market rally
-
సెన్సెక్స్ రోలర్ కోస్టర్
ఎగ్జిట్ పోల్స్ అంచనాలన్నింటినీ తలకిందులు చేస్తూ ఎన్నికల ఫలితాలు బీజేపీ, ఎన్డీయే కూటమిని బిత్తరపోయేలా చేశాయి. అయితే, మిత్రపక్షాల దన్నుతో మళ్లీ సుస్థిర ఎన్డీయే సర్కారు కొలువుదీరడంతో మార్కెట్ వర్గాలు ఊపిరిపీల్చుకున్నాయి. ఫలితాల రోజున నష్టాలన్నింటినీ మూడు రోజుల్లోనే ఎగిరిపోయాయి. వృద్ధికి ఊతమిచ్చేలా 100 రోజుల అజెండాను ప్రకటించిన మోదీ ‘హ్యాట్రిక్’ ప్రభుత్వ చర్యలు ఇన్వెస్టర్లలో మళ్లీ ఉత్సాహా న్ని నింపాయి. విదేశీ ఇన్వెస్టర్లు అమ్మకాల బాటను వీడి మళ్లీ కొనుగోళ్ల రూట్లోకి రావడం కూడా మార్కెట్‌కు మరింతి ఇం‘ధనాన్ని’ అందించింది. రాబోయే కాలంలో మౌలిక రంగ ప్రాజెక్టులపై మోదీ సర్కారు భారీగా ఖర్చు చేయనుండటం, బడ్జెట్లో వృద్ధికి ఊతమిచ్చేలా పలు చర్యలు ఉంటాయన్న అంచనాలతో మార్కెట్లో ర్యాలీ కొనసాగుతోంది. తాజాగా 80,000 పాయింట్ల శిఖరాన్ని కూడా దాటేయడం దీనికి నిదర్శనం. కాగా, ఈ ఏడాది చివరికల్లా సెన్సెక్స్ 90,000 పాయింట్లను తాకే అవకాశాలు మెండుగా ఉన్నా యని సుందరం మ్యూచువల్ ఫండ్ మాజీ ఎండీ సునీల్ సుబ్రమణ్యం అంచనా వేయడం విశేషం. దీనికి ప్రధానంగా లార్జ్ క్యాప్ షేర్ల ర్యాలీ దన్ను గా నిలుస్తుందని కూడా ఆయన చెబుతున్నారు. కాగా, ఇన్వెస్టర్ల సంపద గత నెల రోజుల్లోనే రూ. 50 లక్షల కోట్లు దూసుకెళ్లింది. జూన్ 4నరూ.395 లక్షల కోట్లుగా ఉన్న బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మొత్తం మార్కెట్ విలువ జూలై 3న రూ.445.5 లక్షల కోట్లకు ఎగబాకడం గమనార్హం!జూన్ 4: ఎన్డీయేకు బంపర్ మెజారిటీ ఖాయమన్న ఎగ్జిట్ పోల్స్ అంచనాలతో ముందు రోజు 2,500 పాయింట్ల ర్యాలీ చేసి మార్కెట్ ఫుల్ జోష్ మీదుంది. అయితే, తెల్లారేసరికి అంచనాలు తారుమారయ్యాయి. మార్కెట్‌కు ఎన్నికల ఫలితాల ట్రెండ్ ఊహించన్ని షాకిచి్చంది. బీజేపీకి సొంతంగా మ్యాజిక్ ఫిగర్ కష్టమేనని తేలిపోవడంతో దేశీ స్టాక్ మార్కెట్‌పై అమ్మకాల సునామీ విరుచుకుపడింది. ఇంట్రాడేలో సెన్సెక్స్ దాదాపు 6,234 పాయింట్లు దిగజారి ఏకంగా 70,234 పాయింట్లకు కుప్పకూలింది. చివరికి 4,390 పాయింట్ల భారీ నష్టంతో 72,079 వద్ద ముగిసింది.కట్ చేస్తే... జూలై 3: ఎన్నికల ఫలితాలతో బుర్రతిరిగిన బుల్.. మళ్లీ రంకెలేస్తూ దూసుకుపోయింది. సరిగ్గా నెల రోజుల వ్యవధిలో (ఫలితాల రోజు కనిష్ట స్థాయితో పోలిస్తే) దాదాపు 10,000 పాయింట్ల ర్యాలీతో దుమ్మురేపింది. చరిత్రలో తొలిసారి 80,000 పాయింట్ల మైలురాయిని అధిగమించింది. రోజుకో సరికొత్త రికార్డులతో హోరెత్తిస్తోంది. – సాక్షి, బిజినెస్ డెస్క్ -
రికార్డుల ర్యాలీ కొనసాగొచ్చు
ముంబై: స్టాక్ సూచీల రికార్డుల ర్యాలీ ఈ వారమూ కొనసాగొచ్చని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. కీలక స్థూల ఆర్థిక గణాంకాలు, ప్రపంచ మార్కెట్ల కదలికలకు అనుగుణంగా ట్రేడింగ్ ఉండొచ్చంటున్నారు. హెచ్డీఎఫ్సీ వీలినం, గిఫ్ట్‌నిఫ్టీ ఇండెక్స్ కార్యకలాపాల ప్రారంభం(సోమవారం) అంశాలు కీలకం కానున్నాయి. వీటితో విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు, డాలర్ ఇండెక్స్, రూపాయి విలువ, క్రూడాయిల్ ధరల కదలికలను మార్కెట్ వర్గాలు క్షుణ్ణంగా పరిశీలించవచ్చు. గతవారంలో సెన్సెక్స్ 1,739 పాయింట్లు, నిఫ్టీ 524 చొప్పున లాభపడ్డాయి. దేశవ్యాప్తంగా వర్షపాత నమోదు, ప్రోత్సాహకర ప్రపంచ పరిణామాలు, విదేశీ ఇన్వెస్టర్లు కొనుగోళ్లు, హెచ్డీఫ్సీ–హెచ్డీఫ్సీ బ్యాంక్ విలీనం నుంచి సానుకూల అప్డేట్ అంశాల నేపథ్యంలో గతవారం సూచీలు కొత్త జీవితకాల గరిష్టాలను నమోదు చేశాయి. ‘‘ఈక్విటీ మార్కెట్లలో ప్రస్తుత నెలకొని ఉన్న సానుకూల పరిమాణాల దృష్ట్యా సూచీలు స్వల్పకాలం పాటు ముందుకే కదిలే అవకాశం ఉంది. సాంకేతికంగా నిఫ్టీ ఎగువన 19250–19500 స్థాయిని పరీక్షించాల్సి ఉంటుంది. ప్రతికూల పరిస్థితులు ఏర్పడితే ఇన్వెస్టర్లు రికార్డు స్థాయిల వద్ద లాభాల స్వీకరణకు పాల్పడే వీలుంది. దిగువ స్థాయిలో 19000 వద్ద బలమైన తక్షణ మద్దతును కలిగి ఉంది. స్థూల ఆర్థిక గణాంకాలు ముందుగా మార్కెట్ శనివారం విడుదలైన ఆటో కంపెనీల జూన్ వాహన విక్రయ గణాంకాలకు స్పందించాల్సి ఉంటుంది. ఇవాళ భారత, అమెరికా దేశాల జూన్ తయారీ రంగ పీఎంఐ డేటా విడుదల కానుంది. దేశీయ సేవారంగ పీఎంఐ, అమెరికా మే ఫ్యాక్టరీ ఆర్డర్లు డేటా ఎల్లుండి(బుధవారం) వెల్లడి కానుంది. యూరోజోన్, యూకే దేశాలూ ఇదే వారంలో తయారీ, సేవారంగ డేటాలను విడుదల చేయనున్నాయి. శుక్రవారం జూన్ చివరి వారంతో ముగిసిన ఫారెక్స్ నిల్వల డేటా, జూన్ 18న ముగిసిన డిపాజిట్– బ్యాంక్ రుణ వృద్ధి డేటాను వెల్లడించనుంది. ఆయా దేశాల ఆర్థిక వ్యవస్థ స్థితిగతులను ప్రతిబింబించేసే ఈ స్థూల గణాంకాలను మార్కెట్ ట్రేడింగ్‌పై ప్రభావం చూపగలవు. విదేశీ ఇన్వెస్టర్ల కొనుగోళ్లు భారత ఈక్విటీలను కొనేందుకు విదేశీ ఇన్వెస్టర్లు ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ జూన్‌లో మొత్తం రూ. 47,148 కోట్ల షేర్లను కొన్నారు. దేశీయ మార్కెట్లోకి విదేశీ పెట్టుబడులు వెల్లువెత్తడంతో స్టాక్ సూచీలు రికార్డు స్థాయిని చేరుకోగలిగాయి. ‘‘భారత ఈక్విటీ మార్కెట్‌పై ఎఫ్ఐఐలు తమ వ్యూహాన్ని మార్చుకున్నారు. కోవిడ్ అనంతరం చైనా ఆర్థిక వ్యవస్థ పునఃప్రారంభం నేపథ్యంలో ఈ ఏడాది తొలి రెండు నెలలు భారత్‌లో విక్రయించి, చైనాలో కొనుగోలు చేశారు. అయితే ఇటీవల భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి బాటలో పయనిస్తుందనేందుకు సూచికగా వెలువడి ఆర్థిక డేటాతో విదేశీ ఇన్వెస్టర్లు దేశీయ మార్కెట్లో పెట్టుబడులు పెడుతున్నారు’’ అని వీకే విజయ్ కుమార్ జియోజిత్ ఫైనాన్సియల్ సర్వీసెస్ ఇన్వెస్ట్మెంట్ వ్యూహకర్త వీకే విజయ్ కుమార్ తెలిపారు. -
30 రోజుల్లో 100 శాతం లాభాలు
ముంబై, సాక్షి: కోవిడ్-19 సంక్షోభం నుంచి దేశ ఆర్థిక వ్యవస్థ రికవరీ బాట పట్టిన నేపథ్యంలో దేశీ స్టాక్ మార్కెట్లు సరికొత్త రికార్డులను సాధిస్తున్నాయి. కొద్ది రోజులుగా ర్యాలీ బాటలో సాగుతున్నాయి. దీంతో ఇన్వెస్టర్లు పలు మిడ్, స్మాల్ క్యాప్ కౌంటర్లవైపు దృష్టిసారించారు. వెరసి పలు కౌంటర్లు గత నెల రోజుల్లోనే 100 శాతానికిపైగా లాభపడ్డాయి. గత 30 రోజుల్లో 29 కంపెనీలు రెట్టింపునకుపైగా ఎగశాయి. ఇదే సమయంలో సెన్సెక్స్ 6 శాతమే లాభపడటం గమనార్హం! ఇటీవల దూకుడు చూపుతున్న కంపెనీల జాబితాలో జెట్ ఎయిర్వేస్, వక్రంగీ, డైనకాన్స్ సిస్టమ్స్, గోల్డెన్ టొబాకో, ఆర్కిడ్ ఫార్మా, బాఫ్నా ఫార్మా, ఆర్వీ డెనిమ్స్ తదితరాలు చోటు సాధించాయి. వివరాలు చూద్దాం.. (కోవిడ్-19లోనూ దిగ్గజాల దూకుడు) జోరుగా హుషారుగా మురారీ లాల్ జలాన్, కల్రాక్ క్యాపిటల్ కన్సార్షియం ద్వారా తిరిగి రెక్కలొచ్చిన జెట్ ఎయిర్వేస్ కౌంటర్ వరుసగా 8వ రోజు అప్పర్ సర్క్యూట్‌ను తాకింది. రూ. 105.35 వద్ద 52 వారాల గరిష్టానికి చేరింది. కొత్త ఏడాది(2021)లో దేశ, విదేశాలకు సర్వీసులను పునరుద్ధరించే ప్రణాళికల్లో ఉంది. మెట్రో నగరాలతో యూరోపియన్ దేశాలకు సర్వీసులను ప్రారంభించనుంది. దీంతో ఈ కౌంటర్ జోరందుకోగా.. గోల్డెన్ టొబాకో షేరు 20 శాతం అప్పర్ సర్క్యూట్‌కు చేరింది. గత మూడు రోజుల్లోనే 60 శాతం దూసుకెళ్లింది. తాజాగా రూ. 50.55 వద్ద నిలిచింది. ఇది ఏడాది గరిష్టంకాగా.. ముంబైలోని విలే పార్లే ప్రాపర్టీని ఎక్సైజ్ శాఖ అటాచ్ చేసింది. అయితే ఈ సమస్యనుంచి బయటపడగలమని యాజమాన్యం భావిస్తోంది. అంతేకాకుండా గుంటూరులో గల ప్రాపర్టీని సైతం అభివృద్ధి చేసే యోచనలో ఉన్నట్లు తెలియజేసింది. (జూబిలెంట్ నుంచి బిర్యానీ- దివీస్ కొత్త రికార్డ్) ఇతర కౌంటర్లూ ఫార్మా కంపెనీ సువెన్ లైఫ్ సైన్సెస్ నాలుగో రోజూ 5 శాతం అప్పర్ సర్క్యూట్‌ను తాకింది. రూ. 105.20 వద్ద ఫ్రీజయ్యింది. గత మూడు రోజుల్లో 10 శాతం చొప్పున జంప్‌చేసింది. గత నెల రోజుల్లో ఈ షేరు 124 శాతం ర్యాలీ చేసింది. కాగా.. డైనకాన్స్ సిస్టమ్స్ తొలుత 10 శాతం అప్పర్ సర్క్యూట్‌కు చేరింది. రూ. 85.50 వద్ద ఏడాది గరిష్టాన్ని తాకింది. ఆపై తిరిగి 10 శాతం లోయర్ సర్క్యూట్‌కు చేరి రూ. 70 వద్ద ముగిసింది. ఈ ఐటీ కన్సల్టింగ్ కంపెనీ షేరు గత వారం రోజుల్లోనే 88 శాతం పురోగమించింది. పీఎస్‌యూ సంస్థ యూబీఐ నుంచి రూ. 24.5 కోట్ల విలువైన కాంట్రాక్టును పొందినట్లు డైనకాన్స్ మంగళవారం ప్రకటించింది. నెల రోజుల తీరు స్మాల్ క్యాప్ కౌంటర్లలో ప్రధానంగా ఆర్కిడ్ ఫార్మా, బాఫ్నా ఫార్మా, రాజ్ ఆయిల్, జిందాల్ ఫొటో, గోల్డెన్ టొబాకో, ట్రాన్స్ఫార్మర్స్(ట్రిల్), సువెన్ లైఫ్, డైనకాన్స్, ఆర్వీ డెనిమ్స్, బీఎండబ్ల్యూ ఇండస్ట్రీస్, వక్రంగీ, జెనిత్ ఎక్స్‌పోర్ట్స్, ఆర్ఫిన్ ఇండియా, జెట్ ఎయిర్వేస్ తదితరాలు గత నెల రోజుల్లో 178-102 శాతం మధ్య దూసుకెళ్లడం విశేషం! -
మార్కెట్లు బౌన్స్‌బ్యాక్- ర్యాలీ కంటిన్యూ
ముంబై, సాక్షి: ఒక్క రోజు విరామం తదుపరి తిరిగి దేశీ స్టాక్ మార్కెట్లు జోరందుకున్నాయి. అయితే మిడ్‌సెషన్‌లో ఉన్నట్టుండి అమ్మకాలు ఊపందుకోవడంతో మార్కెట్లకు షాక్ తగిలింది. చివరికి కోలుకుని ప్రస్తావించదగ్గ లాభాలతో ముగిశాయి. వెరసి రికార్డుల ర్యాలీ తిరిగి ప్రారంభమైందని నిపుణులు పేర్కొన్నారు. సెన్సెక్స్ 139 పాయింట్లు పెరిగి 46,099 వద్ద నిలవగా.. నిఫ్టీ 36 పాయింట్లు పుంజుకుని13,514 వద్ద స్థిరపడింది. గత నెలలో ఉద్యోగ ఆఫర్లు పుంజుకోవడం, సహాయక ప్యాకేజీపై తిరిగి పెరిగిన ఆశల నేపథ్యంలో గురువారం యూఎస్ మార్కెట్లు కనిష్టాల నుంచి కోలుకుని మిశ్రమంగా ముగిశాయి. ఇటీవల జీడీపీ రికవరీ బాట పట్టడం, వ్యాక్సిన్ల అందుబాటుపై అంచనాలు దేశీయంగా సెంటిమెంటుకు ప్రోత్సాహాన్నిస్తున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. కాగా.. ఇంట్రాడేలో సెన్సెక్స్ 46,310 వద్ద గరిష్టాన్ని, 45,706 వద్ద కనిష్టాన్నీ తాకింది. నిఫ్టీ సైతం 13,579-13,403 పాయింట్ల మధ్య ఊగిసలాడింది. ఫార్మా, ఐటీ వీక్ ఎన్ఎస్ఈలో ప్రధానంగా మెటల్, ఎఫ్ఎంసీజీ, రియల్టీ, బ్యాంకింగ్ రంగాలు 1 శాతం స్థాయిలో పుంజుకోగా.. ఫార్మా, ఐటీ 0.5 శాతం చొప్పున నీరసించాయి. నిఫ్టీ దిగ్గజాలలో ఓఎన్జీసీ, ఎన్టీపీసీ, గెయిల్, కోల్ ఇండియా, టాటా స్టీల్, ఐసీఐసీఐ, టైటన్, ఐవోసీ, ఐటీసీ, ఎస్బీఐ 5.4-1 శాతం మధ్య ఎగశాయి. అయితే యాక్సిస్, దివీస్, అదానీ పోర్ట్స్, ఎంఅండ్ఎం, ఐషర్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, యూపీఎల్, సిప్లా, టెక్ మహీంద్రా, ఎస్బీఐ లైఫ్ 2.3-0.8 శాతం మధ్య డీలాపడ్డాయి. (లాజిస్టిక్స్ కంపెనీలకు వ్యాక్సిన్ల బూస్ట్) అపోలో టైర్ అప్ డెరివేటివ్స్‌లో అపోలో టైర్స్, పీఎన్బీ, సెయిల్, ఆర్ఈసీ, జూబిలెంట్ ఫుడ్, ఐడియా, ఎన్ఎండీసీ 6.5-3 శాతం మధ్య జంప్ చేశాయి. కాగా.. మరోపక్క టీవీఎస్ మోటార్, పేజ్ ఇండస్ట్రీస్, నౌకరీ, పిరమల్, బీవోబీ, సన్ టీవీ, మ్యాక్స్ ఫైనాన్స్, వోల్టాస్ 3.3-1.5 శాతం మధ్య క్షీణించాయి. బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ 0.2-0.5 శాతం చొప్పున బలపడ్డాయి. ట్రేడైన షేర్లలో 1,749 లాభపడగా..1218 నష్టాలతో ముగిశాయి. ఎఫ్‌ఫీఐల ఇన్వెస్ట్మెంట్స్ నగదు విభాగంలో గురువారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 2,260 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేయగా.. దేశీ ఫండ్స్(డీఐఐలు) రూ. 2,275 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి. బుధవారం ఎఫ్‌పీఐలు రూ. 3,564 కోట్లకుపైగా ఇన్వెస్ట్ చేయగా.. డీఐఐలు రూ. 2,493 కోట్ల విలువైన అమ్మకాలు నిర్వహించాయి. మంగళవారం ఎఫ్‌పీఐలు రూ. 2,910 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేయగా.. డీఐఐలు రూ. 2,641 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్న విషయం విదితమే. -
మార్కెట్లు కుమ్మేస్తున్నాయ్.. ఎన్నాళ్లీ జోరు?!
ఓవైపు ప్రపంచ దేశాలన్నిటినీ కరోనా వైరస్ కుదిపేస్తున్నప్పటికీ స్టాక్ మార్కెట్లు మాత్రం లాభాలతో దూసుకెళుతున్నాయి. యూఎఎస్ ఇండెక్సులు చరిత్రాత్మక గరిష్టాలను అందుకోగా.. దేశీయంగానూ సెన్సెక్స్ 37,000 పాయింట్ల మార్క్‌ను అధిగమించింది. ఇక నిఫ్టీ 11,000 పాయింట్ల మైలురాయికి చేరువైంది. ఈ నేపథ్యంలో ఇకపై మార్కెట్ల దారెటు అన్న సందేహాలు ఇన్వెస్టర్లను మనసులను తొలుస్తున్నట్లు పలువురు నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. యూఎస్ ఫెడరల్ రిజర్వ్‌సహా.. యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్(ఈసీబీ), బ్యాంక్ ఆఫ్ జపాన్(బీవోజే), బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్(బీవోఈ) తదితర కేంద్ర బ్యాంకులు ఇప్పటికే వడ్డీ రేట్లను నేలకు దించాయి. అంతేకాకుండా భారీ ప్యాకేజీల ద్వారా బిలియన్ డాలర్లను వ్యవస్థలోకి విడుదల చేస్తున్నాయి. తద్వారా కోవిడ్-19 కట్టడికి అమలు చేస్తున్న లాక్‌డవున్‌లతో నిలిచిపోయిన ఆర్థిక కార్యకలాపాలకు ఊతమిచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఫలితంగా అంతర్జాతీయ స్థాయిలో ఇన్వెస్టర్లకు ఆర్థిక రికవరీతోపాటు.. స్టాక్ మార్కెట్లపట్ల విశ్వాసం పెరుగుతున్నట్లు పలువురు విశ్లేషకులు పేర్కొంటున్నారు. ప్రధానంగా జెఫరీస్ ఈక్విటీ గ్లోబల్ హెడ్ క్రిస్టోఫర్ ఉడ్, ఫస్ట్ గ్లోబల్ విశ్లేషకులు శంకర్ శర్మ, ఎడిల్వీజ్ గ్రూప్ చైర్మన్ రాశేష్ షా వెల్లడించిన అభిప్రాయాలు, అంచనాల వివరాలు చూద్దాం.. క్రిస్ ఉడ్, జెఫరీస్ నిజానికి ఇండియాసహా వర్ధమాన దేశాలలోని ప్రజలకు కరోనా వైరస్ కంటే లాక్డవున్లే అత్యధికంగా చేటు చేస్తాయి. ప్రస్తుతం ఈక్విటీ మార్కెట్లకు కేంద్ర బ్యాంకులు అమలు చేస్తున్న విధానాలలో మార్పులే అతిపెద్ద రిస్క్‌గా చెప్పవచ్చు. సరళతర పాలసీల అమలు మార్కెట్లకు ప్రోత్సాహాన్నిస్తోంది. దేశీయంగా చూస్తే ఐటీ, ఫార్మా రంగాలను కీలకంగా పేర్కొనవచ్చు. వీటికి సవాళ్లు ఎదురయ్యే అవకాశాలు తక్కువే. అయితే ఆర్థిక మందగమనం, మొండి బకాయిలు దేశానికి సమస్యలు సృష్టించే వీలుంది. హౌసింగ్, నిర్మాణ రంగాలు ఆసక్తిని రేకెత్తిస్తున్నప్పటికీ లాక్‌డవున్ కారణంగా రియల్టీ మార్కెట్ దెబ్బతింటోంది. ఇతర పెట్టుబడి మార్గాలలో బంగారం మరింత మెరిసే వీలుంది. ఔన్స్ 1900 డాలర్లను అధిగమించవచ్చు. ఇటీవల వ్యాక్సిన్లపై పెరుగుతున్న అంచనాలు కృత్రిమతకు దారితీస్తున్నాయి. నిజానికి వ్యాక్సిన్ల అవసరం ఉన్నదని భావించడంలేదు. శంకర్ శర్మ, ఫస్ట్ గ్లోబల్ మార్కెట్ల ర్యాలీకి ఇండెక్స్ హెవీవెయిట్ రిలయన్స్ ఇండస్ట్రీస్ అత్యధికంగా సహకరిస్తోంది. ఇటీవల మార్కెట్ల మొత్తం ర్యాలీలో ఈ కౌంటర్ కీలకపాత్ర పోషించింది. ఒకే కౌంటర్‌పై ఆధారపడి మార్కెట్లు పరుగందుకుంటే ఆందోళనలు తలెత్తుతాయి. గత మూడు నెలల్లో చూస్తే బ్యాంకులు, ఎన్బీఎఫ్సీ, రియల్టీ కేటగిరీలో తొలుత ర్యాలీరాగా.. తదుపరి రిలయన్స్ వల్ల మార్కెట్ పురోగమించింది. ఇటీవల రిలయన్స్ ఆర్థికంగా, వ్యూహాత్మకంగా మరింత బలపడటంతో ఈ షేరు చాలా వేగంగా దౌడు తీసింది. మూడు నెలల్లోనే రెట్టింపయ్యింది. దీంతో ఇకపై లాభాల స్వీకరణకు దారితీయవచ్చు. ఈ ఏడాది దేశీ మార్కెట్లు 24 శాతం క్షీణించాయి. ఇతర మార్కెట్లతో పోలిస్తే వెనుకబడ్డాయి. అయితే కొన్ని రంగాలలో అత్యంత ఆకర్షణీయమైన స్టాక్స్ ఉన్నాయి. అలాగని బుల్ మార్కెట్‌కు అవకాశంలేదు. కొన్ని స్టాక్స్ ఆధారంగా కదిలే మార్కెట్‌గా కనిపిస్తోంది. రాశేష్ షా, ఎడిల్వీజ్ గ్రూప్ స్వల్పకాలిక ఆర్థిక గణాంకాలను మార్కెట్లు పట్టించుకోవడం లేదు. మార్చి, ఏప్రిల్‌లో చూస్తే.. కరోనా వైరస్ కారణంగా అనూహ్య భయాలు నెలకొన్నాయి. ఇది ఎలా అంతమవుతుందన్న అంశాన్ని ఎవరూ ఊహించలేదు. అయితే లిక్విడిటీతో స్వల్పకాలిక ఒత్తిడి తొలగిపోయింది. స్వల్పకాలంలో లిక్విడిటీ ఆదుకోగా.. తదుపరి దశలో అంటే డిసెంబర్, జనవరికల్లా కోవిడ్-19కు తెరపడగలదని ఇన్వెస్టర్లు భావిస్తున్నారు. ఈ ఏడాది ఆర్థిక గణాంకాలు అంటే జీడీపీ, కంపెనీల ఫలితాలు వంటివి నిరాశపరుస్తాయన్నది తెలిసిన సంగతే. దీంతో ఆపై అంటే 2021 తదుపరి పరిస్థితులపట్ల ఇన్వెస్టర్లు ఆశావహంగా స్పందిస్తున్నారు. -
మార్కెట్ల ఈ దూకుడు ఎందుకంటే!
వరుసగా నాలుగో రోజు దేశీ స్టాక్ మార్కెట్లు ర్యాలీ బాటలో సాగుతున్నాయి. సెన్సెక్స్ 36,400కు చేరగా.. నిఫ్టీ 10,700 ఎగువన కదులుతోంది. ఇటీవల మార్కెట్లలో కనిపిస్తున్న సానుకూల ట్రెండ్నకు పలు కారణాలున్నట్లు కుంజ్ బన్సాల్ చెబుతున్నారు. ఒక ఇంటర్వ్యూలో మార్కెట్లకు జోష్‌నిస్తున్న అంశాలతోపాటు.. కార్పొరేట్ నిధుల సమీకరణ వెనుకున్న కారణాలు తదితరాలపై పలు అభిప్రాయాలను వ్యక్తం చేశారు. వివరాలు చూద్దాం.. ఆశావహం ప్రపంచవ్యాప్తంగా కోవిడ్-19 కల్లోలం సృష్టిస్తున్నప్పటికీ దేశీయంగా మార్కెట్లు ఇటీవల హుషారుగా కదులుతున్నాయి. ఇన్వెస్టర్లలో ఆశావహ ధోరణి నెలకొంది. ఇందుకు పలు అంశాలు దోహదం చేస్తున్నాయి.గత మూడు నెలలుగా మార్కెట్లు అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తూ బలపడుతున్నాయి. కరోనా వైరస్ కేసుల సంఖ్య పెరగడం, లాక్‌డవున్‌లతో పారిశ్రామికం కుదేలవడం, ఆర్థిక మందగమనం వంటి ప్రతికూలతలున్నప్పటికీ మార్కెట్లు ర్యాలీ చేస్తున్నాయి. ప్రధానంగా మార్కెట్లకు లిక్విడిటీ.. అంటే చౌక నిధులు బూస్టింగ్నిస్తున్నాయి. వీటికితోడు ఇటీవల వస్తు, సేవల పన్ను(జీఎస్టీ) వసూళ్లు పుంజుకుంటున్నాయి. ఏప్రిల్‌లో రూ. 40,000 కోట్లు నమోదుకాగా.. మే నెలలో రూ. 70,000 కోట్లకు, జూన్‌లో రూ. 90,000 కోట్లకు జీఎస్టీ వసూళ్లు పెరిగాయి. ఆటో విక్రయాలు గత నెలలో ఆటో విక్రయాలు సైతం సానుకూల ధోరణిని సూచిస్తున్నాయి. వ్యవసాయ రంగం నుంచి లభించిన దన్నుతో ట్రాక్టర్ల అమ్మకాలు ఊపందుకున్నాయి. ద్విచక్ర వాహన అమ్మకాలు సైతం ఇందుకు దన్నునిచ్చాయి. అయితే కార్లు, వాణిజ్య వాహన విక్రయాలు నిరాశపరచాయి. ఇక వ్యవసాయోత్పత్తిపై అంచనాలు బాగా పెరిగాయి. సాధారణ వర్షపాత అంచనాలు, పంటల విస్తీర్ణం వంటి అంశాలు ఇందుకు మద్దతివ్వనున్నాయి. ఇలాంటి పలు సానుకూల అంశాల కారణంగా కోవిడ్-19 వల్ల తలెత్తుతున్న ఆరోగ్య, ఆర్థిక సవాళ్లకు ఇన్వెస్టర్లు అంతగా ప్రాధాన్యత ఇవ్వడంలేదు. ఈ నేపథ్యంలో అవకాశాలు అందిపుచ్చుకోగల ఫార్మా, ఎఫ్ఎంసీజీ వంటి రంగాలు వెలుగులో నిలుస్తున్నాయి. రంగాలవారీగా ప్రాధాన్యతలు మారుతున్నాయి. ఇది కొంతకాలంపాటు కొనసాగవచ్చు. జియో జోరు ఇటీవల డిజిటల్, టెలికం సేవల సంస్థరిలయన్స్ జియో ప్లాట్‌ఫామ్స్‌లో వాటా విక్రయం ద్వారా మాతృ సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ భారీగా నిధులు సమీకరించింది. ఫేస్బుక్ తదితర పలు విదేశీ సంస్థలు రిలయన్స్ జియోలో పెట్టుబడికి ఆసక్తి చూపాయి. మరోవైపు టెలికం దిగ్గజం భారతీ ఎయిర్టెల్ ప్రమోటర్లు కొంతమేర వాటాను విక్రయించారు. తద్వారా కంపెనీ బలోపేతానికి నిధుల సమీకరణ చేపట్టారు. ఇదే విధంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ తగిన సమయంలో రుణభారాన్ని తగ్గించుకునేందుకు జియో ద్వారా నిధులను సమీకరించింది. తద్వారా పబ్లిక్ ఇష్యూ తదితరాలు చేపట్టేందుకు అనువైన పరిస్థితులను ఏర్పాటు చేసుకుంది. ఇవన్నీ సెంటిమెంటుకు బలాన్నిస్తున్నాయి. ఇక మరోవైపు కొటక్ మహీంద్రా బ్యాంక్ క్విప్, ప్రమోటర్ వాటా విక్రయం ద్వారా నిధులు సమీకరించింది. ఇదే విధంగా పలు బీమా రంగ కంపెనీలు సైతం వాటాలు విక్రయించాయి. నాణ్యమైన కంపెనీల వాటాలను కొనుగోలు చేసేందుకు పలు విదేశీ సంస్థలు ముందుకు వచ్చాయి. దీంతో కొన్ని వాటా విక్రయ ఆఫర్లు అధిక నిధులను ఆకట్టుకోగలిగాయి కూడా. తద్వారా దేశీ బిజినెస్లపట్ల విదేశీ ఇన్వెస్టర్లు చూపుతున్న ఆసక్తి వ్యక్తమవుతోంది. వెరసి ఇలాంటి పలు అంశాలు దేశీ స్టాక్ మార్కెట్లకు జోష్‌నిస్తున్నాయి. -
సెన్సెక్స్ తొలి నిరోధం 34,220
కోవిడ్ కేసులు పెరుగుతున్నా, ఇండో–చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తతలు నెలకొన్నా, గతవారం పెద్ద ఎత్తున జరిగిన షార్ట్ కవరింగ్ ప్రభావంతో దేశీయ మార్కెట్ హఠాత్ ర్యాలీ జరిపింది. ప్రధాన కార్పొరేట్ రిలయన్స్ ఇండస్ట్రీస్ వరుస పెట్టుబడుల ప్రవాహాన్ని ఆకర్షిస్తున్నతీరు, రూ.1,620 సమీపంలో ట్రిపుల్టాప్ను ఆ షేరు ఛేదించిన శైలిని పరిశీలిస్తే....ఈ జూన్ డెరివేటివ్ కాంట్రాక్టుల ముగింపులోపు మరింత పెరిగే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఈ షేరుకు సూచీల్లో వున్న అధిక వెయిటేజి కారణంగా మార్కెట్ర్యాలీ కూడా కొనసాగే ఛాన్సుంది. అలాగే గత శుక్రవారం వడ్డీ ప్రభావిత రంగాలైన బ్యాంకింగ్, ఫైనాన్షియల్స్, ఆటో, రియాల్టీ షేర్లు కూడా ర్యాలీలో పాలుపంచుకున్నందున, అనూహ్య పరిణామాలేవీ చోటుచేసుకోకపోతే.... ఇప్పటికే బాగా పెరిగివున్న ఇతర ప్రపంచ ప్రధాన మార్కెట్లు బలహీనంగా ట్రేడయినా, భారత్ సూచీలు మరికొంతశాతం పెరిగే అవకాశాలు ఎక్కువగా కన్పిస్తున్నాయి. ఇక సాంకేతిక అంశాలకొస్తే.... సెన్సెక్స్ సాంకేతికాంశాలు... జూన్ 19తో ముగిసినవారం ప్రధమార్థంలో 32,923 పాయింట్ల వరకూ తగ్గిన బీఎస్ఈ సెన్సెక్స్...ద్వితీయార్థంలో జోరుగా ర్యాలీ సాగించి 34,848 పాయింట్ల గరిష్టస్థాయికి ర్యాలీ జరిపింది. చివరకు అంతక్రితంవారంతో పోలిస్తే 951 పాయింట్ల భారీ లాభంతో 34,732 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ వారం అప్ట్రెడ్ కొనసాగితే సెన్సెక్స్ తొలుత 34,930 పాయింట్ల స్థాయిని అధిగమించాల్సివుంటుంది. అటుపైన వేగంగా 35,260 పాయింట్ల స్థాయిని అందుకోవొచ్చు. ఈ స్థాయిపైన ముగిస్తే 35,920 పాయింట్ల స్థాయికి చేరవచ్చు. సెన్సెక్స్ ఈ ఏడాది జనవరి20న సాధించిన 42,274 పాయింట్ల రికార్డు గరిష్టం నుంచి మార్చి 24 నాటి 25,639 పాయింట్ల కనిష్టస్థాయివరకూ జరిగిన పతనానికి 61.8 శాతం రిట్రేస్‌మెంట్ స్థాయి అయిన 35,920 పాయింట్ల వద్ద రానున్న రోజుల్లో సెన్సెక్స్‌కు గట్టి అవరోధం కలగవచ్చు. ఈ స్థాయిని ఛేదిస్తే రానున్న కొద్దిరోజుల్లో 36,950 పాయింట్ల వద్దకు పెరగవచ్చు. ఈ వారం తొలి అవరోధస్థాయిని అధిగమించలేకపోయినా, బలహీనంగా మొదలైనా 34,135 పాయింట్ల వద్ద తొలి మద్దతు లభిస్తున్నది. ఈ మద్దతు దిగువన ముగిస్తే 33,370 పాయింట్ల వరకూ తగ్గవచ్చు. ఈ లోపున తిరిగి 32,920 పాయింట్ల స్థాయిని పరీక్షించవచ్చు. నిఫ్టీ తొలి నిరోధం 10,330 గతవారం ఎన్ఎస్ఈ నిఫ్టీ అనూహ్యంగా 10,272 పాయింట్ల వరకూ ర్యాలీ జరిపి. చివరకు అంతక్రితంవారంతో పోలిస్తే 272 పాయింట్ల లాభంతో 10,244 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ వారం అప్‌ట్రెండ్ కొనసాగాలంటే నిఫ్టీ 10,330 పాయింట్ల స్థాయిని అధిగమించాల్సివుంటుంది. ఈ స్థాయిని దాటితే 61.8 శాతం ఫిబోనకి రిట్రేస్‌మెంట్ స్థాయి అయిన 10,550 పాయింట్ల వరకూ ర్యాలీ జరిగే ఛాన్స్ వుంటుంది. ఈ స్థాయి వద్ద ఎదురుకాబోయే గట్టి నిరోధాన్ని సైతం అధిగమిస్తే క్రమేపీ 10,750 పాయింట్ల వరకూ ర్యాలీ కొనసాగవచ్చు. ఈ వారం నిఫ్టీ తొలి నిరోధాన్ని దాటలేకపోయినా, బలహీనంగా మొదలైనా 10,070 పాయింట్ల సమీపంలో తొలి మద్దతు లభిస్తున్నది. ఈ మద్దతు దిగువన ముగిస్తే 9,845 పాయింట్ల వరకూ తగ్గవచ్చు. ఈ లోపున 9,725 పాయింట్ల వరకూ క్షీణించవచ్చు. – పి. సత్యప్రసాద్ -
ఈసారి బూమ్‌లో కొత్త కంపెనీలకు చోటు!
ఇటీవల మార్కెట్లు ర్యాలీ బాటలో సాగుతున్నాయి. గత రెండు వారాల్లోనే 12 శాతం లాభపడ్డాయి. దీంతో ఇకపై కొంతమేర కరెక్షన్కు చాన్స్ ఉన్నదంటున్నారు ఎన్విజన్ క్యాపిటల్ ఎండీ, సీఈవో నీలేష్ షా. భవిష్యత్‌లో మార్కెట్ల గమనం, పెట్టుబడి అవకాశాలు, విభిన్న రంగాలు తదితర అంశాలపై ఒక ఇంటర్వ్యూలో పలు అభిప్రాయాలు వ్యక్తం చేశారు. వివరాలు చూద్దాం.. క్యూ1, క్యూ2 వీక్ ఈ ఏడాది ద్వితీయార్థంకంటే ముందుగానే ఆర్థిక వ్యవస్థ రికవరీ సాధించకపోవచ్చని అత్యధిక శాతం కార్పొరేట్ వర్గాలు విశ్వసిస్తున్నాయి. గత కొద్ది వారాలుగా మార్కెట్లు పుల్‌బ్యాక్ ర్యాలీలో సాగుతున్నాయి. ఈ సమయంలో ఇన్వెస్టర్లు జాగ్రత్తగా వ్యవహరించవలసి ఉంది. ప్రపంచవ్యాప్తంగా లాక్‌డవున్ ఎత్తివేస్తుండటంతో గత రెండు వారాల్లోనే మార్కెట్లు 12 శాతం లాభపడ్డాయి. దీనికితోడు విదేశీ ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) సైతం పెట్టుబడులను కుమ్మరిస్తుండటంతో సెంటిమెంటు బలపడింది. మరోవైపు మిడ్, స్మాల్ క్యాప్స్ ఇటీవల జోరు చూపుతున్నాయి. ఈ ఏడాది(2020-21) తొలి రెండు త్రైమాసికాలలో కంపెనీల పనితీరు నిరాశపరిచే వీలుంది. ఏప్రిల్- సెప్టెంబర్ మధ్య కాలంలో ఆర్థిక ఫలితాలు బలహీనపడనున్నాయి. దీంతో మార్కెట్లు ఇకపై మరింత ర్యాలీ చేయకపోవచ్చు. అంతేకాకుండా ఇక్కడినుంచీ వెనకడుగువేసే అవకాశముంది. 7,500 చాన్స్ తక్కువే ఇటీవల ర్యాలీ నేపథ్యంలో నిఫ్టీ 10,000 పాయింట్ల మార్క్‌ను అధిగమించింది. దీంతో మార్కెట్లలో మళ్లీ భారీ కరెక్షన్కు చాన్స్ తక్కువే. వెరసి మార్చి కనిష్టం 7,500 పాయింట్ల స్థాయికి నిఫ్టీ పతనంకాకపోవచ్చు. అయితే కొన్ని రంగాలు ఊహించినదానికంటే అధికంగా దెబ్బతినవచ్చు. ఇదే విధంగా కొన్ని కంపెనీలు నిరుత్సాహకర పనితీరు చూపడంతో కొత్త కనిష్టాలను తాకే వీలుంది. నాయకత్వ పటిమ, పటిష్ట బిజినెస్‌లవైపు మార్కెట్లు దృష్టిసారిస్తాయి. కోవిడ్-19 కారణంగా తలెత్తిన పరిస్థితులు బ్యాంకింగ్ రంగానికి సవాళ్లను విసరనున్నాయి. భవిష్యత్‌లోనూ ఫైనాన్షియల్ రంగానికి సమస్యలు ఎదురుకావచ్చు. కరోనా వైరస్ మరోసారి విజృంభిస్తే.. తిరిగి లాక్‌డవున్ పరిస్థితులు తలెత్తవచ్చని కొంతమంది అంచనా వేస్తున్నారు. ఇది మార్కెట్లను దెబ్బతీయవచ్చని భావిస్తున్నారు. ఈ అంశాలపై ఇప్పుడే ఒక అంచనాకు రాలేము. వచ్చే ఏడాదిలోనే ఈ ఏడాది పలు రంగాలలోని కంపెనీలు అంతంతమాత్ర పనితీరునే చూపవచ్చు. అయితే వచ్చే ఆర్థిక సంవత్సరం(2021-22)లో పరిస్థితులు సర్దుకునే వీలుంది. ఏఏ రంగాల నుంచి డిమాండ్ పుట్టవచ్చు లేదా.. ఎలాంటి కంపెనీలు వృద్ధి సాధించవచ్చన్న అంచనాలు కీలకంగా మారనున్నాయి. కొన్ని కంపెనీలు కోవిడ్-19 పరిస్థితుల్లో నిలదొక్కుకోవడంతోపాటు.. పటిష్ట ఫలితాలవైపు సాగవచ్చు. ప్రధానంగా సాధారణ బీమా, జీవిత బీమా, ఆరోగ్య బీమా రంగాలు వెలుగులో నిలిచే వీలుంది. ఇదే విధంగా కిచెన్- హోమ్ అప్లయెన్సెస్ విభాగాలకు సైతం డిమాండ్ కనిపించనుంది. ఈ బాటలో ఆరోగ్య పరిరక్షణ(హెల్త్, వెల్నెస్), వ్యక్తిగత సంరక్షణ విభాగాలు పటిష్ట పనితీరు ప్రదర్శించవచ్చని భావిస్తున్నాం. రానున్న రెండేళ్లలో టెక్నాలజీ కౌంటర్లు సైతం బౌన్స్‌బ్యాక్ సాధించవచ్చు. యూఎస్ ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడం ద్వారా టెక్నాలజీ సర్వీసులకు డిమాండ్ పెరిగే వీలుంది. చిన్న షేర్లు గుడ్ ఇటీవల మిడ్, స్మాల్ క్యాప్స్ ర్యాలీ చేస్తున్నాయి. అయినప్పటికీ 2017-18 గరిష్టాలతో పోలిస్తే 50 శాతం తక్కువలోనే ట్రేడవుతున్నాయి. అయితే ఈ విభాగంలో నాణ్యమైన కంపెనీలను ఎంపిక చేసుకోవలసి ఉంటుంది. కన్జూమర్ అప్లయెన్సెస్, హెల్త్, వెల్నెస్ తదితర రంగాలకు చెందిన కొన్ని కౌంటర్లు ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి. సమర్ధవంత నిర్వహణ, తక్కువ రుణ భారం, పటిష్ట బ్యాలన్స్‌షీట్స్, నగదు నిల్వలు కలిగిన కంపెనీలు మెరుగైన ఫలితాలను సాధించే అవకాశముంది. సరైన రంగాల నుంచి నాణ్యమైన కంపెనీలను ఎంచుకుంటే భారీ ప్రతిఫలాలను పొందవచ్చని ఆశిస్తున్నాం. ఎన్బీఎఫ్సీలు వద్దు మార్చి చివరి వారంలో మార్కెట్లు బాటమవుట్ అయినప్పటికీ బ్యాంకింగేతర ఫైనాన్షియల్ కంపెనీ(ఎన్బీఎఫ్సీ)ల కౌంటర్లలో భారీ అమ్మకాలు నమోదయ్యాయి. దీంతో ఎన్బీఎఫ్సీ విభాగాన్ని తప్పించుకోవడమే మేలు. కొన్ని కంపెనీలు బలమైన యాజమాన్యం, పెట్టుబడులను కలిగి ఉన్నప్పటికీ రుణ నాణ్యత విషయంలో సమస్యలు ఎదురయ్యే వీలుంది. సమీపకాలంలో రుణ వసూళ్లు, మొండిబకాయిలు వంటి సవాళ్లకు ఆస్కారం ఉంది. మారటోరియం ప్రభావం భవిష్యత్‌లో కనిపించనుంది. ఫలితంగా ఎన్బీఎఫ్సీ రంగానికి ఈ ఏడాది సమస్యాత్మకంగా నిలిచే అవకాశముంది. -
మార్కెట్ల ర్యాలీ- లిక్విడిటీ మాయ!
ప్రపంచవ్యాప్తంగా వెల్లువెత్తుతున్న నిధులతోనే స్టాక్ మార్కెట్లకు జోష్వస్తున్నందటున్నారు మార్కెట్ల స్వతంత్ర విశ్లేషకులు ఆనంద్ టాండన్. దీంతో వాస్తవిక పరిస్థితులను విస్మరిస్తూ ఇండెక్సులు పరుగుతీస్తున్నట్లు చెబుతున్నారు. మార్కెట్ల తీరు, లిక్విడిటీ, కోవిడ్-19 ప్రభావం వంటి అంశాలపై ఒక ఇంటర్వ్యూలో పలు అభిప్రాయాలు వ్యక్తం చేశారు. వివరాలు చూద్దాం.. చివరి దశ..? నిజానికి స్టాక్ మార్కెట్లు లిక్విడిటీ ప్రభావంతో పరుగుతీస్తున్నాయి. ఇందువల్లనే ఇటీవల మిడ్, స్మాల్ క్యాప్స్సైతం ర్యాలీ చేస్తున్నాయి. కోవిడ్-19 ప్రభావాన్ని అడ్డుకునేందుకు పలుదేశాల కేంద్ర బ్యాంకులు అమలు చేస్తున్న భారీ సహాయక ప్యాకేజీల కారణంగా చౌక నిధులు వెల్లువెత్తుతున్నాయి. కరోనా వైరస్ కారణంగా సవాళ్లు ఎదుర్కొంటున్న రంగాల కంపెనీలు సైతం ఇటీవల జోరు చూపుతున్నాయి. ఉదాహరణకు టాటా గ్రూప్ దిగ్గజాలు ఇండియన్ హోటల్స్, టాటా మోటార్స్ తాజాగా వెలుగులోకి వచ్చాయి. నిజానికి ఆతిథ్య రంగం, వాహన రంగాలు ఇంకా కోలుకోవలసి ఉంది. ఇక ట్రక్కుల విక్రయాలు ఊపందుకోనప్పటికీ అశోక్ లేలాండ్ కౌంటర్‌కు డిమాండ్ పెరిగింది. వీటిని పక్కనపెడితే.. పలు మిడ్, స్మాల్ క్యాప్స్ స్టాక్స్ భారీగా లాభపడుతున్నాయి. ఫండమెంటల్స్ లేదా కంపెనీల ఆర్జన మెరుగుపడే అంచనాలకంటే లిక్విడిటీ ప్రభావమే ఇందుకు సహకరిస్తోంది. ఆటో రంగాన్నే తీసుకుంటే.. వాణిజ్య వాహన విక్రయాలు వెనకడుగులో ఉన్నాయి. సీవీలు, కార్లతో పోలిస్తే ట్రాక్టర్లు, ద్విచక్ర వాహనాలకు డిమాండ్ కనిపించే వీలుంది. నిజానికి అండర్పెర్ఫార్మింగ్ కంపెనీల షేర్లు సైతం బలపడుతున్నాయంటేటే.. ర్యాలీ చివరి దశకు చేరినట్లు కొంతమంది విశ్లేషకులు భావిస్తుంటారు. అయితే లిక్విడిటీ కారణంగా పరుగెడుతున్న మార్కెట్లలో ట్రెండ్‌కు అనుగుణంగా వ్యవహరించడమే మేలు. తద్వారా స్వల్పకాలంలో కొంతమేర లాభాలు ఆర్జించేందుకు వీలుంటుంది. అయితే ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరించవలసి ఉంటుంది. దీర్ఘకాలంలోనూ నిజానికి మార్కెట్లను అధిక సమయాలలో లిక్విడిటీనే నడిపిస్తుంటుంది. గత ఐదు, ఆరేళ్లుగా చూస్తే దేశీయంగా కంపెనీల ఆర్జనలకు మించుతూ మార్కెట్లు లాభపడుతూ వచ్చాయి. ఇందుకు వడ్డీ రేట్లు వంటివి దోహదం చేశాయి. దీంతో ఫండమెంటల్స్కంటే వడ్డీ రేట్లే స్టాక్స్‌కు బలాన్నిచ్చాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం ప్రభుత్వాలు, కంపెనీలు రుణ భారాన్ని అధికంగా మోస్తున్నాయి. అయితే ఈ పరిస్థితుల్లో ఎప్పటికి మార్పు వస్తుందో ఇప్పుడే అంచనా వేయలేము. చౌకగా లభిస్తున్న నిధులు వెల్లువెత్తుతున్నాయి. ఒకవేళ ప్రపంచ దేశాలపై ఆధారపడకుండా దేశీయంగా కంపెనీలు నిలదొక్కుకోవాలనుకుంటే.. డిమాండ్ పెరిగి ధరలు పుంజుకోవలసి ఉంటుంది. ఇది జరిగితే.. ప్రస్తుత స్థాయిలో వడ్డీ రేట్లు కొనసాగకపోవచ్చు. గైడెన్స్ ఎలా వచ్చే ఏడాది లేదా ఒకటి రెండు త్రైమాసికాలకు ప్రస్తుతం ఏ కంపెనీ ఆదాయ అంచనాలను ప్రకటించే అవకాశాలు కనిపించడం లేదు. ప్రస్తుతం నెలకొన్న అనిశ్చితులు దీనికి కారణంకాగా.. మార్కెట్లలో సాధారణంగా ఎప్పటికప్పుడు పలువురు నిపుణులు 25 శాతం ఆర్జనలు అంచనా వేస్తూ ఉంటారు. అయితే పలు కంపెనీలు నిరాశను మిగులుస్తుంటాయి. అయితే ప్రస్తుతం కోవిడ్-19 ప్రభావంతో ఎవరూ సరైన అంచనాలు వేసే పరిస్థితులు లేవు. నిజానికి ఈ పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలన్న అంశంలో కూడా సరైన ప్రణాళికలు లేవనే చెప్పాలి. ఇలాంటి స్థితిలో రెండేళ్ల కాలాన్ని అంచనా వేయాలంటే చీకట్లో గురిపెట్టవలసిందే. త్వరలో కోవిడ్-19 చికిత్సకు ఔషధం వెలువడుతుందని ఆశిద్దాం. ఇలాంటి పరిస్థితుల్లోనూ అంచనాలు అంత సులభంకాదు. ఎందుకంటే కోవిడ్-19కు ముందు సైతం ప్రపంచ దేశాలు మందగమన పరిస్థితులను ఎదర్కొంటూ వచ్చాయి. గత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో దేశీయంగా జీడీపీ 4 శాతానికి పరిమితమైంది. ఇందుకు ప్రభుత్వ ప్యాకేజీసైతం ప్రోత్సాహాన్నివ్వలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రపంచ దేశాలను మించి భారత్ ఆర్థిక వ్యవస్థ పరుగుతీస్తుందని చెప్పాలంటే ఎంతో ఆశావహం ధృక్పథం కలిగి ఉండాలి. అయినప్పటికీ మార్కెట్లు ర్యాలీ చేస్తున్నాయంటే ఫండమెంటల్స్ లేదా వాస్తవిక పరిస్థితులకంటే లిక్విడిటీయే ప్రధాన పాత్ర పోషిస్తున్నట్లు చెప్పవచ్చు. -
ఈ ర్యాలీ అనూహ్యం- జాగ్రత్త అవసరం!
కోవిడ్-19 నేపథ్యంలో దేశ ఆర్థిక వ్యవస్థ క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్నప్పటికీ.. స్టాక్ మార్కెట్లు అనూహ్య ర్యాలీ చేస్తున్నట్లు జిమీత్ మోడీ పేర్కొన్నారు. ఇందుకు ప్రధానంగా లిక్విడిటీ కారణమవుతున్న్లట్లు తెలియజేశారు. ఈ బాటలో గత వారం సైతం మార్కెట్లు పలువురు నిపుణులను ఆశ్చర్యపరుస్తూ జోరందుకున్నట్లు ఒక ఇంటర్వ్యూలో శామ్కో సెక్యూరిటీస్ సీఈవో జిమీత్ మోడీ పేర్కొన్నారు. ఇలాంటి సందర్భాలలో మార్కెట్లకు దూరంగా ఉండమంటూ లాజిక్ హెచ్చరిస్తుంటే.. ఎమోషన్స్ ప్రధాన పాత్ర పోషిస్తాయని వ్యాఖ్యానించారు. ఇతర వివరాలు చూద్దాం.. నిరుత్సాహకర వార్తలు నిజానికి దేశ సావరిన్ రేటింగ్‌ను మూడీస్ Baa3కు డౌన్‌గ్రేడ్ చేసింది. జనవరి-మార్చి త్రైమాసికంలో దేశ జీడీపీ 40 త్రైమాసికాల కనిష్టం 3.12 శాతం వృద్ధికి పరిమితమైంది. అయినప్పటికీ గత వారం మార్కెట్లు ఆశ్చర్యకరంగా జంప్‌చేశాయి. బిజినెస్‌లను ఒక ట్రెండ్ మాత్రమే నడిపిస్తుందిగానీ.. షేర్ల ధరలను మాత్రం పలు ఇతర అంశాలు ప్రభావితం చేస్తుంటాయని సర్ జాన్ టెంపుల్టన్ ఏనాడో స్పష్టం చేశారు. ప్రస్తుతం మార్కెట్లకు జోష్‌నిస్తున్న అంశం ఒక్కటే.. భారీ లిక్విడిటీ. ప్రపంచవ్యాప్తంగా లభిస్తున్న నిధులు బ్లూచిప్ కౌంటర్లకు డిమాండ్‌ను పెంచుతున్నాయి. ఇది మార్కెట్లను ఎగదోస్తోంది. వెరసి డిమాండ్- సప్లై గ్యాప్ మార్కెట్ల స్పీడుకు కారణమవుతోంది. ఈ సమయంలో ఇన్వెస్టర్లు బ్లూచిప్స్ తదుపరి జోరందుకోగల ద్వితీయ శ్రేణి కౌంటర్లవైపు దృష్టి సారించవచ్చు. ఇండెక్స్ స్టాక్స్‌లో రన్ పూర్తయ్యాక నిధులు వీటిలోకి ప్రవహించే అవకాశముంటుంది. ఇలాంటి సందర్భాలలో పెట్టుబడులకు దిగవద్దంటూ లాజిక్ సూచిస్తుంటుంది. అయితే ఎమోషన్స్ మాత్రం తొందరపెడుతుంటాయి. అలాంటి సందర్భాలలో లాజిక్పైనే ఆధారపడటం ఉత్తమంకాగలదు. షేర్ల విక్రయం గత వారం రూ. 53,000 కోట్ల రియలన్స్ ఇండస్ట్రీస్ రైట్స్ ఇష్యూ విజయవంతంగా ముగిసింది. దీంతో స్వల్పకాలంలో కొంతమేర లిక్విడిటీకి విఘాతం కలిగింది. ఈ బాటలో రైట్స్ ద్వారా టాటా పవర్ రూ. 2000 కోట్ల సమీకరణ లక్ష్యాలను ప్రకటించగా.. మరోపక్క టెలికం దిగ్గజం ఎయిర్టెల్ ప్రమోటర్లు రూ. 8400 కోట్ల విలువైన వాటాను విక్రయించింది. అనుబంధ సంస్థ హెచ్డీఎఫ్సీ లైఫ్‌లో ప్రమోటర్ కంపెనీలు స్టాండర్డ్ లైఫ్, హెచ్డీఎఫ్సీ రూ. 3200 కోట్ల విలువైన వాటాల అమ్మకాన్ని చేపట్టగా.. ఉదయ్ కొటక్ రూ. 6940 కోట్ల విలువైన వాటాను విక్రయించారు. క్విప్ ద్వారా మరో రూ. 7400 కోట్లను సమీకరించారు. నిఫ్టీ స్పీడ్ విదేశీ ఇండెక్సులతో పోలిస్తే గత రెండు వారాలుగా నిఫ్టీ మెరుగైన ర్యాలీ చేసింది. ఫలితంగా నిఫ్టీ కీలక రెసిస్టెన్స్‌లకు చేరువైంది. సమీపకాలంలో బలహీన సంకేతాలు కనిపించడంలేదు. హైయర్ టైమ్ చార్టుల ప్రకారం నిఫ్టీ బేరిష్‌గా ఉన్నప్పటికీ 20 వారాల చలన సగటుకంటే ఎగువన కదులుతోంది. ఇది పుల్‌బ్యాక్ ర్యాలీకి దారిచూపుతోంది. ఇకపై నిఫ్టీ 10,450- 10,550 పాయింట్ల స్థాయిలో రెసిస్టెన్స్‌ను ఎదుర్కొనే వీలుంది. ఇటీవల వెనకడుగు నుంచి ఇది 61.8 శాతం ఫిబోనకీ రీట్రెస్మెంట్ స్థాయిగా చెప్పవచ్చు. ఈ స్థాయి నుంచి నిఫ్టీ ఎలా టర్న్ అవుతుందన్నది చూడవలసి ఉంది. సమీప కాలంలో స్వల్ప బుల్లిష్ సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇకపై గ్లోబల్ ఫైనాన్షియల్ మార్కెట్లలో లిక్విడిటీ పరిస్థితులు ఎలా పరిణమిస్తాయన్నది వేచిచూడవలసి ఉంది. దేశీ స్టాక్ మార్కెట్లపై ఈ ప్రభావం పడే అవకాశముంది. ఎఫ్‌పీఐల పెట్టుబడుల తీరు వంటి అంశాలకు ప్రాధాన్యత ఉంటుంది. అయితే గరిష్ట స్థాయిలవద్ద ట్రేడర్లు లాభాల స్వీకరణకు దిగే వీలుంది. దీంతో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరించవలసి ఉంటుంది. -
వైరస్ పడగ.. మార్కెట్ ర్యాలీ!
కోవిడ్–19(కరోనా) వైరస్ కల్లోలాన్ని తట్టుకోవడానికి అమెరికా భారీ ప్యాకేజీని ప్రకటించడంతో ప్రపంచ మార్కెట్లతో పాటే మన మార్కెట్ కూడా బుధవారం భారీగా లాభపడింది. మన దగ్గర కూడా కేంద్రం ఉద్దీపన ప్యాకేజీని ఇవ్వనున్నదని, ఆర్బీఐ 60 బేసిస్ పాయింట్ల మేర రేట్లను తగ్గించనున్నదన్న అంచనాలు సానుకూల ప్రభావం చూపించాయి. మార్చి డెరివేటివ్స్ కాంట్రాక్టులు మరొక్క రోజులో ముగియనుండటంతో భారీగా షార్ట్ కవరింగ్ కొనుగోళ్లు చోటు చేసుకోవడం కలసివచ్చింది. బీఎస్ఈ సెన్సెక్స్ 28,000 పాయింట్లు, నిఫ్టీ 8,300 పాయింట్లపైకి ఎగబాకాయి. ఇంట్రాడేలో 2,116 పాయింట్ల మేర ఎగసిన సెన్సెక్స్ చివరకు 1,862 పాయింట్ల లాభంతో 28,536 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ 517 పాయింట్లు పెరిగి 8,318 పాయింట్ల వద్దకు చేరాయి. శాతం పరంగా చూస్తే, సెన్సెక్స్ 6.98 శాతం, నిఫ్టీ 6.62 శాతం మేర లాభపడ్డాయి. సెన్సెక్స్, నిఫ్టీలు ఒక్క రోజులో ఇన్నేసి పాయింట్లు లాభపడటం ఇది గత 11 ఏళ్లలో ఇదే మొదటిసారి. అన్ని రంగాల సూచీలు లాభాల్లోనే ముగిశాయి. కాగా గుడిపడ్వ పర్వదినం కారణంగా ఫారెక్స్ మార్కెట్ బుధవారం పనిచేయలేదు. నష్టాల్లోంచి... భారీ లాభాల్లోకి ఆసియా మార్కెట్లు లాభాల్లో ఉన్నా మన మార్కెట్ నష్టాల్లోనే ఆరంభమైంది. సెన్సెక్స్ 174 పాయింట్లు, నిఫ్టీ 66 పాయింట్ల నష్టాలతో మొదలయ్యాయి. ఆ తర్వాత లాభాల్లోకి వచ్చినా, మళ్లీ నష్టాల్లోకి జారిపోయాయి. ఉదయం 11 తర్వాత మళ్లీ లాభాల్లోకి వచ్చిన సూచీలు ట్రేడింగ్ చివరి వరకూ లాభాల జోరును కొనసాగించాయి. ఒక దశలో 314 పాయింట్లు పతనమైన సెన్సెక్స్ మరో దశలో 2,116 పాయింట్లు ఎగసింది. మొత్తం మీద రోజంతా సెన్సెక్స్ 2,430 పాయింట్ల రేంజ్లో కదలాడింది. కాగా భారత్‌లో కోవిడ్–19 వైరస్ కేసులు 562కు, మరణాలు 10కు పెరిగాయి. ఇక ప్రపంచవ్యాప్తంగా ఈ వైరస్ కేసులు 4.34 లక్షలకు, మరణాలు 19,600కు, రికవరీలు లక్షకు చేరాయి. మరిన్ని విశేషాలు..... ► సెన్సెక్స్‌లోని మొత్తం 30 షేర్లలో మూడు షేర్లు–ఇండస్ఇండ్ బ్యాంక్, ఓఎన్జీసీ, ఐటీసీ మాత్రమే నష్టపోయాయి. మిగిలిన 27 షేర్లు లాభాల్లో ముగిశాయి. ► 200కు పైగా షేర్లు అప్పర్ సర్క్యూట్లను తాకాయి. అవెన్యూ సూపర్ మార్ట్స్, హెచ్డీఎఫ్సీ, ఎన్ఐఐటీ టెక్నాలజీస్, చోళమండలం ఇన్వెస్ట్మెంట్స్, ఐసీఐసీఐ సెక్యూరిటీస్ తదితర షేర్లు ఈ జాబితాలో ఉన్నాయి. ► స్టాక్ మార్కెట్ భారీగా లాభపడినప్పటికీ, 800కు పైగా షేర్లు ఇంట్రాడేలో ఏడాది కనిష్ట స్థాయిలకు పడిపోయాయి. ఏసీసీ, ఏబీబీ ఇండియా, అల్ట్రాటెక్ ఇండియా, జిల్లెట్ ఇండియా తదితర షేర్లు ఈ జాబితాలో ఉన్నాయి. ► ఐఆర్సీటీసీ షేర్ వరుసగా ఎనిమిదో రోజూ 5 శాతం లోయర్ సర్క్యూట్‌తో రూ.816కు పడిపోయింది. ఇది ఐదు నెలల కనిష్ట స్థాయి. గత ఒక్క నెలలోనే ఈ షేర్ 58 శాతం పతనమైంది. లాభాలు ఎందుకంటే... ► అమెరికా భారీ ప్యాకేజీ... కోవిడ్–19 వైరస్‌తో కుదేలవుతున్న ఆర్థిక వ్యవస్థను ఆదుకోవడానికి అమెరికా భారీ ప్యాకేజీని ఇవ్వనున్నది. ఈ 2 లక్షల కోట్ల డాలర్ల ప్యాకేజీలో భాగంగా ఒక్కొక్క అమెరికన్ ఖాతాలో 1,200 డాలర్లు జమ చేస్తారని అంచనా. అమెరికా చరిత్రలోనే ఇదే అత్యంత భారీ ప్యాకేజీ. ఈ ప్యాకేజీ నేపథ్యంలో ఆసియా మార్కెట్లు 2–8% రేంజ్లో లాభపడగా, యూరప్ మార్కెట్లు భారీ లాభాల తో మొదలై, 1–4% రేంజ్ లాభాల్లో ముగిశాయి. ► షార్ట్ కవరింగ్ కొనుగోళ్లు.... మార్చి నెల ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ కాంట్రాక్టులు నేడు(గురువారం) ముగియనున్నాయి. ఈ ఎఫ్ అండ్ ఓ కాంట్రాక్టుల ముగింపు నేపథ్యంలో జోరుగా షార్ట్ కవరింగ్ కొనుగోళ్లు జరిగాయి. ► లాక్‌డౌన్‌ను మెచ్చిన మార్కెట్ మంగళవారం అర్ధరాత్రి నుంచి 21 రోజుల పాటు దేశమంతా లాక్డౌన్ విధించిన విషయం తెలిసిందే. ఈ లాక్డౌన్ కారణంగా భారత జీడీపీలో రూ. 5 లక్షల కోట్ల మేర గండి పడుతుందని అంచనా. ఇంత భారీ నష్టం వాటిల్లే ప్రమాదం ఉన్నప్పటికీ కోవిడ్–19 వైరస్‌ను ఎదుర్కొనడానికి భారత్ గట్టి చర్యలు తీసుకుంటోందన్న భరోసా స్టాక్ మార్కెట్‌కు లభించిందని నిపుణులు పేర్కొంటున్నారు. ► ఉద్దీపన చర్యలపై ఆశలు... దేశవ్యాప్తంగా 21 రోజుల పాటు లాక్డౌన్ విధించిన నేపథ్యంలో కుదేలయ్యే ఆర్థిక రంగాన్ని ఆదుకోవడానికి కేంద్ర ప్రభుత్వం భారీ స్థాయిలోనే (సుమారు 1.5 లక్షల కోట్లు) ఉద్దీపన ప్యాకేజీని ఇవ్వనున్నదన్న అంచనాలు నెలకొన్నాయి. ► రేట్ల కోత అంచనాలు: ఏప్రిల్‌లో జరిగే పాలసీ సమావేశంలో కీలక రేట్లను ఆర్బీఐ 50–100 బేసిస్ పాయింట్ల మేర తగ్గించగలదన్న ఆశలతో వడ్డీ రేట్ల ప్రభావిత బ్యాంక్, వాహన షేర్లలో జోరుగా కొనుగోళ్లు జరిగాయి. ► హెవీ వెయిట్స్ ర్యాలీ సెన్సెక్స్, నిఫ్టీ సూచీల్లో వెయిటేజీ అధికంగా గల రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, కోటక్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లలో జోరుగా కొనుగోళ్లు జరిగాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్డీఎఫ్సీ ద్వయం షేర్లు 9–15 శాతం రేంజ్లో దూసుకెళ్లాయి.సెన్సెక్స్ లాభాల్లో ఈ మూడు షేర్ల వాటాయే దాదాపు సగంగా ఉంది. సెన్సెక్స్ మొత్తం 1,862 పాయింట్ల లాభంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ వాటా 416 పాయింట్లు, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ వాటా 363 పాయింట్లుగా, హెచ్డీఎఫ్సీ వాటా 232 పాయింట్లుగా ఉన్నాయి. రిలయన్స్‌కు ‘ఫేస్బుక్’ కిక్ రిలయన్స్ ఇండస్ట్రీస్ టెలికం విభాగం, రిలయన్స్ జియోలో 10% వాటాను ఫేస్బుక్ కొను గోలు చేయనుందన్న వార్తలతో రిలయన్స్ షేర్ జోరుగా పెరిగింది. ఇంట్రాడేలో 22% లాభంతో రూ. 1,152ను తాకిన ఈ షేర్ చివరకు 15 శాతం లాభంతో రూ.1,081 వద్దకు చేరింది. సెన్సెక్స్‌లో బాగా లాభపడిన షేర్ ఇదే. 11 ఏళ్లలో ఈ షేర్ ఇంత గా లాభపడటం ఇదే తొలిసారి. ఈ కంపెనీ మార్కెట్ క్యాప్ రూ. 87,577 కోట్లు పెరిగి రూ.6,85,433 కోట్లకు చేరింది. దేశంలోనే అత్యధిక మార్కెట్ విలువగల కంపెనీ ట్యాగ్ ను మళ్లీ టీసీఎస్ నుంచి చేజిక్కించుకుంది. రూ. 4.7 లక్షల కోట్లు ఎగసిన ఇన్వెస్టర్ల సంపద స్టాక్ మార్కెట్ భారీ లాభాల కారణంగా ఇన్వెస్టర్ల సంపద రూ.4.7 లక్షల కోట్లు ఎగసింది. ఇన్వెస్టర్ల సంపదగా పరిగణించే బీఎస్ఈలో లిస్టైన మొత్తం కంపెనీల మార్కెట్ క్యాప్ రూ.4.7 లక్షల కోట్లు పెరిగి రూ.108.41 లక్షల కోట్లకు పెరిగింది. మార్కెట్ పతన జోరు ఒకింత తగ్గవచ్చు. అయితే సమీప భవిష్యత్తులో పరిమిత శ్రేణిలోనే సూచీలు తీవ్రమైన ఒడిదుడుకులకు గురయ్యే అవకాశాలున్నాయి. మార్కెట్ తరువాతి దశ (పెరగడం లేదా తగ్గడం)లోకి ప్రవేశించే ముందు ఇదే రేంజ్లో కొంత కాలం కొనసాగవచ్చు. దీర్ఘకాలానికి ఇన్వెస్ట్ చేయాలనుకునేవాళ్లకు, యావరేజ్ చేయాలనుకునేవాళ్లకు ఇది మంచి అవకాశమే. –సహజ్ అగర్వాల్, కోటక్ సెక్యూరిటీస్ ఫండమెంటల్స్ పరంగా ఎలాంటి మార్పులు లేకపోయినా, ఉద్దీపన చర్యల ఆశలతో మార్కెట్ లాభపడింది. కోవిడ్–19 వైరస్ కట్టడికి సంబంధించిన శుభవార్తలు వస్తేనే స్టాక్ మార్కెట్లో నిలకడైన ర్యాలీ నెలకొంటుంది. –వినోద్ నాయర్, జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సమీప భవిష్యత్తులో ఒడిదుడుకులు కొనసాగుతాయి. కోవిడ్–19 వైరస్ వ్యాప్తిని ప్రభావవంతంగా అరికట్టగలిగే విష యంపైననే స్టాక్ మార్కెట్ ర్యాలీ ఆధారపడి ఉంటుంది. –అజిత్ మిశ్రా, రెలిగేర్ బ్రోకింగ్ -
క్యూ2 ఫలితాలే దిక్సూచి..!
ఈ వారంలో రిలయన్స్ ఇండస్ట్రీస్, హిందుస్తాన్ యూనిలివర్, విప్రో, అంబుజా, తదితర దిగ్గజ సంస్థలు తమ క్యూ2 ఫలితాలను వెల్లడించనున్నాయి. కంపెనీల క్యూ2 ఫలితాలతో పాటు ప్రపంపవ్యాప్తంగా చోటు చేసుకునే పరిణామాలు కూడా ఈ వారం మార్కెట్ గమనాన్ని నిర్దేశిస్తాయని నిపుణులంటున్నారు. మరోవైపు నేడు (సోమవారం) విడుదలయ్యే రిటైల్, టోకు ధరల ద్రవ్యోల్బణ గణాంకాల, గత శుక్రవారం వెల్లడైన పారిశ్రామికోత్పత్తి గణాంకాల ప్రభావం కూడా మార్కెట్‌పై ఉంటుందని వారంటున్నారు. పాక్షిక ఒప్పందం.... గత 15 నెలలుగా జరుగుతున్న అమెరికా–చైనాల మధ్య వాణిజ్య యుద్ధానికి గత శుక్రవారం జరిగిన పాక్షిక ఒప్పందంతో ఒకింత తెరపడింది. ఇరు దేశాల మధ్య వాణిజ్య ఉద్రిక్తతలతో అంతర్జాతీయ వృద్ధిపై ప్రతికూల ప్రభావం చూపించింది. ఇరు దేశాల మధ్య కుదిరిన పాక్షిక ఒప్పందం ఒకింత సానుకూల ప్రభావం చూపించవచ్చు. అయితే పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతల కారణంగా ముడి చమురు ధరలు భగ్గుమంటే ఆ ప్రభావం మన మార్కెట్‌పై ప్రతికూలంగానే ఉంటుంది. నేడు రిటైల్ గణాంకాలు నేడు సెప్టెంబర్ నెలకు సంబంధించిన రిటైల్, టోకు ధరల ద్రవ్యోల్బణ గణాంకాలు వెల్లడవుతాయి. రేపు(ఈ నెల 15న) ఎగుమతుల గణాంకాలు వస్తాయి. ఇక ఈ నెల 1–4న జరిగిన ఆర్బీఐ ద్రవ్య, పరపతి విధాన సమావేశ వివరాలు (మినిట్స్) 18న(శుక్రవారం) వెల్లడవుతాయి. ఒడిదుడుకులు... ఫలితాల సీజన్ ఆరంభమై ఇది రెండో వారం. ఈ వారంలో దాదాపు 96 కంపెనీలు తమ ఫలితాలను వెల్లడించనున్నాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్, హిందుస్తాన్ యూనిలివర్, ఎస్బీఐ లైఫ్, విప్రో, ఏసీసీ, జీ ఎంటర్టైన్మెంట్, హెచ్డీఎప్సీ బ్యాంక్, అంబుజా సిమెంట్స్, ఎల్ అండ్ టీ ఫైనాన్స్, టీవీఎస్ మోటార్స్, ఎల్ అండ్ టీ ఇన్ఫోటెక్, పీవీఆర్, ఈ జాబితాలో ఉన్నాయి. కంపెనీల ఫలితాలు మార్కెట్ మూడ్‌ను నిర్దేశిస్తాయని శామ్కో సెక్యూరిటీస్ ఎనలిస్ట్ జిమీత్ మోదీ పేర్కొన్నారు. దిగ్గజ కంపెనీల ఫలితాల వెల్లడి కారణంగా మార్కెట్లో ఒడిదుడుకులు చోటు చేసుకోవచ్చని ఎపిక్ రీసెర్చ్ ఎనలిస్ట్ ముస్తఫా నదీమ్ అంచనా వేస్తున్నారు.ఇక అంతర్జాతీయంగా చూస్తే, చైనా క్యూ3 జీడీపీ గణాంకాలు ఈ నెల 18న వస్తాయి. అమెరికా సెప్టెంబర్ నెలకు సంబంధించిన రిటైల్ అమ్మకాల వివరాలు ఈ నెల 16న (బుధవారం) వస్తాయి. 6,200 కోట్ల విదేశీ నిధులు వెనక్కి విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐ) ఈ నెలలో ఇప్పటిదాకా మన క్యాపిటల్ మార్కెట్ నుంచి రూ.6,200 కోట్ల పెట్టుబడులు ఉపసంహరించుకున్నారు. ఎఫ్‌పీఐలు స్టాక్ మార్కెట్ నుంచి రూ.4,955 కోట్లు, డెట్ మార్కెట్ నుంచి రూ.1,262 కోట్లు చొప్పున మొత్తం రూ.6,217 కోట్లు పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. అంతర్జాతీయ వృద్ధి భయాలు, వాణిజ్య యుద్ధ ఆందోళనలు, ప్రభుత్వం పలు చర్యలు తీసుకున్నా, ఆర్థిక వ్యవస్థ ఆశించిన స్థాయిలో పుంజుకోలేకపోవడం దీనికి కారణాలు. కంపెనీల క్యూ2 ఫలితాలు, ప్రపంచ వాణిజ్య పరిణామాలు, ఆర్థిక మందగమనాన్ని నిరోధించేందుకు ప్రభు త్వం తీసుకునే చర్యలు తదితర అంశాలపై విదేశీ నిధుల భవిష్యత్తు పెట్టుబడులు ఆధారపడి ఉంటాయని నిపుణులంటున్నారు. -
బ్యాంక్ నిఫ్టీ...ఫ్యూచర్స్ సిగ్నల్స్
ప్రపంచ ట్రెండ్ ప్రభావంతో మంగళవారం కూడా కొనసాగిన మన మార్కెట్ ర్యాలీలో ప్రధాన సూచీ నిఫ్టీతో పోలిస్తే బ్యాంక్ నిఫ్టీ తక్కువ పెరిగింది. నిఫ్టీ 0.80 శాతం పెరగ్గా, బ్యాంక్ నిఫ్టీ మాత్రం 0.42 శాతం పెరుగుదలతో సరిపెట్టుకుని 24,785 పాయింట్ల వద్ద ముగిసింది. కానీ బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్ కాంట్రాక్టు ఓపెన్ ఇంట్రస్ట్ (ఓఐ)లో 1.72 లక్షల షేర్లు (7.33 శాతం) యాడ్ అయ్యాయి. మొత్తం ఓఐ 25.16 లక్షల షేర్లకు పెరిగింది. క్రితం రోజు స్పాట్ బ్యాంక్ నిఫ్టీతో పోలిస్తే ఫ్యూచర్ 13 పాయింట్ల డిస్కౌంట్‌తో ముగియగా, ఆ డిస్కౌంట్ మంగళవారం 2 పాయింట్లకు తగ్గింది. తాజా లాంగ్ బిల్డప్‌ను ఈ యాక్టివిటీ సూచిస్తున్నది. ఈ గురువారం ముగిసే వీక్లీ ఆప్షన్స్ విభాగంలో 25,000 స్ట్రయిక్ వద్ద తాజా కాల్‌రైటింగ్ ఫలితంగా 2.43 లక్షల షేర్లు యాడ్‌కాగా, 11.08 లక్షల షేర్లతో భారీ కాల్ బిల్డప్ ఇక్కడ వుంది. 24,500, 24,600, 24,700 స్ట్రయిక్స్ వద్ద పుట్ రైటింగ్ జరగ్గా, అన్నింటికంటే ఎక్కువగా 24,700 స్ట్రయిక్ పుట్ ఆప్షన్లో 3.28 లక్షల షేర్లు యాడ్ అయ్యాయి. ఇక్కడ 4.63 లక్షల షేర్ల బిల్డప్ వుంది. మిగతా రెండు స్ట్రయిక్స్ వద్ద 2.50 లక్షల చొప్పున షేర్లు యాడ్ అయ్యాయి. 24,600 స్ట్రయిక్ వద్ద 5.47 లక్షలు, 24,500 స్ట్రయిక్ వద్ద 7.53 లక్షల షేర్ల చొప్పున బిల్డప్ వుంది. వచ్చే రెండు రోజుల్లో బ్యాంక్ నిఫ్టీ 24,700పైన స్థిరపడితే 25,000 స్థాయిని తాకే అవకాశం వుంటుందని, 25,140 పాయింట్ల రికార్డుస్థాయిని చేరాలంటే 25,000 పాయింట్లస్థాయిని బలంగా దాటాల్సివుంటుందని కాల్ ఆప్షన్ డేటా సూచిస్తున్నది. క్షీణత సంభవిస్తే 24,500–24,700 పాయింట్ల శ్రేణి మధ్య మద్దతు పొందవచ్చని పుట్ ఆప్షన్ డేటా వెల్లడిస్తున్నది. -
ర్యాలీకి బ్రేక్ స్వల్పంగా తగ్గిన సూచీలు
ముంబై: వరుసగా మూడు ట్రేడింగ్ సెషన్లుగా జరుగుతున్న మార్కెట్ ర్యాలీకి మంగళవారం బ్రేక్‌పడింది. రోజంతా పరిమితశ్రేణిలో హెచ్చుతగ్గులకు లోనైన స్టాక్ సూచీలు చివరకు స్వల్పనష్టాలతో ముగిసాయి. 187 పాయింట్ల మేర అటూ, ఇటూ ఊగిసలాడిన బీఎస్ఈ సెన్సెక్స్ చివరకు 12 పాయింట్ల నష్టంతో 31.210 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 9,650–9,595 పాయింట్ల మధ్య హెచ్చుతగ్గులకు గురై 2 పాయింట్ల నష్టంతో 9,613 పాయింట్ల వద్ద ముగిసింది. దక్షిణ కొరియా క్షిపణిని ప్రయోగించడంతో భౌగోళిక ఉద్రిక్తతలు తలెత్తుతాయన్న భయాలతో ఇన్వెస్టర్లు లాభాలు స్వీకరించారని, దాంతో మార్కెట్ మందకొడిగా ముగిసిందని విశ్లేషకులు చెప్పారు. ప్రధాన ఆసియా మార్కెట్లు సైతం నష్టాలతో ముగిసాయి. యూరప్ సూచీలు స్వల్పనష్టాల్ని చవిచూడగా, అమెరికా మార్కెట్లకు మంగళవారం సెలవు. 21 సెన్సెక్స్ షేర్లకు నష్టాలు... సెన్సెక్స్–30 షేర్లలో 21 షేర్లు నష్టాలతో ముగిసాయి. యాక్సిస్‌బ్యాంక్ అన్నింటికంటే అధికంగా 2.08 శాతం తగ్గుదలతో రూ. 507 వద్ద ముగిసింది. హీరో మోటో కార్ప్ కూడా 2 శాతంపైగా నష్టపోయింది. డాక్టర్ రెడ్డీస్ లాబ్, ఐటీసీ, సిప్లా, షేర్లు 1–2 శాతం మధ్య తగ్గాయి. వివిధ రంగాల సూచీల్లో అన్నింటికంటే ఎక్కువగా బీఎస్ఈ హెల్త్‌కేర్ ఇండెక్స్ 0.73 శాతం తగ్గింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ షేరు మాత్రం 2.8 శాతం ర్యాలీ జరిపి రూ. 1,423 వద్ద క్లోజయ్యింది. -
మార్కెట్ పరుగుకు బ్రేక్..
8 రోజుల దూకుడుకు పగ్గాలు ముంబై : ఎనిమిది రోజుల మార్కెట్ ర్యాలీకి బుధవారం బ్రేక్ పడింది. బీఎస్ఈ సెన్సెక్స్ 75 పాయింట్లు నష్టపోయి, 27,730 వద్ద ముగిసింది. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ నిఫ్టీ 21 పాయింట్లు నష్టంలో 8,361 వద్ద ముగిసింది. గడచిన ఎనిమిది ట్రేడింగ్ సెషన్స్‌లో సెన్సెక్స్ 1,433 పాయింట్లు లాభపడింది. కారణం..!: రుణ సంక్షోభం నుంచి బయటపడటానికి గ్రీస్ ప్రతిపాదనలు ఫలిస్తాయన్న అంచనాలు గత ట్రేడింగ్ సెషన్స్‌లో భారత్‌కు కలసివచ్చింది. అంచనాలను మించి వర్షాలు కురుస్తుండటంతో రేట్ల కోత ఉండొచ్చన్న సానుకూల అంచనాలు కొనసాగాయి. అయితే రుణ సంక్షోభం పరిష్కార దిశలో గ్రీస్ ప్రతిపాదనను రుణదాతలు తిరస్కరించారన్న తాజా వార్త మార్కెట్ సెంటిమెంట్‌ను బుధవారం దెబ్బతీసింది. ట్రేడింగ్‌లో అధికభాగం సానుకూలంగానే సాగిన మార్కెట్ గ్రీస్ వార్తతో చివరి గంటలో మైనస్‌లోకి జారిపోయింది. మొత్తంగా గురువారం ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ జూన్ కాంట్రాక్ట్ పూర్తి అవుతున్న నేపథ్యంలో మార్కెట్లో ప్రాఫిట్ బుకింగ్ చోటుచేసుకుంది. వెరసి బుధవారం ట్రేడింగ్ ప్రారంభంలోనే 27,948 గరిష్ట స్థాయిని తాకిన సెన్సెక్స్, ట్రేడింగ్ ముగిసే సరికి దాదాపు 200 పాయింట్లు పతనమయ్యింది. నిఫ్టీ సైతం నేటి ట్రేడింగ్‌లో 8,421 పాయింట్ల గరిష్ట స్థాయిని తాకింది. లాభనష్టాల్లో...: 30 సెన్సెక్స్ షేర్లలో 24 నష్టపోయాయి. ట్రేడయిన స్టాక్స్‌లో 1,496 నష్టపోయాయి. 1,222 లాభపడ్డాయి. 134 స్థిరంగా ఉన్నాయి. లాభపడిన సెన్సెక్స్ షేర్లలో బీహెచ్ఈఎల్ (4%), హిందుస్తాన్ యునిలివర్ (2.40%), లుపిన్ (2%), సన్ ఫార్మా (2%), విప్రో (1.5%), ఐసీఐసీఐ బ్యాంక్ (1%) ఉన్నాయి. టర్నోవర్... బీఎస్ఈలో టర్నోవర్ రూ.2,629 కోట్లుగా నమోదయ్యింది. ఎన్ఎస్ఈ నగదు విభాగంలో రూ.16,050 కోట్లుగా, ఎన్ఎస్ఈ డెరివేటివ్స్ విభాగంలో రూ.4,19,991 కోట్లుగా నమోదైంది. -
కీలక మద్దతు 28,800
మార్కెట్ పంచాంగం కొద్ది నెలల నుంచి జరుగుతున్న మార్కెట్ ర్యాలీలతో పోలిస్తే క్రితంవారం అప్‌ట్రెండ్ బలంగా వున్నట్లు ఆయా షేర్ల కదలికలు సూచిస్తున్నాయి. ప్రధాన సూచీలైన సెన్సెక్స్, నిఫ్టీల్లో అంతర్భాగంగా వుండే షేర్లలో 10 శాతం మాత్రమే గత ర్యాలీల్లో కొత్త శిఖరాల్ని చేరుతూవుండేవి. కానీ ఈ దఫా మూడోవంతు షేర్లు రికార్డుల్ని సృష్టించగలిగాయి. తాజా ర్యాలీలో బ్యాంకింగ్‌తో పాటు ఫార్మా, సిమెంటు షేర్లు పాలుపంచుకున్నాయి. వచ్చే కొద్దిరోజుల్లో మరిన్ని షేర్లు సూచీలకు అనుగుణంగా నూతన గరిష్టస్థాయిల్ని చేరుతూవుంటే మార్కెట్ ర్యాలీ చెదిరిపోకుండా వుండటమేకాదు. మరింత ఉధృతమవుతుంది. ఇక సూచీల సాంకేతికాంశాలకొస్తే... సెన్సెక్స్ సాంకేతికాంశాలు... జనవరి 23తో ముగిసినవారం ఐదురోజులూ పెరిగిన బీఎస్ఈ సెన్సెక్స్ తొలిసారిగా 29,000 శిఖరాన్ని అధిరోహించింది. చివరకు అంతక్రితం వారంతో పోలిస్తే 1,157 పాయింట్ల భారీలాభంతో 29,279 వద్ద ముగిసింది. ఈ వారం సెన్సెక్స్ ర్యాలీ కొనసాగితే 29,500-600 లక్ష్యాన్ని చేరవచ్చు. రానున్న రోజుల్లో 30,000 పాయింట్ల మ్యాజిక్ ఫిగర్‌ను చేరాలంటే 29,500-29,600 స్థాయిని దాటాల్సివుంటుంది. ఇక ఈ వారం కరెక్షన్ జరిగితే 28,800 సమీపంలో కీలక మద్దతు లభిస్తున్నది. ఇదే స్థాయి నుంచి బుధవారం భారీ ట్రేడింగ్ పరిమాణంతో మార్కెట్ పెరగడం, ఇదేస్థాయి నవంబర్ 28నాటి రికార్డుస్థాయి అయినందున, 28,800 దిగువన ముగిస్తేనే తదుపరి క్షీణత కొనసాగవచ్చు. ఈ స్థాయి దిగువన మద్దతులు 28,325, 28,200 పాయింట్లు. వచ్చే కొద్దిరోజుల్లో 28,200 స్థాయిని భారీ ట్రేడింగ్ పరిమాణంతో కోల్పోతే ప్రస్తుత అప్‌ట్రెండ్‌కు బ్రేక్‌పడుతుందని టెక్నికల్ చార్టులు వెల్లడిస్తున్నాయి. నిఫ్టీ మద్దతు 8,690 గత మార్కెట్ పంచాంగంలో సూచించినట్లు ఎన్ఎస్ఈ నిఫ్టీ 8,545 స్థాయిని ఛేదించినంతనే పెద్ద ర్యాలీ జరిపింది. చివరకు అంతక్రితంవారంతో పోలిస్తే 322 పాయింట్లు పెరుగుదలతో 8,836 వద్ద ముగిసింది. ఈ వారం నిఫ్టీ క్షీణిస్తే 8,690 వద్ద ప్రధాన మద్దతు లభిస్తున్నది. ఈ మద్దతు కోల్పోకపోతే 9,000 పాయింట్ల శిఖరాన్ని ఈ వారం చేరవచ్చు. ఆ లోపున 8,880 స్థాయిని తొలుత దాటాల్సివుంటుంది. హెచ్చుతగ్గులు ఏర్పడితే 8,690 దిగువన మద్దతుస్థాయిలు 8,575, 8,530 పాయింట్లు. జనవరి డెరివేటివ్ కాంట్రాక్టుల ముగింపు సందర్భంగా పై స్థాయిలో నిఫ్టీకి ఆప్షన్ బిల్డప్ ఇప్పటివరకూ అల్పంగానే వుంది. 9,000 స్ట్రయిక్ వద్ద మాత్రమే కాస్త ఎక్కువగా 44 లక్షల కాల్ బిల్డప్ వుంది. అలాగే దిగువన 8,700, 8,600, 8,500 స్ట్రయిక్స్ వద్ద 46.5-49 లక్షల మధ్య పుట్ బిల్డప్ ఏర్పడింది. ఈ వారం నిఫ్టీకి సమీపస్థాయిలో పెద్దగా నిరోధం, మద్దతుగానీ వుండకపోవచ్చని, సూచీ స్వేచ్ఛగా కదలవచ్చని ఈ ఆప్షన్ బిల్డప్ వెల్లడిస్తున్నది. -
స్వల్ప లాభాలతో రికవరీ
బ్లూచిప్ షేర్ల పెరుగుదలతో దేశీ స్టాక్‌మార్కెట్లు బుధవారం స్వల్ప లాభాలతో రికవర్ అయ్యాయి. సెన్సెక్స్ 48 పాయింట్లు పెరిగి 28,386 వద్ద, నిఫ్టీ 13 పాయింట్లు పెరిగి 8,476 వద్ద ముగిసింది. ఢిల్లీలో ఫ్లోర్ ఏరియా నిష్పత్తిని ప్రభుత్వం పెంచిన సానుకూల పరిణామంతో డీఎల్ఎఫ్ తదితర రియల్టీ స్టాక్స్ ఎగిశాయి. అటు వచ్చే నెలలో వడ్డీ రేట్లలో కోత ఉండొచ్చన్న అంచనాలు, డెరివేటివ్ కాంట్రాక్ట్స్ నెలవారీ ముగింపు ముందు రోజున షార్ట్‌కవరింగ్ కూడా మార్కెట్ల పెరుగుదలకు దోహదపడ్డాయని ట్రేడర్లు తెలిపారు. బీఎస్ఈలో రియల్టీ ఇండెక్స్ అత్యధికంగా 4% పెరగ్గా.. విద్యుత్, మెటల్, ఎఫ్ఎంసీజీ స్టాక్స్ కూడా లాభపడ్డాయి. రియల్టీలో అనంత్‌రాజ్, డీఎల్ఎఫ్, యూనిటెక్ మొదలైన షేర్లు 4-10 శాతం మధ్య పెరిగాయి. క్రితం రోజున 5 శాతం క్షీణించిన ఐటీసీ బుధవారం 2 శాతం మేర పెరిగింది. మరోవైపు, అంతర్జాతీయంగా చాలా మటుకు ఆసియా, యూరప్ మార్కెట్లు లాభాల్లో ట్రేడయ్యాయి. -
వచ్చే ఏడాది 5.5% వృద్ధి: గోల్డ్‌మన్ శాక్స్
ముంబై: వచ్చే ఆర్థిక సంవత్సరంలో భారత్ 5.5% వృద్ధి సాధిస్తుందని అమెరికా బ్యాంకింగ్ దిగ్గజం గోల్డ్‌మన్ శాక్స్ అంచనా వేస్తోంది. ఈ అంచనాల్లో ఎలాంటి రాజకీయ పరిస్థితుల ప్రమేయం లేదని గోల్డ్‌మన్ శాక్స్ ఇండియా ముఖ్య ఆర్థిక వేత్త తుషార్ పొద్దార్ వివరించారు. మూలధన పెట్టుబడులు స్వల్పంగా పెరిగే అవకాశాలుండటం, ఎన్నికల తర్వాత సంభవించే సాధారణ వృద్ధి తదితర అంశాల కారణంగా ఈ వృద్ధి రేటును నిర్ణయించామని పేర్కొన్నారు. బీజేపీకి చెందిన నరేంద్ర మోడి ప్రధానవుతారని అందుకనే భారత స్టాక్‌ల రేటింగ్‌ను అప్‌గ్రేడ్ చేస్తున్నామని ఈ నెల మొదట్లో ఈ కంపెనీ పేర్కొంది. దీంతో వివిధ కేంద్ర మంత్రుల నుంచి విమర్శలు వెల్లువలా వచ్చాయి. రాజకీయాలు చేయకుండా గోల్డ్‌మన్ శాక్స్ తన పని చూసుకోవాలంటూ పలువురు కేంద్ర మంత్రులు విమర్శలు గుప్పించారు. దీంతో తాజా అంచనాల్లో రాజకీయాలను పరిగణనలోకి తీసుకోలేదని నిపుణులంటున్నారు. ఈ ఏడాదిలో 4.3% వృద్ధి నమోదవుతుందని అభిప్రాయాన్నే పొద్దార్ పునరుద్ఘాటించారు. -
బేర్ మార్కెట్ స్వరూపం బయటపడింది
‘‘2008లో బేర్ మార్కెట్ ప్రారంభమైంది. ఇది ప్రస్తుతం తన పూర్తి వాస్తవిక రూపాన్ని సంతరించుకుంది’’ అని మార్కెట్ల తాజా పతనంపై ఫస్ట్ గ్లోబల్ ట్రేడింగ్ వ్యూహకర్త శంకర్ శర్మ ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. మామూలుగా జరిగే మార్కెట్ల నష్టానికీ శుక్రవారం జరిగిన మార్కెట్ల పతనం భిన్నమైందని ఆయన పేర్కొంటూ, ఇది కచ్చితంగా బేర్ మార్కెట్టేనన్న విషయం ఈ పతనంతో స్పష్టమైందని శంకర్‌శర్మ అన్నారు. ‘మార్కెట్లు పూర్తి కనిష్ట స్థాయికి పడినట్లేనా...!’అని అడిగిన ప్రశ్నకు సమాధానం చెబు తూ, ‘మార్కెట్లు పడినప్పుడే మనం ఈ విషయం గురించి ఎందుకు మాట్లాడుకోవాలి. మార్కెట్లు రెండు శాతం ర్యాలీ చేసినప్పుడు అక్కడ లాభాల స్వీకరణ గురించి మనం ఎందుకు మాట్లాడుకోకూడదు. ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సింది పెట్టుబడులను ఎలా రక్షించుకోవాలన్న అంశంపైనే కానీ, కనిష్ట స్థాయికి మార్కెట్లు పడ్డం-ఆ స్థాయిలో చౌక రేటు వద్ద లభించే షేర్ల కొనుగోలు గురించో మరే ఇతర అంశం గురించో కాదు’’ అని అన్నారు. ప్రస్తుత సవాళ్ల నేపథ్యంలో బుల్ మార్కెట్ల సృష్టి అసాధ్యమన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. నిఫ్టీ 5,000 పాయింట్ల స్థాయికి... మార్కెట్ల నష్టకాలం పూర్తికాలేదని ఆయన సూచిస్తూ... సమీప భవిష్యత్తులో నిఫ్టీ 5,000 పాయింట్ల స్థాయికి చేరుతుందని కూడా అంచనావేశారు. భారత్ పలు కఠిన స్థూల ఆర్థిక పరిస్థితులను ఎదుర్కొంటున్న నేపథ్యంలో స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు 5 శాతం కూడా నమోదవడం కష్టమేనన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. బ్య్రాంకింగ్ స్టాక్స్‌కు ఇంకా ఇబ్బందులు పొంచి ఉన్నాయని పేర్కొంటూ, తాను ఈ స్టాక్స్‌లో పెట్టుబడులు పెట్టబోనని వివరించారు. క్రూడ్ రంగం కూడా బేరిష్‌లోనే ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఐటీ స్టాక్స్ పటిష్టంగానే ఉన్నాయని వివరిస్తూ, నారాయణ మూర్తి నేతృత్వంలో ఇన్ఫోసిస్ ఉత్తమ ఫలితాలను నమోదుచేసుకుంటుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అమెరికా మార్కెట్ల గురించి అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ, ఈ మార్కెట్లు కొంత పతనం కావచ్చుకానీ, వర్ధమాన దేశాల స్థాయిలో ఈ పతనం రేటు ఉండకపోవచ్చన్నారు. సహాయక ప్యాకేజీల ఉపసంహరణలపై కూడా ఇది ఆధారపడి ఉంటుందని వివరించారు.