భార్య కాపురానికి రాలేదని ఆత్మహత్య
మేడిపెల్లి: భార్య కాపురానికి రావడం లేదని కలతచెందిన ఓ యువకుడు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మేడిపెల్లి మండలం మన్నెగూడెం గ్రామానికి చెందిన శివరాత్రి శేఖర్(23)కు రెండేళ్ల క్రితం రాయికల్ మండలం ఇటిక్యాలకు చెందిన శైలజతో వివాహమైంది. కొన్నాళ్ల క్రితం పుట్టింటికి వెళ్లిన శైలజ తిరిగి కాపురానికి రాకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురై ఆదివారం రాత్రి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకొన్నట్లు ఏఎస్సై సత్తయ్య తెలిపారు. శేఖర్ తండ్రి దుర్గయ్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై పేర్కొన్నారు.