Mandate
-
తుది దశకు..
వేగంగా పునర్విభజన ప్రక్రియ ఇందూరు : జిల్లాల పునర్ వ్యవస్థీకరణ కసరత్తు దాదాపు తుది దశకు చేరుకుంది. దసరా నుంచే కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాల్లో వేర్వేరుగా పరిపాలన జరిగాలని రాష్ట్ర సర్కారు స్పష్టం చేయడంతో జిల్లా యంత్రాంగం బిజీగా మారింది. కొత్త జిల్లాల మ్యాపులు, కామారెడ్డి జిల్లా కలెక్టరేట్, ఎస్పీ, ఇతర జిల్లా ప్రభుత్వ కార్యాలయాలతోపాటు కొత్త మండలాల్లో ఏర్పాటు చేసే మండల కార్యాలయాల పరిశీలనతో మొదలైన ప్రక్రియ ఫైళ్ల విభజన, స్కానింగ్, ఉద్యోగుల వివరాలు ఆన్లైన్లో అప్లోడ్ చేయడం, వాహనాలు, ఫర్నిచర్ వరకు విభజన ప్రక్రియ ఈ పాటికే 90 శాతం పూర్తయింది. మిగిలిన పది శాతం పని ఆదివారం పూర్తిచేసి చేయాలని అధికారులకు ఆదేశాలు అందాయి. ఇక కలెక్టరేట్‌కు వచ్చిన అభ్యంతరాలపై ప్రభుత్వం పరిశీలన చేసి నిర్ణయం తీసుకోవడమే ఆలస్యం. రెండో శనివారం, ఆదివారం సెలవులు రద్దు చేసి పునర్విభజన పనులను కలెక్టర్ యోగితారాణా చక చకా చేయిస్తున్నారు. ఏ అధికారికి, ఉద్యోగికి సెలవులు మంజూరు చేయడం లేదు. వివరాలు పోర్టర్లో నమోదు చేయాలి.. కొత్తగా ఏర్పాటు కానున్న కామారెడ్డి జిల్లా కార్యాలయం, బాన్సువాడ రెవెన్యూ కార్యాలయం, తొమ్మిది మండల కార్యాలయాల ఫైళ్ల విభజన, స్కానింగ్, పరికరాలు, వాహనాల వివరాలు, ఉద్యోగుల సమాచారాన్ని పోర్టల్‌లో నమోదు చేయాలని స్పష్టం చేశారు. శనివారం ప్రగతి భవన్లో జిల్లా అధికారులతో జరిగిన జిల్లాల పునర్విభజన సమావేశంలో కలెక్టర్ యోగితారాణా స్పష్టం చేశారు. సదరు నమోదులపై సంబంధిత శాఖ అధికారి ధ్రువీకరణ పత్రాన్ని సమర్పించాలని, దీంతోపాటు శాఖల్లో పని చేసే అవుట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగుల వివరాలు కూడా నమోదు చేయాలని సూచించారు. ఆయా ప్రాంతాల అవసరాలను బట్టి మెరుగైన సేవలు అందించేందుకు ఉద్యోగులను ప్రతిపాదించాలన్నారు. ఉదాహరణకు ఆర్మూర్ ప్రాంతంలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లకు డిమాండ్ ఉన్నందున, ఆ యూనిట్లను ప్రోత్రహించేందుకు ఒక పరిశ్రమల విభాగాన్ని ప్రతిపాదించాలని చెప్పారు. అలాగే రాష్ట్ర్ట ప్రభుత్వం అన్ని పాఠశాలలను డిజిటల్ బోధనతో అనుసంధానం చేస్తున్నందున డివిజన్ స్థాయిలో డిజిటల్ బోధనను మానిటరింగ్ చేసేందుకు ప్రత్యేక అధికారులను నియమించనున్నట్లు తెలిపారు. ఐకేపీ, ఆరోగ్యం, ఐసీడీఎస్ కార్యక్రమాలను సమన్వయం చేసేందుకు డివిజన్ స్థాయిలో వ్యవస్థ పరమైన ఏర్పాట్లు చేయనున్నట్లు తెలిపారు. కొత్తగా ఏర్పాటు చేస్తున్న కార్యాలయాల్లో వినియోగిస్తున్న ఫర్నిచర్‌కు కూడా వారితో తరలించాలని స్పష్టం చేశారు. ఏ శాఖకు కూడా కొత్తగా ఫర్నిచర్‌ను ఏర్పాటు చేయడం జరిగిందని, ఉన్నదానితోనే పని చేయాలని సూచించారు. ఈ సమావేశంలో సంయుక్త కలెక్టర్ ఎ, రవీందర్‌రెడ్డి, డీఆర్వో పద్మాకర్, డీడీ గ్రౌండ్ వాటర్ జగన్మోహన్ ఉన్నారు. 1,150కు చేరిన అభ్యంతరాలు జిల్లాల పునర్ వ్యవస్థీకరణలో భాగంగా కొత్త మండలాల ఏర్పాటు, గ్రామాల మార్పులు–చేర్పులపై కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన సెల్‌కు అభ్యంతరాలు, వినతులు అందుతూనే ఉన్నాయి. శనివారం వరకు 1,150 నమోదయ్యాయి. వచ్చిన అభ్యంతరాలలో తమ గ్రామాలను కొత్త మండలాలుగా ఏర్పాటు చేయాలని, పాత మండలాల్లోనే కొనసాగించాలని, వద్దని, కామారెడ్డి జిల్లాలోనే మండలాన్ని, గ్రామాన్ని ఉంచాలని, వద్దని ఎక్కువ మొత్తంలో అభ్యంతరాలు, వినతులు అందాయి. ఈ నెల 21 వరకు అవకాశం ఉండడంతో అభ్యంతరాల సంఖ్య పెరగనుంది. ప్రస్తుతం కొత్త మండలాలకు డిమాండ్ పెరగడంతో ఏడు మండలాలను పరిశీలన చేసేందుకు జిల్లా యంత్రాంగం ప్రభుత్వానికి నివేదించినట్లు సమాచారం. అభ్యంతరాలు, వినతులు స్వీకరణ గడువు ముగిసిన తరువాత జిల్లా అధికారులు ప్రభుత్వానికి నివేదించనున్నారు. అనంతరం సర్కారు వాటిని పరిశీలించి కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాల పూర్తి స్వరూపంతో తుది జాబితాను ప్రకటించనుంది. -
దైచీకి రూ. 2,500 కోట్లు చెల్లించండి
ర్యాన్‌బాక్సీ డీల్‌లో సింగ్ సోదరులకు ఆర్బిట్రేషన్ ట్రిబ్యునల్ ఆదేశం సింగపూర్: దైచీ శాంక్యో రూ.2,500 కోట్ల పరిహారాన్ని చెల్లించాలని ర్యాన్‌బాక్సీ ల్యాబొరేటరీస్ ఒకప్పటి ప్రమోటర్లు సింగ్ సోదరులను ఇక్కడి ఆర్బిట్రేషన్ ట్రిబ్యునల్ ఆదేశించింది. ర్యాన్‌బాక్సీ షేర్లను జపాన్ సంస్థ దైచీ శాంక్యోకు విక్రయించే సమయంలో వీరు సంస్థకు సంబంధించి కీలక సమాచారాన్ని దాచిపెట్టారని, తప్పుడు సమాచారాన్ని అందించారనేది ఆరోపణ. ఈ ఆరోపణలు రుజువయినట్లు ట్రిబ్యునల్ పేర్కొంది. సింగ్ సోదరుల్లో ఒకరైన మల్విందర్ సింగ్ ప్రస్తుతం ఫోర్టీస్ హెల్త్‌కేర్ చైర్మన్‌గా ఉన్నారు. మల్విందర్ సింగ్ ఆయన సోదరుడు శివేందర్ సింగ్, కుటుంబ సభ్యులు ర్యాన్‌బాక్సీలోని తమ పూర్తి దాదాపు 35% వాటాలను 2008లో దైచీ శాంక్యోకు 2.4 బిలియన్ డాలర్లకు విక్రయించారు. 2013లో జపాన్ ఫార్మాసూటికల్ దిగ్గజం దైచీ.. సింగపూర్‌లో ఆర్బిట్రేషన్ కేసు దాఖలు చేసింది. ర్యాన్‌బాక్సీ ప్లాంట్లలో తయారీ ప్రక్రియ గురించి అమెరికా డ్రగ్ రెగ్యులేటర్ పలు ఆంక్షలు విధించిన అంశాన్ని ప్రమోటర్లు దాచిపెట్టారని దైచీ పేర్కొంది. ఈ వివాదం పరిష్కారానికి అమెరికా న్యాయ శాఖకు 500 మిలియన్ డాలర్లను ర్యాన్‌బాక్సీ చెల్లించాల్సి వచ్చిందని పిటిషన్లో పేర్కొంది. ఈ అంశాలను విచారించిన కోర్టు సింగ్ సోదరులతో పాటు తదనంతరం షేర్లు విక్రయించిన మరో రెండు సంస్థలకు వ్యతిరేకంగా తాజా జరిమానా విధించింది. -
'అమ్మ' పేరు చేర్చి గుర్తింపివ్వండి
-
వివేకం: బాధ్యత బరువు కాదు!
సామాన్యంగా బాధ్యత అనగానే బరువు అనుకుంటారు. బాధ్యత అంటే తమ విద్యుక్తధర్మం అని తప్పుగా భావించడం వలనే ఇలా బరువు అనిపిస్తున్నది. చిన్నప్పటినుండే అందరికీ విద్యుక్తధర్మం అనే భావాన్ని పెంపొందించారు. కొడుకుని చదివించడం తండ్రి ధర్మం, వృద్ధులైన తల్లిదండ్రులను కాపాడటం కొడుకు ధర్మం, విద్యార్థులను తీర్చిదిద్దడం ఉపాధ్యాయుని ధర్మం, దేశాన్ని కాపాడటం రక్షణ సిబ్బంది ధర్మం అంటూ ధర్మం అనే మాటను మీ మనసులో బలంగా నాటుకుపోయేలా చేశారు. ‘నా ధర్మం నిర్వహిస్తున్నాను’ అనుకుంటూ ఏది చేసినా అలసటగా ఉంటుంది, దానివల్ల రక్తపు పోటు పెరుగుతుంది. ఒక పాదరక్షల ఫ్యాక్టరీని చూడటానికి యజమాని వచ్చాడు. ఒక కార్మికుడు అట్టపెట్టె అందుకుని, దానిమీద లేబుల్ అతికిస్తున్నాడు. మరో కార్మికుడు దానిలో ఒక పాదరక్షనుంచాడు. అతని తర్వాతి కార్మికుడు ఆ పెట్టెను మూసి, ముందుకు జరిపాడు. తరువాత అతను దాన్ని బండిలోకెక్కించాడు. ‘‘ఏం జరుగుతున్నదిక్కడ? చెప్పులను జతలుగా తయారుచేస్తున్నాం కదా. కాని పెట్టెలో ఒక చెప్పునే ఎందుకు పెట్టి పంపిస్తున్నారు?’’ అని కంగారుగా అడిగాడా యజమాని. ‘‘అయ్యా తీసుకుంటున్న జీతాని కన్నా ఇక్కడ ఎవరూ తక్కువ పనిచేయడం లేదు. ఎడం కాలి చెప్పు అందుకుని పెట్టెలో పెట్టే అతను ఈ రోజు సెలవులో ఉన్నాడు. అదే సమస్య’’ అని ఫ్యాక్టరీ మేనేజర్ సమాధానం. తమ విద్యుక్తధర్మాన్ని క్రమం తప్పకుండా నెరవేర్చే కార్మికులున్నప్పటికీ, ఇలా జరుగుతూ ఉంటే ఆ వ్యాపారం ఏమవుతుందో కాస్త ఆలోచించండి. పూర్తి బాధ్యత తీసుకోకుండా, డ్యూటీ చేస్తున్నామనుకుంటూ ప్రవర్తిస్తే, అది అభివృద్ధికి పనికిరాదు. త్వరలో మీరు విరక్తి, ద్వేషం, చిరాకు కలగలిసిన యంత్రంలా మారిపోతారు. ఎవరో చెప్పింది చేయడం కంటే, మీరే గ్రహించి బాధ్యతాయుతంగా చేస్తే ఈ బాధ ఉండదు.ముందు బాధ్యతను పనిగా భావించకుండా, దాన్ని మనస్ఫూర్తిగా అంగీకరించడానికి ప్రయత్నించండి. ఇష్టంగా, సంపూర్ణంగా బాధ్యతను స్వీకరిస్తే, ‘‘ఇది నాది. నాకు సంబంధించినది’’ అనే భావన కలుగుతుంది. అప్పుడది భారం కాదు. ఇది నా బాధ్యత అనుకున్నప్పుడు, ఈయన నా భర్త, నా గృహం, నా వాహనం అని భావిస్తారు. అలా అనుకోగానే పూర్తి ఆసక్తి కలుగుతుంది. అప్పుడది తేలిక అవుతుంది. ఏ భారమూ ఉండదు. మీరీ భూమిని తలపై పెట్టుకున్నారనుకుందాం. ఈ భూమి నాది అనే తలంపుతో ఉన్నంతవరకు, అది మీకు బరువుగా తోచదు. కాని, ‘నేను బాధ్యుడను కాను’ అనే భావనతో, ఒక చిన్న సూది తీసుకున్నా, అది బరువుగా ఉంటుంది. మనస్ఫూర్తిగా ‘నాది’ అని అనుకుంటున్నప్పుడు మీరు జీవితంతో ఇష్టంగా స్పందిస్తారు. ‘నేను బాధ్యుడను కాను’ అని అనుకుంటే వ్యతిరేకత, అయిష్టత కలుగుతాయి. జీవితంతో మనస్ఫూర్తిగా స్పందించేప్పుడు, ఆ మాధుర్యాన్నే స్వర్గం అంటున్నాం. ఇష్టం లేకుండా, వ్యతిరేక భావంతో స్పందిస్తున్నప్పుడు, దాన్ని నరకం అంటున్నాం. కాబట్టి స్వర్గం, నరకం మరణం తర్వాత కాదు - ఇక్కడే, ఇప్పుడే మీరు స్పష్టించుకోగలిగినవే. సమస్య - పరిష్కారం అందరూ నాకు అహం చాలా ఎక్కువ అంటారు. నా అహానికి భయమే కారణమా? నా అహాన్ని నేను ఎలా తెంచుకోగలను? -కె.ఎల్.శ్రీనివాస్, కావలి సద్గురు: దీనిని అటువైపు నుంచి చూడాలి. భయం వల్ల అహం కాదు, అహం వల్లనే భయం ఉంటుంది. అహం గాయపడుతుందేమోనన్న భయం అది. ఎవరో పరుషంగా దూషించినట్లు మనకు అనిపించేది - అహం వల్లే. మీకు మీరు ఒక పరిమితమైన సరిహద్దు గీసుకున్నారు. ‘నేను’ అనే దానికి ఒక గుర్తింపు పెట్టుకున్నారు. అందువల్ల, సహజంగానే భయం కలుగుతుంది. ‘నేను’ అని మీరు భావించుకునే వ్యక్తి, మీరు స్వయంగా సృష్టించుకున్న రూపమే. మీరు నిజంగా భయపడేది, శరీరాన్ని పోగొట్టుకుంటామని కాదు. మీరు స్వయంగా నిర్మించుకున్న ఈ వ్యక్తిత్వాన్ని పోగొట్టుకుంటామేమోనని మాత్రమే మీరు భయపడుతూ ఉంటారు. ఉదాహరణకు, మిమ్మల్ని అవమానానికి, దూషణకు గురిచేశామనుకోండి. అప్పుడు ఈ వ్యక్తికి మరణం వచ్చినట్లే అని మీరు భావిస్తారు. అటువంటి సందర్భంలో మరణమే నిజమైన వరం అనిపిస్తుంది. మీ ఈ గుర్తింపును మీరు ధ్వంసం చేయాలి. అప్పుడు ఇక హద్దులు, అహాలు, భయాలు ఉండవు. - జగ్గీ వాసుదేవ్