నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా 2009లో మహేశ్వరం నియోజకవర్గం ఏర్పాటైంది.
డీలిమిటేషన్‌లో కొత్తగా ఏర్పాటైన మహేశ్వరం నియోజకవర్గం
‘తీగల’పై విజయం సాధించిన సబిత
రంగారెడ్డి, న్యూస్‌లైన్ : నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా 2009లో మహేశ్వరం నియోజకవర్గం ఏర్పాటైంది. అంతకుముందు ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో భాగంగా ఉన్న మహేశ్వరం, కందుకూరు మండలాలు.. మలక్‌పేట నియోజకవర్గంలో ఉన్న సరూర్‌నగర్ మండలంతోపాటు డివిజన్‌ను కలిపి మహేశ్వరం నియోజకవర్గాన్ని ఏర్పాటు చేశారు.
మహేశ్వరం నియోజకవర్గం ఏర్పడిన తర్వాత 2009లో నిర్వహించిన మొదటి ఎన్నికల్లో 18 మంది పోటీపడగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పి.సబితాఇంద్రారెడ్డి విజయం సాధించారు. టీడీపీకి చెందిన సమీప ప్రత్యర్థి తీగల కృష్ణారెడ్డిపై ఆమె 7,833 ఓట్ల ఆధిక్యతంతో గెలుపొందారు. ఆ తర్వాత సబితాఇంద్రారెడ్డి హోంమంత్రిగా బాధ్యతలు చేపట్టి దేశంలోనే తొలి మహిళా హోంమంత్రిగా చరిత్ర పుటల్లోకి ఎక్కారు.