Media Teams
-
ఇండియా నన్ను స్వీకరిస్తే చాలు..!: జాక్వెలిన్ ఫెర్నాండేజ్
కష్టాలను తట్టుకొని, త్వరగా కోలుకొని, తిరిగి మామూలు స్థితిలోకి వచ్చే మానసిక దృఢత్వాన్ని ఇంగ్లిష్‌లో ‘రిజిలియన్స్’ అని, తెలుగులో ‘స్థితిస్థాపకత్వం’ అని మనం అంటే అంటూండవచ్చు కానీ.. ఇక్కడ మాత్రం.. ‘జాక్వెలిన్ ఫెర్నాండేజ్’ అని మాత్రమే ఆ.. దృఢత్వానికి అర్థం చెప్పుకోవాలి! జాక్వెలిన్ బాలీవుడ్‌లోకి వచ్చి 15 ఏళ్లు అయింది. ఈ ఒకటిన్నర దశాబ్దాలలో ఆమె అనేక విజయాలను చవి చూశారు. కొన్ని కష్టకాలాలు కూడా ఆమెకు తమ తడాఖా చూపించాయి. అయితే – ‘‘కష్టం లేనిదే జీవితం లేదు. ఆ కష్టం నుంచి జీవితం ఏం నేర్పిందన్నదే మనకు ముఖ్యం’’ అని అంటారు జాక్వెలిన్.‘‘నేనైతే గాలి దుమారంలా వచ్చిపోయే ఒడిదుడుకులకు గట్టిగా నిలబడటం నేర్చుకున్నాను. నాపై నేను నమ్మకాన్ని ఏర్పరచుకోవడాన్ని సాధన చేశాను. చేస్తున్న పని నుండి పారిపోవలసి వస్తే అసలా పనిలోకి ఎన్ని ఆశలతో వచ్చామన్నది మొదట గుర్తు చేసుకోవాలి. అక్కడి వరకు సాగిన మన ప్రయాణాన్ని వృథా కానివ్వకూడదని సంకల్పించుకోవాలి. ఇక నాకైతే నన్ను ప్రేమించే కుటుంబ సభ్యులు అండగా ఉన్నారు. నన్ను సంతోషంగా ఉంచే వ్యాపకాలూ నాకు తోడుగా ఉన్నాయి’’ అంటారు జాక్వెలిన్ . శ్రీలంక నుంచి వచ్చి, ‘అలాద్దీన్’ (2009) చిత్రంతో బాలీవుడ్‌కు పరిచయమై, ‘మర్డర్–2’ తో ఇండస్త్రీలో నిలదొక్కుకున్న జాక్వెలిన్ .. ‘‘ఇండియా నన్ను స్వీకరిస్తే చాలునన్నదే అప్పటి నా కల’’ అంటారు. ‘‘అయితే ఈ దేశం నన్ను అక్కున చేర్చుకుని, ఆ కలను మించిన గుర్తింపునే ఇచ్చింది. మొదట్లో భాష కొంచెం కష్టంగా అనిపించినప్పటికీ, బాలీవుడ్ ప్రేక్షకులు నాకిది పరాయి దేశం అన్న భావన కలగనంతగా నన్ను ఆదరించారు’’ అని ఆమె తెలిపారు.ఈ పదిహేనేళ్లలోనూ 30కి పైగా చిత్రాలలో నటించిన జాక్వెలిన్ రెండు నెలల క్రితమే ‘స్టార్మ్ రైడర్’ మ్యూజిక్ వీడియోతో సంగీత ప్రపంచంలోకి కూడా ప్రవేశించారు. ప్రస్తుతం షూటింగ్లో ఉన్న ‘హౌస్‌ఫుల్ 5’ చిత్రంలో నటిస్తున్నారు. అందులో హీరో అక్షయ్ కుమార్. ‘‘ఏ రంగంలోనైనా ఎదుగుతున్న క్రమంలో సవాళ్లు ఎదురవటం మామూలే. అయితే ఊహించని వైపుల నుంచి సవాళ్లు చుట్టుముట్టినప్పుడు (బహుశా ఈడీ దాడులు, మీడియా రాతలు అని ఆమె ఉద్దేశం కావచ్చు) జీవితం తలకిందులు అయినట్లుగా అనిపిస్తుంది. అప్పుడే మనం దృఢంగా ఉండాలి.. ’’ అని హార్పర్స్ బజార్’కు ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో చెప్పారు జాక్వెలిన్ (చదవండి: జస్ట్ ఏడు రోజుల్లో 8 కిలోలు బరువు తగ్గిన నటి నిమ్రా ఖాన్: ఇది ఆరోగ్యకరమేనా..?) -
జూబ్లీహిల్స్ లోని ఒక ప్రముఖ మీడియా హౌస్ లో ఈడీ సోదాలు
-
సచివాలయం కూల్చివేత.. అనూహ్య నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: సచివాలయ భవనాల కూల్చివేత పనులకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం అనూహ్య నిర్ణయం తీసుకుంది. సచివాలయ భవనాల కూల్చివేత పనుల వద్దకు వెళ్లేందుకు మీడియాకు ప్రభుత్వం అనుమతిచ్చింది. ఈ క్రమంలో సోమవారం సాయంత్రం 4 గంటలకు బీఆర్కే భవన్ నుంచి సిటీ పోలీసు కమిషనర్ నేతృత్వంలో మీడియా ప్రతినిధులు.. సచివాలయ భవనాల కూల్చివేత పనుల వద్దకు వెళ్లనున్నారు. ఈనెల 6 వ తేది అర్ధరాత్రి నుంచి కూల్చివేతలు ప్రారంభమయిన సంగతి తెలిసిందే. మధ్యలో హై కోర్టు కూల్చివేతల పనులను వారం రోజుల పాటు నిలిపివేయాలని ఆదేశించింది. ప్రతిపక్ష పార్టీలు కూల్చివేతలను ఆపాలని సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి. కానీ కేబినెట్ నిర్ణయాన్ని వ్యతిరేకించలేమని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్‌లో కూడా పిటిషన్ దాఖలు చేశారు. అక్కడ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఊరట లభించింది. దాంతో ప్రభుత్వం కూల్చివేత పనులను తిరిగి ప్రారంభించింది. (సినిమా అయిపోయాక టికెటిస్తే?) ఇప్పటికే దాదాపు 90 శాతం కూల్చివేత పనులు పూర్తయ్యాయి. శిథిలాలు (వ్యర్థాలు) మొత్తం దాదాపు 4500 లారీల లోడు ఉంటుందని అంచనా. ఇందులో ఇప్పటికే 2వేల లారీల ట్రిప్పులు ఎత్తివేయడం జరిగింది. మిగతా పనులు జరుగుతున్నాయి. ఎత్తైన భవనాలు కూల్చివేసే సందర్భంలో ప్రమాదం జరిగే అవకాశం పొంచి ఉండడంతో ముందు జాగ్రత్త చర్యగా ప్రభుత్వం ఎవరినీ ఆ ప్రాంతంలోకి అనుమతించలేదు. అందులో భాగంగా మీడియాను కూడా అనుమతించలేదు. అయితే కూల్చివేత వార్తలు సేకరించడానికి అనుమతి ఇవ్వాలని మీడియా ప్రతినిధుల నుంచి పదే పదే విజ్ఞప్తులు వెల్లువెత్తాయి. హైకోర్టులో పిటిషన్ కూడా దాఖలయ్యింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కూల్చివేత పనులకు, వ్యర్థాల తొలగింపు పనులకు సంబంధించిన వార్తల సేకరణకు అనుమతి ఇవ్వాలని నిర్ణయించింనట్లు రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత రెడ్డి ప్రకటించారు. (కేసీఆర్ సర్కార్‌కు హైకోర్టు షాక్..) అయితే కూల్చివేతల సందర్భంగా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకుని ప్రభుత్వమే మీడియా ప్రతినిధులకు ఆ ప్రాంతాన్ని చూపించాలని నిర్ణయించినట్లు ఆయన వెల్లడించారు. ఈ రోజు (సోమవారం) సాయంత్రం 4 గంటలకు బీర్కే భవన్ నుంచి మీడియా ప్రతినిధులను సిటి పోలీస్ కమిషనర్ ఆధ్వర్యంలో తీసుకెళ్ళి, సెక్రటేరియట్ ప్రాంతాన్ని చూపిస్తామన్నారు. -
‘అరే.. మమ్మల్ని కింద పడేస్తారా ఏంటి’
కోల్‌కతా : తృణముల్ కాంగ్రెస్ (టీఎంసీ) నుంచి పోటీచేసి తొలిసారి ఎంపీగా ఎన్నికయిన నుస్రత్ జహాన్, మిమి చక్రవర్తీలు లోక్‌సభ సభ్యులుగా మంగళవారం ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. ప్రమాణ స్వీకారం అనంతరం బయటకు వచ్చిన మహిళా ఎంపీల చుట్టూ విలేకరుల గుమిగూడారు. వారిని కదలనీయకుండా చుట్టుముట్టి.. ప్రశ్నలు అడుగుతూ.. ఫోటోలు తీస్తూ ఇబ్బంది పెట్టారు. ముందుకు వెళ్లడానికి దారి లేకుండా చుట్టూ చేరారు. ఒకానొక సమయంలో ఈ మహిళా ఎంపీలు తిరిగి పార్లమెంట్‌లోకి వెళ్దామనుకున్నారు. కానీ అది కూడా వీలు పడలేదు. దాంతో తమకు దారి ఇవ్వాల్సిందిగా విలేకరులను కోరారు. అయితే వారి మాటలను ఎవరూ పట్టించుకోలేదు. దాంతో సహనం కోల్పోయిన ఈ యువ ఎంపీలు విలేకరుల మీద మండి పడ్డారు. ‘మీరంతా ఇలా చుట్టుముట్టడం చాలా ఇబ్బందిగా ఉంది. మమ్మల్ని పడేస్తారా ఏంటి.. అర్థం చేసుకోండి.. మమ్మల్ని వెళ్లనివ్వండి’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వీరి ఇబ్బంది గమనించిన భద్రతా సిబ్బంది అక్కడకు వచ్చి.. ఎంపీలు వారి వాహనం వద్దకు వెళ్లేందుకు సాయం చేశారు. కారు దగ్గరకి వచ్చాక కూడా విలేకరులు వీరిని వదిలిపెట్టలేదు. ఒక్క ఫోటో అంటూ ఇబ్బంది పెట్టారు. దాంతో ఈ మహిళా ఎంపీలు క్యూలైన్లో తమకు దూరంగా నిలబడితే ఫోటో దిగుతామని కండిషన్ పెట్టి.. ఫోటోలు దిగి అక్కడ నుంచి బయటపడ్డారు. -
జట్టులో లేని ఆటగాళ్లను పంపిస్తారా?
సౌతాంప్టన్: భారత జట్టు మేనేజ్మెంట్ తీరుపై అసహనం వ్యక్తం చేసిన విలేకర్లు మీడియా సమావేశాన్ని బాయ్‌కాట్ చేశారు. ప్రపంచకప్‌లో రేపు భారత్ తొలి మ్యాచ్ ఆడనుంది. ఈ నేపథ్యంలో సోమవారం మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయగా... దీనికి నెట్ ప్రాక్టీస్ కోసం ఇంగ్లండ్ వెళ్లిన బౌలర్లు దీపక్ చహర్, అవేశ్ ఖాన్, ఖలీల్ అహ్మద్‌లు వచ్చారు. అంతర్జాతీయ మీడియా ప్రతినిధులు... టీమిండియా కెప్టెన్ కోహ్లి కాకపోయినా, హెడ్‌కోచ్ రవిశాస్త్రినో లేదంటే కనీసం సీనియర్ క్రికెటర్ ఎవరైనా వస్తారని ఆశించారు. తీరా జట్టులో చోటేలేని ఆటగాళ్లు మీడియా హాల్లో కనబడటంతో అసంతృప్తి వ్యక్తం చేసిన విలేకరులు... సమావేశాన్ని బాయ్‌కాట్ చేశారు. దీనిపై టీమిండియా మీడియా మేనేజర్‌ను సంప్రదించగా... భారత్ ప్రపంచకప్ ఆట ఇంకా మొదలుకాకపోవడం వల్లే నెట్ బౌలర్లను పంపించాల్సి వచ్చిందని బదులిచ్చాడు. గత ప్రపంచకప్‌లోనూ భారత జట్టుతో మీడియాకు ఇలాంటి పరిస్థితులే ఎదురయ్యాయి. అప్పటి కెప్టెన్ ధోని మీడియా సమావేశాలకు అంతగా ప్రాధాన్యత ఇవ్వలేదు. బుమ్రాకు డోప్ టెస్టు: భారత పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు సోమవారం డోప్ టెస్టు నిర్వహించారు. ప్రపంచ డోపింగ్ నిరోధక సంస్థ (వాడా) గుర్తింపు ఉన్న ఏజెన్సీ బుమ్రా నుంచి మూత్ర నమూనాలను సేకరించింది. ఇది ప్రపంచకప్ టోర్నీ కావడంతో పలానా జట్టుకు అని కాకుండా ర్యాండమ్‌గా ఎవరికైనా డోపింగ్ పరీక్షలు నిర్వహించే అవకాశముంటుంది. -
కాంగ్రెస్ కొత్త మీడియా జట్లు
సాక్షి, న్యూఢిల్లీ: ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో సమర్థులైన, వాగ్ధాటి నైపుణ్యంగల వారితో కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ కొత్తగా మీడియా బృందాలను రూపొందించారు. అధికార ప్రతినిధుల జాబితాలో మార్పులు జరిగాయి. కేంద్ర మంత్రులు చిదంబరం, సల్మాన్ ఖుర్షీద్, గులాంనబీ ఆజాద్, ఆనంద్‌శర్మతోపాటు ఏఐసీసీ సెక్రటరీ జనరల్ ముఖుల్ వాస్నిక్‌లు పార్టీ తరఫున సీనియర్ అధికార ప్రతినిధులుగా ఇకపై వ్యవహరించనున్నారు. రెండు జాబితాల్లోనూ రాహుల్ అనుచరులకు తగిన చోటు లభించింది. పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఆమె తనయుడు రాహు ల్ కలసి ఈ సారి జాబితాలను ఖరారు చేశారు. 13 మంది అధికార ప్రతినిధులు, 24 మంది మీడియా ప్యానలిస్ట్లతోపాటు.. జాతీయ మీడియాలో రాష్ట్రాల అంశాలపై మాట్లాడేందుకు మరో 30 మంది టెలివిజన్ ప్యానలిస్ట్‌లను నియమించినట్లు పార్టీ ప్రతినిధి అజయ్ మాకెన్ వెల్లడించారు. 13 మంది పార్టీ అధికార ప్రతినిధుల జాబితాలో.. ఇటీవలే భార్య సునందపుష్కర్ అనుమానాస్పద మృతితో వార్తలకెక్కిన శశి థరూర్‌కు కూడా చోటు లభించింది. వివాదాస్పద సీడీ వివాదంతో అధికార ప్రతినిధి స్థానం నుంచి తప్పుకున్న అభిషేక్ సింఘ్వికి మళ్లీ చోటు కల్పించారు.