కొత్త బిల్లుతో అన్నదాతకు మేలు
యలమంచిలి, న్యూస్‌లైన్: బలవంతపు భూ సేకరణ కు కళ్లెం పడింది. పరిశ్రమల కోసం ఇంతకాలం ప్రభుత్వం, ఏపీఐఐసీలు అడ్డగోలుగా తక్కువ ధరకు భూములను రైతుల నుంచి సేకరించేవి. ఇందుకు నిరాకరించే అన్నదాతలపై ప్రభుత్వం కక్ష సాధింపునకు పాల్పడేది. లోక్‌సభ ఆమోదం పొందిన భూసేకరణ, పునరావాసం, పరిహారం-2012 బిల్లు ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లో భూములకు మార్కెట్ ధర కంటే నాలుగు రెట్లు, పట్టణప్రాంతాల్లో భూములకు మార్కె ట్ ధరకు రెట్టింపు పరిహారం చెల్లించవలసి ఉంది.
రైతుల నుంచి సేకరించిన భూమిని అధిక ధర కు విక్రయిస్తే వచ్చే లాభంలో 40 శాతాన్ని భూమి యజమానికి చెల్లించాలన్న నిబంధనతో రైతులకు మేలు చేకూరుతుంది. ప్రాజెక్టులు, శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగులు ఉన్నారు. వీరందరూ ప్రతి నెలా 23వ తేదీలోగా జీతాల బిల్లులను ఖజానా శాఖకు సమర్పించాల్సి ఉంటుంది. అయితే ఉద్యోగులందరూ విధులను బహిష్కరించడంతో ఖజానాకు బిల్లులు సమర్పించలేదు. దీంతో జీతాలు ఆగిపోయాయి. ఖజానా శాఖ నుంచి ప్రతీ నెలా జీతాలు, పెన్షన్లు కలిపి మొత్తం రూ.135 కోట్లు చెల్లింపులు జరుగుతుంటాయి.
సమైక్యాంధ్ర కోసం..
రాష్ట్ర విభజనపై యూపీఏ నిర్ణయాన్ని ప్రకటించిన వెంటనే ఏపీఎన్జీవో సంఘం సమ్మెకు పిలుపునిచ్చింది. దీంతో అన్ని ప్రభుత్వ ఉద్యోగుల సంఘాలు సమ్మె బాట పట్టాయి. ఆగస్టు 12 అర్ధరాత్రి నుంచి విధులను బహిష్కరించాయి. అన్ని ప్రభుత్వ శాఖలతో పాటు ఖజానా ఉద్యోగులు కూడా ఆందోళనలు చేస్తున్నారు. అన్ని శాఖల్లోను ఉన్నతాధికారుల నుంచి కింది స్థాయి వరకు సమ్మెలో ఉండడంతో ఉద్యోగుల జీతాల బిల్లులను తయారు చేసేవారు లేకుండా పోయారు. అలాగే ఉద్యోగులు కూడా తమ జీతాలు రావన్న విషయం తెలిసినప్పటికీ గడువు తేదీ ముగిసినప్పటికీ ఖజానా శాఖకు జీతాల బిల్లులు సమర్పించలేదు. వీరితో పాటు ఖజానా ఉద్యోగులు ఆందోళనలు చేస్తుండడంతో పెన్షనర్లకు కూడా పింఛన్లు రావడం లేదు. జిల్లాలో సుమారుగా 18 వేల మంది పింఛన్‌దారులు ఉన్నారు. వీరందరికీ ప్రతీ నెలా ఒకటినే పెన్షన్ వస్తుంటుంది. కానీ ఈనెల ఒకటిన మాత్రం రావడం లేదు.
నాలుగు శాఖలకు అనామతు ఖాతాతో చెల్లింపు
పోలీస్, జైలు, కోర్టు, ఫైర్ శాఖ ఉద్యోగులకు మాత్రం అనామతు ఖాతా ద్వారా జీతాలను చెల్లించాలని ప్రభుత్వం ఆదేశించింది. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే ఈ ఖాతా ద్వారా చెల్లింపులు చేస్తుంటారు. ప్రస్తుతం ఈ నాలుగు శాఖల ఉద్యోగులు మినహా మిగిలిన వారందరూ సమైక్యాంధ్ర ఉద్యమంలో పాల్గొంటున్నారు.