొంది. జాబితాలో తమ పేర్లు లేవంటూ అక్కడక్కడా పలువురు ఆందోళన వ్యక్తం చేయడంతో కొంత గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. వారిని సంతృప్తి పరచడానికి అధికారులు నానా హైరానా పడాల్సి వచ్చింది. పింఛన్లు మంజూరు గాని వారి దరఖాస్తులు పరిశీలనలో ఉన్నాయని... గతంలో మాదిరిగా పింఛన్లు పంపిణీ చేస్తామని హామీ ఇచ్చి వారిని శాంతింపజేశారు. తొలి దశలో భాగంగా నగరంలో 12 వేల పింఛన్లు పంపిణీ చేయాలని అధికారులు నిర్ణయించారు. హైదరాబాద్ జిల్లా పరిధిలోని 14 మండలాల్లో శనివారం 3,500 సామాజిక పింఛన్లు పంపిణీ చేసినట్టు కలెక్టర్ ముఖేష్‌కుమార్ మీనా తెలిపారు. ఆదివారం కూడా పింఛన్ల పంపిణీ కొనసాగుతుందన్నారు. రంగారెడ్డి జిల్లాలో రెండు వేలకుపైగా పింఛన్లు పంపిణీ చేసినట్టు అధికారుల పేర్కొంటున్నారు. పథకాన్ని ప్రారంభించిన నేతలు... సైదాబాద్ మండలం బాల రావమ్మ బస్తీలో, చార్మినార్ మండలం బండ్లగూడలోని బహదూర్‌పురా ప్రాంతాల్లో ఆసరా పథకాన్ని డిప్యూటీ సీఎం మహముద్ అలీ లాంఛనంగా ప్రాభించారు. ఎమ్మెల్యే అహ్మద్ బలాలా, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. అంబర్పేట్, ముషీరాబాద్, నాంపల్లి మండలాల్లో హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి ప్రారంభించారు. గోల్కొండలో ఎమ్మెల్యే కౌసర్ మోయినొద్దీన్, అమీర్‌పేట్‌లో ఎంపీ దత్తాత్రేయ, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస యాదవ్, హిమాయత్‌నగర్‌లో ఎమ్మెల్యేలు జి.కిషన్‌రెడ్డి, చింతల రామచంద్రారెడ్డి, ఆఫిస్నగర్లో ఎమ్మెల్యే జాఫర్ హూస్సేన్ ఆసరా పథకాన్ని ప్రారంభించారు. -
రుణమాఫీ జాబితాలు విడుదల
తహశీల్దార్ల వెబ్సైట్లకు పంపిన ప్రభుత్వం 7,600 పేజీలతో జాబితా నేడు పంచాయతీ కార్యాలయాలకు మచిలీపట్నం : పంట రుణమాఫీకి సంబంధించిన జాబితాలను ప్రభుత్వం శుక్రవారం విడుదల చేసింది. వాటిని అన్ని మండల తహశీల్దార్ల వెబ్సైట్లకూ పంపింది. రుణమాఫీకి సంబంధించి అర్హుల జాబితాను తయారుచేసిన ప్రభుత్వం దాని వివరాలను తహశీల్దార్ కార్యాలయ వెబ్‌సైట్‌కు పంపి, అక్కడి పాస్వర్డ్తోనే ఓపెన్ అయ్యేలా ఏర్పాటు చేసింది. ఈ జాబితా 7,600 పేజీల్లో ఉందని పలువురు తహశీల్దార్లు తెలిపారు. రుణమాఫీకి సంబంధించిన మండలం.. అందులోని రెవె న్యూ గ్రామాల వారీగా ప్రకటించినట్లు పేర్కొన్నారు. రుణం తీసుకున్న రైతు పేరు, ఏ బ్యాంకులో తీసుకున్నారు, ఎంత తీసుకున్నారు, రైతు పేరున ఉన్న భూమి వివరాలు ఈ జాబితాలో ఉన్నాయని తహశీల్దార్లు వివరించారు. ఈ జాబితాను శనివారం ఆయా గ్రామాలకు పంపుతామని.. పంచాయతీ కార్యాలయాల్లో వీటిని ప్రదర్శించనున్నామని వారు వివరించారు. 20 శాతమే నగదు జమ... ప్రభుత్వం రుణమాఫీకి సంబంధించిన జాబితాను ప్రకటించటంతో అందులో ఎంతమంది పేర్లు ఉన్నాయి. ఎవరెవరి పేరున ఎంత రుణమాఫీ జరిగింది అనే అంశంపై రైతుల్లో ఉత్కంఠ నెలకొంది. పంట రుణాలను మాఫీ చేస్తామని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఒక కుటుంబానికి రూ.1.50 లక్షలు మాత్రమే రుణమాఫీ చేస్తామని ప్రకటించారు. ఈ జాబితాలో బంగారం తాకట్టు పెట్టి తీసుకున్న పంట రుణాలకు సంబంధించిన వివరాలు ఉన్నాయా లేదా అనే అంశంపైనా పలువురు చర్చించుకుంటున్నారు. ఇటీవల ప్రభుత్వం రుణమాఫీ కింద మంజూరు చేయనున్నట్లు ప్రకటించిన రూ.5 వేల కోట్ల నగదును ఒక్కొక్క రైతు పేరున ఉన్న బకాయిలో 20 శాతం మేర జమ చేసే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. అంతా మాయేనా... ఎన్నికల ప్రచారంలో వ్యవసాయ రుణాలన్నీ మాఫీ చేస్తామని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పదవీ స్వీకారం రోజున వ్యవసాయ రుణాలన్నీ రద్దు చేస్తామని ప్రకటించారు. దీంతో పాటు రుణమాఫీ ఫైలు పైనే తొలి సంతకం చేస్తామని ఈ ప్రకటనల్లో వివరించారు. ప్రమాణస్వీకారం చేసే సమయంలో రుణమాఫీకి సంబంధించి విధి విధానాలు ఖరారు చేసేందుకు కోటయ్య కమిటీని నియమిస్తున్నట్లు సంతకం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా వ్యవసాయ రుణాలు రైతులెవ్వరూ కట్టవద్దని, బంగారం తాకట్టు పెట్టిన రుణాలు తీసుకుంటే ఆ రుణాలు చెల్లించి మీ బంగారం మీ ఇంటికే తీసుకువచ్చి ఇస్తామని హామీ ఇచ్చారు. కానీ కాలక్రమేణా అరటి, పసుపు, మిర్చి, కూరగాయలు, పూలతోటలు తదితర ఉద్యానవన పంటలకు రైతులు తీసుకున్న రుణాలను రుణమాఫీ జాబితాను తొలగించారు. మహిళల పేరుతో బంగారం తాకట్టు పెట్టి తీసుకున్న పంట రుణాలే రద్దవుతాయంటూ మెలిక పెట్టారు. పట్టాదారు పాస్‌పుస్తకం ఉండాలని, ఆధార్ కార్డు, అడంగల్ కాపీలు ఈ వివరాలు ఉండాలని ఆంక్షలు విధించారు. ఖరీఫ్ సీజన్ పూర్తయ్యే దశలో ఉన్నా ఇంతవరకు రైతులకు రుణాలు ఇప్పించటంలో ప్రభుత్వం విఫలమైంది. ప్రభుత్వం నిర్లక్ష్యానికి తోడు వరుణుడు కరుణించకపోవటంతో రైతులు పంటలు ఎండిపోయి దిగుబడులు ఆశించిన మేర రావని ఆందోళనకు గురవుతున్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు రుణాలు సకాలంలో చెల్లించకపోవటంతో వడ్డీ లేని పంట రుణాలు తీసుకున్న రైతులు నేడు 14 శాతం వడ్డీ చెల్లించాల్సిన దుస్థితి నెలకొంది. సకాలంలో వడ్డీ చెల్లిస్తే రైతులు చెల్లించిన వడ్డీలో మూడు శాతం ఇన్సెంటివ్‌గా కేంద్ర ప్రభుత్వం భరించే అవకాశం ఉండేది. దీనిని రైతులు కోల్పోయారు. బ్యాంకుల ద్వారా పంట రుణాలు అందకపోవడంతో రైతులు ప్రైవేటు వడ్డీ వ్యాపారుల నుంచి అప్పులు చేసి మరీ పంటలు సాగు చేశారు. బ్యాంకుల్లో రుణాలు తీసుకోకపోవటంతో పంట బీమా సొమ్ము చెల్లించని పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం రుణమాఫీ చేయకపోవటం, రైతులు తీసుకున్న రుణాలు మార్చి 31లోపు చెల్లించకపోవటంతో రుణాలు తీసుకున్న రైతులంతా డిఫాల్టర్లుగా మారారు. ఇలాంటి స్థితిలో ప్రస్తుతం రుణమాఫీకి సంబంధించిన జాబితాలను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ జాబితాల్లోని వివరాలు బయటపడితే ప్రభుత్వం రుణమాఫీపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో తెలిసే అవకాశం ఉంది. బ్యాంక్ పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ విజయవాడ సిటీ : నగర పోలీసు కమిషనరేట్ పరిధిలోని కొత్తపేట, సూర్యారావుపేట, నున్న, పటమట పోలీసు స్టేషన్ల పరిధిలో భారతీయ స్టేట్ బ్యాంక్ ఆధ్వర్యంలో నిర్వహించే ప్రొబేషనరీ ఆఫీసర్స్ (పీఓ) పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేస్తూ నగర పోలీసు కమిషనర్, మెట్రోపాలిటన్ ప్రాంత అదనపు జిల్లా మేజిస్ట్రేట్ ఎ.బి.వెంకటేశ్వరరావు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 9, 15, 23, 29, 30 తేదీల్లో ఈ ఉత్తర్వులు ఆయా పోలీసు స్టేషన్ల పరిధిలో అమలులో ఉంటాయని ఆయన పేర్కొన్నారు. పరీక్షలు అవాంఛనీయ ఘటనలకు ఆస్కారం లేకుండా ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు ముందస్తు చర్యల్లో భాగంగా ఉత్తర్వులు జారీ చేసినట్టు కమిషనరేట్ అధికారులు తెలిపారు. సెక్షన్ 144 అమలులో ఉన్నందున పరీక్షలు జరిగే రోజుల్లో.. పరీక్షా కేంద్రాలకు 250 మీటర్ల పరిధిలో ఐదుగురు అంతకంటే ఎక్కువ మంది గుమిగూడరాదని, కర్రలు, రాళ్లు సహా మారణాయుధాలు కలిగి ఉండరాదని తెలిపారు. పరీక్షా కేంద్రాలకు సమీపంలోని ఇంటర్నెట్ సెంటర్లు, జిరాక్స్ షాపులు తెరిచి ఉంచరాదని వివరించారు.