ఆగంతకుల కాల్పులు: నాయకుడి మృతి
మవు(ఉత్తర్ ప్రదేశ్): దుండగులు జరిపిన కాల్పుల్లో సుహెల్దెవ్ భారతీయ సమాజ్ పార్టీకి చెందిన స్థానిక నాయకుడు ఒకరు మృతి చెందారు. ఈ సంఘటన ఉత్తర్ ప్రదేశ్ లోని మవులో చోటు చేసుకుంది. సుహెల్దెవ్ భారతీయ సమాజ్ పార్టీకి చెందిన పవన్ యాదవ్ పార్టీ ఆఫీసు నుంచి బయటకు వెళుతున్న సమయంలో అతని పైకి కొందరు దుండగలు కాల్పులు జరిపి పరారయ్యారు.
బుల్లెట్ గాయాలతో ఆస్పత్రిలో చేరిన యాదవ్ చికిత్స పొందుతూ మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.