meenambakkam airport
-
ఆరు కిలోల బంగారం స్వాధీనం
తిరువొత్తియూరు/చెన్నై: దుబాయ్ నుంచి చెన్నైకి వచ్చిన విమానంలో రూ.2 కోట్ల 90 లక్షల విలువ చేసే ఆరు కిలోల బంగారు కడ్డీలను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. చెన్నై మీనంబాక్కం అంతర్జాతీయ విమానాశ్రయానికి దుబాయ్ నుంచి ఆదివారం ఉదయం విమానం వచ్చింది. అందులో వచ్చిన ప్రయాణికులను కస్టమ్స్ అధికారులు తనిఖీలు చేశారు. తరువాత అధికారులు విమానంలోకి ఎక్కి తనిఖీ చేయగా ఓ సీటు కింద రెండు పార్శిల్స్ కనబడ్డాయి. వాటిని విప్పి చూడగా ఆరు బంగారు కడ్డీలు వున్నాయి. వీటి విలువ రూ.2 కోట్ల 90 లక్షలు అని తెలిసింది. బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. చదవండి: బంగారం..స్మగ్లర్ల సింగారం -
పాదరక్షల్లో బంగారం తరలింపు
టీ.నగర్(చెన్నై): చెన్నై మీనంబాక్కం విమానాశ్రయంలో అక్రమంగా తరలిస్తున్న రూ.33 లక్షల విలువగల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు మంగళవారం రాత్రి స్వాధీనం చేసుకుని, ఇద్దరిని అరెస్టు చేశారు. చెన్నైకి చెందిన అస్మద్‌ఖాన్ (34) తాను ధరించిన పాదరక్షల అడుగు భాగంలో బంగారాన్ని దాచి తీసుకువస్తుండగా అదుపులోకి తీసుకున్నారు. అలాగే కేరళకు చెందిన ప్రకాశ్ (32) సూట్‌కేసులో దాచి తీసుకువస్తుండగా పట్టుకున్నారు. కాగా, సింగపూర్‌కు వెళ్లేందుకు విమానాశ్రయానికి వచ్చిన చెన్నైకి చెందిన మహ్మద్ ఆసిఫ్ అనే వ్యక్తి దగ్గర కస్టమ్స్ అధికారులు రూ.5 లక్షల విలువైన అబుదాబి దేశ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. అతను తన లోదుస్తుల్లో ఆ కరెన్సీని దాచుకుని వచ్చి తనిఖీల్లో పట్టుబడ్డాడు. -
నిబంధనల ఉల్లంఘన
సాక్షి, చెన్నై: మీనంబాక్కం విమానాశ్రయంలో నిబంధనలు ఉల్లంఘించినందుకు గాను ఎం డీఎంకే నేత వైగోపై కేసు నమోదు అయింది. ఆయనతోపాటుగా 400 మందిపై కేసులు పెట్టారు. అయితే, నిబంధనలను ఉల్లంఘిస్తున్నా చోద్యం చూసినందుకుగాను విమానాశ్రయం ఇన్స్పెక్టర్ మహిమై వీరన్పై బదిలీ వేటు పడింది. ఎండీఎంకే నేత వైగో చాలా కాలం తర్వాత విదేశాలకు గత వారం వెళ్లారు. ఆయనపై ఉన్న కేసుల ఎత్తివేతతో తొలి పర్యటనలో మలేషియాకు వెళ్లారు. అక్కడ తమిళ మహాసభల్ని ముగించుకుని బుధవారం చెన్నైకు తిరుగు పయనమయ్యారు. విదేశాలకు వెళ్లి వస్తున్న తమ నేతకు ఘన స్వాగతం పలికేందుకు ఎండీఎంకే వర్గాలు ఏర్పాట్లు చేశాయి. ఎలాంటి ముందస్తు అనుమతులు లేకుండానే విమానాశ్రయం పరిసరాల్లో హంగామా సృష్టించాయి. వివాదం: విదేశీ టెర్మినల్ వద్ద ప్రత్యేక ఆంక్షలు ఉన్నాయి. రాజకీయ నాయకులు ఎవరైనా వస్తే, వారిని ఆహ్వానించేందుకు పెద్ద సంఖ్య లో టెర్మినల్ వైపుగా ఎవ్వరూ చొచ్చుకు రాకూడదు. అలాగే, ఊరేగింపులు నిర్వహించరాదు. అయితే, ఎండీఎంకే వర్గాలు కాస్త అత్యుత్సాహం ప్రదర్శించాయి. వైగో బయటకు రాగానే టెర్మినల్ ప్రవేశ మార్గంలోకి చొచ్చుకెళ్లాయి. భద్రతా సిబ్బంది అడ్డుకునే క్రమంలో వైగో తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు. అక్కడి భద్రతా సిబ్బందిని ఆయన తీవ్రంగానే మందలించారు. దీంతో మరింతగా రెచ్చిపోయిన ఎండీఎంకే వర్గాలు ఉత్సాహంతో కేరింతలు కొడుతూ టెర్మినల్ నుంచి ఊరేగింపుగా నినాదాలతో హోరెత్తిస్తూ ముందుకు కదిలారు. కేసుల నమోదు: విమానాశ్రయం పరిసరాల్లో సాగిన ఎండీఎంకే వర్గాల హంగామాను అక్కడి ఉన్నతాధికారులు తీవ్రంగా పరిగణించారు. నిబంధనల ఉల్లంఘన, భద్రతలో స్థానిక పోలీసుల వైఫల్యంను ఎత్తి చూపుతూ హోంశాఖకు ఫిర్యాదు చేశారు. దీంతో నగర పోలీసు యంత్రాంగం వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. నగర పోలీసు కమిషనర్ జార్జ్ ఆదేశాలతో అక్కడి పోలీసులు ఆ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను సేకరించారు. వైగోకు ఆహ్వానం పలికేందుకు వచ్చిన వారి పేర్లను సేకరించి, కేసుల నమోదుకు నిర్ణయించారు. ఎండీఎంకే నేత వైగో, మల్లై సత్య, పాలవాక్కం సోము తదితరులతో పాటుగా 400 మందిపై కేసులు నమోదు చేశారు. విమానాశ్రయంలో భద్రత విధుల్లో ఉన్న పోలీసులను అడ్డుకోవడం, వారించిన వారిపై తిరగబడడం, నిబంధనల ఉల్లంఘన, అనుమతి లేకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరించడం తదితర సెక్షన్లతో వీరిపై కేసులు పెట్టారు. చివరకు అక్కడి భద్రతా విధుల్లో ఉన్న ఇన్స్పెక్టర్ మహిమై వీరన్పై బదిలీ వేటు తప్పలేదు. ఆయన్ను అక్కడి నుంచి ట్రిప్లికేషన్ క్రైం బ్రాంచ్‌కు మార్చారు. మైలాపూర్ ఇన్స్పెక్టర్ వెంకటరమణను విమానాశ్రయూనికి బదిలీ చేశారు. -
మీనంబాక్కంలో అలర్ట్
సాక్షి, చెన్నై: మీనంబాక్కం విమానాశ్రయం ఆవరణలో ఆదివారం ఉదయం కాసేపు హైడ్రామా సాగింది. విమానాశ్రయం భద్రతా సిబ్బంది, తమిళ పోలీసులు ఓ వైపు, ఆంధ్రా పోలీసులు మరో వైపు తిష్ట వేయడంతో ఏమి జరుగుతోందో తెలియక ఉత్కంఠ నెలకొంది. చివరకు కట్టుదిట్టమైన భద్రత నడుమ కోల్‌కతా నుంచి చెన్నై మీదుగా నెల్లూరుకు మావోయిస్టు వెంకటేశ్వరరావును తరలించిన సమాచారంతో ఉత్కంఠకు తెర పడింది. ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం నేదురుమల్లి జనార్దన్ రెడ్డి మీద జరిగిన బాంబు దాడి కేసు విచారణను ప్రత్యేక సిట్‌కు అప్పగించారు. ఈ క్రమంలో పశ్చిమ బెంగాల్లో దీపక్ అలియాస్ వెంకటేశ్వరరావు అనే మావోయిస్టును అక్కడి పోలీసులు పట్టుకున్నారు. అతడిని తమ కస్టడీలోకి తీసుకునేందుకు ఆంధ్రా పోలీసులు కోల్‌కతాకు వెళ్లారు. వెంకటేశ్వరరావును తమ అదుపులోకి తీసుకుని తిరుగు పయనమయ్యూరు. అలర్ట్ : చెన్నై మీదుగా నెల్లూరుకు వెంకటేశ్వరరావును తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. దీంతో మీనంబాక్కం విమానాశ్రయం వద్ద ఉదయం కాసేపు పోలీసులు మరింత అప్రమత్తంగా వ్యవహరించి హడావుడి సృష్టించారు. విమానాశ్రయంలోని కేంద్ర భద్రతా బలగాలు, తమిళ పోలీసులు ఓ వైపు, ఆంధ్రా నుంచి ఆయుధాలతో వచ్చిన పోలీసుల బృందాలు మరో వైపు అక్కడ తిష్ట వేయడంతో ఉత్కంఠ నెలకొంది. ఎవరైనా వీఐపీ వస్తున్నారా..? అన్న అనుమానాలు మెుదలయ్యూయి. అక్కడి మీడియా వర్గాలు సైతం కాసేపు అయోమయంలో పడ్డాయి. చివరకు తమిళ పోలీసుల ద్వారా వివరాలను రాబట్టడంతో కోల్‌కతా నుంచి మావోరుుస్టును పట్టుకొస్తున్నారన్న ప్రచారం అక్కడ వ్యాపించింది. అదే సమయంలో అక్కడి భద్రతా సిబ్బంది కాసేపు హడావుడి సృష్టించడంతో అటు ప్రయాణికులు, ఇటు మీడియా వర్గాలకు ఇబ్బందులు తప్పలేదు. చివరకు కోల్‌కతా నుంచి వచ్చిన ఓ విమానం నుంచి గట్టి భద్రత నడుమ వెంకటేశ్వరరావును బయటకు తీసుకొచ్చారు. నెల్లూరుకు : ఆంధ్రా పోలీసుల వాహనంలో వెంకటేశ్వరరావును ఎక్కించారు. ముందు వెనుక పోలీసుల భద్రతా వాహనాలు అనుసరించగా మావోరుుస్టు కూర్చున్న వాహనం నెల్లూరు వైపుగా బయల్దేరింది. ఈ వాహనాలకు సిగ్నల్స్ వద్ద తమిళ పోలీసులు దారి ఇచ్చారు. రాష్ట్ర సరిహద్దులు దాటే వరకు తమిళ పోలీసులు సహకారం అందించి, చివరకు హమ్మయ్యా అని ఊపిరి పీల్చుకున్నారు. అసలే, రాష్ట్రంలో సంఘ విద్రోహ శక్తుల కదలికలు చాప కింద నీరులా విస్తరిస్తుండడం, రెండు రోజుల క్రితం ఐఎస్ఐ ఏజెంట్ పట్టుపడడం పోలీసుల్లో కొంత ఆందోళన కలిగించింది. కోల్‌కతా నుంచి మావోరుుస్టును చెన్నై మీదుగా తరలించడంతో తాము భద్రత కల్పించాల్సి వచ్చిందని తమిళ పోలీసులు పేర్కొనడం గమనార్హం. -
వెంకయ్యకు బ్రహ్మరథం
- అందరూ మిత్రులే - ప్రాంతీయ భాషల్ని గౌరవిస్తాం - జంప్ జిలానీలొద్దు... - యువత రావాలని పిలుపు సాక్షి, చెన్నై : కేంద్ర మంత్రిగా తొలిసారి చెన్నైలో అడుగుపెట్టిన ఎం.వెంకయ్యనాయుడుకు కమలనాథులు బ్రహ్మరథం పట్టారు. మీనంబాక్కం విమానాశ్రయంలో, పార్టీ కార్యాలయం కమలాలయంలో ఆయనకు ఘన స్వాగతం పలికి సత్కరించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన వెంకయ్య నాయుడు అన్ని రాష్ట్రాలతో స్నేహ పూర్వకంగా మెలిగేందుకు తమ ప్రభుత్వం ముందుకెళ్తోందన్నారు. ప్రాంతీయ భాషలకు గౌరవం ఇస్తున్నామని, ఆ భాషల మీద మరో భాషను రుద్దే ప్రయత్నం చేయలేదని స్పష్టం చేశారు. తొలిసారిగా కేంద్ర మంత్రి హోదాలో వెంకయ్యనాయుడు చెన్నైకు శుక్రవారం వచ్చారు. ఆయన రాకను పురస్కరించుకుని కమలనాథులు భారీ స్వాగతానికి ఏర్పాట్లు చేశారు. కమలాలయం వద్ద పార్టీ వర్గాలు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు.అనంతరం మీడియాతో ఆయన మాట్లాడారు. హుందాగా వ్యవహరించాలి తమ పార్టీ కార్యాలయం ఎదుట కాంగ్రెస్ ఆందోళన చేయడం విడ్డూరంగా ఉందని గుర్తుచేస్తూ, ప్రజలు ఇచ్చిన తీర్పును ఓ మారు వారు పరిశీలన చేసుకోవాలని హితవు పలికా రు. గతంలో ఎన్డీఏ నియమించిన గవర్నర్‌లోని అధికారంలోకి రాగానే, యూపీఏ తప్పించిందని గుర్తుచేశారు. అయితే తాము రాజీనామ చేయాలని అడగక ముందే కాంగ్రెస్ రాజకీయం చేస్తుండడం శోచనీయమన్నారు. రాజకీయంగా పదవులు పొందిన వాళ్లు ప్రభుత్వం మారగానే, వాళ్లంతకు వాళ్లు రాజీనామాలు చేసి వెళ్లడం సంప్రదాయం అని, అలా చేసి తమ హుందాతనాన్ని నిరూపించుకోవాల్సిన అవసరం ఉందని కాంగ్రెస్ నియమించిన గవర్నర్లకు సూచించారు. తమిళనాడులో బీజేపి బలం పెరిగిందన్నారు. తమిళనాడులో పార్టీ బలోపేతం మీద దృష్టి పెట్టనున్నామన్నారు. ప్రాంతీయ భాషలకు గౌరవం హిందీని రుద్దేయత్నం చేస్తున్నామని కొన్ని పార్టీలు గగ్గోలు పెట్టడం విడ్డూరంగా ఉందన్నారు. గతంలో యూపీఏ ఇచ్చిన ఉత్తర్వుల్ని తాము ఇచ్చినట్టుగా చెబుతున్నారంటూ మండి పడ్డారు. అయితే ఆ ఉత్తర్వుల్లో ఎలాంటి తప్పులు లేవని వివరించారు. హిందీ మాట్లాడే రాష్ట్రాలకు హిందీ ప్రాధాన్యత ఇవ్వాలని ఉందేగానీ, ఇతర భాషల మీద రుద్దాలని లేదని పేర్కొన్నారు. హిందీని ఇతర భాషల మీద రుద్దాలన్న సిద్ధాంత బీజేపీలో లేదని పేర్కొంటూ, తాము ప్రాంతీయ భాషలకు గౌరవాన్ని ఇస్తున్నామన్నారు. ఇలగణేషన్, చక్రవర్తి, వానతీ శ్రీనివాసన్ పాల్గొన్నారు. -
బాంబు బూచి!
సాక్షి, చెన్నై:చెన్నై మీనంబాక్కం విమానాశ్రయంలో భద్రత ఎప్పుడూ కట్టుదిట్టంగానే ఉంటుంది. కేంద్రం హెచ్చరికల నేపథ్యంలో రెండు రోజులుగా భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. విమానాశ్రయంలోకి వెళ్లే ప్రతి వాహనాన్నీ తనిఖీలు చేసిమరీ లోనికి అనుమతిస్తున్నారు. టెర్మినల్ పరిసరాల్లో కేంద్ర బలగాలు, బయట ప్రాంతం, రన్ వే ప్రహరీకి వెలుపల నగర పోలీసులు భద్రతా విధుల్లో నిమగ్నమై ఉన్నారు. భద్రతను కట్టుదిట్టం చేసి, తనిఖీలు ముమ్మరంగా చేస్తున్న వేళ స్వదేశీ టెర్మినల్‌లో నాలుగు సంచులు వృథాగా పడి ఉండడం పెను కలకలాన్ని సృష్టించాయి. బాబోయ్ బాంబులు: మీనంబాక్కం స్వదేశీ టెర్మినల్ లోపలి భాగంలో నాలుగు ప్రవేశ మార్గాలు ఉంటాయి. ఇందులో ఓ మార్గంలో జెట్ ఎయిర్ వేస్ ప్రయాణికులు ఏడు గంటల సమయంలో ఢిల్లీ, ముంబైలకు బయలు దేరడానికి సిద్ధమయ్యారు. తనిఖీల అనంతరం విమానంలోకి ఎక్కేందుకు బయలు దేరిన కొందరు ప్రయాణికుల దృష్టి అక్కడి నాలుగు సంచుల మీద పడింది. వీటి గురించి భద్రతా సిబ్బంది తెలియజేశారు. భద్రతా సిబ్బంది ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. ఆ సంచులు ఎవరివని వాకబు చేసినా ఫలితం లేకపోయింది. ఆ సంచుల్లో బాంబులు ఉన్నట్టుగా ప్రచారం ఊపందు కోవడంతో కొందరు ప్రయాణికుల్లో ఆందోళన నెలకొంది. కొందరు అయితే బయటకు పరుగులు తీశారు. దీంతో కాసేపు గందరగోళం నెలకొంది. అక్కడే విధుల్లో ఉన్న డాగ్, బాంబ్ స్క్వాడ్ల ద్వారా తనిఖీలు చేయించారు. ఆ మార్గాన్ని మూసివేసి, రెండో మార్గం ద్వారా జెట్ ఎయిర్ వేస్ ప్రయాణికుల్నిలోనికి పంపించారు. తనిఖీల్లో నిమగ్నమైన సిబ్బందికి ఓ మహిళ రూపంలో వ్యతిరేకత వ్యక్తమైంది.. నలభై ఏళ్లు పైబడ్డ ఓ మహిళ పరుగున వచ్చి ఆ సంచులు తనవేనని, వాటిని తనిఖీలు చేయొద్దంటూ వారించడంతో అనుమానాలు నెలకొన్నాయి. అత్యవసరంగా బాత్రూంకు వెళ్లాల్సి రావడంతోనే వాటిని అక్కడ వదలి వెళ్లాల్సి వచ్చిందని, తన వెంట ఎవ్వరూ లేనందున ఇబ్బంది పడాల్సి వచ్చిందంటూ ఆమె వేడుకుంది. అయినా భద్రతా సిబ్బంది మాత్రం వదలి పెట్టలేదు. పచ్చళ్లు...పొడులు : గంటన్నర ఉత్కంఠతో చివరకు అందులో పచ్చళ్లు, పొడులు, కొత్త బట్టలు ఉండడంతో బాంబ్, డాగ్ స్క్వాడ్ సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. వాటిని ఆమె ఢిల్లీకి తీసుకెళ్తున్నట్టు గుర్తించారు. తాను బాత్రూంలో ఉన్న సమయంలో మైక్‌లో ప్రకటన వచ్చిందని, అయితే తనకు ఆంగ్లం రాక పోవడంతో దాన్ని పట్టించుకోలేదని ఆమె విన్నవించుకున్నారు. అరుుతే అధికారులు మాత్రం తగ్గలేదు. తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ, ఆమెకు జరిమానా విధించే యత్నం చేశారు. తనకు హిందీ తప్ప వేరే భాష రాదంట్టూ ఆ మహిళ కన్నీళ్లు పెట్టుకోవడంతో చివరకు క్షమించి, ఆమెను ఢిల్లీకి పంపించారు.