Meals shutdown
-
ఆఫీసులో ఉచిత మీల్స్, స్నాక్స్ కట్..
న్యూఢిల్లీ: ఎడ్టెక్ సంస్థ అన్ఎకాడమీ ఇకపై అనవసర వ్యయాలను గణనీయంగా తగ్గించుకుని, లాభదాయకతపై మరింతగా దృష్టి పెట్టాలని నిర్ణయించుకుంది. ఇందులో భాగంగా మేనేజ్మెంట్ జీతాల్లో కోత విధించడంతో పాటు గ్లోబల్ టెస్ట్ ప్రెప్ వంటి కొన్ని వ్యాపారాలను కూడా మూసివేయనుంది. సంస్థ ఉద్యోగులకు రాసిన లేఖలో వ్యవస్థాపకుడు, సీఈవో గౌరవ్ ముంజల్ ఈ విషయాలు తెలిపారు. ఆఫీసులో కాంప్లిమెంటరీగా ఇచ్చే మీల్స్, స్నాక్స్ కూడా ఇకపై ఉండబోవని ఆయన పేర్కొన్నారు. వ్యవస్థాపకులు, టాప్ మేనేజ్మెంట్తో పాటు ఎవరికీ కూడా బిజినెస్ క్లాస్ విమాన ప్రయాణాల్లాంటి ప్రయోజనాలు లభించనవి ముంజల్ తెలిపారు. అంతే కాకుండా టాప్ ఎగ్జిక్యూటివ్‌ల కోసం ప్రత్యేకంగా నియమించిన డ్రైవర్లను కూడా తొలగిస్తున్నామని చెప్పారు. కంపెనీ ఖాతాల్లో పుష్కలంగా రూ. 2,800 కోట్ల మేర నిధులు ఉన్నప్పటికీ .. వచ్చే రెండేళ్లలో పబ్లిక్ ఇష్యూకి వస్తున్న నేపథ్యంలో లాభదాయకతను పెంచుకునేందుకే ఈ చర్యలు తీసుకుంటున్నట్లు ముంజల్ వివరించారు. పనితీరు బాగాలేదంటూ ఇటీవలే 10 శాతం మంది సిబ్బందిని (దాదాపు 600 మంది) తొలగించిన అన్ఎకాడమీ తాజాగా మరిన్ని వ్యయ నియంత్రణ చర్యలు ప్రకటించడం ప్రాధాన్యం సంతరించుకుంది. -
పీజీ హాస్టల్లో ఆకలి కేకలు
రెండు రోజులుగా భోజనాలు బంద్ ఆకలితో అలమటిస్తున్న విద్యార్థులు రాయచూరు : గుల్బర్గా వర్సిటీకి అనుబంధంగా స్థానిక శివారు ప్రాంతంలోని జ్ఞానతుంగ స్నాతకోత్తర కేంద్రం హాస్టల్లో ఆకలికేకలు మార్మోగుతున్నాయి. హాస్టల్ అస్తవ్యస్త నిర్వహణ కారణంగా రెండు రోజులుగా విద్యార్థులు ఆకలిదప్పులతో అలమటిస్తున్నారు. నీటి సౌకర్యం లేక రెండు రోజులుగా స్నానాలకు కూడా నోచుకోవడం లేదు. హాస్టల్లో వివిధ జిల్లాల నుంచి వచ్చిన 130 విద్యార్థులు, 10 విద్యార్థినిలు వసతి పొందుతున్నారు. ప్రస్తుత విద్యాసంవత్సరం నుంచి టిఫిన్లు, భోజనాల కోసం టెండర్లు పిలిచి కంట్రాక్టు ఇచ్చారు. కాంట్రాక్టర్ అందజేస్తున్న భోజనంలో నాణ్యత లేదని రెండు రోజుల క్రితం విద్యార్థులు ఆరోపించడంతో కాంట్రాక్టర్ ఏకంగా భోజనాలు వడ్డించడం మానేశారు. దీంతో విద్యార్థులు బయటి హోటళ్లను ఆశ్రయించారు. జేబులు ఖాళీ కావడంతో దాదాపు 80 మంది స్వగ్రామాలకు వెళ్లిపోగా 40 విద్యార్థులు ఒక్కొక్కరు 20 రూపాయలు చందా వేసుకొని ఒకపూట భోజనం ఏర్పాటు చేసుకున్నారు. ఈ విషయంపై హాస్టల్ ప్రత్యేక అధికారి, ఇంచార్జి వార్డెన్‌ను వివరణ కోరగా తన నిస్సాహాయతను వ్యక్తం చేశారు. ఆ కేంద్రం ప్రత్యేక అధికారి భాస్కర్ మాట్లాడుతూ కాంట్రాక్టర్‌తో వివాదం ఫలితంగానే విద్యార్థుల ఈ పరిస్థితి వచ్చిందన్నారు. ఈ విషయంలో చట్టరీత్య చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. విషయాన్ని కలెక్టర్ శశికాంత్ సెంథిల్ దృష్టికి తీసుకెళ్లగా గుల్బర్గ విశ్వవిద్యాలయం కులపతితో మాట్లాడి భోజన ఇతర వసతులకు అత్యవసర ఏర్పాట్లు చేయాలని కోరతానన్నారు.