Lose Weight
-
బరువు తగ్గితే రూ.10 లక్షలు.. ఉద్యోగులకు బంపర్ ఆఫర్
ముంబై: జెరోడా అనే ఆన్లైన్ బ్రోకరేజీ కంపెనీ ఉద్యోగులకు సీఈఓ నితిన్ కామత్ బంపర్ ఆఫర్ ఇచ్చారు. బరువు తగ్గితే మంచి ఇన్సెంటివ్‌లు ఇస్తారట. అంతేకాదు, ఒక లక్కీ విజేతకు ఏకంగా రూ.10 లక్షల రివార్డు ప్రకటించారు. ఇందుకోసం వారు రోజుకు కనీసం 350 క్యాలరీలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. అలా ఏడాది పాటు శ్రమించి లక్ష్యంలో 90 శాతం సాధించిన వారందికీ నెల వేతనం బోనస్‌గా ఇస్తారు! దీనికి తోడు రూ.10 లక్షల బంపర్ బొనాంజా ఉండనే ఉంది! దాంతో ఈ ఫిట్నెస్ చాలెంజ్‌ను సీరియస్‌గా తీసుకుని ఉద్యోగులంతా గట్టిగానే శ్రమిస్తున్నారట. అన్నట్టూ, ఎవరు ఏ మేరకు కొవ్వు కరిగిస్తున్నదీ కంపెనీ తాలూకు ఫిట్నెస్ ట్రాకర్ గమనిస్తుంటుందట. ఉద్యోగుల ఆరోగ్యం, ఫిట్నెస్ కోసం ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం ఈ కంపెనీకి కొత్తేమీ కాదట. 25 కంటే తక్కువ బీఎంఐ ఉన్న ఉద్యోగులకు ఇప్పటికే సగం నెల వేతనం బోనస్‌గా ఇస్తోంది!! వర్క్ ఫ్రం హోం వల్ల స్థూలకాయం తెచ్చుకుని అనారోగ్యం పాలు కావొద్దన్నదే తమ ఉద్దేశమంటున్నారు కామత్. కరోనా కాలంలో పెరిగిన బరువును తానెలా తగ్గించుకున్నదీ చెబుతూ ఉద్యోగులను మోటివేట్ చేస్తున్నారు. -
ఎంత తిన్నా లావెక్కకుండా ఉండాలంటే...?
పొట్ట పగిలేలా కొవ్వు పదార్థాలు తిన్నా ఇంచు కూడా లావెక్కరాదని, మధుమేహం వంటి వ్యాధులేవీ రాకూడదని అందరం అనుకుంటాంగానీ.. సాధ్యం కాదు కాబట్టి అవసరం కొద్దీ రకరకాలుగా కడుపు కట్టుకుంటాం. అయితే ఇలా ఉండటం సాధ్యమే అంటున్నారు వాషింగ్టన్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు. కొవ్వు కణాల్లోని ఓ ప్రొటీన్‌ను చైతన్యవంతం చేయడం ద్వారా అవి లావెక్కకుండా చేయవచ్చునని ఫాంక్సిన్ లాంగ్ అనే శాస్త్రవేత్త అంటున్నారు. ఈ విషయాన్ని నిర్ధారించుకునేందుకు శాస్త్రవేత్తలు ఎలుకలపై ప్రయోగాలు చేశారు. ఎలుకలతో పాటు మన శరీరాల్లో కూడా హెడ్జ్హాగ్ సిగ్నలింగ్ పాథ్‌వే అని ఒక వ్యవస్థ ఉంటుంది. ఎదుగుదలతోపాటు కొవ్వు కణజాలం వద్ధి చెందేందుకు కూడా ఇది ఉపయోగపడుతుందని ఇప్పటికే తెలుసు. ఎలుకల కణాల్లో ఈ వ్యవస్థను మళ్లీ చైతన్యవంతం చేసి కొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉన్న ఆహారం అందించారు. ఎనిమిది వారాల తరువాత లావెక్కుతాయి అనుకున్న ఎలుకలు కూడా ఉన్నవి ఉన్నట్టుగా స్పష్టమైంది. హెడ్జ్హాగ్ పాథ్‌వేను చైతన్యవంతం చేయని ఎలుకలు మాత్రం లావెక్కిపోయాయి. అంతేకాకుండా లావెక్కని ఎలుకల రక్తంలోని గ్లూకోజ్ శాతం కూడా తక్కువగా ఉన్నట్లు తెలిసింది. ‘‘మనం లావెక్కడమంటే.. మనలోని కొవ్వు కణాల సైజు పెరగడమే. కొవ్వు కణాలు సాధారణ సైజులోనే ఎక్కువ సంఖ్యలో ఉంటే పెద్దగా ఇబ్బంది లేదు.’’ అని లాంగ్ అంటున్నారు. -
నడుము కొవ్వును కరిగించే ప్యాచ్
న్యూయార్క్ : నడుము భాగం వద్ద కొవ్వు బాగా పెరిగి ఇబ్బంది పడుతున్నారా? మీ కోసం శాస్త్రవేత్తలు చిన్న చిన్న సూదులున్న ప్యాచ్‌ను రూపొందించారు. కొవ్వును కరిగించే ఈ ప్యాచ్ ఊబకాయం, మధుమేహం లాంటి జీవక్రియ సంబంధ రుగ్మతలకు చికిత్స అందించేందుకు కూడా ఉపకరిస్తుందట. తెల్లని కొవ్వు (మోతాదుకు మించి ఉండేది) ను ఇది గోధుమ రంగులోకి మార్చుతుందని అమెరికాకు చెందిన కొలంబియా యూనివర్శిటీ మెడికల్ సెంటర్, యూనివర్శిటీ ఆఫ్ నార్త్ కరోలినా పరిశోధకులు తెలిపారు. -
ప్రేమ కోసం 'ఆ మాత్రం' తగ్గలేనా..!
-
కునుకుతో నాజుకుదనం
మీరు అధిక బరువుతో బాధపడుతున్నారా? శరీరాన్ని నాజూగ్గా ఉంచుకుని మెరుపు తీగలా మారిపోవాలని ఉందా? బొద్దుగుమ్మలాంటి మీరు... జీరో సైజుకు రావాలనుకుంటున్నారా? అయితే ఎంచక్క... ఎక్కువ సేపు కునుకు తీయండి. మీ ప్రోబ్లమ్ సాల్వ్ అయిపోతుంది. ఈ విషయం అతివలపై జరిపిన పరిశోధనలలో తేలింది. మారుతున్న పరిస్థితుల్లో నేటి తరం యువత... ముఖ్యంగా మహిళల్ని అమితంగా వేధిస్తున్న సమస్య ఒబెసిటీ. ఉరుకుల పరుగుల జీవితం, వేళాపాళా లేని ఉద్యోగాలు, మారుతున్న ఆహార అలవాట్లు... తగ్గుతున్న శారీరక శ్రమ, నిద్రలేమి ఇవన్నీ ఊబకాయానికి కారణం. ఇలాంటి పరిస్థితుల్లో శరీరాన్ని అదుపులో ఉంచుకుని ఆకృతి చెడిపోకుండా నాజూగ్గా కనిపించేందుకు జిమ్‌ల చుట్టూ తిరిగేవారు కోకొల్లలు. దీనిపై అమెరికాకు చెందిన రెండు పెద్ద యూనివర్సిటీలకు చెందిన సుమారు 300మంది మహిళలపై... బ్రిగమ్ యంగ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ బ్రూస్ బైలీ నిర్వహించిన పరిశీలనలో ఓ విషయం తేలింది. ఎవరైతే చక్కగా నిద్రపోతారో వారిలో ఊబకాయం లేదని గుర్తించారు. నిద్ర విషయంలో కచ్చితమైన సమయాన్ని పాటిస్తే ఊబకాయం దరిచేరదని ఆ అధ్యయం తేల్చింది. 17 నుంచి 26 ఏళ్ల వయసున్న యువతులపై జరిపిన పరిశోధనల్లో ముందుగా వారి శరీర ఆకృతి, నిద్రపోయే సమయాలపై దృష్టిసారించారు. వారంపాటు పరిశోధనలు సాగించారు. ఈ అధ్యయనంలో ఎన్నో ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగుచూశాయి. ముఖ్యంగా రాత్రి పడుకునే సమయం, ఉదయం నిద్రలేచే సమయానికి ...శరీర బరువుకు సంబంధం ఉందంటున్నారు పరిశోధకులు. రోజూ ఒకే సమయానికి నిద్రపోయి... దాదాపు అంతా ఒకే సమయానికి నిద్రలేచేవారి శరీర బరువులో మార్పులేమీ లేవని గుర్తించారు. గంటన్నర ఆలస్యంగా పడుకుని, నిద్రలేచిన యువతుల్లో శరీరంలో కొవ్వు పెరిగినట్లు అధ్యయనంలో తేలింది. ముఖ్యంగా నిద్రలేచే సమయం శరీరాకృతిని ప్రభావితం చేస్తోంది. తరచూ ఒకే సమయానికి నిద్రలేచేవారిలో ఎలాంటి ఒబెసిటీ లక్షణాలు కనిపించలేదని ఈ అధ్యయన బృందం గుర్తించింది. చక్కటి ఆకృతి కోసం నిద్రపోవాల్సిన సమయం 8 నుంచి ఎనిమిదిన్నర గంటలని పరిశోధన బృందం గుర్తించింది. 8 గంటలు నిద్రపోతే కొవ్వు తగ్గుతుందంటూనే...అతి నిద్ర పనికిరాదని ఫ్రొఫెసర్ బెయిలీ హెచ్చరిస్తున్నారు. అమ్మాయిలూ చూశారుగా ఇక నుంచి హాయిగా నిద్రపోండి, మీరు కోరుకునే స్లిమ్ అన్ ఫిట్ బాడీని సొంతం చేసుకోండి.