Mallika Srinivasan
-
రూ.68 వేల కోట్ల కంపెనీకి గుడ్ బై: మల్లికా శ్రీనివాసన్ సక్సెస్ స్టోరీ
అనుకున్నది సాధించాలంటే కృషి, పట్టుదల మాత్రమేకాదు, ఎంత పెద్ద రిస్కే అయినా చేసే సాహసం ఉండాలి. ? సక్సెస్ సాధిస్తామా లేదా అనే భయాలు ఒక ప్రయాణ ప్రారంభంలో చాలా ఉంటాయి. కానీ తప్పదు. విజయతీరాలను అందుకోవాలి అంటే సాహసం చేయాలి. అలా దృఢ సంకల్పంతో "ట్రాక్టర్ క్వీన్ ఆఫ్ ఇండియా" గా పేరు సంపాదించుకున్న సాహసి గాథ మీకోసం.. ట్రాక్టర్స్ అండ్ ఫార్మ్ ఎక్విప్మెంట్ లిమిటెడ్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ మల్లికా శ్రీనివాసన్.కేవలం పురుషులకు మాత్రమే పరిమితం అనుకున్న రంగంలోకి దూకి చాలా పెద్ద సాహసమే చేశారు. ఆమె పట్టుదల ఆత్మ విశ్వాసం అలాంటిది మరి. రూ. 10,000 కోట్ల కంటే ఎక్కువ ఆదాయంతో ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ట్రాక్టర్ తయారీదారుగా ఎదిగారు. మహిళలు కూడా సమర్ధులని ఏ రంగంలోలోనై సత్తాచాటగలరని ప్రపంచానికి చాటిచెప్పిన మహిళా పారిశ్రామికవేత్త, షీరో మల్లికా శ్రీనివాసన్. 1959లో జన్మించిన మల్లికా శ్రీనివాసన్ మద్రాస్ యూనివర్సిటీ డిగ్రీని, అమెరికాలోని పెన్సిల్వేనియా యూనివర్సిటీకి చెందిన వార్టన్ స్కూల్లో ఎంబీఏ పట్టా పొందారు. ఆ తరువాత అమెరికా నుంచి తిరిగొచ్చి 1986లో కుటుంబ వ్యాపారంలో చేరారు. ఈ కంపెనీని చెన్నైని 'డెట్రాయిట్ ఆఫ్ ఇండియా'గా మార్చడంలో కీలక పాత్ర పోషించిన , దివంగత, ప్రసిద్ధ పారిశ్రామికవేత్త S అనంతరామకృష్ణన్ 1960లో చెన్నైలోప్రారంభించారు. వ్యాపారంలో అడుగు పెట్టింది మొదలు తన కృషి సాహసోపేతమైన నిర్ణయాలతో కంపెనీని బహుళ-మిలియన్ డాలర్ల వ్యాపారంగా మార్చింది. రైతులు ఆకాంక్షల్ని, ట్రెండ్లను గుర్తించి దానికనుగుణంగా సంబంధిత ఉత్పత్తు లుండేలా చూసుకున్నారు. మధ్యతరగతి, వ్యవసాయ ప్రజల కోసం తన చౌకైన ట్రాక్టర్లను అందించడం మొదలు పెట్టారు. అలాగే గ్రామీణ ప్రాంతాలకు వెళ్లినపుడు, అక్కడ టీ షాపుల వద్ద ఆగి, వ్యవసాయ పద్ధతులు, సమస్యలు, తెలుసుకోవడం, ఎలాంటి పరిష్కారాలు కావానుకుంటున్నారో అడిగి తెలుసుకునేవారట. అయితే మార్కెట్ హెచ్చు తగ్గులు ఉన్నప్పటికీ మల్లిక పట్టుదలతో ముందుకు సాగారు. సహేతుకమైన ధరలతో వృద్ధిని కొనసాగించారు. చివరికి మహీంద్రా & మహీంద్రా తర్వాత భారతదేశంలో రెండవ అతిపెద్ద ట్రాక్టర్ తయారీదారుగా కంపెనీని నిలబెట్టారు. 1961లో కేవలం ఒక ట్రాక్టర్ మోడల్‌తోన కంపెనీ వార్షిక టర్నోవర్ రూ. 10,000 కోట్లు. ఆమె టర్కీలో ఒక కర్మాగారాన్ని కూడా స్థాపించారు. వ్యాపారం రంగంలో ఆమెచేసిన సేవలకు గుర్తింపుగా 2014లో ప్రతిష్టాత్మక పద్మశ్రీ పురస్కారాన్ని కూడా అందుకున్నారు. మల్లికా భర్త ఇండియన్ బిలియనీర్ వేణు శ్రీనివాసన్ టీవీఎస్‌మెటార్ సీఎండీగా ఉన్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు. మల్లికా శ్రీనివాసన్ AGCO, టాటా స్టీల్ అండ్ టాటా గ్లోబల్ బెవరేజెస్, అలాగే చెన్నైలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT) , ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ISB), ఎగ్జిక్యూటివ్ బోర్డు బోర్డులలో కూడా ఉన్నారు. మల్లికా స్విగ్గీ బోర్డులో స్వతంత్ర డైరెక్టర్ పదవి నుండి తప్పుకున్నారు. స్విగ్గీ నెట్‌వర్త్ రూ.68918 కోట్లు. ఫోర్బ్స్ ప్రకారం రూ. 23,625.96 కోట్ల నికర విలువతో 83వ సంపన్న భారతీయురాలిగా నిలిచింది.ఫోర్బ్స్ ఇండియా ఉమెన్ లీడర్ ఆఫ్ ది ఇయర్ అవార్డుతోపాటు, ఫోర్బ్స్ ఆసియా టాప్ 50 ఆసియన్ పవర్ బిజినెస్ వుమెన్‌లలో ఒకరిగా నిలిచారు. జీవితంలో ఎదురయ్యే ఇబ్బందులకుఎప్పటికీ తలొగ్గకూడదని ఆమె చెబుతారు.ఎల్లప్పుడూ అవకాశాల కోసం వెతుకుతూనే ఉండాలంటారు. అంతేకాదు చేసే పనిని ప్రేమించడమే తన సక్సెస్ మంత్రా అంటారు మల్లికా శ్రీనివాసన్. డౌన్ టు ఎర్త్‌గా ఉండే ఆమె వ్యక్తిత్వం, వ్యాపార రంగంలో రాణించాలనుకునే ఎందరో అమ్మాయిలకు నిజమైన ప్రేరణ. -
వెయ్యికోట్ల సామ్రాజ్యానికి తిరుగులేని అధినేత్రి - సక్సెస్ స్టోరీ
Mallika Srinivasan Success Story: ప్రపంచం అభివృద్ధి పైపు పరుగులు పెడుతున్న సమయంలో ఆడవాళ్లు అన్ని రంగాల్లోనూ మేము సైతం అంటున్నారు. పని ఏదైనా మనసు పెట్టి చేస్తే తప్పక విజయం సాధిస్తావన్నది లోకోక్తి. అలాంటి కోవకు చెందిన 'ట్రాక్టర్ క్వీన్' గా పిలువబడే 'మల్లిక శ్రీనివాసన్' (Mallika Srinivasa) గురించి ఈ కథనంలో తెలుసుకుందాం. భారతదేశంలో వ్యాపార రంగంలో దూసుకెళ్తున్న కొంత మంది మహిళల్లో మల్లిక శ్రీనివాసన్ ఒకరు. 1959 నవంబర్ 19న జన్మించిన మల్లికకు చిన్నప్పటి నుంచి బిజినెస్ స్టడీస్‌పై ఉన్న ఆసక్తి కారణంగా మద్రాస్ యూనివర్సిటీలో ఎమ్ఏ పూర్తి చేసి, ఆ తరువాత ఉన్నత చదువులు కోసం విదేశాలకు పయనమైంది. వార్టన్ స్కూల్ ఆఫ్ పెన్సిల్వేనియా యూనివర్సిటీలో ఎంబీఏ చేసి ఇండియాకు తిరిగి వచ్చింది. చదువు పూర్తయిన తరువాత 1986లో, చెన్నైని 'డెట్రాయిట్ ఆఫ్ ఇండియా'గా మార్చడంలో కీలక పాత్ర పోషించిన దివంగత ప్రముఖ పారిశ్రామికవేత్త ఎస్ అనంతరామకృష్ణన్ స్థాపించిన కుటుంబ వ్యాపారంలో మల్లిక జనరల్ మేనేజర్‌గా చేరింది. రోజు రోజుకి TAFE కంపెనీని అభివృద్ధి మార్గంలో తీసుకెళ్లడానికి మల్లిక చాలా కృషి చేసింది. అతి తక్కువ కాలంలోనే కంపెనీ మంచి లాభాలను ఆర్జించగలిగింది. TAFE (ట్రాక్టర్స్ అండ్ ఫార్మ్ ఎక్విప్మెంట్ లిమిటెడ్) కంపెనీ ఆదాయం & అమ్మకాల పరిమాణంలో మహీంద్రా ట్రాక్టర్ల తర్వాత భారతదేశపు రెండవ అతిపెద్ద ట్రాక్టర్ కంపెనీ. మల్లిక నాయకత్వంలో, టాఫె సంస్థ 2022లో ఫ్రెంచ్ సంస్థ ఫౌరేసియా (Faurecia) ఇండియా వ్యాపారాన్ని రూ. 400 కోట్ల డీల్‌తో, 2018లో IMT వంటి కంపెనీలను కొనుగోలు చేసింది. (ఇదీ చదవండి: కేవలం 18 నెలలు.. రూ. 100 కోట్ల టర్నోవర్ - ఒక యువతి సక్సెస్ స్టోరీ!) మల్లికా శ్రీనివాసన్ గవర్నింగ్ బోర్డ్ ఆఫ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT) చెన్నై, ఎగ్జిక్యూటివ్ బోర్డ్ ఆఫ్ ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ISB) హైదరాబాద్, AGCO, టాటా స్టీల్ అండ్ టాటా గ్లోబల్ బెవరేజెస్ వంటి పెద్ద సంస్థలలో ఉన్నారు. ఆమె ఇటీవల బిలియన్ డాలర్ల స్టార్టప్ స్విగ్గీ బోర్డులో కూడా అడుగుపెట్టడం గమనార్హం. (ఇదీ చదవండి: సత్య నాదెళ్ల కంటే ఎక్కువ ఆస్తులున్న మహిళ గురించి తెలుసా?) మల్లిక శ్రీనివాసన్ ఒక వైపు కంపెనీ విషయాలను చూసుకుంటూనే.. తిరునెల్వేలిలోని అనేక ఆరోగ్య సంరక్షణ, విద్యా సౌకర్యాలకు కూడా మద్దతు ఇస్తున్నారు. అంతే కాకుండా ఆమె ఇందిరా శివశైలం ఎండోమెంట్ ఫండ్ ద్వారా చెన్నై శంకర నేత్రాలయలోని క్యాన్సర్ ఆసుపత్రికి మద్దతు ఇస్తుంది. కర్ణాటక సంగీతం సంగీత సంప్రదాయాన్ని కూడా ప్రోత్సహించడంలో తన వంతు కృషి చేస్తోంది. ట్రాక్టర్ ఇండస్ట్రీ పురుషుల ఆధిపత్యంలోనే ఉంటుందని భావిస్తారు. అలాంటి భావనకు చరమగీతం పాడి ప్రపంచంలో మూడవ అతిపెద్ద ట్రాక్టర్ కంపెనీగా, భారతదేశంలో రెండవ అతిపెద్ద ట్రాక్టర్ కంపెనీగా తీర్చిదిద్ది 'ట్రాక్టర్ క్వీన్' పేరు పొందింది. మల్లిక శ్రీనివాసన్ మొత్తం ఆస్తుల విలువ రూ. 200 కోట్లకంటే ఎక్కువ అని తెలుస్తోంది. ఈమె భర్త టీవీఎస్ మోటార్స్ సీఎండీ వేణు శ్రీనివాసన్. పారిశ్రామిక రంగంలో ఈమె చేసిన కృషికి గాను భారత ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు ప్రధానం చేసింది. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు తెలుసుకోవడానికి సాక్షి బిజినెస్ చూస్తూ ఉండండి. -
Mallika Srinivasan: ట్రాక్టర్ మహారాణి
విజయానికి వయసు అడ్డు పడుతుందా? వయసు అనేది ఒక నెంబర్ మాత్రమే అని చెబుతూ తమను తాము నెంబర్ వన్‌గా నిరూపించుకున్న మహిళలు ఉన్నారు. ‘మహిళలకు పరిమితులు ఉన్నాయి’ అంటూ ఎక్కడైనా అడ్డుగోడలు ఎదురొచ్చాయా? ఆ అడ్డుగోడలను బ్రేక్ చేసి, కొత్త మార్గం వేసి దూసుకుపోయి తమను తాము నిరూపించుకున్న మహిళలు ఉన్నారు. తమ శక్తియుక్తులతో భవిష్యత్‌ను ప్రభావితం చేసే ఎంతోమంది మహిళలు ఉన్నారు. ఫోర్బ్స్ ‘50 వోవర్ 50: ఆసియా 2022’లో మెరిసిన మహిళా మణులలో మన మల్లికా శ్రీనివాసన్ ఉన్నారు. మల్లికా శ్రీనివాసన్... అనే పేరుతో పాటు కొన్ని విశేషణాలు కూడా సమాంతరంగా ధ్వనిస్తాయి. అందులో ముఖ్యమైనవి... ‘ట్రాక్టర్ క్వీన్’ ‘మోస్ట్ పవర్ఫుల్ సీయివో’ ట్రాక్టర్ ఇండస్ట్రీని మేల్ డామినేటెడ్ ఇండస్ట్రీగా చెబుతారు. అలాంటి ఇండస్ట్రీలో విజయధ్వజాన్ని ఎగరేఓఆరు. కంపెనీని ప్రపంచంలో మూడో స్థానంలో, దేశంలో రెండో స్థానంలో నిలిపారు. ‘ఏ గూటి చిలక ఆ గూటి పలుకే పలుకుతుంది’ అంటారుగానీ అది అన్ని సమయాల్లో నిజం కాకపోవచ్చు. పెద్ద వ్యాపార కుటుంబానికి చెందిన మల్లికకు చిన్న వయసు నుంచే వ్యాపార విషయాలపై ఆసక్తి. తనకు సంగీతం అంటే కూడా చాలా ఇష్టం. ‘ఇది ఏ రాగం?’ అని కమనీయమైన రాగాల గురించి తెలుసుకోవడంలో ఎంత ఆసక్తో, జటిలమైన వ్యాపార సూత్రాల గురించి తెలుసుకోవడంపై కూడా అంతే ఆసక్తి ఉండేది. ‘యూనివర్శిటీ ఆఫ్ మద్రాస్’ నుంచి ‘ఎకనామెట్రిక్స్’లో గోల్డ్‌మెడల్ అందుకున్న మల్లిక ప్రతి విజయం వెనుక కొన్ని ‘గోల్డెన్ రూల్స్’ ఉంటాయని బలంగా నమ్ముతారు. ఆ సూత్రాలు పుస్తకాల్లో తక్కువగా కనిపించవచ్చు. సమాజం నుంచే ఎక్కువగా తీసుకోవాల్సి రావచ్చు. చదువుల్లో ఎప్పుడూ ముందుండే మల్లిక పుస్తకాల్లో నుంచి ఎంత నేర్చుకున్నారో, సమాజం నుంచి అంతకంటే ఎక్కువ నేర్చుకున్నారు. వాటిని ఆచరణలో పెట్టారు. ట్రాక్టర్స్ అండ్ ఫామ్ ఎక్విప్మెంట్ లిమిటెడ్ (టఫే–(చెన్నై) లో జనరల్ మేనేజర్‌గా మొదలయ్యారు మల్లిక. ఆ తరువాత చైర్పర్సన్ అయ్యారు. జనరల్ మేనేజర్ నుంచి చైర్పర్సన్ వరకు ఆమె ప్రస్థానంలో ప్రతికూల పరిస్థితులు ఎదురై ఉండవచ్చు. అయితే జటిలమైన సమస్యలకు సృజనాత్మక పరిష్కారాలు కనుక్కోవడంలో ఆమె ఎప్పుడూ చురుగ్గా ఉంటారు. ‘మీ లక్ష్యం ఏమిటి?’ అని అడిగితే ఆమె చెప్పే సమాధానం... ‘నాకో మంచి ట్రాక్టర్ కావాలి...అనుకునే ప్రతి రైతు మొదట మా ట్రాక్టర్ వైపే చూడాలి’ కేవలం వ్యాపార విషయాల గురించి మాత్రమే కాకుండా సమాజసేవపై కూడా దృష్టి పెడుతుంటారు మల్లిక. పేదలకు వైద్యం అందించే వైద్యసంస్థలు, విద్యాసంస్థలకు ఆర్థికసహాయాన్ని అందిస్తున్నారు. సమాజానికి తిరిగి ఇవ్వాల్సిన బాధ్యతను నెరవేరుస్తున్నారు. -
ఈ మల్లిక పదవిలోనూ పరిమళించింది!
స్ఫూర్తి ఆమె ప్రపంచంలోనే ప్రతిష్ఠాత్మకమైన పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయంలో ఎంబిఏ చేశారు. భారతదేశంలో అత్యుత్తమ ఎంట్రప్రెన్యూర్‌గా గుర్తింపు పొందారు... ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో గవర్నింగ్ మెంబర్‌గా ఉన్నారు. మద్రాస్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీకి ప్రెసిడెంట్‌గా ఎన్నికైన మొట్టమొదటి మహిళగా రికార్డు సాధించారు... 2006 ఎకనమిక్ టైమ్స్ బిజినెస్ ఆఫ్ ద ఇయర్ అవార్డు అందుకున్నారు. ఫోర్బ్స్ అమేజింగ్ టాప్ 50లో పవర్ఫుల్ బిజినెస్ ఉమన్‌గా ఎంపికయ్యారు. ఎప్పుడూ ఆకాశాన్ని అందుకోవడానికే ప్రయత్నిస్తారు... కాని నేల మీదే నడుస్తారు... కొందరు ఆమెకు తలపొగరని అంటారు... కాని పెద్ద పెద్ద కంపెనీలు తల ఎత్తుకునేలా చేస్తారామె. ఆమె 2500 కోట్ల టర్నోవర్ ఉన్న టాఫే కంపెనీ డెరైక్టర్ మల్లికా శ్రీనివాసన్. బడా పారిశ్రామికవేత్త శివశైలమ్ ఇంట్లో 1959 నవంబర్ 19న పుట్టిన మల్లిక, మద్రాసు యూనివర్శిటీలో ఎంఏ ఎకనామిక్స్ పట్టా పుచ్చుకున్నాక, పెన్సిల్వేనియాలో ఎం.బి.ఏ చేసి, టీవీఎస్ కంపెనీ సీఎండీ వేణు శ్రీనివాసన్ని వివాహం చేసుకున్నారు. ఇద్దరు పిల్లలకు తల్లయ్యారు. 1986లో కొన్ని ప్రత్యేక పరిస్థితులలో ఆమె తన తండ్రిదైన ట్రాక్టర్ అండ్ ఫార్మ్ ఎక్విప్మెంట్ కంపెనీ (టాఫే)లో ఉద్యోగిగా చేరారు. సొంత కంపెనీలోనే పని చేస్తున్నప్పటికీ మల్లిక మొదట్లో కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవలసి వచ్చింది. ఆమెది ఆ కంపెనీలో ఏ పదవో తెలియలేదు. అయితే ఆమె ఏం చేయాలో మాత్రం చెప్పారు. ఎంతటి ప్రతికూల పరిస్థితులనైనా అనుకూలంగా మార్చుకోగలిగే చాకచక్యం... తండ్రి పర్యవేక్షణ, సాటి ఉద్యోగుల చేయూతతో ఆమె తాను ఎదుగుతూ, ట్రాక్టర్ పరిశ్రమకు సిఈవో అయ్యే స్థాయికి చేరారు. ఈ ప్రయాణంలో ఎన్నో ఎత్తుపల్లాలు ఎదురైనప్పటికీ దృఢదీక్షతో ముందుకు దూసుకువెళ్లారు. ట్రాక్టర్ మ్యాన్యుఫాక్చరింగ్‌లో ఎన్నో విప్లవాత్మక మార్పులు తెచ్చారు. ట్రాక్టర్‌ను రైతులకు మరింత ఉపయోగపడేలా చేశారు. స్వభావం... గొప్పశక్తి అనేది గొప్ప బాధ్యత నుంచి వస్తుంది అని నమ్మే మల్లిక తన ఆశయాలు, ఆలోచనల విషయంలో ఆశావాది. ట్రాక్టర్ అండ్ ఫార్మ్ ఎక్విప్మెంట్ (టాఫే) చెన్నైలో ఉంది. చైర్మన్, సిఈవో ఆఫీస్ కూడా అక్కడే ఉంది. అయితే ఆమె అందరితో కలిసి పని చేస్తారు. తాను కంపెనీలో చేరిన తొలి రోజులను గుర్తు తెచ్చుకుంటూ... టాఫే బిల్డింగ్ కారిడార్‌లో కొంత భాగాన్ని వేరు చేసి అందులో ఆఫీసు పెట్టారు. ఉన్న స్థలంలోనే మంచి టీమ్ ఎంతో పొందికగా కంఫర్ట్‌గా ఉంది. పనిచేస్తున్నవారిలో చాలామంది మా నాన్నగారి టైమ్‌లో అంటే 1964లో కంపెనీ ప్రారంభించిన నాటి నుంచి ఉన్నారు. కొందరు నన్ను ఆహ్వానించారు. కొందరు మాత్రం ‘ఈవిడ ఎంతకాలం ఉంటుందిలే’ అనుకునేవారు’’ అని చెప్పారామె. 2005లో ఏషర్ మోటార్స్‌ను దాటి టాఫే రెండోస్థానానికి రావడం చూసి ‘‘ఆమె తీసుకున్న తెలివైన నిర్ణయానికి చాలామంది ఆశ్చర్యపోయారు’’ అంటారు టాఫే కార్పొరేట్ కమ్యూనికేషన్ వ్యవహారాలు చూసే విజయకుమార్ బ్రౌనింగ్. మార్కెటింగ్ అండ్ ప్రొడక్ట్ స్ట్రాటెజీ, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ టి.ఆర్ కేశవన్... మల్లిక చాలా నిబద్ధత కల్గిన వ్యక్తి. అందరినీ ముందుకు నడిపించే శక్తి ఆమెలో ఉంది అంటారు. 1986లో నాలుగు వేల ట్రాక్టర్లను ఉత్పత్తి చేసిన ఈ సంస్థ ప్రస్తుతం 1,20,000 ట్రాక్టర్లను ఉత్పత్తి చేసే స్థాయికి వెళ్లి, ప్రపంచంలో మూడవ స్థానంలో ఉంది. 2000 వ సంవత్సరంలో కంపెనీ చాలా నష్టాల్లో కూరుకుని పోయి ఉన్న సమయంలో మల్లిక రిసెర్చ్ అండ్ డెవలప్మెంట్లోను, కొత్త ఉత్పత్తుల కోసమూ కొన్ని కోట్ల రూపాయలు పెట్టుబడిగా పెట్టి, ఉత్పత్తుల ప్రమాణాలను పెంచారు. తాను చేరే నాటికి 86 కోట్ల టర్నోవర్ ఉన్న ఈ కంపెనీని 2011 నాటికి 5800 కోట్లకు తీసుకువెళ్లారు. మహీంద్రా ట్రాక్టర్ల తరువాత రెండోస్థానాన్ని సంపాదించి పెట్టారు టాఫేకి. ‘‘జీవితంలో ఇబ్బందులు ఎదురైనప్పుడు కుంగిపోకుండా అవకాశాల కోసం వెతుకుతూండాలి. అలాగే... చేస్తున్న పని పట్ల నిబద్ధతతో ఉంటూ, ఆనందంగా చేయాలి’’ అంటారు మల్లిక. ఉత్తమ సీఈఓగానే కాదు, ఉత్తమ ఉద్యోగిగా... ఆఖరుకు బాధ్యత గల పౌరుడిగా పేరు తెచ్చుకోవాలన్నా కూడా ఆమె చెప్పిన సూత్రాలను, క్రమశిక్షణను పాటించడం అవసరమేమోననిపిస్తుంది. ఎందుకంటే అది అక్షర సత్యం కాబట్టి! - డా. వైజయంతి ఏ ప్రధాన బాధ్యత స్వీకరించవలసి వచ్చినా, ముందుగా ఆ విషయం గురించి కూలంకషంగా తెలుసుకుని తనను తాను నిరూపించుకునేవారు మల్లిక. తన ఉద్యోగస్థులందరితోటీ చక్కగా మాట్లాడతారు. ఎక్కడ సమస్య ఉందో తెలుసుకుని, దానికి పరిష్కారం కనుక్కునేవారు. కంపెనీలో అత్యున్నత పదవిలో ఉన్నా కూడా చాలా సాధారణ ఉద్యోగిలాగే ఉంటారామె. ‘‘ఇలా ఉండటం వలన ఎవరు ఎక్కడ పనిచేయగలరో తెలుసుకోవడానికి ఉపయోగపడింది’’ అంటారు మల్లిక. పొద్ద్దున్న తొమ్మిది గంటలకు ఆఫీసుకి వెళ్లి చూస్తే, అప్పటికే ఆమె కంపెనీ ఫైల్స్ చూస్తూ, ఉద్యోగులకు సూచనలు ఇస్తూ కనిపిస్తారు. బహుశ అదే ఆమె విజయ రహస్యం కావచ్చు! -
పద్మ అవార్డుల సత్కారం