
Tennis Legend Martina Navratilova Tweet Over Amit Shah And Modi: భారత ప్రధాని నరేంద్ర మోదీపై టెన్నిస్ దిగ్గజ క్రీడాకారిణి మార్టినా నవ్రతిలోవా ట్విటర్ వేదికగా సంచలన వ్యాఖ్యలు చేసింది. తరుచూ మోదీపై వ్యతికేర వ్యాఖ్యలు చేసే ఆమె.. తాజా మరోసారి అలాంటి వ్యాఖ్యలనే చేసి ట్రోలింగ్‌కు గురైంది. మోదీ నియంత కాదు, ఆయన ఓ గొప్ప ప్రజాస్వామవాది అంటూ ఇటీవల కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేసిన ట్వీట్‌పై ఆమె వ్యంగ్యంగా స్పందించింది. ఇదో పెద్ద జోక్ అంటూ అమిత్ షా కామెంట్‌ను రీట్వీట్ చేస్తూ.. జోకర్ ఫోటోను జత చేసింది. ఈ ట్వీట్ ప్రస్తుతం సోషల్‌మీడియాలో తెగ హల్‌చల్ చేస్తోంది.
And for my next joke …😳🤡 https://t.co/vR7i5etQcv
— Martina Navratilova (@Martina) October 10, 2021
కాగా, భారత ప్రధాని మోదీ, అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ల విధానాలను నవ్రతిలోవా తప్పుపడుతూ వస్తున్నారు. రాజకీయ లబ్ధి కోసం ఈ ఇద్దరూ నిజాలను అణిచివేస్తారని ఆమె పలు సందర్భాల్లో వ్యాఖ్యానించారు. ఇదిలా ఉంటే, అమెరికాకు చెందిన 64 ఏళ్ల మార్టినా నవ్రతిలోవా మహిళ టెన్నిస్‌లో ఆల్‌టైమ్ గ్రేట్ ప్లేయర్‌గా ప్రఖ్యాతి చెందారు. ఆమె ఖాతాలో 18 సింగిల్స్ గ్రాండ్‌స్లామ్ టైటిళ్లతో పాటు 31 మహిళల మేజర్ డబుల్స్ టైటిళ్లు, 10 మేజర్ మిక్స్‌డ్ డబుల్స్ టైటిళ్లు కలపి మొత్తం 59 టైటిళ్లు ఉన్నాయి.
చదవండి: బీసీసీఐపై పాక్ ప్రధాని సంచలన వ్యాఖ్యలు..