Love Sonia movie
-
ఈమె తెలుగు హీరోయిన్.. హిట్లు కొట్టడంలో స్పెషలిస్ట్.. గుర్తుపట్టారా?
ఈమె తెలుగులో ఫేమస్ హీరోయిన్. సినిమా చేసిందంటే హిట్ గ్యారంటీ. ఏంటి నమ్మట్లేదా? స్టోరీ చదవండి మీకే ఐడియా వచ్చేస్తుంది. చీర కట్టినా.. మోడ్రన్ డ్రస్ వేసినా సరే కేక పుట్టించే అందంగా ఉంటుంది. అలాంటిది సడన్‌గా ఎవరూ గుర్తుపట్టలేని విధంగా కనిపించి షాకయ్యేలా చేసింది. మరి ఇంతలా చెప్పాం కదా ఈమె ఎవరో కనిపెట్టారా? లేదంటే మమ్మల్నే చెప్పేయమంటారా? (ఇదీ చదవండి: కుమారి ఆంటీ పుడ్ బిజినెస్ క్లోజ్.. సాయం చేస్తానంటున్న తెలుగు హీరో) పైన ఫొటోలో కనిపిస్తున్న అమ్మాయి పేరు మృణాల్ ఠాకుర్. హా అవును.. 'సీతారామం', 'హాయ్ నాన్న' సినిమాలతో హిట్ కొట్టి.. టాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషన్‌గా మారిన బ్యూటీ ఈమెనే. మహారాష్ట్రలో పుట్టి పెరిగిన ఈ ముద్దుగుమ్మ.. కాలేజీ అయిపోగానే సీరియల్స్‌లో నటించింది. 'కుంకుమ భాగ్య' ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే మాత్రం వాళ్లని అడిగితే మృణాల్ గురించి చెప్పేస్తారు. 2012 నుంచి సీరియల్స్, 2014 నుంచి సినిమాలు చేస్తున్న మృణాల్.. హిందీ, తెలుగు, మరాఠీ భాషల్లో నటించేసింది. పైన ఫొటోలో కనిపిస్తున్న లుక్ మాత్రం 'లవ్ సోనియా' మూవీలోనిది. 2012లో ఈ ప్రాజెక్ట్ మొదలైంది కానీ 2018లో రిలీజైంది. అందుకే గుర్తుపట్టలేనత డీ గ్లామర్‌గా మృణాల్ కనిపిస్తోంది. దీనికి తోడు ఈ సినిమా కథంతా కూడా ముంబయి రెడ్ లైట్ ఏరియా బ్యాక్ డ్రాప్‌తో తీశారు. తాజాగా ఆ చిత్రంలో మృణాల్ స్టిల్స్ వైరల్ కావడంతో తొలుత ఈమె ఎవరా అనుకున్నారు. మృణాల్ అని తెలిసి అవాక్కయ్యారు. ఇకపోతే 'లవ్ సోనియా' మూవీ ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్‌లో అందుబాటులో ఉంది. (ఇదీ చదవండి: సంక్రాంతి మూవీస్.. ఓటీటీల్లో రిలీజయ్యేది ఎప్పుడంటే?) View this post on Instagram A post shared by Mrunal Thakur (@mrunalthakur) -
చేదు అనుభవాన్ని పంచుకున్న హీరోయిన్
కెరీర్లో కొంతదూరం ప్రయాణించాక కొందరు నటీనటులు తమ కెరీర్ తొలి రోజులను గుర్తు చేసుకుంటుంటారు. ఇటీవల తన కెరీర్ ఫస్ట్ డేస్‌ను గుర్తు చేసుకుని ఓ చేదు అనుభవాన్ని పంచుకున్నారు హీరోయిన్ మృణాళ్ ఠాకూర్. ‘‘హిందీలో నేను నటించిన తొలి సినిమా ‘లవ్ సోనియా’. ఈ సినిమాలో హీరోయిన్గా చాన్స్ వచ్చిందని తెలియగానే చాలా ఆనందపడ్డాను. కానీ ఈ సినిమా ఆఫీస్‌లో ఉన్న నోటీస్ బోర్డ్ చూసి షాకయ్యాను. సోనియా పాత్రకు... ఆప్షన్ 1, ఆప్షన్ 2, ఆప్షన్ 3.. అని ముగ్గురు హీరోయిన్ల పేర్లు ఉన్నాయి. ‘ఆప్ష్షన్ 3’లో నా పేరు ఉంది. అది చూసి నా హృదయం బద్దలైంది. ఈ పాత్ర వస్తే పూర్తి న్యాయం చేయాలని నా మనసులో అనుకున్నాను. నా సంకల్పం మంచిదై సోనియాగా నటించే చాన్స్ నాకే వచ్చింది’’ అని పేర్కొన్నారు మృణాళ్. 2018లో హిందీ, ఇంగ్లీష్ భాషల్లో రూపొందిన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. ఆ తర్వాత హృతిక్ రోషన్ ‘సూపర్ 30’, జాన్ అబ్రహాం ‘బాట్లా హౌస్’, ఫర్హాన్ అఖ్త్తర్ ‘తుఫాన్’లతో పాటు ‘ఘోస్ట్ స్టోరీస్’ అనే ఓ వెబ్ ఆంథాలజీలో కూడా మృణాళ్ నటించారు. తాజాగా మృణాళ్ నటించిన ‘జెర్సీ’ హిందీ రీమేక్ ఈ ఏడాది నవంబరు 5న విడుదల కానుంది. ఇందులో షాహిద్ కపూర్ హీరో. చదవండి: Sushmita Konidela: సుష్మిత చేతిలోకి ఎనిమిది బుల్లెట్లు -
స్త్రీలోక సంచారం
మైసూరు సమీపంలోని కృష్ణరాజనగర్ తాలూకా పరిధిలో గల ఎరెమనుగణహళ్లి గ్రామంలో ఉన్న 450 మంది జనాభాలో నయీమా ఖాన్ (8) అనే ఒక ఒక్క బాలిక ఆ గ్రామంలోని ప్రభుత్వ పూర్వ ప్రాథమిక పాఠశాలకు గత మూడేళ్లుగా క్రమం తప్పకుండా వెళుతుండగా.. ఆమె పట్టుదలను చూసి.. ఆ ఒక్క విద్యార్థిని కోసం.. ఉర్దూ బోధించడానికి సబియా సుల్తాన్, కన్నడ బోధించడానికి నాగరాజు అనే ఇద్దరు ప్రభుత్వ టీచర్లు ఏనాడూ గైర్హాజరు కాకుండా స్కూలుకు హాజరవుతున్న విషయం వార్తల్లోకి వచ్చింది. దళిత జనాభా అధిక సంఖ్యలో ఉన్న ఈ గ్రామంలో ప్రస్తుతం 40 ముస్లిం కుటుంబాలు ఉండగా, ఆ కుటుంబాలంతటికీ నయీమా ఖాన్ ఒక్కతే చదువుకుంటూ, ఆమె మూడవ తరగతి వరకు రావడానికి తోడ్పడిన ఈ పాఠశాలను ఉర్దూ భాష వ్యాప్తి కోసం ప్రభుత్వం 60 ఏళ్ల క్రితం స్థాపించింది. మిస్ ఇంగ్లండ్ ఫైనల్స్‌లో తొలిసారి హిజబ్ ధరించి పాల్గొన్న యువతిగా శారా ఇఫ్తెఖర్ అనే విద్యార్థిని రికార్డు సృష్టించారు. మిస్ ఇంగ్లండ్ పోటీలలో గతంలో క్వాలిఫయింగ్ రౌండ్స్‌లో హిజబ్ ధరించి పాల్గొన్నవారు ఉన్నప్పటికీ, ఫైనల్స్‌లో హిజబ్‌తో పోటీకి నిలబడడం ఇదే మొదటిసారి. ఏలీ ఫ్రేజర్ అనే స్కాట్లాండ్ యువతి.. తన బాయ్‌ఫ్రెండ్ ఆవు ఒంటి మీద, ‘నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా?’ అని రాసి, ఆ ఆవును ఆమె దగ్గరికి తోలుకొచ్చి, తను ఆమె ఎదురుగా మోకాలిపై వంగి, ప్రపోజ్ చెయ్యడంతో ఆనందంతో పొంగిపోయి, వెంటనే ‘ఎస్’ చెప్పడం ఒక విశేషం అయింది. ఆమె ఈడు వాడే అయిన క్రిస్ గాస్పెల్ అనే 30 ఏళ్ల యువ రైతు, ఎంతో భిన్నంగా ఆలోచించి, తన మనోభావాలను ప్రియురాలికి వ్యక్తం చేసిన తీరుకు ముచ్చట పడిన ఇరువైపు స్నేహితులు కూడా అబ్బాయికి అమ్మాయి ఓకే చెప్పడంలో తగిన పాత్ర పోషించారు. జీవితంలోని అన్ని దశల్లోనూ స్త్రీజాతి ఎదుర్కొంటున్న వివక్షల్ని, వరకట్న వేధింపుల్ని, లైంగిక హింసల్ని, అసమానతలను మనసుకు హత్తుకునేలా చిత్రీకరించి.. స్త్రీ తలచుకుంటే, స్త్రీ తిరగబడితే ఏ శక్తీ ఆమెను ఆపలేదని, ఆమె సహనాన్ని పరీక్షించడం మానవ జాతికే క్షేమకరం కాదనీ.. సందేశం ఇస్తూ.. తెలుగు బిగ్‌బాస్ 2 కంటెస్టెంట్ రోల్ రైడా (రాహుల్ కుమార్ వేల్పుల) దృశ్యీకరించి ‘అరుపు’ పేరుతో యూట్యూబ్‌లోకి ఆగస్టు 24 న విడుదల చేసిన వీడియో అమితమైన వీక్షకాదరణ పొందుతోంది. ఇప్పటి వరకు దాదాపు 20 లక్షల హిట్స్‌కు చేరుకున్న ఈ 6 ని. 58 సెకన్ల వీడియోకు పాట రాసి, పెర్ఫామ్ చేసింది రైడానే కాగా, మ్యూజిక్‌ను కమ్రాన్, గాత్రాన్ని మనీషా అందించారు. దగాపడి, పడుపు వృత్తిలో కూరుకుపోయిన ఓ అమాయకపు పల్లెటూరి అమ్మాయి జీవితం ఎన్ని మలుపులు తిరిగిందో, వాటిని ఆమె ఏ విధంగా ధైర్యంగా ఎదుర్కొందో చూపించే ‘లవ్ సోనియా’ చిత్రం ఈ నెల 14న దేశవ్యాప్తంగా విడుదలకు సిద్ధం అయిన నేపథ్యంలో చిత్రంలో సోనియా పాత్రను పోషించిన మరాఠీ నటి మృణాళ్ ఠాకూర్ ప్రమోషనల్ ఇంటర్వ్యూలు ఇన్స్పైరింగ్గా ఉంటున్నాయి. ‘మౌనంగా ఉండమనీ, మౌనంగా భరించమనీ’ అమ్మాయిలకు నూరి పోయడం అంటే.. వారిని చేజేతులా నరక కూపంలోకి నెట్టివేయడమేనని మృణాల్ తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. జాతిపిత గాంధీజీ హత్యకు గురైనప్పుడు సంబరాలు జరుపుకున్నవారు ఇప్పుడు జాతిని పరిపాలిస్తున్నారని బాలీవుడ్ నటి స్వరాభాస్కర్ ఆలోచన రేకెత్తించే వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ముంబై, రాంచీ, హైదరాబాద్, ఫరీదాబాద్, ఢిల్లీ, థాణెలలో కొందరు హక్కుల కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేసిన విషయమై న్యూఢిల్లీలో శనివారం జరిగిన ‘ఇండియ¯Œ ఉమెన్ ప్రెస్ కోర్’ సమావేశంలో ఒక ప్రశ్నకు సమాధానంగా ఈ వ్యాఖ్యను చేసిన స్వరా భాస్కర్.. చేతలకు శిక్ష విధించాలి కానీ, ఆలోచనలకు కాదు’ అని కూడా అంటూ హక్కుల కార్యకర్తలను సమర్థించడంతో పాటు, ఎన్డీయే ప్రభుత్వం వైఖరి మీద తన తీవ్రమైన అసంతృప్తిని వ్యక్తం చేశారు. అక్టోబర్ 12న విడుదల అవుతున్న బాలీవుడ్ రొమాంటిక్ మ్యూజికల్ డ్రామా మూవీ ‘జలేబీ’ పోస్టర్లో హీరోయిన్ రియా చక్రవర్తిని, కొత్త కుర్రాడైన హీరో వరుణ్ మిత్రా ముద్దు పెట్టుకుంటున్న సన్నివేశంపై అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. బాలికలు, మహిళలపై అసంఖ్యాకంగా లైంగిక అకృత్యాలు జరుగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఇలాంటి పోస్టర్లు అబ్బాయిల్లో చెడు తలంపులకు కలిగించే ప్రమాదం లేకపోలేదన్న వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. నాలుగిళ్లలో పని చేసి, ఏళ్ల పాటు రూపాయి రూపాయి కూడబెట్టుకుని లక్షా 39 వేలు పొదుపు చేసుకుని, నోట్ల రద్దుతో తీవ్ర మనోవేదనకు గురైన మీనాక్షి (41) అనే మహిళ ఆ నోట్లను గడువు లోపల మార్చుకోవడం తెలియక, వాటిని తీసుకెళ్లి హేమావతి నీటిలో కలిపి వేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సరిగా మాటలు రాని, ఏదీ వినిపించని మీనాక్షి.. తనకు బ్యాంకు అకౌంట్ లేకపోవడం, నోట్లు ఎలా మార్చుకోవాలో తెలియకపోవడం, అంతకన్నా కూడా తను డబ్బు దాచిన విషయం ఎవరికీ తెలియకూడదని అనుకోవడంతో చాలాకాలం పాటు సతమతమై, గడుపు తేదీ అయిన మార్చి 31 (2017) తర్వాత కూడా ఇంట్లో నోట్లుంటే నేరమని తెలుసుకుని, ఆఖరి ప్రయత్నంగా వాటిని మార్చుకునేందుకు మాజీ ప్రధాని దేవెగౌడను, బ్యాంకు అధికారులను కూడా కలిసి, ప్రయోజనం లేక ఈ వ్యవస్థపై కోపంతో తన కష్టార్జితాన్నంతా నీటి పాలు చేసుకుందని ఆమె తల్లి లక్ష్మీదేవి (70) కంట తడి పెట్టుకున్నారు. -
మరో ‘మహానది’
ఆడపిల్లల అక్రమ రవాణాపై గతంలో కమలహాసన్ ‘మహానది’ చిత్రాన్ని తీశాడు. మళ్లీ ఇటీవలి కాలంలో బాలీవుడ్, ఇతర భారతీయ సినిమాల దృష్టి ఈ అక్రమ రవాణా మీద పడింది. ఎన్ని చట్టాలు తెచ్చినా, అవరోధాలు సృష్టించినా, జాగ్రత్తలు తీసుకున్నా స్త్రీల రక్తంతో, కన్నీటితో మహోధృతంగా ఆ పాపపంకిల మహానది పరుగులిడుతూనే ఉంది అనడానికి రాబోతున్న ‘లవ్ సోనియా’ సినిమాయే వకాల్తా. ప్రపంచ వ్యాప్తంగా వ్యభిచారం మీద సంవత్సరానికి జరిగే వ్యాపారం ఎంతో తెలుసా? అక్షరాలా 20 లక్షల కోట్ల రూపాయలు. ఇది కూడా కచ్చితమైన లెక్క కాదు. ఎంత అనేది ఎవరి ఊహకూ అందనిది. అది ఎంతైనా అన్నెం పున్నెం ఎరగని అమాయక స్త్రీల దేహాల మీద, యువతుల ఆక్రందనల మీద, చిన్న పిల్లల ఆర్తనాదాల మీద నిలబెట్టిన ఆర్థిక సామ్రాజ్యం. ఇందులో భారత్ వాటా తక్కువ కాదు.సంవత్సరానికి మన దేశంలో రెండు లక్షల కోట్ల రూపాయల వ్యాపారం ‘వ్యభిచారం’ మీద జరుగుతుందని అంచనా. ఈ మొత్తం కూడా ఇంకా ఎక్కువే ఉండవచ్చు. దేశంలో ముప్పై లక్షల మంది ఆడవాళ్లు కనీసం ఈ రొంపిలో ఉన్నారు. వీరిలో నలభై శాతం మంది మైనర్లు. మొత్తం సంఖ్యలో ఎనభై శాతం మంది అక్రమ రవాణా ద్వారా ఈ కూపంలో దింపబడిన వాళ్లే. ఈ అక్రమ రవాణాకు బలైన వారందరూ ఎక్కడి నుంచి వస్తారు? పేదరికంలో ఉన్నవారి నుంచి, నిర్లక్ష్యానికి గురైన సమూహాల నుంచి, వంచనకు, మోసానికి గురై... వీరి జీవితం ఎంత నరకప్రాయంగా మారుతుందో ఊహించను కూడా ఊహించలేము.స్త్రీల అక్రమ రవాణా మీద తెలుగులో కొన్ని సినిమాలు ‘లైట్’ వేసే ప్రయత్నం చేశాయి. ‘గులాబి’ సినిమా అందులో ముఖ్యమైనది. దాని కంటే చాలా కాలం ముందు ‘పట్నం వచ్చిన పతివ్రతలు’ సినిమా కూడా అమాయక స్త్రీలను ఈ రొంపిలో దించే కథాంశంతోనే వచ్చింది. కమలహాసన్ నటించిన ‘మహానది’ ఏకంగా సెక్స్వాటికల వరకూ కెమెరాను తీసుకెళ్లి ఈ కోరల్లో చిక్కుకున్నవారి జీవితాన్ని చూపించి కదిలించింది. ‘గజిని’ సినిమాలో ట్రాఫికింగ్‌ను అడ్డుకొనబోయే అసిన్ ప్రాణాలు విడుస్తుంది. ఇటీవల ‘కృష్ణార్జున యుద్ధం’లో ఇదే లైన్ తీసుకున్నారు కానీ సీరియస్‌గా డీల్ చేయలేదు. ఇప్పుడు బాలీవుడ్లో రాబోతున్న ‘లవ్ సోనియా’ సినిమా మాత్రం పూర్తిగా అధ్యయనం చేసి మరీ లోతుగా ఈ అంశం మీద తీసిన సినిమాగా చెప్పవచ్చు. ‘లవ్ సోనియా’ ఇద్దరు అక్కాచెల్లెళ్ల కథ. వ్యవసాయం చేసే కుటుంబానికి చెందిన ఈ అక్కాచెల్లెళ్లలో ఒకరిని వ్యవసాయం వల్ల నిరుపేదగా మారిన తండ్రి ఒక ఇంటికి పని మనిషిగా అమ్మేస్తాడు. కాని ఆ అమ్మాయి కేవలం అక్కడ పని మనిషిగా ఉండదు. చేతులు మారి వ్యభిచార కేంద్రానికి చేరుతుంది. ముఖ్యమైన విషయం ఏమిటంటే ‘విటుల’కు ‘కన్య’లు కావాలి. ఈ ‘కన్య’ల కోసం ఎంత డబ్బైనా చెల్లిస్తారు.ఈ సినిమాలో ఈ సోదరి ‘కన్యత్వానికి’ బాగా రేటు పలుకుతుంది. కానీ మనం స్థాణువయ్యే అంశం ఏమిటంటే మళ్లీ వీరికి చిన్నపాటి ‘ఆపరేషన్’ చేయించి విటులకు ‘కన్యలు సిద్ధం’ అని చెప్తారు. అలా ఈ సోదరి ఒకసారి కన్యత్వం కోల్పోయి ‘తెప్పించుకున్న కన్యత్వం’తో హాంకాంగ్‌కు అమ్మివేయబడుతుంది. అక్కడి నుంచి సరుకులు చేరవేసే కంటైనర్‌లో అమెరికాలోని లాస్ ఏంజెలెస్‌కు చేరుతుంది. ఆడపిల్లల అక్రమ రవాణాకు చైనావారు కనిపెట్టిన పద్ధతి ఇది. సరుకులు చేరవేసే కంటైనర్‌లో గాలి వెలుతురు లేని బిగింపు మధ్య పశువుల కంటే ఘోరంగా వెలుతురు చూడకుండా వీళ్లు రోజుల తరబడి ఓడలో ప్రయాణించి దేశాలు దాటుతారు. మన దేశంలో కూడా ఈ వ్యవస్థ పకడ్బందీగా సాగుతోందని ఈ రంగంలో పని చేస్తున్న ఎన్జీవో సంఘాలు చెబుతున్నాయి. ‘కృష్ణార్జునయుద్ధం’లో కూడా ఈ పాయింట్ చూపించారు. సరే... ఈ సోదరి నరక కూపంలో పడింది. ఇంకో సోదరి ఊరికే ఉండలేకపోతుంది. తన ప్రాణప్రదమైన సోదరి కోసం వెతుకులాట మొదలెడుతుంది. ఆమె పేరు సోనియా. ఎన్నో కష్టనష్టాలు, ప్రమాదాలు ఎదుర్కొని ఈ సోనియా తన సోదరిని ఎలా చేరుకుంటుందనేది కథ.ఈ సినిమాకు దర్శకత్వం వహించిన తబ్రేజ్ నూరానీ అమెరికాలో స్థిరపడ్డ భారతీయుడు. అంతేకాదు గత పదేళ్లుగా అక్రమ రవాణా జరుగుతున్న స్త్రీల గురించి పని చేస్తున్న కార్యకర్త. కొందరికి విముక్తి కూడా ప్రసాదించగలిగాడు. నాలుగేళ్ల పాటు అతడు రాసుకున్న కథకు రూపమే ‘లవ్ సోనియా’. ఇందులో దళారీలు, ‘మేడమ్’లు, విటులు... వీళ్ల వికృతత్వం ఏ స్థాయిలో ఉంటుందో చూపించే ప్రయత్నం చేశాడు తబ్రేజ్. అంతేకాదు ఈ కూపం నుంచి బయటపడిన కొందరు స్త్రీలను కూడా సినిమాలో భాగం చేశాడు. వాళ్లందరూ నటించారు కూడా.రోజూ దినపత్రికలు, టీవీ చానల్స్ ఎన్నో ఉదంతాలను బయటపెట్టి చైతన్యం తెచ్చే ప్రయత్నం చేస్తున్నాయి అక్రమ రవాణా విషయంలో. కానీ సినిమా వంటి మాధ్యమం ఇంకా ఎక్కువ ప్రభావాన్ని ఏర్పరచగలదు. ‘లవ్ సోనియా’ కచ్చితంగా మనకు తెలియని చీకటి లోకాన్ని పరిచయం చేసి మనం మరింత జాగ్రత్త పడేలా, చైతన్యంతో ఉండేలా, ప్రభుత్వ వ్యవస్థలు మేలుకొని పని చేసేలా చేయగలదని ఆశిద్దాం. -
లవ్ సోనియా: లాస్ ఏంజిల్స్ చీకటి కోణం
అమెరికాలో రెండో అతిపెద్ద నగరమైన లాస్ ఏంజిల్స్.. షిప్పులో నుంచి అప్పుడే దించిన కంటెయినర్ నిండా అమ్మాయిలు. చైనా నుంచి కిడ్నాప్ చేసి తీసుకొచ్చిన ఆ యువతుల బృందంలో ఓ ఇండియన్ కూడా ఉంది. దూరంగా నిల్చున్న తబ్రేజ్ నూరానీ.. ఆ అమ్మాయిలను ఎక్కడికి తీసుకెళ్తారా అని ఆరాతీశాడు. రకరకాలుగా వేధించి కిడ్నాపర్లు ఆ అమ్మాయిలను బలవంతంగా వ్యభిచారం రొంపిలోకి దింపుతారని తెలుసుకున్నాడు. పరిశీలించేకొద్దీ నూరానీకి ఇలాంటి ఉదంతాలా ఎన్నో కనిపించాయి. పోలీసులతో కలిసి వెళ్లి వ్యభిచార గృహాలపై దాడులను దగ్గర్నుంచి చూశాడు నూరానీ. నిజానికి అతను జర్నలిస్ట్ కాదు. సినిమా పర్సనాలిటీ. లాస్ ఏంజిల్స్ లోనే అతనికి డేవిడ్ వోమార్క్ తో పరిచయం అయింది. అప్పటికి డేవిడ్ 'లైఫ్ ఆఫ్ పై' అనే సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. నూరానీ చెప్పిన లైన్ నచ్చడంతో సినిమా చేద్దామని మాటిచ్చాడు. మూడేళ్ల ప్రాజెక్ట్ సెట్స్ మీదికి వచ్చింది. సినిమా పేరు లవ్ సోనియా. లాస్ ఏంజిల్స్ లో తాను చూసిన భాతీయ యువతి నిజజీవిత గాథ ఆధారంగా తబ్రేజ్ నూరానీ తీస్తున్న ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ టైటిల్ రోల్ చేస్తోంది. ఫ్రిదా పింటో, రిచా చడ్డా, అనుపమ్ ఖేర్, మనోజ్ వాజపేయి ఇతర నటీనటులు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ రాజస్థాన్ లో జరుగుతోంది. టెడ్ కప్లాన్, అల్కేశ్ విజాలు సంయుక్తంగా కథను అందించారు. రాజస్థాన్ లోని అద్భుతమైన లొకేషన్లలో 'లవ్ సోనియా'ను షూట్ చేస్తున్నాం అంటూ నటుడు అనుపమ్ ఖేర్ సోమవారం ట్వీట్ చేశారు. ఇండియాతోపాటు హాంకాంగ్, లాస్ ఏంజిల్స్ లో షూటింగ్ జరుపుకోబోయే ఈ సినిమా హిందీ, ఇంగ్లీష్ భాషల్లో తెరకెక్కుతోంది. 'ది హల్క్', 'లైఫ్ ఆఫ్ పై', 'జీఐ జో రైస్ ఆఫ్ కోబ్రా' వంటి హిట్ చిత్రాల నిర్మాత కావటంతో డేవిడ్ రూపొందిస్తున్న 'లవ్ సోనియా' పట్ల హాలీవుడ్ లోనూ విపరీతమైన ఆసక్తి నెలకొంది. నిర్మాత డేవిడ్ వోమార్క్, దర్శకుడు తబ్రేజ్ నూరానీతో నటుడు అనుపమ్ ఖేర్.