Marital life
-
Patna High Court: భార్యను భూతం.. పిశాచి అనడం క్రూరత్వం కాదు
పట్నా: వైవాహిక జీవితం విఫలమైన సందర్భంలో ఒక భర్త తన భార్యను భూతం, పిశాచి అంటూ దూషించడం క్రూరత్వం కాదని పట్నా హైకోర్టు తేల్చిచెప్పింది. తననుంచి విడాకులు తీసుకున్న మహిళ ఫిర్యాదుపై కిందికోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ ఆమె మాజీ భర్త దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. జార్ఖండ్‌లోని బొకారోకు చెందిన నరేశ్కుమార్గుప్తాకు 1993లో బిహార్‌లోని నవదా పట్టణానికి చెందిన మహిళతో వివాహం జరిగింది. అదనపు కట్నం కింద కారు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ తన భర్త, అతడి తండ్రి సహదేవ్ గుప్తా కలిసి తనను శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నారంటూ ఆమె 1994లో నవదాలో పోలీసులకు ఫిర్యాదు చేసింది. తండ్రీకుమారులపై కేసు నమోదైంది. వారిద్దరి విజ్ఞప్తి మేరకు ఈ కేసు నలందా జిల్లాకు బదిలీ అయ్యింది. నరేశ్‌కుమార్ గుప్తా, సహదేవ్ గుప్తాకు 2008లో నలందా కోర్టు ఏడాదిపాటు కఠిన కారాగార శిక్ష విధించింది. దీనిని వ్యతిరేకిస్తూ వారిద్దరూ అదనపు సెషన్స్ కోర్టును ఆశ్రయించారు. వారి అప్పీల్‌ను పదేళ్ల తర్వాత కోర్టు తిరస్కరించడంతో పట్నా హైకోర్టుకు వెళ్లారు. ఇంతలో జార్ఖండ్ హైకోర్టు విడాకులు మంజూరు చేసింది. 21వ శతాబ్దంలో ఒక మహిళను ఆమె అత్తింటివారు భూతం, పిశాచి అంటూ ఘోరంగా దూషించడం దారుణమని విడాకులు తీసుకున్న మహిళ తరపున ఆమె లాయర్ వాదించారు. ఇది ముమ్మాటికీ క్రూరత్వమేనని, తండ్రీ కుమారులను కఠినంగా శిక్షించాలని కోరారు. అందుకు జస్టిస్ బిబేక్ చౌదరి నేతృత్వంలోని ఏకసభ్య ధర్మాసనం నిరాకరించింది. విఫలమైన వివాహ బంధాల్లో దంపతులు పరస్పరం దూషించుకొనే సందర్భాలు చాలా వస్తుంటాయని అభిప్రాయపడింది. భర్త తన భార్యను భూతం, పిశాచి అంటూ దూషించడం క్రూరత్వం కిందికి రాదని తేల్చిచెప్పింది. పైగా సదరు మహిళ నిర్దిష్టంగా ఏ ఒక్కరిపైనా ఆరోపణలు చేయలేదని పేర్కొంది. కింది కోర్టులు ఇచ్చిన తీర్పులను కొట్టివేసింది. -
బంధం నిలబడాలంటే అదొక్కటే సరిపోదు!
సునీత, సురేష్ అందమైన జంట.. వాళ్లకొక పాప. ఇద్దరూ హైదరాబాద్‌లో సాఫ్ట్వేర్ ఇంజినీర్లుగా పనిచేస్తున్నారు. వారాంతంలో పార్టీలు, నెలకోసారి విహారయాత్రలు, ఏడాదికోసారి విదేశీ యాత్రలు.. అంతా బాగానే ఉంది. కానీ నెలకో, రెణ్నెల్లకో గొడవ గ్యారంటీ. కారణాలు చాలా చిన్నవి..గొడవలు మాత్రం పెద్దవి. చివరకు విడిపోదామని నిర్ణయించుకున్నారు. లాయర్‌నూ సంప్రదించారు. చివర్లో మిత్రుడి సలహా మేరకు మ్యారిటల్ కౌన్సెలింగ్‌కు వచ్చారు. సునీత, సురేష్‌లతో రెండు గంటలపాటు మాట్లాడాక.. వారి మధ్య శారీరక సాన్నిహిత్యం తప్ప మరెలాంటి బంధమూ లేదని అర్థమైంది. సునీత శాలరీ ఎంతో కూడా సురేష్‌కు తెలియదు. అడిగినా చెప్పదు. అది నీకు సంబంధంలేని విషయం అంటుంది. ఏ మాటంటే సురేష్‌కు కోపం వస్తుందో సునీతకు తెలియదు. ఏం చేస్తే సునీత సంతోషపడుతుందో సురేష్‌కు తెలియదు. పగలు ఎన్ని గొడవలున్నా.. రాత్రికి ఒకటైతే.. అన్ని గొడవలూ సర్దుకుంటాయని వారు బలంగా భావిస్తున్నారు. కానీ బంధం బలపడటానికి, నిలబడటానికి ఇతర సాన్నిహిత్యాలు కూడా అవసరమని వారికి తెలియదు. అందువల్ల వారెలాంటి ప్రయత్నమూ చేయడం లేదు. ఫలితమే చిన్న చిన్న విషయాలకే పెద్ద పెద్ద గొడవలు.. తిట్టుకోవడాలు.. కొట్టుకోవడాలు.. విడాకుల ప్రయత్నాలు. జీవితంలో మనకు స్నేహితులు, కుటుంబ సభ్యులు, బంధువులు.. ఇలా అనేక మందితో సాన్నిహిత్యం లేదా ఆత్మీయత ఉంటుంది. వైవాహిక బంధంలో ఇది మరింత అవసరం. అయితే సాన్నిహిత్యం అనగానే చాలామంది సునీత, సురేష్లలా శారీరక సాన్నిహిత్యం గురించి మాత్రమే ఆలోచిస్తారు. కానీ బంధాలు బలపడాలంటే ఇతర సాన్నిహిత్యాలు కూడా అవసరం. అవేంటో ఈరోజు తెలుసుకుందాం. శారీరక సాన్నిహిత్యం: చేయి పట్టుకోవడం, ముద్దులు పెట్టుకోవడం, కౌగిలించుకోవడం, తాకడం.. శారీరక సాన్నిహిత్యానికి ఉదాహరణలు. అయితే దీన్ని బహిరంగంగా ప్రదర్శించడం కొందరికి ఇబ్బందిగా అనిపిస్తుంది. సురేష్‌కు కూడా. భావోద్వేగ సాన్నిహిత్యం: భవిష్యత్తులో దంపతులిద్దరూ ఏం కోరుకుంటున్నారు, మీరు ఆందోళన చెందుతున్న విషయాలు, పని ఒత్తిడితో కూడిన సంఘటనల గురించి మాట్లాడుకోవడం ఎమోషనల్ ఇంటిమసీకి ఉదాహరణలు. సునీత, సురేష్‌ల మధ్య ఇది శూన్యం. మేధా సాన్నిహిత్యం: చదివిన పుస్తకం గురించి మాట్లాడటం, ఆలోచనలు, అనుభవాలు, ప్రశ్నలు పంచుకోవడం లాంటివి ఇంటలెక్చువల్ ఇంటిమసీకి ఉదాహరణలు. సురేష్‌కు నాన్ ఫిక్షన్ ఇష్టమైతే, సునీతకు ఫిక్షన్ అంటే ప్రాణం. అనుభవ సాన్నిహిత్యం: ఆరోగ్యకరమైన సంబంధాల్లో కలసి పంచుకునే అనుభవాలు ముఖ్యం. కలసి సమయాన్ని గడపడం, పనులు చేసుకోవడం వంటివి ఎక్స్‌పీరియెన్షియల్ ఇంటిమసీకి ఉదాహరణలు. సురేష్, సునీతల మధ్య ఇది ఫర్వాలేదు. ఆధ్యాత్మిక సాన్నిహిత్యం: విలువలు, విశ్వాసాలు, మతపరమైన ఆచారాలలో పాల్గొనడం, ఆధ్యాత్మిక విషయాలను జీవిత భాగస్వామితో చర్చించడం స్పిరిచ్యువల్ ఇంటిమసీ. సునీత భక్తురాలు. సురేష్ నాస్తికుడు. నిరంతరం ప్రయత్నించాలి.. ఎంతకాలం కలసి ఉన్నా, సాన్నిహిత్యాన్ని ఎప్పటికప్పుడు పెంచుకోవడం అవసరం. సునీత, సురేష్‌లకు వారి మధ్య విభేదాలను వివరించడంతో పాటు, వారి సాన్నిహిత్యాన్ని పెంచుకోవడానికి కౌన్సెలింగ్ చేశాను. అలాగే మీ జీవితంలో సాన్నిహిత్యాలను బలోపేతం చేయడానికి కొన్ని సులువైన మార్గాలున్నాయి. శారీరక సాన్నిహిత్యమంటే కేవలం సెక్స్ మాత్రమే కాదు. ఇద్దరూ ఇష్టాయిష్టాలను పంచుకోవడం, చేతులు పట్టుకోవడం, కౌగిలించుకోవడం శారీరక సాన్నిహిత్యాన్ని పెంపొందిస్తాయి· భాగస్వామి చెప్పే మాటలు వినడానికి, భావాలను పంచుకోవడానికి ప్రతిరోజూ కొంత సమాయాన్ని కేటాయించడం భావోద్వేగ సాన్నిహిత్యాన్ని పెంచుతుంది· భోజనం చేస్తున్నప్పుడు లేదా జీవిత భాగస్వామితో కలసి ప్రదర్శనను చూస్తున్నప్పుడు మొబైల్ ఫోన్, గాడ్జెట్స్‌ను దూరంగా పెట్టండి · ఇద్దరూ కలసి కొత్త విషయాలను ఆస్వాదించడం సరదాగా ఉంటుంది. అందుకే ఇద్దరూ వెళ్లని ప్రదేశానికి ట్రిప్ ప్లాన్ చేసుకోవాలి· కొత్త విషయాల గురించి మాట్లాడుకోవడం, ఆర్టికల్స్ పంచుకోవడం మేధో సాన్నిహిత్యాన్ని పెంపొందిస్తుంది· భాగస్వామి నమ్మకాల మేరకు ఆధ్యాత్మిక సందర్శనలు ప్లాన్ చేసుకోవాలి. ఆత్మీయతకు ఆటంకాలు ప్రతి బంధంలోనూ విభేదాలు, హెచ్చు తగ్గులు ఉంటాయి. వాటిని అర్థం చేసుకుని ఆనందించాలి. కానీ కొన్ని అడ్డంకులు ఇంటిమసీని దెబ్బతీస్తాయి. వాటిని గుర్తించి సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది. అవేంటో తెలుసుకుందాం. కోపం, చిరాకు, అపనమ్మకంతో భాగస్వామితో నిత్యం వాదిస్తూ ఉంటే అది ఇద్దరిమధ్య ఆత్మీయతను దెబ్బతీస్తుంది పని, అనారోగ్యం, ఆర్థిక, పిల్లలు, ఇతర సమస్యల వల్ల కలిసి ఒత్తిడి కూడా దంపతుల సాన్నిహిత్యాన్ని దూరం చేస్తుంది · భాగస్వామితో మాట్లాడటం, వారు చెప్పేది వినడం ఆత్మీయత పెంపొం దించడానికి అవసరం. మీరు మీ భావాలను, అవసరాలను సరిగా వ్యక్తీకరించలేకపోతే అది సాన్నిహిత్యంపై ప్రభావం చూపుతుంది· కొన్నిసార్లు, కొంతమంది గత అనుభవాలు, గాయాల వల్ల భాగస్వామితో సన్నిహితంగా ఉండటానికి భయపడతారు. దీన్నే ఫియర్ ఆఫ్ ఇంటిమసీ అంటారు. సునీతలో ఇది కనిపించింది. (చదవండి: ఈ సరస్సు ఎంత ప్రమాదకరమంటే.. ఒడ్డున నిలుచున్న ప్రమాదమే..!) -
శృంగారంపై ప్రశ్న.. హీరోయిన్ సమాధానం ఏంటంటే?
Koffee With Karan 7: Kareena Kapoor Answer To Karan Johar Question: బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్ హోస్ట్‌గా సక్సెస్ అయిన షో 'కాఫీ విత్ కరణ్' టాక్ షో. ఇప్పటికీ ఈ షో 6 సీజన్లు పూర్తి చేసుకుని ప్రస్తుతం ఏడో సీజన్‌తో దూసుకుపోతోంది. ఈ సీజన్లో పార్టిస్పేట్ చేసిన సెలబ్రిటీలతో అనేక రహస్యాలను బయటపెడుతున్నాడు ఈ స్టార్ ప్రోడ్యూసర్. ఇటీవలిటీ ఎపిసోడ్లో జాన్వీ కపూర్, సారా అలీ ఖాన్ అన్నదమ్ములతో డేటింగ్ చేయడం, విజయ్ దేవరకొండ కారులో శృంగారం చేయడం వంటి విషయాలతోపాటు సమంత, అక్షయ్ కుమార్ వ్యాఖ్యలు ఆసక్తిరేపాయి. తాజాగా మరో ఇంట్రెస్టింగ్ టాపిక్‌తో ఐదో ఎపిసోడ్ ప్రొమోను బయటకు వదిలారు. ఈ ఎపిసోడ్లో 'లాల్ సింగ్ చద్దా' హీరోహీరోయిన్లు అమీర్ ఖాన్, కరీనా కపూర్ పాల్గొన్నారు. ఇందులో భాగంగా 'పిల్లలు పుట్టాక సంతృప్తికర లైంగిక జీవితం అనేది నిజమా? కల్పితమా?' అని కరణ్ జోహర్ అడిగిన ప్రశ్నకు 'మీకు తెలియదా?' అని కరీనా కపూర్ ధీటుగా సమాధానమిచ్చింది. దీంతో 'మా అమ్మ ఈ షో చూస్తారు. ఇలా నా లైంగిక జీవితం గురించి మాట్లాడటం బాగుండదేమో?' అని కరణ్ చెప్పగా వెంటనే 'మీరు ఇతరుల లైంగిక జీవితం గురించి మాట్లాడటాన్ని మాత్రం మీ అమ్మగారు పట్టించుకోవడం లేదు కదా' అని అమీర్ అనడంతో షోలో నవ్వులు కురిశాయి. చదవండి: హీరోయిన్ మేనకోడలు, కాంగ్రెస్ నాయకుడి కుమార్తె మృతి.. హీరోయిన్‌కు ముద్దు పెట్టిన హీరో.. కంట్రోల్ చేసుకోవాలని ట్వీట్ కాగా అమీర్ ప్రధాన పాత్రలో నటిస్తున్న 'లాల్ సింగ్ చద్దా'లో నాగ చైతన్య కీలక పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. తెలుగులో మెగాస్టార్ చిరంజీవి సమర్పిస్తున్న ఈ చిత్రం ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. హాలీవుడ్ సూపర్ హిట్ అయిన 'ఫారెస్ట్ గంప్'కు రీమేక్‌గా తెరకెక్కిన ఈ సినిమాకు అద్వైత్ చందన్ దర్శకత్వం వహించారు. చదవండి: నాగార్జునతో 'విక్రమ్' లాంటి సినిమా చేయాలని ఉంది: డైరెక్టర్ బికినీ దుస్తుల్లో వేదిక రచ్చ.. సినిమా అవకాశాల కోసమేనా? -
ఆర్థిక ఒత్తిడిని జయించాలంటే..!
ఇప్పుడు ఎవరినోటవిన్నా వినిపిస్తున్న మాట.. ఒత్తిడి. జీవనశైలిలో చోటుచేసుకుంటున్న తీవ్రమైన మార్పులే దీనికి ప్రధాన కారణమంటూ సర్వేలు ఊదరగొడుతున్నాయి. ఇక మన దేశానికొస్తే... ప్రతీ పది మందిలో ఒక్కరు మినహా ఎదుర్కొంటున్న ఒత్తిళ్లకు ఆర్థిక అంశాలే మూలమని సిగ్నా 360 వెల్ బీయింగ్ సర్వే పేర్కొంది. ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక ఒత్తిళ్లను ఎదుర్కొంటున్న వారు 86 శాతం అయితే, మన దేశంలో మాత్రం 89 శాతంగా ఉన్నారు. ఉద్యోగం కోల్పోవడం లేదా కుటుంబానికి ఆధారమైన వ్యక్తి మరణంతో అప్పులు... ప్రణాళిక లేని ఖర్చులు ఇలా ఆర్థిక ఒత్తిళ్లకు ఎన్నో కారణాలు ఉంటున్నాయని పీక్ ఆల్ఫా ఇన్వెస్ట్మెంట్ సర్వీసెస్ డైరెక్టర్ ప్రియా సుందర్ తెలిపారు. ఈ ఒత్తిళ్లు ఆర్థిక లక్ష్యాలను దెబ్బతీయవచ్చు. ఆర్థిక ఆందోళన ఎక్కువ కావడం వల్ల గుండెపోటు వచ్చే ప్రమాదం 13 శాతం ఉంటుందని యూరోపియన్ సొసైటీ ఆఫ్ కార్డియాలజీ అంటోంది. వైవాహిక జీవితం విచ్ఛిన్నం కావడం, ఆర్థిక లక్ష్యాలను చేరుకోవడంలో విఫలం చెందడం వంటివీ ఆర్థిక కుంగుబాటుకు కారణాలుగా ఉన్నాయి. అందుకే పక్కా ప్రణాళికతో, నియంత్రణ చర్యలతో ఈ ఒత్తిళ్ల నుంచి బయటపడే మార్గాలపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అసలు ఆర్థిక ఒత్తిళ్లకు కారణమవుతున్న ప్రధాన కారణాలు, వీటిని అధిగమించడం ఎలాగన్నది నిపుణుల అభిప్రాయాల ఆధారంగా తెలియజేసే కథనం ఇది... షేర్లు కుప్పకూలితే...! దీర్ఘకాలం కోసం ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేసినప్పడు, ఫండమెంటల్స్ బలంగానే ఉంటే మార్కెట్ పతనం చూసి ఆందోళన చెందక్కర్లేదు. 2008 ఆర్థిక సంక్షోభం ఇన్వెస్టర్లకు ఎన్నో పాఠాలు నేర్పింది. అయినప్పటికీ ఇన్వెస్టర్లు మార్కెట్లలో కరెక్షన్ మొదలైందన్న సంకేతం రాగానే వెంటనే అమ్మేయాలన్న ఒత్తిడిని ఎదుర్కొంటూనే ఉన్నారు. ‘‘ఇన్వెస్టర్లు ఎలా స్పందించాలన్నది తెలుసుకోవాలి. కానీ, మార్కెట్ కదలికలను చూసి ప్రతిస్పందించకూడదు’’ అని 5నాన్స్ సహ వ్యవస్థాపకుడు దినేష్ రోహిరా పేర్కొన్నారు. దీర్ఘకాలం కోసం ఇన్వెస్ట్ చేసిన వారు స్వల్ప కాల ఆటుపోట్లపై ఆందోళన చెందక్కర్లేదని సూచించారు. ‘‘మార్కెట్, గ్రూపు, పథకం మూలాలు బలంగా ఉన్నాయా, లేవా అన్నది చూడాలి. మ్యూచువల్ ఫండ్ పథకం పనితీరు చక్కగా ఉంటే పెట్టుబడిని ఎప్పటిలాగానే కొనసాగించాలి. ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నప్పుడే ఎంత కాలానికి అన్న స్పష్టత అవసరం. మార్కెట్లలో పెద్ద కరెక్షన్ ప్రతీ 6–7 ఏళ్లకోసారి వస్తుంటుంది. దీర్ఘకాల ఇన్వెస్టర్లు అయితే ఆందోళన చెందకుండా సిప్‌ను కొనసాగించాలి’’ అని ఫైనాన్షియలప్లానర్ పంకజ్ తెలిపారు. ఉదాహరణకు... హెచ్డీఎఫ్సీ ఈక్విటీ ఫండ్‌లో 2014 నుంచి 2016 వరకు ఇన్వెస్ట్ చేసి ఉంటే, పెట్టుబడి భారీగా వృద్ధి చెంది ఉండేది. అలా కాకుండా 2016 ఫిబ్రవరిలో కరెక్షన్ సమయంలో పెట్టుబడులను వెనక్కి తీసేసుకుని తిరిగి అదే ఏడాది మార్చిలో ఇన్వెస్ట్ చేసి ఉంటే పై ఉదాహరణ కంటే తక్కువే రాబడులు వచ్చేవి. నేరుగా స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేసే వారు అయినా... కంపెనీల ఫండమెంటల్స్ బలంగా ఉంటే ఆందోళన చెందాల్సిన అవసరమే లేదని ఆర్థిక నిపుణుల సూచన. అయితే, దీర్ఘకాలం కోసం కాని వారు, అవసరమైతే నష్టాలను బుక్ చేసుకుని బయటకు వచ్చేయాలని దినేష్ రోహిరా సూచించారు. ఉదాహరణకు... ఐఎల్‌అండ్‌ఎఫ్ గ్రూపు ఆర్థిక సంక్షోభంతో కొన్ని డెట్ ఫండ్స్ భారీ నష్టాలను మూటగట్టుకున్నాయి. వీటి రికవరీపై ఆశలు కూడా సన్నగిల్లాయి. ఆ సమయంలో పెట్టుబడులను ఉపసంహరించుకోవడం సరైనదే. ఆశ, భయాలకు దూరంగా ఉండి, క్రమం తప్పకుండా పెట్టుబడులను పరిశీలిస్తూ ఉండాలని రోహిరా సూచించారు. పరిమితికి మించి రుణాలు అప్పటికే తీసుకున్న రుణాన్ని తీర్చివేయాలని చెప్పి మరో రుణాన్ని తీసుకోవడం సరైనది కాదు. రుణమన్నది నిర్వహణను బట్టి స్నేహితునిగాను, శత్రువుగానూ మారగలదని దినేష్ రోహిరా హెచ్చరించారు. ఓ ఆస్తి సమకూర్చుకోవడానికి రుణం చేస్తే (ఇల్లు), క్రెడిట్ స్కోరును పెంచుకునేందుకు బాధ్యతాయుతంగా క్రెడిట్ కార్డును వినియోగిస్తే, రుణం తీసుకోవడమే మంచిది. అవసరం ఉంది కదా అని పెద్ద ఎత్తున రుణం తీసుకుంటే లేదా అధిక వడ్డీ రేటు కోసం వ్యక్తిగత రుణాన్ని తీసుకుంటే బడ్జెట్, నగదు ప్రవాహాలపై ఒత్తిడి నెలకొంటుంది. కొంత మంది ఒక రుణాన్ని తీర్చివేసేందుకు మరో పెద్ద రుణం తీసుకుంటుంటారు. ఇవన్నీ ఆర్థికంగా తలకిందులు చేసే నిర్ణయాలు. ఒకటికి మించి రుణాలు ఉంటే, అధిక వడ్డీతో ఉన్న రుణాన్ని ముందుగా తీర్చివేయడంపై దృష్టి పెట్టాలి. రుణంపై 13 శాతం వడ్డీ రేటు చెల్లిస్తూ... అదే సమయంలో 6–7 శాతం వడ్డీనిచ్చే సాధనాల్లో ఇన్వెస్ట్మెంట్ ఉంటే... ఉపసంహరించుకుని రుణాన్ని చెల్లించివేయడం వివేకం. అన్ని రుణాల చెల్లింపులు నెల వేతనంలో సగాన్ని మించకుండా చూసుకోవాలి. ఆదాయ–రుణ–వ్యయ నిష్పత్తులను జాగ్రత్తగా ఎప్పటికప్పుడు సరిచూసుకోవాలి. రిటైర్మెంట్కు ముందునుంచే రిటైర్మెంట్ జీవితం గురించి మరీ ఆలస్యంగా పొదుపు మొదలు పెడితే అవసరాలు తీరవు. ఆర్థిక సమస్యలతో మలి వయసులోనూ ప్రశాంతత కోల్పోవాల్సి వస్తుంది. 25 ఏళ్ల వ్యక్తి ప్రతీ నెలా రూ.20,000 వేలను ఇన్వెస్ట్ చేస్తే 60 ఏళ్ల నాటికి రూ.10.9 కోట్లు (12 శాతం రాబడి) సమకూరుతుంది. కానీ, 35 ఏళ్ల వయసు నుంచి ప్రతీ నెలా రూ.20,000 వేలు ఇన్వెస్ట్ చేస్తే 60 ఏళ్ల నాటికి కేవలం రూ.3.4 కోట్లే సమకూరుతుంది. ఇంకాస్త ఆలస్యంగా 45వ ఏట నుంచి మొదలు పెడితే రూ.94.3 లక్షలు, 55 ఏళ్ల నుంచి అయితే రూ.16.1 లక్షల దగ్గర నిధి ఆగిపోతుంది. భాగస్వామితో సమన్వయం జీవిత భాగస్వామికి ఆర్థిక లక్ష్యాల్లోనూ చోటు కల్పించడం ఎంతైనా అవసరం. కుటుంబ బడ్జెట్ గురించి ఇద్దరూ మాట్లాడుకోవడం, ఉమ్మడి లక్ష్యాల కోసం చేయాల్సిన పొదుపు విషయాలపై ఏకాభిప్రాయానికి రావాలి. దంపతుల మధ్య ఆర్థిక విషయాల్లో సఖ్యత లేకపోయినా, ఆ కుటుంబం ఆర్థిక సమస్యల్లో చిక్కుకునేందుకు దారితీయవచ్చు. ఖర్చులు, పొదుపు, ఇన్వెస్ట్మెంట్, భవిష్యత్తు లక్ష్యాల విషయంలో ఇద్దరూ ఓ నిర్ణయానికి రావడం తప్పనిసరి. ఇద్దరూ ఆర్జనాపరులే కావాల్సిన అవసరం లేదు. దంపతుల్లో ఒక్కరే ఆదాయ పరులైనా కానీ, ఆర్థిక విషయాల్లో ఇద్దరూ ఏకాభిప్రాయంతో, సమన్వయంతో నడుచుకుంటే సమస్యలు రాకుండా చూసుకోవచ్చు. దంపతులిద్దరూ సంపాదిస్తుంటే... ఉమ్మడి బ్యాంకు ఖాతాను తెరిచి, తమ వేతనం నుంచి ఇద్దరూ సమాన మొత్తంలో జాయింటు ఖాతాలోకి కుటుంబ ఖర్చుల కోసం మళ్లించుకోవాలని ఆర్థిక నిపుణులు సుందరం సూచించారు. వ్యక్తిగత ఖర్చులను వారు తమ వ్యక్తిగత ఖాతాల్లో ఉన్న మిగులు నిల్వల నుంచి చేసుకోవచ్చన్నారు. ఇక జీవిత భాగస్వాముల్లో ఒకరే ఆర్జనా పరులైతే, ఒకరు ఇన్వెస్ట్మెంట్, మరొకరు ఇంటి ఖర్చులను నిర్వహించడం చేయాలి. ముందుగానే పక్కా ప్రణాళిక భవిష్యత్తులో ఎదురయ్యే ఆర్థిక అవసరాలకు ముందు నుంచే సరైన ప్రణాళిక వేసుకోవాలి. మూడేళ్ల చిన్నారి ఉన్నత విద్య కోసం నిధిని సమకూర్చుకోవాలంటే... ఈ రోజు రూ.10 లక్షలయ్యే కోర్సు, 15 ఏళ్ల తర్వాత 7 శాతం ద్రవ్యోల్బణ రేటు ఆధారంగా రూ.27.59 లక్షలు అవుతుంది. ఆర్థిక సన్నద్ధత తీవ్ర అనారోగ్యం, ప్రమాదానికి గురవడం, ఉద్యోగం కోల్పోవడం, కుటుంబానికి ఆధారమైన వ్యక్తి మరణించడం వంటి సందర్భాల్లో ఆర్థిక సమస్యలు ఏర్పడతాయి. ఆర్థిక సమస్యలకు కారణమయ్యే వాటిల్లో ఇవే అతిపెద్దవి. అత్యవసర నిధి ఈ సమయాల్లో అక్కరకు వస్తుంది. ఉద్యోగం స్థిరంగా ఉంటుందన్న హామీ కష్టమే. ఇక ఆరోగ్యానికి రిస్క్‌తో కూడిన ఉద్యోగాలలో ఉన్న వారు ముందుగానే రిటైర్మెంట్ తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇటువంటి వారు ముందు నుంచే విచక్షణారహిత ఖర్చులకు కళ్లెం వేసి పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్ చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అనవసర ఖర్చులు వద్దు.. బడ్జెట్‌ను అనుసరించి ఖర్చు చేసే వారికి ఈ పరిస్థితి ఎదురుకాదు. ఆర్థిక ఒత్తిళ్లు అన్నవి చాలా సాధారణం. వీటికి ఎన్నో కారణాలు కూడా ఉంటాయి. మీ వేతనం తక్కువగా ఉంటే, అధిక వేతనం లభించే కొత్త ఉద్యోగ అవకాశం చూసుకోవడం, ఇతర మార్గాల ద్వారా ఆదాయాన్ని పెంచుకోవడం మినహా ప్రత్యామ్నాయాలు లేవు. ‘‘చాలా మంది విషయంలో నెల చివర్లో నిధుల్లేని పరిస్థితికి కారణం సరైన బడ్జెట్ లేకపోవడమే, నగదు నిర్వహణ నిర్మాణాత్మకంగా లేకపోవడమే’’ అని దినేష్ రోహిరా తెలిపారు. ఇక మనలో చాలా మందికి అసలు ఓ బడ్జెట్ అంటూ ఉండదు. దీంతో వస్తున్న ఆదాయంతో ఖర్చులను సమన్వయం చేసే అవకాశం ఉండదు. నెల వేతనం రాగానే అనవసరమైన ప్రతిదానికీ ఖర్చు చేయడం వల్ల... ఉన్నదంతా నెల మొత్తానికి సర్దుబాటు కాదు. మరో కారణం దుబారాగా ఖర్చు పెట్టే అలవాటు. తప్పనిసరి ఖర్చులు, ఇష్టానికి చేసే ఖర్చుల మధ్య భేదాన్ని చాలా మంది గుర్తించరు. వేతనం రాగానే పెట్టుబడులు, బిల్లు చెల్లింపులు, రుణ ఈఎంఐల చెల్లింపులు ముందుగా చేయడానికి బదులు... రెస్టారెంట్‌కు వెళ్లి కడుపునిండా నచ్చిన విందు చేసుకుంటే ఎలా ఉంటుందో ఆలోచించండి. ఈ పరిస్థితుల్లో అవసరాల కోసం క్రెడిట్ కార్డు లేదంటే మరో రుణమో తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దీనివల్ల రుణ సమస్యల్లో చిక్కుకుంటారు. పరిమితికి మించిన రుణ భారం కూడా మనిషిని ఆర్థికంగా కుంగదీస్తుంది. కారు రుణం, ఇంటి రుణం, వ్యక్తిగత రుణం అన్ని ఈఎంఐలు నెల ఆదాయంలో 50 శాతానికి మించాయంటే సంక్షోభంలోకి వెళుతున్నట్టే. దీన్నుంచి బయటపడేందుకు ముందుగా బడ్జెట్ రూపొందించుకోవాలి. తప్పనిసరి ఖర్చులను విచక్షణ లేకుండా చేసే ఖర్చుల నుంచి వేరు చేయాలి. తప్పనిసరి అవసరాలకు ఖర్చు చేసిన తర్వాత... మీ ఆదాయంలో మిగులు ఉంటే అప్పుడు విచక్షణా రహిత ఖర్చులకు వెళ్లడంలో తప్పులేదు. ఇక ఆర్జన మొదలైన నాటి నుంచే మొత్తం ఆదాయంలో 20–30 శాతాన్ని ఇన్వెస్ట్ చేస్తుండాలని, ఇది చేస్తుంటే ఖర్చులన్నవి పెద్ద సమస్యే కాబోవని నిపుణులు పేర్కొంటున్నారు. ఇక అత్యవసర నిధిని ఏర్పాటు చేసుకోకపోయినా బడ్జెట్ తలకిందులు అవుతుంది. అత్యవసరాలు చేతిలో ఉన్నదంతా ఖాళీ చేసేస్తే ఇబ్బంది పడాల్సి వస్తుంది. అందుకే కనీసం మూడు నెలల అవసరాలకు సరిపడా అయినా అత్యవసర నిధిని ఏర్పాటు చేసుకోవాలి. ఓ కారు ఖర్చులను భరించే సామర్థ్యం లేకపోతే, రుణంపై కారు తీసుకోవద్దు. నెలంతా చేతిలో డబ్బుల్లేని పరిస్థితుల్లో ఉన్నవారు క్రెడిట్‌కార్డు వినియోగానికి దూరంగా ఉండాలి. డబ్బులంతా ఖర్చవడానికి అనవసర ఖర్చులే కారణం అయితే... అటువంటి వారు మరింత ఆదాయం కోసం కష్టపడినా నిష్ప్రయోజనమే. ఎందుకంటే పిండికొద్దీ రొట్టె అన్నట్టు ఎంత వచ్చినా విచక్షణారహితంగా ఖర్చు చేసే అలవాటు పెద్ద ముప్పు. నెలసరి ఆదాయం అంతా నెల మధ్యలోనే ఖాళీ అయిపోతే, అవసరాల కోసం అత్యవసర నిధి జోలికి వెళ్లొద్దు. అధిక ఆదాయం కోసం లాటరీలు, జూదం, చాలా స్వల్ప కాలంలోనే భారీ రాబడులు ఇచ్చే పథకాల్లో ఇన్వెస్ట్ చేయడం వంటి వాటికి దూరంగా ఉండాలి. ముఖ్యంగా రుణ ఈఎంఐలు, బీమా ప్రీమియంలు, బిల్లులు అన్నీ చేతికి ఆదాయం అందించిన వెంటనే చెల్లింపులు చేసేయాలి. -
నరకం నుంచి బయటికి
పెళ్లయిన ప్రతి ముగ్గురిలో ఒక స్త్రీ.. గృహహింసకు గురవుతున్న దేశం మనది! చట్టాలు, కోర్టులు, పోలీసు వ్యవస్థ.. ఎన్ని ఉన్నా, ఇంటి నాలుగు గోడల మధ్య భర్త, ఇతర కుటుంబ సభ్యులు పెట్టే నరకయాతనను అడ్డుకోలేకపోతున్నాయి. ఒకవేళ ఏ బాధితురాలైనా తనను తాను కాపాడుకోడానికి, తన పిల్లల్ని తీసుకుని బయటి ప్రపంచంలోకి పారిపోయి వచ్చినా.. తల్లీపిల్లలకు రక్షణ ఎవరిస్తారు? చేయడానికి ఆమెకు పని ఎవరు చూపిస్తారు? మళ్లీ అక్కడ కూడా ఇంటిలాంటి సమాజమే వారిని వెంటపడి వేధిస్తే? ఇంట్లో ఉండడమే నయమనిపిస్తే?! ‘‘లేదు, లేదు.. నయం అనిపించదు. నరకంలోకి వెళ్లినా ఇల్లు నయం అనిపించదు’’ అని జులేఖా, షైమీన్, రాణి, మమత, జ్యోతి, సునీత, ప్రీతి అంటున్నారు. వీళ్లందరిదీ ఒకటే కథ.. గృహహింస. వీళ్లందరినీ చేరదీసింది ఒకే సంస్థ.. ‘గౌరవి’. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో 2014లో ప్రారంభమైన ‘గౌరవి’ గత నాలుగేళ్లుగా.. ఇంటి హింసను తట్టుకోలేక ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వచ్చిన బాలికలకు, గృహిణులకు ఆశ్రయం ఇస్తోంది. ‘హోమ్ షుడెన్ట్ హర్ట్’ (ఇల్లు బాధించకూడదు) అనే క్యాంపెయిన్‌తో ఏ ఆసరాలేని ఆడపడుచులను ఆదుకుంటోంది. ‘గౌరవి’ చేయూతతో బోరుబావుల్లోంచి ప్రాణాలతో బయటికి వచ్చినట్లుగా కొత్త జీవితాన్ని ఆరంభించి, ఆదర్శంగా నిలుస్తున్న కొంతమంది మహిళల సంక్షిప్త వ్యథనాలివి. ‘తోడుగా నేను లేనా’ అన్నాడు! జులేఖాకు 19 ఏళ్లకే పెళ్లైంది. ఆ వెంటనే భర్త ఆమెను భౌతికంగా హింసించడం మొదలైంది. భార్యను కొట్టడం కూడా దాంపత్య జీవితంలో ఒక భాగమే అనుకున్నట్లు, అదొక దైనందిన వైవాహిక ధర్మంగా ఆమెను కొట్టేవాడు! గదిలోకి తోసి, తలుపులు వేసి నరకం చూపించేవాడు. ఆమె ఓర్చుకున్నా ఆమె దేహం ఎన్నాళ్లని తట్టుకుంటుంది. ఓ రోజు భర్త దెబ్బలకు నిలువునా కూలిపోయింది. అమ్మానాన్న వచ్చి వెంటనే ఆసుపత్రిలో చేర్పించారు. ఆమె కోలుకుని ఇంటికి రాకముందే ఆమె భర్త రెండోపెళ్లి చేసుకుని వెళ్లిపోయాడు. అత్తింట్లో ఒంటరిగా ఉండిపోయింది. ‘తోడుగా నేను లేనా’ అని ఓ రాత్రి ఆమె మామ (భర్త తండ్రి) ఆమె పడుకుని ఉన్న గదిలోకి వచ్చాడు. అప్పట్నుంచి కొత్త నరకం మొదలైంది. ఇల్లొదిలి పారిపోయింది. తనకుంటూ చిన్న ఉపాధిని ఏర్పరచుకుంది. మహిళలెవరైనా తనకు తారసపడితే వారిని చేరదీసి ఒక దారి చూపిస్తోంది. నా కూతుర్ని నాలా కానివ్వను షైమీ పై నిత్యం ఆమె భర్త చెయ్యి చేసుకునేవాడు. అవసరం లేకున్నా అలవాటుగా ఆ పని చేసేవాడు. ఉదయాన్నే లేవలేకపోయినందుకు, ఒంట్లో బాగోలేదు అన్నందుకు, ఫోన్లో పుట్టింటి వాళ్లతో మాట్లాడినందుకు భర్త ఆగ్రహించేవాడు. కర్రనో, కుర్చీనో.. చేతికి అందిన దాన్ని తీసుకుని ఆమెపై విసిరేవాడు. షైమీన్ గర్భిణిగా ఉండగా ఓ రోజు బలంగా కడుపులో కొట్టడంతో గర్భస్రావం జరిగి, ఆమె ప్రాణం పోయినంత పని జరిగింది. మళ్లీ గర్భం దాల్చినప్పుడు ఆడబిడ్డను కన్నందుకు ఆమెను వదిలేసి వెళ్లిపోయాడు. షైమీన్ కోర్టుకు వెళ్లింది. కోర్టు అతడి నుంచి ఆమెకు 4,500 రూపాయల పరిహారం ఇప్పించింది. షైమీన్ ఇప్పుడు స్వయం ఉపాధితో తనను, తన కూతుర్ని పోషించుకుంటోంది. ‘‘నా కూతుర్ని నాలా కానివ్వను. ఆమెకు ఆరోగ్యవంతమైన జీవితాన్ని, చక్కటి చదువును అందిస్తాను’’ అంటోంది. సంపాదిస్తేనే భార్యకైనా గౌరవం రాణి రెండో బిడ్డను కడుపులో మోస్తున్నప్పుడు ఆమె భర్త ఆమెను చావబాదాడు! ‘మళ్లీ కనుక కూతుర్నే కన్నావంటే, ముగ్గుర్నీ కలిపి పాతేస్తాను’ అని హెచ్చరించాడు. రాణి భయపడిపోయింది. అప్పటికే ఆమెకు ఒక కూతురు. ఆమెకు అర్థమైంది. అతడు అన్నంత పనీ చేస్తాడని. ఆరేళ్ల వైవాహిక బంధాన్ని తెంపేసుకుని, ఇంట్లోంచి వెళ్లిపోయింది. కోర్టులో విడాకుల కేసు ఇంకా నడుస్తూనే ఉంది. కేసుతో సంబంధం లేకుండా, భర్త విదిలించే డబ్బుల కోసం చూడకుండా కష్టం చేసుకుంటూ తన కాళ్ల మీద తను నిలబడింది. ఇద్దరు ఆడపిల్లల్ని ఎలాంటి భయాలు లేకుండా మురిపెంగా పెంచుకుంటోంది. ‘‘డబ్బు సంపాదిస్తున్న భార్యను మాత్రమే మగవాళ్లు గౌరవంగా చూస్తారు. లేకుంటే.. చులకన చేస్తారు’’ అని రాణి అంటోంది, భర్త తనను ఎంత హీనంగా చూసిందీ గుర్తు చేసుకుంటూ. ఇప్పుడెవరికీ భయపడే పని లేదు మమత మరొక బాధితురాలు. ఆమెనే కాదు, పిల్లల్ని కూడా కొట్టేవాడు ఆమె భర్త. ‘ఇలాంటి భర్త వద్దు’ అనుకుని బయటికి వచ్చేసింది. పిల్లల్ని హాస్టల్లో చేర్చింది. నాలుగు రాళ్లు సంపాదిస్తోంది. ‘‘ఇప్పుడు నేనెవరికీ భయపడే పని లేదు. నా బతుకు నేను బతుకుతున్నాను. నా పిల్లలకు మంచి జీవితాన్ని ఇస్తాను’’ అని ఆత్మవిశ్వాసంతో చెబుతోంది. ఫ్రెండ్స్ ముందు కొట్టేవాడు జ్యోతి చైల్డ్ కౌన్సిలర్‌గా చేస్తోంది. పన్నెండేళ్ల వైవాహిక జీవితంలోని దుర్భరమైన హింస నుంచి విముక్తి కోసం ఆమె గడప బయటికి అడుగుపెట్టింది. భర్త ప్రతి విషయంలోనూ ఆమెను నియంత్రించేవాడు. ఎలాంటి దుస్తులు వేసుకోవాలి, ఎవరితో మాట్లాడాలి.. ఏం తినాలి? ఎప్పుడు నిద్రపోవాలి.. అన్నీ అతడి ఆదేశానుసారం జరగాల్సిందే! చివరికి అతడి ఫ్రెండ్స్ ముందుకు కూడా ఆమెను కొట్టడం మొదలుపెట్టాడు. అతడికి విడాకులిచ్చేశాక జ్యోతి చైల్డ్ సైకాలజీ చదువుకుంది. చదువుకు తగ్గ జాబ్ వెతుక్కుంది. కొడుకును తన దగ్గరే ఉంచుకున్నాడు భర్త. ఇప్పుడా కొడుకు కోసం న్యాయ పోరాటం చేస్తోంది. ‘‘నా భర్త నుంచి విడిపోగానే నాకు రెక్కలు వచ్చినట్లుగా అయింది. చాలా ఆనందంగా అనిపించింది. ‘ఇకనుంచీ నా ఇష్టం వచ్చినట్లు నేను ఉండొచ్చు కదా’ అన్న ఆలోచన నాలో జీవితేచ్ఛను కలిగించింది. నా జీవితానికి ఒక అర్థం కనిపిస్తోంది’’ అని జ్యోతి సంతోషంగా చెబుతోంది. నా ఫొటో వేసి రాయండి సునీత భర్త ప్రతిరోజూ తాగి వచ్చి, సునీతతో అయినదానికీ, కానిదానికీ గొడవపడేవాడు. ఇక అతడితో కలిసి ఉండలేని పరిస్థితికి వచ్చేసింది సునీత. ఆ సమయంలో బంధువులు చొరవచూపి, భార్యాభర్తల్ని మ్యారేజ్ కౌన్సెలింగ్‌కి తీసుకెళ్లారు. ‘సరే, నేనిక తాగను. గొడవ పడను’ అని కౌన్సెలింగ్ ఇచ్చినవారి ముందు అంగీకరించి, ఇంటికొచ్చాక మళ్లీ మామూలుగానే తాగడం, సునీతను కొట్టడం మొదలుపెట్టాడు! సునీతకు విడాకులు తప్ప వేరే మార్గం కనిపించలేదు. కోర్టులో కేసు వేసింది. భర్త నుంచి ఇప్పుడు ఆమెకు భరణం కూడా అందుతోంది. ‘ది టెలిగ్రాఫ్’ పత్రిక ప్రతినిధులతో కూడా ఆమె ధైర్యంగానే చెప్పింది.. ‘‘నా ఫొటో వెయ్యండి, నా గురించి రాయండి. నాలాంటి మహిళలు కొందరికైనా నేనొక ప్రేరణ అయి, వారి జీవితాలు మెరుగయితే అంతకుమించిన సంతృప్తి నాకు ఏముంటుంది?’’ అంది సునీత. ఇరవై ఏళ్లకే ఇద్దరు పిల్లలు ప్రీతి భోపాల్‌లో ఒక ఫుడ్ కియోస్క్ నడుపుతోంది. రెండు పెళ్లిళ్లు విఫలమై, దారుణమైన జీవితాన్ని అనుభవించి ఇప్పుడు తన బతుకు తను బతుకుతోంది. పదేళ్ల వయసులో ప్రీతికి మొదటి పెళ్లి జరిగింది. వరుడు ఆమెకన్నా చాలా పెద్దవాడు. ఇరవైఏళ్ల వయసు వచ్చేనాటికి ప్రీతికి ఇద్దరు పిల్లలు. భర్త ఆనారోగ్యంతో చనిపోయాక, రెండో పెళ్లి చేసుకుంది. ఒక మగబిడ్డను కంది. అయితే రెండో పెళ్లి కూడా ఆమెకు నరకమే చూపించింది. భర్త ఎప్పుడూ తిట్టేవాడు, కొట్టేవాడు. అనుమానించేవాడు. ఒకరోజు ముగ్గురు పిల్లల్నీ తీసుకుని ఆ గృహనరకం నుంచి బయటపడింది ప్రీతి. ఇప్పుడు తినుబండారాల బండిని నడిపిన విధంగానే తన జీవితాన్నీ సాఫీగా నడుపుకుంటోంది. పిల్లల్ని చక్కగా చదివించుకుంటోంది. (సౌజన్యం: ది టెలిగ్రాఫ్) -
మేఘన్‌కు కష్టాలు.. కన్నతండ్రి కన్నీటిపర్యంతం!
వివాహం అయిన తర్వాత ప్రతి మహిళ జీవితంలో కొన్ని సర్దుబాట్లు తప్పవు. అత్తింటి ఆచారాలకు తగ్గట్టు తనను తాను మార్చుకోవడానికి కాస్తా సమయం పడుతుంది. సాధరణ కుటుంబాల్లో పరిస్థితి ఇలా ఉంటే ఇక రాయల్ ఫ్యామిలిలో కోడలిగా అడుగుపెట్టిన వారి పరిస్థితి ఇంకాస్తా కష్టంగానే ఉంటుంది. రాజ కుటుంబం అంటే కట్టుబాట్లు, కష్టమైన నియమాలు తప్పవు. ఏం తినాలి, ఎలా ప్రవర్తించాలి, ఎటువంటి వస్త్రాలు ధరించాలి, ఎలా మాట్లాడాలి... ఇలా ప్రతి విషయంలోనూ ఆచారం, వ్యవహారం ఉంటుంది. అవన్ని ఆకళింపు చేసుకోవడానికే చాలా సమయం పడుతుంది. అన్నింటి కంటే ముఖ్యమైనది వాటన్నింటికి అనుగుణంగా తమని తాము మార్చుకునే క్రమంలో వారిలో చెలరేగే సంఘర్షన. కొందరు దీనిని తట్టుకోగలరు, మరి కొందరు వీటన్నింటిని భరించడం మా వల్ల కాదు అనుకుని ఆ బంధం నుంచి బయటపడతారు. ప్రస్తుతం మేఘన్ మార్కల్ కూడా ఇదే పరిస్థితులను ఎదుర్కొంటున్నారంట. నలుగురిలో చిరునవ్వుతో కనిపించే మేఘన్ తన మనసులో అపారమైన బాధను భరిస్తున్నారంట. ఆమె మోముపై ఉన్న చిరునవ్వు నిజం కాదంట. ఈ మాటలు అంటున్నది ఎవరో కాదు.. స్వయంగా మేఘన్ తండ్రే. ఒకప్పటి ఈ నటి ప్రిన్స్ హారీని వివాహం చేసుకుని రాజకుటుంబంలో అడుగుపెట్టారు. ఇన్నాళ్లు సాధారణ జీవితం గడిపిన మేఘన్ ఉన్నట్టుండి ఒక్కసారిగా రాయల్ ఫ్యామిలీలో ఒదిగిపోవడం అంటే కష్టమే. కొత్త వాతవారణం, కొత్త మనుషులు అన్నింటికి మించి ఇన్నాళ్లు అందరిలానే చేసిన కొన్ని పనులను కూడా ప్రత్యేక పద్దతిలో చేయాల్సి రావడం కాస్తా కష్టమే. ప్రస్తుతం ఇలాంటి ఇబ్బందికర పరిస్థితులనే ఎదుర్కొంటున్నారు మేఘన్ మార్కల్. ఇప్పటికే పలు సందర్భాల్లో రాయల్ ఫ్యామిలీ నియమాలను మర్చిపోతూ మీడియా వారికి పని కల్పిస్తున్నారు. దాంతో సామన్యులు కూడా పాపం మేఘన్‌కు రాజకుటుంబం బరువు బాధ్యతలు మోయడం ఇబ్బందిగా ఉన్నట్లుంది అనుకుంటున్నారు. ఇలా అనుకునే వారిలో మేఘన్ మార్కేల్ తండ్రి కూడా ఉన్నారు. ఈ విషయం గురించి థామస్ ‘ఇప్పుడు నా కూతురు ప్రారంభించిన కొత్త జీవితం ఆమెను భయపెడుతుందనుకుంటున్నాను. ఆమె కళ్లల్లో, మొహంలో, చివరికి ఆమె నవ్వులో కూడా ఆ భయం నాకు స్పష్టంగా తెలుస్తుంది’ అని తెలిపారు. మేఘన్ మార్కల్ బహిరంగ సమావేశాలకు హాజరయిన ప్రతిసారి ఆమె మొము మీద చిరునవ్వు ఉంటుంది. కానీ ఆమె తండ్రి థామస్ మాత్రం అది నిజం చిరునవ్వు కాదంటున్నారు. ‘నా కూతురి నవ్వు ఎలా ఉంటుందో నాకు తెలుసు. చిన్నతనం నుంచి తన నవ్వుని చూస్తున్నాను. ఇప్పుడు ఆమె మొహంలో కనిపించే చిరునవ్వు నిజమైనది కాదు. ఆ చిరునవ్వు వెనక ఎంతో బాధ ఉంది’ అది నాకు స్పష్టంగా కనిపిస్తుంది అన్నారు. అంతేకాక ‘మేఘన్‌కు వివాహం అయిన నాటి నుంచి నేటి వరకూ నేము ఆమెతో మాట్లాడలేదు. నేను ఎన్నిసార్లు ఆమెకు ఫోన్ చేసిన తను ఫోన్ ఎత్తడం లేదు. స్వయంగా కలుద్దామంటే ఆమె చిరునామ నా దగ్గర లేదు’ అని ఆయన కంటతడి పెట్టారు. -
మరి గదిలోకి ఎలా వెళ్లను?
ఇంటికంటే సేఫ్‌ప్లేస్ ఉంటుందా?అమ్మాయికి వీధిలో భద్రత లేదు.స్కూల్లో లేదు. ఆటస్థలంలో లేదు.మరి ఇల్లయినా సేఫ్‌ప్లేస్ అవుతుందా?తల్లిదండ్రులకు చెప్పకపోతే ఇల్లు అన్‌సేఫ్ ప్లేస్‌గానే ఉండిపోతుంది. అమ్మాయిలు చెప్పుకోరు. చెప్పాలనుకున్నా అంత నీచమైంది ఎలా చెప్పాలి?అందుకే తల్లిదండ్రులే ఇంట్లో అమ్మాయితో అన్ని విషయాలు మాట్లాడాలి.. కనుక్కోవాలి. తెలియజేయాలి!! మా మామయ్యలతో తప్ప పరాయి మగవాళ్లతో మాట్లాడలేదు. ఆ టైమ్‌లోనే ఈ సంబంధం వచ్చింది. అమ్మతో చెప్పి ఏడ్చాను పెళ్లి వద్దు నాకు భయం అని. పెళ్లయితే అన్నీ సర్దుకుంటాయి ఏం కాదు అని నచ్చచెప్పింది అమ్మ. ఏడ్చుకుంటూ అమ్మ దగ్గరికి పరిగెత్తాను. ఎందుకేడుస్తున్నావ్.. అంటూ అమ్మ దగ్గరకుతీసుకుంది. కలొచ్చి.. భయపడి ఉంటది అని నానమ్మ. అలాగే వెక్కుతూ అమ్మను అతుక్కుపోయాను. దూరం నుంచి తాతయ్య.. గుడ్లురుముతూ! ఇప్పుడు నా వయసు 27 సంవత్సరాలు. పెళ్లయి మూడేళ్లయింది. ఆయనకు మంచి ఉద్యోగం. హైదరాబాద్ సంబంధం కుదిరితే ఎప్పుడంటే అప్పుడు అమ్మను చూసుకోడానికి ఉంటుంది అని ఆశపడ్డాను. దేవుడు నా కోరిక విన్నాడో ఏమో హైదరాబాద్‌నే అత్తిల్లు చేశాడు. మామూలుగా అయితే అలాంటి అత్తగారు.. భర్త.. ఆ ఇల్లు దొరికినందుకు హ్యాపీగా ఉండాలి. కాని నాకు భయం. నా జీవితం నరకం. నా వైవాహిక జీవితం అంటే నరకం. ఆ గది పెళ్లయ్యాక ఏ ఆడపిల్ల అయినా భర్త గదిలోకి వెళ్లాలి. కాని నాకు నా హజ్బెండ్ దగ్గరకు వెళ్లాలంటే భయం. కొత్తలో బెరుకు అనుకొని సర్దుకుపోయాడు. తర్వాత సెక్సువల్ యాక్ట్ పట్ల నాలెడ్జ్ లేదనుకుని డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లాడు. రొమాంటిక్ వీడియోలు చూపించేవాడు. అయినా నాలో మార్పు లేదు. పెళ్లికి ముందు లవ్ ఎఫైర్ ఉందేమోనని అనుమానపడ్డం మొదలుపెట్టాడు. నా ఫ్రెండ్స్‌ని, బంధువులనూ అడిగాడు. నా ఫేస్బుక్, జీ మెయిల్, ఫోన్ అన్నీ చెక్ చేశాడు. ఎఫైర్ ఆనవాలేమీ దొరకలేదు. ఇక నాకు నా మామగారిని చూస్తే వణుకు వచ్చేది. నా చిన్నప్పుడు నేను చూసిన మా తాతగారిలాగే కనపడేవాడు. దాంతో మా మామగారితో సరిగ్గా మాట్లాడేదాన్ని కాను. అసలు ఆయన ఉన్న పరిసరాల్లోకి వెళ్లేదాన్నే కాను. గదిలో తలుపేసుకుని ఉండిపోయేదాన్ని ఎన్ని గంటలైనా. దాంతో మా అత్తగారు వాళ్లు నాకు పొగరని, పెద్దవాళ్లంటే గౌరవం లేదనే అభిప్రాయానికి వచ్చారు. నా ప్రవర్తన అర్థం కాక మరోవైపు దాంపత్య జీవితం లేక నన్ను నా భర్త తన్నాడు. మళ్లీ డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లాడు. ఆవిడ ఏవేవో ప్రశ్నలు అడిగారు. చివరకు నాకు ఫ్రిజిడిటీ ఉందని తేల్చారు ఆవిడ. ఇలా ఎందుకు జరిగింది? మాది జాయింట్ ఫ్యామిలీ. నాకు ఇద్దరు పెద్దనాన్నలు.. ఇద్దరు బాబాయ్‌లు... ఇద్దరు అత్తలు.... పెద్ద ఇల్లు. అప్పుడు నాకు తొమ్మిదేళ్లుంటాయేమో.. ఫోర్త్ క్లాస్ సమ్మర్ హాలిడేస్. ఇంకో పన్నెండు రోజుల్లో చిన్నత్త పెళ్లి. ఆ అరేంజ్మెంట్స్ అవుతున్నాయి. ఓ మధ్యాహ్నం పూట.. మా వంటిల్లు నానుకుని పెద్ద వసారా ఉంటుంది. అందరూ అక్కడే ఉన్నారు. నేను హాల్లో పడుకున్నా. బాగా నిద్దరలో ఉన్నా. నా మీద బరువుగా ఏదో ఉండటం.. శ్వాస ఆడనట్టు కావడంతో గాబరాపడి లేచాను. నన్నంతా ఆక్రమించుకొని మా తాతయ్య. అక్షరాలా మా నాన్న నాన్న. నేను కళ్లు తెరవగానే తన చేత్తో నా కళ్లు, నోరు మూసి తన నడుముతో నా నడుమును అదమసాగాడు. అరిచే ప్రయత్నం చేసి.. ఆయన చేతిని కొరికి.. రక్కితే అప్పుడు లేచాడు. నేను ఏడ్చుకుంటూ అమ్మ దగ్గరికి పరిగెత్తాను. ఎందుకేడుస్తున్నావ్.. అంటూ అమ్మ దగ్గరకు తీసుకుంది. కలొచ్చి.. భయపడి ఉంటది అని నానమ్మ. అలాగే వెక్కుతూ అమ్మను అతుక్కుపోయాను. దూరం నుంచి తాతయ్య.. గుడ్లురుముతూ! భయం... భయం... భయమంటే ఏంటో తెలిసింది ఆ రోజు నుంచి. ఒంటరిగా ఉండడమంటే చచ్చేంత వణుకొచ్చేది. నాకు తెలియకుండానే ఇంట్లో తాతయ్య నన్ను చేజ్ చేయడం స్టార్ట్ చేశాడు. ఆడుకుంటుంటే వచ్చి వెనక నుంచి పట్టుకునేవాడు. ఆ పట్టుకోవడం ప్రేమతో.. పెద్దవాళ్లకు పిల్లల పట్ల ఉండే వాత్సల్యంలా ఉండేది కాదు. నాకు ఇబ్బందిగా.. అసహ్యంగా.. చిరాగ్గా అనిపించేది. ఎప్పుడు నా ఛాతీ మీద.. వెనక హిప్స్ మీద చేతులు వేయడానికి ప్రయత్నించేవాడు. అందరూ ఉన్నప్పుడు ఆయన ప్రవర్తన ఇంకో రకంగా ఉండేది. ఎప్పటికప్పుడు అమ్మకు చెప్పాలనిపించేది. కానీ తాతయ్య అంటే అందరికీ భయమే. అమ్మ, నాన్నకైతే మరీ భయం. నాన్నకు ప్రైవేట్ జాబ్. శాలరీ తక్కువగా ఉండేది. అందుకే అన్నీ సర్దుకోవాలని నాన్న అమ్మతో చెప్తూ ఉండేవాడు. బహుశా నేను నోర్మూసుకొని భరించడానికీ అదే కారణమేమో. పెద్దమనిషి అయ్యాక.. నైన్త్‌క్లాస్‌లో ఉన్నప్పుడు పెద్దమనిషయ్యా. భోగి రోజు రాత్రి పదకొండు గంటలకు వాకిట్లో ముగ్గులేస్తున్నాం. వంటింటి గూట్లో ఉన్న నీలం రంగు తెమ్మని అత్త పురమాయిస్తే పరిగెత్తుకుంటూ వెళ్లా. రంగు తీసుకొని అదే పరుగుతో వస్తుంటే తాతయ్య నా చెస్ట్ మీద చేయి వేసి ప్రెస్ చేస్తూ ఆపాడు. గట్టిగా అరిచా. తాతయ్యను తోసేస్తే కిందపడ్డాడు. అందరూ పరిగెత్తుకొచ్చారు. తాతయ్య నడుముకి బాగానే దెబ్బ తగిలింది. హాస్పిటలైజ్డ్ అయ్యాడు. తెల్లవారి ఇంట్లో అంతా కలిసి నాకు క్లాస్ తీసుకున్నారు. అప్పుడు ధైర్యంగా చెప్పా. చిన్నప్పటి నుంచి ఆ ముసలాడి వల్ల నేను పడ్డ బాధను. అనుభవించిన భయాన్ని. అమ్మను పట్టుకొని ఏడ్చేశా. ఎవరూ నమ్మలేదు.. అమ్మా, నాన్న తప్ప. నాన్న తాతయ్యను చంపేస్తానని ఆవేశపడ్డాడు. పెద్దనాన్నలు నాన్నను తిట్టారు. నన్ను అసహ్యంగా ఈసడించుకున్నారు. ‘‘అది మదంతో ఉంది. దానికి పెళ్లి చేసేయ్. ఈడొచ్చే దాక కూడా ఆగేట్టు లేదు. ఎవడినైనా ఎత్తుకొని పోతది’’ అని అత్త నన్ను తిట్టింది. భరించలేని అమ్మ అత్తను చెంప పగలగొట్టింది. మమ్మల్ని ఇంట్లోంచి గెంటేశారు. నాన్న వెళ్లిపోయాడు.. మామయ్య వాళ్ల హెల్ప్‌తో ఇంకో ఇల్లు చూసుకొని మా ఫ్యామిలీ విడిగా ఉంది. వన్ ఇయర్ అయ్యేసరికి నాన్న మళ్లీ మా నానమ్మ వాళ్ల దగ్గరకు వెళ్లిపోయాడు. తాతయ్య, పెద్ద నాన్నలు ఏవో చెప్పి నాన్నను మార్చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు నాన్న మా వంక చూడలేదు. అమ్మమ్మ వాళ్ల హెల్ప్‌తోనే చదువుకున్నా. ఇంజనీరింగ్ కంప్లీట్ చేశా. ఇంజనీరింగ్‌లో ఉన్నప్పుడు చాలా మంది అబ్బాయిలు వెంటపడ్డారు. నేను ఎవరి వంకా చూసేదాన్ని కాను. ఈవెన్ మేల్ లెక్చరర్స్ అంటే కూడా భయమేసేది. మా మామయ్యలతో తప్ప పరాయి మగవాళ్లతో మాట్లాడలేదు. ఆ టైమ్‌లోనే ఈ సంబంధం వచ్చింది. అమ్మతో చెప్పి ఏడ్చాను పెళ్లి వద్దు నాకు భయం అని. పెళ్లయితే అన్నీ సర్దుకుంటాయి ఏం కాదు అని నచ్చచెప్పింది అమ్మ. కానీ సర్దుకోలేదు. సరికదా.. భయం ఎక్కువైంది. ఆయన దగ్గరికొచ్చే ప్రయత్నం చేస్తే ముసలాడి బిహేవియర్ గుర్తుకొచ్చి ఫిట్స్ వచ్చినట్టు అయిపోయేది. డాక్టర్ నాకు ఫ్రిజిడిటీ అని తేల్చాక నా హజ్బెండ్ మా అమ్మకు కాల్ చేశాడు వచ్చి మీ అమ్మాయిని తీసుకెళ్లిపోండని. అప్పుడైనా ఆయనకు జరిగింది చెప్పేయాలనిపించింది. కాని చెప్పలేకపోయా. ఇప్పుడు సైకియాట్రి ట్రీట్మెంట్ తీసుకుంటున్నా. ‘‘ఇంకో త్రీ మంత్స్ చూస్తాను. హెల్దీగా వస్తే ఓకే. లేదంటే.. ప్లీజ్ లీవ్మీ. డైవోర్స్ తీసుకుందాం’’ అన్నాడు. ఆ మాటకే నాకేం బాధనిపించలేదు కాని అమ్మే చాలా బాధపడుతోంది. నాకు ఈ పెళ్లి రొమాన్స్ ఏమీ వద్దు. హాయిగా ఉద్యోగం చేసుకొని అమ్మతో ప్రశాంతంగా బతకాలనుంది. అమ్మలేకపోతే ఉండలేను. నా వల్ల కాదు’’ అంటూ రెండు చేతుల్లో మొహం దాచుకుని ఏడుస్తూనే ఉంది చాలాసేపటి దాకా. ఎవరు ఓదార్చాలి? ఆ భయం ఎలా పోగొట్టాలి? కనేదాన్నే కాను.. మా ఇంట్లోనే నా తండ్రి లాంటి వాడే నా బిడ్డను అలా చూస్తాడని ముందే తెలిసుంటే అసలు ఆడపిల్లను కనేదాన్నే కాను. కడుపులోనే చంపేసేదాన్ని అంటూ కన్నీళ్లు పెట్టుకుంది ఆ అమ్మాయి తల్లి. – శరాది -
వన్.. టు.. త్రీ.. గో!
లైఫ్ ఈజ్ ఎ ఛాయిస్! స్వేచ్ఛ ఉంటుంది. నిగూఢంగా.. సంకోచాల మధ్య దాగి ఉంటుంది. సంకోచాలు పొరల్లాంటివి.ఆత్మగౌరవాన్ని, జీవితాన్ని, ధైర్యాన్ని కప్పేస్తాయి! జీవిత బంధం అందమైనదే... నిర్బంధం కానంత వరకు. నిర్బంధం అనిపించనంత వరకు. నిజానికి.. బంధం ఎవరితోనో కాదు.. ముందు మనకు మనతో ఉండాలి. మనల్ని మనం నిర్బంధించుకోకూడదు. అనుమానం, అవమానం, అన్యాయాల నుంచి.. వన్.. టు.. త్రీ.. గో! బాల్యంలో, యవ్వనంలో, వైవాహిక జీవితంలో, వృద్ధాప్యంలో.. ఏ దశలోనూ స్త్రీకి ఛాయిస్ ఉండదు. అమ్మానాన్న చెప్పినట్లో, సమాజం నిర్దేశించినట్లో, భర్త ఆదేశించినట్లో, బిడ్డలు ఆశించినట్లో ఆమె జీవితం ఆమె ప్రమేయం లేకుండా సాగిపోతుంది. ఇష్టాలు, అభిప్రాయాలు, ఆశయాలు, నిర్ణయాలు ఇవేవీ స్త్రీ జీవితంలో ఉండవు. అసలు తను జీవిస్తున్నది తన కోసమే కాదన్నంతగా ఆమె తన చుట్టూ ఉన్న బంధాల నిర్బంధనాలలో.. ముళ్లకంపపై చీరలా పరుచుకుంటుంది. ఎక్కడో కొందరు స్త్రీమూర్తులు మాత్రమే ఆ ముళ్లను విడిపించుకుని బయటికి వచ్చే ధైర్యం చేస్తారు. ‘హర్ఛాయిస్’ పేరుతో బీబీసీ భారతీయ భాషల విభాగం తాజాగా రూపొందించిన పన్నెండు నిజజీవిత కథలు.. అలా ముళ్లను విడిపించుకున్న మహిళలవే! వాటిలోని మూడు కథలివి. మై బిగ్ సీక్రెట్ పశువులా మీద పడటానికి వచ్చిన ప్రతిసారీ నా భర్తకు నేను ఏదో ఒక అబద్ధం చెప్పి తప్పించుకోవాలని చూసేదాన్ని. తలనొప్పి, ఒళ్లు నొప్పులు, అలసట.. ఏదో ఒక అబద్ధం. ‘అయితే నాకేంటి?’ అని మీద పడేవాడు! అలా నా 20వ యేటకే నలుగురు పిల్లల్ని కన్నాను. పనేమీ చేసేవాడు కాదు. తాగొచ్చేవాడు. కొట్టేవాడు. మీద పడేవాడు. అదే పని. అమ్మకు చెబితే, ‘ప్రతి ఇంట్లోనూ ఉండే ముదనష్టమే’ అని బాధపడింది. భర్తను మాత్రం వదిలెయ్యొద్దంది. నేను ఒకరింట్లో పనిచేసేదాన్ని. నా గురించి ఆమెకు తెలుసు. ‘మళ్లీ గర్భం వస్తుందేమోనమ్మా..’ అని తరచూ నేను ఆమె దగ్గర అంటుండేదాన్ని.‘‘నేను చెప్పినట్లు చేస్తావా?’’ అన్నారు ఓరోజు ఆవిడ.. నా బాధను, భయాన్ని చూసి. చేస్తానన్నాను. ఏం చెయ్యాలో చెప్పారు ఆవిడ. ‘‘నా భర్తకు తెలిస్తే చంపేస్తాడేమోనమ్మా’’ అన్నాను. ‘‘నువ్వు చెబితేనే కదా తెలిసేది’’ అన్నారు. ఆవిడ చెప్పిన దాని గురించి చాలారోజులు ఆలోచించాను. నా భర్తకు తెలిస్తే ఏమౌతుంది? ఇంకా తాగుతాడు. ఇంకా కొడతాడు. అప్పటికి అయిపోతుంది. మళ్లీ మళ్లీ పిల్లల్ని కంటూ ఉండే నరకం తప్పుతుంది కదా అనుకున్నాను. ఒక నిర్ణయానికి వచ్చాను. పదేళ్లయింది ఇప్పటికి. నా భర్తకు తెలీదు, నా పిల్లలకూ తెలీదు.. నేను ఆపరేషన్ చేయించుకున్నానని. ఆ రహస్యం నాలోనే ఉండిపోయింది. నా భర్త ఇప్పటికీ తాగొస్తాడు. ఇప్పటికీ మీద పడతాడు. కానీ నాకొక ధీమా. నా ఇష్టానికి వ్యతిరేకంగా ఏమీ జరగదని. నాకొక గర్వం. నా దేహం నా చెప్పుచేతల్లోనే ఉందని. ఓ పెద్ద రహస్యాన్ని నేను కడుపులో మోస్తున్నాను. ఆ రహస్యానికి నేనెప్పటికీ జన్మనివ్వను. బార్న్ అగైన్ అది మా ఫస్ట్‌నైట్. నా వయసు 35 ఏళ్లు. నేను కన్యను. అయితే ఆ ఫస్ట్‌నైట్ తర్వాత కూడా కన్యగానే ఉండబోతున్నానని నాకు తెలియదు. గదిలోకి వెళ్లాను. నా భర్త నన్ను గట్టిగా కౌగిలించుకుంటాడని, నాపై ముద్దులు కురిపిస్తాడని ఎదురుచూస్తున్నాను. అటు తిరిగి పడుకున్నాడు! నిద్రపోయాడు! అయితే అది వచ్చిన నిద్ర కాదని, తెప్పించుకుంటున్న నిద్ర అని కొన్నాళ్ల తర్వాత నాకు తెలిసింది. ఫస్ట్‌నైట్ తెల్లారే అడిగాను. ఒంట్లో బాగోలేదన్నాడు. రెండో రాత్రి, మూడో రాత్రి, ఆ తర్వాతి రాత్రులన్నిట్లో అతడికి ఒంట్లో బాగోలేదు. సెక్స్ ఒక్కటే నా సమస్య కాదు. కనీసం అతడు నన్ను టచ్ చెయ్యడం లేదు! మాట్లాడ్డం లేదు. నా అనుమానం నిజమైంది. ఆ నిజాన్ని మా అత్తమామలు దాచిపెట్టి నా గొంతు కోసారు. దుఃఖం వేసింది. గది తలుపులు వేసుకుని బోరున ఏడ్చారు. మావాళ్ల దగ్గర కూడా. ‘‘ఊర్కో. ఏమీ జరగనట్లే ఉండు. నీ కర్మింతే అని సరిపెట్టుకో’’ అని సలహా ఇచ్చారు. నేను సరిపెట్టుకోలేక పోయాను. అర్థంలేని రిలేషన్ అది. మెడలో తాళి ఉన్నా, మదిలో మొగుడు లేని రిలేషన్ అది. పిచ్చి రిలేషన్. అతడిని వదిలేయాలని నిర్ణయించుకున్నాను. భర్తని వదిలేస్తే తప్పు ఈ సమాజంలో. కానీ అతడు భర్తకూడా కాదే! వదిలేయొచ్చు. అమ్మకీ, నాన్నకీ చెప్పాను. ‘‘భర్తకు విడాకులిస్తే, నిన్ను ఇంటి గడప కూడా తొక్కనివ్వం’’ అన్నారు అమ్మానాన్న!నాకిక ఏ గడపా అక్కర్లేదనుకున్నాను. మెట్టినింటికి, పుట్టింటికి దూరంగా వచ్చేశాను. ఫ్రెండ్స్ హెల్ప్ చేశారు. ఉమెన్స్ హాస్టల్లో చేరాను. ఉద్యోగం వెతుక్కున్నాను. విడాకులకు ఫైల్ చేశాను. నా భర్త, అత్తమామలు నన్ను దూషించారు. పరాయి పురుషులతో సంబంధాలను అంటగట్టారు. నేనేం బాధపడలేదు.ఇంపొటెంట్ భర్తతో ఏ సంబంధమూ లేకుండా ఒకే ఇంట్లో ఉండటం అంతకంటే పెద్ద బాధ. విడాకులు రావడానికి మూడేళ్లు పట్టింది. విడాకుల పత్రాలు చేతికి వచ్చినప్పుడు నేను మా అమ్మ కడుపులోంచి మళ్లీ పుట్టినట్లు అనిపించింది. ఫ్రెష్‌గా. ఎవ్రీథింగ్ విల్బి ఆల్రైట్ ముస్తఫాతో నేను ప్రేమలో పడినప్పుడు ముస్తఫాది ఏ దేశమో, ముస్తఫాది ఏ మతమో, ముస్తఫాది ఏ కులమో నేను చూసుకోలేదు. ప్రేమించానంతే. నేను క్రిస్టియన్ని. నార్త్ ఈస్ట్‌లో మాది చిన్న ఊరు. ముస్తఫా ముస్లిం. ఆఫ్రికన్. ఇద్దరం కలిసున్నాం. అయితే కొన్నాళ్లే! మమ్మల్ని కలిపి ఉంచగల ఏ సామాజిక శక్తీ మాకోసం రాలేకపోయింది. అడ్డు మరి. కులం అడ్డు. మతం అడ్డు. దేశం అడ్డు. మా సహజీవనం తెగిపోయేనాటికి నాకు 21 ఏళ్లు. నా కడుపులో అతడి బిడ్డ. ‘తీయించుకో’ ఫ్రెండ్స్ సలహా ఇచ్చారు. ‘ఉంచుకుంటాను’ అన్నాను. ‘ఎందుకా దరిద్రం!’ అన్నట్లు చూశారు. అంతకన్నా బాధించే మాట.. ముస్తఫా అన్నాడు! ‘నీ లోపల ఉన్నది నా బిడ్డే అని నమ్మకం ఏంటి? అని. ఆ క్షణమే అతడితో విడిపోయి వచ్చేశాను. కూతురు జీవితం ఇలా అయిపోయిందేమిటని నా తల్లిదండ్రులు బాధపడలేదు. ఈ భూమ్మీదకి తమది కాని వారసత్వాన్ని ఎక్కడ మోసుకొస్తానోనని భయపడ్డారు. కూతురికి నల్లటి ఆఫ్రికా శిశువు పుట్టబోతున్నాడంటేనే వాళ్లకు కంపరంగా ఉంది. కుటుంబ సభ్యులు, బంధువులు నన్ను వెలివేశారు. నేను, నాకు పుట్టబోయే బిడ్డ.. ఇద్దరమే ఒకరికొకరం తోడుగా ఈ మనుషుల మధ్య నిలబడిపోయాం. చేరదీసేవారు లేరు. గ్లాసు నీళ్లతో సేదతీర్చేవారూ లేరు. నాకొక మంచి ఉద్యోగం కూడా లేదు. ఒక్క ఫ్రెండు మాత్రం మిగిలింది. ‘జాగ్రత్తే’ అంది. తన మీద తలవాల్చి ఏడ్చేశాను. నొప్పులొచ్చే వరకు ఆ ఫ్రెండే నాకు తల్లి అయింది. దగ్గరుండి ఆసుపత్రికి తీసుకెళ్లింది. మగ బిడ్డ పుట్టాడు. వాణ్ణి చూడగానే నా మనసు తేలికయింది. ఇప్పుడు నా వయసు 29 ఏళ్లు. నా బిడ్డ వయసు ఆరేళ్లు. ఈ ఆరేళ్లు నేను లోకానికి ఎదురీదాను. బలంగా తయారయ్యాను. నా బిడ్డకు బలాన్ని ఇవ్వాలంటే ఈ మాత్రం బలం నాకు ఉండాలి కదా. త్రీ స్టోరీస్: దివ్య ఆర్య, ఐశ్వర్య రవిశంకర్, సింధువాణి త్రిపాఠీ. / ఇలస్ట్రేషన్స్ : గోపాల్ శూన్య -
ఆత్మబంధువు
ట్రింగ్గ్గ్... పక్కనే పెట్టుకున్న అలారం సరిగ్గా అయిదు గంటలకు మోగింది. ఆ శబ్దం వినిపించగానే టక్కున నాలుగు కళ్లు తెరుచుకున్నాయి. రెండు అంజన్నవి.. మిగతా రెండు తన అర్ధాంగి లక్ష్మివి. అర్ధాంగి అంటే అర్థం సగ భాగం. కానీ లక్ష్మమ్మ అంజన్నలో సగం కాదు మూడొంతులనే చెప్పాలి. ముప్పై ఐదేళ్ల తమ దాంపత్య జీవితంలో వారిద్దరూ ఇప్పటి వరకూ ఒకర్ని విడిచి మరొకరు ఉండలేదు. ఏ కష్టమొచ్చినా, నష్టమొచ్చినా ఇద్దరూ కలిసే పంచుకున్నారు. ఉన్నదాంట్లోనే సంతోషంగా జీవించారు. అనుకోకుండా ఇప్పుడు వారిద్దరినీ ఓ కష్టం ప్రేమగా పలకరించింది! రోజులాగే ఆ రోజు కూడా అలారం పెట్టుకొని ఉదయాన్నే లేచారిద్దరూ. రోజూలాగే ఆ రోజూ వాకింగ్‌కు బయలుదేరారు. ఇంటి గేటు దగ్గర మొదలైన సంభాషణ.. వాకింగ్ చేస్తున్న గంటసేపు సాగుతూనే ఉంది. ‘‘నాకెందుకో చాలా బాధేస్తోంది. ఇన్నేళ్లూ అది మన కష్టాలు తీర్చింది. ఇప్పటి వరకు వేళకింత తిండి దొరుకుతోందంటే దానివల్లే. పదహారేళ్లుగా మన సంతోషాలను, బాధలను చూసిందది. రేపటి నుంచి అది మన ఇంట్లో ఉండదని తలుచుకుంటేనే గుండె పగిలిపోతోంది’’ అంటూ భర్తతో చెప్పుకుంటూ కళ్లు తుడుచుకుంటోంది లక్ష్మి. భార్య కళ్లల్లో నీటిని చూడగానే.. అంజన్న కళ్లల్లోనూ నీళ్లు తిరిగాయి. ఒక్కసారిగా కూలబడ్డాడు. కంగారుతో లక్ష్మమ్మకు కాళ్లూ చేతులు వణికాయి. భర్తను మెల్లిగా లేపి పక్కనున్న ఓ అరుగుపై కూర్చోబెట్టింది. రెండు నిమిషాల్లో ఇద్దరూ సంబాళించుకొని, పది నిమిషాల్లో ఇల్లు చేరుకున్నారు. గోడకున్న పెద్ద గడియారంలో టైం పదవుతోంది.. దంపతులు ఇద్దరూ మౌనంగా ఉన్నారు. సమయం గడుస్తోంది. అప్పుడో పిలుపు గేటు దగ్గర నుంచి వినిపించింది... ‘‘అంజన్నా.. పోదామా.. టైం అయింది..!’’. ఆ పిలుపుతో ఇద్దరూ ఒక్కసారిగా హడలిపోయారు. ఒకరి ముఖాన్ని ఇంకొకరు చూసుకున్నారు. ఆ చూపుల్లో ‘అంతా అయిపోయింది’ అన్న అర్థం ధ్వనిస్తోంది. రోజూ దేవుడికి దీపం పెట్టగానే, గ్లాసు పాలు తాగి, వేడివేడి అన్నం తిని బయలుదేరే అంజన్నకు ఆ రోజు ఏమీ సహించలేదు. పరగడుపునే గుండె నిండా బాధతో, కన్నీళ్లను దాచుకుంటూ.. చూపులతోనే వెళ్తున్నానని భార్యకు చెప్పి బయలుదేరాడు. ఏడ్చి.. ఏడ్చి.. దిగాలుగా కూర్చున్న లక్ష్మమ్మకు... ‘మమ్మీ.. మమ్మీ’ అన్న పిలుపు వినిపించడంతో వెంటనే తలుపు దగ్గరకు వచ్చి నిల్చుంది. ‘‘మమ్మీ..! డాడీ వెళ్లాడా.. అసలు అలా గ్యారేజీకి పంపకుండా, మన ఆటోను ఊరికేనైనా ఇంట్లో ఉంచుకోవాల్సిందేమో’’ అంది. ఆ అమ్మాయికీ దుఃఖం ఆగట్లేదు. ఆటో రేపటి నుంచి ఇంట్లో కనిపించదంటేనే తనకు బాధగా ఉంది. తను, తమ్ముడు చిన్నప్పటి నుంచి ఎక్కడికైనా అందులోనే తిరిగారు. తమ చిన్నతనమంతా అది చూసింది. ఎంత దూరం నుంచి డాడీ ఆటో వస్తున్నా.. అది మన ఆటోనే అని గుర్తు పట్టే వాళ్లు. హారన్ సౌండ్ వినిపిస్తే చాలు, డాడీ వస్తున్నాడని తెలుసుకునేవాళ్లు. అవన్నీ తలచుకుంటూనే తమాయించుకుంది. ‘‘మమ్మీ.. మనకే ఇలా ఉంటే, పాపం ఇరవై నాలుగు గంటలూ దానిపైనే తిరిగిన డాడీకి ఇంకెంత బాధగా ఉందో కదా’’ అంది. ‘‘అవునమ్మా.. ! నేనూ అదే ఆలోచిస్తున్నా.. ఆ ఆటో ఆయనలో ఒక భాగమైపోయింది. మనలో ఒక మనిషిగా మారిపోయింది. దానిపై వచ్చిన పైసలతోనే ఈ సంసారాన్ని ఇన్నాళ్లూ వెళ్లదీశాం. నిన్ను చదివించి, పెళ్లి చేశాం.. చిన్నోణ్ని చదివించాం. అదంతా మన ఆటో చలవే. మీ చదువులకు, పెళ్లికి అయిన అప్పును కూడా దాని మీదే తీర్చాం. ఇప్పుడది బాగా మొరాయిస్తోందని అమ్ముతున్నాం కానీ నాకూ, డాడీకి అసలు ఇష్టం లేదమ్మా. దాన్ని గ్యారేజీలో ముక్కలు ముక్కలుగా విడదీస్తారంటేనే నాకు బాధగా ఉంది. పేరుకు ఆటోనే కానీ, అది మన ఇంట్లోని మనిషే. ఏనాడూ యాక్సిడెంట్ జరగకుండా మనల్ని కాపాడింది. ఇప్పుడు అరవై వేల కోసం దాన్ని అమ్ముతున్నందుకు గుండె పగిలిపోతోంది. కానీ ఆ పైసలకు కష్టంగా ఉండబట్టి అమ్ముతున్నాం. అది అమ్మకుండా కొత్త ఆటోను కొనాలంటే అంత డబ్బు లేకపాయే. ఆ డబ్బే ఉంటే, దాన్ని మన పెరట్లో ఓ జ్ఞాపకంలా ఉంచుకొని, అపురూపంగా చూసుకునే వాళ్లం’’ అంటున్న తల్లికి మంచినీళ్లు అందించింది కూతురు. - నిఖిత నెల్లుట్ల -
యాండ్రాలజీ కౌన్సెలింగ్
యాక్సిడెంట్లో జననాంగాలకు దెబ్బలు... దాంపత్య జీవితానికి విఘాతమా? నా వయసు 26 ఏళ్లు. ఇటీవల ఒక యాక్సిడెంట్లో తీవ్రంగా గాయపడ్డాను. ఆ సమయంలో జననాంగాల వద్ద దెబ్బ బలంగా తగిలింది. రెండు వృషణాలకూ, పురుషాంగానికి దెబ్బలు తగిలాయి. పురుషాంగం నుంచి రక్తస్రావం కూడా అయ్యింది. దాంతో మూత్రవిసర్జన కూడా చేయలేకపోయాను. డాక్టర్లు బొడ్డు వద్ద పైప్ వేసి మూత్రాన్ని బయటకు తీశారు. మూత్రనాళం డ్యామేజ్ కావడం వల్ల సర్జరీ అవసరమని చెబుతున్నారు. ఈ దెబ్బల వల్ల భవిష్యత్తులో నాకు సెక్స్ పవర్ పోతుందా? నేను నార్మల్‌గా సెక్స్ చేయగలుగుతానో లేదో అని నాకు చాలా ఆందోళనగా ఉంది. తగిన సలహా ఇవ్వండి. - ఆర్.కె.ఆర్. రాజమండ్రి మూత్రనాళం దెబ్బతినడాన్ని యురెథ్రల్ ఇంజ్యూరీ అంటారు. మూత్రనాళం ఏమేరకు దెబ్బతిన్నది అన్న విషయాన్ని ‘రెట్రోగ్రేడ్ యురెథ్రోగ్రామ్’ అనే పరీక్షతో నిర్ధారణ చేస్తారు. ఒకవేళ మూత్రనాళం పూర్తిగా దెబ్బతింటే యాక్సిడెంట్ అయిన ఆరువారాల తర్వాత ఆపరేషన్ చేసి మూత్రనాళాన్ని మళ్లీ పునరుద్ధరిస్తారు. ఈ సర్జికల్ ప్రక్రియను యురెథ్రోప్లాస్టీ అంటారు. మీకు అంగస్తంభన లోపం రావడం అన్నది మీకు తగిలిన దెబ్బ వల్లగానీ, లేదా సర్జరీ వల్లగానీ సంభవించడం చాలా అరుదు. కాబట్టి మీరు నిశ్చింతగా ఆపరేషన్ చేయించుకోండి. ఆశావహ దృక్పథంతో ఉండండి. నాకు 45 ఏళ్లు. సెక్స్ చేయడంలో సమస్య లేదు. కాకపోతే ఈమధ్య పురుషాంగం మీద ఉన్న చర్మం చివరిభాగం ఒరుసుకుపోయి, చిన్న చిన్న పగుళ్లు ఏర్పడుతున్నాయి. దీనివల్ల చర్మం ఫ్రీగా వెనక్కు రావడం లేదు. దాంతో సెక్స్ సమయంలో నొప్పిగా ఉంది. మూత్రం మాత్రం సాఫీగానే వస్తోంది. ఇలా తరచూ జరుగుతోంది. తగిన సలహా ఇవ్వండి. - జీ.డి.ఆర్.ఎమ్., ఉయ్యూరు పురుషాంగం చివరి భాగంలో ఉన్న చర్మం ఇలా ఒరుసుకుపోతూ ఉంటే మొదట రక్తంలో చక్కెర పాళ్లను తెలుసుకోవాలి. మీరు చెబుతున్న లక్షణానికి... షుగర్, మీ భాగస్వామికి ఇన్ఫెక్షన్ ఉండటం, లేదా మీకు అనేక మందితో సెక్స్ సంబంధాలు ఉండటం, మీరు వ్యక్తిగత పరిశుభ్రత సరిగా పాటించకపోవడం వంటివి ప్రధానమైన కారణాలు. ఒకవేళ మీకు షుగర్ ఉన్నట్లుగా రిపోర్టు వస్తే చక్కెర నియంత్రణ కోసం అవసరమైన మందులు వాడుతూ, రక్తంలో చక్కెర పాళ్లు ఎప్పుడూ నియంత్రణలో ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. మీ భాగస్వామి, మీరు ఒకసారి పరీక్ష చేయించుకొని స్థానికంగా ఏవైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నాయేమో తెలుసుకొని తగిన యాంటీబయాటిక్స్, యాంటీ ఫంగల్ మందులు వాడండి. మీ లక్షణాలు తగ్గిన తర్వాత సున్తీ చేయించుకుంటే ఈ సమస్య మళ్లీ మళ్లీ రాకుండా ఉంటుంది. మీరు ఒకసారి మీకు దగ్గర్లోని యూరాలజిస్ట్‌ను సంప్రదించండి. డాక్టర్ వి. చంద్రమోహన్ యూరో సర్జన్ అండ్ యాండ్రాలజిస్ట్, ప్రీతి యూరాలజీ అండ్ కిడ్నీ హాస్పిటల్, కెపిహెచ్బి, హైదరాబాద్