Malaysian Township
-
మలేషియా టౌన్ షిప్లో భోగి సంబరాలు
-
ఫ్లై ఓవర్ ప్లీజ్!
సాక్షి,సిటీబ్యూరో: మంజీరా మెజిస్టిక్ షాపింగ్ మాల్ నుంచి మలేషియన్ టౌన్‌పిష్ వైపు వెళ్లే రాజీవ్‌గాంధీ జంక్షన్ ఫ్లై ఓవర్‌ను వెంటనే అందుబాటులోకి తేవాల్సిందిగా సిటీజనుల నుంచి, నెటిజన్ల నుంచి డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. ఈ వంతెనను వినియోగంలోకి తెస్తే ఈ మార్గం నుంచి ప్రయాణించే దాదాపు నాలుగైదు లక్షల మందికి ఊరట లభించడంతో పాటు, ట్రాఫిక్ చిక్కులు సైతం తీరుతాయి. ‘ఫ్లై ఓవర్ లేక ముందు.. నిర్మాణం ప్రారంభం కాకముందు.. ఎన్నో అవస్థలు భరించాం. ఫ్లై ఓవర్ పూర్తయింది. అనుమతించడానికి ఇబ్బంది ఏముంది? అందరికీ సమస్యలు తీరుతాయిగా. అసలెందుకు ప్రారంభించడం లేద’ంటూ అధికారులను పలువురు సామాజికమాధ్యమాలైన ట్విట్టర్, ఫేస్బుక్, వాట్సప్‌ల వేదికగా ప్రశ్నిస్తున్నారు. అయితే, ప్రస్తుతం ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులో ఉండటంతో ‘కోడ్’ ఉల్లంఘన అవుతుందేమోనని అధికారులుసంశయిస్తున్నారు. కోడ్ అడ్డువస్తే అధికారికంగా లాంఛనాలతో ప్రారంభోత్సవం చేయకపోయినా ప్రయాణానికి అనుమతించాలని కోరుతున్నారు. అనుమతిస్తే నిత్యం నిజాంపేట్, ప్రగతినగర్, కూకట్పల్లి మీదుగా హైటెక్‌సిటీకి వెళ్లే వారికి, అటు నుంచి ఇటు వచ్చేవారికి ఎంతో మేలు జరుగుతుందనివెంటనే అనుమతించాలని డిమాండ్ చేస్తున్నారు. రాజీవ్‌గాంధీ విగ్రహం, మలేషియా టౌన్‌షిప్‌ల మీదుగా హైటెక్‌సిటీకి వెళ్లేవారికి ట్రాఫిక్ నరకం తప్పుతుందంటున్నారు. ఈ మార్గంలో నిత్యం దాదాపు 1.60 లక్షల వాహనాలు ప్రయాణిస్తున్నాయి. రాజీవ్‌గాంధీ విగ్రహం జంక్షన్ ఫ్లై ఓవర్.. మంజీరా మెజిస్టిక్ షాపింగ్‌మాల్ నుంచి ప్రారంభమయ్యే ఈ ఫ్లై ఓవర్ మలేషియా టౌన్షిప్ ముందు ముగుస్తుంది.జేఎన్టీయూ రోడ్, కేపీహెచ్‌బీ ఫేజ్–1, ఫేజ్–6, ఫేజ్–9 సంగమంగా ఉన్న ఈ జంక్షన్ వద్ద రద్దీ సమయాల్లో 66 శాతం జేఎన్టీయూ నుంచి హైటెక్ సిటీవైపు వెళ్లే వారే ఉంటున్నారు. ఈ వంతెన వినియోగంతో ఇందులో 94 శాతం సమస్య పరిష్కారమవుతుందని, హైటెక్‌సిటీలో ఐటీ రంగం అభివృద్ధికి ముందు ఉన్నంత రద్దీ మాత్రమే ఉంటుందని అధికారులు చెబుతున్నారు. రాజీవ్‌గాంధీ సర్కిల్ వద్ద రద్దీ తగ్గితే ట్రాఫిక్ కష్టాలు చాలా వరకు తగ్గినట్లే. హైటెక్ సిటీ నుంచి కేపీహెచ్‌బీ వైపు వెళ్లే వారికీ ఇదే సౌలభ్యంగా ఉంటుంది. ప్యాకేజీ–4 లో చేపట్టిన పనులు.. ప్యాకేజీ–4లో బయోడైవర్సిటీ జంక్షన్, అయ్యప్ప సొసైటీ జంక్షన్, రాజీవ్‌గాంధీ జంక్షన్, మైండ్‌స్పేస్ జంక్షన్ పనులను మొత్తం రూ.379 కోట్ల వ్యయంతో చేపట్టారు. వీటిలో అయ్యప్ప సొసైటీ జంక్షన్, మైండ్‌స్పేస్ అండర్‌పాస్, మైండ్‌స్పేస్ ఫ్లై ఓవర్ అందుబాటులోకి వచ్చాయి. రాజీవ్‌గాంధీ జంక్షన్ ఫ్లై ఓవర్ పూర్తయింది. ఇప్పుడు ఈ వంతెనను అందుబాటులోకి తేవాలని ప్రజలను డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. ఫ్లై ఓవర్ వివరాలు ఇవీ.. వ్యయం: రూ.97.94 కోట్లు పొడవు: 1230 మీ. వయడక్డ్ పొడవు: 780 మీ. ఆబ్లిగేటరీ స్పాన్ పొడవు: 90 మీ. అప్రోచెస్ పొడవు: 360 మీ. వెడల్పు: 20 మీ. క్యారేజ్‌వే: ఆరు లేన్లు (రెండువైపులా ప్రయాణం) కాంట్రాక్ట్ ఏజెన్సీ: ఎం.వెంకట్రావు ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ -
కూకట్‌పల్లిలో భోగి సంబరాలు
-
కట్నం వేధింపులకు నవవధువు బలి
మలేసియాటౌన్‌షిప్: కట్నం వేధింపులు తాళలేక నవవధువు ఆత్మహత్య చేసుకుంది. కేపీహెచ్‌బీ ఎస్ఐ జానయ్య, మృతురాలి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం... గుంటూరు జిల్లా కొత్తపాలానికి చెందిన శ్రీనివాసరావు, శకుంతల దంపతుల కుమార్తె సుకన్య (28)కు అదే జిల్లాకు చెందిన మహేష్ (32)తో 14 నెలల క్రితం పెళ్లైంది. గుంటూరులోని ఓ ఫైనాన్స్ కంపెనీలో మహేష్ ఉద్యోగం చేస్తున్నాడు. సుకన్య తల్లిదండ్రులు పెళ్లి సమయంలో రూ.5 లక్షలు కట్నం ఇచ్చారు. భర్త అదనపు కట్నం కోసం వేధిస్తుండటంతో మూడు నెలల క్రితం సుకన్య ప్రస్తుతం నిజాంపేట రోడ్డులో నివాసం ఉంటున్న తన తల్లిదండ్రుల వద్దకు వచ్చి ఉంటోంది. కాగా, మంగళవారం మధ్యాహ్నం తన బెడ్రూంలోకి వెళ్లిన సుకన్య చున్నీతో ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. అదనపు కట్నం కోసం భర్త వేధిస్తుండటంతోనే సుకన్య ఆత్మహత్య చేసుకుందని ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
హైదరావాద్లో ఘనంగా హోలీ డే
-
హైకోర్టు తీర్పుతో జేఎన్టీయూహెచ్ డైలమా
గుర్తింపు కోసం యాజమాన్యాల పడిగాపులు తీర్పు ప్రతి అందాకే తదుపరి నిర్ణయమన్న రిజిస్ట్రార్ సాక్షి, సిటీబ్యూరో/మలేషియన్ టౌన్షిప్: ప్రైవేటు కళాశాలలకు అఫిలియేషన్ విషయమై హైకోర్టు వెలువరించిన తీర్పుతో జేఎన్టీయూహెచ్ అధికారులు డైలామాలో పడ్డారు. అర్హతలున్న కళాశాలలను కౌన్సెలింగ్‌కు అనుమతించాలని గురువారం హైదరాబాద్ హైకోర్టు తీర్పు ఇచ్చింది. లోపాలు ఉన్నాయనే నెపంతోనే 174 ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాలలకు అఫిలియేషన్ నిలిపివేసిన జేఎన్టీయూహెచ్కు, వీటిలో అర్హతలున్న కళాశాలలను ఎంపిక చేయడం కత్తిమీద సామే. కొన్ని కళాశాలలకు అవకాశం కల్పిస్తే.. విగినవాటితో వివాదం తప్పేలా లేదు. అలాగని.. హైకోర్టు ఆదేశాలను అమలు పరచకుంటే పరిస్థితి మరింత క్లిష్టమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఎటూ తేల్చుకోలేని వైనం.. జేఎన్టీయూహెచ్ నిర్ధేశించిన ప్రమాణాలకు అనుగుణంగా ఆయా ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాలల్లో సిబ్బంది, లాబొరేటరీలు తదితర వసతులు లేవంటూ వర్సిటీ అకడమిక్ ఆడిట్ సెల్ నుంచి యాజమాన్యాలకు గత వారం నోటీసులు అందాయి. వీటిపై ఈనెల 25లోగా వివరణ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో డీ అఫిలియేషన్ వేటుకు గురైన 174 కళాశాలల యాజమన్యాలు.. లోపాలను సవరించుకున్నామని, తక్షణం తమకు వెబ్ కౌన్సెలింగ్‌కు అనుమతించాలని రిపోర్టు సమర్పించాయి. హైకోర్టు తీర్పు కూడా తమకు సానుకూలంగా రావడంతో.. వర్సిటీ అధికారుల అనుమతి కోసం మంగళవారం ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాలల ప్రతినిధులు జేఎన్టీయూహెచ్కు వచ్చారు. సాయంత్రం వరకు వీసీ, రిజిస్ట్రార్ తమ కార్యాలయాలకు రాకపోవడంతో నేరుగా రిజిస్ట్రార్ ఇంటికే వెళ్లి కలిశారు. అయితే, హైకోర్టు తీర్పు కాపీ అడ్వకేట్ జనరల్ నుంచి తమకు ఇంకా అందలేదని, కాపీ అందాకే తమ నిర్ణయం ప్రకటిస్తామని యాజమాన్యాలతో రిజిస్ట్రార్ చెప్పినట్లు తెలిసింది. ఈ విషయమై వీసీ, రిజిస్ట్రార్‌ను వివరణ కోరేందుకు ‘సాక్షి’ ఫోన్ ద్వారా ప్రయత్నించగా వారు స్పందించలేదు. అయితే, వెబ్ కౌన్సెలింగ్‌కు కొన్ని కళాశాలలకు అనుమతి ఇచ్చి, మరికొన్నింటికి ఇవ్వకుంటే ఇబ్బందులు తప్పవని అధికారులు భావిస్తున్నారు.