
ఆర్‌బీఐ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు
హైదరాబాద్: ప్రపంచ దేశాలతో పోలిస్తే భారత ఆర్థిక వ్యవస్థ త్వరితగతిన కోలుకుంటుందని ఆర్‌బీఐ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు అన్నారు. మంథన్ ఫౌండేషన్ ఆదివారం నిర్వహించిన వెబినార్‌లో ఆయన మాట్లాడారు. ‘కరోనా నేపథ్యంలో ప్రస్తుతం వృద్ధి రేటు తగ్గుతుంది. అయితే మూలధనం అలాగే ఉంది. ఫ్యాక్టరీలు, దుకాణాలూ నిలదొక్కుకుని ఉన్నాయి. లాక్‌డౌన్ ఎత్తివేయగానే పనులకు వెళ్లేందుకు అందరూ సిద్ధంగా ఉన్నారు. దీంతో రికవరీ విజయవంతం అవుతుంది. ఇతర దేశాలతో పోలిస్తే మెరుగైన అవకాశాలు భారత్‌కు ఉంటాయి’ అని దువ్వూరి అభిప్రాయపడ్డారు.