ప్రతీకాత్మక చిత్రం
తిరువొత్తియూరు/చెన్నై: దుబాయ్ నుంచి చెన్నైకి వచ్చిన విమానంలో రూ.2 కోట్ల 90 లక్షల విలువ చేసే ఆరు కిలోల బంగారు కడ్డీలను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. చెన్నై మీనంబాక్కం అంతర్జాతీయ విమానాశ్రయానికి దుబాయ్ నుంచి ఆదివారం ఉదయం విమానం వచ్చింది. అందులో వచ్చిన ప్రయాణికులను కస్టమ్స్ అధికారులు తనిఖీలు చేశారు. తరువాత అధికారులు విమానంలోకి ఎక్కి తనిఖీ చేయగా ఓ సీటు కింద రెండు పార్శిల్స్ కనబడ్డాయి. వాటిని విప్పి చూడగా ఆరు బంగారు కడ్డీలు వున్నాయి. వీటి విలువ రూ.2 కోట్ల 90 లక్షలు అని తెలిసింది. బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
చదవండి: బంగారం..స్మగ్లర్ల సింగారం
Comments
Please login to add a commentAdd a comment