Manthan Foundation
-
ఇతర దేశాల కంటే వేగంగా రికవరీ: దువ్వూరి
హైదరాబాద్: ప్రపంచ దేశాలతో పోలిస్తే భారత ఆర్థిక వ్యవస్థ త్వరితగతిన కోలుకుంటుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు అన్నారు. మంథన్ ఫౌండేషన్ ఆదివారం నిర్వహించిన వెబినార్‌లో ఆయన మాట్లాడారు. ‘కరోనా నేపథ్యంలో ప్రస్తుతం వృద్ధి రేటు తగ్గుతుంది. అయితే మూలధనం అలాగే ఉంది. ఫ్యాక్టరీలు, దుకాణాలూ నిలదొక్కుకుని ఉన్నాయి. లాక్డౌన్ ఎత్తివేయగానే పనులకు వెళ్లేందుకు అందరూ సిద్ధంగా ఉన్నారు. దీంతో రికవరీ విజయవంతం అవుతుంది. ఇతర దేశాలతో పోలిస్తే మెరుగైన అవకాశాలు భారత్‌కు ఉంటాయి’ అని దువ్వూరి అభిప్రాయపడ్డారు. -
గ్రామీణ వారసత్వమే మన సంపద
సాక్షి, హైదరాబాద్: గ్రామీణ వారసత్వం దేశానికి వెలకట్టలేని సంపద అని ప్రముఖ జర్నలిస్టు, రచయిత, రామన్ మెగసెసె అవార్డు గ్రహీత పాలగుమ్మి సాయినాథ్ పేర్కొన్నారు. ఆధునికత, నాగరికత పేరుతో అంతరించిపోతున్న గ్రామీణ సంస్కృతి, జీవనం, విలువలు, సంప్రదాయాలను కాపాడుకుని రాబోయే తరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిపై ఉందని ఆయన అన్నారు. ‘పీపుల్స్ ఆర్కైవ్స్ ఆఫ్ రూరల్ ఇండియా’(పరి) పేరుతో శనివారం జూబ్లీహిల్స్‌లోని అన్నపూర్ణ స్టూడియోలో మంథన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. హస్తకళలు, చేతివృత్తులు, గ్రామీణ భాషలు, లిపులు, సంస్కృతి, సంప్రదాయాలను ప్రపంచానికి పరిచయం చేయడం, అంతరించిపోతున్న అరుదైన కళలు, భాషలు, వంటకాలు తదితరాలను వెలుగులోకి తీసుకొచ్చి ప్రాచుర్యం కల్పించే లక్ష్యంతో ‘పీపుల్స్ ఆర్కైవ్స్ ఆఫ్ రూరల్ ఇండియా’పేరుతో డిజిటల్ జర్నలిజమ్ ఫ్లాట్‌ఫామ్ అందుబాటులోకి తీసుకొచ్చినట్లు పాలగు మ్మి చెప్పారు. దేశవ్యాప్తంగా పలు రంగాలకు చెందిన ఔత్సాహికులు, పాత్రికేయులు, 1000 మంది వాలంటీర్లు ఇందులో భాగస్వాముల య్యారన్నారు. కనుమరుగవుతున్న గ్రామీ ణ భాషలు, లిపులు, కళలు రికార్డు చేసి వెలుగులోకి తెస్తున్నామని, లక్షకు పైగా మరాఠీ గ్రామీణ గీతాలు, జనపదాలు వెలుగులోకి తెచ్చామని, ఇంకా బ్రతికి ఉన్న కొద్దిమంది స్వాతంత్ర సమరయోదుల అనుభవాలను ప్రజలకు పరిచయం చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. స్వేచ్ఛా వాణిజ్యం, ప్రపంచీకరణ పేరుతో గ్రామీణ విధ్వంసం ఆమోదయోగ్యం కాదన్నారు. గ్రామీణ చేతివృత్తులు ,అరుదైన కళలను ముందు తరాలకు అందించాలనే లక్ష్యంతో లాభాపేక్ష లేకుండా ఈ వెబ్సైట్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. పలు గ్రామీణ ప్రాంతాల్లోని చేనేతకారులు, కేరళ మలబార్‌లోని కళాసీలు జీవనాధారం కోల్పోయారని, 50 ఏళ్లలో 200 గ్రామీణ భాషలు వాడుకలో లేకుండా పోయాయని సాయి నాథ్ ఆవేదన వ్యక్తం చేశారు. సువిశాల భారతంలో వివిధ ముఖకవళిలకలతో ఉండే ప్రజలను పరిచయం చేయడానికి ‘ఫేస్ డైవర్సిటి’పేరుతో దేశంలోని అన్ని జిల్లాల నుండి జిల్లాకు ముగ్గురు చొప్పన ఫోటోలు సేకరించి అందుబాటులో ఉంచే ప్రాజెక్ట్ కూడా ప్రారంభించామన్నారు. కార్యక్రమంలో మంథన్ ప్రతినిధి అజయ్‌గాంధీ సహ పలువురు ఔత్సాహికులు పాల్గొన్నారు. -
చైతన్య వాహిని
లోకంలో ప్రశ్నించే వాళ్లు ప్రతి ఇంట్లో ఉంటారు. నిలదీసే వాళ్లూ ప్రతి వీధిలో తారసపడతారు. సమాధానం చెప్పేవాళ్లు మాత్రం కోటికొక్కరు ఉంటారు. అంతులేని ప్రశ్నలకు అర్థమయ్యేలా జవాబు చెప్పి.. సమాజంలో పేరుకుపోయిన బూజును దులిపే ప్రయత్నం చేస్తుంటారు. ఇదే సంకల్పంతో ఏర్పాటైంది మంథన్ ఫౌండేషన్. సామాజిక అంశాలు, ఆర్థిక అవసరాలు, రాజకీయ కోణాలు, అంతర్జాతీయ సంగతులు.. ఇలా ఎన్నో అంశాలపై ఓపెన్ డిబేట్ నిర్వహిస్తూ సామాన్యుడికి అర్థం కాని అనేక విషయాలపై అవగాహన కల్పిస్తోంది. మంథన్ అంటే .. మేధోమథనం! వినడానికి బరువైన పదంగా అనిపించొచ్చు. కానీ ఎన్నో సమస్యలకు అర్థవంతమైన పరిష్కారాలు చూపుతున్న మార్గం ఇది. సైన్స్ అండ్ ఫిక్షన్, రాజకీయాల్లోని అవినీతి.. ప్రజా చట్టాల్లోని లొసుగులు.. అభివృద్ధితో అందే ఫలాలు.. ఇలా లోకాభిరామాయణాన్ని భుుజానికెత్తుకుంది మంథన్ సంస్థ. ప్రముఖ చార్టర్డ్ అకౌంటెంట్లు అజయ్ గాంధీ, ఎమ్ఆర్ విక్రమ్‌ల ఆలోచనతో తొమ్మిదేళ్ల కిందట తొమ్మిది మందితో పిల్లకాలువలా మొదలైన ఈ వాహిని.. ఇప్పుడు ఆరువేల మంది సభ్యులతో ఉప్పెనలా రూపుదిద్దుకుంది. సామాజిక చైతన్యం కల్పించడమే లక్ష్యంగా ఉద్యమ స్ఫూర్తితో ముందుకు సాగుతోంది. లక్ష్యం దిశగా.. అంశం ఏదైనా సమాజాన్ని చైతన్య పర్చడమే మంథన్ లక్ష్యం. వివిధ రంగాల్లో ప్రముఖులు, నీతి, నిజాయతీలకు మారు పేరుగా నిలిచిన వారు ఇందులో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. ప్రజల్లో సామాజిక స్పృహ కలిగించేందుకు బృంద చర్చలు, సమావేశాలు, బహిరంగ చర్చలు నిర్వహిస్తుంటారు. వివిధ రంగాల్లో నిష్ణాతులైన వ్యక్తులను వక్తలుగా ఆహ్వానిస్తారు. ఆయా అంశాలపై వారి అభిప్రాయాలు వ్యక్తం చేయడంతో పాటు ఓపెన్ డిబేట్లో ఆహూతుల అభిప్రాయాలను స్వీకరిస్తారు. ప్రతినెలా ఒకటి లేదా రెండు సమావేశాలు ఏర్పాటు చేస్తారు. వీటికి ప్రవేశం ఉచితం. మనం చేయాల్సిందల్లా ఠీఠీఠీ.ఝ్చ్టజ్చిజీఛీజ్చీ.ఛిౌఝ లో పేరు నమోదు చేసుకోవడమే. సామాజిక బాధ్యతను నెత్తినేసుకున్న మంథన్ ఫౌండేషన్ ఏ ఇతర సంస్థ నుంచి , వ్యక్తుల నుంచి నిధులు వసూలు చేయదు. రచయితలు, వ్యాపారులు, కంపెనీ యజమానులు, న్యాయవాదులు, పోలీసులు, విద్యార్థులు, గృహిణులు ఇలా అన్ని రంగాలకు చెందిన వారు ఇందులో సభ్యులుగా ఉండటం విశేషం. పెరుగుతున్న ఆదరణ.. మంథన్ ఎక్కడ సమావేశాలు నిర్వహించినా 150 నుంచి 700 మంది ప్రజలు హాజరవుతారు. ఇటీవల కేంద్ర బడ్జెట్ వల్ల సామాన్య, మధ్యతరగతి కుటుంబాలపై ఎలాంటి ప్రభావం పడుతుందనే అంశంపై ఆరుసార్లకు పైగా ప్రముఖ వక్తలతో చర్చలు నిర్వహించింది. గతేడాది గాంధీ జయంతి సందర్భంగా ప్రజాస్వామ్య మనుగడపై సామాజిక కార్యకర్త, మెగసెసె అవార్డు గ్రహీత అరుణ్‌రాయ్ ఉపన్యసించారు. గతంలో ప్రముఖ న్యాయవాది, మానవ హక్కుల పోరాట నేత కణ ్ణబీరన్, కవి జావెద్ అక్తర్, శ్రీలంక క్రికెటర్ కుమార సంగక్కర, సుప్రీం కోర్టు న్యాయవాది ప్రశాంత్ భూషణ్ వంటి 150 మందికి పైగా ప్రముఖులు మంథన్ సదస్సులో పాల్గొన్నారు. ఓపెన్ ప్లాట్‌ఫాం గాంధీ జయంతి సందర్భంగా నగరంలోని విస్పర్ వ్యాలీ రోడ్‌లోని జేఆర్సీ కన్వెక్షన్ సెంటర్లో మంథన్ సంవాద్-2014 ఏర్పాటు చేసినట్లు మంథన్ ఫౌండేషన్ సామాజిక సంస్థ ప్రతినిధులు, విశాంత్ర ఐఏఎస్ అధికారి, మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కాకి మాధవరావు తెలిపారు. ఉదయం 9.30 నుంచి సాయంత్రం 5.30 వరకు జరుగుతుందన్నారు. మంథన్ అభిప్రాయాలు పంచుకోవడానికి అందరికీ ఓపెన్ ప్లాట్‌ఫాం అని తెలిపారు. - కాకి మాధవరావు, ఐఏఎస్(రిటైర్డ్ ) ఒక మైల్స్టోన్ నగరానికి మంథన్ ఒక మైల్స్టోన్ లాంటిది. తొమ్మిదేళ్లుగా సంస్థ కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తోంది. ఇప్పటి వరకు 150 మంది వరకు వ్యక్తలు పాల్గొన్నారు. వివిధ రకాల సభలు, సదస్సులు నిర్వహించాం. దేశంలోని సమస్యల గురించి విపులంగా, సూక్ష్మంగా విశ్లేషించేందుకు మంథన్ ఫౌండేషన్ సదస్సులు దోహదం చేస్తున్నాయి. - అజయ్ గాంధీ - కోన సుధాకర్‌రెడ్డి -
2న మంథన్ సంవాద్
మేధోమథన సదస్సును విజయవంతం చేయండి ఫౌండేషన్ ప్రతినిధుల పిలుపు హైదరాబాద్: మంథన్ ఫౌండేషన్ సామాజిక సంస్థ ఆధ్యర్యంలో ‘మంథన్ సంవాద్ - 2014’ పేరిట అక్టోబరు రెండున గాంధీ జయంతిని పురస్కరించుకొని మేధోమథన సదస్సును నిర్వహించనుంది. మంథన్ ఫౌండేషన్ సామాజిక సంస్థ ప్రతినిధులు, విశాంత్ర ఐఏఎస్ అధికారి, ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి కాకి మాధవరావు, అజయ్‌గాంధీ, చందనా చక్రబట్టిలు ఈ మేరకు తెలిపారు. సోమవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో వారు విలేకరులతో మాట్లాడారు. నగరంలోని విస్పర్ వ్యాలీ రోడ్‌లోని జేఆర్సీ కన్వెక్షన్ సెంటర్లో సదస్సు ఆ రోజు ఉదయం 9.30 నుంచి సాయంత్రం 5.30 వరకు జరుగుతుందన్నారు. ఈ వేదిక దేశంలోని సమస్యల గురించి విపులంగా - సూక్ష్మంగా విశ్లేషించేందుకు ఉపకరిస్తుందన్నారు. సదస్సుకు అన్ని ప్రాంతాల నుంచి 1,500 మంది హాజరు కావచ్చన్నారు. గత ఏడాది తాము నిర్వహించిన సదస్సు బాగా జరిగిందనీ ఈసారీ జయప్రదమవుతుందని మాధవరావు ఆశాభావం వ్యక్తపరిచారు. కార్యక్రమంలో ప్రముఖ వక్త అరుణ్ మైరా ‘మంథన్ సంవాద్ కార్యక్రమాల’ గురించి, ప్రఖ్యాత అర్కిటెక్ట్ అండ్ అర్బన్ డిజైనర్ కేటీ రవీంద్రన్ ‘భవిష్యత్తు అవసరాలు’, కల్పనా కన్నాభిరన్ ‘మహిళల హక్కులు- చట్టాలు’, ప్రముఖ జర్నలిస్టు శేఖర్ గుప్తా ‘దేశాభివృద్ధిలో సమానత్వం’, వందనాశివ ‘వ్యవసాయం... భవిష్యత్తు’, రాజకీయ ప్రముఖుడు యోగేంద్ర యాదవ్ ‘భవిష్యత్తు రాజకీయ ప్రత్యామ్నాయాలు’ అనే అంశాలపై మాట్లాడతారని చెప్పారు. ఈ సంవాద్‌లో పాల్గొనాలనుకునే వారు తమ పేర్లను ‘డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ మంథన్‌సంవాద్ డాట్ కామ్ వెబ్సైట్’లో నమోదు చేసుకోవాలన్నారు. ప్రవేశం ఉచితమన్నారు. తొమ్మిదేళ్లుగా నిర్వహిస్తున్న తమ సంస్థ అనేక సామాజిక అంశాలపై విసృ్తత చర్చలు జరిపిందన్నారు. 9 మందితో ప్రారంభించిన ఈ సంస్థలో ఇప్పుడు ఆరువేలమంది సభ్యులుగా ఉన్నారన్నారు.