అట్లాంటాలో మధు తాతాకు ఘన సత్కారం
అట్లాంటా : తెలంగాణ రాష్ట్ర సమితి కార్యదర్శి మధు తాతాను అట్లాంటా తెలుగు కమ్యూనిటీ ఘనంగా సన్మానించింది. ఇటీవల మధు తాతా అమెరికా పర్యటన సందర్భంగా ఈ సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కమ్మింగ్, జార్జియా (గ్రేటర్ అట్లాంటా పరిధి) లోని ఎస్- కన్వెన్షన్ సెంటర్ లో జరిగిన ఈ సమావేశంలో మొత్తం 300 మంది ప్రతినిధులు పాల్గొన్నారు. మధు తాతా మాట్లాడుతూ.. ఎన్ఆర్ఐలు కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలని కోరారు. తెలంగాణ కొత్తగా ఏర్పడిన రాష్ట్రం అయినప్పటికీ ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో అన్ని రంగాల్లో పురోగమిస్తుందన్నారు. తెలంగాణకు తమ వంతు సాయం అందజేస్తామని ఈ సందర్భంగా ఆటా ప్రతినిధులు తెలిపారు. వందలాది మంది సమక్షంలో మధు తాతాను దుశ్శాలువతో ఘనంగా సత్కరించారు.
బంగారు తెలంగాణ కోసం తమ వంతు పాటుపడతామని ఈ సందర్భంగా సమావేశానికి హాజరైన ఎన్ఆర్ఐలు తెలిపారు. ఈ వేడుకలో అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఏటీఏ) ప్రెసిడెంట్ కరుణాకర్ రెడ్డి, అసోసియేషన్ నేతలు నరేందర్ రెడ్డి, షీలా లింగం, చాంద్ అక్కినేని, డాక్టర్ మంగరాజు వావపల్లి, డాక్టర్ హైమవతి మిక్కిలినేని, డాక్టర్ సుజాతారెడ్డి, డాక్టర్ శ్రీని గంగసాని, శ్రీధర్ జూపల్లి, పూర్ణ వీరపనేని, అనిల్ బోడిరెడ్డి, సురేష్ పెద్ది, మహేశ్ పవార్, వెంకట్ వీరనేని, సంధ్య యల్లాప్రగడ, శ్యామ్ మల్లవరపు, శివకుమార్ రామడుగు, నిరంజన్ ప్రొద్దుటూరి, వెంకట్ మొండెద్దు, సునీల్ షివాలి, సాగర్ మలిశెట్టి, శ్రీనివాస్ జరుగుమల్లి తదితరులు పాల్గొన్నారు.