madabushi sridher
-
జనమే సార్వభౌమాధికారులు
విశ్లేషణ రాష్ట్రపతి, గవర్నర్లకు ఆర్టికల్ 361 కింద ఉన్న మినహాయింపు న్యాయసమీక్షను నిరోధించలేదు. ఒక పబ్లిక్ అథారిటీగా గవర్నర్ కానీ, రాష్ట్రపతి కానీ అవసరమైన సమాచారం ఇవ్వవలసిందే. రాజ్యాంగం రూపొందించిన పాలనా వ్యవస్థలో పూర్తిస్థాయి రాష్ట్రా నికి గవర్నర్ ఉంటారు. ఆ రాజ్యాంగ పదవిని రాజ్ పాల్ అంటారు. కేంద్రపా లిత ప్రాంతానికి పాలకు డిగా లెఫ్టినెంట్ (ఉప) గవర్నర్ ఉంటారు. శాసన సభ, ముఖ్యమంత్రితో కూడిన మంత్రివర్గం కొన్ని కేంద్రపాలిత రాష్ట్రాలలో ఉంటాయి. ఢిల్లీ, పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంతాలలో ఈ విధంగా ముఖ్యమంత్రులు ఉన్నారు. దేశ రాజధాని ఢిల్లీలో కూడా అసెంబ్లీ ఉంది. మంత్రి మండలి, అసెంబ్లీ, ఇతర పాలనా రంగాలన్నీ ఉపగవర్నర్ కింద పనిచేస్తుంటాయి. మంత్రి మండలి సలహాను అనుసరించి గవర్నర్ పాలనా నిర్ణయాలు తీసుకోవలసి ఉంటుంది. కొన్ని పరిమిత రంగాలలో గవర్నర్‌కి సొంతంగా ఆలోచించి నిర్ణయం తీçసుకునే అధికారం ఉంది. ముఖ్యంగా కావలసిన మెజారిటీ లేనపుడు ముఖ్యమంత్రి, అతని మంత్రిమండలి సలహాను గవర్నర్ వినాల్సిన అవసరం లేదు. కొత్తగా ఎవరు ముఖ్యమంత్రి కావాలనే విషయంలో కూడా గవర్నర్‌కు సొంత అధికారాలు ఉంటాయి. ఢిల్లీ కేంద్ర పాలిత ప్రాంతానికి కొన్ని ప్రత్యేక నియమాలను 64వ రాజ్యాంగ సవరణ ద్వారా 1991లో రూపొందించారు. ఉపగవర్నర్ (లెఫ్టినెంట్ గవర్నర్ లేదా ఎల్జి)కు కొన్ని సందర్భాలలో సొంత అధికారా లున్నాయి. అయితే గవర్నర్, ఉప గవర్నర్ పదవులను రాజ్యాంగం కల్పించింది. వారు సమాచార హక్కు పబ్లిక్ అథారిటీ నిర్వచనం పరిధిలోకి వస్తారు. సమాచారాన్ని ఇవ్వడానికి వారు సిద్ధంగా ఉండాలి. రాష్ట్రపతి, గవర్నర్ సార్వభౌమ అధికారాలు కలిగి ఉన్నారు కనుక మామూలు జనానికి సమాచారం చెప్పనవసరం లేదని వాదించారు. బొంబాయి హైకోర్టు సార్వభౌమాధికారం అంటే ఏమిటో వివరించింది. సార్వభౌమాధికార లక్షణాలు రెండు. మొదటిది, మొత్తం ప్రజానీకం గవర్నర్ అధీనంలో ఆజ్ఞానువర్తిగా ఉంటుంది. రెండోది, గవర్నర్ ఎవరి ఆజ్ఞలకూ బద్దుడుగా ఉండడు. సార్వభౌముడికి శాసనాధికారాలు, పాలనాధికారాలు ఉంటాయి. వివాదాలను విచారించి పరిష్క రించే అధికారమూ ఉంటుంది. అయితే ఈ అధికారం ఎవరికి ఉంది? రాజ్యాంగ పీఠిక ప్రకారం సార్వభౌమ సమసమాజ, మతాతీత, ప్రజాస్వామ్య రాజ్యాధికారం భారతదేశ ప్రజలకు కట్టబెట్టింది. రాష్ట్రపతి, గవర్నర్.. మంత్రిమండలి సలహా లేకుండా ఏ నిర్ణయాలూ తీసుకోలేరు, అతికొద్ది సందర్భాలలో తప్ప, కేంద్ర హోంమంత్రి, రాష్ట్రపతిలకు లోబడి గవర్నర్లు పనిచేయాలి. గవర్నర్ అయితే కేంద్రం ఇష్టపడినంత కాలం మాత్రమే పదవిలో ఉంటారు. కనుక వారికి సార్వభౌమ అధికార లక్షణాలు లేవన్నట్టే. రాష్ట్రపతి దేశానికి అధినేత. గవర్నర్ ఒక రాష్ట్రానికి రాజ్ పాల్. ఆర్టికల్ 361 కింద కొన్ని మినహాయిం పులు తప్ప వారికి పెద్దగా సార్వభౌమ ప్రత్యేకత లేమీలేవు. సమాచార హక్కు కింద చెప్పనవసరంలేని మినహాయింపు ఏదీ లేదు. ఆర్టీఐ చట్టం సెక్షన్ 8(1)(ఎ) ప్రకారం దేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను దెబ్బతీసే ఏ సమాచారమూ ఇవ్వనవసరం లేదు. అయితే రాష్ట్రపతి, గవర్నర్లకు సంబంధించిన సమాచారం కూడా దేశ సార్వభౌమాధికారాన్ని దెబ్బతీసే పరిస్థితి ఉంటే ఇవ్వనవసరం లేదు. ఆర్టికల్ 361 ఇచ్చే మినహాయింపు కూడా పరిమితమైనదే. దురుద్దేశపూరితంగా వ్యవహరించారనే ఆరోపణలను విచా రించే అధికారం కోర్టులకు ఉందని అక్కడ ఆర్టికల్ 361 మినహాయింపు వర్తించబోదని రామేశ్వర్ ప్రసాద్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా (2006) 2 ఎస్.సి.ఎస్.సి 1లో తీర్పు చెప్పింది. రాష్ట్రపతి, గవర్నర్లకు ఆర్టికల్ 361 కింద ఉన్న మినహాయింపు న్యాయసమీక్షను నిరోధించలేదు. ఒక పబ్లిక్ అథారిటీగా గవర్నర్‌గానీ, రాష్ట్రపతిగానీ సమాచారం ఇవ్వవలసిందే. అలా ఇవ్వకుండా ఆపడానికి ఆర్టికల్ 361 ఉపయోగపడదు. ప్రజాస్వామ్యంలో సార్వభౌమాధికారం ఒక అధికార హోదాకు పరిమితమై ఉండదు. ప్రజలు, వారెన్నుకున్న ప్రతినిధుల పార్లమెంటు, వారినుంచి వచ్చిన మంత్రిమండలి, ప్రతిని«ధు లంతా ఎన్నుకునే రాష్ట్రపతి, శాసనాలు పాలనా నిర్ణయాలు సమీక్షించే రాజ్యాంగ న్యాయస్థానాలు ఈ సార్వ భౌమాధికారాన్ని పంచుకుంటాయి. గవర్నర్ రాజ్యాంగాన్ని శాసనాన్ని రక్షిస్తానని, రాజ్యాంగం, శాసనాల ప్రకారం నడుస్తానని ప్రమాణ స్వీకారం చేస్తాడు. సమాచారం ఇవ్వాలని పీఐఓ, మొదటి అప్పీలు అధికారి, లేదా సమాచార కమిషన్‌గానీ ఆదేశిస్తే, తన ప్రమాణం ప్రకారం ఆ సమాచారాన్ని వెల్లడించాలని, ఆర్టీఐ చట్టాన్ని ఆ విధంగా పాటించి రక్షించాలని బొంబాయి హైకోర్టు వివరించింది. దీనిపై సుప్రీంకోర్టు తాత్కాలిక స్టే జారీ చేసింది. అయితే స్టే ఆ ఒక్క కేసుకే వర్తిస్తుంది కాని మొత్తం గవర్నర్లు, లెఫ్టినెంట్ గవర్నర్లంతా ఆర్టీఐ కింద జవాబులు ఇవ్వనవసరం లేదని భావించే వీల్లేదు. రాజకీయ పార్టీల నాయకులతో ఢిల్లీ ఉప గవర్నర్ సాగించిన ఉత్తర ప్రత్యుత్తరాలను వెల్లడించాలని సీఐసీ ఇదివరకు జారీ చేసిన ఉత్తర్వుపైన ఉప గవర్నర్ కార్యాలయం ఢిల్లీ హైకోర్టులో రిట్ పిటిషన్ వేసింది. తాత్కాలిక స్టే ఇచ్చారు. తరువాత కూడా ఎల్జీ కార్యాలయం ఆర్టీఐ దరఖాస్తులకు జవాబులు ఇస్తూనే ఉన్నది. కనుక పబ్లిక్ అథారిటీ హోదాపై అది స్టే కాదని గమనించాలి. కనుక రాష్ట్రాల గవర్నర్లు, కేంద్రపాలిత ప్రాంతాల ఉప గవర్నర్లు సమాచార చట్టం కింద సమాచారం ఇవ్వవలసిందే. వ్యాసకర్త కేంద్ర సమాచార కమిషనర్ professorsridhar@gmail.com మాడభూషి శ్రీధర్ -
'మార్కెట్' లో కొనుక్కోవాలా?
తాము చేసిన చట్టాలను ప్రజలంతా పాటించాలని ఆశించే ప్రభువులు ఆ చట్టాలు జనానికి తెలిసే భాషలో సులువుగా దొరికే రీతిలో అందుబాటులోకి తేవలసి ఉంటుంది. విశ్లేషణ 1860లో వచ్చిన భారతీయ శిక్షాస్మృతిని చాలాసార్ల్లు సవరిం చారు. నిర్భయ దుర్మా ర్గం జరిగిన తరువాత ఐపీసీలో ఆత్మరక్షణ నియమాలను సవరిస్తూ తాజా చట్టం చేశారు. యాసిడ్ దాడులు, రేప్ ప్రయత్నాలను ప్రతిఘటించడానికి హత్య చేసినా ఆత్మరక్షణ మినహాయింపు వర్తిస్తుందని ఈ కొత్త సవరణ వివరిస్తున్నది. కొన్ని కొత్త నేరాలను కూడా ఐపీసీలో చేర్చారు. లైంగిక దాడుల కేసులను రిజిస్టర్ చేయకపోవడం నేరం అని శిక్ష నిర్దేశించారు. బాధితులు ఈ చట్టం ప్రకారం ఆత్మ రక్షణ హక్కు వినియోగించుకోవాలంటే, ఫిర్యాదు చేయాలంటే ఈ సమాచారం అందరికీ అందుబాటులో ఉండాలి. కాని అసలు చట్టమే అందుబా టులో లేకపోతే పౌరులకు ఏవిధంగా తెలుస్త్తుంది, ఏవిధంగా ఆత్మరక్షణ చేసుకుంటారు? సివిల్ ప్రొసీజర్ కోడ్ కూడా వందసార్లకు పైగా సవరణలకు గురైంది. అధికారికంగా సమ గ్రమైన, సవరించిన చట్టం కాపీ అందుబాటులో లేదు. ఇంతెందుకు భారత రాజ్యాంగం పరిస్థితి కూడా అంతే. వందసార్లు సవరణ జరిగిన ఈ కీలక జాతీయ శాసనం ప్రతి తుదిరూపం అందు బాటులో లేదు. డబ్బు పెట్టి కొనుక్కుంటే తప్ప. ఫలానా సెక్షన్‌ను సవరించిన చట్టం ఉంటుంది కాని. సవరించిన సెక్షన్ ప్రజలకు అందు బాటులో ఉండదు. ప్రైవేటు ప్రచురణకర్తలు పుస్తకాల మీద వ్యాపారం చేసేవాళ్లు సవరణలతో కూడిన అసలు చట్టాలను ప్రచురించి వందల రూపాయలకు అమ్ముతున్నారు. వ్యాఖ్యానాలు లేని కేవలం చట్ట పాఠం ఇదివరకు పది పాతిక రూపాయలకు అమ్మితే ఈ రోజు వంద రూపా యలు మించి అమ్ముతున్నారు. ప్రజలు పాటించి విధేయంగా ఉండవలసిన చట్టం కొనుక్కుంటే తప్ప దొరకదు. చట్టాలలో ఎవరికీ కాపీరైట్ ఉం డదు. చట్టాలు ఉచితంగా సులువుగా తెలుసుకునే అవకాశం ఉండాలి. పౌరులకు తమ ప్రభుత్వం చేసిన చట్టాలేమిటో తెలుసుకునే హక్కు ఉంది. చట్టాలను అందుబాటులో ఉంచాల్సిన బాధ్యత ప్రభుత్వంపైన ఉంది. ఫలానా చట్టం ఉందని నాకు తెలియదు అని నిందితుడు చెప్పుకునే అవ కాశాన్ని ఇవ్వడం లేదు. కనుక వారికి చట్టం గురించి చెప్పవలసిన బాధ్యత ఉంటుంది. జాతీయ న్యాయ విశ్వవిద్యాలయ విద్యార్థి ఒకరు క్రైస్తవ వివాహ చట్టం గురించి అధ్యయనం చేయవలసివచ్చింది. ఇది బ్రిటిష్ కాలపు చట్టం. ఎక్కడా దొరకలేదు. ప్రభుత్వం వారి దగ్గర కూడా లేదు. ఇండియా కోడ్ వెబ్సైట్లో ఉంది కాని అది చదవడానికి అనుకూలంగా లేదు. వాక్యాలు కలుపుకోవాలన్నా కొన్ని రోజులు పడుతుంది. ప్రైవేట్ పబ్లిషర్ల దగ్గర ఈ ప్రచురణ లేదు. క్రైస్తవ మహిళల హక్కులకు సంబంధించిన నియమాలు ఏమిటో తెలియకుండా ఆ హక్కుల రక్షణ సాధ్య మవుతుందా? కనుక ఆయన కాపీ కావాలని కేంద్ర న్యాయ శాఖను ఆర్టీఐ కింద అభ్యర్థించారు. కాని న్యాయమంత్రిత్వ శాఖ పీఐఓ ఏం చేయ గలరు? ఆ చట్టాన్ని వెతికి పట్టుకోవడం ఎడిట్ చేసి వెబ్సైట్లో పెట్టడం ఖర్చుతో కూడుకున్న పని. అదే జవాబు ఇచ్చారాయన. కాని పీఐఓ పబ్లిక్ అథారిటీకి ప్రతినిధి, వ్యక్తిగతంగా ఆయన చేతిలో పరిష్కారం లేనందువల్ల సమాచారం ఇచ్చే బాధ్యత నుంచి మినహాయింపు లభించదు. చట్టం ప్రతిని కచ్చితంగా పబ్లిక్ అథారిటీ ప్రజ లకు ఇవ్వవలసిందే. దీనికి ఏవిధమైన మినహా యింపూ సమాచార హక్కు చట్టంలో లేదు. దీని వల్ల ప్రైవేటు ప్రచురణ వ్యాపారులను ప్రోత్సహిం చడమేకాకుండా చట్టాలు సామాన్యులకు అందు బాటులోకి రావు. తాముచేసిన చట్టాలను ప్రజలం తా పాటించాలని ఆశించే ప్రభువులు ఆ చట్టాలు జనానికి తెలిసే భాషలో సులువుగా దొరికే రీతిలో అందుబాటులోకి తేవలసి ఉంటుంది. అన్ని చట్టాలను అప్డేట్ చేసి అందుబా టులో ఉంచే కార్యక్రమాన్ని తమ మంత్రిత్వశాఖ చేపట్టిందని సీపీఐఓ వివరించారు. ఇందుకు గాను ఇద్దరు ఇంగ్లిష్, మరో ఇద్దరు హిందీ సంప్రదింపు దారులను నియమించారు. అధికారులు కూడా చట్టాలను చదువుతున్నారు. నవీకరిస్త్తున్నారు. సవరణలను పొందుపరుస్తున్నారు. ఆంగ్లంలో చట్టాల నవీకరణ త్వరగా పూర్తవుతుంది. హిందీ నవీకరణ ఎక్కువ సమయం తీసుకుంటుంది. ప్రస్తుతం 2014 సంవత్సరం చట్టాల నవీకరణ పూర్తి చేస్తున్నారు. ఈ విధంగానే వెనుకటి సంవ త్సరాల చట్టాలకు సవరించిన తాజాప్రతులను తయారు చేయడం కొనసాగుతున్నదని పీఐఓ వివరించారు. ఈ చట్టాల సమాచారాన్ని ఇవ్వడం సెక్షన్ 4(1)(బి) కింద ప్రభుత్వ బాధ్యత. అడిగినా ఇవ్వకపోవడం చట్టం ఉల్లంఘన అవుతుంది. కనీసం అడిగిన ఈ చట్టాన్ని సవరించడానికి నెల రోజుల సమయం ఈ మంత్రిత్వ శాఖకు సరిపోక పోవడం సమంజసం కాదు. నెల కాకపోయినా కనీసం రెండు నెల్లకో ఏడాదిలోగానో ఇస్తే బాగుం డేది. కాని నాలుగేళ్లయినా ఇప్పటికీ ఇవ్వలేదు. అడిగిన విద్యార్థి నేషనల్ లా స్కూల్ ఆఫ్ ఇం డియా యూనివర్సిటీ నుంచి బంగారు పతకా లతో సహా డిగ్రీ తీసుకుని వెళ్లిపోయారు. ఇప్పుడు అతనికి అవసరం లేదు. కాని లా విద్యార్థులంద రికీ అవసరం. మంత్రిత్వ శాఖ ఆ యూనివర్సిటీకి పది వేల రూపాయల పరిహారం చెల్లించాలని ఆదే శించక తప్పలేదు. (CIC_SS_C_2013_900008-SA లో నా తీర్పు ఆధారంగా) (వ్యాసకర్త కేంద్ర సమాచార కమిషనర్ మాడభూషి శ్రీధర్) professorsridhar@gmail.com -
హరిత క్షేత్రాల రక్షణకు సహ అస్త్రం
ప్రకృతి సహజంగా ఏర్పడిన హరిత క్షేత్రాలను విజయనగర రాజులు లక్షల ఎకరాలకు పెంచి కాపాడేవారు. వీటిని విధ్వంసం చేసే వారిని శిక్షించేవారు. మన ప్రభుత్వాలకు వేలాది ఎకరాల భూములను పరిశ్రమలకు అప్పగించడంపైనే ఎక్కువ ఆసక్తి. సహ చట్టం ఇచ్చిన హక్కు సమాచారం అడగడానికే కాని సమస్యలకు పరిష్కారాలు కోరడానికి కాదు, ప్రశ్నలకు సమాధానాలు సంపాదించడా నికి కాదు అన్నది చాలా వరకు చట్టం చెప్పేమాటే. కాని సమ స్యలేనిదే సమాచారం అడ గరు. ప్రశ్న పుట్టకపోతే ఆర్టీఐ అభ్యర్థన రాదు. ఆర్టీఐ కింద ఏమడిగినా దానికి ఏదో ఒక సమస్య మూలాధారమవుతుందన్నది సామాజిక వాస్తవం. చాలా సందర్భాలలో రాజ్యాంగ న్యాయస్థానాల తీర్పులకే దిక్కులేదు, ఇక ట్రిబ్యునల్ ఆదేశాలను అడిగే దెవరు? జాతీయ పర్యావరణ న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలు పాటించారా లేదా అనే వివరాలను కర్ణాటక పర్యావరణ మిత్రుడొకరు ఆర్టీఐ కింద పర్యావరణ మం త్రిత్వశాఖను అడిగారు. సాధారణంగా సమాచారం ఇచ్చే పర్యావరణ మంత్రిత్వశాఖ ఈ ప్రశ్నను మాత్రం పక్కకుబెట్టింది. మొదటి అప్పీలుకు కూడా స్పందన కరువైతే కమిషన్ ముందు రెండో అప్పీలు తప్పలేదు. కర్ణాటక రాష్ర్టంలోని చిత్రదుర్గ జిల్లా చెల్లకెరె తాలూకాలో అమృత్ మహల్ కావల్స్ ప్రాంతం అద్భు తమైన పచ్చదనాన్ని చిందే జన, జంతు, జల, జీవ కేంద్రం. తూర్పు కనుమలలో ఇదొక పర్యావరణ రక్షక కేంద్రం. ఇక్కడ అనేకానేక ప్రాజెక్టుల కోసం ప్రభుత్వ ప్రైవేటు సంస్థలకు వేలాది ఎకరాల భూమిని ధారా దత్తం చేస్త్తున్నది కర్ణాటక ప్రభుత్వం. దీంతో సహజ మైన జలవనరులు నానాటికీ క్షీణించి నీటి సంక్షోభం ఏర్పడే దశ వచ్చిందని ఐసీఏఆర్ పరిశోధన తెలిపింది. కర్ణాటక కాలుష్య నివారణ మండలి చెల్లకెరె అమృత్ మహల్ కావల్స్ భూములలో రకరకాల పరిశ్ర మలు తదితర కార్యక్రమాలను సాగిస్త్తున్న సంస్థలకు నోటీసులు జారీ చేసింది. తమ అనుమతి లేకుండా పరి శ్రమల విస్తరణ కార్యక్రమాలను చేపట్టడం కూడదని, వెంటనే అనుమతి కోరుతూ దరఖాస్తులు చేసుకోవాలని మండలి ఆ నోటీసుల్లో ఆదేశించింది. ఇస్రో, బార్క్, భారతీయ విజ్ఞాన సంస్థ, ఏరోనా టికల్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్, సాజిటార్ వెంచర్స్ లిమిటెడ్ వంటి సంస్థలకు కర్ణాటక ప్రభుత్వం దాదాపు 10 వేల ఎకరాల భూమిని ఇచ్చేసింది. వారు కాలుష్య నియంత్రణ మండలికి తమ పనుల వివరా లను ఇవ్వలేదు. అనుమతులు కోరలేదు కాని పనులు ప్రారంభించారు. 1980 అడవుల రక్షణ చట్టం కింద అనుమతి లేకుండా అటవీ భూములను మరే ఇతర పను లకు కేటాయించే వీల్లేదు. కాని ఈ నిబంధనను పట్టిం చుకునే వారు తక్కువ. పెద్ద చెట్లు, దట్టమైన అడవులు, పొదలు కాకుండా పచ్చని గడ్డి విస్తారంగా కనిపించే భూములను గ్రాస్ లాండ్స్ అంటారు. అటువంటి భూముల్లో అమృత్ మహల్ కావల్స్ హరిత నేలలు చాలా విశిష్టమైనవని శాస్త్రజ్ఞులు వివరించారు. విజయనగర రాజులు ఈ హరిత క్షేత్రాలను లక్షల ఎకరాలకు పెంచి కాపాడేవారు. వీటిని విధ్వంసం చేసే వారిని కఠినంగా శిక్షించే వారు. మన ప్రభుత్వాలు మాత్రం వేలాది ఎకరాల భూము లను పరిశ్రమలకు అప్పగించడంలో ఆసక్తి చూపుతు న్నారేతప్ప, హరిత క్షేత్రాలుగా ఉండనీయడం లేదు. ప్రతి నియమాన్ని, చట్టాన్ని ధిక్కరించి, అక్కడ నివ సించే ఆదిమవాసుల హక్కులను పట్టించుకోకుండా పశుపక్ష్యాదులను బతకనీయకుండా, పుష్పవనాలు, తీగలు డొంకలు, పొదలు, నీటివనరులను కాపాడే బదులు హరిస్త్తున్నారని పర్యావరణవాదులు విమర్శిస్తు న్నారు. ఈ హరిత క్షేత్రాలలో అభివృద్ధి వాదులు కోట గోడల వంటి ప్రహరీలు నిర్మించి, నీటి ప్రవాహాలను అడ్డుకోవడమే కాకుండా, వీటిపై ఆధారపడి జీవించే ఆదిమవాసుల బతుకు హక్కులను కూడా హరిస్తు న్నారని వారు ఆరోపించారు. విదేశాల నుంచి అందమైన పక్షులు ఇక్కడ జీవించ డానికి వలస వచ్చేవి. కాని ఇక్కడ పచ్చదనం కరువై జలవనరులు ఇంకిపోవడంతో, పక్షులు రావడం లేదు. నీటి ఊటలు తగ్గిపోయాయి. పశువులకు మేత కూడా కరువయ్యే పరిస్థితి వచ్చింది. చుట్టుపక్కల పంటల దిగుబడి తగ్గింది. ఈ జిల్లాలో పదేళ్లలో దాదాపు 101 మంది ఆత్మహత్య చేసుకున్నారు. మనుషులు బతకలేక, పశువులు గడ్డి లేక నానా తంటాలు పడడానికి కారణం ఈ పచ్చదనం కరువు కావడమే. మనుషులతోపాటు పూలవనాలు, జలాశ యాలు, భూగర్భజల నిలయాలు కూడా వసివాడి పోతున్నాయి. ఇక్కడ జనజీవనం ఒక నాటి హరిత క్షేత్రాలను వదిలేసి వలస పోయే పరిస్థితులు వచ్చాయి. ఇటువంటి హరిత క్షేత్రాలు ఎన్నో జాతుల పశువులను పోషిస్తూ, పూలవనాలకు ఆవాసమవుతూ జీవవైవిధ్య కేంద్రాలుగా ఉన్నాయని, కాని ప్రస్త్తుతం ఇవి శరవేగంగా తరిగిపోతున్నాయని, వీటిని రక్షించుకో వలసిన బాధ్యత కర్ణాటక రాష్ర్ట ప్రభుత్వంపైన ఉందని, ఇకనుంచి అమృత్ మహల్ కావల్స్ భూములను పరిశ్రమల కోసం లేదా మరే ఇతర అభివృద్ధి కోసం ఇవ్వకూడదని హైకోర్ట్టు తీర్పు చెప్పింది. జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ కూడా సవివరమైన ఆదేశాలు జారీ చేసింది. ఆ ఆదేశాలను అమలు చేశారో లేదో, చేయకపోతే ఎందుకు చేయలేదో చెప్పవలసిన అవసరం ఉందని కేంద్ర సమాచార కమిషన్ ఆదేశించింది. (డేవిస్ జార్జి థామస్ వర్సెస్ పర్యావరణ మంత్రిత్వశాఖ కేసులో అక్టోబర్ మూడో వారంలో ఇచ్చిన తీర్పు ఆధారంగా) వ్యాసకర్త కేంద్ర సమాచార కమిషనర్ professorsridhar@gmail.com