Maheshwaram constituency
-
మంత్రి సబితారెడ్డికి పోటీగా బరిలో మేయర్ పారిజాత?
సాక్షి, రంగారెడ్డిజిల్లా: మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థిగా బడంగ్పేట్ మేయర్ చిగురింత పారిజాత పేరు దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. నియోజకవర్గం నుంచి డీసీసీ అధ్యక్షుడు చల్లానర్సింహారెడ్డి సహా సీనియర్ నాయకులు దేప భాస్కర్‌రెడ్డి, కొత్త మనోహర్‌రెడ్డి తీవ్రంగా పోటీపడ్డారు. బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్‌లో చేరిన కొత్త మనోహర్‌రెడ్డి ఇటీవల కర్ణాటక వెళ్లారు. డిప్యూటీ సీఎంతో పై రవీ చేయించారు.అయినా అధిష్టానం మాత్రం చిగురింతవైపే మొగ్గు చూపినట్లు సమాచారం. అభ్యర్థి పేరు అధికారికంగా ఇంకా వెల్లడించాల్సి ఉంది. సర్పంచ్‌గా మొదలైన ప్రస్థానం చిగురింత పారిజాత మొదట్లో కాంగ్రెస్ పార్టీ నుంచి కార్పొరేటర్‌గా గెలుపొందారు. ఆ తర్వాత బీఆర్ఎస్లో చేరారు. మంత్రి సబితారెడ్డి ఆశీస్సులతో బడంగ్పేట్ మేయర్ పీఠాన్ని అధిష్టించారు. ఆమెకు గతంలో బాలాపూర్ సర్పంచ్‌గా పని చేసిన అనుభవం ఉంది. ఆ తర్వాత కొద్ది రోజులకే అధికార బీఆర్ఎస్ను వీడి మళ్లీ సొంతగూటికి చేరుకున్నారు. అప్పటి నుంచి మంత్రికి పోటీగా బరిలో నిలిచేందుకు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ వచ్చారు. ఇటీవల తుక్కుగూడ వేదికగా నిర్వహించిన కాంగ్రెస్ విజయభేరి సభ ఏర్పాట్లు కూడా మేయర్ దంపతులే చూసుకున్నట్లు తెలిసింది. బడంగ్పేట్, మీర్పేట్, జల్పల్లి మున్సిపాలిటీల్లో వీరికి మంచి పట్టుంది. -
తెలంగాణకు నిధుల కేటాయింపులో కేంద్రం వివక్ష
సాక్షి, రంగారెడ్డి జిల్లా: ‘ఎవరెన్ని కుట్రలు చేసినా రాజకీయాలకతీతంగా రాష్ట్రంలోని అన్ని నియోజ కవర్గాలను అభివృద్ధి చేసి తీరుతాం’అని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. నోటికొచ్చినట్లు మాట్లాడటం, మంత్రుల పర్యటనలను అడ్డుకోవడం సరికాదని, దమ్ము ఉంటే కేంద్రం నుంచి ఎక్కువ నిధులు తీసుకొచ్చి అభివృద్ధిలో పోటీ పడాలి’ అని బీజేపీ నేతలకు సవాల్ విసిరారు. ‘అధికారం ఎవరి సొత్తు కాదని, మీరు దేశంలో అధికారంలో ఉన్నారు. ఈ ఏడున్నరేళ్లలో రాష్ట్రం కోసం చేశారో చెప్పాలని కేంద్ర ప్రభుత్వాన్ని, బీజేపీ నాయకత్వాన్ని ప్రశ్నిస్తున్నా’అని నిలదీశారు శనివారం రంగారెడ్డి జిల్లాలోని తుక్కుగూడ, జల్పల్లి, మీర్పేట్, బడంగ్పేట్ పుర/నగర పాలికల పరిధిలో రూ.371.09 కోట్ల అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం బడంగ్పేట్ క్రికెట్ స్టేడియంలో నిర్వహించిన బహిరంగ సభలో కేటీఆర్ మాట్లాడారు. గతేడాది అక్టోబర్‌లో కురిసిన భారీ వర్షాలకు నగరంలో అనేక కాలనీలు మునిగి పోయాయని, ఆర్థిక సహాయం చేయాలని కేంద్రాన్ని కోరినా అరపైసా కూడా ఇవ్వలేదని, గుజరాత్లో వరదలొస్తే ప్రధాని మోదీ తక్షణ సాయంగా రూ.వెయ్యి కోట్లు ఇచ్చారన్నారు. మోదీ సర్కార్ తెలంగాణ ప్రభుత్వానికి సహకరిం చకపోగా అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తోందని ఆరోపించారు. మత విద్వేషాలు రెచ్చగొట్టి రాజ కీయ లబ్ధిపొందాలని చూస్తోందని మండిపడ్డారు. ఒక్క విద్యాసంస్థనూ మంజూరు చేయలేదు.. మన ఊరు– మనబడిలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా రూ.7,289 కోట్లతో 26 వేల పాఠశాలను సంస్క రించుకుంటున్నామని కేటీఆర్ తెలిపారు. ప్రభుత్వ హాస్టళ్లలో ఒక్కో విద్యార్థిపై రూ.1.20 లక్షలు ఖర్చు చేసి 950 గురుకుల పాఠశాలల్లో నాణ్యమైన విద్య ను అందిస్తున్నామని చెప్పారు. కేంద్రం మాత్రం రాష్ట్రానికి కొత్తగా ఒక్క నవోదయ పాఠశాలను కూడా కేటాయించలేదని విమర్శించారు. దేశవ్యా ప్తంగా 16 ఐఐఎంలు మంజూరు చేస్తే, తెలంగాణకు ఇచ్చింది గుండు సున్నా అని మండిపడ్డారు. ప్రభు త్వ ఆస్పత్రులను అభివృద్ధి చేశామని, కేసీఆర్ కిట్టు వల్ల ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలు 50 శాతం పెరిగాయని గుర్తు చేశారు. కార్యక్రమాల్లో మంత్రి సబితారెడ్డి, ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. -
మామా.. కోడలా..?
మామా.. కోడలా.. ఎవరు పోటీచేస్తారు? తీగల తప్పుకుంటారా.. అనిత బరిలో దిగుతారా? మహేశ్వరం నియోజకవర్గంలో ప్రస్తుతం ఇదే చర్చ జరుగుతోంది. స్థానిక శాసనసభ్యుడు తీగల కృష్ణారెడ్డికి దీటుగా ఆయన కోడలు అనితారెడ్డి పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఆమె నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తుండడంతో కార్యకర్తల్లో గందరగోళం నెలకొంది. ఇప్పటికే మూడు గ్రూపులు, ఆరు వర్గాలుగా చీలిపోయిన పార్టీలో కొత్త పవర్ సెంటర్ ఏర్పడడం ఆందోళన కలిగిస్తోంది. మహేశ్వరం: మహేశ్వరం నియోజకవర్గం నుంచి 2014 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ తరఫున విజయం సాధించిన తీగల కృష్ణారెడ్డి రాష్ట్రంలో మారిన సమీకరణల నేపథ్యంలో టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. అయితే, ఇప్పటికే పార్టీని వెన్నంటి నిలిచిన ముఖ్యనేతలకు ఈ పరిణామం మింగుడు పడలేదు. పార్టీ ఆవిర్భావం నుంచి సేవలందించిన తమను కాదని తీగలకు ప్రాధాన్యం పెరగడాన్ని జీర్ణించుకోలేకపోయారు. గత ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో దిగిన కొత్త మనోహర్‌రెడ్డి, నియోజకవర్గ ఇన్చార్జిగా వ్యవహరించిన కప్పాటి పాండురంగారెడ్డిలు తీగల చేరికను బాహాటంగానే వ్యతిరేకించారు. ఈ మేరకు వైరివర్గాలుగా మారిన సీనియర్లను సమన్వయపరిచేందుకు అధిష్టానం కప్పాటిని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పదవితో సంతృప్తిపరిచే ప్రయత్నం చేసింది. గ్రూపులకు ఫుల్స్టాప్ పడిందని హైకమాండ్ భావిస్తున్నాక్షేత్రస్థాయిలో మాత్రం ఎవరికివారుగానే వ్యవహరిస్తున్నారు. వచ్చే ఏడాది జరుగనున్న ఎన్నికల్లో తీగల అభ్యర్థిత్వాన్ని పరిశీలించకపోతే తమకు న్యాయం జరుగుతుందనే భరోసా ఇద్దరిలోనూ ఉంది. ఇదిలావుండగా ఎమ్మెల్యే కృష్ణారెడ్డికి సొంత కోడలు నుంచే తీవ్ర పోటీ ఎదురవుతున్నట్లు అధికార పార్టీలో ప్రచారం జరుగుతోంది. మామ ఆదేశిస్తే వచ్చే ఎన్నికల్లో బరిలో దిగుతానని ఆమె స్పష్టం చేస్తుండడం.. పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటుండడం గులాబీ శ్రేణులను అయోమయంలో పడేస్తోంది. వయోభారం దృష్ట్యా మామకు టికెట్ నిరాకరిస్తే తన అభ్యర్థిత్వాన్ని పరిశీలించాలనే అంశాన్ని ఆమె అంతర్గతంగా తెరమీదకు తెస్తున్నారు. తమ కుటుంబానికి గాకుండా మరొకరు టికెట్ ఎగురేసుకుపోకుండా ఈ ఎత్తుగడ వేసినట్లు రాజకీయవర్గాల విశ్లేషిస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో పోటీచేయాలనే మనసులోని మాటను మామతో అనితారెడ్డి ఇప్పటికే వెల్లడించారని, ఆయన మాత్రం కోడలు సూచనను సున్నితంగా తిరస్కరించినట్లు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో కూడా తానే పోటీచేస్తానని తెగేసి చెప్పినట్లు పార్టీవర్గాలు చెబుతున్నాయి. సబితను ఢీకొనే శక్తి తనకు ఉందని భావన మరోవైపు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఈ సారి మహేశ్వరం నుంచి పోటీచేయాలని నిర్ణయించుకున్నారు. గత ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్న ఆమె 2019 ఎన్నికల్లో బరిలో దిగడం ఖాయమని స్పష్టం చేస్తున్నారు. ఈ మేరకు ఇప్పటికే నియోజకవర్గంలో ముమ్మరంగా తిరుగుతున్నారు. ఈ పరిణామాన్ని కూడా అనితారెడ్డి ఉపయోగించుకుంట్నుట్లు కనబడుతోంది. సబితను ఢీకొనడం మహిళగా తనకు కలిసివస్తుందనే అంచనా వేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. మహిళగా ప్రజల్లోకి వెళితే సానుకూల స్పందన లభిస్తుందని, ఇది విజయతీరాలవైపు తీసుకెళుతుందని ఆమె సన్నిహితుల వద్ద అంటున్నారు. ఆర్ట్ ఫౌండేషన్‌తో ముందుకు.. టికెట్టు విషయం పక్కనపెడితే అనితారెడ్డి తీగల(ఆర్ట్) ఫౌండేషన్ పేరిట అనితారెడ్డి సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉచిత వైద్య శిబిరాలు, శస్త్రచికిత్సలు, మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్ శిక్షణ ఇప్పించి వారి స్వయం ఉపాధి పెంపొందించేందుకు దోహదపడే కార్యక్రమాలు చేపడుతూ ప్రజలకు చేరువవుతున్నారు. పార్టీ, ప్రభుత్వ కార్యక్రమాల్లో మామ కృష్ణారెడ్డితోపాటు పాల్గొంటూ పార్టీపై పట్టు సాధించే ప్రయత్నం చేస్తున్నారు. మామ, కోడలు మధ్య టికెట్ విషయంతో అంతర్గతంగా పోరు నడుస్తున్న తరుణంలో ఎవరికి టికెట్ వస్తుందోననే పార్టీ శ్రేణులు చర్చింకుంటున్నాయి. ఈ ఇరువురు సాధ్యమైనంత త్వరగా అభ్యర్థిత్వంపై స్పష్టమైన ప్రకటన చేయకపోతే ఇబ్బందులు ఏర్పడతాయని టీఆర్ఎస్ ముఖ్యనేత ఒకరు ‘సాక్షి’తో వ్యాఖ్యానించారు. ఆర్ట్ ఫౌండేషన్‌తో ముందుకు.. టికెట్టు విషయం పక్కనపెడితే అనితారెడ్డి తీగల(ఆర్ట్) ఫౌండేషన్ పేరిట అనితారెడ్డి సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉచిత వైద్య శిబిరాలు, శస్త్రచికిత్సలు, మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్ శిక్షణ ఇప్పించి వారి స్వయం ఉపాధి పెంపొందించేందుకు దోహదపడే కార్యక్రమాలు చేపడుతూ ప్రజలకు చేరువవుతున్నారు. పార్టీ, ప్రభుత్వ కార్యక్రమాల్లో మామ కృష్ణారెడ్డితోపాటు పాల్గొంటూ పార్టీపై పట్టు సాధించే ప్రయత్నం చేస్తున్నారు. మామ, కోడలు మధ్య టికెట్ విషయంతో అంతర్గతంగా పోరు నడుస్తున్న తరుణంలో ఎవరికి టికెట్ వస్తుందోనని పార్టీ శ్రేణులు చర్చింకుంటున్నాయి. ఈ ఇరువురు సాధ్యమైనంత త్వరగా అభ్యర్థిత్వంపై స్పష్టమైన ప్రకటన చేయకపోతే ఇబ్బందులు ఏర్పడతాయని టీఆర్ఎస్ ముఖ్యనేత ఒకరు ‘సాక్షి’తో వ్యాఖ్యానించారు. -
కామ్రేడ్..కాస్కో!
మహేశ్వరం నియోజకవర్గంలో సీపీఐ-కాంగ్రెస్ పొత్తు అపహాస్యం పొత్తులో సీటు సీపీఐకి కేటాయించిన కాంగ్రెస్ బీఫారం ఇచ్చి మల్‌రెడ్డితో నామినేషన్ వేయించిన అదే పార్టీ సీపీఐ తరఫున అజీజ్‌పాషా,కాంగ్రెస్ తరఫున మల్రెడ్డి సాక్షి,రంగారెడ్డిజిల్లా: కామ్రేడ్ల-కాంగీయుల పొత్తు ఆదిలో హంసపాదయ్యింది. ఇలా సీట్లు ఇస్తున్నట్లే ఇచ్చి కాంగ్రెస్ పార్టీ సీపీఐకి గట్టి షాక్ ఇచ్చింది. తెలంగాణ ఏర్పాటులో కీలకపాత్ర పోషించిన సీపీఐకి కాంగ్రెస్ మధ్య ఎన్నికల పొత్తు కుదిరిన విషయం తెలిసిందే. ఇందులోభాగంగా రంగారెడ్డి జిల్లా మహేశ్వరం అసెంబ్లీ నియోజకవర్గాన్ని సీపీఐకి కేటాయించారు. ఇందుకు పార్టీ సీనియర్‌నేత అజీజ్‌పాషా నామినేషన్ కూడా వేశారు. అయితే కాంగ్రెస్ పార్టీ కూడా ఇదే స్థానంలో అభ్యర్థిని నిలబెట్టింది. మల్రెడ్డి రంగారెడ్డికి బీ ఫారంఇచ్చి నామినేషన్ వేయించింది. అయితే మల్‌రెడ్డితో నామినేషన్‌ను ఉపసంహరింపజేయాలని సీపీఐ నాయకులు కాంగ్రెస్‌పై చేసిన ఒత్తిడి ఏ మాత్రం ఫలితాన్నివ్వలేదు. దీంతో ఆయన బరిలో నిలిచి ప్రచారం కూడా కొనసాగిస్తున్నారు. నారాయణ అసహనం : మహేశ్వరం అసెంబ్లీ స్థానంలో కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థిని నిలపడంపై సీపీఐ కార్యదర్శి నారాయణ టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాలను శుక్రవారం నిర్వహించిన సంయుక్త మీడియా సమావేశంలో బహిరంగంగానే ప్రశ్నించారు. తమకు సీటు కేటాయించి మల్‌రెడ్డికి మళ్లీ పార్టీ బీ ఫారం ఎందుకిచ్చారని తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. దీనిపై పొన్నాల స్పందిస్తూ హైకమాండ్ ఆదేశాల మేరకే మల్‌రెడ్డికి బీఫారం ఇచ్చామని, కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో అలా చేయాల్సి వచ్చినప్పటికీ పోటీనుంచి తప్పుకోవాల్సిందిగా మల్‌రెడ్డిని ఆదేశించానని తెలిపారు. కానీ మల్రెడ్డి రంగారెడ్డి మాత్రం శనివారం నామినేషన్‌ను ఉపసంహరించుకోలేదు. అంతేకాకుండా శనివారం బడంగ్‌పేటలో కాంగ్రెస్ కార్యకర్తలతో సమావేశమయ్యారు. తాను పోటీలో ఉన్నానని, తన గెలుపునకు సహకరించాలని కోరారు. సోమవారం నుంచి పూర్తిస్థాయి ప్రచారం ప్రారంభించేందుకు ఆయన సన్నాహాలు చేసుకుంటున్నారు. ఈ విషయమై నియోజకవర్గ సీపీఐ అభ్యర్థి అజీజ్‌పాషా మాత్రం నోరుమెదపడం లేదు. దీంతో ఆపార్టీ నియోజకవర్గ శ్రేణులు డైలమాలో పడ్డాయి. ఇరుపార్టీల మధ్య తెరచాటు ఒప్పందమేమైనా కుదిరిందా..అని అనుమానపడుతున్నాయి. ఎంతైనా కాంగ్రెస్ మార్కు రాజకీయం కదా..!! -
తొలి మహిళా హోం మంత్రి మహేశ్వరం నుంచే..
డీలిమిటేషన్లో కొత్తగా ఏర్పాటైన మహేశ్వరం నియోజకవర్గం ‘తీగల’పై విజయం సాధించిన సబిత రంగారెడ్డి, న్యూస్‌లైన్ : నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా 2009లో మహేశ్వరం నియోజకవర్గం ఏర్పాటైంది. అంతకుముందు ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో భాగంగా ఉన్న మహేశ్వరం, కందుకూరు మండలాలు.. మలక్‌పేట నియోజకవర్గంలో ఉన్న సరూర్‌నగర్ మండలంతోపాటు డివిజన్‌ను కలిపి మహేశ్వరం నియోజకవర్గాన్ని ఏర్పాటు చేశారు. మహేశ్వరం నియోజకవర్గం ఏర్పడిన తర్వాత 2009లో నిర్వహించిన మొదటి ఎన్నికల్లో 18 మంది పోటీపడగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పి.సబితాఇంద్రారెడ్డి విజయం సాధించారు. టీడీపీకి చెందిన సమీప ప్రత్యర్థి తీగల కృష్ణారెడ్డిపై ఆమె 7,833 ఓట్ల ఆధిక్యతంతో గెలుపొందారు. ఆ తర్వాత సబితాఇంద్రారెడ్డి హోంమంత్రిగా బాధ్యతలు చేపట్టి దేశంలోనే తొలి మహిళా హోంమంత్రిగా చరిత్ర పుటల్లోకి ఎక్కారు. -
త్వరలో సబిత పాదయాత్ర
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: మహేశ్వరం నియోజకవర్గంలో మరోసారి పట్టు నిలుపుకునేందుకు మాజీ మంత్రి సబితాఇంద్రారెడ్డి వ్యూహరచన చేస్తున్నారు. కొన్నాళ్లుగా స్తబ్దుగా ఉన్న ఆమె.. వచ్చే నెలాఖరులో నియోజకవర్గంలో పాదయాత్ర నిర్వహించేందుకు సన్నద్ధమవుతున్నారు. సీబీఐ కేసుల నేపథ్యంలో మంత్రి పదవికి రాజీనామా చేసిన చేవెళ్ల చెల్లెమ్మ... జిల్లా రాజకీయాల్లో కూడా మునుపటి తరహాలో చొరవ చూపడంలేదు. అయితే, ఇటీవల మహేశ్వరం నియోజకవర్గంలో టీడీపీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు తీగల కృష్ణారెడ్డి, దేప భాస్కరరెడ్డి యాత్రలు నిర్వహించడంతోపాటు.. మూడు నెలల క్రితం జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ఆ పార్టీలు మంచి ఫలితాలను సాధించాయి. మరోవైపు తెలంగాణ ఉద్యమం కూడా ఊపందుకోవడంతో నియోజకవర్గ పర్యటనకు కాసింత దూరం పాటించారు. కాగా, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో రాజకీయ సమీకరణలు మారిపోయాయి. రాష్ట్ర విభజనతో మళ్లీ అధికారం ఖాయమనే సంకేతాలు వస్తుండడంతో.. ఇదే అదనుగా ప్రతి పల్లెకు పాదయాత్ర చేపట్టాలని సబిత భావిస్తున్నారు. అసెంబ్లీలో తెలంగాణ బిల్లుపై జనవరి 23న చర్చ ముగిసిన అనంతర ం నియోజకవర్గ పర్యటనకు షెడ్యూల్ ఖరారు చేసుకునే దిశగా ఆలోచన చేస్తున్నారు. అప్పటినుంచి ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే వరకు ప్రజలతో మమేకం కావడం ద్వారా పూర్వవైభవం సంపాదించుకోవచ్చని అంచనా వేస్తున్నారు. అభివృద్ధి, తెలంగాణ అంశం తమను విజయతీరాలకు చేరుస్తుందని భావిస్తున్న ఆమె... వీటినే ప్రచారాస్త్రాలుగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని యోచిస్తున్నారు.