తొలిరోజు ఆదిత్యుని తాకని సూర్య కిరణాలు
అరసవల్లి : సూర్య భగవానుడు తొలిరోజు భక్తులను కటాక్షించలేదు. వాతావరణం మబ్బులతో ఉండటంతో సూర్యకిరణాలు ఆదిత్యుని పాదాలు తాకలేదు. శ్రీకాకుళం జిల్లా అరసవల్లిలో ప్రతి అక్టోబర్ మొదటివారంలో మూడ్రోజుల పాటు భానుడి కిరణాలు మూలవిరాట్ను స్పృశిస్తాయి. ఈ అద్భుత దృశ్యాన్ని వీక్షించేందుకు దేశ నలువైపుల నుంచి అశేష సంఖ్యలో భక్తులు తరలి వస్తుంటారు.
పది నిమిషాలపాటు సూర్యుడి శిరస్సు నుంచి పాదాల వరకూ తాకే లేలేత కిరణాలను చూసి ధన్యులవుతుంటారు. అయితే గత రెండ్రోజులుగా వర్షాలు పడుతుండడంతో, దట్టంగా మేఘాలు అలుముకున్నాయి. దీంతో ఆదిత్యుడిని దర్శించుకునేందుకు ఆశగా ఎదురుచూసిన భక్తులు తీవ్ర నిరాశతో వెనుదిరిగారు. కనీసం రెండో రోజు అయినా తమకు ఆ మహద్భాగ్యం కలగాలని ప్రార్థించారు. కాగా భాస్కరుడు ప్రసరించే సహస్ర కిరణాలు మన శరీరంలోకి ప్రవేశించి అనారోగ్యం లేకుండా కాపాడతాయి.