measurement
-
కుండంత పొట్ట : ఇలా కొలుచుకొని జాగ్రత్త పడండి!
శరీరం బరువు ఉండాల్సినంతే ఉన్నప్పటికీ పొట్ట పెద్దగా ముందుకు వచ్చి కనిపిస్తుంటే అది కాస్తంత ప్రమాదకరమైన కండిషన్ అని గుర్తుంచుకోవాలి. ఇదెంత ప్రమాదకరం, పొట్టను ఏ మేరకు తగ్గించుకోవాలి అనే విషయాలు ఓ టేప్ సహాయంతో తెలుసుకోవచ్చు. ఇలా కొలిచే సమయంలో పొట్టను బొడ్డుకు ఒక అంగుళంపైనే కొలవాలి. ఆ కొలతకూ, పిరుదుల కొలతకు నిష్పత్తిని లెక్కగట్టాలి. అంటే నడుము కొలతని హిప్ కొలతతో భాగించాలి. అదెప్పుడూ ఒకటి కంటే తక్కువగానే (అంటే జీరో పాయింట్ డెసిమల్స్‌లో) వస్తుంది. సాధారణంగా నడుము కొలత, హిప్స్ భాగం కొలత కంటే తక్కువగా ఉండటమే ఇందుకు కారణం. సాధారణంగా మహిళల్లో ఈ కొలత విలువ 0.85 కంటే తక్కువగా ఉండాలి. పురుషులకు ఇది 0.9 కంటే తక్కువగా రావాలి. ఈ నిష్పత్తినే డబ్ల్యూహెచ్ఆర్ (వేయిస్ట్ బై హిప్ రేషియో) అంటారు. పైన పేర్కొన్న ప్రామాణిక కొలతల కంటే ఎక్కువగా వస్తే ... అంటే... ఈ రేషియో విలువ... మహిళల్లో 0.86 కంటే ఎక్కువగానూ, పురుషులలో 0.95 కంటే ఎక్కువగా ఉంటే అది కాస్త ప్రమాదకరమైన పరిస్థితి అని గుర్తుంచుకోవాలి. అలా కొలతలు ఎక్కువగా ఉన్నాయంటే వారికి ‘అబ్డామినల్ ఒబేసిటీ’ ఉందనడానికి అదో సూచన. దీన్నే సెంట్రల్ ఒబేసిటీ అని కూడా అంటారు. (స్నానం చేయడు.. గంగాజలం చల్లుకుంటాడు.. నా కొద్దీ పెనిమిటి!)ఇలా అబ్డామినల్ ఒబేసిటీ లేదా సెంట్రల్ ఒబేసిటీ ఉన్నవారికి గుండెసమస్యలు / గుండెపోటు వచ్చే అవకాశాలు ఎక్కువ. అందుకే ఈ నిష్పత్తి (వేయిస్ట్ బై హిప్ రేషియో) ఉండాల్సిన ప్రామాణిక విలువల కన్నా ఎక్కువగా ఉన్నవారు వాకింగ్ లేదా శరీరానికి మరీ ఎక్కువ శ్రమ కలిగించని వ్యాయామాలతో పొట్ట చుట్టుకొలతను (పొట్టని) తగ్గించుకోవడమన్నది గుండెకూ, ఆరోగ్యానికి అన్ని విధాలా మంచిది. ఇదీ చదవండి: పెళ్లైన ఇన్నాళ్లకు, ఇంటిపేరు మార్చుకున్న అలియా -
మేడమ్ తుస్సాడ్స్‌లో...
దుబాయ్‌లోని మేడమ్ తుస్సాడ్స్‌లో అల్లు అర్జున్ మైనపు బొమ్మ ఏర్పాటు కానుంది. ఇందుకు సంబంధించి మేడమ్ తుస్సాడ్స్ ప్రతినిధులు అల్లు అర్జున్ కొలతలను తీసుకున్నారు. దాదాపు 200 కొలతలు తీసుకున్నారట. ‘‘ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు అందుకున్న తొలి తెలుగు నటుడు అల్లు అర్జున్ బొమ్మను ఏర్పాటు చేయబో తున్నాం. ఈ మైనపు బొమ్మ ఆవిష్కరణ వచ్చే ఏడాది ఉంటుంది’’ అంటూ అల్లు అర్జున్ కొలతలు తీసుకుంటున్న వీడియోను షేర్ చేశారు నిర్వాహకులు. కాగా, దుబాయ్‌లోని మేడమ్ తుస్సాడ్స్‌లో తెలుగు నుంచి ప్రదర్శితం కానున్న తొలి మైనపు బొమ్మ అల్లు అర్జున్‌దే కావడం విశేషం. National Award winner; the first Telugu Actor in 69 years to win this award and icon of dance moves, the one and only Allu Arjun is all set to come face to face with his wax twin at Madame Tussauds Dubai later this year. Stay tuned for an event like never before 🎬✨#alluarjun pic.twitter.com/ePHhfvWfru — Madame Tussauds Dubai (@Tussauds_Dubai) October 5, 2023 -
వసతులు, సౌకర్యాలపై బిల్డర్లు దృష్టి సారించాలి
సాక్షి, హైదరాబాద్: ‘దేశంలో భూమి లభ్యత పరిమితంగా ఉండటంతో డెవలపర్లు ఎత్తయిన నిర్మాణాల వైపు మొగ్గు చూపిస్తున్నారు. భవనాల ఎత్తు పెరిగే కొద్దీ సమస్యలు ఉంటాయి. అందుకే ఎత్తు మాత్రమే కొలమానం కాకుండా సౌకర్యాలు, వసతులు కూడా దృష్టిలో పెట్టుకొని నిర్మాణాలు చేపట్టాలి’అని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు డెవలపర్లకు సూచించారు. హైదరాబాద్‌లో శనివారం నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కౌన్సిల్ (నరెడ్కో) రజతోత్సవాలు జరిగాయి. ముఖ్య అతిథిగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ.. ప్రణాళికాబద్ధమైన రియల్ ఎస్టేట్ అభివృద్ధి కోసం కేంద్రం రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (రెరా) తీసుకొచ్చి ఏళ్లు గడుస్తున్నా...ఇప్పటికీ కొన్ని రాష్ట్రాలు రెరా ప్రతినిధులను నియమించకపోవటం శోచనీయమన్నారు. ఔటర్ రింగ్ రోడ్, ఎయిర్వేస్, హైవేస్, రైల్వేస్‌తో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ఐటీ రంగం.. వెరసి హైదరాబాద్ హ్యాపెనింగ్ సిటీ అని వెంకయ్య కొనియాడారు. చంద్రుడిపై ఇళ్లు కట్టే స్థాయికి నరెడ్కో ఎదుగుతుందని ఛలోక్తి విసిరారు. సమర్థ నాయకుడితోనే అభివృద్ధి: వేముల స్థిర, సమర్థవంతమైన నాయకుడితోనే అభివృద్ధి సాధ్యమవుతుందని మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. మెరుగైన మౌలిక వసతులు, శాంతి భద్రతలు బాగున్న చోట పెట్టుబడులు వాటంతటవే వస్తాయని ఈ విషయంలో హైదరాబాద్ ముందున్నదని చెప్పారు. కార్యక్రమంలో నరెడ్కో జాతీయ అధ్యక్షుడు రజన్ బండేల్కర్ తదితరులు పాల్గొన్నారు. -
వర్షం ఎంత కురిసింది ఎలా లెక్కిస్తారో తెలుసా?
సాక్షి, హైదరాబాద్: ఒక్కోసారి కాస్త వాన పడుతుంది.. ఒక్కోసారి కుండ పోతగా కురుస్తుంది. అధికారులేమో.. పది సెంటీమీటర్లు పడింది.. 15 సెంటీమీటర్లు పడింది అని చెప్తుంటారు. మరి ఈ లెక్కలు ఎలా తీస్తారో తెలుసా..? ఇందుకు వాడేది రెయిన్ గేజ్‌గా పిలిచే ఓ చిన్నపాటి పరికరమే. ఓ చిన్నపాటి గాజు సీసా, దాని లోపలికి ఉండే ఓ గాజు గరాటు, దానిపై ఉండే మిల్లీమీటర్, సెంటీమీటర్ల కొలతలు.. అంతే. నిర్దిష్ట ప్రదేశాల్లో, నిర్ణీత ఎత్తులో ఈ రెయిన్ గేజ్‌లను ఏర్పాటు చేస్తారు. వాన కురిసినప్పుడు పైన ఉన్న గరాటు ద్వారా గాజు సీసాలోకి నీళ్లు చేరుతాయి. ఆ నీళ్లు ఎంత ఎత్తున చేరితే.. అన్ని సెంటీమీటర్లు/ మిల్లీమీటర్లు వాన పడిందన్న మాట. చెట్లు, భవనాలకు సమీపంలో, అటూఇటూ గాలి మళ్లేలా ఉన్న ఎగుడు దిగుడు ప్రదేశాల్లో రెయిన్ గేజ్‌లను ఏర్పాటు చేస్తే తప్పుడు లెక్కలు వస్తాయి. అందుకే విమానాశ్రయం వంటి విశాలమైన, చుట్టూ ఖాళీ ఉండే ప్రదేశాల్లో ఏర్పాటు చేస్తారు. -
నాకూ ఓ మనసుంది
అంత అందమైన అమ్మాయిని చూడటం అదే మొదటిసారి. అంటే ఇంతకు ముందు అందమైన అమ్మాయిల్ని చూళ్లేదని కాదు, కానీ ఇంత అందంగా, అద్భుతమైన శిల్పం చెక్కినట్టు, ఎక్కడా అంగుళంలో వెయ్యోవంతు కూడా కొలత తప్పకుండా... అప్సరసలు కూడా ఇంత అందంగా ఉండరేమో! సాయం సంధ్యలో సముద్రపు ఒడ్డున కూచుని ఎగసిపడే అలల్ని చూస్తూ... పక్కనే ఎవరో కూచోవడంతో తల తిప్పి చూసి... తర్వాత తల తిప్పుకోలేక... ఎంత అవస్థో కదా! ఓవైపు ఆడపిల్ల మొహం వైపు తదేకంగా చూడకూడదన్న సంస్కారం వెనక్కి లాగుతుంటే మరోవైపు ఈ అతిలోక సౌందర్యాన్ని వీక్షించడంలో ఓ క్షణం కోల్పోయినా జీవితం వృథా అనిపిస్తోంది. ఆమె కూడా తల తిప్పి నావైపు చూసింది. తిడుతుందేమోనన్న భయంతో చూపులు మరల్చబోతూ ఆమె పెదవుల మీద పూసిన మనోహరమైన నవ్వు చూసి ఆగిపోయాను. ‘‘హలో... ఏమిటలా చూస్తున్నారు? అబద్ధం చెప్పకండి. నాకు తెలుసు మీరెందుకలా చూశారో’’ అంది. ఓవైపు గొంతు తడారిపోయి తొట్రుపాటు... మరోవైపు తనే పలకరించినందుకు ఒంట్లో అలల్లా కదులుతున్న పులకింత. ‘‘మీకు తెలుసున్నారుగా... ఇంకా చెప్పడం దేనికి?’’ అన్నాను. ‘‘మీరేం చెప్తారో విందామని’’ ‘‘రోజూ మీరు అద్దంలో మీ ముఖాన్ని చూసుకున్నప్పుడల్లా మీరనుకునేదే నా జవాబు కూడా’’ ‘‘అదే సమస్య. అద్దం మాట్లాడదుగా... దానికే మాటలు వస్తే ఎంత బాగుండేదో కదా. మీకొచ్చుగా... చెప్పండి’’ ‘‘పొగడ్తలు వినడం చాలా ఇష్టంలా ఉందే’’ ‘‘పొగడ్తలంటే ఇష్టపడని అమ్మాయిలు కూడా ఉంటారా?’’ అంటూ మరోసారి నవ్వింది. ప్రతి ఆదివారం సాయంత్రం ఈ బీచ్ ఒడ్డున కూచుని సముద్రంలో పొంగుతున్న అలల్ని చూడటం ఓ ఏడాది నుంచి నా అలవాటు. కానీ ఈ అమ్మాయిని ఎప్పుడూ చూసినట్టు గుర్తు లేదు. ‘‘మీరీ బీచ్‌కి రెగ్యులర్‌గా వస్తుంటారా?’’ అని అడిగాను.‘‘లేదు. ఇదే మొదటిసారి రావడం’’‘‘అలానా... అయితే నేను చాలా అదృష్టవంతుణ్ణి. మీరు బీచ్‌కి వచ్చిన మొదటి రోజే మీ పరిచయభాగ్యం కలిగింది. ఇంతకూ మీ పేరేమిటో చెప్పలేదు’’‘‘మీరడగలేదుగా’’ అంటూ నవ్వింది. ‘‘నా పేరు లిఖిత’’‘‘స్వీట్ నేమ్. నా పేరు సునీల్. ఇక్కడే యూనివర్సిటీలో రీసెర్చ్ స్కాలర్ని. మరి మీరు?’’‘‘అన్నప్రాశననాడే ఆవకాయ తినిపిస్తారా ఏమిటి?’’ తొందరెందుకు? మళ్లీ కలుస్తాంగా’’‘‘ఎప్పుడు?’’‘‘వచ్చే ఆదివారం. ఇక్కడే’’ ఆమె లేచి కదుల్తున్న అలలా వెళ్లిపోయింది.ఆదివారం ఎప్పుడొస్తుందా అని ఆరాటం... సోమవారం తర్వాత ఆదివారం వస్తే ఎంత బావుండునో కదా అనే ఆశ. నిజంగానే వస్తుందా... ఒకవేళ రాకపోతేనో అనే అనుమానాలు... ఆదివారం రానే వచ్చింది. అప్పటి వరకు రోజులు యుగాల్లా గడిపితే ఈ రోజు మాత్రం నిమిషాలే యుగాల్లా సుదీర్ఘంగా సాగి బాధిస్తున్నాయి. బీచ్‌లో ఎదురుచూస్తూ కూచున్నప్పుడు క్షణాలు యుగాల్లా... లిఖిత వచ్చింది. ఎన్ని కబుర్లో. ఆమె అందమైన నవ్వుల్ని మధ్య మధ్యలో ఆస్వాదిస్తూ... అలాంటి ఎన్ని ఆదివారాలు అందమైన అలల్లా వచ్చి వెళ్లాయో... లిఖితను చూడకుండా ఉండలేని పరిస్థితి. రోజులో అధికభాగం లిఖితను కలవరిస్తూ... పలవరిస్తూ... నేను ప్రేమలో పడ్డానని అర్థమైంది. మొదట నన్నాకర్షించింది ఆమె అందమే అయినా నన్ను కట్టి పడేసింది మాత్రం ఆమె తెలివి, వాక్చాతుర్యం.‘‘మనం పెళ్లి చేసుకుందాం’’ అన్నానో రోజు.‘‘సారీ, నేను పెళ్లికి యోగ్యురాల్ని కాను’’ లిఖిత మొహంలో సముద్రమంత ఉదాసీనత... ‘‘నీకేం తక్కువ? ఎందుకలా అనుకుంటున్నావు?’’ అన్నాను ఆశ్చర్యపోతూ.‘‘నేను తల్లిని కాలేను. ఓ బిడ్డకు జన్మనివ్వడానికి అవసరమైన యుటెరస్, ఓవరీస్, ఫాలోపియన్ ట్యూబ్స్ లాంటి అవయవాలు నాలో లేవు’’‘‘నీకెలా తెలుసు? డాక్టర్లు చెప్పారా? ఎప్పుడు చెకప్ చేయించుకున్నావు? పెళ్లి కాకముందే పిల్లల గురించి ఎందుకు డాక్టర్లని కన్సల్ట్ చేశావు?’’ అని అడిగాను.విషాదంగా నవ్వి ‘‘డాక్టర్లు చెప్పలేదు. నాకు తెలుసు’’ అంది.‘‘అదే ఎలా తెలుసు?’’ కొద్దిగా చిరాగ్గా అడిగాను.‘‘నన్నడగొద్దు. ఈ ప్రశ్నకు నేను సమాధానం చెప్పలేను’’ అంటూ నేను పిలుస్తున్నా వినకుండా ఇసుకలో లుప్తమైపోతున్న అలలా వేగంగా వెళ్లిపోయింది.నేనీ విషయం గురించి తీవ్రంగా ఆలోచించాను. ప్రేమంటే ఆమెలోని ఉత్తమ లక్షణాల్ని ఇష్టపడటమే కాదు, లోపాల్ని కూడా అంగీకరించాలి కదా. పిల్లలు లేకున్నా పర్లేదు. కంటేనే పిల్లలా... పెంచినామన పిల్లలవుతారు. ఏ అనాథాశ్రమం నుంచో ఓ ఆడపిల్లని తెచ్చి పెంచుకుంటే చాలు. మాకు పిల్లలు లేని లోటు తీరటంతో పాటు ఆ పిల్లకు తల్లి ప్రేమనూ తండ్రి ప్రేమనూ అందించవచ్చు.ఆదివారం కలుసుకున్నప్పుడల్లా ‘‘పిల్లలు పుట్టకున్నా పర్లేదు. మనం పెళ్లి చేసుకుందాం’’ అన్నాను.లిఖిత నావైపు ఆరాధనగా చూసింది. ‘‘మీ వాళ్లతో వచ్చి మాట్లాడనా? మన మధ్య ప్రేమ చిగురించి ఇన్ని నెలలైనా నువ్విప్పటి వరకు మీ ఫ్యామిలీ గురించి ఏమీ చెప్పలేదు. మీ నాన్నగారు ఏం చేస్తారు? మీ ఇల్లెక్కడ?’’ అని అడిగాను. ‘‘సారీ... ఇంత క్రితం కూడా నువ్వు చాలాసార్లు అడిగావు. నేను చెప్పలేదు. చెప్పలేను కూడా’’‘‘అనాథవా?’’‘‘ఓ రకంగా అంతే. మరో రకంగా కాదు’’‘‘అర్థంకాని ప్రహేళికలా మాట్లాడతావెందుకు?’’‘‘నేను నిజంగానే ఓ పజిల్ని కాబట్టి’’‘‘సరే, అవన్నీ నీ వ్యక్తిగత విషయాలు. ఇప్పుడు మన పెళ్లి జరగాలంటే నీ వైపు బంధువులెవరైనా ఉండాలిగా’’‘‘బంధువులు ఎవ్వరూ లేరు. మనం పెళ్లి ఎప్పుడు చేసుకుందామో చెప్పు.తప్పించుకుని వచ్చేస్తా’’‘‘తప్పించుకుని రావడమేంటి? అంటే ఎవరైనా నిన్ను నిర్బంధించారా? అదే నిజమైతే ఇలా ప్రతి ఆదివారం బయటికి స్వేచ్ఛగా ఎలా రాగలుగుతున్నావు?’’లిఖిత మొహంలో దిగులుఅరణ్యంలా విస్తరించడం గమనించాను. ఓసారి తల తిప్పి వెనక్కి చూసింది. ఆమె కళ్లలో బెదురు...‘‘నేను స్వేచ్ఛగా తిరుగుతున్నానని అనుకుంటున్నావా? లేదు. నాకు స్వేచ్ఛ లేదు. బందీని. నా ప్రతికదలికనీ రెండు జతల కళ్లు గమనిస్తూ ఉంటాయి. స్వేచ్ఛ కోసం పరితపిస్తున్న పంజరంలో పక్షిని నేను’’ ఆమె సన్నగా ఏడుస్తోంది.‘‘నాకు అర్థమయ్యేలా చెప్పు. అవసరమైతే పోలీసుల సాయం తీసుకుందాం.నువ్వు గూండాల చెరలో ఉన్నావా? మాఫియా గ్యాంగ్ ఏదైనా నిన్ను తన గుప్పిట్లో పెట్టుకుని ఆడిస్తోందా?’’‘‘లేదు. అలాగని నేను స్వతంత్రురాల్ని కూడా కాదు’’‘‘అబ్బా... మళ్లీ పజిల్’’‘‘దయచేసి ఇంక నన్నేమీ అడక్కు. పెళ్లి ఎప్పుడు చేసుకుందామో చెప్పు. ఎలా రావాలో ఎవరి దృష్టి నుంచి తప్పించుకు రావాలో అదంతా నా సమస్య’’ అంది స్థిరంగా.‘‘సరే. నిన్ను ఇబ్బంది పెట్టే ప్రశ్నలేవీ వేయను. వచ్చే ఆదివారం ఉదయం నా గదికి వచ్చేయి. పెళ్లి చేసుకుందాం. నా అడ్రస్ కాగితం మీద రాసిస్తాను’’ అంటూ పెన్ను తీయబోతుంటే లిఖిత వారించింది.‘‘వద్దు. చెప్పు చాలు. గుర్తు పెట్టుకుంటాను’’ మళ్లా వెనక్కి తిరిగి భయం భయంగా చూస్తూ అంది.నేనూ వెనక్కి తిరిగి చూశాను. ఆదివారం కాబట్టి గుంపులు గుంపులుగా మనుషులు ఉన్నారు. ఎవరి ధ్యాసలో వాళ్లున్నారు తప్ప మావైపు పత్తేదారు కళ్లతో చూస్తున్న శాల్తీలెవ్వరూ కనిపించలేదు.అడ్రస్ చెప్పాక ‘‘తప్పకుండా వస్తాను’’ అనేసి వెళ్లిపోయింది.ఆదివారం రోజు... ఉదయం నుంచి ఉత్కంఠ... నిన్న రాత్రి నిద్రపడితే ఒట్టు. ఎడతెరిపిలేని ఆలోచనలు... ఉదయం ఐదింటికే లేచి కూచున్నా. సమయం ముందుకు కదలడం లేదన్న అసహనం. అశాంతిగా గదంతా ఏ వందసార్లు తిరిగుంటానో.పదయింది... పదకొండు... పన్నెండు... లిఖిత జాడ లేదు. నేను అడ్రస్ రాసివ్వకుండా చెప్పి తప్పు చేశానేమో! ఒకట్రెండు కొండ గుర్తులైనా చెప్పి ఉండాల్సింది. డోర్ నంబర్లో చాలా అంకెలున్నాయి. మర్చిపోయిందో ఏమో! వీధిలోకొచ్చి నిలబడ్డాను. కాళ్లు నొప్పెడుతున్నాయి. ఎన్ని గంటల నుంచి నిలబడి ఉన్నానోఏమో... మెల్లగా చీకట్లు కమ్ముకోసాగాయి. లిఖిత రాలేదు.తన దగ్గర మొబైల్ ఫోన్ లేదు. ఓ రోజు నేను కొనిస్తానన్నా విన్లేదు. తనకిష్టం ఉండదని చెప్పింది. ఇప్పుడు తను రాకపోవడానికి కారణమేమిటో తెలిసే అవకాశం లేదు. ఆదివారం వరకు ప్రాణాల్ని ఉగ్గబట్టుకుని ఎదురు చూశాను. ఆదివారం సాయంత్రం బీచ్‌లో తన కోసం కళ్లు కాయలు కాచేలా వేచి చూశాను. రాలేదు. ఆ ఆదివారమే కాదు, ఆ తర్వాత వచ్చిన ఆదివారాలప్పుడు కూడా లిఖిత బీచ్‌కి రాలేదు. చిక్కని చీకటిలాంటి నిరాశ. ఇంక ఎప్పటికీ వెల్తురనేదే కనిపించదా అనే నిస్పృహ... దుఃఖం దట్టమైన కీకారణ్యంలా నన్ను తనలోకి లాక్కుంటోంది. లిఖిత ఏమైంది? మెరుపులా మెరిసి మరుక్షణంలో మాయమైపోయినట్టు... మోసం చేసిందా? లేదు. చాలా అమాయకమైన పిల్ల. స్వచ్ఛమైన మనసున్న అమ్మాయి. తన ప్రేమ నిజమైనది. మరి ఎందుకు రాలేదు? ఎవరో తనను గమనిస్తూ ఉంటారని చెప్పిందిగా.వాళ్లేమైనా కట్టడి చేశారా? లిఖిత క్షేమంగా ఉందా? అసలీ ఊళ్లోనే ఉందా లేక ఎక్కడికైనా తీసుకెళ్లిపోయారా? నిరంతరం ఇవే ఆలోచనలు... మనశ్శాంతి కరువైంది. ఆదివారం సాయంత్రాలు బీచ్ ఒడ్డున పిచ్చోడిలాతిరగటం మాత్రం మానలేదు.ఓ ఆదివారం ఉదయం ఉరుములేని మెరుపులా లిఖిత నా రూమ్‌లో ప్రత్యక్షమైంది. భుజాల చుట్టూ గులాబి పూల డిజైన్ ఉన్న షాల్ కప్పుకుని... అందంగా ఉండే మొహం నిండా ఆందోళన...‘‘ఇన్నాళ్లూ ఏమైపోయావు?’’ అంటూ ఉద్విగ్నంగా అడిగాను.‘‘అవన్నీ చెప్పేంత సమయం లేదు. తొందరగా బయల్దేరు. మనం ఈ ఊరు విడిచిపెట్టి ఎక్కడికైనా దూరంగా వెళ్లిపోదాం’’ అంది.ఆమె కళ్లలో భయం నగ్నంగా...‘‘ఇప్పటికిప్పుడు ఎలా వెళ్లగలం? ఎక్కడికని వెళ్లగలం?’’‘‘నాకు తెలియదు. కానీ వెళ్లిపోక తప్పదు. నా కోసం వెతుకులాట మొదలైంది. నేను కనిపిస్తే బతకనివ్వరు.చంపేస్తారు.’’‘‘ఎవరు వాళ్లు?’’ మనం పోలీస్ స్టేషన్కెళ్దాం.’’‘‘లాభం లేదు. లీగల్‌గా నేను వాళ్ల ప్రాపర్టీ. వాళ్లు నన్ను ఏమైనా చేసుకునే అధికారం ఉంది. చంపినా ముక్కలు ముక్కలుగా నరికినా పోలీసులు కూడా జోక్యం చేసుకోలేరు’’‘‘మనం ఉంటున్నది సభ్య సమాజంలో... అడవిలో కాదు. నువ్వు మేజర్‌వి. నీ ఇష్టమొచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకునే హక్కు నీకుంది. దాన్ని ఎవ్వరూ ప్రశ్నించలేరు.’’‘‘నేను నిన్ను ప్రేమిస్తున్నట్టు నన్ను గమనించడానికి నియమించబడ్డ వ్యక్తికి తెలిసిపోయింది. మనం పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్న విషయం కూడా అతను స్పష్టంగా విన్నాడు. అందువల్లనే మరునాడు నన్ను గదిలోంచికదలనీయకుండా బంధించారు.’’‘‘అదెలా సంభవం? మనం ఆ రోజు పెళ్లి గురించి మాట్లాడుకున్న సమయంలో చుట్టుపక్కల కొన్ని మీటర్ల దూరం వరకు ఎవ్వరూ లేరుగా’’ అన్నాను.‘‘నాకు తెలియకుండా నా జడపిన్నులో మైక్రో ట్రాన్స్‌మీటర్ అమర్చారు. నన్ను బంధించిన రోజు నా రక్షకుడితో బాగా గొడవ పడ్డాను. నాకు ప్రేమించే హక్కు లేదా అని అడిగాను. లేదన్నాడు. నన్ను నీకు దగ్గర చేయడంలో ఉద్దేశం నేను మానసికంగా పరిపక్వత సాధించానా లేదా, శారీరకంగా పరిపూర్ణతను పొందానా లేదా అనేది నిర్ధారించుకోవడానికి పెట్టిన పరీక్ష మాత్రమేనట. నేను మగవాళ్లని ఎంత త్వరగా ప్రేమలో పడేయగలిగితే అంత గొప్పగా సఫలీకృతురాలినైనట్టు లెక్క. వాళ్లు చేస్తున్న ప్రయోగాల్లో ఆఖరి మజిలీని నేను’’‘‘అదేం పరీక్ష? ఏం ప్రయోగాలు? నాకర్థం కావడంలేదు. మీ నాన్న ఏమైనా సైకాలజీ ప్రొఫెసరా? ఆడపిల్లల మనస్తత్వం మీద రీసెర్చ్ చేస్తున్నాడా?’’‘‘నాన్న కాదు. రక్షకుడు.. నేను నిన్ను ప్రేమలో పడేయాలి తప్ప నేను ప్రేమలో పడకూడదట. పెళ్లి మాటే తల్చుకోకూడదట. నేను పారిపోతానేమోనని కుర్చీకితాళ్లతో కట్టేసి, గదిలో పెట్టి తలుపేశారు.ఎలాగోలా తాళ్లు విప్పదీసుకుని, తలుపు తెరుచుకున్న వెంటనే అతన్ని పక్కకు నెట్టేసి బయటికి పరుగెత్తాను. కొంత మంది నా వెంట పడ్డారు. వాళ్లకు దొరక్కూడదని చాలా వేగంగా పరుగెత్తాను. అందులో ఒకడు నా మీదికి కత్తి విసిరాడు.’’ నాకు చప్పున భయమేసింది. ‘‘కత్తి విసిరాడా? ఎంతటి దుర్మార్గుడు... నీకు తగల్లేదు కదా’’ అన్నాను కంగారుపడుతూ.‘‘నా మెడకు గురిచూసి విసిరాడు. అదృష్టం. గురి తప్పింది. లేకపోతే మెడ తెగి పడిపోయి ఉండేది’’ విషాదంగా నవ్వింది.‘‘వాళ్లు ఆ రోజు మనం మాట్లాడుకున్న మాటల్ని మైక్రో ట్రాన్స్‌మీటర్ ద్వారా విని ఉంటే నా గది ఎక్కడో తెలిసిపోయి ఉండాలిగా’’‘‘తెలుసు... ఒకసారి ఎవర్నో పంపించి నీ అడ్రస్ కరెక్టో కాదో సరిచూసుకున్నారు కూడా. అందుకే చెప్పేది. మనం ఇక్కడి నుంచి తొందరగా వెళ్లిపోవాలి. వాళ్లు ఏ క్షణమైనా ఈ గదికి రావొచ్చు’’‘‘రానీయ్. వాళ్ల సంగతేంటో తేల్చుకుంటాను. చుట్టుపక్కల ఉన్న వాళ్లందర్నీమనకు రక్షణగా పిలుస్తాను. నీ మీద కత్తి విసిరిన దుర్మార్గుడి మీద అటెంప్ట్ టు మర్డర్ కేసు పెట్టి జైల్లో తోయిస్తాను’’ అన్నాను ఆవేశంగా.‘‘లాభం లేదు. నా విషయంలో ఈ చట్టాలు వర్తించవు. ప్రభుత్వం మాలాంటి వాళ్ల రక్షణ కోసం కొత్త చట్టాలు చేసే వరకు వాళ్లను ఎవ్వరూ ఏమీ చేయలేరు.’’‘‘మళ్లా పజిల్ భాషలో మాట్లాడుతున్నావు. వాళ్లేమైనా దివి నుంచి దిగొచ్చినా దేవతలా లేక వేరే గ్రహం నుంచి మన భూమి పైకొచ్చిన ఏలియన్సా?’’‘‘రెండూ కాదు. వాళ్ల ఉద్దేశంలో నాకు తెలివుండాలి కాని మనసుండకూడదు. అందులో ప్రేమలాంటి అనుభూతులు ఉండకూడదు’’‘‘నిన్నేమైనా మరబొమ్మనుకుంటున్నారా?’’‘‘మాటల్తో సమయం వృథా చేయకుండా నన్నిక్కడి నుంచి తీసుకెళ్లిపో. దూరంగా.. వీళ్లకు అందనంత దూరంగా... ప్లీజ్... బయల్దేరు. నీ వాదనలు నా విషయంలో పనికి రావు’’ అంటూనే ఆమె ఓ చేత్తో నా బట్టల్ని సూట్‌కేసులో సర్దసాగింది.‘‘ఎందుకు పనికి రావు? నువ్వూ మనిషివే. వస్తువు కాదు’’ అన్నాను కోపంగా.ఆమె భుజాల్ని కప్పి ఉన్న షాల్ కిందికి జారిపోయింది. అప్పుడు గమనించాను. ఆమెకు కుడిచేయి లేదు.ఎవరో తెగ్గొట్టేశారు. కానీ రక్తం కారటం లేదు. భుజంలోంచి ఏవో వైర్లు తెగిపోయి వేలాడుతున్నాయి. వాటి వైపు ఆశ్చర్యంతో అపనమ్మకంతో చూస్తున్న నా వైపు తిరిగి లిఖిత అంది. ‘‘ఎందుకంటే నేను మనిషిని కాదు కాబట్టి. నేను ఆండ్రాయిడ్ మరబొమ్మనే, కానీ హృదయం ఉన్న మరబొమ్మని’’ మళ్లా షాల్ని తన తెగిపోయిన చేయి కన్పించకుండా భుజాల చుట్టూ కప్పుకుని ఒంటి చేత్తో సామన్లు సర్దడంలో లీనమైపోయింది. ∙ -
చైనా దిగజారుడు రాజకీయాలు
ఖట్మాండు : చైనా భారత్‌పై మరోసారి తన అక్కసును వెళ్లగక్కుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఎవరెస్ట్ శిఖరం ఎత్తును కొలవాలన్న భారత్ ప్రయత్నానికి డ్రాగన్ కంట్రీ అడ్డుతగులుతోంది. నేపాల్‌తో కలసి సంయుక్తంగా ఎవరెస్ట్ శిఖర ఎత్తును కొలిచేందుకు భారత్ పంపిన ప్రతిపాదన తిరస్కరణకు గురైంది. దీంతో ఈ వ్యవహారం వెనుక చైనా హస్తం ఉండి ఉంటుందని భారత్ భావిస్తోంది. ఎవరెస్ట్ ఎత్తును తామే కొలుస్తామని.. భారత్, చైనాలు కేవలం కీలకమైన గణాంకాలను అందిస్తే చాలని నేపాల్ సర్వే విభాగం డైరెక్టర్ జనరల్ గణేష్ భట్టా చెప్పారు. 2015లో 7.8 తీవ్రతతో ‘గోర్ఖా భూకంపం’ నేపాల్ ను కుదిపేసింది. ఈ విలయం తర్వాత ఎవరెస్ట్ ఎత్తు తగ్గిందనే సందేహాలు సర్వత్రా నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో నేపాల్ సర్వే డిపార్ట్ మెంట్ తో కలిసి ఎవరెస్ట్ ఎత్తును కొలిచేందుకు సర్వే ఆఫ్ ఇండియా ప్రతిపాదనలు పంపింది. కానీ, నేపాల్ మాత్రం నిర్మోహమాటంగా భారత్ ప్రతిపాదనను తిరస్కరించింది. నేపాల్‌లో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వంపై రాజకీయంగా ఒత్తిడి తెచ్చి చైనా ఈ పని చేయించి ఉంటుందని భారత అధికారులు అంటున్నారు. మరి చైనా కూడా అలాంటి ప్రతిపాదనలేమైనా పంపిందా? అంటే.. అలాంటిదేం లేదని నేపాల్ స్పష్టత ఇచ్చింది. చుట్టుపక్కల దేశాల నుంచి సమాచారం తీసుకోవటం కీలకం. అందుకే భారత్, చైనా నుంచి డేటాను మాత్రం స్వీకరిస్తాం అని నేపాల్ చెబుతోంది. 1975 నుంచి 2005 దాకా ఎవరెస్ట్ ఎత్తును చైనానే నిర్థారిస్తూ వచ్చింది. 1956లో భారత్ అలాంటి ప్రయత్నం చేసింది. స్వతంత్ర భారతావనిగా ఆవిర్భవించక ముందునాటి నుంచే ఎవరెస్ట్ శిఖర విషయంలో భారత్ జోక్యం ఉండేది. సర్ జార్జ్ నేతృత్వంలోని భారత్ బృందం 1855లో ఎవరెస్ట్‌ను అత్యంత ఎత్తైన పర్వత శిఖరంగా గుర్తించింది. -
బొంకుతున్న బంకులు
సాక్షి, సిటీ బ్యూరో: గ్రేటర్లో పెట్రో బంక్‌లు మళ్లీ బొంకుతున్నాయి. కొలతల్లో దగా, నాణ్యతలో మోసాలకు పాల్పడుతూ వినియోగదారులను నిలువునా దోచేస్తున్నారు. బంకులపై గత కొన్ని నెలలుగా తనిఖీలు లేకపోడంతో అక్రమార్కులకు అడ్డు అదుపు లేకుండా పోయింది. సంబంధిత పౌరసరఫరాల, తూనికల కొలతల శాఖాధికారులు నిద్రవస్థలో జోగుతున్నారు. కేవలం బంకుకు స్టాంపింగ్ సమయంలో తప్ప పరిశీలించిన దాఖలాలు కనిపించడం లేదు. రెండేళ్ల క్రితం స్పెషల్ ఆపరేషన్ టీం(ఎస్వోటీ) పోలీసులు, తూనికల కొలత శాఖ వేర్వేరుగా దాడులు నిర్వహించి బట్టబయలు చేసిన పెట్రో అధునిక సాంకేతిక మోసాల కథ కంచికి చేరింది. అప్పట్లో కొన్ని పెట్రోల్, డీజీల్ బంకులు యాజమాన్యాలు ఫిల్లింగ్ మిషన్ల సాఫ్ట్‌వేర్‌లో ప్రత్యేక చిప్‌లు అమర్చి రిమోట్ కంట్రోల్ ద్వారా మీటర్ రీడింగ్‌ను జంపింగ్ చేస్తూ దొరికిపోగా, మరికొందరు సాక్షాత్తు ప్రధాన ఆయిల్ కంపెనీలు సరఫరా చేసిన రిమోట్ ద్వారా ఆయిల్ పంపింగ్ కంట్రోల్ చేస్తూ దొరికి పోవడం సంచలనం సృష్టించింది. ఆయిల్ కంపెనీలు సరఫరా చేసిన ఫిల్లింగ్ మిషన్ మోడల్‌ను తప్పుబట్టి నోటీసులు జారీ చేసి హడావుడి సృష్టించిన అధికారులు చివరకు కాంపౌండింగ్‌తో సరిపెట్టడం విస్మయానికి గురిచేస్తోంది. లీటర్‌కు 10 ఎంఎల్ నొక్కేస్తారు పెట్రోల్ బంకుల్లో డీలర్లు ప్రతి లీటర్‌కు సగటున 8 నుంచి 20 ఎంఎల్ వరకు తక్కువగా పంపింగ్ జరగడం సర్వసాధారణంగా మారింది. తూనికల,కొలతల శాఖ నిబంధనల ప్రకారం ఐదు లీటర్లలో 25 ఎంఎల్ వరకు తక్కువగా ఉండవచ్చు. కానీ ప్రతి లీటర్లో తక్కువగా పంపింగ్ జరుగుతున్నా.. అధికారులు పట్టించుకోకపోవడంతో వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. యథేచ్చగా కల్తీలు... నాన్ ఎలక్టాన్రిక్ పెట్రోల్ బంకుల్లోనే కల్తీ జరుగుతున్నట్లు ఆరోపణలు వినవస్తున్నాయి. ఎలక్టాన్రిక్ బంకులుæఆయిల్ కంపెనీల ప్రధాన యూనిట్లకు అనుసంధానమై ఉండటంతో కల్తీకి అస్కారం లేకుండా పోయింది. ఒక వేళ కల్తీ జరిగినా..రీడింగ్, డెన్సిటీ ద్వారా బయటపడుతోంది. దీంతో నాన్ ఎలక్టాన్రిక్ పెట్రోల్ బంక్‌ల్లోనే ఈ వ్యవహరం సాగుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ట్యాంకర్ల కొద్ది టిన్నర్, నాఫ్త ఆయిల్, కిరోసిన్ సరఫరా జరుగడం ఇందుకు బలం చేకూర్చుతోంది..సాధారణంగా నిత్యం 25 వేల లీటర్ల పెట్రోల్, 40 వేల లీటర్ల డీజిల్ఆయిల్ను విక్రయించే బంకులు పూర్తి స్థాయి ఎలక్టాన్రిక్‌గా మారాల్సి ఉంటుంది. ఆయితే మహానగరంలో అనేక బంకుల్లో సెల్స్ ఉన్నా... పూర్తి స్థాయి ఎలక్టాన్రిక్‌గా బంక్‌లుగా మార్పు జరగకపోవడం పలు అనుమానాలకు తావీస్తోంది. -
పెట్రోలు బంకుల మోసాలు...గప్ ‘చిప్’
మళ్లీ ‘చిప్’ బాగోతం బట్టబయలు అటు కొలతలో తరుగు.. ఇటు నాణ్యతలో దగా ఎడాపెడా వినియోగదారులకు టోకరా బంకుల యాజమాన్యాల ఇం‘ధన’ దోపిడీ ఫిర్యాదులొస్తేనే తూ.కొ. శాఖ చర్యలు సాక్షి, సిటీ బ్యూరో: పెట్రోలు బంకుల మోసాలకు అడ్డుకట్ట పడటం లేదు. అటు కొలతలో.. ఇటు నాణ్యతలో వినియోగదారులు దగా పడుతూనే ఉన్నారు. పంపింగ్‌లో, మీటర్ రీడింగ్‌లో చేతివాటం చూపడం దగ్గర్నుంచి ఏకంగా ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించడం వరకు మోసాల స్థాయి పెరిగి.. యథేచ్ఛగా సాగుతూనే ఉంది. ఫలితంగా ఇం‘ధన’ రూపేణా గ్రేటర్‌లోని పెట్రోల్, డీజిల్ వినియోగదారుల జేబుకు నిత్యం లక్షల్లో చిల్లుపడుతోంది. బుధవారం భారత్ పెట్రోలియం కార్పొరేషన్‌కు చెందిన ఉప్పల్‌లోని జయలీల ఫిల్లింగ్ స్టేషన్ మోసాల తంతు బట్టబయలైన తీరు మరోసారి వినియోగదారులు ఉలిక్కిపడేలా చేసింది. బంకుల నిర్వాహకులు తమపై సరైన నిఘా, పర్యవేక్షణ లేకపోవడాన్ని సాకుగా తీసుకుని సాఫ్ట్వేర్ చిప్‌లతో మీటర్ రీడింగ్‌లో జంపింగ్‌కు పాల్పడుతూ దోపిడీ చేస్తున్నారు. ఈ పరిస్థితికి అడ్డుకట్ట వేయాల్సిన తూనికల, కొలతల శాఖ అధికారులు.. వినియోగదారుల నుంచి ఫిర్యాదులందితే కానీ కాలు కదపట్లేదు. పోలీసు టాస్క్‌ఫోర్స్ ప్రత్యేక బృందం ఆరు నెలల క్రితం పెట్రోలు బంకుల సాఫ్ట్వేర్ చిప్ మోసాలను బయటపెట్టినా.. తూనికలు కొలతల శాఖ నామమాత్రపు తనిఖీలతో సరిపెట్టింది. అప్పట్లోనే గట్టి చర్యలు తీసుకుని ఉంటే బుధవారం మరో మోసం బయటపడేది కాదు. బుధవారం నాటి ఘటనలో, ఉప్పల్ జయలీల బంకులో ప్రతి లీటర్‌కు 2.30 ఎంఎల్ మేర కొలతలో తరుగు ఉన్నట్టు తేలింది. అంటే ఈ లెక్కన గ్రేటర్ వ్యాప్తంగా ఉన్న బంకుల్లో ఏ మేరకు వినియోగదారులు నష్టపోతున్నారో అర్థం చేసుకోవచ్చు. జరిమానాలతో సరి.. బెదరని డీలర్లు పెట్రోలు బంకుల మోసాలపై నమోదవుతున్న కేసులు కేవలం జరిమానాలకే పరిమితవుతున్నాయి. దీంతో బంకుల డీలర్లు బెరుకు లేకుండా అక్రమాలకు పాల్పడుతున్నారు. ఆరు నెలల క్రితం కొన్ని ఫిల్లింగ్ యంత్రాల సాఫ్ట్‌వేర్‌లో ప్రత్యేక చిప్‌లను రిమోట్ ద్వారా ఆపరేట్ చేస్తూ, మరికొన్నింటిలో సాక్షాత్తూ ఆయిల్ కంపెనీలు సరఫరా చేసిన రిమోట్‌లోనే మార్పుచేర్పుల ద్వారా ఇంధనం పంపింగ్ చేస్తూ మోసాలకు పాల్పడుతున్నట్టు వెలుగుచూసిన ఘటన వినియోగదారులను నివ్వెరపరిచింది. అప్పట్లో ఆయిల్ కంపెనీలు సరఫరా చేసిన ఫిల్లింగ్ మిషన్ మోడల్‌ను తప్పుపట్టి హడావుడి చేసిన అధికారులు ఆపై నోటీసులు జారీ చేసి చేతులు దులుపుకొన్నారు. బంకుల మోసాలపై భారత తూనికలు కొలతల చట్టం-2009 సెక్షన్ 22 కింద కేసులు నమోదు చేసి జరిమానాలతో సరిపెట్టారు. దీంతో బంకు యాజమాన్యాలకు భయం లేకుండాపోయింది. తాజాగా బుధవారం వెలుగుచూసిన ఘటనతో వినియోగదారులు కంగుతిన్నారు. మోసాలు ఇలా... పెట్రోల్ బంకులకు ఆయిల్ కంపెనీలే ఫిల్లింగ్ యంత్రాలను సరఫరా చేస్తాయి. కొన్ని కంపెనీలు నిబంధనలకు విరుద్ధంగా ఫిల్లింగ్ యంత్రంలో మార్పుచేర్పులతో పాటు రిమోట్ ద్వారా ఆపరేట్‌కు వెసులుబాటు కల్పించాయి దీన్ని ఆసరా చేసుకున్న యాజమాన్యాలు పెట్రోలు, డీజిల్ పంపింగ్ రీడింగ్‌లో జంపింగ్‌లకు పాల్పడుతూ వినియోగదారులకు తూకంలో టోకరా వేస్తున్నాయి కొన్ని కంపెనీల్లో ఫిల్లింగ్ యంత్రాలకు రిమోట్ వెసులుబాటు లేకున్నా.. పంపింగ్ యంత్రాల్లో ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను అమర్చి కొలతల్లో మోసాలకు పాల్పడుతున్నారు సాధారణంగా ప్రతి ఫిల్లింగ్ యంత్రానికి తూనికలు కొలతల శాఖ సీల్ వేసి ఉంటుంది. బంకుల యాజమాన్యాలు దీన్ని బ్రేక్ చేసి సైతం మోసాల సాఫ్ట్వేర్ చిప్‌లను అమర్చుతున్నారు పెట్రోల్ బంకుల్లోని ఫిల్లింగ్ యంత్రంపై చూస్తే రీడింగ్సవ్యంగానే కనిపిస్తుంది. కానీ, ప్రత్యేక సాఫ్ట్వేర్ చిప్‌లను అమర్చిన కారణంగా ప్రతి వెయ్యి లీటర్లలో 40 లీటర్ల మేర ఇంధనం బంకుల నిర్వాహకులకు ‘ఆదా’ అవుతోంది ఒక్కో బంకులో నిత్యం పది వేల లీటర్ల ఇంధనాన్ని విక్రయిస్తారనుకుంటే, 400 లీటర్ల మేర యాజమాన్యానికి ‘మిగులు’బాటవుతోంది. ఫలితంగా వినియోగదారులు ఎడాపెడా నష్టపోతున్నారు.