Maldivian
-
ముయిజ్జూ ప్రభుత్వంపై అభిశంసన కోసం విపక్షాల పట్టు
-
హరివిల్లు.. చేప బ్యూటీఫుల్లు
చేపల్లో ఇప్పటికే మనకు చాలా రకాలు తెలుసు. వండుకొని తినే కొర్రమీను, పులస, జెల్ల, పాపెరల లాంటి చేపలతో పాటు అక్వేరియంలో పెంచుకునే రకరకాల రంగుల చేపలను చూసే ఉంటాం. శాస్త్రవేత్తలు కూడా ఇప్పటికే ఎన్నో రకాల చేపలను కనుగొన్నారు. తాజాగా ఇంకో రకం చేపను కూడా గుర్తించారు. అచ్చం హరివిల్లు రంగులో ఉండే ఈ కొత్తరకం చేపను మాల్దీవుల్లోని సముద్రంలో కనుగొన్నారు. వ్రాస్సె జాతికి చెందిన ఈ సముద్ర చేపకు సిర్రిలాబ్రస్ ఫినిఫెన్మా అని మాల్దీవుల జాతీయ పువ్వు పేరును కలిపి పెట్టారు. ముఖానికి గులాబీ రంగు ముసుగు వేసుకుందా అన్నట్టుండే ఈ చేపను సముద్రంలో 40 నుంచి 70 మీటర్ల లోతులో ట్విలైట్ జోన్లో గుర్తించారు. ఇంతకుముందు 30 ఏళ్ల కిందటే ఈ చేపను చూశామని, అయితే అప్పుడు ఇంకోరకం చేప అనుకున్నామని సైంటిస్టులు తెలిపారు. తాజా పరిశీలనలో అసలు విషయం తెలిసిందన్నారు. పెరుగుతూ.. రంగు మారుతూ.. చాలా రకాల చేపలు యుక్త వయసులో ఉన్నప్పుడు ఒకేలా అనిపిస్తాయి. పెద్ద వయసుకు వచ్చాక వాటి పూర్తి రూపును సంతరించుకుంటాయి. అలాగే వ్రాస్సె జాతికి చెందిన చేపలు కూడా వయసు పెరుగుతున్నాకొద్దీ రంగు మారుతుంటాయి. ఆ ప్రకారమే పెద్ద వయసుకు వచ్చాక ఈ రెయిన్బో చేపలు.. మెజెంటా, నారింజ, గులాబీ, ముదురు ఉదా, ఎరుపు రంగులతో అద్భుతంగా కనిపిస్తుంటాయి. ట్విలైట్ జోన్ అంటే? సముద్రంలో సూర్యకాంతి కొద్దికొద్దిగా చొచ్చుకెళ్లే ప్రాంతం ట్విలైట్ జోన్. సముద్ర ఉపరితలానికి 35 నుంచి 70 మీటర్ల మధ్య ఉంటుంది. ఈ ప్రాంతంలో కిరణజన్యసంయోగ క్రియ జరిగేంత స్థాయిలో సూర్యరశ్మి ఉండదు. కాబట్టి ఇక్కడ మొక్కలు పెరగవు. ఈ జోన్లో ఉండే జంతువులు అధిక పీడనం, చల్లని ఉష్ణోగ్రతలు, చీకటి వాతావరణానికి అలవాటు పడి జీవిస్తుంటాయి. ఈ నీటిలో ఉండే జంతువులు స్పష్టంగా చూసేందుకు కళ్లు పెద్దగా ఉంటాయి. అలాగే పెద్ద దంతాలు, దవడలు కూడా ఉంటాయి. – సాక్షి సెంట్రల్డెస్క్ -
మాజీ ప్రధాని భార్యపై భారీ ఆరోపణలు!
పేరుకు ఆమె నడిపింది ఓ మానవ హక్కుల సంస్థ. కానీ ఓ నియంతకు కొమ్ముకాసి.. భారీగా సొంత ఖజానా నింపుకొంది. మానవ హక్కులను నిలువునా పాతరేసి.. తన సొంత ప్రయోజనాలను దండిగా కాపాడుకుంది. తన భర్త ప్రధానమంత్రి వంటి అత్యున్నత పదవి నిర్వర్తించినప్పటికీ, ఆమె అవినీతికి పాల్పడేందుకు ఏమాత్రం వెనుకాడలేదు. ఈ మేరకు బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్ భార్య చెరీ బ్లెయిర్ నిలువునా అవినీతి ఆరోపణల్లో మునిగిపోయి.. ఉక్కిరిబిక్కిరి అవుతోంది. మాల్దీవులకు చెందిన అవినీతి నియంత అబ్దుల్లా యమీన్తో చెరీ బ్లెయిర్ సాగించిన రహస్య ఆర్థిక వ్యవహారాల గూడుపుఠాణీ బట్టబయలైంది. అబ్దుల్లా యమీన్కు అండగా నిలిచినందుకు రోజుకు రెండు వేల పౌండ్ల చొప్పున మొత్తం రెండు లక్షలకుపైగా పౌండ్ల సొమ్ము ఆమె కంపెనీకి ముట్టినట్టు ఆరోపణలు వస్తున్నాయి. చెరీ కంపెనీ ఒమ్నియా స్ట్రాటెజీకి అక్రమంగా పెద్ద మొత్తం తరలిన ఈ నిధులపై దర్యాప్తు జరిపేందుకు సీరియస్ ఫ్రాడ్ ఆఫీస్, అమెరికా ప్రభుత్వం సిద్ధమవుతున్నాయి. మల్దీవులకు నియంత పాలకుడిగా ఉన్నప్పుడు యమీన్ భారీగా ఆరోపణలు ఎదుర్కొన్నాడు. తన ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు నిర్వహించిన 1700మంది ప్రతిపక్ష కార్యకర్తలను జైళ్లలో బంధించాడు. న్యాయాన్ని అవహేళన చేస్తూ ముగ్గురు ప్రతిపక్ష నేతలను శిక్షించాడు. ఈ నియంత పాలకుడితో చెరీ బ్లేయిర్ సాగించిన అక్రమ ఆర్థిక వ్యవహారాలు తాజాగా డైలీమెయిల్ పత్రిక వెలుగులోకి తెచ్చింది. - నియంతృత్వ పాలకుడైన అబ్దుల్లా యమీన్ తో ఆరు నెలలపాటు పనిచేసేందుకు 4.20 లక్షల పౌండ్లతో చెరీ బ్లెయిర్ ఓ ఒప్పందం చేసుకుంది. - అంతర్జాతీయంగా మానవ హక్కుల పరిరక్షణ కోసం కృషి చేస్తున్నానని చెప్పుకొనే చెరీ.. నియంత పాలనలో ఉన్న మాల్దీవుల్లో పారదర్శకత, జవాబుదారీతనం పెంపొందించడం, ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించడంతో పనిచేస్తున్నట్టు అప్పట్లో ప్రకటించారు. - కానీ నియంత యమీన్కు అనుకూలంగా వ్యవహరించినందుకు ఆమె కంపెనీకి అక్రమమార్గంలో ఏకంగా 2.10 లక్షల పౌండ్లు ముట్టాయి. వీటిని ఆయుధ సరఫరా వ్యాపారి, ఉగ్రవాది, ఇంటర్ పోల్ మోస్ట్ వాంటెడ్ నేరగాడు మహమెద్ ఆలం లతీఫ్ ఆమె కంపెనీ ఖాతాలో జమచేయడం గమనార్హం. మల్దీవులు అధ్యక్షుడిగా ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికైన మహమ్మద్ నౌషధ్ను సైనిక చర్య ద్వారా అబ్దుల్లా యమీన్ గద్దె దించిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంలో కోర్టు విచారణలో న్యాయసహాయం కోసం చెరీ బ్లెయిర్ లీగల్ కంపెనీ 'ఒమ్నియా స్ట్రాటెజీ'ని అబ్దుల్లా యమీన్ గత ఏడాది వేసవిలో నియమించుకున్నారు. అయితే ఈ సంస్థ మానవ హక్కులకు సంబంధించి న్యాయసహాయం కోసం కాకుండా అంతర్జాతీయ మీడియా ముందు నియంత ప్రభుత్వాన్ని సమర్థించడానికి, అంతర్జాతీయ దౌత్య సంబంధాలు మెరుగుపరచడానికి లోపాయికారి సహకారం అందించిందనే ఆరోపణలు వినవస్తున్నాయి.