Maize crop
-
25 వరకు ఆర్బీకేల్లో రైతుల పేర్ల నమోదు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఈ నెల 26వ తేదీ నుంచి మొక్కజొన్న కొనుగోళ్లను ప్రారంభిస్తున్నట్టు మార్కెటింగ్‌శాఖ ప్రత్యేక కమిషనర్ ఎస్.ప్రద్యుమ్న చెప్పారు. భారీ వర్షాలు, వరదల కారణంగా రైతులు పంటలను కాపాడుకునే పనుల్లో నిమగ్నమైనందున రైతు భరోసా కేంద్రాల్లో పేర్ల నమోదును ఈ నెల 25 వరకూ కొనసాగిస్తున్నట్టు తెలిపారు. పత్తి రైతులకూ అవకాశం: ఈ ఏడాది నుంచి పత్తి రైతులు కూడా తమ పేర్లను రైతు భరోసా కేంద్రాల్లో నమోదు చేసుకుని పంటను అమ్ముకునే వెసులుబాటును ప్రభుత్వం కల్పించింది. కొత్తగా టైమ్‌స్లాట్ విధానాన్నీ ప్రవేశపెట్టింది. పేరు నమోదు చేసుకున్న రైతుకు ముందుగా (కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) సీసీఐ కూపన్లు జారీచేస్తుంది. ఆ కూపన్లలో పేర్కొన్న కొనుగోలు కేంద్రానికి, కేటాయించిన టైమ్‌లో రైతులు పత్తిని తీసుకెళ్లాలి. ఒక వేళ ఆ టైమ్‌లోగా పంట తీసుకెళ్లకుంటే మరోసారి టైమ్‌స్లాట్ తీసుకోవాల్సి ఉంటుంది. పత్తికి క్వింటాలుకు రూ.5,825ను మద్దతు ధరగా సీసీఐ ప్రకటించింది. -
నిలువునా ముంచిన ‘కరోనా’
కరోనా వైరస్ కోళ్ల పరిశ్రమను సంక్షోభంలోకి నెట్టేసింది. మొక్కజొన్న రైతులను నిలువునా ముంచేసింది. కోళ్లకు ప్రధాన మేత అయిన మొక్క జొన్న వినియోగం అమాంతం తగ్గింది. ఫలితం.. మార్కెట్లో మొక్కజొన్న ధరలు ఒక్కసారిగా పతనమయ్యాయి. మొన్నటివరకు రూ.2,200 పలికిన క్వింటా ఇప్పుడు రూ.1300కు పడిపోవడంతో రైతులు దిగులు చెందుతున్నారు. ఇదే అదునుగా వ్యాపారులు సిండికేట్‌గా మారి పంటను దోచుకుంటుండడంతో శ్రమకు తగిన ఫలితం దక్కడంలేదంటూ గగ్గోలు పెడుతున్నారు. చీపురుపల్లి రూరల్/సాలూరు: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ ప్రభావం మొక్క జొన్న రైతులనూ విడిచిపెట్టలేదు.చీడపీడలు, ఈదురుగాలులకు పంట నేలకొరగడం వంటి కారణాలతో ఆశించిన స్థాయిలో దిగుబడులు రాలేదు. ఇప్పుడు ధరలు గణనీయంగా తగ్గిపోవడంతో మొక్కొజన్న రైతులు నష్టపోతున్నారు. మొక్కజొన్న ఉత్తత్తిలో అధిక శాతం (సుమారు 90 శాతం) కోళ్ల పరిశ్రమకు వెళ్తుంది. కరోనా వైరస్ ప్రభావం వల్ల ప్రస్తుతం చికెన్ విక్రయాలు గణనీయంగా తగ్గిపోయాయి. ఫౌల్ట్రీ యజమానులు తీవ్ర నష్టాలను ఎదుర్కొంటున్నారు. దీంతో పరిశ్రమను నిలిపివేస్తున్నారు. ఫలితం.. కోళ్లకు మేతగా వినియోగించే మొక్కజొన్న కొనుగోలు చేసేందుకు ముందుకు రావడం లేదు. ఈ ప్రభావం రైతులపై పడింది. (కరెంటుకు ‘కరోనా’ షాక్!) ఒక్కసారిగా ధరలు పతనం... జిల్లాలో ప్రస్తుత రబీ సీజన్లో సుమారు 18వేల హెక్టార్లలో మొక్కజొన్న పంటను రైతులు సాగుచేశారు. ఎకరాకు సుమారు 30 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుంది. గత ఖరీఫ్‌లో క్వింటా మొక్కజొన్నలు బస్తా రూ.2,400 నుంచి రూ.2,200 ధర పలికేది. దీంతో సాగు విస్తీర్ణం పెంచారు. పంట చేతికొచ్చేవేళ... దేశంలో కరోనా వైరస్ ప్రభావం కనిపించడంతో ధరలు పడిపోయాయి. ప్రస్తుతం క్వింటా రూ.1300లకు కొనుగోలు చేస్తున్నారు. దీంతో ఒక్కో బస్తాపైన సుమారుగా రూ.900లు నష్టపోతున్నామంటూ రైతులు వాపోతున్నారు. దీనిని అదునుగా తీసుకుని వ్యాపారులు సిండికేట్‌గా మారి రైతుల పంటను నిలువునా దోచుకుంటున్నారన్న వాదన వినిపిస్తోంది. (కోవిడ్-19: వారికి సోకదు) కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు వినతి... మొక్కజొన్న పంటను కొనుగోలుకు ప్రభుత్వం తక్షణమే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేయాలని రైతులు కోరుతున్నారు. గడిచిన ఖరీఫ్ సీజన్లో ప్రభుత్వం మొక్కజొన్నపంటకు క్వింటా రూ.1760 మద్దతు ధర ప్రకటించింది. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేసింది. ఆ సమయంలో పంట తక్కువగా ఉండడం, మార్కెట్లో ఎక్కువ ధర పలకడంతో రైతులు వ్యాపారులకు అమ్మకాలు జరిపారు. దీంతో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేసినా ఫలితం లేకపోయింది. ఇప్పుడు వ్యాపారులు పంటకు ధరలను అమాంతం తగ్గించేయడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. గిట్టుబాటు ధర కల్పించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. -
ఆహా ఏమి రుచి..తినరా మైమరిచి
సాక్షి, కర్నూలు : వర్షాకాలం వచ్చింది..దాని వెంటే మొక్కజొన్న పొత్తులు కూడా మార్కెట్లోకి వచ్చాయి. ఒక పక్క వర్షం కురుస్తుంటే మరో పక్క వేడివేడి జొన్నపొత్తులు తింటుంటే ఆ మజానే వేరంటారు మొక్కజొన్న పొత్తుల ప్రియులు. ఏటా జూలై నుంచి సెప్టెంబర్ నెల వరకు లభించే మొక్క జొన్న పొత్తులకు మంచి గిరాకీ ఉంటుంది. రాష్ట్రంలో దొరికే మొక్కజొన్న పొత్తుల కన్నా కర్ణాటక పొత్తుకు ఓ ప్రత్యేక రుచి ఉంటుంది. అక్కడ వుండే నేలస్వభావంతో వాటికి ప్రత్యేకమైన రుచి ఉంటుంది. సీజన్ ఉపాధి.. మొక్కజొన్న పొత్తుల సీజన్ పలువురికి ఉపాధిగా మారుతుంది. ఇతర ప్రాంతాల నుంచి సైతం దిగుమతి చేసుకోవడంతో స్థానికులకు ఆదాయం సమకూరుతోంది. ఈ సీజన్లో ఇక్కడ రోడ్ల పక్కన దుకాణాలు ఏర్పాటు చేసుకొని పొత్తులు అమ్ముతూ జీవనం సాగిస్తున్నారు. ఒక్కో దుకాణం, తోపుడు బండిపై వెయ్యి పొత్తుల వరకు కాల్చి అమ్మి ఆదాయం పొందుతారు. స్థానిక మార్కెట్‌యార్డుకు దిగుమతి అయిన మొక్కజొన్నపొత్తులను హోల్‌సేల్‌గా ఒక్కటి రూ.7 నుంచి రూ.8వరకు కొని రిటైల్‌గా అమ్ముతుంటారు. ఒక్కో పొత్తు ప్రస్తుతం రూ.10 నుంచి రూ.15 వరకు సైజును బట్టి అమ్మకాలు జరుపుతున్నారు. అయితే ప్రస్తుతం ధరలు అధికంగా ఉండటంతో ఈ ధర గిట్టుబాటు కావడం లేదని వ్యాపారులు చెబుతున్నారు. ఎకరం మొక్కజొన్న పంట రూ.50వేలు మొక్కజొన్న సీజన్ ప్రారంభం కావడంతో ఇక్కడి వ్యాపారులు రాయచూర్, నారాయణపేట పలు ప్రాంతాలకు వెళ్లి మొక్కజొన్న పంటను కొంటారు. ప్రస్తుతం మొక్కజొన్న పంట ఎకరా కాపు రూ.50వేల వరకు వ్యాపారులు చెల్లించి రైతుల వద్ద నుంచి కొనుగోలు చేస్తున్నారు. ఇది చాలా మంచి ధరని రైతులు చెబుతున్నారు. అయితే గత ఏడాది పంటకు తెగుళ్లు, చీడపీడలు ఆశించడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. దిగుబడి లేక కొనుగోలు చేసిన వ్యాపారులు సైతం నష్టాలను చవిచూశారు. దీంతో సాగు విస్తీర్ణం తగ్గడంతో ధరలు పెరిగాయని చెబుతున్నారు. ఈ ఏడాది కర్ణాటక, తమిళనాడు, చిత్తూరు శివారు ప్రాంతాల్లో కూడా మొక్కజొన్న సాగు విస్తీర్ణం బాగా తగ్గడంతో ధరలు పెరిగాయని వ్యాపారులు చెబుతున్నారు. -
పెట్టుబడి రాయితీ.. ఆపేయడమే ఆనవాయితీ
సాక్షి, అమరావతి: దేవుడు వరమిచ్చినా పూజారి కనికరించలేదన్న చందంగా తయారైంది రాష్ట్రంలోని రైతుల పరిస్థితి. గత ఏడాది కరువు వల్ల పంటలు కోల్పోయిన రైతులకు పెట్టుబడి రాయితీ నిమిత్తం కేంద్ర ప్రభుత్వం రూ.932 కోట్లు విడుదల చేసినా చంద్రబాబు సర్కారు వాటిని తన సోకులకు ఉపయోగించుకుంది. విపత్తుల వల్ల పంటలు పోగొట్టుకున్న రైతులు సాధారణంగా అప్పుల్లో కూరుకుపోతారు. ఇలాంటి వారికి తదుపరి పంటలు వేసుకునేందుకు వీలుగా వీలైనంత త్వరగా పెట్టుబడి రాయితీ చెల్లించాలని విపత్తు నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. ఇందులో భాగంగానే కేంద్ర ప్రభుత్వం తన వాటాగా రూ.932 కోట్లు ఎప్పుడో విడుదల చేసింది. దీనికి మరికొంత మొత్తం కలిపి బాధిత రైతులకు పెట్టుబడి సాయం అందించాల్సి ఉండగా.. చంద్రబాబు సర్కారు ఆ నిధులను ఎన్నికల తాయిలాల కోసం వినియోగించి రైతుల్ని నిలువునా ముంచింది. వారి ఖర్మకు వారే పోతారన్నట్టుగా గాలికొదిలేసింది. మరోవైపు తీవ్ర దుర్భిక్ష పరిస్థితుల నడుమ అష్టకష్టాలు పడి పండించిన పంటలను కొనుగోలు చేసిన సర్కారు ఆ సొమ్ములూ చెల్లించలేదు. మొక్కజొన్నలను ప్రభుత్వానికి విక్రయించిన వారికి రూ.200 కోట్లకు పైగా బకాయిలు చెల్లించాల్సి ఉంది. ప్రభుత్వానికి మొక్కజొన్నల్ని అమ్మిన పాపానికి గుంటూరు, కృష్ణా, ప్రకాశం, కర్నూలు తదితర జిల్లాల రైతులు డబ్బు కోసం వ్యవసాయ శాఖ కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నారు. మరోవైపు గత ఖరీఫ్‌లో ధాన్యం విక్రయించిన రైతులకూ సొమ్ములు చెల్లించలేదు. బిందు, తుంపర సేద్యం, వ్యవసాయ పనిముట్లకు సంబంధించిన సబ్సిడీ బిల్లులు కూడా రూ.వేల కోట్లు పెండింగ్‌లోనే ఉన్నాయి. ట్రాక్టర్ల కొనుగోలు, పొలాల్లో షెడ్ల నిర్మాణం, చిన్నపాటి నీటి చెరువుల ఏర్పాటు తదితరాల కోసం కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ఇస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ఈ బిల్లుల్ని కూడా పెండింగులో పెట్టింది. దీనివల్ల కొత్తగా ఈ యూనిట్లు ఎవరికీ మంజూరు చేయడం లేదు. రాయితీ బకాయి రూ.2,950 కోట్లపైనే 2015–16లో చిత్తూరు, వైఎస్సార్ కడప, అనంతపురం, తూర్పు, పశ్చిమ గోదావరి, విజయనగరం, కృష్ణా, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో 4,96,890 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. బాధిత రైతులకు ఇవ్వాల్సిన రూ.270 కోట్ల పెట్టుబడి రాయితీ బకాయిలను ప్రభుత్వం ఇప్పటివరకూ విడుదల చేయలేదు. గత ఏడాది (2018) ఖరీఫ్‌లో కరువు వల్ల పంటలు కోల్పోయిన రైతులకు రూ.1,832 కోట్లను పెట్టుబడి రాయితీగా చెల్లించాల్సి ఉండగా, ఇప్పటివరకూ నయాపైసా కూడా విదల్చలేదు. ఇందులో కేంద్రం వాటా రూ.932 కోట్లను ఎప్పుడో విడుదల చేసింది. 2018 రబీ సీజన్లో రాష్ట్ర ప్రభుత్వం 257 మండలాలను కరువు ప్రాంతాలుగా ప్రకటించింది. 450 మండలాల్లో దుర్భిక్షం ఉన్నప్పటికీ 257 మండలాలనే కరువు ప్రాంతాల జాబితాలో చేర్చడంపై విమర్శలు రావడంతో కలెక్టర్లు మరో 90 మండలాలను చేర్చాలని ప్రతిపాదనలు పంపించారు. అవి ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో ఉన్నాయి. 2018 రబీలో ప్రభుత్వం మరో రూ.750 కోట్లు చెల్లించాల్సి ఉంటుందని అంచనా. వెరసి దుర్భిక్ష బాధిత రైతులకు చెల్లించాల్సిన పెట్టుబడి రాయితీ బకాయి మొత్తం రూ.2,950 కోట్లకు పైగా ఉంది. 2014లో బకాయిలు ఎగవేత ఓట్లు వేసి గెలిపించిన పాపానికి చంద్రబాబు సర్కారు అధికారంలోకి రాగానే రైతులకు కుచ్చుటోపీ పెట్టింది. 2014లో అధికారంలోకి రాగానే రూ.2,350 కోట్ల పెట్టుబడి రాయితీ బకాయిలను ఎగవేసింది. ఇది చాలాదన్నట్టు 2014 ఖరీఫ్‌లో రైతులకు రూ.1,067.77 కోట్ల పెట్టుబడి రాయితీ అందించాలని మంత్రివర్గ సమావేశం నిర్ణయించగా.. దానిని రూ.రూ.692.67 కోట్లకు కుదించింది. 2014 నాటి రూ.2,350 కోట్ల పెట్టుబడి రాయితీ బకాయిలు ఎందుకు పెండింగులో పెట్టారని అన్నదాతలు, రైతు సంఘాల నేతలు నిలదీస్తున్నా పట్టించుకోవడం లేదు. ఇదిలావుంటే.. 4–5 విడతల రుణమాఫీ బకాయిలు రూ.8,830 కోట్లను ఈనెల 6వ తేదీలోగానే చెల్లిస్తామని ఎన్నికల ముందు చెప్పిర ప్రభుత్వం ఇప్పటివరకూ ఆ మొత్తాలను విడుదల చేయలేదు. రైతులంటే ఇంత వివక్షా? ముడుపులే లక్ష్యంగా చంద్రబాబు సర్కారు సంపన్న వ్యాపార సంస్థలకు రాయితీలు ఇస్తూ.. రైతుల విషయంలో తీవ్ర వివక్ష చూపుతోంది. విమానాల్లో తిరిగేది సంపన్నులేనన్న విషయం అందరికీ తెలిసిన విషయమే. అలాంటి విమానయాన సంస్థలు నష్టపోకుండా ప్రభుత్వం ఇంధన సబ్సిడీ ఇస్తోంది. ఇది చాలదన్నట్టు విజయవాడ (గన్నవరం) నుంచి దేశ, విదేశాలకు విమానాలను నడిపే సంస్థలకు నష్టం వాటిల్లితే సర్కారే ఆ మొత్తాలను భర్తీ చేస్తోంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. అయిదు నక్షత్రాల హోటళ్లు, లక్షలాది రూపాయల ఫీజులు వసూలు చేసే కార్పొరేట్ విద్యాసంస్థలు, ఫక్తు వ్యాపార దృక్పథంతో ఏర్పాటు చేస్తున్న కార్పొరేట్ ఆస్పత్రులకు, కాగితాలకే పరిమితమైన పరిశ్రమలకు సైతం రూ.వేల కోట్ల రాయితీలు ఇస్తోంది. -
గులాబీ/కత్తెర పురుగులపైముష్టి యుద్ధం!
పత్తి, మొక్కజొన్న పంటల్లో గులాబీ/ కత్తెర పురుగులకు ముష్టి ద్రావణంతో చెక్. తెలుగు రాష్ట్రాల్లో ఏటా పత్తి పంట సాగు విస్తీర్ణం పెరుగుతోంది. ఈ పంటకు ఇప్పుడు అంతో ఇంతో ఆశించిన మద్దతు ధరలు ఉండటంతో రైతులు ఈ ఏడాది బోరుబావుల కింద, నదీ తీరా ప్రాంతాల్లో అధికంగా సాగు చేశారు. అయితే ఈ పంటను మూడు నాలుగేళ్లుగా గులాబీ రంగు పురుగు నాశనం చేస్తోంది. పంట పూత దశలో ఈ పురుగు ఆశించి పూత, పిందెలను తినేసి ఏ మాత్రం దిగుబడి రాకుండా చేస్తోంది. ఈ పంటను రక్షించుకోవడానికి తెలుగు రాష్ట్రాల్లోని రైతులు రకరకాల మందులు పిచికారీ చేసినా ఆయా పురుగులు, తెగుళ్లు అదుపులోకి రాక పంటలను వదిలేయడం లేదా దున్నేయడం రైతుకు ఆనవాయితీగా మారింది. పత్తి, మొక్కజొన్న రైతులను కష్టనష్టాల నుంచి గట్టెక్కించే ‘ముష్టి ద్రావణా’న్ని వైఎస్సార్ జిల్లా వేంపల్లె మండలం టి. వెలంవారిపల్లెకు చెందిన రైతు శాస్త్రవేత్త, సేంద్రియ వ్యవసాయ నిపుణుడు కొమ్ములూరి విజయకుమార్ రైతులకు సూచిస్తున్నారు. పొలాల గట్లపైన, బంజరు భూముల్లో లభించే కొన్ని మొక్కలను, కాయలు, పండ్లు తీసుకుని పలు రకాల ద్రావణాలను తయారు చేసి, పంటలపై పిచికారీ చేయించి అద్భుత ఫలితాలను రాబడుతున్నారు. ఈ కోవలోనే పత్తిలో గులాబీ రంగు పురుగు, మొక్కజొన్నలో లద్దె పురుగు(కత్తెర పురుగు) నివారణకు ‘ముష్టి ద్రావణం’ తయారు చేసి మంచి ఫలితాలు సాధించారు. ముష్టి పండ్లను అత్యధిక మోతాదులో వాడి దీన్ని తయారు చేస్తున్నందున దీన్ని ముష్టి ద్రావణం అని పిలుస్తున్నారు. ఆ ద్రావణం తయారీ, వినియోగం, పనితీరు విజయకుమార్ మాటల్లో తెలుసుకుందాం.. పత్తిని ఆశించే గులాబీ రంగు పురుగు, మొక్కజొన్న, వరి తదితర పంటలను ఆశించే కత్తెర పురుగుల నివారణకు ముష్టికాయలు, వెర్రి పుచ్చ, జముడు, నల్లేరు, సునాముఖి ఆకులు.. ఇవి పొలాల గట్ల మీద ఈ సీజన్లో మాత్రమే దొరుకుతాయి. ముష్టి పండ్లు : గుట్టలు, కొండలపై ముష్టి చెట్లు విరివిగా ఉంటాయి. ఈ చెట్ల పండ్లు జూన్ నుంచి సెప్టెంబర్, అక్టోబర్ వరకూ దొరుకుతాయి. బాగా మాగి పక్వానికి వచ్చిన ముష్టి కాయలు తీసుకుంటేనే రసం, గుజ్జు బాగా వస్తుంది. ఈ పండ్లు 10 కిలోలు తీసుకుని ప్లాస్టిక్ సంచిలో వేసి చితగ్గొట్టి ఒక పాత్రలో ఉంచుకోవాలి. వెర్రి పుచ్చకాయలు: చెరువులు, నదీ తీరాలు, వాగులు, వంకల వద్ద వెర్రిపుచ్చ కాయలు లభిస్తాయి. ఈ కాయలు పండుబారినవి 5 కిలోలు తీసుకుని బాగా దంచి నిల్వ చేయాలి. జముడు : జముడు చెట్టు అన్నీ ముళ్లతో కొమ్ములు కలిగి ఉంటుంది. ఈ కొమ్ములు రెండున్నర కిలోలు తీసుకొని ఆ కొమ్ములను కొడవలితో చిన్న ముక్కలుగా కోసి ఉంచాలి. నల్లేరు: నీటి పారుదల సదుపాయం ఉండే ఉద్యాన తోటల గట్లపైన, గుట్టల్లో, పొలాల వద్ద నల్లేరు మొక్కలు పెరుగుతూ ఉంటాయి. నల్లేరు కనుపులను రెండున్నర కిలోలు తీసుకొని ప్లాస్టిక్ సంచిలో వేసి దంచాలి. సునాముఖి : ఈ మొక్కలు రోడ్ల వెంట ఉంటాయి. పూలు పసుపు పచ్చగా ఉంటాయి. సునాముఖి ఆకులను, పూలను రెండున్నర కిలోలు తీసుకొని గ్రైండర్లో గానీ, రోలులో గానీ వేసి రుబ్బి నిల్వ చేసుకోవాలి. ద్రావణం తయారీ విధానం: 200 లీటర్ల డ్రమ్మును తీసుకుని ఆ డ్రమ్ములో దంచి ఉంచుకున్న ఆయా పదార్థాలు పోయాలి. ఇలా పోసిన వాటిని 12 రోజుల పాటు మురగబెట్టాలి. ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం వేళల్లో ఒకే కర్రతోనే కలియబెట్టాలి. ద్రావణం డ్రమ్మును నీడలోనే ఉంచి, గోనె సంచిని కప్పి ఉంచాలి. పత్తి చేలలో పిచికారీ విధానం పత్తిని ఆశించే గులాబీ రంగు పురుగు నిర్మూలన కోసం పత్తి మొక్కలకు మొగ్గలు రాక ముందు రెండుసార్లు, మొగ్గ దశలో రెండుసార్లు, పూత నుంచి కాయలు తయారయ్యే సమయంలో ఒకసారి చెట్టు అంతా బాగా తడిచేలా పిచికారీ చేయాలి. మొదటిసారి పిచికారీకి ద్రావణం లీటరు తీసుకుని 10 లీటర్ల నీటికి కలుపుకోవాలి. రెండోసారి.. 10 లీటర్ల నీటికి ఒకటిన్నర లీటరు ద్రావణం, మూడోసారి 10 లీటర్ల నీటికి ఒకటిన్నర లీటరు ద్రావణం, నాలుగోసారి 10 లీటర్ల నీటికి ఒకటిన్నర లీటరు ద్రావణం కలుపుకొని పిచికారీ చేస్తే పురుగు నిర్మూలన జరగడమే కాకుండా అధిక దిగుబడి వస్తుంది. మొక్కజొన్నకు నాలుగైదు సార్లు.. మొక్కజొన్న పంట విత్తిన 15 రోజుల పంట నుంచి మొదళ్లు బాగా తడిచేలా.. నాలుగైదు సార్లు పిచికారీ చేస్తే కత్తెర పురుగు(మక్క లద్దె పురుగు) రానే రాదు. కర్ర చేదెక్కుతుంది కాబట్టి గుడ్లు పెట్టే పరిస్థితే ఉండదు. వరిలోనూ.. వరిలో కాండం తొలిచే పురుగుతోపాటు అగ్గి, ఉల్లికోడు తెగుళ్లను ఈ ద్రావణం పారదోలుతుంది. తీగజాతి, కూరగాయ, పండ్ల తోటలను పట్టి పీడించే పండుఈగ (బంగారు ఈగ)ను కూడా ఈ ముష్టి ద్రావణం మట్టుబెడుతుంది. రసం పీల్చే పురుగులను, రెక్కల పురుగులను, తెలుపు, పసుపు పచ్చ పురుగులను ఈ ద్రావణంతో నివారించవచ్చని విజయకుమార్ చెబుతున్నారు. మత్తు వచ్చి.. విరేచనాలై.. ముష్టి ద్రావణం పిచికారీతో పంటలపై పురుగులకు మత్తు రావటంతోపాటు విరేచనాలు అవుతాయని, బలహీనమైన పురుగులు మొక్క మీద నుంచి నేల రాలుతుందని, నేల రాలిన పురుగులను చీమలు తినేస్తాయని.. ఈ విధంగా విష రసాయనాలను వాడకుండానే పురుగులను ముష్టి ద్రావణంతో నివారించుకోవచ్చని, నిర్మూలించుకోవచ్చని విజయకుమార్ వివరించారు. పూత దశలో పవర్ స్ప్రేయర్లు వాడొద్దు ద్రావణాలను ఎండ వేళల్లో పిచికారీ చేయొద్దని చెబుతూ.. ఉదయం 5 గం. నుంచి 8 గం.లోగానే పిచికారీని పూర్తి చేయాలని విజయకుమార్(98496 48498) అన్నారు. పూత దశలో ద్రావణాలు పిచికారీ చేయకుండా ఉంటే పూత రాలకుండా ఉంటుందని రైతులు ముఖ్యంగా గమనించాలన్నారు. పూత దశలోనూ పిచికారీ అవసరమైతే.. పవర్ స్ప్రేయర్ల ద్వారా కాకుండా సాధారణ స్ప్రేయర్లను వినియోగించి నెమ్మదిగా పిచికారీ చేసుకుంటే పూత రాలకుండా ఉంటుందన్నారు. రైతులు గత ఏడాది నుంచి దోమ నివారణకు వివిధ పంటలపై వాడుతున్న ‘బమావె’ ద్రావణం వంటి ఏ ఇతర ద్రావణాలతోనైనా ముష్టి ద్రావణాన్ని కూడా కలిపి పిచికారీ చేయవచ్చునని ఆయన తెలిపారు. – మాచుపల్లె ప్రభాకరరెడ్డి, సాక్షి (అగ్రికల్చర్), వైఎస్సార్ జిల్లా -
సీతారాంపురంలో భారీ అగ్నిప్రమాదం
విజయనగరం: విజయనగరం జిల్లాలోని గజపతి నగరం మండలం సీతారాంపురంలో బుధవారం ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 50 పశువుల పాకలు, 4 పూరిళ్లు, మొక్కజొన్న పంట అగ్నికి ఆహుతి అయ్యాయి. ఈ ఘటనలో సుమారుగా 50 లక్షల రూపాయల ఆస్తినష్టం వాటిలినట్టు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
రైతన్నా మేలుకో.. పంటలను కాపాడుకో
* వ్యవసాయ క్షేత్రాలను సందర్శించిన శాస్త్రవేత్తలు * మొక్కజొన్న, పత్తికి ఆశించే తెగుళ్ల నివారణకు సలహాలు, సూచనలు * రోలింగ్ స్టెమ్ అప్లికేటర్ వాడకంపై అన్నదాతలకు అవగాహన సదాశివపేట: ఆరుతడి, వర్షాధార పంటలైన మొక్కజొన్న, పత్తి సాగులో చీడపీడల నివారణకు చర్యలు చేపట్టి ఎక్కువ దిగుబడులు సాధించవచ్చని సంగారెడ్డి ఏరువాక కేంద్రం కో ఆర్డినేటర్ డాక్టర్. ఏ శ్రీనివాస్ 9989623819, శాస్త్రవేత్త డాక్టర్. ఎం శ్రీనివాస్ 9440512029 రైతులకు సూచించారు. మండల పరిధిలోని పలు గ్రామాల్లో రైతులు సాగు చేస్తున్న మొక్కజొన్న, పత్తి పంటలను గురువారం సందర్శించిన వీరు రైతులకు పలు సలహాలు, సూచనలు అందజేశారు. మొక్కజొన్నలో కాండం తొలిచే పురుగు... ప్రస్తుతం మొక్కజొన్న పంటల్లో కాండం తొలుచు పురుగు లక్షణాలు కనిపిస్తున్నాయని అధికారులు తెలిపారు మొవ్వులో చేరే కాండం తొలిచే, లద్దె పురుగులు లేత ఆకులను తింటాయని పేర్కొన్నారు. దీనివల్ల ఆకులపై వరుస క్రమంలో రంధ్రాలు ఏర్పడడంతో పాటు వాటి విసర్జితాలు కనిపిస్తాయన్నారు. మొవ్వను పట్టుకుని లాగినట్లయితే సులభంగా ఊడి వస్తుందని వివరించారు. వర్షాభావ పరిస్థితుల్లో దీని తీవ్రత అధికంగా ఉంటుందని సూచించారు. కాండం తొలుచు పురుగు నివారణకు కార్బోఫ్యురాన్ 3జీ గుళికలను ఇసుకలో కలుపుకుని మొవ్వులో పడే విధంగా వేయాలని తెలిపారు. పత్తి పంటలకు తెల్ల దోమ, పిండి నల్లి... పత్తి పంటలకు తెల్ల దోమ, తామర పురుగు, పిండినల్లి ఆశించినట్లు గుర్తించామని తెలిపారు. దీని నివారణకు లీటరు నీటిలో పావులీటర్ మోనోక్రొటోఫాస్ మందును లేదా ఐదు లీటర్ల నీటిలో కిలో ఇమిడాక్లోప్రిడ్ పౌడర్‌ను కలిపి కాండం లేత భాగంపై రుద్దాలని సూచించారు. పంట విత్తిన 20, 40, 60, 80 రోజుల దశలో మోనోక్రొటోఫాస్ మందును మొక్క కాండంపై పూస్తే రసం పీల్చే పురుగుల ఉధృతిని నివారించవచ్చని సూచించారు. ఇలా చేస్తే పంటపై పురుగు మందును పిచికారీ చేయాల్సిన అవసరం ఉందని సూచించారు. ఈ విధానంతో మిత్ర పురుగులు, వాతావరణానికి ఎలాంటి కీడు జరగదని చెప్పారు. పత్తి మొక్కపై మందును పూయడానికి ‘కృషి విజ్ఞాన్ కేంద్రం వైరా’ వారి సాంకేతిక పరిజ్ఞానంతో తయారు చేసిన రోలింగ్ స్టెమ్ అప్లికేటర్‌ను వినియోగించి తక్కువ శారీరక శ్రమతో పని పూర్తి చేయవచ్చని వివరించారు. ఈ పరికరం అవసరమైన రైతులు సంగారెడ్డిలోని ఏరువాక కేంద్రంలో సంప్రదించాలని తెలి పారు. రోలింగ్ స్టిమ్ అప్లికేటర్ వినియోగించే విధానాన్ని క్షే త్ర స్థాయిలో రైతులకు ప్రదర్శించి చూపించారు. వర్షాభావ పరిస్థితుల్లో నేలలో తగినంత తేమ లేని పక్షంలో 0.2 శాతం యూరియా (2 గ్రాములు) లీటర్ నీటికి కలిపి అన్ని పం టలపై పిచికారీ చేయవచ్చని సూచించారు. ఈ కార్యక్రమ ంలో మండల వ్యవసాయ అధికారి బాబునాయక్, ము నిపల్లి ఏఓ శివకుమార్, సదాశివపేట మండల వ్యవసాయ విస్తరణ అధికారులు ప్రవీణ్‌కుమార్, శ్రీనివాస్, ఆత్మ బీటీఎం షేక్‌అహ్మద్, రైతులు పాల్గొన్నారు. -
తొలి దశ నుంచే దాడి చేస్తాయి
పాడి-పంట: జగిత్యాల అగ్రికల్చర్ (కరీంనగర్): ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో మొక్కజొన్న పంటను వర్షాధారంగా, నీటి వనరుల కింద సాగు చేస్తున్నారు. అయితే ఈ పైరుపై తొలి దశ నుంచే చీడపీడలు దాడి చేసి నష్టపరుస్తున్నాయి. వాటిని సకాలంలో గుర్తించి నివారిస్తే నాణ్యమైన దిగుబడులు, మంచి ఆదాయం పొందవచ్చునని సూచిస్తున్నారు కరీంనగర్ జిల్లా పొలాస వ్యవసాయ పరిశోధనా స్థానం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ వెంకటయ్య. ఆ వివరాలు... మొక్క మొలకెత్తిన తర్వాత... ఖరీఫ్ సీజన్లో మొక్కజొన్న దిగుబడులను ప్రభావితం చేసే పురుగుల్లో ప్రధానమైనది మచ్చల కాండం తొలుచు పురుగు. ఈ పురుగు మొక్క మొలకెత్తిన 10-12 రోజుల నుంచే పైరును ఆశిస్తుంది. కాండానికి నష్టం కలిగిస్తుంది. రెక్కల పురుగులు ఒక దానిపై ఒకటిగా, గుంపులు గుంపులుగా ఆకుల అడుగు భాగాన, కాడ దగ్గర గుడ్లు పెడతాయి. అవి చేప పొలుసు మాదిరిగా కన్పిస్తాయి. గుడ్ల నుంచి పిల్ల పురుగులు బయటికి వచ్చి ముందుగా ఆకుల పత్రహరితాన్ని తినేస్తాయి. ఆ తర్వాత కాండాన్ని తొలుస్తాయి. కాండం అడుగు భాగం నుంచి రంధ్రం చేసుకుంటూ లోపలికి ప్రవేశిస్తాయి. అక్కడ ఎదిగే అంకురాన్ని తింటాయి. దీనివల్ల మొవ్వులు చనిపోతాయి. లేకుంటే మొక్క మొదలు నుంచి నాలుగైదు పిలకలు వస్తాయి. అయితే వాటిలో ఏ ఒక్క పిలకకూ ఉపయోగపడే కంకులు రావు. పురుగు ఆశించిన మొక్క కాండాన్ని చీల్చి చూస్తే లోపల గుండ్రని లేదా ఇంగ్లీషు ‘ఎస్’ ఆకారంలో సొరంగాలు కన్పిస్తాయి. ఈ పురుగును నివారించాలంటే... ముందుగా పురుగు ఆశించిన మొక్కల అవశేషాలను కాల్చేయాలి. చేలో కలుపు మొక్కలు, చెత్తా చెదారం లేకుండా చూడాలి. పైరులో వరుసల మధ్య కంది/బొబ్బర్లు/సోయాచిక్కుడును అంతరపంటగా వేసుకుంటే కాండం తొలుచు పురుగుకు సహజ శత్రువులైన పురుగుల సంఖ్య పెరుగుతుంది. తద్వారా ఈ పురుగు తాకిడి తగ్గుతుంది. ట్రైకోగ్రావూ ఖిలోనిస్ అనే పరాన్నజీవి గుడ్లను ఎకరానికి 2-3 ట్రైకోకార్డుల రూపంలో రెండు విడతలుగా... విత్తిన 12, 22 రోజులప్పుడు వేసుకోవాలి. పురుగు ఉధృతి ఎక్కువగా ఉన్నట్లయితే ఎకరానికి 3 కిలోల చొప్పున కార్బోఫ్యూరాన్ 3జీ గుళికలను ఆకు సుడుల్లో వేయాలి. రసాన్ని పీలుస్తాయి మొక్కజొన్న పైరును రసం పీల్చే పేనుబంక, నల్లి ఆశిస్తే మొక్కలు గిడసబారతాయి. వాటి ఎదుగుదల సరిగా ఉండదు. పేనుబంక పురుగు చాలా చిన్నదిగా, సూది మొన మాదిరిగా ఉంటుంది. ఆకుపచ్చ లేదా నీలి రంగులో ఉండే తల్లి, పిల్ల పురుగులు మొక్కల లేత ఆకులు, కాండాన్ని ఆశించి రసాన్ని పీలుస్తాయి. దీనివల్ల ఆకులు వాడినట్లుగా పసుపు రంగుకు వూరి వుుడుచుకుపోతారుు. మొక్క మొలిచిన 30-40 రోజుల నుంచి ఈ పురుగు పైరుపై దాడి చేస్తుంది. ఇది విసర్జించే తేనె లాంటి జిగురు పదార్థం వల్ల కాండం, లేత ఆకులను శిలీంద్రాలు ఆశిస్తాయి. ఈ తీపి పదార్థం కోసం నల్ల చీమలు చేరతాయి. శిలీంద్రాల కారణంగా మొక్కల్లో కిరణజన్య సంయోగక్రియకు ఆటంకం ఏర్పడుతుంది. మొక్కలకు పూత (జల్లు) రాక దిగుబడి తగ్గుతుంది. సాధారణంగా అక్షింతల పురుగులు, స్పిరిడ్స్, లేస్ వింగ్ బగ్స్ వంటివి పేనుబంకను అదుపులో ఉంచుతాయి. కాబట్టి పురుగు తాకిడి తక్కువగా ఉన్నప్పుడు మందులు వాడకూడదు. ఒకవేళ పేనుబంక దాడి ఎక్కువగా ఉన్నట్లయితే అవసరాన్ని బట్టి లీటరు నీటికి 1.6 మిల్లీలీటర్ల మోనోక్రొటోఫాస్ లేదా ఒక గ్రాము ఎసిఫేట్ చొప్పున కలిపి పిచికారీ చేయాలి. నెల రోజుల దశను దాటిన మొక్కజొన్న పైరును నల్లి పురుగు ఆశిస్తుంది. తల్లి, పిల్ల నల్లులు ఆకుల కింది భాగంలో సావుూహికంగా లేదా విడివిడిగా చేరి రసాన్ని పీలుస్తాయి. దీనివల్ల ఆకులపై సన్నని, తెల్లని వుచ్చలు ఏర్పడతారుు. ఆగస్ట్-అక్టోబర్ మధ్యకాలంలో పురుగు తాకిడి ఎక్కువగా ఉంటుంది. నల్లులు ముందుగా పై ఆకులను ఆశించి, ఆ తర్వాత కింది ఆకులకు వ్యాపిస్తాయి. దీంతో మొక్క పాలిపోయి ఎండుతుంది. ఈ మొక్కను తాకిన మనుషులకు దురద పుడుతుంది. నల్లి నివారణకు లీటరు నీటికి 1.6 మిల్లీలీటర్ల మోనోక్రొటోఫాస్ లేదా 1.5 గ్రాముల ఎసిఫేట్ చొప్పున కలిపి పిచికారీ చేయాలి. ఎండు తెగులు సోకితే... మొక్కలు జల్లు దశకు వచ్చిన తర్వాత, కంకి దశలో ఉన్నప్పుడు మొక్కజొన్న పైరుకు ఎండు తెగులు సోకుతుంది. తెగులు సోకిన మొక్కలు పై నుంచి కిందికి వడలిపోతాయి. ఆకులు లేతాకుపచ్చ రంగుకు వూరి తర్వాత ఎండిపోతారుు. మొక్క కణుపులు సహజ రంగును కోల్పోరుు, ఎరుపుతో కూడిన గోధువు రంగుకు వూరి కుంచించుకుపోతారుు. ఆ తర్వాత మెత్తబడతాయి. చివరికి ఎండిపోయి బెండుగా తయారవుతాయి. తెగులు కారక శిలీంద్రాలు భూమిలో, పంట అవశేషాలలో, విత్తనాలలో జీవిస్తాయి. పైరు పూత దశకు వచ్చిన తర్వాత నీటి ఎద్దడి ఏర్పడితే తెగులు త్వరగా వ్యాప్తి చెందుతుంది. ఈ తెగులు నివారణకు పంట మార్పిడి చేయాలి. కిలో ట్రైకోడెర్మా విరిడెను 90 కిలోల పశువుల ఎరువు, 10 కిలోల వేపపిండిలో కలిపి ఆఖరి దుక్కిలో వేసి కలియదున్నాలి. చేలో పరిశుభ్రత పాటించాలి. విత్తడానికి ముందు కిలో విత్తనాలకు 3 గ్రాముల థైరమ్/కాప్టాన్ పట్టించి శుద్ధి చేయాలి. పుష్పించే దశ నుంచి పైరుకు నీటి ఎద్దడి కలగకుండా చూడాలి.