కొత్త వివాదంలోకి జేఎన్‌యూ వీసీ
న్యూఢిల్లీ: జేఎన్‌యూ వివాదం రోజుకో మలుపు తీసుకుంటుంది. యూనివర్సిటీలో దేశ వ్యతిరేక నినాదాలు చేశారని కొంతమంది విద్యార్థులను పోలీసులు అరెస్టు చేయగా.. అసలు పోలీసులు విశ్వవిద్యాలయంలోకి ఎలా ప్రవేశించారనే ప్రశ్న ప్రస్తుతం తలెత్తుతోంది. వైస్ ఛాన్సలర్ ఎం జగదీశ్ కుమారే స్వయంగా పోలీసులను ఆహ్వానించాడని, వారిని క్యాంపస్ లోకి అనుమతించాడని తాజాగా ఓ లేఖ బయటపడింది.
అయితే, అంతకుముందు వీసీ కుమార్ మాట్లాడుతూ అసలు తాను పోలీసులకు అనుమతి ఇవ్వనే లేదని చెప్పిన నేపథ్యంలో ఈ లేఖ స్వయంగా ఆయనే పోలీసులకు రాసినట్లు తాజాగా బయటపడటం కొంత ఆసక్తిని కలిగిస్తోంది. వీసీ ఏవో నిజాలు దాచిపెడుతున్నారని యూనివర్సిటీలోని పలువురు విద్యార్థినాయకులు, నాన్ టీచింగ్, టీచింగ్ స్టాఫ్‌లలో కొంతమంది ఆరోపిస్తున్నారు. ఈ నెల 9న క్యాంపస్‌లోకి పోలీసులకు అనుమతిస్తూ ఆయన స్వయంగా సంతకం చేసిన లేఖ ఒకటి తాజాగా బయటపడింది. ఆరోజే ఏఐఎస్ఎఫ్ విద్యార్థి నాయకుడు కన్నయ్య కుమార్ ను పోలీసులు అరెస్టు చేశారు.