Mahatma Gandhi birth anniversary
-
గాంధీ కలల్ని నిజం చేశాం: సీఎం జగన్
సాక్షి, గుంటూరు: జాతిపిత మహాత్మాగాంధీ 154వ జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా ఎక్స్ అకౌంట్లో ఆయన నివాళి సందేశం ఉంచారు. ‘‘మహాత్మా గాంధీ గారి మాటలు ఆదర్శంగా... రాష్ట్ర ప్రజలందరి సంక్షేమమే లక్ష్యంగా పాలన చేస్తున్నాం. గ్రామ/వార్డు సచివాలయ వ్యవస్థ ద్వారా గాంధీ గారు కలలు కన్న గ్రామ స్వరాజ్యాన్ని నిజం చేశాం.మునుముందు కూడా ఆయన చూపిన మార్గంలోనే నడుస్తాం. నేడు మహాత్మా గాంధీ గారి జయంతి సందర్భంగా నివాళులు’’ అని పేర్కొన్నారాయన. మహాత్మా గాంధీ గారి మాటలు ఆదర్శంగా…రాష్ట్ర ప్రజలందరి సంక్షేమమే లక్ష్యంగా పాలన చేస్తున్నాం. గ్రామ/వార్డు సచివాలయ వ్యవస్థ ద్వారా గాంధీ గారు కలలు కన్న గ్రామ స్వరాజ్యాన్ని నిజం చేశాం. మునుముందు కూడా ఆయన చూపిన మార్గంలోనే నడుస్తాం. నేడు మహాత్మా గాంధీ గారి జయంతి సంద… pic.twitter.com/9fEwN6KFf4 — YS Jagan Mohan Reddy (@ysjagan) October 2, 2023 -
ఓటే ఆయుధం.. అందరూ వేయండి
ఓటే ఆయుధం.. అందరూ వేయండి‘మనం మనకోసం చేసేది మనతోనే అంతరించిపోతుంది. ఇతరుల కోసం చేసేది శాశ్వతంగా నిలిచిపోతుంది.’ – జాతిపిత మహాత్మాగాంధీ సాక్షి, కరీంనగర్: అహింసే ఆయుధంగా.. సహనమే డాలుగా దేశానికి స్వేచ్ఛావాయువులందించిన మహోన్నతుడు మన జాతిపిత మహాత్మాగాంధీ. ఆంగ్లేయుల బానిస సంకెళ్ల నుంచి విముక్తి కల్పించిన స్ఫూర్తి ప్రధాత. రాజకీయాల్లో అడుగడుగునా విలువలు పెరగాలని.. ప్రజాస్వామ్యం పరిఢవిల్లాలని ఆకాంక్షించిన గొప్ప వ్యక్తి. పల్లెలే పట్టుగొమ్మలుగా సిద్ధాంతాలతో కూడిన నాయకత్వం పెంపొందాలని పరితపించిన ఆదర్శనీయుడు కోట్లాది మంది భారతీయుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. హుజూరాబాద్ ఉప ఎన్నిక వేళ ఓటర్లు, అభ్యర్థులు, ఎన్నికల యంత్రాంగం బాపూజీ మాటల్ని మననం చేసుకొని, విలువల మంత్రాల్ని ఆచరించాల్సిన తరుణమిది. ఓటరన్నా.. విలువ కాపాడుకో.. ఓటు విషయంలో నీ విలువ కాపాడుకో. మంచి నాయకుడిని ప్రజాప్రతినిధిగా ఎన్నుకునేందుకు ఓటు అనే ఆయుధాన్ని వాడుకోవాలి. హుజూరాబాద్ ఎన్నికలో మొత్తం 305 పోలింగ్ కేంద్రాలు వినియోగిస్తుండగా 2,36,283 మంది ఓటర్లున్నారు. ప్రతిఒక్కరూ ఓటింగ్‌లో పాల్గొనాలి. మంచి నాయకుడికి పట్టం గట్టాలి. సిద్ధాంతాలు లేని రాజకీయాలు వ్యర్థం ఎన్నికల్లో గెలుపోటములు సహజం. విలువలతో ప్రజల మనసుని గెలవాలి. సిద్ధాంతాలకు లోబడి ఉండలేని రాజకీయాలు వ్యర్థం. అందుకే ఇచ్చిన మాటకు కట్టుబడాలి. ఆయా పార్టీల అభ్యర్థులుగా బరిలో ఉండే నాయకులంతా ప్రజాసేవపై దృష్టి సారించాలి. విలువలకు కట్టుబడాలి.. విధి నిర్వహణకు మించిన సేవ లేదు. విలువలకు కట్టుబడకుండా.. వ్యక్తిత్వాన్ని కోల్పోయి సేవలందించినా అది నిరుపయోగమే. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని అనుసరించడంలో బాధ్యత ముఖ్యమన్నది మరవొద్దు. చెడుకు సహాయ నిరాకరణ చేయడం ద్వారా విలువల్ని పరిరక్షించవచ్చు. బంధుప్రీతి.. ఇతర వ్యామోహాలకు వెరవకుండా ఎన్నికల్లో సమర్థంగా పనిచేస్తే ఎన్నికల ఆశయానికి ఊపిరిపోసినట్లే. నైతికత.. పారదర్శకత అభివృద్ధి చెందడమంటే అద్దాల మేడలు.. రంగు గో డలు కాదు. పౌరుల నైతికాభివృద్ధే నిజమైన అభివృద్ధి. అలాగే నాయకులు అందించే పాలనలో పారదర్శకత ముఖ్యం. సమాజానికి మేలు చేయాలనే భావన నాయకుల హృదయాంతరాల్లో నుంచి రావాలి. అందుకు ప్రణాళికతో కూడిన సాధన అవసరం. ప్రగతితో కూడిన పాలన నిత్యం అత్యవసరం. మద్యం జోలికి వెళ్లకండి.. ప్రజాస్వామ్య వ్యవస్థ పునర్నిర్మాణంలో యువతే కీలకం. నేను కన్న కలల లోకంలో విహరించాలంటే నా బాటలో నడవండి. అహింసాయుత జీవనానికి నాంది పలకండి. ఏరులై పారే మద్యం జోలికి ఈ ఎన్నికల్లో అసలు వెళ్లకండి. ఎవరినీ వెళ్లనివ్వకండి. 305 పోలింగ్ కేంద్రాల పరిధిలో ఓటర్లను ప్రలోభపెట్టే అవినీతి సొమ్ము సహా మద్యాన్ని కట్టడి చేసేలా ఊరూరా మీ బాధ్యత చూపండి. స్వచ్ఛమైన మనసుతో ఆలోచించండి. అసత్య ప్రచారాల్ని నమ్మకండి. నీతి, నిజాయతీలకు పట్టం కట్టండి. చదవండి: తొలి రోజు మూడు నామినేషన్ల దాఖలు -
మహాత్ముడికి సీఎం వైఎస్ జగన్ నివాళి
సాక్షి, తాడేపల్లి: సీఎం క్యాంపు కార్యాలయంలో జాతిపిత మహాత్మాగాంధీ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మహాత్ముడి చిత్రపటానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నివాళుర్పించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు, వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి, మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, సీఎం ప్రోగ్రాం కోఆర్డినేటర్ తలశిల రఘురాం తదితరులు పాల్గొన్నారు. చదవండి: పల్లెల్లో చిచ్చు: టీడీపీ నయా కుయుక్తులు.. వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో.. తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో గాంధీ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. గాంధీ చిత్రపటానికి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, లేళ్ల అప్పిరెడ్డి నివాళులర్పించారు. చదవండి: సాగునీటి ప్రాజెక్టులు సకాలంలో పూర్తి -
మహాత్మా గాంధీకి గవర్నర్ తమిళిసై నివాళి
సాక్షి, హైదరాబాద్: నగరంలోని బాపుఘాట్ వద్ద జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. మహాత్ముడి విగ్రహం వద్ద గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ పుష్పగుచ్ఛం ఉంచి నివాళులర్పించారు. మహాత్ముడికి నివాళులర్పించిన వారిలో హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ, శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రులు కేటీఆర్, మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, హైదరాబాద్ కలెక్టర్ శ్వేతా మహంతి, హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్‌తో పాటు పలువురు నివాళులర్పించారు. చదవండి: హెడ్‌కానిస్టేబుల్ కూతురుకు అరుదైన గౌరవం -
డాలస్ లో ఘనంగా గాంధీజీ 15౦ వ జయంతి ఉత్సవాలు
ప్రతి పురుషుని విజయం వెనుక ఓ స్త్రీ ఉంటుంది అనే నానుడి వాస్తవం కాదని నిరూపిస్తూ గాంధీజీతో సమానంగా ఆయన పక్కనే నడుస్తూ సత్యాగ్రహంతో పాటు మరెన్నో విషయాల్లో కస్తూర్బాగాంధీ ఎంతో తోడ్పాటును అందించారని మహాత్మా గాంధీ మనవరాలు ఈలా గాంధీ పేర్కొన్నారు. డాలాస్లోని పార్క్‌ప్లాజాలో మహాత్మా గాంధీ మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సాస్ (ఎంజీఎంఎన్టీ) ఆధ్వర్యంలో నిర్వహించిన మహాత్ముని 150వ జయంతి వేడుకల్లో పాల్గొని ఆమె ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆమె మహాత్ముని జీవిత గాథలపై గాక ఆయన సతీమణి కస్తూర్బాగాంధీ జీవితంపై చక్కని ప్రదర్శనతో కూడిన ప్రసంగాన్ని వినిపించారు. 13ఏళ్ల వయస్సులో గాంధీజిని వివాహం చేసుకున్న కస్తుర్బా.. ఏనాడూ బడికి పోలేదన్నారు. గాంధీజీ చొరవతో ఆయన శిక్షణలోనే చదువుకున్న కస్తూర్భా.. భర్తతో కలిసి దక్షిణాఫ్రికా వలస వెళ్లాక అక్కడి భారతీయులకు వ్యతిరేకంగా అమలులో ఉన్న జాతి వివక్ష చట్టాలపై ఆమె చేసిన పోరాటాల గురించి వివరించారు. 1942-44 మధ్య కాలంలో ఆమె జీవిత చివరి దశలో బాపూజీతో కలిసి గడిపిన జైలు జీవితంపై ఈలా గాంధీ సుదీర్ఘంగా ప్రసంగించి పలు ఛాయాచిత్రాలను ప్రదర్శించారు. బాహ్యప్రపంచానికి గాంధీజీ మహాత్ముడేమో గానీ, ఇంట్లో మాత్రం ఆమె శక్తిమంతురాలని, బాపూజీకి సత్యాగ్రహాన్ని, దాని శక్తిని పరిచయం చేసిన తొలి వ్యక్తి కస్తుర్బా అని ఈలా గాంధీ పేర్కొన్నారు. మహిళా చైతన్యం, మహిళా సాధికారత వంటి అంశాల పట్ల ఆ రోజుల్లోనే ఎంతో అవగాహన కలిగిన తన నాయినమ్మ కస్తుర్బా గాంధీ నేటి మహిళలకు తప్పక ఆదర్శంగా నిలుస్తుందని ఈలా గాంధీ ఆశాభావం వ్యక్తపరిచారు. ఎంజీఎంఎన్టీ రూపొందించిన ప్రత్యేక సంచికను ముఖ్య అతిధి ఈలా గాంధీ ఆవిష్కరించారు. అనంతరం ఆమెను ఎంజీఎన్టీ కార్యవర్గం ఘనంగా సత్కరించింది. అహింసయే శాంతి- శాంతియే శక్తి-శక్తియే ఆనందం-ఆనందమే ఐకమత్యం ఈలా గాంధీ ప్రసంగానికి పూర్వం ఎంజీఎంఎన్టీ ఛైర్మన్ డా. తోటకూర ప్రసాద్ ప్రసంగిస్తూ.. కస్తుర్బా గాంధీ 150వ జయంతి కూడా ఇదే సంవత్సరం కావడం విశేషమని అన్నారు. సోషల్ మీడియాలు, వైరల్ వీడియోలు లేని రోజుల్లోనే కోట్ల మందిని అహింసా, సత్యాగ్రహం, క్రమశిక్షణ వంటి శాంతియుతమైన నినాదాలతో కదిలించిన మహిమాన్వితుడు మహాత్మా గాంధీ అని, ఆయన 150వ జయంత్యుత్సవాలను డల్లాస్‌లో నిర్వహించుకోవడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు. నోబెల్ విజేతలకు, దేశాధినేతలకు, ప్రపంచ ప్రముఖులకెందరికో గాంధీజీ సిద్ధాంతాలు ఆదర్శప్రాయమని కొనియాడారు. గాంధీజి ఆశయాలు, ఆదర్శాలు మరో 150ఏళ్లు విశ్వవ్యాప్తంగా విరాజిల్లుతాయని డా. ప్రసాద్ తోటకూర పేర్కొన్నారు. 2014 లో అమెరికా దేశంలో కెల్లా అతి పెద్దదైన మహాత్మా గాంధీ స్మారకస్థలిని డాలస్ (ఇర్వింగ్)లో ఏర్పాటు చేయడానికి సహకరించిన ఇర్వింగ్ పట్టణ అధికారులకు కృతజ్ఞతలు తెలియజేసి భారీ విరాళాలు అందించిన దాతలను సత్కరించారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ పూర్వ ఉపసభాపతి డా. మండలి బుద్ధప్రసాద్ మాట్లాడుతూ అహింసతోనే శాంతి సాధ్యమని, గాంధీజి సిద్ధంతాలు ఎల్లవేళలా ఆదర్శనీయమని వెల్లడించారు. గాంధీజి నిర్దేశించిన మార్గంలో అందరూ నడవాలని తద్వారా ఐకమత్యం భాసిల్లుతుందని అన్నారు.పుదుచ్చెరి ఆరోగ్య శాఖా మంత్రి మల్లాడి కృష్ణారావు మాట్లాడుతూ యానాంలో ఒక పెద్ద పార్కులో 11 కోట్ల రూపాయిల వ్యయంతో అతిపెద్ద గాంధీజి విగ్రహాన్ని ఏర్పాటు చేశామని, జనవరిలో దాన్ని గాంధీ పార్కుగా నామకరణం చేస్తున్నామని ప్రకటించారు.స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయంలో మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ రీసెర్చ్ సెంటర్ కు డైరెక్టర్ గా వ్యవహరిస్తున్న ప్రొఫెసర్ క్లేబోర్న్ కార్సన్ మాట్లాడుతూ.. మార్టిన్ లూథర్ కింగ్ కు గాంధీజి చూపిన ఆశయాలు, సిద్ధాంతాలు మార్గదర్శకమని, ఆ శాంతి బాటలోనే అమెరికాలో ప్రజాహక్కుల ఉద్యమాలను కింగ్ నిర్వహించారని పేర్కొన్నారు. గాంధీ కింగ్ ఫౌండేషన్ ఛైర్మన్ గొల్లనపల్లి ప్రసాద్ మాట్లాడుతూ గాంధీజి జీవితాన్ని అనుసరించి అందరూ శాంతియుత జీవితాన్ని ఆస్వాదించాలని కోరారు. బాపూజీ పై ప్రత్యేకంగా నృత్యశక్తి డ్యాన్స్ స్కూల్ విద్యార్థులు ప్రదర్శించిన నృత్యరూపకం అందరినీ ఆకట్టుకుంది. గుజరాత్ నుండి వచ్చిన ప్రముఖ చిత్రకారుడు జిగర్ సోని గాంధిజీ పై ప్రత్యేకంగా రూపొందించిన చిత్ర ప్రదర్శన అందరి మెప్పును పొందింది. ఎంజిఎంఎన్టి కార్యవర్గ సభ్యులు జిగర్ సోనిను, అమెరికాలోనే అతిపెద్దదైన మహాత్మాగాంధీ విగ్రహ శిల్పి బుర్ర శివవరప్రసాద్ ను సతిసమేతంగా సత్కరించారు.ఈ కార్యక్రమంలో హోస్ట్ కమిటీ సభ్యులైన రన్నా జాని, ఆనంద్ దాసరి, డా. సత్ గుప్తా, శ్రీకాంత్ పోలవరపు, షబ్నం మోడ్గిల్, గుత్తా వెంకట్, మురళి వెన్నం, శాంటే చారి, జాన్ హామొండ్, రాజేంద్ర వంకవాల, శ్రీధర్ తుమ్మల లను ఎంజిఎంఎన్టి బోర్డు ఘనంగా సత్కరించింది.ఈ కార్యక్రమ నిర్వహణలో సహకరించిన కార్యకర్తలు డా. పులిగండ్ల విశ్వనాధం, దినేష్ హూడా, అనిల్ రాతే, మహేందర్ రావు, రాజీవ్ కామత్, ఉర్మిత్ సింగ్ లను ఎంజిఎంఎన్టి అభినందించింది. ఎంజీఎంఎన్టీ కార్యదర్శి రావు కల్వల తన స్వాగతోపన్యాసంలో గాంధీజీ 150వ జయంతి ఉత్సవాలను వందలాది అభిమానుల మధ్య ఇంత ఘనంగా జరుపుకోవడం సంతోషంగా ఉందని, గాంధీజీ చూపిన బాటలోనే యువతరం కూడా ప్రపంచవ్యాప్తంగా నడవాలని ఆశించారు. ఈ కార్యక్రమంలో మహాత్మా గాంధీ మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సాస్ ఛైర్మన్ డా. ప్రసాద్ తోటకూర తో పాటు బోర్డు సభ్యులు బీఎన్ రావు, జాన్ హామేండ్, రావు కల్వాల, తైయాబ్ కుండావాల, పియూష్ పటేల్, అక్రం సయాద్, కమల్ కౌషల్, అభిజిత్ రాయల్కర్ పాల్గొన్నారు. -
మహాత్మున్ని స్మరించిన సల్మాన్, షారుఖ్, రణబీర్
-
ప్రపంచశాంతికి గాంధేయ వాదమే చక్కటి పరిష్కారం
ఎడిసన్ : మహాత్మగాంధీ 150వ జయంతిని పురస్కరించుకొని న్యూజెర్సీ పట్టణంలోని సాయిదత్త పీఠంలో వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా గాంధేయవాదం గురించి ప్రసంగించారు. ప్రపంచశాంతికి గాంధేయ వాదమే చక్కటి పరిష్కారమని న్యూజెర్సీ పబ్లిక్ యుటిలిటీస్ కమిషనర్ ఉపేంద్ర చివుకుల అన్నారు. ప్రపంచంలోని చాలా మంది నాయకులు ఆ మహాత్ముడిని ఆదర్శంగా తీసుకుని ఎన్నో అద్భుత విజయాలు సాధించారని ఆయన పేర్కొన్నారు. ఐక్యరాజ్యసమితి గాంధీ జయంతిని ప్రపంచ శాంతి, అహింస దినోత్సవం గా ప్రకటించటం పై ఆయన హర్షం వ్యక్తం చేశారు. గాంధీ సిద్ధాంతాలను, ఆయన పాటించిన విలువలను జనంలోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఎంతో ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ క్రమంలో న్యూజెర్సీ రాష్ట్రంలో మహాత్మా గాంధీ 150వ జయంతిని పురస్కరించుకుని ప్రపంచ శాంతి, అహింస దినోత్సవంగా జరుపుకోవాలని అన్ని ప్రభుత్వ, ప్రయివేట్ సంస్థలకు, ధార్మిక సంస్థలకు అధికారిక ఉత్తర్వుల ప్రకటన జారీ చేశారు. కార్యక్రమంలో సాయిదత్త పీఠం నిర్వాహకులు రఘు శర్మ శంకరమంచి, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. -
బాపూజీ కల సాకారమే గ్రామ సచివాలయాలు: సీఎం జగన్
సాక్షి, అమరావతి: మహాత్మా గాంధీ 150వ జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బాపూజీకి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సత్యం, అహింస, శాంతి పదాలకు నిజమైన అర్థం బాపూజీ జీవితం అన్నారు. మహాత్ముడి ఆదర్శాలే స్ఫూర్తిగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి అడుగులు వేస్తున్నామని తెలిపారు. ఆ మహామహుడి 150వ జయంతి వేళ ఆయన స్వప్నమైన గ్రామ స్వరాజ్యం సాకారంలో భాగంగా గ్రామ సచివాలయాలను ప్రారంభించబోతున్నామని పేర్కొన్నారు. గత నాలుగు నెలల్లోనే 43 వేల బెల్ట్ షాపులను మూసివేసి.. మద్యం దుకాణాల సంఖ్యను 4,380 నుంచి 3,500కు తగ్గించామన్నారు జగన్. భారతీయ ఆత్మ పల్లేల్లోనే ఉందన్న బాపూజీ పలుకులే వేదాలుగా రైతులు, పేదల సంక్షేమానికి, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి గాను నవరత్నాలు అమలు చేస్తున్నామని తెలిపారు సీఎం జగన్. నా జీవితమే నేనిచ్చే సందేశం అని చాటిన ఆయన మహోన్నత వ్యక్తిత్వాన్ని ఖండాలు, దేశాలు దాటి.. మామూలు జనాలతో పాటు మహానాయకులు కూడా స్మరించుకుంటున్నారని పేర్కొన్నారు. ప్రపంచ మానవాళి మీద బాపూజీ చెరగని ముద్ర వేశారన్నారు సీఎం జగన్. -
ప్లాస్టిక్ రహిత సంస్థగా ఎస్బీఐ
హైదరాబాద్ : మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని, దేశీయ అతిపెద్ద బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ కీలక ప్రకటన చేసింది. ఏడాది లోపు ఎస్బీఐను ప్లాస్టిక్ రహిత సంస్థగా తీర్చిదిద్దనున్నట్టు పేర్కొంది. 2022 వరకు ప్లాస్టిక్ వాడకాన్ని నిర్మూలించాలని భావిస్తున్న కేంద్ర నిబద్ధతకు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వచ్ఛ్ భారత్ అభియాన్‌కు అనుగుణంగా ఎస్బీఐ ఈ కీలక కార్యక్రమాన్ని చేపడుతున్నట్టు ప్రకటించింది. వచ్చే 12 నెలల్లో, ఎస్బీఐను ప్లాస్టిక్ రహిత సంస్థగా మార్చేందుకు దశల వారీగా చర్యలు తీసుకోనున్నట్టు పేర్కొంది. తమ ఆఫీసుల్లో, మీటింగుల్లో పెట్ వాటర్ బాటిళ్లను(ప్లాస్టిక్ బాటిళ్లను), నీటి పంపిణీదారితో భర్తీ చేయనున్నామని చెప్పింది. ప్లాస్టిక్ బాటిళ్లకు బదులు నాణ్యమైన కాగితపు ఫోల్డర్లను వాడుతామని పేర్కొంది. భోజనశాలల్లో ఒక్కసారి వాడి పారేసే ప్లాస్టిక్ ప్లేట్లకు బదులు పర్యావరణ హిత పాత్రలను వినియోగించడానికి చర్యలు తీసుకుంటామని తెలిపింది. స్వచ్ఛ భారత్ మిషన్‌లో భాగంగా ముంబైలో జరిగిన క్లీన్‌నెస్ డ్రైవ్‌లో చైర్మన్‌తో పాటు 300 మంది ఎస్బీఐ ఉద్యోగులు, బ్యాంక్ టాప్ మేనేజ్మెంట్ పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని స్థానిక ప్రధాన కార్యాలయాల్లో ఈ డ్రైవ్‌ను చేపట్టారు. ప్రత్యేక సందర్భంలో ఈ కార్యక్రమాన్ని లాంచ్ చేయడం ప్రత్యేకమైన అనుభూతిని కలిగిస్తోందని ఎస్బీఐ చైర్మన్ రజనీష్ కుమార్ చెప్పారు. మన దేశంలో రోజు రోజుకీ ప్లాస్టిక్ వినియోగం పెరుగుతోందని, ఇది దేశానికి అతిపెద్ద పర్యావరణ సవాలని పేర్కొన్నారు. -
మహాత్ముడికి రాష్ట్రపతి, ప్రధాని నివాళులు
-
లాల్‌బహదూర్ అంటే చులకనా?
{పధానిపై మండిపడ్డ విపక్షాలు సమాధి వద్ద మోదీ నివాళి అర్పించకపోవటంపై ఆగ్రహం న్యూఢిల్లీ: మాజీ ప్రధాని లాల్‌బహదూర్ శాస్త్రికి ఆయన జయంతి సందర్భంగా ప్రధాని మోదీ నివాళులు అర్పించకపోవటంపై విపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. మహాత్మాగాంధీ జయంతి రోజునే శాస్త్రి జయంతి కూడా కావటం తెలిసిందే. అయితే.. శుక్రవారం రాజ్‌ఘాట్‌కు వెళ్లి గాంధీకి నివాళులు అర్పించిన ప్రధాని మోదీ.. అక్కడికి అతి దగ్గర్లోనే ఉన్న విజయ్‌ఘాట్(లాల్‌బహదూర్ సమాధి)కు వెళ్లి నివాళులు అర్పించలేదు ట్విటర్లో మాత్రం శాస్త్రికి 140 పదాల్లో నివాళి అర్పించారు. మరోవైపు రాష్ట్రపతి ప్రణబ్, ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ, కాంగ్రెస్ చీఫ్ సోనియాగాంధీ, వివిధ పార్టీల నేతలు విజయ్‌ఘాట్‌కు వెళ్లి శాస్త్రికి నివాళి అర్పించారు.