ఈ పాటకు ట్యూన్ తెలుసా?
పల్లవి :
ఆనందరాగం కోరే ప్రాయం (2)
నీ నవ్వులో విరులే తోచెనే
ఈక్షణం యవ్వనం నీకోసం పాడేనే
ఆనందరాగం కోరే ప్రాయం
చరణం : 1
కొసరిన కలలలో ముసిరిన కథలలో
ఊగే రేగే తీయని తీరని కోరికలే
విరిసిన మల్లెలలో పరచిన వెన్నెలలో
ఏవో తోచే అచ్చట ముచ్చటలెరుకలే
తొలకరి వన్నెల పందిరిలో గడసరి కన్నుల వాకిటలో
ఆశలు తీరా బాసలు తీరా ఆడాలీ పాడాలీ
॥ఆనందరాగం॥
చరణం : 2
అలిగిన దీపములే కలిపిన బంధములే
నాలో నీలో చేసెను రేపెను సందడులే
చెరగని స్నేహములే తరగని మోహములే
నన్నూ నిన్నూ పొందిన అల్లరి చేసెనులే
మనసున రాగము పూచినది పరువము నీపై వీచినదీ
నీ జతలోనా మైమరిచేనా నీనీడై నీతోడై
॥ఆనందరాగం॥
చిత్రం : మధురగీతం (1981), రచన : రాజశ్రీ
సంగీతం : ఇళయరాజా, గానం : పి.సుశీల