lover relatives
-
ప్రేమించిన పాపానికి.. కత్తిపోట్లు..
అనంతపురం: నగరంలో సుభాష్‌రోడ్డు నామాటవర్స్ సమీపంలో ఓ వ్యక్తిపై విచక్షణా రహితంగా దాడి చేయడం కలకలం సృష్టించింది. పోలీసుల వివరాల మేరకు.. నల్లచెరువు మండలానికి చెందిన లక్ష్మీపతినాయుడు నగరంలో భైరవనగర్‌లో నివాసముంటున్నాడు. అదే మండలానికి చెందిన అమ్మాయిని సంవత్సర కాలంగా ప్రేమించాడు. ఈ విషయం తెలుసుకున్న అమ్మాయి తల్లిదండ్రులు వేరే యువకుడితో వివాహం నిశ్చయించి, శుక్రవారం హరిప్రియ ఫంక్షన్హాల్లో వివాహం జరిపించారు. దీంతో లక్ష్మీపతినాయుడు ఫంక్షన్‌హాల్ సమీపంలో మాటు వేశాడు. ఇది గమనించిన వధువు తరుఫు బంధువులు కత్తులు, రాడ్లతో అతడిపై దాడి చేశారు. క్షతగాత్రున్ని స్థానికులు వెంటనే ప్రభుత్వాసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న వన్‌టౌన్ సీఐ సాయిప్రసాద్, ఎస్ఐ వెంకటరమణ ప్రభుత్వాసుపత్రికి వెళ్లి బాధితుడితో ఫిర్యాదు తీసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
ఇద్దరు భార్యలున్నా మరో యువతితో..
ప్రేమ వ్యవహారం = కారు డ్రైవర్‌ను చితకబాదిన ప్రియురాలి బంధువులు బెంగళూరు(బనశంకరి) : ఇద్దరు భార్యలున్నా మరో యువతిని ప్రేమలోకి దించిన కారు డ్రైవర్‌ను ప్రియురాలి బంధువులు చితకబాది పోలీసులకు అప్పగించారు.ఈ ఘటన జ్ఞానభారతి పోలీస్‌స్టేషన్ పరిధిలో శుక్రవారం చోటుచేసుకుంది. కగ్గలిపురకు చెందిన వజ్రేశ్ కారుడ్రైవరుగా పనిచేస్తున్నాడు. దొడ్డబళ్లాపుర తాలూకాకు చెందిన శశికళా అనే యువతిని వివాహం చేసుకుని రాజరాజేశ్వరినగరలో నివాసముంటున్నారు. అనంతరం మొదటి భార్యకు తెలియకుండా హొసకోటే తాలూకాకు చెందిన రూపా అనే యువతిని వివాహం చేసుకుని జ్ఞానభారతిపోలీస్స్టేషన్ పరిధిలోని బీడీఏ కాంప్లెక్స్ సమీపంలో అద్దె ఇంటిలో ఉంచాడు. ఇటీవల కగ్గలిపుర పోలీస్‌స్టేషన్ పరిధిలో 19 ఏళ్ల యువతిని ప్రేమించాడు. తనను పెళ్లిచేసుకోవాలని కోరడంతో కొంతకాలంగా ఆమెకు దూరంగా ఉంటున్నాడు. రెండు చోట్ల కాపురాలు చేయడంతో ఖర్చు అధికమైన వజ్రేశ్ శశికళాను రూపా వద్దకు తీసుకెళ్లగా రెండు వివాహాలు చేసుకున్నట్లు వెలుగులోకి వచ్చింది. మరో యువతిని కూడా ప్రేమించినట్లు తెలియడంతో రూపా, శశికళలు శుక్రవారం ఉదయం వజ్రేశ్తో గొడవ పడ్డారు. విషయం ప్రేయసికి తెలియడంతో ఆమె తరఫు బంధువులు అక్కడకు చేరుకొని వజ్రేశ్ను చితకబాదారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వజ్రేశ్ ను అదుపులోకి విచారణ చేపట్టారు.