Martina Navratilova
-
క్యాన్సర్ నుంచి కోలుకున్న టెన్నిస్ దిగ్గజం
టెన్నిస్ దిగ్గజం మార్టినా నవ్రతిలోవా భయంకరమైన క్యాన్సర్ నుంచి పూర్తిగా కోలుకుంది. 66 ఏళ్ల ఈ టెన్నిస్ సూపర్‌స్టార్ జనవరిలో రొమ్ము, గొంతు క్యాన్సర్ బారిన పడింది. వెంటనే జాగ్రత్త పడి ప్రారంభ దశలోనే చికిత్స ప్రారంభించడంతో కోలుకుంది. గతంలో 2010లో కూడా ఇదే రొమ్ము క్యాన్సర్ నుంచి ఆమె సురక్షితంగా బయటపడింది. నవ్రతిలోవా కెరీర్లో 18 గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్స్ నెగ్గింది. చదవండి: #SikandarRaza: జింబాబ్వే తరపున ఫాస్టెస్ట్ సెంచరీ.. రెండు రోజుల్లోనే చెరిపేసి -
క్యాన్సర్ మహమ్మారి నుంచి బయటపడిన టెన్నిస్ దిగ్గజం
మహిళల టెన్నిస్ దిగ్గజం మార్టినా నవ్రతిలోవా క్యాన్సర్ మహమ్మారి నుంచి బయటపడింది. మూడు నెలల క్రితం నవ్రతిలోవా గొంతు, బ్రెస్ట్ క్యాన్సర్‌కు గురైనట్లు వైద్యులు పేర్కొన్నారు. అప్పటినుంచి క్యాన్సర్‌తో పోరాడిన ఆమె ఎట్టకేలకు దాని నుంచి విముక్తి పొందినట్లు స్వయంగా ప్రకటించింది. ''క్యాన్సర్ మహమ్మారి నుంచి ఇంత త్వరగా కోలుకుంటానని అనుకోలేదు. చికిత్స సందర్భంగా 15 పౌండ్ల బరువు తగ్గాను. ఆ సమయంలో ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నా. అన్ని భరించి ఇవాళ మహమ్మారి నుంచి విముక్తి సంపాదించా. ఇక క్యాన్సర్ నుంచి విముక్తి కలగగానే టీవీ చానల్ బాధ్యతల్లో లీనమయ్యా.'' అంటూ తెలిపింది. ప్రస్తుతం 66 ఏండ్ల నవ్రతిలోవా మియామీ ఓపెన్‌లో టీవీ చానల్ ప్రజెంటర్‌గా వ్యవహరిస్తుంది. అమెరికాకు చెందిన మార్టినా నవ్రతిలోవా 18 సింగిల్స్ , 31 మహిళల డబుల్స్, 10 మిక్స్డ్ డబుల్స్‌తో మొత్తంగా 59 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ నెగ్గి చరిత్ర సృష్టించింది. 1970,80వ దశకంలో ఆమె సమకాలీకురాలు క్రిస్ ఎవర్ట్‌తో పోటీ పడిన నవ్రతిలోవా దిగ్గజ టెన్నిస్ ప్లేయర్‌గా రికార్డులకెక్కింది.1981లో అమెరికా పౌరసత్వం రాగానే తనను తాను లెస్బియన్‌గా ప్రకటించుకున్న నవ్రతిలోవా అప్పటి నుంచి ఎల్జీబీటీ(LGBT) హక్కుల కోసం పోరాడుతూ వచ్చింది. చదవండి: దేశం క్లిష్ట పరిస్థితుల్లో.. వాళ్లకు ప్లాట్లు, ఖరీదైన ఫోన్లు? అంతర్జాతీయ క్రికెట్‌కు సీనియర్ క్రికెటర్ గుడ్‌బై -
Martina Navratilova: మాజీ ఛాంపియన్‌కు ఒకేసారి రెండు క్యాన్సర్లు
మియామి: టెన్నిస్ దిగ్గజం మార్టినా నవ్రతిలోవా(66) మళ్లీ క్యాన్సర్ బారిన పడ్డారు. తాజాగా ఆమెకు గొంతు, రొమ్ము క్యాన్సర్ సోకినట్లు తాజాగా తేలింది. అది స్టేజ్ వన్‌లోనే ఉందని తెలుస్తోంది. అంటే ఆరంభ దశ అన్నమాట. మెడ దగ్గర చిన్నకణితి ఏర్పడడంతో వైద్య పరీక్షలు చేయించుకోవడంతో.. గొంతు క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్ ఉందని వెల్లడైంది. కాగా, నవ్రతిలోవా క్యాన్సర్ బారిన పడడం రెండోసారి. తన కెరీర్లో 18 గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిళ్లు గెలిచారు ఆమె. సింగిల్స్, డబుల్స్, మిక్స్డ్ డబుల్స్‌తో కలిపి గ్రాండ్‌స్లామ్‌లో మొత్తం 59 సార్లు ఛాంపియన్‌గా నిలిచారు. ప్రపంచ ఉత్తమ టెన్నిస్ క్రీడాకారుల్లో ఒకరైన మార్టినా నవ్రతిలోవాకు గతంలో రొమ్ము క్యాన్సర్ సోకగా.. ఆరు నెలల పాటు చికిత్స తీసుకుని కోలుకున్నారు. ‘‘ఒకేసారి రెండు రకాల క్యాన్సర్లు సోకడం తీవ్రమైన అంశమే. కానీ, చికిత్సతో జయించే అవకాశం ఉంది. ఫలితం సానుకూలంగా వస్తుందనే నమ్ముతున్నా. కొద్దికాలం హాస్పిటల్ వాసన భరించక తప్పదు. నా శక్తికొద్దీ పోరాడతా’’ అని 66 ఏళ్ల నవ్రతిలోవా తెలిపారు. 2010లో క్యాన్సర్ బారిన పడినప్పుడు నిస్సహాయంగా మారనని, అందుకే ఇలాంటి సమస్యలను వెలుగులోకి తీసుకురావడం వల్ల తనలా బాధపడుతున్న మహిళలకు సహాయం చేయవచ్చని నిర్ణయించుకున్నట్లు ఆమె తెలిపారు. చెక్-అమెరికన్ అయిన నవ్రతిలోవా కుటుంబంతో ప్రస్తుతం ఫ్లోరిడా మియామీలో ఉంటున్నారు. త్వరలోనే ఆమె చికిత్స తీసుకుంటారని కుటుంబ సభ్యులు వెల్లడించారు. -
మోదీపై అమిత్ షా ప్రశంసలు.. వ్యంగ్యంగా స్పందించిన టెన్నిస్ దిగ్గజం
Tennis Legend Martina Navratilova Tweet Over Amit Shah And Modi: భారత ప్రధాని నరేంద్ర మోదీపై టెన్నిస్ దిగ్గజ క్రీడాకారిణి మార్టినా నవ్రతిలోవా ట్విటర్ వేదికగా సంచలన వ్యాఖ్యలు చేసింది. తరుచూ మోదీపై వ్యతికేర వ్యాఖ్యలు చేసే ఆమె.. తాజా మరోసారి అలాంటి వ్యాఖ్యలనే చేసి ట్రోలింగ్‌కు గురైంది. మోదీ నియంత కాదు, ఆయన ఓ గొప్ప ప్రజాస్వామవాది అంటూ ఇటీవల కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేసిన ట్వీట్‌పై ఆమె వ్యంగ్యంగా స్పందించింది. ఇదో పెద్ద జోక్ అంటూ అమిత్ షా కామెంట్‌ను రీట్వీట్ చేస్తూ.. జోకర్ ఫోటోను జత చేసింది. ఈ ట్వీట్ ప్రస్తుతం సోషల్‌మీడియాలో తెగ హల్చల్ చేస్తోంది. And for my next joke …😳🤡 https://t.co/vR7i5etQcv — Martina Navratilova (@Martina) October 10, 2021 కాగా, భారత ప్రధాని మోదీ, అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ల విధానాలను నవ్రతిలోవా తప్పుపడుతూ వస్తున్నారు. రాజకీయ లబ్ధి కోసం ఈ ఇద్దరూ నిజాలను అణిచివేస్తారని ఆమె పలు సందర్భాల్లో వ్యాఖ్యానించారు. ఇదిలా ఉంటే, అమెరికాకు చెందిన 64 ఏళ్ల మార్టినా నవ్రతిలోవా మహిళ టెన్నిస్‌లో ఆల్‌టైమ్ గ్రేట్ ప్లేయర్‌గా ప్రఖ్యాతి చెందారు. ఆమె ఖాతాలో 18 సింగిల్స్ గ్రాండ్‌స్లామ్ టైటిళ్లతో పాటు 31 మహిళల మేజర్ డబుల్స్ టైటిళ్లు, 10 మేజర్ మిక్స్డ్ డబుల్స్ టైటిళ్లు కలపి మొత్తం 59 టైటిళ్లు ఉన్నాయి. చదవండి: బీసీసీఐపై పాక్ ప్రధాని సంచలన వ్యాఖ్యలు.. -
టెన్నిస్ వండర్స్
అలనాటి టెన్నిస్ దిగ్గజం మార్టినా నవ్రతిలోవా బుధవారం సానియా మీర్జాతో కలసి ముర్తుజాగూడలోని టెన్నిస్ అకాడమీలో సందడి చేశారు. వింబుల్డన్ డబుల్స్ టైటిల్ సొంతం చేసుకున్న సానియాను ఉమెన్స్ టెన్నిస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. సైబరాబాద్ కమిషనర్ సీవీ ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. -
స్ఫూర్తి ప్రదాతలు
సాధారణంగా క్రీడాకారులంటేనే పోరాటయోధులు. ఒక మ్యాచ్‌లో లేదా టోర్నీలో ఓడిపోయినా నీరు గారిపోరు.. కసితో మళ్లీ బరిలోకి దిగుతారు. ఓటమిని జీవన్మరణ సమస్యగా తీసుకుని తాము అనుకున్నది సాధిస్తారు. అయితే ఎదుటివారికి ఆదర్శంగా నిలిచే స్పోర్ట్స్ స్టార్లు కొందరు నిజ జీవితంలోనూ జీవన్మరణ సమస్యల్ని ఎదుర్కొన్నారు. తీవ్రమైన వ్యాధుల బారిన పడినా, వాటిని అధిగమించి మళ్లీ మైదానంలో సత్తా చాటారు. మరికొందరు రిటైర్మెంట్ తర్వాత వ్యాధుల బారిన పడి, వాటిని అధిగమించారు. కొందరైతే తాము అనుభవించిన బాధలు ఎదుటివాళ్లు పడొద్దన్న ఉద్దేశంతో చారిటీలను ఏర్పాటు చేసి బాధితులకు అండగా నిలుస్తున్నారు. అలాంటి వారిలో కొందరి గురించి... - శ్యామ్ తిరుక్కోవళ్లూరు యువరాజ్ క్రికెట్ కెరీర్‌ను కొనసాగిస్తూ క్యాన్సర్ బారిన పడిన ఏకైక క్రికెటర్ యువరాజ్.. 2011లో భారత క్రికెట్ జట్టు ప్రపంచకప్ సాధించిన తర్వాత అనారోగ్యానికి గురయ్యాడు. అయితే ఆ అనారోగ్యానికి కారణం క్యాన్సర్ కణితిగా పరీక్షల్లో తేలింది. యువరాజ్ ఎడమ ఊపిరితిత్తిలో కణితి ఉందని గుర్తించడంతో అమెరికాలోని బోస్టన్‌కు వెళ్లి కీమో థెరపీ చేయించుకున్నాడు. ఆ తర్వాత ఇండియానాలోనూ చికిత్స పొందాడు. 2012లో పూర్తిగా కోలుకుని మళ్లీ బ్యాట్ పట్టి అంతర్జాతీయ క్రికెట్లోకి పునరాగమనం చేశాడు. ప్రస్తుతం జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న యువీ.. ఐపీఎల్ ఏడో సీజన్లో రాణించాడు. మొత్తానికి రీ ఎంట్రీలోనూ అదరగొడుతున్న యువరాజ్ అందరికీ స్ఫూర్తిగా నిలిచాడు. ఇక యువరాజ్ ‘యు వియ్ కెన్’ పేరుతో క్యాన్సర్ చారిటీని ఏర్పాటు చేశాడు. ఈ చారిటీ ద్వారా క్యాన్సర్ రోగులను ఆదుకుంటున్నాడు. టిమ్ హోవార్డ్ అమెరికా స్టార్ గోల్ కీపర్. సాకర్ ప్రపంచకప్‌లో బెల్జియంతో మ్యాచ్‌లో 16 గోల్ ప్రయత్నాలను అడ్డుకుని చరిత్ర సృష్టించాడు. ప్రపంచంలో ఏ గోల్‌కీపర్‌కు సాధ్యం కాని రీతిలో గోల్‌పోస్ట్ దగ్గర అద్భుతమైన విన్యాసాలు చేశాడు. ఈ మ్యాచ్‌లో అమెరికా చిత్తయినా... బెల్జియం ఆటగాళ్లు గోల్స్ వర్షం కురిపించేందుకు చేసిన ప్రయత్నాలను దీటుగా ఎదుర్కొన్నాడు. అయితే బంతిని అందుకునేందుకు అతను చేసిన విన్యాసాలు చూసిన వారేవరికైనా సూపర్మ్యాన్లా కనిపించాడు. టిమ్ హోవార్డ్ అద్భుత ప్రదర్శనకు 9 ఏళ్ల వయసులో అతనికి వచ్చిన టోరెట్టె సిండ్రోమే కారణం. ఈ సిండ్రోమ్ బారిన పడటం వల్ల హోవార్డ్‌కు వెంటనే స్పందించే లక్షణాలు వచ్చాయని న్యూరో స్పెషలిస్టులు చెబుతున్నారు. మెదడులో న్యూరో సెక్రియాట్రిక్ రుగ్మతతో బాధపడిన హోవార్డ్, ఆ తర్వాత దానిని అధిగమించాడు. టోరెట్టె సిండ్రోమ్ నుంచి కోలుకుని గోల్‌కీపర్‌గా రాణించడమంటే మాటలు కాదు.. కఠోర శ్రమ వల్లే అతను ఈ స్థాయికి చేరుకోగలిగాడు. ప్రపంచకప్‌లో హోవార్డ్ అద్భుత ప్రదర్శన అమెరికా అధ్యక్షుడు ఒబామాను ఆకట్టుకోవడమే కాదు.. ఆయన నుంచి ప్రశంసలు కూడా అందుకున్నాడు. మొత్తానికి ప్రపంచకప్‌తో అమెరికా ఫుట్‌బాల్‌కు నయా స్టార్ దొరికాడు. మార్టినా నవ్రతిలోవా టెన్నిస్ దిగ్గజాల్లో మార్టినా నవ్రతిలోవా కూడా ఒకరు. ఒకప్పుడు అంతర్జాతీయ టెన్నిస్‌లో ఓ వెలుగు వెలిగిన నవ్రతిలోవా.. మార్టినా హింగిస్ లాంటి టెన్నిస్ స్టార్లకు ఆదర్శం. ప్రస్తుతం కోచ్‌గా సేవలందిస్తున్న ఈ మాజీ చెక్, అమెరికా టెన్నిస్ క్రీడాకారిణి బ్రెస్ట్ కాన్సర్ బారిన పడింది. నాలుగేళ్ల కిందట (2010లో) ఈ విషయాన్ని మీడియాకు వెల్లడించింది. దీనిపై అవగాహన కల్పించాలన్న లక్ష్యంతో ఈ విషయాన్ని ఆమె బయటపెట్టింది. ఈ సమస్య నుంచి బయటపడిన మార్టినా నవ్రతిలోవా అందరికీ ఆదర్శంగా నిలిచింది. విల్మా రుడాల్ఫ్ ఈమె జీవితమే ఒక పాఠం.. చిన్నతనంలో పోలియో బారిన పడింది. 12 ఏళ్ల వయసులో రుడాల్ఫ్ కోరింత దగ్గు, తీవ్ర జ్వరం, తట్టు ఇలా అనారోగ్యం నుంచి బయటపడి చివరికి అథ్లెట్‌గా తానేంటో నిరూపించుకుంది. పోలియో కారణంగా ఎడమ కాలులో తేడా ఉండటంతో దాన్ని సరిచేసుకుని ట్రాక్ అండ్ ఫీల్డ్‌లో సత్తా చాటింది. 1960 ఒలింపిక్స్‌లో రుడాల్ఫ్ మూడు పతకాలు సాధించి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆ తర్వాత ట్రాక్ అండ్ ఫీల్డ్‌లో ఫాస్టెస్ట్ అథ్లెట్‌గా అందరి మన్ననలు పొందిన రుడాల్ఫ్ భావితరాలకు స్ఫూర్తిగా నిలిచింది. వీనస్ విలియమ్స్ అమెరికా టెన్నిస్ బ్యూటీ... తన చెల్లెలు సెరెనా విలియమ్స్‌తో కలసి టెన్నిస్ కోర్టులో అద్భుతాలు సృష్టించింది. 2000 నుంచి 2010 వరకు టెన్నిస్‌లో ఆధిపత్యం ప్రదర్శించిన వీనస్.. జగ్రెన్స్ సిండ్రోమ్ అనే అరుదైన స్వయం నిరోధిత లోపంతో బాధపడింది. ఆయాసం, కీళ్లనొప్పి కారణంగా 2011లో యూఎస్ ఓపెన్ మధ్యలోనే నిష్ర్కమించింది. జగ్రెన్స్ నుంచి బయటపడిన ఈ అమెరికా స్టార్.. 2012లో వింబుల్డన్ మహిళల డబుల్స్‌లో సెరెనాతో కలసి టైటిల్‌ను చేజిక్కించుకుంది. అదే ఏడాది లండన్ ఆతిథ్యమిచ్చిన ఒలింపిక్స్‌లో బంగారు పతకం సాధించింది. మళ్లీ టెన్నిస్‌లో తనదైన ముద్ర వేసేందుకు ఈ బ్లాక్ బ్యూటీ ప్రయత్నిస్తోంది. లో గెహ్రాగ్ అమెరికాకు చెందిన అద్భుతమైన బేస్‌బాల్ ఆటగాడు. అమ్యోట్రోఫిక్ లాటరల్ స్ల్కేరోసిస్(ఏఎల్ఎస్) కారణంగా 37 ఏళ్లకే కన్నుమూసిన గెహ్రాగ్.. తాను ఈ వ్యాధితో బాధపడుతున్న విషయాన్ని కెరీర్‌ను కొనసాగిస్తున్న సమయంలోనే బయట పెట్టాడు. సాధారణంగా ఎవరైనా ఏదైనా వ్యాధితో బాధపడుతున్నప్పుడు ఆ విషయాన్ని బయటపెట్టేందుకు అస్సలు ఇష్టపడరు. అయితే గెహ్రాగ్ మాత్రం అలా చేయలేదు. ఏఎల్ఎస్ విషయాన్ని బయట పెట్టడంతో ఇప్పుడు అంతా దీన్ని లో గెహ్రాగ్ వ్యాధి అని పిలుస్తుంటారు. అంతేకాదు తనకు వ్యాధి ఉందన్న సంగతిని బయటపెట్టిన తొలి క్రీడాకారుడు కూడా గెహ్రాగే. మొహమ్మద్ అలీ అమెరికాకు చెందిన 72 ఏళ్ల బాక్సింగ్ దిగ్గజం మొహమ్మద్ అలీ.. కెరీర్ ముగిశాక పార్కిన్సన్ వ్యాధి బారిన పడ్డాడు. మూడుసార్లు హెవీ వెయిట్ చాంపియన్‌షిప్ సాధించి చరిత్ర సృష్టించిన అలీలో తొలిసారిగా 1981లో పార్కిన్సన్ లక్షణాలు కనిపించాయి. అయితే మూడేళ్ల తర్వాత (42 ఏళ్ల వయసులో) అది పార్కిన్సనే అని డాక్టర్లు నిర్వహించిన పరీక్షల్లో తేలింది. అప్పటికే బాక్సింగ్ కెరీర్‌ను ముగించిన బాక్సింగ్ దిగ్గజం ఈ వ్యాధిని ఇప్పటికీ ఎదుర్కొంటున్నాడు. 30 ఏళ్లుగా పార్కిన్సన్తో పోరాడుతున్న అలీ తనలా వేరేవాళ్లు ఈ వ్యాధి బారిన పడకుండా... 1997లో పార్కిన్సన్ రీసెర్చ్ సెంటర్‌ను ఏర్పాటు చేసి అందరికీ స్ఫూర్తిగా నిలిచాడు. వ్యాధుల బారిన పడిన ఇతర ప్లేయర్లు... అర్థర్ యాష్ (టెన్నిస్)-ఎయిడ్స్/హెచ్ఐవీ కరీం అబ్దుల్ జబ్బార్ (బాస్కెట్‌బాల్)-లుకేమియా -
‘గే’ అథ్లెట్లకు మద్దతివ్వండి: మార్టినా నవ్రతిలోవా
యునెటైడ్ నేషన్స్: అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ)లాంటి ప్రపంచ స్పోర్ట్స్ బాడీలు... స్వలింగ సంపర్క అథ్లెట్లకు మరింత మద్దతు ఇవ్వాలని అమెరికా టెన్నిస్ దిగ్గజం మార్టినా నవ్రతిలోవా, ఎన్బీఏ ప్లేయర్ జాసన్ కొలిన్స్ కోరారు. ఈ అంశంలో ఐఓసీ మరింత స్వేచ్ఛగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని నవ్రతిలోవా వ్యాఖ్యానించారు. స్వలింగ సంపర్కులపై జరుగుతున్న హింస, వివక్షపై ఐక్యరాజ్య సమితి చేపట్టిన ప్రచార కార్యక్రమానికి ఈ ఇద్దరు ప్లేయర్లు మద్దతుగా నిలిచారు. ‘ఇది ఒక్క దేశానికే పరిమితం కాలేదు. అన్ని దేశాల్లో ఇది కొనసాగుతోంది. అయినా దీని గురించి ఎవరూ మాట్లాడటం లేదు. 2022 ఫిఫా వరల్డ్‌కప్ ఖతార్‌లో జరగనుంది. అక్కడి నిబంధనల ప్రకారం స్వలింగసంపర్క చర్యకు జైలు శిక్ష వేస్తారు’ అని నవ్రతిలోవా ఆందోళన వ్యక్తం చేశారు. రాబోయే ఒలింపిక్స్, సోచీలో జరగనున్న పారాలింపిక్స్‌లో స్వలింగ సంపర్కుల పట్ల కొంత మంది అధికారులు చాలా కఠినంగా వ్యవహరించబోతున్నారు. అయితే దీనిపై స్పందించిన కొలిన్స్ మాట్లాడుతూ... ‘స్థానికంగా ఉండే స్వలింగ సంపర్కులు, లెస్బియన్స్, లింగమార్పిడి వ్యక్తులపై దృష్టిపెడితే బాగుంటుంది. కానీ క్రీడలు ఆడేందుకు వచ్చే వారిపై ఇలాంటి నిబంధనలు పెట్టడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు’ అని కొలిన్స్ వివరించారు.