luxurious house
-
తన ఇంటిని అమ్మేసిన ముకేశ్ అంబానీ...
-
ముంబైలో మరో కాస్ట్లీ ఇంటిని కొన్న అమితాబ్ బచ్చన్!
ముంబై : బిగ్‌బి అమితాబ్ బచ్చన్ ముంబైలో మరో ఖరీధైన ఇంటికి కొనుగోలు చేసినట్లు ఓ వార్త బీటౌన్‌లో చక్కర్లు కొడుతుంది. 31 కోట్ల విలువైన ఈ ఇంటికి సంబంధించి 2020లోనే రిజిస్ట్రేషన్ పూర్తి చేసినట్లు సమాచారం. దాదాపు 27-28 అంతస్థులు కలిగిన ఈ డూప్లెక్ ఇంటిని ప్రముఖ వాణిజ్య సంస్థ టైర్ -2 బిల్డర్ క్రిస్టల్ గ్రూప్ నుంచి బిగ్‌బి ఖరీదు చేసినట్లు తెలుస్తోంది. దాదాపు 5,184 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఎంతో విలాసవంతంగా ఈ ఇంటి నిర్మాణం ఉందని బీటౌన్ వర్గాలు చెబుతున్నాయి. దాదాపు ఆరు కార్ల పార్కింగ్ కెపాసిటీతో పాటు అనేక సదుపాయాలు ఉన్నట్లు తెలుస్తోంది. ముంబైలోని అంథేరి సబర్భన్‌లో అట్లాంటిక్ ఏరియాలో ఈ ఇళ్లు ఉందని తెలుస్తోంది. కాగా ఇదే అపార్ట్మెంట్లో ఇదివరకే బాలీవుడ్ ప్రముఖులు సన్నీలియోన్, దర్శకుడు ఆనంద్ ఎల్ రాయ్ కూడా ఫ్లాట్లు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. 16 కోట్లతో సన్నీలియోన్ ఓ అపార్ట్‌మెంట్‌ను కొనుగోలు చేయగా, డైరెక్టర్ ఆనంద్ రాయ్ 25 కోట్లతో మరో అపార్ట్‌మెంట్‌ను తీసుకున్నట్లు టాక్. ప్రస్తుతం అదే ప్రాంతంలో బిగ్‌బి కూడా ఇంటిని కొనుగోలు చేశారు. ఇప్పటికే ముంబైలో ఆయనకు ఐదు ఖరీధైన ఇళ్లు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన జుహులో నివాసం ఉంటున్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం బిగ్‌బి చెహ్ర్, జుండ్, మేడే, గుడ్ బై చిత్రాల్లో నటిస్తున్నారు. తెలుగులో ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబినేషన్లో తెరకెక్కనున్న చిత్రంలోనూ కీలక పాత్ర పోషించనున్నారు. రణ్‌బీర్, ఆలియా, నాగార్జునతో కలిసి నటించిన బ్రహ్మాస్త్ర సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. చదవండి : ఆఫీసు జలమయం, సిబ్బందికి తన దుస్తులిచ్చిన బిగ్‌బీ ఇంటి రిజిస్ట్రేషన్ ఎవరి పేరు మీద చేశారో తెలిస్తే షాకే! -
టాయిలెట్ కూడా గోల్డే!
ముంబై : దేశీయ బ్యాంకులకు ఎన్నికోట్లు ఎగ్గొడితే ఏమిటి.. లగ్జరీ లైఫ్ అంటే అతనిదే అని చెప్పుకోవచ్చు. ఫార్ములా వన్, క్రికెట్, ఫుట్‌బాల్ టీమ్ వంటి అంతర్జాతీయ స్పోర్ట్స్ ఈవెంట్లలో అతను చేసే హడావుడి అంతాఇంతా కాదు. ప్రపంచంలో అత్యంత అరుదైన వస్తువులుగా చెప్పుకునే మహాత్మాగాంధీ గ్లాసెస్, టిప్పు సుల్తాన్ కత్తిలను తన వశం చేసుకున్నాడు. అతనెవరో ఇప్పటికే మీకు తెలిసిపోయి ఉంటుంది. అతనే దేశీయ బ్యాంకులకు వేల కోట్ల రుణాలు ఎగ్గొట్టి విదేశాల్లో లగ్జరీ లైఫ్ గడుపుతున్న లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా. అతని లగ్జరీ లైఫ్ ఇంతే అనుకున్నారా? వింటే మీరే షాకైపోతారట. లండన్‌లో మాల్యాకు ఓ లగ్జరీ ఇల్లు ఉండిందని తెలిసింది. ఆ ఇంట్లో గోల్డెన్ టాయిలెట్‌ను మాల్యా కలిగి ఉన్నారని రిపోర్టులు వెలువడుతున్నాయి. ఓ వైపు మాల్యా వ్యాపారాలు కుదేలు అవుతున్నా.. మరోవైపు భారతీయ అథారిటీలు అతన్ని ఎలాగైనా భారత్‌కు తీసుకొచ్చి జైలులో పెట్టాలని ప్రయత్నిస్తున్నా.. తాను మాత్రం లండన్ ఇంటిలో లగ్జరీ లైఫ్‌తో ఎంజాయ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ ఇంట్లో ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన లగ్జరీ వస్తువులున్నట్టు రిపోర్టు తెలిపింది. రచయిత జేమ్స్ క్రాబ్ట్రీకి ఒకసారి విజయ్‌మాల్యా ఇంటిని సందర్శించే అవకాశం వచ్చినప్పుడు, మాల్యా ఇంట్లో ఉన్న గోల్డెన్ టాయిలెట్‌ను చూశారని తాజా రిపోర్టు పేర్కొంది. జేమ్స్, లీ కౌన్ యూ స్కూల్ అసోసియేట్ ప్రొఫెసర్. ఈ విషయాన్ని జేమ్స్ ఈ వారంలో ముంబైలో జరిగిన ఓ ఈవెంట్లో కూడా చెప్పారని రిపోర్టు వెల్లడించింది. లండన్‌లోని రీజెంట్స్ పార్క్‌లో ఉన్న మాల్యా భవంతిని తాను సందర్శించానని, ఆ భవంతిని, దానిలో ఉన్న లగ్జరీ వస్తువులను చూసిన తర్వాత తాను ఒక్కసారిగా ఈ ప్రపంచాన్నే మర్చిపోయినట్టు జేమ్స్ చెప్పారు. అక్కడే గోల్డెన్ రిమ్‌తో ఉన్న గోల్డెన్ టాయిలెట్ కనిపించిందని పేర్కొన్నారు. అయితే ఆ భవంతిలో గోల్డెన్ టాయిలెట్ ఉన్నప్పటికీ, గోల్డెన్ టాయిలెట్ పేపర్ లేదన్నారు. ఇలా విజయ్ మాల్యా గోల్డెన్ టాయిలెట్ విషయం బయటకి వచ్చింది. -
కపిల్ ఇంటి కిరాయి అక్షరాలా రూ. 16 లక్షలు
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర మాజీ మంత్రి కపిల్ సిబల్ మారనున్న ఇంటి అద్దె ఎంతో తెలుసా. అక్షరాలా రూ. 16 లక్షలట. యూపీఏ సర్కారులో పదేళ్లు కేబినెట్ మంత్రిగా ఉన్న సిబల్.. తీన్‌మూర్తి రోడ్డులోని ప్రభుత్వ బంగ్లాను ఖాళీ చేసి అన్ని సౌకర్యాలతో కూడిన విలాసవంతమైన అద్దె ఇంటికి మారనున్నారు. జోర్‌బాగ్ ప్రాంతంలోని ఈ ఇంటికి ఆయన త్వరలో మారనున్నారు. నగరంలో అత్యంత అధిక అద్దె పలుకుతోన్న భవనాల్లో ఇదొకటని అంటున్నారు. చాందినీచౌక్ నియోజకవర్గం నుంచి లోక్‌సభ ఎన్నికలలో పోటీచేసి ఓడిపోయిన కపిల్ సిబల్ ప్రభుత్వ బంగ్లాను ఖాళీ చేసి ఆగస్టు ఒకటో తేదీన అద్దె ఇంటికి మారనున్నారు. ఎమ్మార్ ఎంజీఎఫ్ ప్రమోటర్ శ్రవణ్ గుప్తా బావమరిది సిద్ధార్థ్ సరీన్ బంగ్లాను ఆయన అద్దెకు తీసుకున్నారు. ఢిల్లీకి చెందిన వ్యాపారవేత్త అయిన సరీన్త్ ఈ ఇంటికి నెలకు 18 లక్షల రూపాయల అద్దె డిమాండ్ చేశారని, పదహారు లక్షలకు అద్దె ఒప్పందం కుదిరిందని అంటున్నారు. దేశంలోని ప్రముఖ న్యాయవాదులలో ఒకరైన కపిల్ సిబల్ ఈ ఇంట్లో నుంచి లా ప్రాక్టీసు చేయాలనుకుంటున్నారు. ఆయన లా ఆఫీసు కూడా ఇదే భవనంలో ఏర్పాటుచేసుకోనున్నారు. కార్పొరేట్, రాజ్యాంగ వ్యవహారాలలో దిట్ట అయిన కపిల్ సిబల్ అనేక ప్రముఖ కేసులలో తన సత్తా చూపారు. మన్మోహన్ సింగ్ మంత్రివర్గంలో సభ్యుడయ్యాక ఆయన తన న్యాయవాద వృత్తిని పక్కనపెట్టారు. లుట్యెన్స్ జోన్లో బంగ్లాలు తక్కువగా, డిమాండ్ ఎక్కువగా ఉన్నందువల్ల ఎక్కువ అద్దెలు పలుకుతున్నాయని రియల్టర్లు అంటున్నారు. ఎన్నికల్లో ఓడిపోయిన 265 మంది ఎంపీలు ప్రభుత్వ భవనాలను ఖాళీ చేయాల్సి ఉంది. వారిలో పలువురు లుట్యెన్స్ జోన్‌లోని ప్రైవేటు భవనాలకు మారాలనుకుంటున్నారు. ప్రధాన నివాసం, పార్లమెంట్, ఇతర ప్రభుత్వ కార్యాలయాలకు నెలవైన లుట్యెన్స్ జోన్లో నివసిం చడం తమకు హోదాకు అనుగుణంగా ఉంటుందని పలువురు రాజకీయవేత్తలు, వాణిజ్య వేత్తలు భావిస్తుంటారు. లుట్యెన్స్ జోన్లో 1000 పైగా బంగ్లాలు ఉన్నాయి. అయితే ఇందులో కేవలం 10 శాతం మాత్రమే ప్రయివేటు బంగ్లాలు, ఈ బంగ్లాలో కొన్ని దేశంలోని ప్రముఖ వాణిజ్యవేత్తలకు చెందినవి. ఎల్ఎన్ మిట్టల్, కేపీసింగ్ , సునీల్ మిట్టల్, నవీన్ జిందాల్ వంటి వాణిజ్యవేత్తలకు ఈ ప్రాంతంలోనే సొంత భవనాలున్నాయి.