Measurement Department of Officers
-
‘పాయింట్’ దోపిడీ..!
సాక్షి, దేవరకొండ: హడావుడిగా ఆఫీస్‌కు బయల్దేరుతూ దారిలో ఏ బంక్ వద్ద అయినా ఓ రూ.100 పెట్రోల్ పోయించుకుంటే తెలియకుండానే ఓ పాయింట్ ఎగిరిపోతోంది. దీనికి తోడు ఓ రూ.10పైసల నుంచి రూ.20 పైసలు తక్కువ పోసినా తొందరలో ఉన్న కస్టమర్లు గట్టిగా అడగలేరు. ఇది పెట్రోల్ బంకుల్లో నిత్యం జరుగుతున్న తంతు. ఇలా రోజు వినియోగదారుల జేబులకు చిల్లు పెడుతూ భారీగా సొమ్ము చేసుకుంటున్నారు. హైదరాబాద్–నాగార్జునసాగర్ ప్రధాన రహదారిపై నిత్యం పెద్ద సంఖ్యలో వాహనాల రాకపోకలు సాగుతుంటాయి. హైవే వెంట ఉన్న పెట్రోల్ బంకుల్లో ప్రతి నిత్యం పైస పైస పక్కపెడుతూ రూ. లక్షలు దోచుకుంటున్నారు. బంకుల్లో పెట్రోల్ పోయించే సమయంలో పాయింట్లలో గోల్మాల్ జరుగుతున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. కస్టమర్లకు కొందరు రూ.10పైసలు, రూ.20పైసల వరకు తక్కువగా పెట్రోల్ పోస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. పాయింట్లకు కోత పాయింట్లలో కోతతో వినియోగదారులు తెలియకుండానే నష్టపోతున్నారు. పెట్రోల్ బంక్‌లో ధరల పట్టికలు ఉంచడం లేదు. ప్రస్తుతం లీటర్ పెట్రోల్ ధర రూ.75 ఉంది. కంపెనీని బట్టి ధరల్లో తేడా ఉంటుంది. రోజు ధరల్లో హెచ్చుతగ్గులు ఉంటున్నాయి. ఇప్పుడున్న ధరకు లీటర్‌పై రూ.10పైసలు, రూ.20పైసలు పెరిగినప్పుడు యూనిట్ లెక్కించరు. లీటర్‌కు 10 పాయింట్లుగా లెక్కిస్తారు. కనీసం రూ.35పైసలకు పైగా పెరిగితేనే యూనిట్ వస్తుంది. చాలా మంది వాహనదారులు లీటర్ చొప్పున కాకుండా రూ.50, రూ.100 ఇలా పెట్రోల్ పోయించుకుంటుంటారు. ఇక్కడే అసలు చేతివాటం ప్రదర్శిస్తున్నారు. లీటర్ ధర రూ.75 ఉంటే ఒక పాయింట్ విలువ 7.5యూనిట్ లెక్కన చూయిస్తుంది. అయితే వినియోగదారులు ఎవరూ ఎన్ని పాయింట్లు పోస్తున్నారనేది సరిగా గమనించలేకపోతున్నారు. చాలా మందికి దీనిపై సరైన అవగాహన ఉండదు. దీన్ని అవకాశంగా భావించి కొందరు బంకుల్లో అరపాయింట్ తగ్గించి పెట్రోల్పోస్తున్నట్లు తెలుస్తోంది. అంటే అరపాయింట్కు రూ.3.50 వినియోగదారుడు నష్టపోతున్నట్లే. ఈ రూ.3 నష్టపోవడంతో పాటు పెట్రోల్ బంక్ యజమానులకు పెట్రోల్ ఆదా అవుతుంది. ఈ లెక్కన రోజుకు వేల లీటర్లు అరపాయింట్ చొప్పున తగ్గించినా వేలలో ఆదాయం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఒకటి నుంచి రెండు పాయింట్లు తగ్గిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. వినియోగదారులు వదిలేస్తున్న సదరు యజమానులకు లక్షలు మిగుల్చుతున్నాయి. ఈ మోసాన్ని వినియోగదారులు కూడా గుర్తించలేకపోతున్నారు. అధికారులు కూడా చూసిచూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణ లు ఉన్నాయి. అప్పుడప్పుడు తని ఖీలు చేస్తున్నా పూర్తి స్థాయిలో దృష్టి పెట్టడం లేదని వినియోగదారులు వాపోతున్నారు. రూ.10పైసలు, రూ.20పైసలు తక్కువగానే చాలా మంది బంకుల్లో పని చేసే సిబ్బంది రూ.10 పైసల నుంచి రూ.20పైసల వరకు తక్కువగా పెట్రోల్ పోస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. మనం ఇచ్చే డబ్బులకు పూర్తి స్థాయిలో పెట్రోల్ పోయకుండానే చేతిలో ఉన్న క్లచ్‌ను ఆపివేస్తున్నారు. చిన్న మొత్తమైనా పరిశీలిస్తే లక్షల్లో జరుగుతున్న మోసం బయటపడుతుంది. ఇది ప్రతి బంకులో జరుగుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అటు పాయింట్ల కోతతో పాటు ఇలా కూడా వినియోగదారుడు మోసపోతున్నాడు. బంకులో అన్ని మోసాలే మండలంలోని అన్ని పెట్రోల్ బంకుల్లో మోసాలు జరుగుతున్నాయి. పెట్రోల్ బంకులో రూ.వంద పెట్రోల్ పోసుకుంటే రూ.99 మాత్రమే పెట్రోల్ పోస్తున్నారు. ఇదేమిటని అడిగిన వారితో గొడవకు దిగుతున్నారు. ప్రతి వాహనదారుడికి ఇదే సమస్య ఉంది. వాహనదారులు పాయింట్ దోపిడీకి గురికాక తప్పడం లేదు. అధికారులు ఈ దిశగా తనిఖీలు చేపట్టి పెట్రోల్ బంకులపై చర్యలు తీసుకోవాలి. –బొడ్డు మహేశ్, చింతపల్లి అన్నీ అవకతవకలే.. పెట్రోల్ బంకుల్లో పెద్ద ఎత్తున అవకతవకలు జ రుగుతున్నాయి. సంబంధిత తూనికల కొలతల శాఖ అధికారులు కా కుండా పెట్రోల్ కంపెనీలకు సంబంధించిన అధికారులు సక్రమంగా లేకపోవడంతో ఈ అవకతవకలకు ఆస్కారం ఉంటుంది. అధికారుల నిర్లక్ష్యం పెట్రోల్ బంక్ యజమానులకు వరంగా మారుతోంది. లీటర్ పెట్రోల్‌కు అరపాయింట్ వరకు తక్కువగా పోస్తున్నారు. ఇలాగే లీటర్ ధరలోనూ తేడాలు జరుగుతున్నాయి. పెట్రోల్ బంక్ మోసాలపై చర్యలు తీసుకోవాలి. –వింజమూరి రవి, సర్పంచ్, వర్కాల -
తూనికలు, కొలతలశాఖలో సిబ్బంది కొరత
మంచిర్యాలక్రైం: తూనికలు, కొలతల శాఖలో మోసాలను అరికట్టే వారే లేకుండాపోయారు. ఈ శాఖలో ఉన్నతాధికారి నుంచి సిబ్బంది వరకు పోస్టులు ఖాళీగా ఉండడంతో తూకాలు, ధరల్లో మోసాలు జరుగుతున్నాయి. మంచిర్యాల జిల్లా లో అసలు ఈ శాఖ కార్యాలయం ఎక్కడుందో కూడా చాలా మందికి తెలియదంటే అతిశయోక్తి కాదు. ఇదే అలుసుగా తీసుకుంటున్న వ్యాపారులు యథేచ్ఛగా మోసాలకు పాల్పడుతు న్నారు. జిల్లా తూనికల శాఖలో ఒక్కో డివిజన్‌కు ఆరుగులు ఉద్యోగులు ఉండాలి. కానీ ప్రస్తుతం జిల్లా మొత్తం మీద ఆ శాఖలో ముగ్గురే పనిచేస్తుండడంతో మోసాలు పెరుగుతున్నాయి. రెండు విభాగాలుగా దాడులు తూనికలు, కొలతలశాఖ అధికారులు రెండు విభాగాలుగా దాడులు చేస్తారు. ఒకటి పారిశ్రామిక జోన్, రెండు కమర్షియల్ జోన్. పారిశ్రామిక జోన్లో పరిశ్రమలు, పెట్రోల్ బంకులు, వే బ్రిడ్జీలు, ఉత్పత్తి సంస్థలు వస్తాయి. కమర్షియల్ జోన్లో కిరాణా దుకాణాలు, సూపర్బజార్లు, చిన్నచిన్న సంస్థలు వస్తాయి. ముఖ్యంగా ప్రజలకు ఎక్కువగా కమర్షియల్ జోన్‌తోనే సంబంధం. అయితే ప్రస్తుతం జిల్లాలో పనిచేస్తున్న అధికారులు పారిశ్రామిక జోన్ వ్యవహరాలపైనే దృష్టి సారిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. దీంతో సామాన్యులు ప్రతీ కొనుగోలులో వ్యాపారుల చేతిలో మోసపోవాల్సి వస్తోంది. రెండు జిల్లాలకు ఒక్కరే అధికారి మంచిర్యాల, ఆసిఫాబాద్ రెండు జిల్లాలకు ఒక్కరే తూనికలు, కొలతలశాఖ అధికారి కావడంతో పర్యవేక్షణ కొరవడింది. ఒక్కో డివిజన్‌కు ఒక ఇన్స్పెక్టర్, ఇద్దరు టెక్నికల్ అసిస్టెంట్లు, ఒక ల్యాబ్ అసిస్టెంట్, ఇద్దరు ఆఫీస్ సిబ్బంది ఉండాల్సి ఉండగా రెండు జిల్లాలకు కలిపి ఒక్కరే అధికారి ఉండడం గమనార్హం. మంచిర్యాల జిల్లాలో 18 మండలాలు, 311 గ్రామపంచాయతీ ఉన్నాయి. జిల్లాలో పారిశ్రామిక జోన్ విభాగంలో 46 పెట్రోల్ బంకులు, 15 వే బ్రిడ్జిలు సుమారు 120 వరకు ఉత్పత్తి సంస్థలు ఉన్నాయి. కమర్షియల్ జోన్ విభాగంలో సుమారు 550 వరకు వ్యాపార దుకాణాలు ఉన్నాయి. వీటిపై అధికారులు దాడులు చేసిన దాఖలాలు లేవు. వినియోగదారుల దినోత్సవం నిర్వహించడం అయితే ఈ శాఖ అధికారులు ఎప్పుడో మరిచిపోయారు. దీని వల్ల ప్రజలను చైతన్యవంతం చేయాల్సిన అవసరం ఉన్నా.. సిబ్బంది కొరతతో పూర్తిగా వదిలేశారు. కానరాని ల్యాబ్? వ్యాపారులు చేసే ప్రతీ మోసం కంటికి కనిపిం చదు. దాన్ని శాస్త్రీయంగా పరిలిశీస్తే తప్ప వారు చేసే మోసం పసిగట్టలేం. అలాంటి తప్పులను పసిగట్టాలంటె తూనికల కొలతలశాఖకు కొన్ని కచ్చితమైన పరికరాలు, ల్యాబ్ వసతి, ఇతర యంత్రాలు ఉండాలి. ప్రస్తుతం జిల్లాలో అలాంటి యంత్రాలు, ల్యాబ్ లేవు. ఏదో ఉదయం నుంచి సాయంత్రం వరకు సరదాగా బయటకు వెళ్లడం..రెండు కేసులు రాయడం, అందిన కాడికిదండుకోవడంతోనే సరిపెడుతున్నారు. పైగా వీరు చేసే దాడులను గోప్యంగా ఉంచుతున్నారు. ఇక కాగితాల్లో మాత్రం లెక్కలు పక్కగానే చూపిస్తున్నారు. ఫిర్యాదులు స్వీకరించే వారేరి? తూనికలు, కొలతలశాఖ అధికారులకు సమాచా రం ఇవ్వాలన్నా, ఫిర్యాదు చేయాలన్నా ఫోన్‌నంబర్, ఆ శాఖ కార్యాలయం ఎక్కడుందో కూడా చాలా మందికి తెలియదు. అలా తెలిసేలా ఎప్పు డూ ప్రచారం నిర్వహించిదీ లేదు. కొద్దోగొ ప్పో చదువుకున్నవారు ఇంటర్నెట్లో ఫోన్ నంబర్ చూసి అధికారులకు సమాచారం ఇస్తున్నారు. ఫిర్యాదు చేసేందుకు కార్యాలయాన్ని వెతుక్కుంటూ వెళ్తూ అక్కడ ఎవరూ ఉండడంలేదు. ఎప్పుడు చూసినా కార్యాలయానికి తాళం వేసే ఉంటోంది. తూకాల్లో మోసాలు మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రతీ దుకా ణంలో ఎలక్ట్రానిక్ కాంటాలు వాడుతున్నారు. వీటిలో సాంకేతిక లోపాలు రావడంతో వినియోగదారులు మోసపోతున్నారు. చేతికాంటాల్లో కిలో బాట్లకు బదులు బండరాళ్లను వాడుతున్నారు. నిబందనల ప్రకారం ఏటా కాంటాలను అధికారులతో తనిఖీ చేయించి వాటిపై ముద్ర వేయిం చాలి. కాని వ్యాపారులు ఏళ్ల తరబడి తనిఖీలు అలాగే వాడుతున్నారు. కిలోబాటు ఏడాదికి 50 గ్రాముల వరకు అరుగుదల ఉంటుంది. కాని వ్యా పారులు అదేమి పట్టించుకోవడంలేదు. దీంతో కిలోకు తూకంలో 50 గ్రాములు తేడా వస్తోంది. ఈ రకంగా వినియోగదారులు పెద్ద ఎత్తున మోసపోతున్నారు. అంతే కాకుండా కొంతమంది వ్యా పారులు వివిధ వస్తువులను ముందుగానే ప్యాక్ చేసి విక్రయిస్తున్నారు. ఆ ప్యాకింగ్ కవర్లపై తయా రీ తేదీ, కంపెనీ వివరాలు పొందుపరుచడంలేదు. సమాచారం ఇస్తే చర్యలు తీసుకుంటాం సరిపడా సిబ్బంది లేక కార్యాలయానికి తాళం వేసి తనిఖీలకు వెళ్లాల్సి వస్తోంది. జిల్లాలో కమర్షియల్, పారిశ్రామిక జోన్లలో తనిఖీలు చేస్తున్నాం. మార్కెట్లో చిన్నచిన్న కిరాణా దుకాణాల్లో కాంటాలను తనిఖీ చేసి కేసులు నమోదు చేస్తున్నాం. తూకాల్లో తేడాపై సమాచారం ఇస్తే చర్యలు తీసుకుంటాం. – ఎండీ జలీల్, తూనికలు, కొలతలశాఖ మంచిర్యాల జిల్లా అధికారి -
వేబ్రిడ్జి మోసాలపై తూనికలశాఖ కొరడా!
సాక్షి, హైదరాబాద్: వేబ్రిడ్జిల్లో మోసాలపై తూనికలు కొలతలశాఖ కొరడా ఝళిపించింది. శనివారం రాష్ట్ర వ్యాప్తంగా తూనికల కొలతలశాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ‘వేబ్రిడ్జిలో తూకం తగ్గుతోంది’ అని ఈ నెల 18న ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. తూకంలో మోసం చేస్తూ అక్రమాలకు పాల్పడుతున్న 35 వేబ్రిడ్జిలపై తూనికలు, కొలతల శాఖ అధికారులు కేసు నమోదు చేసి సీజ్ చేశారు. రీజినల్ డిప్యూటీ కంట్రోలర్ శ్రీనివాస్, రంగారెడ్డి జిల్లా అసిస్టెంట్ కంట్రోలర్ జగన్మోహన్ నేతృత్వంలో తనిఖీలు జరిగాయి. రంగారెడ్డి జిల్లాలో ఆటోనగర్‌లోని పంతంగి వేబ్రిడ్జి, సాగర్ రింగ్‌రోడ్డులోని జై హనుమాన్ వే బ్రిడ్జి, కర్మన్‌ఘాట్‌లోని ఫైసల్ వేబ్రిడ్జి, శంషాబాద్‌లోని రామధర్మకాంట, గోల్డెన్ వేబ్రిడ్జిల్లో ప్రత్యేక తనిఖీలు నిర్వహించి నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించడాన్ని గుర్తించారు. జై హనుమాన్ వేబ్రిడ్జి వద్ద తనిఖీలో యజమాని, కంప్యూటర్ ఆపరేటర్, లారీ డ్రైవర్లు కుమ్మకైన విషయం వెలుగు లోకి రావడంతో అధికారులు నివ్వెరపోయారు. దీనిపై వారు మరింత లోతుగా తనిఖీలు చేశారు. కంప్యూటర్లో ఎంత బరువు నమోదు చేస్తే అంతే వేబ్రిడ్జి తూకం చూపించేట్టుగా చేయడాన్ని అధికారులు గుర్తించారు. -
పెట్రోల్ బంకుల్లో ఇంధన దోపిడీ
అటు కల్తీ.. ఇటు కోత - వినియోగదారుడు లూటీ - ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌తో మోసాలు - ఫిర్యాదు వస్తేనే స్పందిస్తున్న అధికారులు - నామమాత్రంగా తనిఖీలు - అపరాధ రుసుముతో సరి.. పోచమ్మమైదాన్ : పెట్రోల్ బంకుల్లో మోసాలకు అడ్డే లేకుండా పోతోంది. తూనికలు, కొలతల శాఖ అధికారుల పర్యవేక్షణ కొరవడడంతో కల్తీతోపాటు మీటర్ రీడింగ్‌లో జంపింగ్ (కొలతల్లో మోసం)లకు పాల్పడుతూ వినియోగదారులను నిలువు దోపిడీ చేస్తున్నారు. జిల్లాలో 210 వరకు పెట్రోల్ బంకులు ఉన్నారు. చాలావరకు బంకుల్లో ఇంధనం కల్తీ అవుతున్నట్లు ఫిర్యాదులుఅందగా.. అధికారుల తనిఖీల్లో వెలుగుచూసిన ఘటనలు కోకొల్లలు. జిల్లాలోని పలు బంకుల్లో పరీక్షలకు అందని స్థారులో కల్తీ జరుగుతున్నట్లు సమాచారం. ఇది చాలదన్నట్లు బంకుల నిర్వాహకులు ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించి కొలతల్లో మోసాలకు పాల్పడుతుండడం వినియోగదారులను బెంబేలెత్తిస్తోంది. హన్మకొండ అదాలత్ సమీపంలోని కీర్తి ఫిల్లింగ్ స్టేషన్లో సోమవారం మోసాల తంతు బట్టయలైన తీరు... జిల్లాలోని బంకుల్లో సాగుతున్న అక్రమ దందాకు నిదర్శనంగా నిలుస్తోంది. ఫలితంగా ఇంధనం రూపేణా పెట్రోల్, డీజిల్ వినియోగదారుల జేబులకు నిత్యం రూ.లక్షల్లో చిల్లు పడుతోంది. అధికారుల నిర్లక్ష్యంతోనే... వినియోగదారుల నుంచి ఫిర్యాదులు అందితే గానీ.. అధికారులు కదలరనే అపవాదు తూనికలు, కొలతల శాఖపై ఉంది. ఇంధన కల్తీ.. రీడింగ్ జంపింగ్‌కు సంబంధించి తూతూమంత్రపు చర్యలు తీసుకుని చేతులు దులుపుకోవడంతో అక్రమార్కులు యథేచ్ఛగా దందాకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. గతంలో పంథిని, తొర్రూర్, ఫోర్ట్ రోడ్లలోని పలు బంకుల్లో అధికారులు నిర్వహించిన తనిఖీల్లో నిర్వాహకుల మోసాలు బట్టబయలయ్యూరు. ఓ ఫిల్లింగ్ స్టేషన్లో ఐదు లీటర్ల పెట్రోల్‌కు 130 మిల్లీ లీటర్లు, మరో బంక్‌లో ఐదు లీటర్ల పెట్రోల్‌కు 50 మిల్లీ లీటర్ల పెట్రోల్ తక్కువగా వచ్చినట్లు తేలింది. ఈ మేరకు అధికారులు తక్కువగా వచ్చిన ఫిల్లింగ్ పాయింట్ల (యంత్రాలు)ను మాత్రమే సీజ్ చేసి చేతులు దులుపుకున్నారు. ఆయూ బంకుల్లోని మిగతా ఫిల్లింగ్ పాయింట్ల ద్వారా పెట్రో ఉత్పత్తుల విక్రయూలు కొనసాగుతుండగా... అపరాధ రుసుం చెల్లించడంతో మూతబడినవి కొన్ని రోజుల తర్వాత తెరుచుకోవడం పరిపాటిగా మారింది. దీంతో బంకుల నిర్వాహకుల్లో భయం లేకుండా పోయింది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం మోసాలు బయటపడితే సదరు వ్యక్తులపై చీటింగ్ కేసు నమోదు చేయడమే కాకుండా సంబంధిత వస్తువులను సీజ్ చేసి కోర్టుకు అప్పగించాలి. కానీ.. తూనికలు, కొలతల శాఖ అధికారులు అటువంటి చర్యలు తీసుకున్న దాఖలాలు జిల్లాలో ఎక్కడా లేవు. కొలతల్లో మోసాలు ఇలా... - పెట్రోల్ బంకులకు ఆయిల్ కంపెనీలే ఫిల్లింగ్ యంత్రాలను సరఫరా చేస్తాయి. కొన్ని కంపెనీలు నిబంధనలకు విరుద్ధంగా ఫిల్లింగ్ యంత్రాల్లో మార్పు చేర్పులతోపాటు రిమోట్ ద్వారా ఆపరేట్ వెసులుబాటు కల్పించాయి. దీన్ని అసరా చేసుకున్న ఫిల్లింగ్ స్టేషన్ల యజమాన్యాలు యథేచ్ఛగా పెట్రోల్, డీజిల్ రీడింగ్‌లో జంపింగ్‌కు పాల్పడుతున్నాయి. - కొన్ని కంపెనీలకు సంబంధించి ఫిల్లింగ్ యంత్రాలకు రిమోట్ వెసులుబాటు లేదు. అయినా.... పలు బంకుల నిర్వాహకులు పంపింగ్ యం త్రాల్లో ప్రత్యేక సాఫ్ట్వేర్ అమర్చి కొలతల్లో మోసాలకు పాల్పడుతున్నారు. - భారీ క్యూ ఉండే పెట్రోల్ పంపుల్లో జీ రీడింగ్ చేయకుండానే (డబ్బులు ఫీడ్ కానీ... లీటర్లు అని) పంపింగ్ చేస్తుంటారు. ఇలా చేయడం వల్ల మన కంటే ముందు బైక్ వ్యక్తి ఎంత పెట్రోల్ పోసుకుంటే... అతడి వెనుక వాహనానికి అంత తక్కువగా వస్తుంది. కల్తీ.. ఇలా గుర్తుపట్టొచ్చు.. - ఇంధన పరీక్షకు సంబంధించి ప్రతి పెట్రోల్ బంకులో ఫిల్టర్ పేపర్ ఉండాలి. చతురస్ర ఆకారంలో ఉండే ఫిల్టర్ పేపర్‌పై రెండు చుక్కల పెట్రోల్‌ను పోయూలి. రెండు నిమిషాల తర్వాత అవి నల్లగా మారితే కల్తీ జరిగినట్లే. - పెట్రోల్ పంపుల్లో హైడ్రోమీటర్, థర్మామీటర్ తప్పనిసరిగా ఉండాలని ఆయిల్ కంపెనీ మార్కెటింగ్ గైడ్‌లైన్స్‌లో ఉంది. పెట్రోల్ లేదా డీజిల్‌లో హైడ్రోమీటర్, థర్మామీటర్ పెట్టాలి. హైడ్రోమీటర్ ద్వారా రీడింగ్... థర్మామీటర్ ద్వారా టెంపరేచర్(ఉష్ణోగ్రత)ను చెక్ చేయాలి. గతంలో కంపెనీ వారు పంప్ దగ్గర ఉన్న బుక్‌లో నమోదు చేసిన రీడింగ్‌ను పరిశీలించాలి. ఈ రీడింగ్‌లో 3 పాయింట్ల కంటే ఎక్కువ ఉంటే కల్తీ జరిగినట్లుగా నిర్ధారించవచ్చు. కొలతల్లో ఇలా... - పెట్రోల్ పంప్ వద్ద బీఎస్ఐ గుర్తించిన ఐదు లీటర్ల కొలత పాత్రలు ఉండాలి. కొనుగోలు చేసిన దానికంటే తక్కువ ఇంధనం వచ్చినట్లు అనుమానం కలిగితే... వెంటనే ఆ పాత్రలో పోసి కొలిచి చూడవచ్చు. - కల్తీ జరిగిందని గానీ... కొలతలో తేడా వచ్చిందని గానీ తేలితే పోలీస్, విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్, తూనికలు, కొలతల శాఖ, సివిల్ సప్లయీస్ అధికారులకు ఫిర్యాదు చేయొచ్చు. మూడుసార్లు ఇలాంటి ఫిర్యాదులు అంది... పరీక్షల్లో కల్తీ ఉన్నట్లు తెలితే ఆయూ బంకులను సీజ్ చేసే అధికారం అధికారులకు ఉంది. 97016 06633కు ఫోన్ చేయండి ఏ బంకుల్లోనైనా కల్తీగానీ.. కొలతల్లో మోసం గానీ జరిగితే ఈ నంబర్‌కు సమాచారం ఇవ్వండి. వెంటనే అక్కడ వాలుతాం. ఫిర్యాదులు అందిన బంకుల్లో వెంటవెంటనే తనిఖీలు చేస్తున్నాం. మీటర్ రీడింగ్ మోసాలకు పాల్పడిన బంకుల యజమానులపై కేసులు సైతం పెడుతున్నాం. - రామ్‌కుమార్, తూనికలు, కొలతల శాఖ డిప్యూటీ కమిషనర్