ఈమె తెలుగు హీరోయిన్.. హిట్లు కొట్టడంలో స్పెషలిస్ట్.. గుర్తుపట్టారా? | Mrunal Thakur 'Love Sonia' Movie Glamour Look And Details | Sakshi
Sakshi News home page

Guess The Actress: మీరనుకునే హీరోయిన్.. కాకపోతే ఆ సినిమాలో అలా!

Published Wed, Jan 31 2024 1:58 PM | Last Updated on Wed, Jan 31 2024 2:26 PM

Mrunal Thakur Love Sonia Movie De Glamour Look And Details - Sakshi

ఈమె తెలుగులో ఫేమస్ హీరోయిన్. సినిమా చేసిందంటే హిట్ గ్యారంటీ. ఏంటి నమ్మట్లేదా? స్టోరీ చదవండి మీకే ఐడియా వచ్చేస్తుంది. చీర కట్టినా.. మోడ్రన్ డ్రస్ వేసినా సరే కేక పుట్టించే అందంగా ఉంటుంది. అలాంటిది సడన్‌గా ఎవరూ గుర్తుపట్టలేని విధంగా కనిపించి షాకయ్యేలా చేసింది. మరి ఇంతలా చెప్పాం కదా ఈమె ఎవరో కనిపెట్టారా? లేదంటే మమ్మల్నే చెప్పేయమంటారా?

(ఇదీ చదవండి: కుమారి ఆంటీ పుడ్ బిజినెస్ క్లోజ్.. సాయం చేస్తానంటున్న తెలుగు హీరో)

పైన ఫొటోలో కనిపిస్తున్న అమ్మాయి పేరు మృణాల్ ఠాకుర్. హా అవును.. 'సీతారామం', 'హాయ్ నాన్న' సినిమాలతో హిట్ కొట్టి.. టాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషన్‌గా మారిన బ్యూటీ ఈమెనే. మహారాష్ట్రలో పుట్టి పెరిగిన ఈ ముద్దుగుమ్మ.. కాలేజీ అయిపోగానే సీరియల్స్‌లో నటించింది. 'కుంకుమ భాగ్య' ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే మాత్రం వాళ్లని అడిగితే మృణాల్ గురించి చెప్పేస్తారు.

2012 నుంచి సీరియల్స్, 2014 నుంచి సినిమాలు చేస్తున్న మృణాల్.. హిందీ, తెలుగు, మరాఠీ భాషల్లో నటించేసింది. పైన ఫొటోలో కనిపిస్తున్న లుక్ మాత్రం 'లవ్ సోనియా' మూవీలోనిది. 2012లో ఈ ప్రాజెక్ట్ మొదలైంది కానీ 2018లో రిలీజైంది. అందుకే గుర్తుపట్టలేనత డీ గ్లామర్‌గా మృణాల్ కనిపిస్తోంది. దీనికి తోడు ఈ సినిమా కథంతా కూడా ముంబయి రెడ్ లైట్ ఏరియా బ్యాక్ డ్రాప్‌తో తీశారు. తాజాగా ఆ చిత్రంలో మృణాల్ స్టిల్స్ వైరల్ కావడంతో తొలుత ఈమె ఎవరా అనుకున్నారు. మృణాల్ అని తెలిసి అవాక్కయ్యారు. ఇకపోతే 'లవ్ సోనియా' మూవీ ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్‌లో అందుబాటులో ఉంది.

(ఇదీ చదవండి: సంక్రాంతి మూవీస్.. ఓటీటీల్లో రిలీజయ్యేది ఎప్పుడంటే?)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement